dances
-
అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారంవేళ ఖఢ్గం పట్టుకుని ట్రంప్ డ్యాన్స్
-
ఫ్లెమింగో ఫెస్టివల్లో ఇదీ పరిస్థితి.. అధికారుల సమక్షంలో అశ్లీల నృత్యాలు
సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్–2025 సాంస్కృతిక కార్యక్రమాల్లో జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఆదివారం రాత్రి అర్ధనగ్న ప్రదర్శనలు ఇచ్చారు.గ్రామాల్లో ఎక్కడైనా తిరునాళ్లలో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే దాడి చేసే పోలీసులు.. ఇక్కడ మాత్రం దగ్గరుండి ప్రోత్సహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్లెమింగోలు, పులికాట్ సరస్సు గురించి ఒక్క మాట మాట్లాడని కూటమి నేతలు.. ఈ అర్ధనగ్న నృత్యాలను వీక్షించడం చూసి జనం విస్తుబోయారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ వేదికపై ఉన్నప్పుడే ఈ ప్రదర్శనలు చేయడం గమనార్హం. -
బిగ్‌బాస్ షోలో 'బేబీ'తో కీర్తి సురేశ్ (ఫోటోలు)
-
ప్రచారంలో ట్రంప్ జోష్.. భార్యతో కలిసి డ్యాన్సులు
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు.తాజాగా ఆదివారం(అక్టోబర్28) రాత్రి న్యూయార్క్‌లో జరిగిన మాడిసన్ స్క్వేర్ గార్డెన్ ర్యాలీ వేదికపై భార్య మెలానియాతో కలిసి ట్రంప్ డ్యాన్సులు వేశారు. ర్యాలీలో అనూహ్యంగా ప్రత్యక్షమైన మెలానియా వేదికపైకి ట్రంప్ రాక ముందు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ట్రంప్ వేదికపైకి రాగానే ఆయనను కౌగిలించుకుని ముద్దుపెట్టుకుని సందడి చేశారు. సభలో డ్యాన్సులేయడంతో పాటు ‘మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్’ అని ట్రంప్ నినాదాలు చేశారు. కాగా, నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ట్రంప్ క్రేజ్ పెరుగుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. నెల రోజుల కిందట డెమొక్రాట్ అభ్యర్థి కమల హారిస్ కంటే వెనుకబడిన ట్రంప్ ఎన్నికల లేదీ దగ్గరవుతున్న కీలక సమయంలో పుంజుకోవడం రిపబ్లికన్లలో ఉత్సాహాన్ని నింపుతోంది. Okay just finished MSG Rally. Absolutely adored Melanias smile when she saw her husband doing the YMCA dance--it was awesome!! pic.twitter.com/QdoJvt5wki— Oblivion (@RedKryptonited) October 28, 2024ఇదీ చదవండి: ట్రంప్ గెలుపు మహిళలకు ముప్పు -
ఎన్నికలకు కళ
రాజకీయ నేతలను ప్రజలకు చేరువ చేయడంలో ఏడెనిమిదేళ్లుగా సోషల్ మీడియా కీలకంగా మారింది. ఫేస్బుక్, యూ ట్యూబ్ మొదలు ఇన్స్టాగ్రామ్ వరకు నాయకుల కార్యక్రమాలు క్షణాల్లో ప్రజలకు చేరిపోతున్నాయి. అయితే టెక్నాలజీ ఎంత గా అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ ప్రజలకు చేరువయ్యేందుకు కళారూపాలనే కొందరు నేతలు ఎంచుకుంటున్నా రు. ప్రజల్లో వీటికి ఆదరణ తగ్గకపోవడంతో ఇప్పుడు ఎన్నికల సీజన్లో ఆయా కళాకారులకు డిమాండ్ ఎక్కువగానే ఉంటోంది. సోషల్ జమానా ఎన్నికల్లో గెలిచింది మొదలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే వరకు తాము చేపడుతున్న కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు ఖద్దరు నేతలు సోషల్ మీడియాను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి పాపులర్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లపై వ్యక్తిగత పేజీలతో పాటు ఫాలోవర్స్, ఫ్యాన్స్ పేజీలతో ప్రత్యేకంగా ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. తాము రోజువారీగా చేపడుతున్న కార్యక్రమాలు, ప్రధాన మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లు, లింకులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ మేరకు బూత్ లెవల్ వరకు సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌లను కూడా నియమిస్తున్నారు. మండల, యూత్, మహిళా తదితర విభాగాల బాధ్యుల తరహాలోనే సోషల్ మీడియా ఇన్చార్జ్ పోస్టులూ రాజకీయ పార్టీల్లో పుట్టుకొచ్చాయి. ర్యాలీలు, సభల్లో... బహిరంగంగా చేసే ర్యాలీలు, సభల్లో ఇప్పటికీ ఆదివాసీ నృత్యాలైన కొమ్ము కోయ, థింస్సా, గుస్సాడీ, బంజారా నృత్యాలు, డప్పు కళాకారులకు ఫుల్ డిమాండ్ ఉంది. ప్రధాన నాయకుడు వెనుక వస్తుంటే అతనికి ముందు వరుసలో ఆదివాసీ/బంజారా కళాకారులు చేసే నృత్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇళ్లలో ఉన్న వారు, వాణిజ్య సముదాయాల్లో ఉన్నవారిని బయటకు రప్పిస్తున్నాయి. తద్వారా నేతలు చేపట్టే కార్యక్రమాలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. దీంతో టెక్నాలజీ యుగంలోనూ ఆదివాసీ, బంజారా కళలు.. తగ్గేదేలే అన్నట్టుగా తమ ఉనికిని చాటుకుంటున్నాయి. కొమ్ము కోయ.. రాష్ట్ర విభజనకు ముందు కొమ్ము, కోయ నృత్య కళాకారులు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఉండేవారు. విభజన తర్వాత ఏపీ పరిధిలోకి వెళ్లారు. ప్రస్తుతం చింతూరు కేంద్రంగా కొమ్ము కోయ నృత్య బృందాలు ఉన్నాయి. ఈ బృందాల్లో పొడవైన వాడి కలిగిన కొమ్ములు, నెమలి ఈకలతో చేసిన తలపాగా మగవాళ్లు ధరిస్తారు. మెడలో పెద్దడోలు వాయిద్యం కలిగి ఉంటారు. మహిళలు ఆకుపచ్చచీరలు ధరించి, తలకు ఎర్రని రుమాలు, కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు. మగవారు వేసే డప్పు వాయిద్యాలకు అనుగుణంగా మహిళలు నృత్యం చేస్తారు. అలరిస్తున్న గుస్సాడీ.. ఆదిలాబాద్‌కు చెందిన ఆదివాసీ నృత్యం గుస్సాడీ. ఆదివాసీ పండగల సందర్భంగా ఈ నృత్యం చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహంతో జాతీయ పండగలు, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ రాజకీయ నాయకులు తమ కార్యక్రమాల్లో గుస్సాడీకి స్థానం కల్పిస్తున్నారు. గుస్సాడీ కళాకారులు ధరించే భారీ నెమలి ఈకలు, పూసలతో చేసిన తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బంజారా నృత్యం తెలంగాణ గిరిజనుల్లో అత్యధిక జనాభా లంబాడీలదే. ఇప్పటికీ తండాల్లో లంబాడీ మహిళలు పూ ర్వకాలం నుంచి వస్తున్న వేషధా రణ కొనసాగిస్తున్నారు. ఎరుపురంగులో అద్దాలు, చెమ్కీలతో చేసిన దుస్తులను ధరిస్తుంటారు. చేతులకు తెల్లని పెద్ద గాజులు, చెవులు, ముక్కుకు పెద్ద ఆభరణాలు పెట్టుకుని ప్రత్యేకంగా కనిపిస్తారు. వీరు బంజరా భాష గోర్బోలీలో పాట లు పాడుతూ చేసే నృత్యాలు రాజకీయ ర్యాలీలలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. డప్పు బృందాలు ఒకప్పుడు వామపక్ష పార్టీ పట్ల ప్రజ లు ఆకర్షితులయ్యేలా చేసిన అంశాల్లో డప్పు బృందాలది ప్రత్యేక స్థానం. కళాకారులు కాళ్లకు గజ్జెలు కట్టి డప్పు వాయిస్తూ చేసే నృత్యాలు నేటికీ ఎవర్‌గ్రీన్‌గా కొనసాగుతూ వస్తున్నాయి. ఒకప్పుడు కామ్రేడ్లకే పరిమితమైన డప్పు డ్యాన్సులను ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాలు అక్కున చేర్చుకున్నాయి. - తాండ్ర కృష్ణ గోవింద్ -
65 ఏళ్ల వయసులో ‘డాన్సింగ్ దాదీ’గా ఫేమస్..
సాధారణంగా 65 ఏళ్ల వయసులో మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి అంటూ బాధపడేవారిని చూస్తుంటాం. కానీ, రవి బాల శర్మ బాలీవుడ్ తారలకు దీటుగా డ్యాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు. ఆమె అసలు పేరుకన్నా ‘డాన్సింగ్ దాదీ’గా ఫేమస్ అయ్యింది. మహిళలే కాదు యువత కూడా ఆమె డ్యాన్స్ స్టెప్పులకు ఆశ్చర్యపోతూ ఫాలో అవుతున్నారు. ఈ వయసులో పూజలు చేసుకోకుండా డ్యాన్సులు ఏంటి అనేవారికి మీలో స్కిల్స్ లేకనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఘాటుగా సమాధానం చెబుతుంది. ఇంతకీ ఎవరీ రవి బాల శర్మ... ‘‘నా పేరు ముందు రవి అని అబ్బాయిల పేరు ఉంటుంది. మా చెల్లి పేరు శశి ప్రభ శర్మ అంటే చంద్రుడు. నా పేరులో సూర్యుడు ఉండాలని రవి అని నాన్న అనుకున్నారట. అందుకే బాల అనే నా పేరు ముందు రవి చేర్చారు. చాలా మంది నా పూర్తి పేరు తెలుసుకోకుండా మిస్టర్ అని సంబోధిస్తుంటారు. నేను స్కూల్ టీచర్‌గా చేసే రోజుల్లో ప్రమోషన్ జాబితాలో నా పేరు కనిపించలేదు. విషయమేంటని ఆరా తీస్తే మగ టీచర్ల జాబితాల్లో నా పేరు ఉందని తెలిసింది. సంగీత వారసత్వం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో పుట్టి పెరిగాను. మా ఇంట్లో ఎప్పుడూ సంగీత వాతావరణం ఉంటుంది. మా నాన్న సంగీత ఉపాధ్యాయుడు. అనేక వాద్యాలను వాయించేవాడు. ఆయన దగ్గరే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. మా అమ్మ కూడా చాలా బాగా పాడేది. కానీ, పిల్లల పెంకంలో ఆమె ఎప్పుడూ బిజీగా ఉండేది. మా నాన్న కొడుకు, కూతురు అనే తేడా చూడలేదు. నా కూతుళ్లు తమ కాళ్లపై తాము నిలబడగానే పెళ్లి చేస్తానని చెబుతుండేవాడు. దీంతో ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం రాలేదు. పాడటమే కాకుండా కథక్ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నాను. సితార్, తబలా కూడా వాయిస్తాను. హిందీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాను. 