పశ్చిమ బెంగాల్‌లో డార్జిలింగ్‌లో జరిగిన జీ20 సమావేశంలో అక్కడ జానపద కళాకారులతో కలిసి సింగపూర్ రాయబారి సైమన్ వాంగ్ డ్యాన్స్ చేశారు. ఈ మేరకు డార్జిలింగ్‌లో మూడు రోజుల జీ20 వర్కింగ్ సమావేశాలు సందర్భంగా భారత్‌లోని సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ మొదటి రోజు జరిగిన కార్యక్రమంలో జానపద కళకారులతో కలిసి కాలు కదిపారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..రాబోయే సంవత్సరాలలో టీ టూరిజం మరింత పెరుగుతుందన్నారు.
పర్యాటకం కోసం మా రెండో సమావేశం డార్జిలింగ్‌లో జరిగింది. ఇక్కడ పనిచేసే కార్మికులకు కూడా దీని ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. అని అన్నారు. మొదటి రోజు ఈవెంట్‌లో భాగంగా ప్రతినిధులు టీ తీయడం గురించి అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జీ20 ఛీఫ్ కో ఆర్టినేటర్ హర్షవర్ధన్ ష్రింగ్లా మాట్లాడుతూ.. ప్రపంచానికి భారతదేశం గురించి తెలియజేయాలన్న మోదీ ఆదేశాల మేరకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో జీ20 సదస్సుకు భారత్ ఆతిధ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. జీ20 సమావేశాలు దేశ రాజధాని న్యూఢిల్లీకి మాత్రమే పరిమితం కాకూడదని, భారత్‌లని మిగతా ప్రదేశాల్లోని వారసత్వం, సంస్కృతి, అందం, గొప్పతనం గురించి కూడా విదేశీ ప్రతినిధులు తెలసుకోవాలని ష్రింగ్లా చెప్పారు.
ఈ క్రమంలో సింగపూర్ రాయబారి ట్విట్టర్ వేదికగా నాటి కార్యక్రమాన్ని ఉద్దేశిసస్తూ.. జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశంలో అది ఒక అద్భుతమైన సాయంత్రం. రాత్రి చందుడి వెలుగులో టీని కోయడం అనేది హైలెట్‌గా నిలిచిందని అన్నారు. కాగా, భారతదేశంలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన డార్జిలింగ్‌లో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 3, 2023 వరకు రెండో టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు ఆతిధ్యం ఇవ్వనుంది. దాదాపు 130 మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ మూడు రోజుల సమావేశంలో కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రభావితమైన పర్యాటక రంగాన్ని పునరుద్ధరించే మార్గాలపై జీ20 సభ్య దేశాల ప్రతినిధులు చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment