ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ సేనలు రష్యాపై దాడులతో విరుచుకుపడుతున్నాయి. రష్యాలోని పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకోవటమే లక్ష్యంగా బాంబు, డ్రోన్ దాడులు చేస్తోంది. తాజాగా శనివారం అర్ధరాత్రి రష్యా రాజధాని మాస్కో, ఇతర ప్రాంతాలే టార్గెట్‌గా ఉక్రెయిన్ ఆర్మీ డ్రోన్ దాడికి పాల్పడినట్లు రష్యా అధికారులు ఆదివారం వెల్లడించారు. మాస్కో వైపు దూసుకువచ్చిన డ్రోన్‌ను రష్యా ధ్వంసం చేసిందని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు.
🚨BREAKING/ALERT: Ukraine has launched a massive drone attack on Russia.
Over 100+ drones are airborne & flights are being prevented from landing due to the attack. pic.twitter.com/OqWRnH6uh4— The Enforcer (@ItsTheEnforcer) August 31, 2024
అదేవిధంగా రష్యా నైరుతి ప్రాంతంలోని బ్రయాన్స్క్ సరిహద్దు ప్రాంతంలో ఉక్రెయిన్ ప్రయోగించిన కనీసం 12 డ్రోన్‌లు కూడా ధ్వంసం చేసినట్లు ఆ ప్రాంత గవర్నర్ అలెగ్జాండర్ బోగోమాజ్ పేర్కొన్నారు. మానవరహిత దాడిలో కుర్స్క్ ప్రాంతంపై రెండు వాహనాలను కూడా కూల్చివేశామని తాత్కాలిక గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ తెలిపారు. ఈ ప్రాంతాన్ని ఉక్రెయిన్ సైన్యం పాక్షికంగా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ డ్రోన్ దాడుల వల్ల ఎలాంటి గాయాలు, నష్టం జరగలేదని రష్యా అధికారులు తెలిపారు. అదేవిధంగా.. గత కొన్ని రోజులుగా దాడుల్లో వేగం పెంచిన ఉక్రెయన్ రష్యా భూభాగాలను స్వాధీనం చేసుకోవటమే టార్గెట్‌గా ముందుకు సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment