
సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్–2025 సాంస్కృతిక కార్యక్రమాల్లో జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఆదివారం రాత్రి అర్ధనగ్న ప్రదర్శనలు ఇచ్చారు.
గ్రామాల్లో ఎక్కడైనా తిరునాళ్లలో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే దాడి చేసే పోలీసులు.. ఇక్కడ మాత్రం దగ్గరుండి ప్రోత్సహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్లెమింగోలు, పులికాట్ సరస్సు గురించి ఒక్క మాట మాట్లాడని కూటమి నేతలు.. ఈ అర్ధనగ్న నృత్యాలను వీక్షించడం చూసి జనం విస్తుబోయారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ వేదికపై ఉన్నప్పుడే ఈ ప్రదర్శనలు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment