envoy
-
ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ పాలన.. భారత్‌లో కీలక పరిణామం
ఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ పాలనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొలిసారిగా భారత్‌లోని ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఆప్ఘనిస్థాన్ దౌత్యవేత్త కార్యాలయం (కాన్సులేట్) తాత్కాలిక రాయబారిగా విద్యార్థి ఇక్రముద్దీన్ కమిల్ నియమితులయ్యారు. 2021లో ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే తాలిబన్ పాలనను కేంద్రం వ్యతిరేకించింది. భారత్‌లో ఆప్ఘనిస్థాన్ కాన్సులేట్ రాయబారుల్ని వెనక్కి పంపింది. మూడేళ్ల తర్వాత తాజాగా భారత్‌లోని ఆప్ఘనిస్థాన్ కాన్సులేట్ రాయబారిగా ఇక్రముద్దీన్ కమిల్‌ను తాలిబన్ ప్రభుత్వం నియమించినట్లు తెలుస్తోంది. ఈ నియామకంపై కేంద్రం వివరణ ఇవ్వాల్సి ఉంది. -
‘ఐర్లాండ్‌లో భారత రాయబారిని వెంటనే తొలగించాలి’
ఐర్లాండ్‌లోని భారత రాయబారి అఖిలేష్ మిశ్రా చేసిన విమర్శలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అఖిలేష్ విమర్శలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైం రమేష్ స్పందించారు. అఖిలేష్ చేసిన వ్యాఖ్యలు చేయటం వృతిపరంగా ఆయన అవమానకరమైన ప్రవర్తనకు నిదర్శనం అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘భారత ప్రభుత్వాన్ని సమర్థించటం ఊహించినదే. కానీ, ఒక రాయబారి ప్రతిపక్ష పార్టీలపై బహిరంగంగా ఇలా విమర్శలు చేయటం సరికాదు. ఆయనది వృత్తిపరంగా చాలా అవమానకరమై ప్రవర్తన. రాయబారిగా ఉంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేయటం చాలా సిగ్గుచేటు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆమోదించదగినవి కాదు. ఆయన సర్వీసు నియమాలను ఉల్లంఘించారు. వెంటనే రాయబారి పదవి నుంచి తొలగించాలి’ అని జైరాం రమేష్ మండిపడ్డారు. అఖిలేష్ మిశ్రా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఐర్లాండ్‌లోని ఓ దినపత్రికలో ప్రచురితమైన సంపాదకీయంలో ‘మోదీకి అపూర్వమైన ప్రజాదరణ ఉంది’ అనే శీర్షికపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అపూర్వమైన ప్రజాదరణ పొందారు. దానికి మోదీ వ్యక్తిగత స్వాభావంతో పాటు పరిపాలనలో చూపించే సమగ్రత, స్థిరమైన అభివృద్ధిపై నాయకత్వమే కారణం. మోదీ రాజకీయ కుటుంబం నుంచి రాలేదు. భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లోని లక్షలాది ప్రజలకు మోదీ వ్యక్తిగత జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. ఒకే కుటుంబానికి చెందిన అవినీతి పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయటమే మోదీకి పెరుగుతన్న ప్రజాదరణ వెనక ఉన్న ప్రధానమైన అంశం’ అని అఖిలేష్ మిశ్రా అన్నారు. ‘సంబంధిత కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉపయోగించుకొని ప్రధాని మోదీ ప్రభుత్వం భారత్‌లో అవినీతిని అంతం చేయటంలో విజయం సాధించింది. భారతదేశ ప్రజాస్వామ్యం చాలా దృఢమైనది. 80 శాతం హిందూ మెజార్టీ ఉన్న భారతదేశాన్ని కొందరు మూస పద్దతులతో తప్పదారి పట్టిస్తున్నారు’ అని అఖిలేష్ మిశ్రా తెలిపారు. ఇక.. ‘అత్యంత పక్షపాతంతో ప్రధాని మోదీ, భారత ప్రజాస్వామ్యం, చట్టం అమలు చేస్తున్న సంస్థలపై విమర్శలు చేస్తున్నారు’ అని డబ్లిన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారిక ‘ఎక్స్’ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. Ambassador @AkhileshIFS’s rejoinder to @IrishTimes' highly biased & prejudiced editorial [Modi tightens his grip” April 11, 2024)], casting aspersion on Prime Minister of India, Shri @narendramodi, Indian democracy, law enforcement institutions & “Hindu-majority” people of India. pic.twitter.com/Oh5rFly92Z — India in Ireland (Embassy of India, Dublin) (@IndiainIreland) April 15, 2024 -
రష్యాకు కొత్త రాయబారి.. నియమించిన కేంద్రం
న్యూఢిల్లీ: విదేశీ వ్యవహరాల్లో నిపుణుడైన ఇండియన్ ఫారెన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి వినయ్‌కుమార్‌ను రష్యా రాయబారిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం(మార్చ్ 19) విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన వినయ్‌కుమార్ 2021 నుంచి మయన్మార్‌లలో భారత రాయబారిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం రష్యా రాయబారిగా పనిచేస్తున్న పవన్‌కుమార్ ఇటీవలే విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. సాధారణంగా మాస్కో, వాషింగ్టన్, లండన్, టోక్యో, కాన్బెర్రా నగరాలు భారత ఐఎఫ్ఎస్ అధికారులకు కీలక పోస్టింగ్‌లుగా భావిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో మిత్ర దేశం రష్యాతో సంబంధాలు మరింత మెరుగుపరిచుకునేందుకు అనుభవజ్ఞుడైన వినయ్‌కుమార్‌ను నియమించినట్లు చెబుతున్నారు. ఇదీ చదవండి.. రష్యాతో నాటో ఘర్షణకు దిగితే మూడో ప్రపంచ యుద్ధమే -
ఇరాన్ రాయబారిని బహిష్కరించిన పాక్
ఇస్లామాబాద్: ఇరాన్ దేశ రాయబారిని తమ దేశం నుంచి పాకిస్థాన్ బహిష్కరించింది. తమ దేశానికి చెందిన రాయబారిని కూడా ఇరాన్ వదిలి వచ్చేయాలని కోరింది. తమ భూభాగంలోని బలూచిస్థాన్ ప్రావిన్సులో ఇరాన్ దాడులు జరపడం చట్ట విరుద్ధమని పాకిస్థాన్ ప్రకటించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘పాకిస్థాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఇరాన్ వ్యవహరించింది. మంగళవారం రాత్రి మా వైపు నుంచి ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు లేకుండానే దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఇద్దరు చిన్న పిల్లలు మృతి చెందారు. ఐక్యరాజ్యసమితి నిబంధనలతో పాటు అంతర్జాతీయ చట్టాలను ఇరాన్ ఉల్లంఘించింది’ అని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరాక్‌పై వైమానిక దాడులు జరిపిన మరుసటి రోజే ఇరాన్ పాకిస్థాన్‌పై మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడింది. అయితే స్వతంత్ర బలూచిస్థాన్‌ను డిమాండ్ చేస్తున్న జైషే అల్ అదిల్ ఉగ్రవాదులు లక్ష్యంగానే తాము డ్రోన్లతో దాడులు చేసినట్లు ఇరాన్ ఆర్మీ ప్రకటించింది. పాక్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తలు పెరగడం పట్ల చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. ఇదీచదవండి.. థాయ్‌లాండ్‌లో భారీ పేలుడు.. 18 మంది మృతి -
పీఓకేలో పాక్ బ్రిటన్ హైకమిషనర్ పర్యటన.. భారత్ తీవ్ర అభ్యంతరం
‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ లో (పీఓకే) ఇస్లామాబాద్ బ్రిటన్ రాయబారి పర్యటించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జేన్ మారియట్ పర్యటన అత్యంత అభ్యంతరకరమని పేర్కొంది. ఇది ‘భారత సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించే చర్య’గా అభివర్ణించింది. కాగా పాకిస్థాన్‌లోని బ్రిటన్ హైకమిషనర్ జేన్ మారియట్ ఈనెల 10న పీఓకేలోని మీర్పూర్ను సందర్శించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు, వీడియోలను `ఎక్స్`లో పోస్ట్ చేశారు. ఆమె పర్యటనపై తాజాగా కేంద్ర విదేశీ వ్యవహరాల మంత్రిత్వశాఖ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇస్లామాబాద్‌లో బ్రిటన్ హై కమిషనర్ జాన్ మారియట్ పీవోకేలో పర్యటించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లడఖ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఈ ఉల్లంఘణపై విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా భారత్‌లోని బ్రిటీష్ హైకమిషనర్‌ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: మమ్మల్ని విమర్శించే హక్కు ఏ దేశానికి లేదు: మాల్దీవ్స్ అధ్యక్షుడు -
Maldives Row: వారి కుట్రతోనే వివాదం..మాల్దీవుల మాజీ రాయబారి
న్యూఢిల్లీ: భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతినేందుకు అక్కడ అధికారంలో ఉన్న ఇస్లామిక్ కన్జర్వేటివ్ పార్టీయే కారణం అని మాల్దీవుల్లో గతంలో భారత హై కమిషనర్‌గా పనిచేసిన మనోహర్ మూలే తెలిపారు. ‘మాల్దీవుల ప్రజల మనసును కలుషితం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. దీని వెనుక చైనా పాత్ర కీలకంగా ఉంది. పర్యాటక దేశంలోని కన్జర్వేటివ్ ఇస్లామిస్టులకు చైనా తన పూర్తి అండదండలందిస్తోంది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ ఇస్లామిస్టులు అభివృద్ధి వైపు ఎక్కువ మొగ్గు చూపుతారనే పేరుంది. అదే సమయంలో ఇస్లామిక్ భావజాలాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. మహ్మద్ మొయిజ్జు మాల్దీవుల్లో అధికారం చేపట్టినప్పటి నుంచి పాలనలో కొంత ఇస్లామిక్ రంగు కనిపిస్తోంది. మొయిజ్జు ప్రధాని అయిన తర్వాత తొలుత టర్కీలో పర్యటించారు. రెండవ పర్యటన కోసం చైనాకు వెళ్లారు. నిజానికి మహ్మద్ మొయిజ్జు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ను అనుసరించే వ్యక్తి అబ్దుల్లా యమీన్ కరుడు గట్టిన భారత్ వ్యతిరేకి అని తెలిసిందే.ప్రస్తుతం మహ్మద్ మొయిజ్జు చేపట్టినట్లుగానే 2015లో అబ్దుల్లా యమీన్ ఇండియా అవుట్ క్యాంపెయిన్‌ను చేపట్టారు’ అని మనోహర్ మూలే వివరించారు. ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర వివాదం రేగింది. వేల సంఖ్యలో భారత పర్యాటకులు తమ మాల్దీవుల పర్యటనలను రద్దు చేసుకున్నారు. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవులు పిలుపును కూడా ఇచ్చారు. ఈ పిలుపుతో దిగి వచ్చిన మాల్దీవుల ప్రభుత్వం ఆ మంత్రుల వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని పేర్కొంది. మోదీపై వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేసింది. ఇదీచదవండి..హౌతీలపై అమెరికా దాడులు -
జానపద కళాకారులతో నృత్యం చేసిన సింగపూర్ రాయబారి
పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్‌లో జరిగిన జీ20 సమావేశంలో అక్కడ జానపద కళాకారులతో కలిసి సింగపూర్ రాయబారి సైమన్ వాంగ్ డ్యాన్స్ చేశారు. ఈ మేరకు డార్జిలింగ్‌లో మూడు రోజుల జీ20 వర్కింగ్ సమావేశాలు సందర్భంగా భారత్‌లోని సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ మొదటి రోజు జరిగిన కార్యక్రమంలో జానపద కళకారులతో కలిసి కాలు కదిపారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..రాబోయే సంవత్సరాలలో టీ టూరిజం మరింత పెరుగుతుందన్నారు. పర్యాటకం కోసం మా రెండో సమావేశం డార్జిలింగ్‌లో జరిగింది. ఇక్కడ పనిచేసే కార్మికులకు కూడా దీని ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. అని అన్నారు. మొదటి రోజు ఈవెంట్లో భాగంగా ప్రతినిధులు టీ తీయడం గురించి అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జీ20 ఛీఫ్ కో ఆర్టినేటర్ హర్షవర్ధన్ ష్రింగ్లా మాట్లాడుతూ.. ప్రపంచానికి భారతదేశం గురించి తెలియజేయాలన్న మోదీ ఆదేశాల మేరకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో జీ20 సదస్సుకు భారత్ ఆతిధ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. జీ20 సమావేశాలు దేశ రాజధాని న్యూఢిల్లీకి మాత్రమే పరిమితం కాకూడదని, భారత్‌లని మిగతా ప్రదేశాల్లోని వారసత్వం, సంస్కృతి, అందం, గొప్పతనం గురించి కూడా విదేశీ ప్రతినిధులు తెలసుకోవాలని ష్రింగ్లా చెప్పారు. ఈ క్రమంలో సింగపూర్ రాయబారి ట్విట్టర్ వేదికగా నాటి కార్యక్రమాన్ని ఉద్దేశిసస్తూ.. జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశంలో అది ఒక అద్భుతమైన సాయంత్రం. రాత్రి చందుడి వెలుగులో టీని కోయడం అనేది హైలెట్‌గా నిలిచిందని అన్నారు. కాగా, భారతదేశంలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన డార్జిలింగ్‌లో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 3, 2023 వరకు రెండో టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు ఆతిధ్యం ఇవ్వనుంది. దాదాపు 130 మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ మూడు రోజుల సమావేశంలో కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రభావితమైన పర్యాటక రంగాన్ని పునరుద్ధరించే మార్గాలపై జీ20 సభ్య దేశాల ప్రతినిధులు చర్చించనున్నారు. (చదవండి: రేపే జైలు శిక్షను సవాలు చేస్తు రాహుల్ పిటిషన్!) -
బద్ధ శత్రువులైన ఇరాన్, సౌదీల మధ్య సయోధ్య కుదిర్చిన చైనా!
అరబ్ ప్రపంచంలోన బద్ధ శత్రువులైన ఇరాన్, సౌదీలు మద్య సంబంధాలు మళ్లీ పెనవేసుకుంటున్నాయి. ఆ రెండు దేశాలు దౌత్య సంబంధాల పునరుద్ధరణకు చైనా మధ్యవర్తితం వహించి సయోధ్య కుదిర్చింది. ఇరు దేశాలు సంబంధాలు తెంచుకున్న ఏడేళ్ల అనంతరం ఒక్కటవుతున్నారు. ఈ మేరకు ఇరు దేశాలు తమ శత్రుత్వాన్ని పక్కన పెట్టి పూర్తి స్తాయిలో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు అంగీకరించాయి. ఈ నేపధ్యంలో ఇరాన్ రాయబారి ఇరాజ్ ఎలాహి మాట్లాడుతూ..చైనా మధ్యవర్తిత్వంతో ఏర్పడిన ఇరాన్- సౌదీల ఒప్పందం ప్రాంతీయ సుస్థిరత్వాన్ని అందిస్తుంది. ఇది భారత్‌కు ప్రయోజనకరంగానే ఉంటుంది. ఇది భారత్‌కి ఎంతమాత్రం ఆందోళ కలిగించదనే భావిస్తున్నా. ఇది పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో సుస్థిరత, శాంతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీని ఫలితంగా ఈ ప్రాంతంలోని వివిధ దేశాలతో భారత్ తన వాణిజ్య సంబంధాలు సులభంగా నెరపగలుగుతుంది అని అన్నారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. చైనా ప్రస్తావన ఎత్తకుండానే.. విభేదాలను పరిష్కరించడంలో ఎల్లప్పుడూ చర్చలు, దౌత్యాన్ని సమర్థించే భారత్ ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తుందని అన్నారు. పశ్చిమ ఆసియాలోని వివిధ దేశాలతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని, ఆయా ప్రాంతాలతో లోతైన అనుబంధం ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రెండింటితో వాణిజ్య సంబంధాల విస్తరణను ఆశిస్తున్నట్లు ఇరాన్ రాయబారి ఎలాహి చెప్పారు. తమ మధ్య అంతరాన్ని తగ్గించి భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవడం మంచి ప్రయోజకరంగా ఉంటుందని అన్నారు. కాగా, బైడెన్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత నుంచి సౌదీ, అమెరికాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ తరుణంలో చైనా అరబ్ దేశాలకు దగ్గర అయ్యే ఎత్తుగడలు ప్రారంభించడం గమనార్హం. (చదవండి: రష్యాను సందర్శించనున్న జిన్‌పింగ్..నాలేగేళ్ల తర్వాత తొలిసారిగా..) -
థాంక్యూ భారత్! ఎప్పటికీ మనం దోస్తులమే!: టర్కీ రాయబారి
టర్కీలో వచ్చిన భారీ భూకంపం కారణంగా సుమారు 30 వేల మంది దాక చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ 'ఆపరేషన్ దోస్త్'లో భాగంగా టర్కీకి తక్షణ సాయం అందించడమే గాక పలు రెస్క్యూ బృందాలను కూడా పంపించింది. అందులో భాగంగానే భారత్ 23 టన్నులకు పైగా సహాయక సామాగ్రితో మరో ఏడవ ఆపరేషన్ దోస్త్ విమానాన్ని టర్కీకి పంపించింది. ఆ విమానం ఆదివారం భూకంప బాధిత సిరియాకు చేరుకుంది. దీనిని డమాస్కస్ విమానాశ్రయంలోని స్థానిక పరిపాలన, పర్యావరణ డిప్యూటీ మంత్రి మౌతాజ్ డౌజీ అందుకున్నారు. ఈ మేరకు టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ సోమవారం తమ దేశానికి మరోసారి సహాయక సామాగ్రిని పంపినందుకు భారతదేశానికి ధన్యవాదాలు తెలిపారు. రాయబారి సునెల్ ట్విట్టర్ వేదికగా.. భారత ప్రజల నుంచి మరో బ్యాచ్ అత్యవసర విరాళాలు టర్కీకి చేరుకున్నాయి. భూకంపం సంభవించిన ప్రాంతానికి ప్రతి రోజు ఎంతో ఉదారంగా ఉచిత సహాయాన్ని అందజేస్తోంది. అందుకు భారతదేశానికి ధన్యావాదాలు. వందల వేల మంది భూకంప నుంచి బయటపడిన వారందరికి ఈ సమయంలో గుడారం, దుప్పటి, స్లీపింగ్ బ్యాగ్ వంటివి చాలా ముఖ్యమైనవి. అలాంటి వాటన్నింటిని ఈ విపత్కర సమయంలో మా ప్రజలకు అందించి ఎంతో మేలు చేసింది. లాంఛనప్రాయంగా ప్రారంభమైన ఈ 'ఆపరేషన్ దోస్త్' మనం ఎప్పటికీ స్నేహితులమని నిరూపించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బలోపేతం కావలి అని ట్వీట్ చేశారు. THANK YOU INDIA! 🇮🇳🇮🇳🇮🇳 Each tent, each blanket or sleeping bag are of vital importance for the hundreds of thousands of earthquake survivors. https://t.co/v9rsXtdzjL — Fırat Sunel फिरात सुनेल فرات صونال (@firatsunel) February 13, 2023 (చదవండి: ఉక్రెయిన్ మరితంగా బ్రిటన్ మిటలరీ సాయం..మండిపడుతున్న రష్యా) -
క్షమాపణలు కోరిన బ్రిటిష్ హై కమిషనర్: వీడియో వైరల్
న్యూఢిల్లీ: యూకే వీసా అనుమతుల్లో జాప్యం విషయమై భారత్‌లోని బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ స్పందించారు. వీసాలు అనుమతుల్లో జాప్యం గురించి వివరిస్తూ ట్విట్టర్ వేదికగా ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఈ మేరకు అలెక్స్ వీడియోలో....యూకే వీసాల విషయమై ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఎల్లిస్ ఇలా అన్నారు. " మీలో చాలా మంది 15 రోజుల పని నిమిత్తం యూకేకి వెళ్లడానికి వీసాలను దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలాంటి వాటికి సంబంధించి పలు వీసా అప్లికేషన్స్ వచ్చాయి. ఆయా వీసాల ప్రాసెసింగ్‌కి సమయం పడుతోంది. ఈ ఆలస్యం కారణంగా నష్టపోతున్న ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నాను. కోవిడ్ అనంతరం యూకే వీసాలకు డిమాండ్ పెరింగింది. అంతేకాకుండా రష్యా ఉక్రెయిన్ల యుద్ధం వల్ల కూడా ఈ డిమాండ్ మరింత ఎక్కువైందని చెప్పారు. అలాగే ఈ వీసా ప్రక్రియ వేగవంతం చేసుకునేలా ప్రజలకు శిక్షణ ఇస్తాం. మొదటగా చాలాముంది ప్రాదాన్యత ఇచ్చే వీసా సేవనే మీకు అందుబాటులో ఉంచుతాం. అలాగే మీ వద్ద కావల్సిన సరైన పత్రాలు ఉన్నయని నిర్థింరించడంలో మాకు సహకరించండి. అలాగే మీ వీసా సురక్షితంగా ఉండే వరకు మీ విమాన టిక్కెట్‌కు కట్టుబడి ఉండొద్దు. యూకే వీసాలు పరిమితి గడువులోగా మంజూరయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కేవలం సందర్శకుల వీసాలు జారీ చేయడానికే ప్రస్తుతం ఆరువారాల సమయం పడుతుంది. కొన్నిరకాల వీసా అప్లికేషన్లకు మూడువారాలకు పైగా పట్టొచ్చు. సాధ్యమైనంత త్వరగా ఈ ఈ వీసాలు జారీ చేసేలా తాము కృషి చేస్తున్నాం" అని అన్నారు. A lot of you have been in touch about visa delays; many apologies, as I know this is causing a lot of problems. Here’s what we’re doing, and what you can do. pic.twitter.com/QJm7HceDq6 — Alex Ellis (@AlexWEllis) August 12, 2022 (చదవండి: International Youth Day 2022: యంగిస్తాన్!) -
మాలి రాయబారిగా ఇండో అమెరికన్‌ని నియమించిన బైడెన్
మాలి దేశానికి అమెరికా రాయబారిగా ఇండో అమెరికన్ మహిళ రచనా సచ్దేవ్ను నియమించారు. ఈ మేరకు వైట్‌హౌజ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. భారత సంతతి చెందిన రచనా సచ్దేవ్ అమెరికా ఫారిన్ సర్వీసెస్‌లో సుదీర్ఘ కాలంగా పని చేస్తున్నారు. గతంలో ఆమె శ్రీలంక, సౌదీ అరేబియాలలో పని చేశారు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఈస్ట్రర్న్ ఎఫైర్స్ విభాగంలో పని చేశారు. తాజాగా మాలి దేశానికి రాయబారిగా నియమించారు అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్. నెల రోజుల వ్యవధిలో ముగ్గురు భారత సంతతి అధికారులకు రాయబారులుగా పదోన్నతి కల్పించారు జో బైడెన్. మొరాకో దేశానికి రాయబారిగా పునీత్ తల్వార్‌ను నియమించారు. అంతకు ముందు నెదర్లాండ్స్ రాయబారిగా షెఫాలీ రజ్దాన్ దుగ్గల్‌ను ఎంపిక చేశారు. వీరే కాదు వైట్‌హౌజ్‌లోని బైడెన్ టీమ్‌లో కూడా ఇండో అమెరికన్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. చదవండి: నెదర్లాండ్స్‌లో అమెరికా రాయబారిగా షెఫాలీ జర్దాన్ దుగ్గల్ ! -
రష్యాకు చైనా మద్దతు.. ‘నాటో అటువైపునకు వెళ్లకపోవడమే మంచిది’
బీజింగ్: ప్రపంచంలో తూర్పు భాగంవైపు విస్తరించబోమంటూ గతంలో ఇచ్చిన హామీకి ‘నాటో’ కట్టుబడి ఉండాలని చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి లీ యూచెంగ్ డిమాండ్ చేశారు. తూర్పు వైపు విస్తరణ ఆకాంక్షను వదులుకోవాలని నాటోకు హితవు పలికారు. ఆయన శనివారం బీజింగ్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడాన్ని ఖండించారు. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి మూలాలు ప్రచ్ఛన్న యుద్ధంలో, ఆధిపత్య రాజకీయాల్లో ఉన్నాయని స్పష్టం చేశారు. ఒకవేళ నాటో గనుక తూర్పు వైపు విస్తరిస్తే అది రష్యా శివార్లకు చేరుతుందని పేర్కొన్నారు. రష్యా భద్రతకు అది క్షేమకరం కాదని వెల్లడించారు. అందుకే నాటో విస్తరణ లక్ష్యానికి ముగింపు పలకాలని అన్నారు. రష్యా వైపు వెళ్లకుండా యుగోస్లోవియా, ఇరాక్, సిరియా, అఫ్గానిస్తాన్ దేశాల్లో భద్రతను పటిష్టం చేయాలని సూచించారు. (చదవండి: కుప్పకూలిన నాటో విమానం.. ‘ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో సంబంధం లేదు’) -
భారత సంతతి మహిళకు ఉన్నత పదవి ఇవ్వనున్న జోబైడెన్
నెదర్లాండ్స్‌లో అమెరికా రాయబారిగా భారత సంసతికి చెందిన షెఫాలీ జర్తాన్ దుగ్గల్ పేరును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించారు. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్లకు ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్‌గా ఆమె గతంలో పని చేశారు. ఇప్పటి వరకు ఆమె జోబైడెన్ ప్రభుత్వంలో నేషనల్ కో చైయిర్ ఆఫ్ విమెన్‌గా పని చేశారు. కాగా తాజాగా ఆమెకు పదొన్నతి కల్పిస్తుండటంతో త్వరలో నెదర్లాండ్స్‌లో యూస్ రాయబారిగా పని చేయనున్నారు. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి చెందిన షెఫాలీ జర్దాన్ దుగ్గల్ అమెరికాలో స్థిరపడ్డారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ కమ్యూనికేషన్లో పీజీ చేశారు. ఆ తర్వాత మియామీ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత యూఎస్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. విమెన్ రైట్స్ యాక్టివిస్ట్, హుమన్ రైట్స్ క్యాంపెయినర్‌గా చాలా కాలం పని చేశారు. అనేక అవార్డులు గెలుచుకున్నారు. చదవండి: ఆస్ట్రేలియా అవార్డు రేసులో.. భారత సంతతి యువతి -
ఉక్రెయిన్ విలవిల: మోదీజీ... జోక్యం చేసుకోండి ప్లీజ్!
Russia And Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు భీకరంగా దాడులు చేస్తున్నాయి. బాంబుల మోత మోగిస్తున్నాయి. రష్యా చర్యలను పలు దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి డా. ఇగోర్ పొలిఖా భారత్ మద్దతు కోరారు. భారత్ రష్యాతో ప్రత్యేకమైన స్నేహం కలిగి ఉందని, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని భారత్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మిత్రదేశమైన భారత్.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను నిలువరించడానికి సాయం చేయగలదని పేర్కొన్నారు. వెంటనే భారత్దేశ ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా, ఉక్రెయిన్ దేశాధినేతలతో మాట్లాడాలని కోరారు. ప్రపంచంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎవరి మాట వింటారో? లేదో? తెలియదు కానీ, ప్రధానిమోదీ మాటలను ఆలోచిస్తారని తాను ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు రష్యాది సైనిక చర్య కాదు.. యుద్ధమే అని భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి డా. ఇగోర్ పొలిఖా అన్నారు. రష్యా దాడుల్లో భారీగా ఉక్రెయిన్ ప్రజలు మృతి చెందారని తెలిపారు. యుద్ధ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని చెప్పారు. యుద్ధ సంక్షోభ వేళ భారత్ అండగా నిలవాలని కోరుకుంటున్నామని కోరారు. పరిస్థితులు క్షీణిస్తున్నందున ఉక్రెయిన్‌కు భారత్ మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. నాటో, ఈయూ సభ్యత్వం గురించి మాట్లాడలేనని పేర్కొన్నారు. -
తాలిబన్లతో భారత రాయబారి భేటి
సాక్షి, న్యూఢిల్లీ: తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తరువాత భారత్‌తో సంబంధాల విషయంలో కీలకపరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఖతార్‌లోని భారత రాయబారి దీపక్ మిట్టల్ తాలిబన్ ప్రతినిధి షేర్ మహ్మద్ అబ్బాస్ మధ్య చర్చలు విశేషంగా నిలిచాయి. మంగళవారం దోహాలోని భారత రాయబార కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. తాలిబన్ల అభ్యర్థన మేరకు ఈ సమావేశం జరిగిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరుపక్షాల మధ్య మొట్టమొదటి అధికారిక దౌత్య సంబంధాలపై జరిగిన ఈ మీట్లో భారత్ లేవనెత్తిన సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని తాలిబన్ ప్రతినిధి హామీ ఇచ్చారు. అఫ్గన్ మట్టిని భారత వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాద చర్యలకు ఏంతమాత్రం ఉపయోగించరాదని మిట్టల్ తాలిబన్లను కోరారు. ఈ చర్చల్లో అఫ్తాన్‌లో చిక్కుకున్న భారతీయుల భద్రత, వారిని వేగంగా తరలింపు లాంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే అఫ్గాన్ జాతీయులు, ముఖ్యంగా మైనారిటీలు, భారతదేశాన్ని సందర్శించాలనుకునే వారి ప్రయాణ ఏర్పాట్లు కూడా చర్చకు వచ్చినట్టు తెలిపింది. భారత్‌తోవాణిజ్య, ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తామని, తమ వల్ల భారత్‌కు ఎలాంటి ముప్పు ఉండదని ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: taliban: మా నుంచి భారత్‌కు ఎలాంటి ముప్పు ఉండదు -
పాక్‌లో దారుణం: అఫ్గాన్ దౌత్యవేత్త కుమార్తె కిడ్నాప్.. చిత్రహింసలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో దారుణం చోటు చేసుకుంది. సామాన్యులనే కాకుండా ఏకంగా దౌత్యవేత్తలపై కూడా దారుణాలకు పాల్పడుతున్నారు అక్కడి నేరస్తులు. తాజాగా పాకిస్తాన్‌లోని అఫ్గాన్ దౌత్యవేత్త కుమార్తెను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి.. చిత్రహింసలకు గురి చేశారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ మేరకు అఫ్గనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ లేఖ విడుదల చేసింది. ఆ వివరాలు.. పాకిస్తాన్‌లోని అఫ్గాన్ దౌత్యవేత్త నజిబుల్లా అలిఖిల్ కుమార్తె సిల్సిలా అలిఖిల్‌ను కొద్ది రోజుల క్రితం ఇస్లామాబాద్‌లో దుండగులు కిడ్నాప్ చేశారు. సూపర్‌మార్కెట్ నుంచి ఇంటికి వస్తుండగా దుండగులు ఆమెను ఎత్తుకెళ్లారు. అనంతరం సిల్సిలాను చిత్రహింసలకు గురి చేశారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతన్న స్థితిలో ఉండగా వదిలేశారు. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ. విడుదల చేసిన లేఖలో తెలిపింది. ఈ చర్యలను అఫ్గాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్లో ఉన్న తమ దేశ దౌత్యవ్తేతలు, వారి కుటుంబాల భద్రతపై అఫ్గాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాక సిల్సిలాను కిడ్నాప్ చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అలానే తమ దేశ దౌత్యవేత్తలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని పాక్ ప్రభుత్వాన్ని కోరింది. పాక్-అఫ్గాన్ల మధ్య ఏం జరుగుంది.. గత కొద్ది వారాలుగా అఫ్గాన్‌లోని పలు జిల్లాలను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మూడోంతుల దేశాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్.. పాక్‌పై ఆరోపణలు చేస్తోంది. ఆ దేశ మద్దతుతోనే తాలిబన్లు తమ దేశంలో అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ‘‘స్పిన్ బోల్డాక్ ప్రాంతం నుంచి తాలిబాన్లను తొలగించే చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని’’ పాక్ వాయుసేన తమ ఆర్మీని, ఎయిర్ ఫోర్స్‌ని హెచ్చరించినట్లు అఫ్గనిస్తాన్ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సాలెహ్ తెలిపారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌లోని అఫ్గాన్ దౌత్యవేత్తను కుమార్తె కిడ్నాప్‌కు గురి కావడం సంచలనంగా మారింది.