27 ఏళ్లుగా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో మ్యూజిక్ టీచర్‌గా ఉన్నాను. పెళ్లయ్యాక ఇల్లు, పిల్లలు, స్కూలు బాధ్యతలతో బిజీ అయిపోయాను. నా ఆసక్తుల గురించి పట్టించుకోలేదు. స్కూల్లో పిల్లలకు సంగీతం నేర్పించడంలో ఎంతో సంతృప్తి ఉండేది. కానీ, సంగీతం టీచర్లకు మిగతా టీచర్లకు ఉన్నంత ప్రాధాన్యత ఉండేది కాదు. కొడుకుతో కలిసి.. నా భర్తకు కేన్సర్ అని తెలియగానే కుప్పకూలిపోయాం. అతని మరణం నన్ను బాగా కుంగదీసింది. కూతురికి పెళ్లయ్యింది. మా అబ్బాయి ఏకాంష్ రచయిత, నటుడు. దీంతో అతనితో పాటు ముంబై వచ్చాను. లాక్డౌన్ సమయంలో మా అబ్బాయి సోషల్ మీడియా అకౌంట్‌ను క్రియేట్ చేశాడు. నన్ను విషాదం నుంచి తేరుకునేలా చేసేందుకు కొన్ని వీడియోలు షూట్ చేసేవాడు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించాడు. వాటిని చూసి, వస్తున్న ప్రశంసలు చూసి నేనూ చాలా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. మొదట్లో పెద్దగా వ్యూస్ రాకపోయినా తర్వాత ఫేమస్ అయ్యాను. వైరల్ అయిన విధం.. గాయకుడు, గేయ రచయిత దిల్జీత్ దోసాంజ్ పాటకు డ్యాన్స్ చేసి, ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తే, ఆ వీడియోను అతను షేర్ చేయడంతో తెగ వైరల్ అయ్యింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నా డ్యాన్స్ టాలెంట్ నన్ను సోషల్ మీడియాకు ‘డ్యాన్స్ దాది’ని చేసింది. లక్షలాది మంది అభిమానులను తెచ్చిపెట్టింది. బాలీవుడ్ తారలు ఏ నటి పాటతో డ్యాన్స్ చేసినా ఆమె నా వీడియోను షేర్ చేసేంతగా పేరు రావడం నిజంగా ఆశ్చర్యమనిపించింది. ఈ వయస్సులో డ్యాన్స్ చేయడం చూసి వాళ్లూ ఆశ్చర్యపోతుంటారు. కానీ నా వయస్సును హాబీకి దూరంగా ఉంచుతున్నాను. నృత్యం నా హాబీ. అది నన్ను నా మనసులో ఎప్పుడూ యవ్వనంగా ఉంచుతుంది. నా డ్యాన్స్ వీడియోలు చూసిన తర్వాత చాలామంది మహిళలు ‘మీ నుంచి చాలా స్ఫూర్తి పొందుతున్నామ’ని చెబుతుంటారు. చాలా మంది యువకులు కూడా నా డ్యాన్స్ ఫాలో అవుతున్నారు. కొందరు మాత్రం ‘ఈ వయసులో పూజలు చేసుకోకుండా, డ్యాన్స్ ఎందుకు, నడుం పట్టేస్తుంది జాగ్రత్త’ అని కామెంట్స్ చేస్తుంటారు. అలాంటి వారికి నేను భయపడను. వారికి డ్యాన్స్‌లో స్కిల్ లేదు. కాబట్టి, వారికి ఆ కళ తెలియదు. విమర్శించేవారు వారి వ్యక్తిగత చిరాకుల కారణంగానే అలాంటి కామెంట్స్ చేస్తారు అనిపిస్తుంది. కొందరికి ఇష్టం ఉన్నా తమలో ఉన్న బిడియం వల్ల డ్యాన్స్ చేయలేరు. ఇంకొందరు తమకు నచ్చినది ఇతరులు చేయడం చూస్తే ‘నేనెందుకు చేయలేకపోయాను’ అని బాధపడతారు. ఇది ఒకరకమైన మానసిక రుగ్మత తప్ప మరొకటి కాదు. అలాంటి వారిపై మన శక్తిని వృథా చేయకూడదు. ఎందుకంటే అది మనల్ని ముందుకెళ్లకుండా ఆపుతుంది. వయసు ఓ సంఖ్య మాత్రమే! హృదయంలో పిల్లల్లాగే ఉండి, హాబీస్తో జీవిస్తున్నట్లయితే మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరు. అదే, ఎన్నో విషాదాలను వెనక్కి నెట్టేస్తుంది. మీ హాబీ మిమ్మల్ని యంగ్‌గా ఉండటానికి సహాయపడుతుంది. ఇలాంటప్పుడు వయసు తన ప్రభావాన్ని చూపడంలో ఎప్పుడూ ఫెయిల్ అవుతుంది. నేను డాన్స్ చేయకపోతే వయసు నన్ను ఓడించేది. కానీ, నా హాబీని సజీవంగా ఉంచుకుని, దానిని పూర్తి స్థాయిలో జీవించడం ద్వారా వయసును ఓడించాను’’ అని ఆనందంగా తెలియజేస్తారు ఈ డ్యాన్సర్. -
గణేష్ మండపంలో బుర్ఖాతో డ్యాన్సులు.. అరెస్టు
చెన్నై: గణేష్ చతుర్థి ఉత్సవాల్లో ఓ యువకుడు బుర్ఖా ధరించి డ్యాన్సులు వేయడం వివాదాస్పదంగా మారింది. బుర్ఖా ధరించి డ్యాన్సులు వేయడాన్ని ఆక్షేపిస్తూ ఫిర్యాదులు రావడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తమిళనాడులోని వెల్లూరులో ఈ ఘటన జరిగింది. గణేష్ చతుర్థి ఉత్సవాల్లో ఓ యువకుడు డ్యాన్సులు చేస్తున్న వీడియో సోషల్ మీడియోలో వైరల్ అయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. బుర్ఖా ధరించి డ్యాన్సులు వేయడాన్ని తప్పుబడుతూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు యువకున్ని అరుణ్ కుమార్‌గా గుర్తించి అరెస్టు చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమయ్యేలా ఉందని పోలీసులు తెలిపారు. వినాయక ఉత్సవాల్లో మతపరమైన భావాలను దెబ్బతీస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. డ్యాన్స్‌లో పాల్గొన్న ఇతర యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన -
ఇన్ఫ్లేషన్ మండుతోంటే..ఈ డ్యాన్స్‌లేంటి? కమలా హ్యారిస్‌పై మండిపాటు
Kamala Harris Dances To Hip-Hop: యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. వైట్ హౌస్‌లో హిప్-హాప్ 50వ వార్షికోత్సవ వేడుకను వైట్ హౌస్ పార్టీ ఇచ్చారు. దీనికి సంబంధించి హిప్-హాప్ ట్యూన్లకు అడుగులేశారు. దీంతో నెటిజన్లు ధ్వజమెత్తారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం షాక్, విధ్వంసకర మౌయి అగ్నిప్రమాదాల అనంతర పరిణామాలు వంటి తీవ్రమైన సమస్యలతో అమెరికా అతలాకుతమవుతోంటే, ఈమె మాత్రం బాధ్యతా రాహిత్యంతో పార్టీని ఆస్వాదిస్తున్నారంటూ నెటిజన్లు ఆమెపై మండి పడ్డారు. మరికొంతమంది వినియోగదారులు ఆమె డ్యాన్స్ టైమింగ్‌పై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాజకీయ వ్యాఖ్యాత ఆంథోనీ బ్రియాన్ లోగాన్ గ్రానీ మూవ్స్ అంటూ షేర్ చేసిన 22-సెకన్ల నిడివి గల వీడియోలో హారిస్ డ్యాన్స్ చేశారు. 1999లో క్యూ-టిప్ హిట్ “వివ్రాంట్ థింగ్” కి హారిస్ డ్యాన్స్ చేయడం చూడవచ్చు. హాట్ పింక్ స్లాక్స్, 90ల నాటి నియాన్ బ్లౌజ్‌ని ధరించి చేసిన ఆమె స్టెప్పులు విమర్శలకు తావిచ్చాయి. కోరస్‌కు మించిన సాహిత్యం ఆమెకు తెలియదంటూ సోషల్ మీడియాలో చాలామంది ఎగతాళి చేసారు. "ప్యూర్ క్రింగ్" అని కొందరు "కాకిల్ షఫుల్"గా విమర్శలు వెల్లువెత్తాయి. కాగా హారిస్ డాన్స్‌పై విమర్శలు చెలరేగడం ఇదే మమొదటిసారి కాదు. జూన్‌లో, బ్రావో "వాచ్ వాట్ హాపెన్స్ లైవ్ విత్ ఆండీ కోహెన్"లో డ్యాన్స్, ఇబ్బందికరమైన నవ్వుపై నెటిజన్లు వ్యాంగ్యాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. హారిస్ డ్యాన్స్ మూవ్‌లు ఆన్లైన్లో ఎగతాళికి గురి కావడంపై స్పందించిన కొంతమంది పబ్లిక్ ఫిగర్లు కూడా మనుషులే అని గుర్తుంచు కోవాలి అంటున్నారు. సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం,వ్యక్తిగతంగా కొంత సమయాన్ని ఆస్వాదించడానికి వారూ అర్హులే అని వ్యాఖ్యానించారు. Kamala Harris with the granny 👵🏼 moves at her 50th Anniversary of Hip-Hop partypic.twitter.com/8Lg5XCxQ3a — Anthony Brian Logan (ABL) 🇺🇸 (@ANTHONYBLOGAN) September 9, 2023 -
గిరిజనులతో రాహుల్ డ్యాన్సులు.. వీడియో వైరల్..
చెన్నై: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ముత్తునాడు గ్రామంలో గిరిజన తెగలతో కలిసి జనాపద నృత్యంలో చిందులేశారు. ఎంపీ పదవి పునరుద్ధరణ జరిగిన తర్వాత రాహుల్ గాంధీ మొదటిసారి కేరళ, తమిళనాడులో పర్యటించారు. తన సొంత నియోజకవర్గం అయిన వయనాడ్‌లో కూడా పర్యటించారు. తమిళనాడులో తోడాలు అనే గిరిజన తెగలు ప్రసిద్ధిగాంచారు. పర్యటనలో భాగంగా వారితో కలిసి రాహుల్ గాంధీ ఆడిపాడారు. చేయిచేయి కలిపి జానపద నృత్యంలో చిందులేశారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ పంచుకుంది. ఇది కాస్త వైరల్‌గా మారింది. #WATCH | Congress MP Rahul Gandhi with members of the Toda tribal community in Muthunadu village near Ooty in Tamil Nadu pic.twitter.com/g7iBVcKhTJ — ANI (@ANI) August 12, 2023 పర్యటనలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటి సమావేశాల్లో కూడా రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పర్యటనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీటి సిద్ధిక్ ఈ మేరకు తెలిపారు. ఇదీ చదవండి: మోదీ దేశానికి రాజు కావాలనుకుంటున్నారు -
అదరహో..! ఐదు రోజుల పాటు నిర్విరామంగా బాలిక డ్యాన్స్.. గిన్నీస్ రికార్డ్..
మహారాష్ట్ర: మహారాష్ట్రకు చెందిన ఓ బాలిక అరుదైన ఘనత సాధించింది. నిరంతరాయంగా 127 గంటలపాటు డ్యాన్స్ చేసి గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించింది. డ్యాన్స్ మారథాన్‌లో ఐదు రోజులపాటు నిర్విరామంగా క్లాసికల్ కథక్ నృత్యం చేసింది. మే 29 నుంచి జూన్ 3 వరకు ఈ మారథాన్‌లో పాల్గొని ఇప్పటివరకు ఉన్న 126 గంటల రికార్డ్‌ను అధిగమించింది. సృష్టి సుధీప్ జగతాప్(16) లాతూర్కు చెందిన బాలిక. నృత్యంలో మంచి ప్రతిభను చూపించింది. ఏదైనా గొప్పగా సాధించాలనే తన కలను నెరవేర్చుకుంది. నిర్విరామంగా ఐదు రోజుల పాటు క్లాసికల్ కథక్ నృత్యం చేసి గిన్నిస్ రికార్డును సాధించింది. అయితే.. ఈ అంశంలో ఇప్పటివరకు నేపాలీ డ్యాన్సర్ బందన 2018లోనే 126 గంటలపాటు నృత్యం చేసింది. ఆ రికార్డును ఇప్పుడు సుధీప్ జగతాప్ అధిగమించింది. అయితే.. ఈ డ్యాన్స్‌లో కేవలం ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సుధీప్ కేవలం రాత్రిళ్లు మాత్రమే ఈ అవకాశాన్ని వాడుకుని నృత్యం చేసింది. సుధీప్ ఎల్లప్పుడూ తన కాళ్లలో కదలికలను ఆపలేదని నిర్వహకులు తెలిపారు. తన తల్లిదండ్రులు ఎల్లప్పుడు తన పక్కనే ఉన్నారని సుధీప్ జగతాప్ చెబుతోంది.రాత్రిళ్లు నిద్ర రాకుండా ముఖంపై నీళ్లు చల్లేవారని తెలిపింది. చివరి గంటవరకు తన శరీరం కదలలేని పరిస్థితికి చేరినప్పటికీ లక్ష్యం మీదే దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. తాతయ్యతో పాటు యోగా తరగతులకు వెళ్లి యోగ నిద్ర సాధన చేశానని తెలిపింది. భారతీయ సంప్రదాయాన్ని ప్రపంచ వేదికకు తీసుకువెళ్లడమే ధ్యేయమని అంటోంది. ఇదీ చదవండి:Aryan Dubey Rebirth Story: ‘ఆవిడ మా ఆవిడే..’ పునర్జన్మ చెబుతూ హడలెత్తిస్తున్న కుర్రాడు! -
తగ్గేదే లే.. ఈ బుడ్డోడి డాన్స్ చూశారా?
-
జానపద కళాకారులతో నృత్యం చేసిన సింగపూర్ రాయబారి
పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్‌లో జరిగిన జీ20 సమావేశంలో అక్కడ జానపద కళాకారులతో కలిసి సింగపూర్ రాయబారి సైమన్ వాంగ్ డ్యాన్స్ చేశారు. ఈ మేరకు డార్జిలింగ్‌లో మూడు రోజుల జీ20 వర్కింగ్ సమావేశాలు సందర్భంగా భారత్‌లోని సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ మొదటి రోజు జరిగిన కార్యక్రమంలో జానపద కళకారులతో కలిసి కాలు కదిపారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..రాబోయే సంవత్సరాలలో టీ టూరిజం మరింత పెరుగుతుందన్నారు. పర్యాటకం కోసం మా రెండో సమావేశం డార్జిలింగ్‌లో జరిగింది. ఇక్కడ పనిచేసే కార్మికులకు కూడా దీని ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. అని అన్నారు. మొదటి రోజు ఈవెంట్లో భాగంగా ప్రతినిధులు టీ తీయడం గురించి అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జీ20 ఛీఫ్ కో ఆర్టినేటర్ హర్షవర్ధన్ ష్రింగ్లా మాట్లాడుతూ.. ప్రపంచానికి భారతదేశం గురించి తెలియజేయాలన్న మోదీ ఆదేశాల మేరకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో జీ20 సదస్సుకు భారత్ ఆతిధ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. జీ20 సమావేశాలు దేశ రాజధాని న్యూఢిల్లీకి మాత్రమే పరిమితం కాకూడదని, భారత్‌లని మిగతా ప్రదేశాల్లోని వారసత్వం, సంస్కృతి, అందం, గొప్పతనం గురించి కూడా విదేశీ ప్రతినిధులు తెలసుకోవాలని ష్రింగ్లా చెప్పారు. ఈ క్రమంలో సింగపూర్ రాయబారి ట్విట్టర్ వేదికగా నాటి కార్యక్రమాన్ని ఉద్దేశిసస్తూ.. జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశంలో అది ఒక అద్భుతమైన సాయంత్రం. రాత్రి చందుడి వెలుగులో టీని కోయడం అనేది హైలెట్‌గా నిలిచిందని అన్నారు. కాగా, భారతదేశంలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన డార్జిలింగ్‌లో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 3, 2023 వరకు రెండో టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు ఆతిధ్యం ఇవ్వనుంది. దాదాపు 130 మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ మూడు రోజుల సమావేశంలో కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రభావితమైన పర్యాటక రంగాన్ని పునరుద్ధరించే మార్గాలపై జీ20 సభ్య దేశాల ప్రతినిధులు చర్చించనున్నారు. (చదవండి: రేపే జైలు శిక్షను సవాలు చేస్తు రాహుల్ పిటిషన్!) -
పార్టీ చేసుకున్న ప్రధాని... స్టెప్పులతో హల్చల్: వీడియో వైరల్
ఫిన్లాండ్ ప్రధాని వీడియో పెద్ద వివాదస్పదంగా మారింది. ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్ కొందరూ నాయకులు, సినీ ప్రముఖులతో కలిసి పార్టీ చేసుకుంది. ఈ వీడియో లీక్ అవ్వడంతో... నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఆ పార్టీలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యురాలు ఇల్మారి నూర్మినెన్, ప్రముఖ గాయకులు, ప్రముఖ యూట్యూబర్, టీవీ యాంకర్లు తదితరులు ఉన్నారు. ఆ వీడియోలో ఫిన్లాండ్ ప్రధాని డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టింది. ఐతే ఈ పార్టీ ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కానీ నెటిజన్ల ఈ వీడియోను చూసి విభిన్నంగా స్పందించారు. కొందరూ ప్రధానమంత్రికి కూడా పార్టీలు సర్వసాధారణమైనని అంటూ మారిన్‌కి మద్దతు ఇవ్వగా .... మరికొందరూ ప్రధాని హోదాలో ఇవేమి పనులు అంటూ మండిపడుతున్నారు.. Finland’s Prime Minister @MarinSanna is in the headlines after a video of her partying was leaked today. She has previously been criticized for attending too many music festivals & spending too much on partying instead of ruling. The critics say it’s not fitting for a PM. pic.twitter.com/FbOhdTeEGw — Visegrád 24 (@visegrad24) August 17, 2022 (చదవండి: విదేశాంగ మంత్రి కొడుకుతో యూఎస్ రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడూ ఏం జరిగిందంటే....) -
అట్టహాసంగా లగ్జరీ కారుల్లో డ్యాన్స్‌లు చేస్తూ... పెళ్లి ఊరేగింపు...సీన్ కట్ చేస్తే...
ఇటీవల యువత చాలా అట్టహాసంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. చాలా డబ్బు ఖర్చుపెట్టి మరీ గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటున్నారు. ఐతే ఇక్కడోక ఉత్తరప్రదేశ్‌కి చెందిన వరడుకి కేవలం పెళ్లి ఊరేగింపుకే రెండు లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఎందుకో తెలుసా! వివరాల్లోకెళ్తే....ముజఫర్నార్ హరిద్వార్ జాతీయ రహదారిపై ఒక పెళ్లి బృందం వరుస లగ్జరీ అడీ కార్లలతో సందడి చేసింది. వరుడు అతని స్నేహితుల బృందం టాప్‌లెస్ కారులో డ్యాన్స్‌లు చేశారు. మరికొంతమంది కారు కిటికిలోంచి వేలాడుతూ సెల్పీలు తీయడం వంటి పనులు చేశారు. ఐతే ఇలాంటి స్టంట్లు తోటి ప్రయాణికుల భద్రతను ఎలా దెబ్బతీస్తుందో తెలియజేస్తూ అంకిత్ కుమార్ అనే వ్యక్తి ట్విట్టర్లో ఈ ఘటనకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేశారు. అతను ట్విట్టర్లో... తాను హరిద్వార్ నుంచి నోయిడా వెళ్తున్న సమయంలో.. ముజఫర్ నగర్ జిల్లాలో కొంతమంది తమ వినోదం కోసం ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు గ్రహిస్తారని ఆశిస్తున్న అని ట్వీట్ చేశారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సదరు పెళ్లి బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడమే కాకుండా ఆ ఊరేగింపులో ఉపయోగించిన తొమ్మిది కార్లను స్వాధీనం చేసుకున్నారు. సదరు కారు యజమానులపై రూ. 2 లక్షలు జరిమాన విధించారు కూడా. ➡️हाइवे पर गाडियों से स्टंट करने वाले वाहनों के विरुद्ध मुजफ्फरनगर पुलिस द्वारा की गयी कार्यवाही। ➡️कुल 09 गाडियों का 02 लाख 02 हजार रुपये का चालान।@Uppolice @The_Professor09 @ankitchalaria pic.twitter.com/VqaolvazhO — MUZAFFARNAGAR POLICE (@muzafarnagarpol) June 14, 2022 (చదవండి: వీడియో: దిగజారిపోతున్న పుతిన్ ఆరోగ్యం? వణికిపోతూ.. నిలబడలేక!) -
పబ్‌గా కేఫ్ అండ్ బార్... అర్థనగ్న డ్యాన్సులతో హంగామా!
సాక్షి, హైదరాబాద్: మధ్య మండలంలోని రామ్‌గోపాల్ పేటలో (ఆర్ పేట) క్లబ్ టెకీల పేరుతో కేఫ్ అండ్ బార్ ఏర్పాటు చేసిన ఓ వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా దీన్ని పబ్‌గా మార్చేశాడు. అది చాలదన్నట్లు డ్యాన్స్ బార్ యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేయిస్తూ రూపమిచ్చి క్యాబరేలు నడుపుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడి చేశారు. నిర్వాహకులు, కస్టమర్ల సహా మొత్తం 18 మందిని అరెస్టు చేసినట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. క్లబ్ టెకీల మేనేజింగ్ డైరెక్టర్ సైతం మహిళ కావడం గమనార్హం. బోయిన్‌పల్లికి చెందిన జి.విజయ్‌కుమార్ గౌడ్ కొన్నాళ్లుగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా క్లబ్ టెకీలను నిర్వహిస్తున్నారు. దీనికి నళిని రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఎన్.రవి దీనికి మేనేజర్/అకౌంటెంట్‌గా, సైదా జరీన్, బి.హరికృష్ణ డీజే ఆపరేటర్లుగా, బి.ప్రకాష్ క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. సమయ పాలన లేకపోవడంతో పాటు డీజే నిర్వహణ, డిస్కో లైట్ల ఏర్పాటులోనూ నిబంధనలు పాటించలేదు. ఈ నేపథ్యంలోనే గతంలో రెండు కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ మారని, అంతటితో ఆగని క్లబ్ టెకీల నిర్వాహకులు కస్టమర్లను ఆకట్టుకోవడానికి మరో అడుగు ముందుకు వేశారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దిగువ మధ్య తరగతి యువతులను ఆకర్షించి వారితో నృత్యాలు చేయిస్తూ డ్యాన్స్ బార్గా మార్చేశారు. ఈ యువతులు తమ హావభావాలతో పాటు చర్యలతోనూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. డ్యాన్సర్లు అభ్యంతరకరంగా నృత్యం చేస్తూ వెళ్లి కస్టమర్ల పక్కన కూర్చోవడం, వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించడం చేస్తూ ఇతర అసాంఘిక కార్యకలాపాలకు ప్రోత్సహిస్తున్నారు. దీనిపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్.రఘునాథ్‌కు సమాచారం అందింది. ఎస్సై సీహెచ్ నవీన్ కుమార్ బృందంతో కలిసి ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంటల ప్రాంతంలో క్లబ్ టెకీలపై దాడి చేశారు. నళిని రెడ్డి, ఎన్.రవి, సైదా జరీన్, బి.హరికృష్ణ, బి.ప్రకాష్‌లతో పాటు నృత్యాలు చేస్తున్న ఎనిమిది మంది యువతులు, ఐదుగురు కస్టమర్లను అరెస్టు చేశారు. నిందితులను తదుపరి చర్యల నిమిత్తం ఆర్ పేట పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న విజయ్ కుమార్ గౌడ్ కోసం గాలిస్తున్నారు. పబ్‌లో రష్యన్ యువతులతో డ్యాన్సులు బంజారాహిల్స్: రష్యన్ యువతులతో అర్దనగ్న డ్యాన్స్‌లతో అర్ధరాత్రి హంగామా సృష్టించిన ఓ పబ్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు–36లో ఎనిగ్మా పేరుతో ఒక రెస్టారెంట్, పబ్‌ను ప్రారంభించారు. ప్రీలాంచింగ్ అంటూ ప్రారంభించిన ఈ పబ్‌లో రష్యన్ యువతులతో నృత్యాలు ఏర్పాటు చేశారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ వేడుకలకు ఎౖMð్సజ్‌శాఖ నుంచి అనుమతులు తీసుకున్న పబ్ నిర్వాహకులు..పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఇదే సమయంలో పబ్‌లో శనివారం రాత్రి అతిథులు పెద్దసంఖ్యలో రావడం, మద్యం మత్తులో తూలడంతో పాటు అక్కడున్న రష్యన్ యువతులతో కలిసి నృత్యాలు చేశారు. దీనికితోడు రహదారిపై పూర్తిగా ట్రాఫిక్ జామ్ కావడం,పబ్‌లోని శబ్ధాలకు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. పబ్ నిర్వాహకులైన దుర్గాప్రసాద్, చువాల్సింగ్లపై ఐపీసీ సెక్షన్ 294, ఆబ్సెంట్ చట్టం, 341, 21 ఆఫ్ 76 చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పబ్బు..గబ్బు!) -
మేనల్లుడితో సల్మాన్ డ్యాన్స్.. నెట్టింట వీడియో వైరల్
Salman Khan Dance With Nephew And Niece Video Viral: బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ హిట్ చిత్రాల్లో 'దబాంగ్' సిరీస్ ఒకటి. చుల్బుల్ పాండేగా ఈ సినిమాలతో ఎంతగానో అలరించాడు సల్లూ భాయి. ప్రస్తుతం సల్మాన్ 'ద-బాంగ్' ఈవెంట్ కోసం దుబాయ్‌లో ఉన్నాడు. బుట్టబొమ్మ పూజా హెగ్డే, సాయి మంజ్రేకర్‌తోపాటు ఇతర నటీనటులతో కలిసి దుబాయ్‌లో నిర్వహించిన ఈవెంట్ కోసం ముందు రోజు రిహార్సల్స్ చేశాడు. ఈ క్రమంలోనే సల్మాన్ మేనల్లుడు అహిల్, మేనకోడలు అయత్‌తో కలిసి 'అల్లా దుహై', 'హుద్ హుద్ దబాంగ్' పాటలకు స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియోలో సల్మాన్‌తో కలిసి డ్యాన్స్ చేసేందుకు తన మేనల్లుడు, మేనకోడలు నెర్వస్‌గా ఫీలవడం చూడొచ్చు. ఈ వీడియో చూసిన సల్లూ భాయి అభిమానులు, ఫాలోవర్లు పిల్లలతో సల్మాన్‌కు ఉండే అటాచ్‌మెంట్‌ను పొగుడుతున్నారు. ఇవే కాకుండా సల్మాన్ ఫ్యాన్ పేజీలలో సాయి మంజ్రేకర్, పూజా హెగ్డేతో కలిసి రిహార్సల్స్ చేసిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్లో ఆయుష్ శర్మ, దిశా పటానీ, సోనాక్షి సిన్హా, మనీష్ పాల్, గురు రుంధవా కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. భాయిజాన్ రెండో భాగం సినిమాలో సల్మాన్‌తో తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోనుంది పూజా హెగ్డే. View this post on Instagram A post shared by JA Events (@thejaevents) View this post on Instagram A post shared by JA Events (@thejaevents) -
భోగి సంబరాల్లో అంబటి రాంబాబు డ్యాన్స్
సాక్షి, గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా సంక్రాంతి శోభ సంతరించుకుంది. శుక్రవారం తెల్లువారుజాము నుంచే భోగి మంటలు వేయటంతో పండగ వాతావరణం సందడిగా మారింది. పలువురు రాజకీయ ప్రముఖులు భోగి మంటల వేడుకల్లో సందడి చేశారు. గుంటూరు జిల్లాలొని సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే అంబటి రాంబాబు పాల్గొన్నారు. గాంధీ బొమ్మ సెంటర్లో సాంప్రదాయబద్దంగా భోగి మంటలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. మహిళలలో హుషారుగా డ్యాన్స్ చేసి అక్కడ ఉన్నవారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భోగి సంబరాల్లో పాల్గొనటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలకు తోడుగా జగనన్న సంక్షేమ పథకాలు ఉన్నాయన్నారు. -
Karnataka: అర్ధరాత్రి.. అడవిలో రేవ్ పార్టీలు
సాక్షి,బనశంకరి(కర్ణాటక): నగర శివారులోని బన్నేరుఘట్ట అటవీప్రాంతంలో గుట్టుగా నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై శనివారం అర్ధరాత్రి బెంగళూరు రూరల్ పోలీసులు దాడిచేసి ఇద్దరిని అరెస్ట్ చేసి, 30 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. బన్నేరుఘట్ట, తమిళనాడు సరిహద్దు గల తమ్మనాయకనహళ్లి అటవీప్రాంతం సమీపంలో గల ముత్యాలమడుగు కాలువ వద్దనున్న రిసార్టు ఆధ్వర్యంలో రేవ్ పార్టీ జరిపారు. పెద్దసంఖ్యలో యువతీ యువకులు మత్తు పదార్థాలను సేవించి అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేసి పార్టీని నిలిపేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో చాలామంది కేరళకు చెందినవారు. వారిలో విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పార్టీలో 60 మందికి పైగా పాల్గొనగా పోలీసులను చూడగానే కొందరు పరారయ్యారు. అదుపులోకి తీసుకున్న 30 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి, డ్రగ్స్ వాడారా లేదా అనేది నిర్ధారణకు రక్త నమూనా, వెంట్రుకల పరీక్షలు చేస్తున్నారు. మోడల్స్, డీజే హంగామా నగరానికి చెందిన అభిలాష్ అనే వ్యక్తి రేవ్‌పార్టీ నిర్వాహకుడు. ఒక యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్నారు. మోడల్స్‌ను, డీజేలను పిలిపించారు. శనివారం రాత్రి 8 గంటలకు పార్టీ ప్రారంభం కాగా నిర్వాహకులు అర్ధరాత్రి డీజేతో హోరు పెంచారు. చుట్టూ అడవి ఉండడంతో పార్టీ సంగతి ఎవరికీ తెలియదు. ఘటనాస్థలంలో మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి రిసార్టుకు ఎలాంటి అనుమతులు లేవని తెలిసింది. యువతీ యువకుల వాహనాల్ని, డీజే సామగ్రిని సీజ్ చేశారు. అడవిలో 30 మందికి పైగా ఉడాయించగా ఆనేకల్ పోలీసులు ఆదివారం గాలింపు చేపట్టారు. చదవండి: అమృత్ సర్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత -
‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’.. వధువు వరస మారుతోంది!
పెళ్లికూతుళ్లు సంప్రదాయాలను తిరగ రాస్తున్నారు. పెళ్లిపీటల మీద తల దించుకుని ఉండటం.. కాబోయే భర్త ఎదుట సిగ్గుల మొగ్గ కావడం.. అత్తారింటికి వెళ్లేప్పుడు కన్నీరు మున్నీరుగా ఏడ్వడం.. ఈ ‘సంప్రదాయ ధోరణి’ కాదని పెళ్లి రోజున పూర్తి ఉత్సాహంగా ఉంటున్నారు. జీవితంలో ముఖ్యమైన రోజును అణువణువు ఆనందమయం చేసుకోజూస్తున్నారు. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అని పాడుతూ డాన్స్ చేస్తున్నారు. అంతేనా? అత్తారింటికి పక్కన భర్తను కూచోబెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారు. నిజంగా వీరు కొత్త పెళ్లికూతుళ్లే. నాలుగు రోజుల క్రితం, ఆగస్టు 22న ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఒక పెళ్లి జరిగింది. వధువు సనా షబ్నమ్, వరుడు షేక్ ఆమిర్. ఇప్పుడు వధువు అత్తారింటికి వెళ్లాలి. సాధారణంగా ఆ సమయంలో పెళ్లిమంటపం గంభీరంగా ఉంటుంది. పెళ్లికూతురి తల్లిదండ్రులు భావోద్వేగాలకు లోనవుతారు. ఇన్నాళ్లు పెంచి పోషించిన బంగారు తల్లి ఇప్పుడు తమ నుంచి వేరుపడి కొత్త జీవితంలోకి అడుగు పెడుతోంది కనుక ఆమె వైవాహిక జీవితం బాగుండాలని ఒక ఆకాంక్ష, ఆమె అక్కడ ఎలా ఉండ బోతోందోననే ఆందోళన... ఇవన్నీ వాతావరణాన్ని బరువెక్కిస్తాయి. పెళ్లికూతురు బొరోమని తన వాళ్లను పట్టుకుని ఏడుస్తుంది. పెళ్లికొడుకు సర్ది చెప్పి బండి ఎక్కిస్తాడు... సాధారణంగా జరిగే ఈ రివాజు మొత్తం ఆ రోజు ఆ పెళ్లిలో ఏమీ జరగలేదు. పెళ్లి ఇంటి దగ్గర బయట ఉన్న మహీంద్రా ఎస్.యు.వి వరకూ పెళ్లి కూతురు హుషారుగా నడిచి వచ్చింది. డ్రైవింగ్ సీట్లో కూచుంది. భర్త ఆమిర్‌ను పాసింజర్ సీట్లో కూచోబెట్టుకుంది. ‘వెళదామా... అత్తారింటికి’ అని బండి స్టార్ట్ చేసింది. బంధుమిత్రులందరూ ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే పెళ్లికూతురి ఉత్సాహాన్ని ప్రోత్సహించారు. కశ్మీర్ లోయలో ఇలాంటి ‘విదాయి’ (అంపకాలు) ఎవరూ చూడలేదు. కాని పెళ్లికూతురు సనా షబ్నమ్ గతంలోని స్టీరియోటైప్‌ను బ్రేక్ చేసింది. ‘నేను కశ్మీర్ పెళ్లిళ్ల మూస పద్ధతిని మార్చాలనుకున్నాను. సనా నన్ను కూచోబెట్టుకుని డ్రైవ్ చేయడం తన జీవితంలోని ముఖ్యరోజున విశేషం అవుతుందని భావించాను. ఆమె నన్ను కూచోబెట్టుకుని నడపడాన్ని ప్రోత్సహించాను. కొంతమందికి ఇది నచ్చకపోవచ్చుగాని చాలామంది మెచ్చుకున్నారు’ అని సనా భర్త ఆమిర్ అన్నాడు. అతడు వృత్తిరీత్యా అడ్వకేట్. బారాముల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా. కశ్మీర్ ముస్లింలలో సంప్రదాయాల పట్ల కట్టుబాటు ఉన్నా అక్కడ స్త్రీలు ఆధునికంగా ఆలోచించడాన్ని ఆహ్వానిస్తున్నారని ఈ ఉదంతం వెల్లడి చేస్తోంది. అయితే నెల క్రితం కలకత్తాలో జరిగిన ఇలాంటి సంఘటనే ‘జండర్ మూస’ను బద్దలు కొట్టినట్టయ్యింది. సాధారణంగా భార్య జీవితానికి మార్గం చూపేవాడు భర్తే అవుతాడు సగటు పురుషస్వామ్య భావజాలంలో. భర్త ప్రతిదాన్ని లీడ్ చేస్తే భార్య అనుసరించాలి. ఇది పెళ్లయిన నాటి నుంచి సమాజం మొదలెడుతుంది. అంపకాల్లో పెళ్లికూతురి తండ్రి తన కుమార్తె చేతిని అల్లుడి చేతిలో పెట్టి ‘జాగ్రత్త నాయనా... ఎలా చూసుకుంటావో’నని ఎమోషనల్ అవుతాడు. సమాజం ఇంత ముందుకు వెళ్లినా స్త్రీలు తమ సామర్థ్యాలను నిరూపిస్తున్నా భార్యను భర్త మీద ఆధారపడే వ్యక్తిగా సంకేతం ఇచ్చే ‘అంపకాలను’ ఎందుకు తిరస్కరించకూడదు అని కోల్‌కతాకు చెందిన వధువు స్నేహా సింగ్ అనుకుంది. పెళ్లి అయ్యాక భారీ పెళ్లి లహెంగాలో భర్త సౌగత్ ఉపాధ్యాయను బండిలో కూచోబెట్టుకుని అత్తారింటికి బయలుదేరింది. ఇది దేశంలో చాలా వైరల్ వీడియో అయ్యింది. ‘ఇలా చేయాలని నెల క్రితమే నేను అనుకుని సౌగత్‌ను అడిగాను. అతడు సంతోషంగా అంగీకరించాడు. అయితే ఆ తర్వాత ఆ సంగతి పెళ్లి కంగారులో మర్చిపోయి నేను పాసింజర్ సీట్లో కూచుంటే నువ్వు నడుపుతానన్నావుగా అని అతడే గుర్తు చేశాడు. నిజానికి సౌగత్‌ను కూచోబెట్టుకుని బండిలో తిప్పడం పెళ్లికి ముందు నుంచే నాకు అలవాటు. ఆ పనే ఇప్పుడూ చేశాను. అతని డ్రైవింగ్ నాకు భయం కూడా అనుకోండి’ అని నవ్వింది స్నేహా. ఇరవై ముప్పై ఏళ్ల క్రితం కమ్యూనికేషన్ వ్యవస్థ, ట్రాన్స్‌పోర్టేషన్ సరిగా ఉండేవి కాదు. అత్తారిల్లు పక్క ఊళ్లోనే అయినా దూరం అయినా రాకపోకలు మాటా మంతి అంతగా సాగేవి కావు. ఉత్తరాలనే నమ్ముకోవాల్సి వచ్చేది. పైగా ఆనాటి ఆడపిల్లలు సరైన చదువుకు, ఉపాధికి నోచుకోక భవిష్యత్తంతా అత్తారింటి మంచి చెడ్డల మీద ఆధారపడి ఉండేవారు. అందువల్ల పెళ్లి సమయాలలో పెళ్లికూతుళ్లు ఆందోళనగా, ఉద్వేగంగా, సమాజ పోబడికి తగ్గట్టు బిడియంగా ఉండేవారు. కాని ఇప్పుడు ఎంత దూరం వెళ్లినా, అమెరికాలో ఉన్నా అనుక్షణం తన వాళ్లకు కనపడుతూ వినపడుతూ ఉండే వీలు ఉంది. ఒక్కరోజు తేడాలో ఎంత దూరం అయినా ప్రయాణించవచ్చు. అబ్బాయి అమ్మాయిల మధ్య పెళ్లికి ముందు కొద్దో గొప్పో మాటలు నడిచి పెళ్లి నాటికి స్నేహం కూడా ఏర్పడుతోంది. అందుకే ఇప్పుడు పెళ్లిళ్లలో పూర్తిగా కొత్త ఆలోచనల పెళ్లికూతుళ్లు కనిపిస్తున్నారు. ఇటీవల తెలంగాణలోని జగిత్యాల ప్రాంతానికి చెందిన వధువు సాయి శ్రీయ వరుడు అశోక్‌తో అంపకాల సమయంలో అత్తారింటికి సంతోషంగా వెళుతూ ప్రైవేటు గీతం ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ పాటకు చేసిన నృత్యం దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. ఆ వీడియోలో సాయి శ్రీయ తన భర్తను చూస్తూ సంతోషంగా డాన్స్ చేస్తుంటే భర్త కూడా ఎంతో ముచ్చట పడుతూ చూడటాన్ని జనం మెచ్చుకున్నారు. ఆ జంటను ఆశీర్వదించారు. నిన్న మొన్నటి వరకు అబ్బాయికి విందులో ఏది ఇష్టం, మంటపం ఏది బుక్ చేయమంటాడు, పెళ్లి ఎలా జరగాలంటాడు వంటి ప్రిఫరెన్సు దక్కేది. ఇప్పుడు అమ్మాయికి ఏది ఇష్టం, ఏం కావాలంటోంది, ఏది ముచ్చపడుతోంది అని అడిగి అంగీకరించే పరిస్థితికి నేటి ఆడపిల్లలు వీలు కల్పిస్తున్నారు. సంతోషాల ఎంపికలో ఆమెకూ సమాన భాగం దొరికితే ఆ వివాహం మరెంతో సుందరం కదా. -
బంధువులు లేని పెళ్లి బరాత్.. వైరల్ వీడియో..
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని తీపిగుర్తు. పెళ్లిలోని ప్రతి వేడుకను వధువరులు జీవితాంతం మరిచిపోలేనిదిగా ఉండాలనుకుంటారు. అయితే వివాహం జరిగిన అనంతరం ఏర్పాటు చేసే బరాత్‌లో కుటుంబసభ్యులు, స్నేహితులు చేసే డ్యాన్సుల హంగామా మాములుగా ఉండదు. ప్రతి ఒక్కరు దీన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అయితే తాజాగా, ఓ వరుడి పెళ్లి బరాత్‌లో కేవలం బ్యాండ్‌వారు మాత్రమే కనిపిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కనిపించలేదు. కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న నేపథ్యంలో పెళ్లి బరాత్‌లో ఎవరు హాజరు కాకుండా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బంధువులతో, అల్లరిగా సాగాల్సిన పెళ్లి బరాత్ సందడి లేక వెలవెలబోయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘పాపం.. కోవిడ్ మహమ్మారి వల్ల ఇలా అయింది’.. ‘ఇప్పుడే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు బ్రో.. ‘ అసలు నీ స్నేహితులు ఎక్కడికి వెళ్లారు. కరోనాకు భయపడి వచ్చారా? లేదా?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
మద్యం మత్తులో ‘గాంధీ’ సెక్యూరిటీ గార్డుల డ్యాన్స్
సాక్షి, హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగంలో టిక్‌టాక్‌ల వ్యవహారం సద్ధుమణగక ముందే ఆస్పత్రి అత్యవసర విభాగంలో మద్యం మత్తులో సెక్యూరిటీ గార్డులు చేసిన డ్యాన్సులు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఆస్పత్రి పాలనయంత్రాంగం నలుగురు సెక్యూరిటీ గార్డులను విధుల నుంచి తొలగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గాంధీ ఆస్పత్రిలో ఎజిల్ సెక్యూరిటీ సంస్థ తరుపున సుమారు 200 మంది సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహిస్తున్నారు. అత్యవసర విభాగంలోని రెండవ అంతస్తులో వి«ధి నిర్వహణలో ఉంటూనే మద్యం మత్తులో కే.కట్టయ్య అనే గార్డు డ్యాన్స్ చేస్తుండగా అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న బీ. శ్రీనివాస్, ఎన్ వెంకటస్వామి, వి. వెంకటేష్ అనే గార్డులు మరింత ఉత్తేజ పరుస్తూ సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించారు.సదరు వీడియోలు శనివారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణ చేపట్టి మద్యం మత్తులో డ్యాన్స్ చేసిన కట్టయ్యతోపాటు మిగిలిన ముగ్గురిని విధుల నుంచి తొలగించామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. సదరు వీడియో ఈనెల 21వ తేది ఉదయం 8.30 గంటలకు అత్యవసర విభాగంలోని రెండవ అంతస్తులో చిత్రీకరించగా, శనివారం సామాజక మాధ్యమాల్లో వైరల్ కావడం గమనార్హం. నిర్వహణ సంస్థ ఎజిల్ సెక్యూరిటీ సంస్థకు నోటీసులు జారీ చేశారు. టిక్‌టాక్ వ్యవహారంపై సీరియస్... గాంధీ ఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగంలో జరిగిన టిక్ టాక్ వ్యవహారాన్ని ఆస్పత్రి పాలనయంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. సదరు అప్రెంటీస్ విద్యార్థులను తొలగించడంతో పాటు రాంనగర్ సాధన పారామెడికల్ కాలేజీ, అత్తాపూర్ జెన్ ఓకేషనల్ కాలేజీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ స్పష్టం చేశారు. ఇకపై సదరు కాలేజీలకు చెందిన విద్యార్థులకు గాంధీ ఆస్పత్రిలో శిక్షణ ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులు, జూనియర్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, వైద్యులు ఇతర సిబ్బంది విధి నిర్వహణలో ఉంటు టిక్ టాక్‌లు, సుదీర్ఘ సెల్‌ఫోన్ సంభాషణలు, చాటింగ్, వీడియో చిత్రీకరణ చేపట్టరాదని ఆదేశాలు జారీ చేశారు. ఫిజియోథెరపీ విభాగ వైద్యులకు నోటీసులు ఇవ్వడంతోపాటు కమిటీని ఏర్పాటు చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. -
టీఆర్ఎస్ నేత డ్యాన్స్.. వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: ఆయన గ్రేటర్లో కార్పొరేటర్.. ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ.. సమస్యలపై స్పందిస్తూ అందరి మన్ననలు పొందారు. పౌరుల సమస్యలపై విభిన్నంగా స్పందించే ఆయన అందరికీ ఆదర్శమంటూ గతంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా ప్రశంసించారు. అయితే సదరు కార్పొరేటర్‌కు సంబంధించిన ఓ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. హయత్‌నగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి.. స్నేహితులు, అనుచరులతో కలిసి రెండురోజుల క్రితం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లారు. అక్కడ స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తూ హైవేపై ఆగి అనుచరులతో కలిసి తీన్మార్ ఆడారు. ఇరువైపులా వాహనాలు వస్తున్నా పట్టించుకోకుండా.. కారులో పాటలు పెట్టుకుని నడిరోడ్డుపై చిందులేశారు. ఈ తతంగాన్ని వీడియో తీసిన అనుచరులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇపుడు వైరల్‌గా మారింది. ఓ ప్రజాప్రతినిధి రోడ్డుపై కారు ఆపి ఇలా డ్యాన్సులు చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. సమాజానికి, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులే ఇలా ప్రవర్తించడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. -
అలరించిన ‘దైవం మానస రూపేణా’
పుట్టపర్తి అర్బన్: దశావతారాలు దాల్చిన భగవంతుడు.. కలియుగంలో సత్యసాయి అవతారం దాల్చి భక్తులను ఆదుకుంటున్నారన్న కథాంశంతో తెలంగాణ భక్తులు అత్యద్భుతంగా ప్రదర్శించిన నృత్య నాటకం అందరినీ అలరించింది. పర్తియాత్ర పేరుతో తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూలు, గద్వాల్ జిల్లాల నుంచి పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి విచ్చేసిన వేలాది మంది భక్తులు రెండో రోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మానవాళిని సత్యం, శాంతి, దయ, ప్రేమవంటి నాలుగు కాళ్లపై నడుపుతున్న మహోన్నత శక్తి సత్యసాయికి తప్ప మరో వ్యక్తికి లేదన్న భావంతో నిర్వహించిన నాట్య నృత్యం రంజింపజేసింది. ఈ సందర్భంగా సత్యసాయి సేవాదళ్ సభ్యుల అధ్యక్షుడు మాట్లాడుతూ, సత్యసాయి బాబా పేరుతో చేస్తున్న సేవా కార్యక్రమాలు, ఉచిత అన్నదానం, ఉచిత వైద్యం, ఉచిత విద్య మానవాళికి వరాలన్నారు. అనంతరం మహామంగళహారతి, సత్యసాయిని కీర్తిస్తూ భజన కార్యక్రమాలు నిర్వహించారు. -
హ్యపీ సండేలో ఏలురు మేయర్ నూర్జహన్ డ్యాన్స్
-
జాతరలో అర్ధనగ్న నృత్యాలు
బెంగళూరు(కోలారు) : భక్తిభావం ఉప్పొంగాల్సిన జాతరలో అశ్లీల నృత్యాలు హోరెత్తాయి. వీటిని అడ్డుకోవాల్సిన పోలీసులు చోద్యం చూశారు. ఈఘటన తాలూకాలోని వానరాశి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో వీరళప్ప స్వామి జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా తుమకూరు సంజయ్ ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇదే తరుణంలో కొందరు మహిళా డ్యాన్సర్లు ఒంటిపై దుస్తులు తీసేసి అర్ధనగ్నంగా మారి తెలుగు, హిందీపాటలకు నృత్యాలు చేశారు. భక్తితో జాతరకు వస్తే ఇలాంటి దృశ్యాలు చూడాల్సి వచ్చిందని పలువురు భక్తులు వాపోయారు. పోలీసులు బందోబస్తులో ఉన్నా అశ్లీల నృత్యాలపై ఉదాసీనంగా వ్యవహరించరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ దృశ్యాలను పలువురు సెల్ఫోన్లలో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. -
రికార్డింగ్ డ్యాన్సర్లతో తెలుగు తమ్ముళ్ల చిందులు
-
నటరాజ పున్నమి
యామిని యామిని కృష్ణమూర్తి (76) నాట్యకళాకారిణి. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో.. నిండు పున్నమినాడు జన్మించిన యామిని తమిళనాడులోని చిదంబరంలో పెరిగారు. అక్కడే నాట్య విద్యను అభ్యసించారు. ప్రస్తుతం ఢిల్లీలోని ‘యామినీ స్కూల్ ఆఫ్ డాన్స్’ నాట్యాచార్యురాలిగా బోధనాంశాలలో నిమగ్నమై వున్నారు. యామిని అసలు పేరు పూర్ణతిలక. నాట్యంలో అనేక అవార్డులు గెలుచుకున్నారు. పద్మవిభూషన్ గ్రహీత కూడా. ఇటీవల ‘నటరాజ డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ’ వారి జీవిత సాఫల్య పురస్కారం అందుకోడానికి విజయవాడ వచ్చిన సందర్భంగా సాక్షి ఫ్యామిలీ.. యామినితో ముచ్చటించింది. ఆ విశేషాలు: యామిని తండ్రి కృష్ణమూర్తి కూతుర్ని కూడా తనలా పండితురాలిని చేయాలనుకున్నారు. అనుకోవడమే కాదు చేశారు. అందుకోసం రెండు ఇళ్లు, కొంత పొలం కూడా అమ్మేశారు. ‘‘మా నాన్నగారికి నన్ను విద్వాంసురాలిని చేయాలని బలమైన కోరిక ఉండేది. నేనా అస్సలు కుదురులేని అమ్మాయిని. ఎప్పుడు చూసినా చెట్లు ఎక్కడం, గోడలు దూకడం... ఒక్క క్షణం కూడా కదలకుండా కూర్చునేదాన్ని కాదు. నాలో నాన్నగారికి ఏమి కనిపించిందో కాని, నా ఏడవ ఏటే భరతనాట్యం నేర్పించడం ప్రారంభించారు. పది సంవత్సరాల వయసు వచ్చేసరికి నాట్యంలో నైపుణ్యం సాధించాను’’ అని తన నాట్య ప్రస్థాన గురించి చెప్పడ మొదలుపెట్టారు యామినీ. తండ్రి ఆమెను మొదట చెన్నైలోని రుక్మిణీ అరండేళ్ కళాక్షేత్రకు తీసుకువెళ్లారు. యామిని నాట్యానికి ముగ్ధులయిన రుక్మిణీ అరండేళ్, ఆమెకు తన దగ్గరే నాట్య శిక్షణ ప్రాంభించారు. పండుగలన్నీ నాట్య వేదిక మీదే! భరతనాట్యం నేర్చుకునే సందర్భంలోనే కూచిపూడి నాట్యం వైపు యామిని మనసు మళ్లింది. ఆ తర్వాత కూచిపూడి వైభవానికి ఆమె పాటుపడ్డారు. అది చాలా చిత్రంగా జరిగింది.తర్వాత ప్రముఖ ఒడిస్సీ ఆచార్యులు కేలూచరణ్ మహాపాత్ర దగ్గర ఆమె ఒడిస్సీ నృత్యం అభ్యసించారు. ‘‘నేను మూడు గంటల పాటు చేసే నా నాట్యప్రదర్శనలో కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ... ఒక్కోటి గంట సేపు ప్రదర్శించేదాన్ని. మరొక విషయం చెప్పాలి. నాకు పండుగలన్నీ నాట్యవేదిక మీదే జరిగేవి. ప్రతి పండుగ సందర్భంలో నిర్వహించే వేడుకలలో నా నాట్యం తప్పనిసరిగా ఉండటమే ఇందుకు కారణం’’ అని చెప్పారు యామిని. ఆలయాలు తొలి నాట్యాలయాలు యామినీ కృష్ణమూర్తి ఇల్లు, చెన్నైలోని చిదంబర నటరాజ దేవాలయానికి చాలా దగ్గర కావడంతో, దేవాలయ కుడ్యాల మీద కొలువుతీరిన శిల్పాల భంగిమలు ఆమె మీద చెరగని ముద్ర వేశాయి. ‘‘రోజూ గుడికి వెళ్లేదాన్ని. ఆ శిల్పాలు చూసి ఇంటికి వచ్చాక, అదే భంగిమలో నిలబడేదాన్ని. నేను నాట్యభంగిమలు, ముద్రలు అందంగా పెట్టడానికి ఇది ఒక కారణం అయి ఉంటుంది’’ అంటూ వివరించారు యామిని. – డా. పురాణపండ వైజయంతి, సాక్షి, విజయవాడ ‘యామిని ఉందా?’ ►ఇందిరాగాంధీకి నేనంటే చాలా ఇష్టం. ఢిల్లీలో ఏ ప్రభుత్వ కార్యక్రమం ఉన్నా, ఏ పండుగ సంబరాలు ఉన్నా వెంటనే ‘‘యామిని ఉందా’’ అని అడిగేవారు. ∙నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సమక్షంలో ‘క్షీరసాగరమథనం’ నృత్యరూపకం ప్రదర్శించడం ఒక మధురానుభూతి. ►కలకత్తా ప్రజలను చూస్తే ‘ఆర్ట్ ఈజ్ ఇన్ దెయిర్ హార్ట్స్’ అనిపిస్తుంది. ►నేను లోన్లీ పర్సన్ కాను, ఎలోన్‌గా ఉంటాను, డిలైటెడ్‌గా ఉన్నాను. ∙విమర్శించాలనుకునేవారు... సూర్యుడు ఉదయం తూర్పున ఉదయిస్తాడు, సాయంత్రానికి పడమట అస్తమిస్తాడు అని – సూర్యుడిని కూడా విమర్శిస్తారు. బందిపోట్ల కోసం నాట్యం! ఒకప్పుడు నాట్యానికి వెళ్లడమంటే దేవాలయానికి వెళ్తున్నట్లు భావించేవారు. ఇప్పుడంతా మారిపోయింది. నేను నాట్యం కోసమే పుట్టాను. నా జీవితాన్ని నాట్యానికే అంకితం చేశాను. వివాహానికి దూరంగా ఉన్నాను. మధ్యప్రదేశ్‌లో బందిపోట్ల దగ్గర సైతం రెండు సార్లు ప్రదర్శన ఇచ్చాను. నాన్నగారు భయపడొద్దని చెప్పారు. వారు నా నాట్యం మెచ్చుకోవడమే కాదు, నన్ను బిజిలీ అన్నారు. నాట్యం నేర్పింది ‘రైతు బిడ్డ’ వేదాంతం రాఘవయ్య గారి ‘రైతు బిడ్డ’ సినిమా చూశాక నాకు నాట్యం నేర్పించాలనే కోరిక కలిగిందట నాన్నగారికి. అప్పటికే వెంపటి పెద సత్యం, చిన సత్యం, పసుమర్తి కృష్ణమూర్తి వీరంతా సినిమాలకి వెళ్లిపోయారు. వేదాంతం లక్ష్మీనారాయణ గారి దగ్గర నా కూచిపూడి నాట్యం ఆరంభమైంది. -
సంప్రదాయ సంక్రాంతి
కమ్మటి పాల పొంగుతో పొంగలి ఒకవైపు తయారవుతుంటే.. మరో పక్క తెలుగింటి హోయల మధ్య.. సంక్రాంతి సోయగం.. పురి విప్పిన నెమలిగా నాట్యం చేసింది. కిఫ్ట్ ఫ్యాష¯ŒS కళాశాల ప్రాంగణంలో సోమవారం ఇంద్రధనస్సులా పరచుకున్న రంగవల్లులు, పూల గుబాళింపు, భోగిమంట వెచ్చదనం, గొబ్బెమ్మల చుట్టూ పడచుల నృత్యంతో.. సంక్రాంతి పండుగ కమ్మదనం రుచి అందరికీ తెలిసింది. ఈ సంక్రాంతి సంరంభంలో సందర్శకులు మునిగితేలారు. – కాకినాడ కల్చరల్ -
భీమవరంలో ‘తను నచ్చెనంట’..
భీమవరం : స్థానిక శ్రీ విష్ణు మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు శుక్రవారం ‘తను నచ్చెనంట’ సినిమా బృందం ప్రమోషన్ కోసం వచ్చింది. ఈ సినిమా హీరోయిన్, టీవీ యాంకర్ రేష్మీ గౌతమ్ సందడి చేశారు. విద్యార్థులతో సెల్ఫీలు దిగడంతో పాటు డ్యాన్స్‌లు వేసి హుషారెత్తించారు. ఈ సందర్భంగా రేష్మీ మాట్లాడుతూ కళాశాలలోని విద్యార్థులకు తాను సంబ్రమాశ్చర్యాలు కలిగించాలనుకున్నానని, అయితే విద్యార్థినులు యాంకరింగ్, డ్యాన్స్‌లకు తాను ఎంతగానో థ్రిల్లయ్యానన్నారు. తాను ఎన్నో కళాశాలలు తిరిగినా ఇటువంటి వాతావరణం, విద్యార్థుల హుషారు ఇక్కడే ఎక్కువగా ఆశ్వాదించానని రేష్మి చెప్పారు. అనంతరం విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకు రేష్మీ సమాధానాలు చెప్పారు. తొలుత చిత్ర బందానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాసరాజు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో సినిమా డైరెక్టర్ వెంకట్, నిర్మాత చంద్రశేఖర్ ఆజాద్, కొరియోగ్రాఫర్ యాండి పిళై, కమెడియన్ ఫణి, యాంకర్ నరేష్రాయ్, నటుడు భార్గవ్ పాల్గొన్నారు. -
బోనమెత్తిన హిజ్రాలు
శ్రావణమాసం రెండో ఆదివారాన్ని పురస్కరించుకుని కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన హిజ్రాలు ఆదివారం పోచమ్మ బోనాలు చేశారు. ఈ సందర్భంగా వారు నెత్తిన బోనాలు పెట్టుకుని సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆలయానికి తరలివెళ్లారు. తమ కోర్కెలు నెరవేర్చి చల్లంగా చూడాలని పోచమ్మను భక్తి శ్రద్ధలతో పూజించారు. కార్యక్రమంలో హిజ్రాల సంఘం నాయకురాలు లైలా, హిజ్రాలు సుధ, అశ్విని, స్నేహ, కల్పన, సారిక, రాణి పాల్గొన్నారు. – కరీమాబాద్ -
భళీ బీరన్న..
ఉర్సు, కరీమాబాద్లలో వైభవంగా బీరన్న బోనాలు ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ‘ గావుపట్టే’ దృశ్యం కరీమాబాద్ : ‘భళీ బీరన్నా.. భళీ’ అంటూ కురుమల కేరింతలు.. నృత్యాలు.. డప్పుల చప్పుళ్లు ఓ వైపు.. బోనాలతో బారులు తీరిన వనితలు మరో వైపు. వెరసి తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా వరంగల్ నగరంలోని ఉర్సు, కరీమాబాద్ ఏరియూల్లో సందడి కనిపించింది. పోతరాజుల కత్తుల విన్యాసాలు ఉత్సాహాన్ని నింపారుు. గొర్రెపిల్లను గావుపట్టే కీలక సమయంలో కురుమలు కదన రంగంలోకి దూకినట్లు కదిలిరావడం ఉత్తేజాన్ని అందించింది. మహిళలు గావుపట్టిన గొర్రెపిల్ల మీది నుంచి వెళ్లి బీరన్నగుడిలో బోనాలు సమర్పించారు. ఈ ఉత్సవాలను కరీమాబాద్ బీరన్నస్వామి ఆలయ కమిటీ, ఉర్సు బీరన్న దేవాలయ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉర్సు బీరన్న ఆలయ కమిటీ అధ్యక్షుడు మరుపల్ల రవి ఆధ్వర్యంలో ఉర్సు నుంచి వచ్చిన కురుమలు చెట్లవారిగడ్డ మీదుగా బీరన్నగుడి వద్దకు చేరుకోగా, కరీమాబాద్ బీరన్న గుడి అధ్యక్షుడు కోరె కృష్ణ ఆధ్వర్యంలో కరీమాబాద్ కురుమలు రామస్వామి గుడి నుంచి బురుజు మీదుగా బీరన్న ఆలయూనికి వెళ్లారు. దర్శించుకున్న ప్రజాప్రతినిధులు, ప్రముఖులు.. బీరన్న బోనాల పండుగ సందర్భంగా ఉర్సు, కరీమాబాద్ బీరన్న దేవాలయాలను ఎమ్మెల్యే కొండా సురేఖ దర్శించుకున్నారు. గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావుతో పాటు కార్పొరేటర్లు మరుపల్ల భాగ్యలక్ష్మి, మేడిది రజిత, కత్తెరశాల వేణు, కేడల పద్మ తదితరులు బీరన్నగుడిని దర్శించుకొని పూజలు చేశారు. కార్యక్రమంలో ఉర్సు, కరీమాబాద్ బీరన్న ఆలయ కమిటీల బాధ్యులు మరుపల్ల రవి, కోరె కృష్ణ, ఈర రాధాకృష్ణ, మురికి కుమారస్వామి, వాసూరి శ్రీనివాస్, కడారి కృష్ణ, గోవింద్ కొంరయ్య, మండల ప్రమీల, దాయ్యల సుధాకర్, నరిగె బక్కయ్య, కాళేశ్వర్, ఈశ్వరప్రసాద్, కోరె నాగరాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా మిల్స్‌కాలనీ సీఐ వేణు, ఇంతెజార్గంజ్ సీఐ భీంశర్మ బందోబస్తు నిర్వహించారు. ఎస్సైలు రవీందర్, పీఎస్సై నర్సింహారావు, పీసీలు రమేష్, శ్రీనివాస్, కిరణ్, సిబ్బంది విధులు నిర్వర్తించారు. -
పండగ సంబరాల్లో అశ్లీల నృత్యాలు
-
జల్లంత... తుళ్లింత
-
సయొనరా సందడి
-
బాధ్యత కలిగిన పోలీసు బాబుల వేషాలివీ!!
-
అశ్లీల నృత్యాలను దగ్గరుండి నడిపించారు!
-
దాండియా ఆటలు ఆడా..!!
-
ఘనం...నిమజ్జనం
నిజామాబాద్ క్రైం/నిజామాబాద్ కల్చరల్ : జిల్లాలో వినాయక శోభాయాత్ర సోమవారం ఘనంగా జరిగింది. భక్తులు ఆనందోత్సాహాలతో గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ‘గణపతి బప్పా మోరి యా’ నినాదాలు మారుమోగాయి. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాలలో నిమజ్జనాన్ని వైభవంగా నిర్వహించారు. నగరంలో గణేశ్ శో భాయాత్ర కన్నులపండువగా సాగింది. నిమజ్జ నం కొనసాగిన మార్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఎస్పీ డాక్టర్ తరుణ్ జోషీ, అదనపు ఎస్పీ పాండునాయక్ బందోబస్తు ఏర్పాట్లును పర్యవేక్షించారు. దుబ్బలోని ఖానాపూర్ చౌరస్తా నుంచి నిమజ్జన యాత్ర పగలు 2.15 నిమిషాలకు ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంట ల వరకు గాంధీచౌక్‌కు చేరుకుంది. చీకటి పడకముందే పోలీసులు యాత్రను గురు ద్వారా దాటించారు. అక్కడి నుంచి వినాయక్‌నగర్ వరకు పోలీసులు వలయంగా ఏర్పడి రథాన్ని ముందుకు నడిపించా రు. రథం వెనుక అగ్ని మాపక శకటం, వైద్య బృందంతో కూడి న ప్రత్యేక వాహనం, అదనపు పోలీసు బలగాలను సిద్ధంగా ఉంచారు. దుబ్బ నుంచి వినాయక్‌నగర్ వరకు దాతలు భక్తులకు ప్రసాదం, నీళ్ల పాకెట్లు పంపిణీ చేశారు. ఆనందోత్సాహాలతో దుబ్బ వద్ద పగలు 2.15 నిమిషాలకు సార్వజనిక్ గణేశ్ మండలి అధ్యక్షుడు రంచోడ్లాల్ పచ్చజెండా ఊపి శోభా రథయాత్రను ప్రారంభించారు. అంతకు ముందు ఎంపీ కల్వకుంట్ల కవిత, మేయర్ ఆకుల సుజాత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, సతీష్‌పవార్, కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్పీ తరుణ్‌జోషి తదితర అధికారులు కొబ్బరికాయలు కొట్టి పూజలు చే శారు. పూజల అనంతరం రథయాత్ర ముందు కు సాగింది. పవన్‌నగర్, గుర్బాబాదిరోడ్డు, లలితామహాల్ గేట్, గాంధీగంజ్, వన్‌టౌన్, గాంధీచౌక్, నెహ్రూపార్క్ చౌరస్తా, బోధన్‌రోడ్డు, ఖిల్లా రోడ్డు, బర్కత్‌పుర, గాజుల్పేట్, గురుద్వారా, బడాబజార్, గోల్‌హన్మాన్ చౌర స్తా, ఫులాంగ్ చౌరస్తా మీదుగా రాత్రి 11 గంట ల సమయంలో వినాయక్‌నగర్‌లోని వినాయకుల బావికి చేరుకుంది. దారిపొడవునా ఆయా మండపాల నిర్వాహకులు రంగులు చల్లుకుం టూ, వినాయకుడి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సంబురాలతో శోభారథయాత్రలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్, గడుగు గంగాధర్, నగేశ్‌రెడ్డి, మోటూరి దయానంద్ గుప్తా, భక్తవత్సలం నాయుడు, మీసాల సుధాకర్‌రావు, మాజీ మున్సిపల్ మాజీ చైర్మ న్ ముక్కా దేవేందర్‌గుప్తా, టీఆర్ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గణనాథుని ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారిగా అత్యంత ఘనంగా పూజలందుకున్న గణనాథుడు అందరినీ ఆశీర్వదించాలని ఎం పీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. శోభాయాత్రకు పూజలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. విశేష పూజలందుకున్న వినాయకుని ఆశీస్సులతో జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నా రు. గణనాథుని అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉంటుందన్నారు. నగరంలో ఎడ్ల జతలతో రథయాత్రను శోభాయమానంగా తీర్చిదిద్ది, ఊరేగింపుతో గణనాథులను నిమజ్జనం చేయ డం చక్కటి సంప్రదాయమని పేర్కొన్నారు. రథయాత్ర సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లా అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకుందన్నా రు. ప్రజలకు మంచినీటి సదుపాయం కల్పిం చామన్నారు. నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని ఆమె కోరారు. -
కేరళ పండగ సంబరానికి వెళ్లొద్దాం...
మహాబలి ఆగమనాన్ని పురస్కరించుకొని కేరళవాసులు సంబరం జరుపుకొనే పండగే ఓనమ్. కేరళ ఘనమైన సంస్కృతీ వారసత్వంగా ఈ పండగను పదిరోజుల పాటు జరుపుతారు. సెప్టెంబర్ 10 వరకు జరిగే ఈ పండగ విశేషాలను తిలకించడానికి విదేశీ పర్యాటకులు సైతం కేరళ చేరుకుంటారు. ఇక్కడ నృత్యాలు, విందుభోజనాలు, పులివేషాలు, ప్రాచీన విద్యలు-ఆటలు, పడవ పందేలు కన్నులపండువగా జరుగుతాయి. వారం రోజులు వేడుకగా.. కేరళ పర్యాటక సంస్థ ఓనమ్ పండగ సందర్భంగా రాష్ట్రరాజధాని అయిన త్రివేండ్రానికి దగ్గరలోని కోవళం గ్రామంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతోంది. దీంట్లో భాగంగా నాటకాలు, శాస్త్రీయ నృత్యాలు, జానపద కళలు, ఆహార శాలలు, హస్తకళల కేంద్రాలకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంట్లో చివరి రోజున అలంకరించిన గజరాజుల విన్యాసాలు ఉంటాయి. విందు భోజనం.. సాంప్రదాయిక కేరళ భోజనం తొమ్మిది రకాల వంటకాలతో నోరూరిస్తుంది. దీనిని ‘వన సద్య’ అంటారు. అదనంగా మరో పదకొండు రుచులను అరిటాకుల మీద వడ్డించడానికి కేరళ రెస్టారెంట్లు సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 7న (తిరు ఓనమ్) కేరళలోని అన్ని రెస్టారెంట్లలోనూ విందుభోజనాలు ఉంటాయి. స్నేక్ బోట్ రేస్... ఓనమ్ పండగలో ప్రధాన ఆకర్షణ స్నేక్ బోట్ రేస్. అరన్ముల బోట్ రేస్ పార్థసారధి దేవాలయం దగ్గర పంపానదిలో సెప్టెంబర్ 10న జరుగుతుంది. పులి వేషాలు... శాస్త్రీయ వాద్యపరికరాలను వాయిస్తుండగా పులి వేషాలు కట్టిన వారు ఆ చప్పుళ్లకు నృత్యాలు చేయడమనే ఆచారం ఈ పండగకు మరో ఆకర్షణ. దీనిని ‘పులిక్కలి’ అంటారు. భారతదేశంలోనే అతి ప్రాచీన వేడుకగా దీనికి పేరుంది. సరైన పులివేషధారికి బహుమతులు కూడా ఉంటాయి. త్రిసూర్‌లో ఈ వేడుకలు సెప్టెంబర్ 9న ఘనంగా జరుగుతాయి. తిరువనంతపురంలో జరిగే బాణాసంచా వేడుక ఆ ప్రాంతాన్ని అద్భుత లోకంగా మార్చివేస్తుంది. కొత్త దుస్తులు, సంప్రదాయ వంటలు, నృత్యం, సంగీతాలతో రాష్ట్రమంతటా పాటించే ఆచారాలు ఈ వ్యవసాయ పండగకు చిహ్నాలు. ఇలా చేరుకోవచ్చు: త్రిసూర్ మధ్య కేరళ ప్రాంతంలో ఉంటుంది. కొచ్చి నుంచి రెండు గంటల ప్రయాణం. రైలు, బస్సు ద్వారా చేరుకోవచ్చు. స్వరాజ్ రౌండ్/త్రిస్సూర్ రౌండ్ అని ఇక్కడి ప్రాంతాలకు స్థానిక పేర్లు ఉన్నాయి. వసతి: ఇక్కడ బస చేయడానికి పేరొందిన చిన్నా, పెద్ద హోటల్స్ ఉన్నాయి. కేరళ టూర్ ప్యాకేజీ 5 రాత్రుళ్లు/6 పగళ్లు దేశంలో ఏ ప్రాంతం నుంచైనా కొచ్చిన్ చేరుకోవాలి. కొచ్చిన్‌లో విమానాశ్రయం, రైల్వేస్టేషన్, బస్ స్టేషన్లు ఉన్నాయి. కొచ్చిన్ నుంచి మున్నార్, తేక్కడి, కుమరకోమ్, అలెప్పీ సందర్శన. ఎ.సి హౌజ్‌బోట్‌లో షికార్లు. డబల్రూమ్ వసతి+ అల్పాహారం+రాత్రి భోజనం, కారులో చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాల సందర్శన. మున్నార్‌లో మిస్టీ మౌంటేయిన్, తేక్కడిలో అరణ్యా నివాస్, కుమరకోమ్‌లో వాటర్స్కేప్స్ రిసార్ట్, అలెప్పీలో ఎ.సి డీలక్స్ హౌజ్‌బోట్‌లో వసతి సదుపాయాలు. ఈ మొత్తం ప్యాకేజీ రూ.34,000/- మరిన్ని వివరాలకు: కేరళ టూరిజమ్ పార్క్ వ్యూ, తిరువనంతపురం టోల్ ఫ్రీ నెం. 1-800-425-4747 ఫోన్: +4712321132 -
ఆ కొన్ని నిమిషాలు.. ఈ మొక్క ఇలా..!
-
స్పైస్ జెట్ విమానంలో గానా భజానా..!
-
కళాశాలలో..
-
తెలుగు నేర్చుకుంటున్నా..టాలీవుడ్ సినిమాల్లో నటిస్తా : చాందినీ శర్మ
‘సినిమాలే నా లక్ష్యం. ఇప్పటికే తెలుగు భాష నేర్చుకుంటున్నా. టాలీవుడ్లో నటించాలనుంది’ అంటూ తన సిల్వర్‌స్క్రీన్ డ్రీమ్స్‌ను వెల్లడించింది తాజా ఇండియన్ ప్రిన్సెస్ అందాల పోటీ విజేత చాందినీ శర్మ. ముంబయిలో ఇటీవలే జరిగిన పోటీల్లో బాలీవుడ్ సీనియర్ తారలు గోవిందా, జుహీచావ్లాల చేతుల మీదుగా అందాల కిరీటాన్ని దక్కించుకున్న ఈ సుందరాంగి... శుక్రవారం నగరానికి వచ్చింది. ఈ సందర్భంగా మారియట్ హోటల్లో ‘సాక్షి’తో ముచ్చటించింది. ఆ బ్యూటీక్వీన్ చెప్పిన ముచ్చట్లు మీరే దవండి. సినిమాలంటే ఇష్టం.. మాది హిమాచల్‌ప్రదేశ్. నాన్న ఇంజినీర్. అమ్మ హౌస్‌వైఫ్. అన్నయ్య, చెల్లి ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి గ్లామర్ రంగంలోకి, మరీ ముఖ్యంగా మోడలింగ్ లోకి అమ్మాయిలు రావడం అరుదే. నాకుకూడా ఎప్పుడూ మోడలింగ్ కలలు లేవు. కానీ సినిమాలంటే మాత్రం బోలెడు ఇష్టం. చండీఘడ్‌లో ఇంజినీరింగ్ చదువుకుంటూ అప్పుడప్పుడు కాలేజీలో ర్యాంప్‌వాక్ చేసిన అనుభవం తప్ప మరే రకంగానూ మోడలింగ్‌తో పరిచయం లేదు. కాకపోతే ఇంద్రాణి దాస్ గుప్తా లాంటి సక్సెస్ఫుల్ మోడల్స్ గురించి తెలుసుకునేదాన్నంతే. యావరేజ్ స్టూడెంట్‌ని.. చదువులో నేను యావరేజ్. ఇంట్లోవాళ్లు ఈ విషయం అన్నప్పుడల్లా సినిమాల్లోకి వెళ్లాలన్న ఆకాంక్ష వారితో పంచుకునేదాన్ని. అదే సమయంలో ఇండియన్ ప్రిన్సెస్ పోటీ గురించి తెలిసి సరదాగా అప్లయ్ చేశాను. అనూహ్యంగా ఎంపికయ్యాను. నిజానికి ఫైనలిస్ట్‌లో నా ప్లేస్ చూసినప్పుడే ఆశ్చర్యం వేసింది. అందులోనూ దాదాపు 30 మంది అందగత్తెలు... ఎవరికి ఎవరూ తీసిపోనట్టు ఉన్నారు. నాకన్నా అందంగా ఉన్నారు. అలాంటి తెలివైన, బ్యూటిఫుల్ గాళ్స్‌తో పోటీపడి తొలి ప్రయత్నంలోనే ఏకంగా కిరీటం కూడా దక్కించుకున్నాను. హైదరాబాద్ అమ్మాయి డెబొరాకు కూడా బెస్ట్ హెయిర్ అవార్డ్ వచ్చింది తెలుసా..! కల నిజమాయెగా.. నిన్నటి స్టార్స్ గోవిందా, జుహీచావ్లాలు కిరీటాన్ని అలంకరిస్తుంటే కల నిజమైన క్షణంలా అనిపించింది. మా ఇంట్లో వాళ్లు నా విజయాన్ని ఆస్వాదించారు. సినిమా తార కావాలని తప్ప మరో కెరీర్‌ను నేనెప్పుడూ ఎంచుకోలేదు. ఈ కిరీటాన్ని ఆధారంగా చేసుకుని వెండితెరపై వెలగాలనే నా కల నిజం చేసుకోవాలనుకుంటున్నాను. మీకో విషయం తెలుసా..! నాకు కొంచెం తెలుగు వచ్చింది (కొన్ని పదాలు పలుకుతూ...) టాలీవుడ్లో నటించడానికి కూడా నేను రెడీ. ఎన్నో నేర్పింది.. ఈ పోటీల కోసం కొన్ని నెలల పాటు నిర్వహించిన శిక్షణ నాకెన్నో నేర్పింది. అంతకు ముందు సరైన లక్ష్యం లేకుండా గడిచిన జీవితానికి ఓ లక్ష్యం ఏర్పడింది. గతంలో నాకు అలవాటు లేని యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్... వంటి వ్యాయామాలు, చక్కని ఆహారపు అలవాట్లు నేర్పింది. మొత్తంగా నా జీవనశైలిని తీర్చిదిద్దింది. అందుకు నేను ఈ పోటీలకు థ్యాంక్స్ చెప్తున్నాను. అంతర్జాతీయస్థాయి అందాల పోటీల్లో పాల్గొనడం, సినిమా అవకాశాలకు సిద్ధమవడం ప్రస్తుతం నా ముందున్న లక్ష్యాలు. -
వీడ్కోలు అంటూ..
-
కుర్రాళ్లతో సమానంగా అమితాబ్ డాన్సులు
ఆయన వయసు 71. కానీ మనసు మాత్రం ఇంకా పదిహేడే. అందుకే కుర్రాళ్లతో సమానంగా డాన్సులు వేస్తున్నారు. ఆయనెవరో కాదు.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. తన తోటి నటించిన హీరోలు, హీరోయిన్లంతా వృద్ధాప్య భారంతో కనిపిస్తున్నా, అమితాబ్ మాత్రం తెల్లగడ్డం వచ్చినా ఇప్పటికీ కుర్రాడిలా చకచకా నడుస్తుంటారు. త్వరలో రాబోతున్న 'భూత్నాథ్ రిటర్న్స్' చిత్రం కోసం ఓ డాన్సు చేయాల్సి వచ్చినప్పుడు కుర్రాళ్లతో పోటీలు పడి మరీ ఆయన డాన్సు చేశారు. కొరియోగ్రాఫర్లు కూడా ఆయన వయసు మర్చిపోయి క్లిష్టమైన మూమెంట్లు ఇచ్చారట. అయినా కూడా అమితాబ్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఈ విషయాన్నే తన బ్లాగులో కూడా రాశారు. 'భూత్నాథ్ రిటర్న్స్' సినిమా కొరియోగ్రాఫర్లు తన వయసు మర్చిపోయారని, అయినా తాను కూడా ఆ డాన్సులను ఆస్వాదించానని చెప్పారు. ఇప్పటికీ జిమ్‌కు కూడా వెళ్తూనే ఉన్నానని, అలా చేయగలిగినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ పాటలో చేసిన వ్యాయామాల వల్లే తాను మరో దశాబ్దం కూడా సులభంగా నటించగలనన్న నమ్మకం కుదిరిందని తెలిపారు. గణేశ్ ఆచార్య కంపోజ్ చేసిన డాన్సులను ఆయన చేశారు. -
దిల్ఖుష్ : నూతనోత్సాహం ఇలా..
స్టెప్పులేయించే మ్యూజిక్.. టాప్‌లేపిన డ్యాన్స్.. కేక పెట్టించే సాంగ్స్.. ఎటుచూసినా చిన్నాపెద్దా కేరింత.. పరస్పర శుభాకాంక్షల పులకింత.. కళ్లు జిగేల్మనిపించే వెలుగులు.. దిల్‌ను మైమరిపించే మెరుపులు.. మొత్తానికి నయాసాల్ జోష్ కలర్‌ఫుల్.. నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ నగరం ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టింది. పబ్‌లు, కాఫీక్లబ్‌లు, రెస్టారెంట్లు తదితర ప్రత్యేక వేదికలన్నీ యువత సంబరాలతో కిటకిటలాడాయి. మేడ్చల్‌లోని కంట్రీక్లబ్‌లో నటి చార్మి సందడి చేసింది మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో డీజే సుకేత్ తనదైన శైలిలో మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసి ఉర్రూతలూగించాడు పలుచోట్ల అంత ర్జాతీయ నృత్యకళాకారులు కొత్త సంవత్సర వేడుకల జోష్‌ను పెంచారు మాదాపూర్‌లోని నోవాటెల్, హైటెక్స్, హెచ్ఐసీసీ, బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో ‘కొత్త’ సందడి అంబరాన్ని తాకింది సికింద్రాబాద్‌లోని ట్రిడెంట్, గ్రీన్‌పార్క్ హోటళ్లలో యువత ఉత్సాహం ఉరకలెత్తింది లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని మారియట్ గోల్డ్, సికింద్రాబాద్‌లోని బసేరా హోటల్లో ప్రత్యేక కార్యక్రమాలు అలరించాయి కాఫీ షాప్‌లు యువతీయువకుల కేరింతలతో కళకళలాడాయి నానక్‌రామ్‌గూడలోని హయత్ హోటల్, రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో డ్యాన్స్‌లు హోరెత్తాయి యువకులు వాహనాలపై రివ్వున దూసుకుపోతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సందడి చేశారు ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, నారాయణగూడ, మెహిదీపట్నం, సికింద్రాబాద్, రాజేంద్రనగర్, తార్నాక తదితర ప్రాంతాలలో ట్రిబుల్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పలువురు పోలీసులకు చిక్కారు. -
రేపటినుంచే దసరా ఉత్సవాలు ప్రారంభం
విజయవాడ, న్యూస్‌లైన్ : ఆదిపరాశక్తి అయిన కనకదుర్గమ్మకు కళలంటే అమితమైన ఇష్టమని పురాణేతిహాసాలు తెలుపుతున్నాయి. ఇక ఆదిశంకరుడైన పరమేశ్వరుని నటరాజుగా కళాకారులందరూ కొలుస్తారు. అమ్మవారి సాన్నిద్ధ్యంలో తమ కళలను ప్రదర్శించడం అంటే కళాకారులు అదృష్టంగా భావిస్తారు. అటువంటి కళలపట్ల, కళాకారులపట్ల శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్ధానం అధికారులు చిన్నచూపు చూస్తున్నారని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా దేవస్థానంలో ఇదే తంతు కొనసాగుతుంది. రేపటినుంచి దసరా మహోత్సవాలు ప్రారంభం కానుండగా ప్రదర్శన కోసం దరఖాస్తు చేసుకున్న కళాకారులకు ఇంత వరకు సమాచారం అందించలేదు. మరో ప్రాంతంలో కార్యక్రమాలను ఒప్పుకోవాలో లేదో తెలియని అయోమయ పరిస్థితిలో కళాకారులున్నారు. దసరా మహోత్సవాల్లో తొమ్మిది రోజులపాటు వివిధ కళారూపాలను ప్రదర్శింపజేసేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తుంది. భక్తులను అలరింపజేసేందుకు సంప్రదాయ నృత్యాలు, భక్తి రంజని, పౌరాణిక నాటిక, నాటక ప్రదర్శనలు, హరికథలు, బుర్రకథలు, జానపద కళారూపాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది ఉత్సవాల్లో ప్రదర్శనలిచ్చేందుకు గానూ కళాకారులనుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. గత నెల 20వ తేదీతో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసింది. గడువు ముగిసే నాటికి దాదాపు 700 వరకు దరఖాస్తులు వచ్చాయి. అయితే ఆయా దరఖాస్తులను ప్రాథమిక పరిశీలన చేసి ఎంపిక చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఆ బాధ్యతను చేపట్టిన సబ్ కలెక్టర్ 2వ తేదీన తొమ్మిది మందితో సెలెక్షన్ కమిటీ జాబితాను విడుదల చేసినట్లు తెలిసింది. సెలక్షన్ కమిటీ జాబితా ! సేకరించిన సమాచారం మేరకు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన దరఖాస్తులను ఎంపిక చేసేందుకు ప్రముఖ వయొలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి, కూచిపూడి సిద్ధేంధ్ర కళాపీఠం అధ్యక్షులు పసుమర్తి కేశవప్రసాద్, ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరాజులు, దేవస్థానం స్థానాచార్యులు శివప్రసాద్, పర్యాటక శాఖకు చెందిన రామలక్ష్మణ్, శంకరరావులతోపాటు దేవస్థానానికి చెందిన ముగ్గురు ఉద్యోగులను నియమించినట్లు సమాచారం. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎనౌన్స్మెంట్ ఇచ్చేందుకు వచ్చిన ఒక వ్యక్తి మూడేళ్లుగా సెలక్షన్ కమిటీలో ఉండటం గమనార్హం. ఈ ఏడాది కమిటీలోకూడా అతనికిస్థానం కల్పించడం విమర్శలకు దారితీస్తోంది. త్రిశంకు స్వర్గంలో కళాకారులు : అమ్మవారి సన్నిధిలో ప్రదర్శనలు ఇవ్వటం అదృష్టంగా భావించే కళాకారులు ఆ అవకాశం కోసం ప్రతి ఏటా దరఖాస్తు చేసుకుంటుంటారు. అయితే ఈ ఏడాది ఉత్సవాలు 5వతేదీనుంచి ప్రారంభం కానుండగా ఇంతవరకు వారి దరఖాస్తుల విషయమై ఎటువంటి సమాచారం లేకపోవడంతో త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. హైదరాబాద్ వంటి దూరప్రాంతాలనుంచి వచ్చే కళాకారులకు వారం రోజులు ముందుగా సమాచారం ఉంటే వారికి రైల్వే కన్సెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా కొన్ని కార్యక్రమాలకు కావాల్సిన పక్క వాయిద్య కళాకారులు దొరికే అవకాశంకూడా లేకుండా పోతుంది. ఒక్క విజయవాడలోనే కాకుండా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో దసరా ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో కళాకారులకు పలు చోట్లనుంచి అవకాశాలొస్తుంటాయి. అమ్మవారి దేవస్థానం నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఇతర ప్రాంతాల్లో కార్యక్రమాలు ఒప్పుకోవాలో లేదో అర్ధంకాక సతమతమవుతున్నారు. నగరంలోని శ్రీధర్మ పరిషత్ వంటి ప్రైవేట్ సంస్థ ఇప్పటికే సాంస్కృతిక కార్యక్రమాల వివరాలతో బుక్‌లెట్‌ను విడుదల చేసింది. కావాల్సినంత సిబ్బంది ఉండీ సకాలంలో సాంస్కృతిక కార్యక్రమాల వివరాలను ఇప్పటి వరకు వెల్లడించలేని దుస్థితిలో దేవస్థానం అధికారులు ఉండటం విశేషం. కాగా ఎంపికయిన కళాకారులు తమ ప్రదర్శనలిచ్చేందుకు వేదిక వద్దకు చేరుకోవాలన్నా కష్టంగానే ఉంటుందని భక్తులు పేర్కొంటున్నారు. కళావేదిక మార్పు : కొన్ని సంవత్సరాలుగా మల్లికార్జున మహామండపంలో ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక ప్రదర్శనల వేదికను ఈ ఏడాది మండపం పక్కన మెట్ల మార్గం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలోకి మార్చారు. అక్కడ రేకుల షెడ్ నిర్మించి వేదికను ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజులనుంచే నేల చదును చేయటం ప్రారంభించారు. గురువారం వరకుకూడా షెడ్ నిర్మాణపనులు ప్రారంభం కాలేదు. రేకుల షెడ్లో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం వలన ప్రదర్శనల సమయంలో వర్షం వస్తే అది రేకులపైబడి శబ్ధం వస్తుంది. దీంతో కళాకారుల ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. అంతే కాకుండా పాత రేకులు వాడుతుండటం వలన కళా ప్రాంగణంలో వర్షపు నీళ్లు పడేఅవకాశం ఉంది. గతంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసిన మల్లికార్జున మహా మండపంలో ఈ ఏడాది లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగిస్తున్నారు. అసలు ఈ ఏడాది సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారా లేదా అన్నదికూడా ప్రశ్నార్థకంగా మారింది. -
జనసంద్రంగా ఎంజే మార్కెట్
అబిడ్స్/సుల్తాన్‌బజార్/కలెక్టరేట్/దత్తాత్రేయనగర్, న్యూస్‌లైన్: గణేశ్ నిమజ్జనోత్సవం లక్షలాది భక్తుల మధ్య కోలాహలంగా కొనసాగింది. బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైన నిమజ్జన యాత్రకు అశేష భక్తజనవాహిని తరలివచ్చింది. చాంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్, సైదాబాద్, చంపాపేట్, చార్మినార్, కాచిగూడ, కోఠి, ధూల్‌పేట్, జియాగూడ, కార్వాన్, గోషామహాల్, బేగంబజార్ ప్రాంతాల నుంచి తరలివచ్చిన గణేష విగ్రహాలతో మొజంజాహీ మార్కెట్ జనసంద్రంగా మారింది. పలు అసోసియేషన్ల నిర్వాహకులు వివిధ వాహనాలపై వినూత్నంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలువురు భక్తులు వాహనాలపై భారీ జాతీయ పతాకాలను, కాషాయ జెండాలను చేబూని యాత్రలో పాల్గొన్నారు. ముచ్చటగొలిపే వివిధ రూపాల్లో వినాయక విగ్రహాలను భక్తులు దర్శించి తరించారు. జైగణేష్ మహరాజ్‌కీ జై... గణపతి బప్పా మోరియా...అంటూ భక్తులు చేసిన నినాదాలతో ఊరేగింపు ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. స్వాగత వేదికల నుంచి పలువురు ప్రముఖులు చేసిన ప్రసంగాలు ఊరేగింపులో పాల్గొన్న జనాల్లో ఉత్సాహాన్ని నింపాయి. ట్యాంక్‌బండ్‌కు తరలివెళ్లే భక్తులకు నిర్వాహకులు ప్రసాదాలు, మంచినీరు పంపిణీ చేశారు. మధ్యాహ్నం నుంచి పెరిగిన జోరు ఉదయం నుంచే ప్రారంభమైన గణేష్ నిమజ్జనోత్సవం మధ్యాహ్నంతో మరింత జోరందుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విగ్రహాలతో మొజంజాహీ మార్కెట్ నుంచి ఘన స్వాగతాల మద్య వినాయకసాగర్‌కు తరలివెళ్లాయి. బ్యాండ్ మేళాల హోరులో భక్తులు మైమరిచి నృత్యాలు చేస్తూ గణనాథుడి శోభాయాత్రలో పాల్గొన్నారు. కాగా, సామూహిక నిమజ్జనానికి తరలివచ్చిన అశేషజనవాహినిలో పలువురు చిన్నారులు తప్పిపోయారు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు స్వాగత వేదికల నుంచి తమ చిన్నారుల కోసం విజ్ఞప్తి చేశారు. వర్షంలోనూ సాగిన యాత్ర వినాయక నిమజ్జన శోభాయాత్ర జోరు వర్షంలో సైతం కొనసాగింది. సాయంత్రం ప్రారంభమైన వర్షంలో భక్తులు తడుస్తూ రెట్టింపు ఉత్సాహంతో నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు సైతం తమదైన శైలిలో ప్రసంగాలు చేస్తూ భక్తులను ఉత్సాహపరిచారు. ప్రజలు వర్షం కారణంగా కొంత ఇబ్బంది పడినా వివిధ వినాయక ప్రతిమలను తిలకించేందుకు ఆసక్తి కనబరిచారు. పోలీసుల అత్యుత్సాహం బేగంబజార్, సిద్ధిఅంబర్‌బజార్, ఉస్మాన్‌గంజ్ ప్రాంతాలలో మైక్ బాక్స్‌లను పోలీసులు స్వాధీనం చేసుకోవడంపై భక్తులు మండిపడ్డారు. ప్రసాదాలు పంపిణీ చేసే వద్ద ఉంచిన బాక్స్‌లనూ పోలీసులు సీజ్ చేశారు.