( ఫైల్ ఫోటో )
సాక్షి, తిరుపతి: పీఎస్‌ఎల్‌వీ సీ–55 ప్రయోగం నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ సోమనాథ్ సూళూరుపేట శ్రీచంగాళమ్మ పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ప్రయోగానికి ముందు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. రాకెట్ నమూనాతో సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, శనివారం మధ్యాహ్నం 2.20 లకు పీఎస్‌ఎల్‌వీ సీ–55 నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 12.50 గంటలకి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. పూర్తి 25 గంటల 30 నిమిషాల పాటు కౌంట్ డౌన్ కొనసాగనుంది.
పూర్తిగా విదేశీ పరిజ్ఞానం, సింగపూర్‌కి చెందిన వాణిజ్య ప్రయోగం ఇది. ఈ రాకెట్ ద్వారా 741 కిలో బరువు కలిగిన లియోన్-2 తో పాటు 16 కిలోల లూమ్ లైట్-4 శాటిలైట్లను రోదసిలోకి ఇస్రో పంపనుంది. ఈ ప్రయోగ నేపథ్యంలో తిరుపతిజిల్లా శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి చేరుకున్నారు విదేశీ శాస్త్రవేత్తల బృందం. అక్కడ భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. భూ, ఉపరితలం, సముద్ర తీరంలోనూ సీఐఎస్‌ఎఫ్ బలగాల విస్తృత తనిఖీలు చేపట్టారు. షార్ పరిసర ప్రాంతాల్లో ఇతరులకు ప్రవేశాన్ని నిషేధించారు.
చదవండి: చింతమనేని ప్రభాకర్ వింత ప్రవర్తన.. ఐసీయూలోకి తోపుడు బండ్లు..
Comments
Please login to add a commentAdd a comment