కీవ్: డ్రోన్ దాడులతో రష్యా ఉక్కిరిబిక్కిరైంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం దాకా ఎడతెరిపి లేకుండా జరిగిన దాడుల్లో దేశంలో పలుచోట్ల మౌలిక సదుపాయాలకు స్వల్ప నష్టం వాటిల్లింది. ఇంతకాలం ఉక్రెయిన్ సరిహద్దుల సమీపానికే పరిమితమైన దాడులు ఏకంగా రాజధాని మాస్కో సమీపం దాకా చొచ్చుకొచ్చాయి. ఒక డ్రోన్ మాస్కోకు 100 కిలోమీటర్ల దూరంలో విధ్వంసం సృష్టించింది! పలు డ్రోన్లను రష్యా పేల్చేసింది. మరోవైపు హాకింగ్ దెబ్బకు రష్యా టీవీ, రేడియో ప్రసారాలకు చాలాసేపు అంతరాయం కలిగింది.
డ్రోన్ల కలకలంతో సెయింట్ పీటర్స్‌బర్గ్ విమానాశ్రయాన్ని గంటలపాటు మూసేయాల్సి వచ్చింది! ఈ దాడులన్నీ ఉక్రెయిన్ పనేనంటూ రష్యా మండిపడింది. తమపై రష్యా పూర్తిస్థాయి యుద్ధానికి దిగిన నేపథ్యంలో ఎలాంటి దాడులకైనా పాల్పడే హక్కు తమకుందంటూ ఉక్రెయిన్ నర్మగర్భ వ్యాఖ్యలతో సరిపెట్టింది. రష్యా మిత్రదేశమైన బెలారస్‌లో ఓ వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడుల్లో రూ.2,737 కోట్ల విలువైన రష్యా నిఘా విమానంతో పాటు మరో సైనిక రవాణా విమానం, పలు వాహనాలు దెబ్బ తిన్నట్టు చెబుతున్నారు. ఇది స్థానిక ఉక్రెయిన్ మద్దుతుదారుల పనేనని అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment