
సెయింట్ పీటర్స్ బర్గ్ కు వరల్డ్ ట్రావెల్ అవార్డ్
యూరప్ లోనే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ గా ఎంపికైన సెయింట్ పీటర్స్ బర్గ్ వరల్డ్ ట్రావెల్ అవార్డును గెలుచుకుంది. ఈ రష్యన్ పోర్ట్ నగరం గత సంవత్సరం కూడా ప్రపంచ రికార్డును సాధిచింది.
నేవా నది ఒడ్డుపై, ఫిన్లాండ్ బాల్టిక్ సముద్రం ఒడ్డున ఉన్న సెయింట్ పీటర్స్ బర్గ్ ను 1703 లో పీటర్ ది గ్రేట్ నిర్మించాడు. యూరప్ లోనే బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ గా సెయింట్ పీటర్స్ బర్గ్ వరుసగా రెండోసారి అవార్డును సంపాదించినట్లు వరల్డ్ ట్రావెల్ అవార్డ్స్ అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించింది. 2016 లో సుమారు పది లక్షలమంది యాత్రికులు, టూరిస్ట్ ఎక్స్ పర్ట్ లు సెయింట్ పీటర్స్ బర్గ్ ను బెస్ట్ టూరిస్ట్ స్పాట్ గా ఓటు వేసి ఎన్నుకున్నారు.
పీటర్స్ బర్గ్ ప్రముఖ సందర్శనా స్థలంగా ఇంతటి పేరు ప్రఖ్యాతులు పొందడానికి యాత్రికులకు ఇక్కడ కల్పించే మౌలిక సదుపాయాలు, భద్రత, హోటల్స్ కారణమని గ్జిన్హువా న్యూస్ ఓ ప్రకటనలో తెలిపింది. మొట్టమొదటిసారి వరల్డ్ ట్రావెల్ అవార్డును 1993 లో ప్రారంభించగా 2015 నుంచి సెయింట్ పీటర్స్ బర్గ్ ను భారీగా విదేశీ యాత్రికులు సందర్శిస్తుండటంతో వరుసగా రెండోసారి కూడా ఈ నగరం ట్రావెల్ అవార్డును కైవసం చేసుకుంది.