వర్దా బీభత్సం.. ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా! | Crude oil tanker overturns due to strong winds | Sakshi
Sakshi News home page

వర్దా బీభత్సం.. ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా!

Published Tue, Dec 13 2016 4:19 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM

వర్దా బీభత్సం.. ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా!

వర్దా బీభత్సం.. ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా!

నెల్లూరు: వర్దా తుపాను బీభత్సం కొనసాగుతోంది. బలమైన గాలులు, శక్తిమంతమైన తుపాను ప్రభావంతో అటు తమిళనాడులోని చెన్నై.. ఇటు ఏపీలోని పలు జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. అతి భారీ తుపానుగా కొనసాగుతున్న వర్దాకు తోడుగా బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో అనేకచోట్ల చెట్లు, భవనాలు, హోర్డింగ్‌లు నేలమట్టమవుతున్నాయి. నెల్లూరుజిల్లా సూళ్లూరుపేటలో ఈదురుగాలుల తాకిడికి ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది.

దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ మార్గంలో వాహనాలను నిలిపివేశారు. ట్యాంకర్‌లోని ఆయిల్ రోడ్డుపాలైంది. మరోవైపు వర్దా ఎఫెక్ట్‌తో తిరుమల, తిరుపతిలోనూ భారీ వర్షం కురుస్తోంది. నిన్న అర్ధరాత్రి నుంచి వర్షం పడుతుండగా.. ఈరోజు ఉదయం మంచు కమ్ముకుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో యాత్రికులు అవస్థలు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement