నెదర్లాండ్స్‌లో అమెరికా రాయబారిగా భారత సంసతికి చెందిన షెఫాలీ జర్తాన్ దుగ్గల్ పేరును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించారు. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్‌లకు ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్‌గా ఆమె గతంలో పని చేశారు. ఇప్పటి వరకు ఆమె జోబైడెన్ ప్రభుత్వంలో నేషనల్ కో చైయిర్ ఆఫ్ విమెన్‌గా పని చేశారు. కాగా తాజాగా ఆమెకు పదొన్నతి కల్పిస్తుండటంతో త్వరలో నెదర్లాండ్స్‌లో యూస్ రాయబారిగా పని చేయనున్నారు.
జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి చెందిన షెఫాలీ జర్దాన్ దుగ్గల్ అమెరికాలో స్థిరపడ్డారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ కమ్యూనికేషన్‌లో పీజీ చేశారు. ఆ తర్వాత మియామీ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత యూఎస్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. విమెన్ రైట్స్ యాక్టివిస్ట్, హుమన్ రైట్స్ క్యాంపెయినర్‌గా చాలా కాలం పని చేశారు. అనేక అవార్డులు గెలుచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment