sullurpeta
-
ఫ్లెమింగో ఫెస్టివల్లో ఇదీ పరిస్థితి.. అధికారుల సమక్షంలో అశ్లీల నృత్యాలు
సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్–2025 సాంస్కృతిక కార్యక్రమాల్లో జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఆదివారం రాత్రి అర్ధనగ్న ప్రదర్శనలు ఇచ్చారు.గ్రామాల్లో ఎక్కడైనా తిరునాళ్లలో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే దాడి చేసే పోలీసులు.. ఇక్కడ మాత్రం దగ్గరుండి ప్రోత్సహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్లెమింగోలు, పులికాట్ సరస్సు గురించి ఒక్క మాట మాట్లాడని కూటమి నేతలు.. ఈ అర్ధనగ్న నృత్యాలను వీక్షించడం చూసి జనం విస్తుబోయారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ వేదికపై ఉన్నప్పుడే ఈ ప్రదర్శనలు చేయడం గమనార్హం. -
రేపే ఆదిత్య-ఎల్ 1 ప్రయోగం.. ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు
సాక్షి, తిరుపతి జిల్లా: ఆపరేషన్ ఆదిత్య-ఎల్ 1 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో పీఎస్ఎల్వీ- సి57 రాకెట్ నమూనాతో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాకెట్ ప్రయోగానికి ముందు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం సాంప్రదాయమన్నారు. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు–1(ఎల్–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1,470 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నామన్నారు. చంద్రయాన్-3కీ సంబంధించిన లాండర్ రోవర్లు చంద్రునిపై విజయవంతంగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. అక్టోబర్ మొదటి, రెండో వారంలో గగన్‌యాన్ రాకెట్ ప్రయోగం ఉంటుందని, జీఎస్ఎల్వీ- మార్క్-2 ద్వారా INSAT-3DS రాకెట్ ప్రయోగం చేస్తామన్నారు. తదుపరి మాసంలో ఎస్ఎస్ఎల్-వి రాకెట్ ప్రయోగం చేపడతామని ఇస్రో ఛైర్మన్ చెప్పారు. చదవండి: సూర్యుడి గుట్టు విప్పే ఆదిత్య–ఎల్1 -
Chandrayaan-3: విజయవంతంగా చంద్రయాన్.. వాట్ నెక్ట్స్.?
జాబిల్లిపై ఇప్పటిదాకా ఎవరూ అడుగు పెట్టని దక్షిణ దిశను ముద్దాడాలన్న చిరకాల లక్ష్యాన్ని ఇస్రో సాధించింది. అసలు చంద్రయాన్–3 మిషన్ వల్ల మానవాళికి ఏం లాభం? ఈ ప్రయోగం లక్ష్యమేంటీ? చంద్రుడి గుట్టు విప్పేందుకే... ► చంద్రున్ని లోతుగా అధ్యయనం చేసి, అక్కడ దాగున్న అనేకానేక రహస్యాలను వెలికి తీయడమే చంద్రయాన్–3 ప్రయోగం ప్రధాన లక్ష్యం... చంద్రయాన్–3లో ఏమేం ఉన్నాయి? ► ప్రొపల్షన్ మాడ్యూల్ 2,145 కిలోలు, ల్యాండర్ 1,749 కిలోలు, రోవర్ 26 కిలోలు. ► చంద్రయాన్–2 లో 14 పేలోడ్స్ పంపగా చంద్రయాన్–3లో 5 ఇస్రో పేలోడ్స్, 1 నాసా పేలోడ్‌ను మాత్రమే అమర్చారు. ► చంద్రయాన్–3 ప్రపొల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్లలో అత్యాధునిక సాంకేతిక పరికరాలను అమర్చారు. దక్షిణ ధ్రువంపై దిగాలని... ఇప్పటి దాకా ఎన్నో దేశాలు చంద్రునికి ముందు వైపు, అంటే ఉత్తర ధ్రువంపై పరిశోధనలు చేశాయి. భారత్ మాత్రం చంద్రయాన్–1 నుంచి తాజా చంద్రయాన్–3 దాకా చంద్రుని వెనుక వైపు, అంటే దక్షిణ ధ్రువాన్ని పరిశోధించేందుకే ప్రయత్నిస్తూ వస్తోంది. అందులో భాగంగా చంద్రయాన్–3 ల్యాండర్‌ను సూర్యరశ్మి పడని చంద్రుని దక్షిణ ధ్రువపు చీకటి ప్రాంతంలో దించారు. ► ప్రొపల్షన్ మాడ్యూల్లో ఒకటి, ల్యాండర్లో మూడు, రోవర్లో రెండు పేలోడ్ల చొప్పున చంద్రయాన్–3లో అమర్చారు. ► 2,145 కిలోల బరువున్న ప్రొపల్షన్ మాడ్యూల్లో 1,696 కేజీల అపోజి ఇంధనం నింపారు. దీని సాయంతోనే ల్యాండర్, రోవర్లను మాడ్యూల్ చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లింది. ► చంద్రుని కక్ష్య నుంచి భూమిని, చంద్రున్ని అధ్యయనం చేయడానికి ప్రొపల్షన్ మాడ్యూల్లో ఓ పరికరాన్ని అమర్చారు. ► చంద్రుని ఉపరితలం వాసయోగ్యమో, కాదో తేల్చడంతో పాటు చంద్రునిపై జరిగే మార్పుచేర్పులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇది భూమికి చేరవేస్తుంది. ► రోవర్లో మూడు పేలోడ్లను పంపుతున్నారు. ఇందులో లాంగ్మ్యూయిన్ ప్రోబ్ చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా, అయాన్లు, ఎలక్ట్రాన్ల సాంద్రత కాలంతో పాటు మారుతుందా అనే అంశాన్ని పరిశోధిస్తుంది. ► చంద్రాస్ సర్వేస్ థర్మో ఫిజకల్ ఎక్స్పెరమెంట్ పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను కొలవడానికి, చంద్రుడిపై మ్యాప్ తయారు చేయడానికి దోహదపడుతుంది. ► ఇన్స్ట్రుమెంట్ ఫర్ ల్యూనార్ సెస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ అయానోస్పియర్, అటా్మస్పియర్ పేలోడ్లు చంద్రుడి లాండింగ్ సైట్ చుట్టూ భూ కంపతను కొలుస్తాయి. ► అల్ఫా ప్రాక్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ పేలోడ్‌తో చంద్రునిపై ఖనిజ సంపద, శిలాజాలను శోధించడంతో పాటు చంద్రుడిపై రసాయనాలున్నట్టు తేలితే వాటి జాబితా తయారీకి ఉపయోగిస్తారు. ► లేజర్ ప్రేరేపిత బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ పేలోడ్ చంద్రుడిపై రాళ్ల వంటివున్నాయా, చంద్రుని ఉపరితలం ఎలా ఉంటుంది, చుట్టూతా ఏముంది వంటివి శోధిస్తుంది. చంద్రయాన్–2 ల్యాండర్, రోవర్ క్రాషై పని చేయకపోయినా వాటిని తీసుకెళ్లిన ఆర్బిటార్ ఇప్పటికీ చంద్రుని కక్ష్యలో తిరుగుతూ అత్యంత విలువైన సమాచారం అందిస్తోంది. చంద్రుడిపై నీళ్లున్నట్టు చంద్రయాన్–2 కూడా ధ్రువీకరించింది. చంద్రయాన్–3 ముగియగానే సూర్యుడిపై పరిశోధనలకు ఆగస్టులో ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తారు. తద్వారా మిషన్ సూర్య, చంద్ర దిగ్విజయంగా పూర్తవుతాయి. -
కాళంగి నది తీర నిర్వాసితులకు అండగా వైఎస్ఆర్సీపీ..!
-
శ్రీచంగాళమ్మ పరమేశ్వరిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్
సాక్షి, తిరుపతి: పీఎస్ఎల్వీ సీ–55 ప్రయోగం నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ సోమనాథ్ సూళూరుపేట శ్రీచంగాళమ్మ పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ప్రయోగానికి ముందు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. రాకెట్ నమూనాతో సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, శనివారం మధ్యాహ్నం 2.20 లకు పీఎస్ఎల్వీ సీ–55 నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 12.50 గంటలకి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. పూర్తి 25 గంటల 30 నిమిషాల పాటు కౌంట్ డౌన్ కొనసాగనుంది. పూర్తిగా విదేశీ పరిజ్ఞానం, సింగపూర్‌కి చెందిన వాణిజ్య ప్రయోగం ఇది. ఈ రాకెట్ ద్వారా 741 కిలో బరువు కలిగిన లియోన్-2 తో పాటు 16 కిలోల లూమ్ లైట్-4 శాటిలైట్లను రోదసిలోకి ఇస్రో పంపనుంది. ఈ ప్రయోగ నేపథ్యంలో తిరుపతిజిల్లా శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి చేరుకున్నారు విదేశీ శాస్త్రవేత్తల బృందం. అక్కడ భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. భూ, ఉపరితలం, సముద్ర తీరంలోనూ సీఐఎస్ఎఫ్ బలగాల విస్తృత తనిఖీలు చేపట్టారు. షార్ పరిసర ప్రాంతాల్లో ఇతరులకు ప్రవేశాన్ని నిషేధించారు. చదవండి: చింతమనేని ప్రభాకర్ వింత ప్రవర్తన.. ఐసీయూలోకి తోపుడు బండ్లు.. -
విదేశీ వలస విహంగాల విలాపం.. పదుల సంఖ్యలో మృతి
సాక్షి, సూళ్లూరుపేట: పులికాట్ వన్యప్రాణి సంరక్షణా విభాగం పరిధిలోని పాములమిట్ట చెరువులో పదుల సంఖ్యలో విదేశీ వలస విహంగాలు ఆదివారం (పెలికాన్స్) మృతి చెందాయి. గత కొద్ది రోజులుగా విహంగాలు మృతి చెందుతుంటే సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో చెరువు నీటిలో వాటి కళేబరాలు తేలియాడుతూ కనిపిస్తున్నాయి. ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి ఖండాంతరాలు దాటి సంతనోత్పత్తి కోసం వచ్చే పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల కాలంలో సుమారు 50కు పైగా పెలికాన్స్ చనిపోయినట్లు సమాచారం. చదవండి: (పెద్దపులి నుంచి పునుగు పిల్లి వరకు..) చనిపోయిన పెలికాన్ పక్షుల రెక్కలను చూపిస్తున్న వైల్డ్ లైఫ్ సిబ్బంది చెరువులో ఇటీవల టన్నుల కొద్దీ చేపలు చనిపోగా, ఆహార వేటకు వచ్చిన పక్షులు వారం రోజులుగా చనిపోతున్నాయి. ఆదివారం సుమారు 38 పక్షులు చనిపోయిన విషయాన్ని రైతులు గుర్తించి సమాచారం అందించారు. వైల్డ్ లైఫ్ సిబ్బంది వెళ్లి చెరువులో చనిపోయిన సుమారు 29 పక్షులను గట్టుకు తీసుకొచ్చారు. చెరువులో చనిపోయిన పక్షుల కళేబరాలు చాలా ఉన్నాయని, వాటి వల్ల నీళ్లు దుర్గంధభరితంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. సూళ్లూరుపేట పట్టణంలోని వన్యప్రాణి సంరక్షణా విభాగం కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇంత ఘోరం జరుగుతుంటే గుర్తించలేని పరిస్థితుల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క ఏరియాకు ఒక్కో గార్డు విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే వాళ్లు ఉద్యోగాలు వదిలిపెట్టి సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
పోలీసుల అదుపులో కౌన్సిలర్ హత్య కేసు నిందితుడు
సాక్షి, నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిల్ సభ్యుడు తాళ్లూరు వెంకట సురేష్‌ను దారుణంగా హత్య చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్న క్లూతో పోలీసులు గంటల వ్యవధిలోనే కౌన్సిలర్ హత్య కేసులో పురోగతి సాధించారు. ఈ హత్యలో నలుగురు కిరాయి హంతకులు పాల్గొన్నట్లు సమాచారం తెలియడంతో వారి కోసం పోలీసుల వేట కొనసాగిస్తున్నారు. కేసును సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ విజయారావు ఆదేశాల అనుసరించి ముగ్గురు సీఐలు, 10 మంది ఎస్ఐల ఆధ్వర్యంలో పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. -
ఉప్పు ధార
సూళ్లూరుపేట సుజలస్రవంతి పథకం ద్వారా అన్ని వార్డుల్లో ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందిస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక అన్నీ మర్చిపోయారు. పాలకులకు ముందుచూపు కరువవడంతో ప్రజలకు ఉప్పునీరే గతైంది. భూ గర్భజలాలు ఉప్పు మయమయ్యాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన నీటి పథకాలు నిరుపయోగంగా మారాయి. పట్టణ జనాభాకు సరిపడా నీరు సరఫరా చేయడంలో మున్సిపల్ యంత్రాంగంవిఫలమైంది. శివారు ప్రాంతాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బిందెడు నీళ్లు కూడా కష్టమయ్యాయి. చిత్రమేమిటంటే ప్రజలకు తాగునీరు దొరకదు కానీ వ్యాపారస్తులు పుష్కలంగా లభ్యమతున్నాయి. వారు మంచినీటితో రూ.కోట్లు గడిస్తున్నారు.ప్రజలను దోచేస్తున్నారు. నెల్లూరు, సూళ్లూరుపేట: పట్టణ ప్రజలు మంచినీటి కోసం దాహంతో తపిస్తున్నారు. మంచినీళ్లు దొరకడం గగనంగా మారింది. సుమారు 48 వేల మంది జనాభా అవసరాలకు తగినట్టుగా తాగునీటి వనరుల్లేవు. ఎటుచూసినా ఉప్పునీళ్లే లభిస్తుండడంతో గుక్కెడు మంచినీటికి గుటకలేస్తున్నారు. పులికాట్ సరస్సులోని ఉప్పునీళ్లు కాళంగి నదిలోకి ఎగబాకడంతో భూగర్భ జలాలు పూర్తిగా ఉప్పునీళ్లుగా మారిపోయాయి. సాధారణంగానే సూళ్లూరుపేట పట్టణ పరిధిలో భూగర్భంలో ఉప్పునీళ్లు లభ్యమవుతున్నాయి. పట్టణంలో పది ఓవర్‌హెడ్ ట్యాంకులు ఉన్నాయి. ఇందులో మన్నారుపోలూరు న్యూకాలనీ, ఇందిరానగర్, సూళ్లూరు, బాపూజీకాలనీల్లోని ఓవర్‌హెడ్‌ట్యాంకులు శిథిలమై ప్రమాదకరంగా మారడంతో కూల్చేశారు. సమ్మర్ స్టోరేజీ, ఇతర వనరుల నుంచి రోజుకు 16 లక్షల లీటర్ల నీటిని మాత్రమే అందిస్తున్నామని మున్సిపల్ అధికారులు లెక్కలు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీటి సరఫరా జరడం లేదు. మున్సిపాలిటీ పరిధిలో ఒక మనిషికి రోజుకు 70 లీటర్ల వంతున నీరు సరఫరా చేయాల్సి ఉంది. ఈ లెక్కన పట్టణ జనాభా లెక్కల ప్రకారం 34 లక్షల లీటర్ల నీరు ఇవ్వాల్సి ఉంది. కానీ అందుబాటులో ఉన్న నీటి వనరుల నుంచి సరఫరా చేస్తున్న నీటి లెక్కలు చూస్తే కేవలం 10 లక్షల లీటర్ల నీటిని కూడా అందించడం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం మున్సిపాలిటీలో నీళ్లు కేవలం 30 శాతం మందికి కూడా సరఫరా కావడం లేదు. పట్టణ శివారు ప్రాంతాల వారికి బిందెడు నీళ్లు అందడం కూడా గగనమవుతోంది. తాగునీటికి నెలకు రూ.కోటి వెచ్చింపు పట్టణ ప్రజలకు మంచినీళ్లు అందకపోవడంతో నెలకు రూ.కోటి వెచ్చించి మంచినీళ్లు కొనుగోలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. తాగునీటి పథకాల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కొందరు నీటిని దోచేస్తున్నారు. అక్రమంగా కుళాయిలు, సంప్‌లు నిర్మించుకుని వాటికి మోటార్లు ఏర్పాటు చేసుకుని తోడేయడంతో పట్టణ శివారు ప్రాంతాల్లో కుళాయిల్లో నీళ్లు రావడం గగనమైపోయింది. మన్నారుపోలూరు కేంద్రంగా తాగునీటి వ్యాపారం చేసే కంపెనీలు కోట్లాది రూపాయలు గడిస్తుంటే చెంతనే ఉన్న పట్టణ ప్రజలకు మాత్రం చుక్క నీరు అందాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. మున్సిపల్ లెక్కల ప్రకారం పట్టణంలో సుమారు 15 వేలు కుటుంబాలు ఉన్నాయి. కుటుంబానికి రోజుకు రూ.20 లెక్కన నీళ్లు కొంటే రోజుకు రూ.3 లక్షలు అవుతుంది. అంటే నెలకు సుమారు కోటి రూపాయలు నీళ్ల కోసం ఖర్చు చేస్తున్నారు. ఉప్పు నీళ్లుగా మారిన భూగర్భ జలాలు కాళంగి నదిలోకి పులికాట్ సరస్సు నుంచి ఉప్పు నీళ్లు రాకుండా నిర్మించిన గ్రాయిన్ శిథిలమైపోవడంతో నదిలో ఉన్న మంచినీళ్లు ఉప్పునీళ్లుగా మారిపోయాయి. దీంతో చుట్టు పక్కల బోర్లు, బావుల్లోని మంచినీళ్లు కూడా ఉప్పు నీళ్లుగా మారిపోయి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బావుల్లో, బోరుల్లో వచ్చే నీటిని మామూలుగా ఉపయోగించుకుంటూ తాగడానికి మాత్రం రోజువారీగా నీళ్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితి ఏటా తలెత్తుతున్నా.. కాళంగి నదిలోకి ఉప్పు నీళ్లు ఎగబాకకుండా గ్రాయిన్ నిర్మాణాన్ని పటిష్టం చేయాల్సిన పాలకులు నాలుగేళ్లుగా పట్టించుకోవడం మానేశారు. షార్ నిధులతో నిర్మిస్తామని ముందుకొస్తే వారికి అనుమతులు ఇవ్వకుండా కాలయాపన చేశారు. నిరుపయోగంగా మారిన సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ సూళ్లూరుపేట దాహార్తిని తీర్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ రాజీవ్ పల్లెబాటకు వచ్చినప్పుడు స్థానిక ప్రజల బాధలను తెలుసుకుని సమ్మర్ స్టోరేజీ ట్యాంక్‌కు రూ.6 కోట్లు మంజూరు చేశారు. కోటపోలూరు పెద్దన్నగారి చెరువులో ఎస్ఎస్ ట్యాంక్‌ను నిర్మించారు. వైఎస్సార్ ఉన్నంత కాలం వర్షాలు పుష్కలంగా పడడంతో నీటికి ఇబ్బంది లేకుండాపోయింది. ఎస్ఎస్ ట్యాంక్‌కు నీళ్లు చేరేందుకు తెలుగుగంగ బ్రాంచ్ కాలువను తీసుకువస్తున్నామని, వైఎస్సార్ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, టీడీపీ పాలకులు ఏళ్లకు ఏళ్లే కాలయాపన చేస్తున్నారు. సూళ్లూరుపేట మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందడంతో తాగునీటి పథకాలను ఆర్డబ్ల్యూఎస్ శాఖ నుంచి మున్సిపాలిటీకి అప్పగించారు. షార్ నిధులతో పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.117 కోట్లతో 7.50 లక్షల లీటర్లు కెపాసిటీ కలిగిన ఐదు ఓవర్ హెడ్‌ట్యాంకులు, 18 కిలో మీటర్లు పైపులైన్లు విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఈ ప్రతిపాదనలు పైళ్లకే పరిమితమైపోయింది. 2013 ఏప్రిల్‌లో సూళ్లూరుపేటకు వచ్చిన అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.75 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పడమటికండ్రిగ చెరువులోని ఆక్రమిత స్థలాన్ని, మంగళంపాడు చెరువులో స్థల పరిశీలన కూడా చేశారు. ఈ ప్రతిపాదన కూడా సీఎం కార్యాలయం నుంచి బయటకు రాలేదు. తాజాగా ఏషియన్ ఇన్వెస్టిమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ అనే సంస్థ నుంచి రూ.183 కోట్లు మంజూరు చేస్తారని, దీనికి కూడా అంచనాలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఏఐఐబీ సంస్థ ప్రతినిధులు ఇటీవల సూళ్లూరుపేటకు వచ్చి మంగళంపాడు చెరువును, పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించి వెళ్లారు. ఆ తర్వాత ప్రస్తావనే లేకుండా పోయింది. ఇది కూడా కొండెక్కినట్టేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జోరుగా నీళ్లు వ్యాపారం పట్టణంలోని కళాక్షేత్రంలో స్వజల ధార కింద మున్సిపాలిటీ స్థలంలో ఏర్పాటు చేసిన డాక్టర్స్ వాటర్ అనే సంస్థ మున్సిపాలిటీ నీళ్లను అమ్ముకుంటూ వ్యాపారం చేస్తోంది. అన్ని సౌకర్యాలు మున్సిపాలిటీకి సంబంధించినవి వాడుకుంటూ బిందెనీళ్లు రూ. 4, 20 లీటర్ల క్యాన్ రూ.15లకు విక్రయిస్తున్నారు. మున్సిపాలిటీ వనరులను వాడుకుని పట్టణ ప్రజలకు నామమాత్రపు ధరలకు ఇవ్వాల్సింది పోయి అధికంగా విక్రయిస్తున్నా.. అడిగే నాథుడు లేకుండా పోయారు. -
నమ్మిన కంపెనీనే నట్టేట ముంచేశారు
-
రైలు కిందపడి ప్రేమజంట..
సాక్షి, సూళ్లూరుపేట: ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ జంటకు కులాలు అడ్డుగోడలై నిలిచాయి. వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం గొల్లలములువు రైల్వేగేట్ సమీపంలో గురువారం జరిగింది. గూడూరు రైల్వే ఎస్సై బాలకృష్ణయ్య కథనం మేరకు ప్రకాశం జిల్లా పరుచూరు మండలం నూతలపాడుకు చెందిన కుంభ విద్యాధరి (19), ఒల్లంగుంట ఆంజనేయులు (23) కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని ఇంట్లో పెద్దలకు చెప్పారు. వాళ్లు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో విద్యాధరికి పెళ్లి చేయాలని పెద్దలు సంబంధాలు చూస్తుండటంతో ఇద్దరూ కలిసి మంగళవారం సాయంత్రం ఊరు వదిలి వచ్చేశారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకునే ధైర్యం లేక ఒకరిచేయి ఒకరు పట్టుకొని రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విద్యాధరి కనిపించకపోవడంతో ఆమె తండ్రి పరచూరు పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు ఇచ్చారని తెలుస్తోంది. ప్రేమికులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారని వార్త తెలుసుకున్న చుట్టుపక్కల జనాలు సంఘటన స్థలానికి వచ్చి చూసి కంటతడి పెట్టుకున్నారు. సమాచారం తెలుసుకున్న రైల్వే ఎస్సై బాలకృష్ణయ్య సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి ఇద్దరిదీ పరచూరు మండలం నూతలపాడుగా గుర్తించారు. వెంటనే మృతుల బంధువులకు సమాచారాన్ని అందించారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోవటంతో వాటిని మూటగట్టి పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
అన్నం పెట్టలేదని...
సూళ్లూరుపేట: సూళ్లూరుపేట మండలంలోని ఇసుకమిట్ట వద్ద రైల్వే ట్రాక్‌పై తల్లీకుమారుడు ఆత్మహత్యాయత్నం చేయబోయారు. ఇసుకమిట్టకు చెందిన ఓ మహిళ తన భర్త తనను సరిగ్గా చూసుకోవడం లేదని, బిడ్డకు కూడా సరిగ్గా భోజనం పెట్టలేకపోతున్నానని మనస్తాపం చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. రైలు డ్రైవర్ గమనించి ఆపేయడంతో ప్రమాదం తప్పింది. దీంతో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ను 10 నిమిషాల పాటు ఆపేశారు. సదరు మహిళకు సర్ధి చెప్పి అక్కడి నుంచి పంపివేశారు. -
వర్దా బీభత్సం.. ఆయిల్ ట్యాంకర్ బోల్తా!
నెల్లూరు: వర్దా తుపాను బీభత్సం కొనసాగుతోంది. బలమైన గాలులు, శక్తిమంతమైన తుపాను ప్రభావంతో అటు తమిళనాడులోని చెన్నై.. ఇటు ఏపీలోని పలు జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. అతి భారీ తుపానుగా కొనసాగుతున్న వర్దాకు తోడుగా బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో అనేకచోట్ల చెట్లు, భవనాలు, హోర్డింగ్‌లు నేలమట్టమవుతున్నాయి. నెల్లూరుజిల్లా సూళ్లూరుపేటలో ఈదురుగాలుల తాకిడికి ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ మార్గంలో వాహనాలను నిలిపివేశారు. ట్యాంకర్‌లోని ఆయిల్ రోడ్డుపాలైంది. మరోవైపు వర్దా ఎఫెక్ట్‌తో తిరుమల, తిరుపతిలోనూ భారీ వర్షం కురుస్తోంది. నిన్న అర్ధరాత్రి నుంచి వర్షం పడుతుండగా.. ఈరోజు ఉదయం మంచు కమ్ముకుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో యాత్రికులు అవస్థలు పడుతున్నారు. -
వర్ధా బీభత్సం.. ఆయిల్ ట్యాంకర్ బోల్తా!
-
చెక్‌పోస్టు వద్ద బెదిరింపులు: విలేకరులపై కేసు
సూళ్లూరుపేట (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : నెల్లూరు జిల్లా తడ వద్ద ఉన్న అంతర్ రాష్ట్రీయ చెక్ పోస్టు వద్ద బెదిరింపులకు పాల్పడుతున్న పత్రికా విలేకరులపై పోలీసులు మంగళవారం కేసులు నమోదు చేశారు. గత డిసెంబరు 9వ తేదీన చెక్‌పోస్టు వద్ద సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఈనాడు పత్రిక విలేకరి చంద్రమోహన్‌రెడ్డి, ఆంధ్రజ్యోతి విలేకరి రమేష్ వారిని అడ్డుకుని కొన్ని లారీలను ముందుకు దాటించే ప్రయత్నం చేశారు. ఇదేమని ప్రశ్నించినందుకు సిబ్బందిని బెదిరించారు. దీనిపై చెక్‌పోస్టు అధికారి జగబంధు స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అనంతరం ఆరోపణలు నిజమని తేలటంతో ఇందుకు సంబంధించి ఇద్దరు విలేకరులపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేష్‌కుమార్ తెలిపారు. -
ధర దిగాలు
సూళ్లూరుపేట: రైతులను ఆదుకుంటామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం మద్దతు ధరను మాత్రం వదిలేసింది. ధాన్యం మద్దతు ధర ఆశాజనకంగా లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో రబీ సీజన్లో వేసుకున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ ఏడాది అన్నదాతల అవస్థల వర్ణనాతీతంగా ఉన్నాయి. జిల్లాలో వర్షపాతం తక్కువ కావడంతో మెట్ట ప్రాంతాలంతా ఎండిపోగా పల్లపు ప్రాంతాల్లో, బోర్లు, బావుల కింద ముదురుకాపులో వేసుకున్న పంటలు మాత్రమే పండాయి. లేతకాపులో వేసుకున్న పంటలను కాపాడుకునేందుకు ప్రస్తుతం రైతులు రేయింబవళ్లు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. మద్దతు ధర చూసి ఈసారి పెట్టిన పెట్టుబడులైనా వస్తాయా రావా! అని రైతాంగం ఆందోళన చెందుతున్నారు. దళారుల చేతిలో ధర ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి పండిం చిన పంటను అమ్ముకునేందుకు రైతు ఆశగా ఎదురుచూస్తున్నాడు. కానీ సొమ్మొకరిది సోకొకరిది అనే చందాన రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి వ్యాపారులు, దళారులు రేట్లు నిర్ణయిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ధాన్యానికి ధరలు లేకుండాపోయాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ప్రారంభంలో జిలకర మసూరి పుట్టి ధాన్యం రూ.15,000 నుంచి రూ.16,000 దాకా పలికింది. ఈ ఏడాది ప్రారంభం నుంచే మిల్లర్లు, దళారులు రంగప్రవేశం చేసి రేట్లు లేకుండా చేస్తున్నారు. సాధారణ రకాలు రూ.9,500 నుంచి రూ.10,000 వరకు, జిలకర మసూరి ధాన్యం రూ.12,500లకే మిల్లర్లు, దళారులు రేట్లు నిర్ణయించి కోనుగోలు చేసి స్టాక్ చేస్తున్నారు. తేమ పేరుతో కత్తెర గత ఏడాది ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 135 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా రైతులు వాటివైపు చూడనేలేదు. ఈ ఏడాది కూడా జిల్లావ్యాప్తంగా 150కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రా లు ఏర్పాటుచేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ 17 శాతం ఉండాలి. ఇదంతా తీసేస్తే రైతులకు మిగిలేది అప్పులే అన్న చందాన ఉంది పరిస్థితి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధరల కంటే బయటి మార్కెట్లోనే పది రూపాయలు ఎక్కువగా ఉండటంతో సన్న, చిన్నకారు రైతులు వారికే అమ్మేసుకుంటున్నారు. పెద్దరైతులు మాత్రం ఆరబెట్టి నిల్వ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పెరిగిన పెట్టుబడులు ఈ ఏడాది పెరిగిన ఎరువుల ధరలు, పురుగుమందుల ధరలు, పెరిగిపోయిన కూలీరేట్లు వెరసి ఎకరానికి సుమారుగా రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పైగా పెట్టుబడులయ్యాయని రైతులు చెబుతున్నారు. వర్షాభావంతో అదనంగా మరో ఐదారు వేలు, కౌలు అదనం. ఈ పరిస్థితుల్లో మిల్లర్లు, దళారులు రైతులను నిలువుదోపిడీ చేస్తుంటే రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అంతకంటే దారుణంగా, నట్టేటముంచే విధంగా మద్దతు ధర ప్రకటించడం దారుణమంటున్నారు. -
హుషార్
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : ఈ ఏడాది జనవరి 5న అత్యంత ప్రతిష్టాత్మకమైన జీఎస్ఎల్వీ డీ5, శుక్రవారం పీఎస్ఎల్వీ విజయాలతో ఈ ఏడాది ప్రథమార్థంలో రెండు ప్రయోగాలు విజయవంతం కావడంతో షార్ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. శ్రీహరికోటలోని అన్ని భవనాల మీద నుంచి షార్ ఉద్యోగుల కుటుంబాలు, పిల్లలు రాకెట్ ప్రయోగాన్ని వీక్షించారు. ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో రెండో ఉపగ్రహాన్ని ప్రయోగించడంతో రాకెట్ నింగికి ఎగుస్తున్నంత సేపు కరతాళధ్వనులతో వారి ఆనందాన్ని తెలియజేస్తూ దేశభక్తిని చాటుకున్నారు. షార్‌లో బందోబస్తులో ఉన్న పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది మీడియా సెంటర్లోని టీవీల్లో ప్రయోగాన్ని ఆద్యంతమూ వీక్షించి తమ ఆనందాన్ని ఒకరినొకరు పంచుకున్నారు. 2011లో నాలుగు విజయాలు, 2012లో రెండు విజయాలు, 2013లో ఐదు విజయాలు, ఈ ఏడాది రెండో విజయం నమోదు కావడంతో షార్ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే రెండో విజయాన్ని సాధించడం, పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రెండోసారి తయారు చేసిన శాటిలైట్ ప్రయోగం కావడంతో షార్ ఉద్యోగుల్లో పట్టలేనంత సంతోషాన్ని వ్యక్తమైంది. ఈ ఏడాది ప్రథమార్థంలోనే విజయాల ఖాతా తెరవడంతో షార్ ఉద్యోగులు ఉత్సాహంతో ఉన్నారు. సూళ్లూరుపేట, తడ ప్రాంతాల్లోని గ్రామీణులు సైతం మిద్దెలపై నుంచి రాకెట్ ప్రయోగాన్ని వీక్షించారు. ప్రయోగం విజయవంతంగా నిర్వహించడంతో ఈ ప్రాంత ప్రజల్లో కూడా విజయగర్వం తొణికిసలాడింది. భవిష్యత్తులో కూడా మరిన్ని పెద్ద ప్రయోగాలు చేసి మన శాస్త్రవేత్తలు ప్రపంచం గర్వించదగిన విజయాలు సాధించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. గత ఏడాదితో వంద ప్రయోగాలు పూర్తి చేసి సెంచరీ మైలురాయిని దాటి 113వ ప్రయోగాన్ని కూడా విజయవంతం చేయడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. -
వామ్మో..ఈఎస్ఐ ఆస్పత్రులా !
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్ : కార్మికుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, వారి జీతంలో నుంచి కేటాయించిన మొత్తంతో నడుస్తున్న ప్రభుత్వ కార్మిక బీమా వైద్యశాలలు (ఈఎస్ఐ ఆస్పత్రి) సమస్యలకు నిలయంగా మారాయి. వైద్యాధికారుల నియామకంపై ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడంతో కార్మికులకు వైద్యసేవలు గగనమవుతున్నాయి. ఈ క్రమంలో వారికి ప్రైవేటు ఆస్పత్రులే దిక్కవతున్నాయి. సూళ్లూరుపేట, తడ, నాయుడుపేట ప్రాంతంలోని పారిశ్రామిక సెజ్‌ల్లో ఇటీవల కాలంలో 50 పరిశ్రమల వరకు ఏర్పాటయ్యాయి. వీటిలో సుమారు 25 వేల మంది వరకు పనిచేస్తుండగా, 13 వేల మందికి ఈఎస్ఐ కార్డులున్నాయి. కార్మికులతో పాటు వారి కుటుంబసభ్యులకు కలిపి సుమారు 92 వేల మందికి ఈఎస్ఐ వర్తిస్తుంది. వీరందరికీ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో సూళ్లూరుపేటలోని షార్ బస్టాండ్ సమీపంలో డిస్పెన్సరీ, సూళ్లూరుపేట-శ్రీహరికోటరోడ్డులో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేశారు. కార్మికుల కష్టంతో నిర్వహిస్తున్న ఈ ఆస్పత్రుల్లో సరైన వైద్యసేవలు అందించలేకపోతున్నారు. డిస్పెన్సరీలో నలుగురు వైద్యులకు గాను కొద్దిరోజులు ముగ్గురే పనిచేశారు. ప్రస్తుతం కేవలం ఒకే డాక్టర్ ఉన్నారు. ఆ డాక్టర్ కూడా నెల్లూరు నుంచి డిప్యూటేషన్‌పై వచ్చివెళుతున్నారు. రోజుకు సుమారు రెండు వందల మందికి పైగా వైద్యసేవలు పొందేందుకు వస్తుండటంతో ఒక డాక్టర్ వైద్యసేవలు అందించలేకపోతున్నారు. రెండుపూట్ల నిర్వహించాల్సిన ఆస్పత్రిని మధ్యాహ్నం వరకే పరిమితం చేయడంతో పాటు ఆదివారం, ఇతర ప్రభుత్వ సెలవు దినాల్లో పూర్తిగా మూసేస్తున్నారు. ఈ క్రమంలో కార్మికులు, వారి కుటుంబసభ్యులు అనారోగ్యానికి గురైతే ప్రైవేటు ఆస్పత్రులే దిక్కవుతున్నాయి. డయాగ్నోస్టిక్ సెంటర్లో మరీ దారుణం సూళ్లూరుపేటలోని ఈఎస్ఐ డయాగ్నోస్టిక్ సెంటర్లో 13 మంది స్పెషలిస్టు డాక్టర్లు, నలుగురు అసిస్టెంట్ సివిల్ సర్జన్లు వైద్యసేవలందించారు. గత నెలాఖరుదాకా 9 మంది డాక్టర్లు ఉండేవారు. వారిలో ఇద్దరు నవంబర్‌లో ఉద్యోగ విరమణ చేశారు. మిగిలిన ఏడుగురిలో నలుగురు డిప్యూటేషన్‌పై వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఒకరు మెటర్నటీ సెలవులో ఉన్నారు. విజయవాడ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చి విధులు నిర్వర్తిస్తున్న ఓ డాక్టర్ నెలలో రెండు,మూడు సార్లు మాత్రమే వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉన్న ఒకరిద్దరు డాక్టర్లు అందిస్తున్న సేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ ఆస్పత్రి నిర్వహణకు ఇన్చార్జిగా నియమించిన రామకృష్ణారెడ్డి తిరుపతి నుంచి ఎప్పడు వస్తారో, రారో తెలియని పరిస్థితి నెలకొంది. తగినంత పని, పర్యవేక్షించే వారు లేకపోవడంతో ఉన్న 40 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది మధ్యాహ్నానికే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. రోగులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన మందులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మెరుగైన వైద్యసేవలందించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. ఆస్పత్రి విషయమే తెలియదు బి.బుజ్జమ్మ, కార్మికురాలు, సూళ్లూరు ఇక్కడ ఈఎస్ఐ ఆస్పత్రి ఉందనే విషయమే మాకు తెలియదు. ఈఎస్ఐ కార్డు మాత్రం ఉంది. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ప్రైవేటు ఆస్పత్రికే వెళుతుంటాం. ఎప్పుడు వెళ్లినా డాక్టర్లుండరు మనోజ్, కార్మికుడు, దొరవారిసత్రం ఈఎస్ఐ డిస్పెన్సరీకి ఎప్పుడు వెళ్లినా డాక్టర్లుండరు. మధ్యాహ్నం పైన వెళితే తాళం వేసివుంటారు. డయగ్నోస్టిక్ సెంటర్లోనూ అదే పరిస్థితి. సెకండ్ షిప్ట్ డ్యూటీ చేసుకుని ఆస్పత్రికి వెళితే వెనక్కు రావాల్సిందే. -
రెండున్నర లక్షలు తీసుకున్నారట.!
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: సూళ్లూరుపేటలో ప్రభుత్వాసుపత్రి నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని సమాచారమందడంతో కలెక్టర్ శ్రీకాంత్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వేసిన ప్రశ్నలకు వైద్యాధికారులు తత్తరపోయారు. ‘ఆస్పత్రి ఇన్చార్జి గారూ.. మీరు రోజూ వచ్చిపోతున్నారా..చెన్నైలో ఉంటూ అప్పుడప్పుడు విజిట్‌కు వస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక్కడున్న రిజిస్టర్‌లపైన అవగాహన లేదంటే మీరు సరిగా వ చ్చిపోతున్నట్టు కనిపించలేదు...ఏమండీ డీఎంహెచ్ఓ గారూ..ఈమె విధులు నిర్వహించకుండా మీకు రెండున్నర లక్షల రూపాయలు లంచం ఇచ్చింది కదా’ అని కలెక్టర్ శ్రీకాంత్ ప్రశ్నించారు. ఉలిక్కిపడిన డీఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్ లేదు సార్ అంటూ సమాధానం ఇచ్చారు. అయితే ఆస్పత్రి ఇన్చార్జి డాక్టర్ ప్రియదర్శిని ఆస్పత్రికి రాకుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పేర్నాడు పీహెచ్సీ వైద్యాధికారి పద్మావతిపైనా ఫిర్యాదు ఉంది కదా! ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. వీటికి డీఎంహెచ్ఓ నీళ్లు నములుతూ సమాధానం ఇచ్చారు. మొదట కలెక్టర్ ఆస్పత్రి ఆవరణలోని ఫ్లూయిడ్ బాటిల్స్, మాత్రలను చూసి స్టాక్ రిజిస్టర్ తెమ్మని ఆదేశించడంతో సిబ్బంది తెల్లముఖాలేశారు. రికార్డులను తనిఖీ చేయగా రెండు బాక్సుల నిండా ఫ్లూయిడ్స్ ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు. ఇలా మిగలబెట్టి మందుల షాపులో అమ్మేస్తున్నారా..అని నిలదీశారు. ఆస్పత్రి నిధుల వినియోగంపైనా ఆరా తీశారు. దుర్వినియోగం చేస్తే కఠినచర్యలుంటాయని హెచ్చరించారు. సుమారు రూ. 96 లక్షలు వెచ్చించి సీమాంక్ సెంటర్‌ను ఆధునాతనంగా నిర్మిస్తే పాత భవనంలో నుంచి ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. శుక్రవారం రాత్రి లోపు మార్చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేసినందుకు ఎవరైనా డబ్బులు అడిగితే తనకు గానీ, ఆర్డీఓకు గానీ సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఆయన వెంట ఆర్డీఓ ఎన్.వెంకటరమణ, క్లస్టర్ అధికారి మస్తానమ్మ తదితరులు ఉన్నారు. -
పోలీసునని బెదిరించి యువతిపై అత్యాచారం
సూళ్లూరుపేట: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో శనివారం రాత్రి వేనాటి రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడు తాను పోలీసునని బెదిరించి యువతిపై అత్యాచారం చేశాడు. బాధితురాలు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. నిందితుడు రాజశేఖర్‌రెడ్డి విద్యార్థి సంఘ నాయకుడిగా, పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరించేవాడు. లాఠీ పట్టుకుని వలంటీర్‌గా పోలీసులకు సహకరిస్తుండేవాడు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన కొమ్మల శ్రీనివాసులు, అతడితో పరిచయం ఉన్న సూళ్లూరుపేట మండలం జంగాలగుంటకు చెందిన యువతి శనివారం రాత్రి చెంగాళమ్మ ఆలయానికి వెళ్లారు. వారు ఆలయం పక్కనే ఉన్న కట్టమీదకు వెళ్లడాన్ని గమనించిన రాజశేఖర్‌రెడ్డి వెంబడించాడు. తాను పోలీసునని చెప్పి లాఠీతో శ్రీనివాసులును కొట్టి బెదిరించి పంపి ఆ యువతిపై అత్యాచారం చేశాడు. తర్వాత బాధితురాలు బీట్ తిరుగుతున్న ఏఆర్ పోలీసులను గమనించి వారిని ఆశ్రయించింది. బాధితురాలిని గూడూరు డీఎస్పీ చౌడేశ్వరి విచారించారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడు రాజశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నేడు నింగికి ‘జీఎస్ఎల్వీ డీ5’
* నిర్విఘ్నంగా సాగుతున్న కౌంట్‌డౌన్ * సాయంత్రం గం. 4.50 కు ‘షార్’ నుంచి ప్రయోగం సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజన్ తో కూడిన జీఎస్ఎల్వీ డీ5 రాకెట్ సోమవారం నింగికి దూసుకుపోనుంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో ఈ మేరకు ఆదివారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమై నిర్విఘ్నంగా కొనసాగుతోంది. 29 గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం సాయంత్రం 4.50 గంటలకు రెండో ప్రయోగవేదిక నుంచి జీఎస్ఎల్వీ డీ5 నింగికి దూసుకుపోనుంది. ప్రయోగానికి ఆరు గంటల ముందు రాకెట్‌లోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తారు. ఈ ప్రయోగం ద్వారా జీశాట్-14 సమాచార ఉపగ్రహాన్ని 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెడతారు. జీశాట్-14లో 6 కేయూ బాండ్, 6 ఎక్సెటెండెడ్ సీబాండ్, భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి రెండు కేఏ-బాండ్ ట్రాన్స్పాండర్లు ఉన్నాయి. డీటీహెచ్ ప్రసారాలు, టెలికం రంగానికి ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలు అందించనుంది. జీఎస్ఎల్వీ డీ5 కౌంట్‌డౌన్‌ను ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ ప్రయోగంలో క్రయోజనిక్ దశ కీలకం కావడం, గతంలో ఆ దశ వైఫల్యం చెందిన నేపథ్యంలో ఆయన అప్రమత్తంగా ఉన్నారు.