vardah cyclone
-
ఆ రెండింటి వల్ల చెన్నై చితికిపోయింది!
-
ఆ రెండింటి వల్ల చెన్నై చితికిపోయింది!
వర్దా తుఫాను సృష్టించిన బీభత్సానికి చెన్నపట్నం చెల్లాచెదురైంది. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఇంటర్నెట్ సర్వీసులు ఆగిపోయాయి. మొబైల్ సేవలు స్తంభించాయి. అసలకే కేంద్రం తీసుకున్న పాత నోట్ల రద్దు నిర్ణయానికి తీవ్ర కష్టాల్లో ఉన్న చెన్నపట్న వాసులకు ఈ సేవలు నిలిపివేత తీరని కష్టాల్లో పడేసింది. కనీసం తిండి దొరకని పరిస్థితిలోకి నెట్టేసింది. ప్రతిసారీ చెన్నై పట్నాన్ని ముంచెత్తి వరదలకు ప్రజల నుంచి కనీస మద్దతు వారికి అందేది. ప్రజలు తామున్నామంటూ డబ్బులు వసూలు చేసి మరీ చెన్నైను ఆదుకునే వారు. అక్కడి ప్రజలు కూడా ఒక్కరికొక్కరు చేదుడువాదుడుగా నిలిచేవారు. కానీ ఈసారి చెన్నై పరిస్థితి భిన్నంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. పాత నోట్లు రద్దయి ఉండటంతో వారికి కనీసం తిండి దొరకడానికి కూడా నగదు ఎక్కడి నుంచి పుట్టడం లేదని స్థానికులు వాపోతున్నారు. నగదు సాయానికి ఎవరూ ముందుకు రావడం లేదని పేర్కొంటున్నారు.. ఈ తుఫాను వల్ల తమకు జీవనాధారంగా ఉన్న బోట్లుకు ఎలాంటి హాని కలుగకూడదని వేడుకుంటున్నట్టు ఓ మత్స్యకారి చెప్పారు. ఒకవేళ అవి పాడైతే, వాటిని బాగుచేయించుకోవడానికి తమ దగ్గర నగదు కూడా లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. పాత నోట్లు రద్దయి ఉండటంతో ఈ సమయంలో సాయం దొరకడం కూడా కష్టమంటున్నాడు. తుఫానుతో విరిగిపడిన చెట్లకు తమిళనాడులో చాలా ప్రాంతాలు అంధకారంగా మారాయి. దీంతో నగరంలో ఏటీఎంలు సైతం పనిచేయడం లేదు. ఒకవేళ ఎక్కడో ఒక దగ్గర విద్యుత్ ఉండి నడిచే ఏటీఎంలలో కూడా నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తున్నాయరని స్థానికులు చెబుతున్నారు. నెట్‌వర్క్‌లు డౌనయ్యాయి. తమ కార్డులు కూడా నిరూపయోగంగా మారాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
చెన్నై-న్యూఢిల్లీ టిక్కెట్టు ధర రూ.52 వేలు
-
చెన్నై-న్యూఢిల్లీ టిక్కెట్టు ధర రూ.52 వేలు
న్యూఢిల్లీ: చెన్నై-న్యూఢిల్లీ విమాన చార్జీల ధరలు ఆకాశాన్నంటాయి. వర్దా తుపాను ప్రభావం కారణంగా చెన్నై-న్యూఢిల్లీ వెళ్లే విమానం టికెట్ల ధర ఏకంగా ఐదు రెట్లు పెరిగింది. మంగళవారం అర్ధరాత్రి ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్న విమాన టిక్కెట్ల ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ-చెన్నై వెళ్లే విమాన టికెట్ ధర రూ.24,792లు, కోల్ కతా నుంచి చెన్నై వచ్చే విమానం టిక్కెట్ ధర రూ.17,283లు గా ఉన్నాయ. అదే చెన్నై నుంచి ఢిల్లీ వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ ధర ఏకంగా రూ.52,000లుగా ఉంది. సాధారణంగా ఆఖరి నిమిషంలో తీసుకునే విమానధరలు రూ.5 వేల నుంచి 8వేల వరకూ పెరుగుతూ ఉంటాయని నిపుణులు అంటున్నారు. సోమవారం చెన్నై ఎయిర్ పోర్టును మూసివేసిన కారణంగా ఒక్కసారిగా విమానాశ్రయంలో రద్దీ పెరిగింది. దీంతో చార్జీలను ఆయా విమానయాన సంస్ధలు పెంచేశాయి. -
అతలాకుతలం!
-
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
కలెక్టర్ ముత్యాలరాజు నెల్లూరు(పొగతోట): వార్దా తుపాను ప్రభావంతో జిల్లాలో కురిసిన వర్షాలకు అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు మండల అధికారులను ఆదేశించారు. మంగళవారం వివిధ మండలాల అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యశిబిరాలు నిర్వహించాలన్నారు. విషజ్వరాలకు ఇతర వ్యాధులుకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని సూచించారు. గ్రామాల్లో బ్లీచింగ్ చల్లాలని తెలిపారు. వర్షాలు కురిసిన మండలాల్లో నీరు వృథా కాకుండా చెరువులు, కుంటల్లో నింపేలా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తుపాను ప్రభావానికి సంబంధించి పంట నష్టాలను అంచనావేసి నివేదికలను సిద్ధం చేయాలని తెలిపారు. -
విద్యుత్‌శాఖకు రూ.1.5 కోట్లు నష్టం
నెల్లూరు (టౌన్) : వర్దా తుపాన్ విద్యుత్‌శాఖకు నష్టం తెచ్చిపెట్టింది. గత రెండు రోజులుగా జిల్లాలో భారీ గాలులతో కురిసిన వర్షం కారణంగా ఽవిద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో చెట్లు కూలడంతో తీగలు తెగిపోయాయి. అక్కడక్కడ ట్రాన్స్ఫార్మర్లు కూడా పాడైపోయినట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా తుపాను కారణంగా శాఖకు రూ.1.5 కోట్లు మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా సూళ్లూరుపేట, నాయుడుపేట, తడతో పాటు తీరప్రాంత గ్రామాల్లో ఎక్కువ నష్టం జరిగింది. 33 కేవీ లైనుకు సంబంధించి 50 స్తంబాలు, 11 కేవిలైన్కు సంబంధించి 212 స్తంభాలు, ఎల్టీ సెక్షనుకు సంబంధించి 312 స్తంభాలు దెబ్బతిన్నాయి. ప్రిన్సిపల్ సెక్రటరీ అజేయ్‌జైన్ ఆదేశాలతో ట్రాన్స్‌కో సీఈ నందకుమార్ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన ప్రాంతాల్లో ఉండి పనులను పర్యవేక్షించారు. జిల్లాలో 90 శాతంకు పైగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తీరప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో ఇంకా కరెంట్ లేదు. వాటికి బుధవారం నాటికి సరఫరాను పునరుద్ధరించే అవకాశం ఉంది. ఎన్జీఆర్ఎస్ సహాయక బృందాలు కూడా విద్యుత్‌శాఖ సిబ్బందికి సహకరించడంతో యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేశారు. -
యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయండి
మంత్రి పి.నారాయణ నెల్లూరు(పొగతోట) : వార్దా తుపాను ప్రభావంతో జిల్లాలో కురిసిన భారీవర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ అ«ధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న వీడియో కాన్ఫరెన్స్‌లో హాలులో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షంతో మెట్టప్రాంతాల్లో తాగునీటి సమస్యలు కొంతవరకు తగ్గే అవకాశం ఉందన్నారు. వర్షాలకు 600 విద్యుత్ పోల్స్ దెబ్బతిన్నాయన్నారు. సబ్స్టేషన్లకు మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం జరుగుతుందన్నారు. డాక్టర్లు పీహెచ్‌సీలల్లో అందుబాటులో ఉండాలని, అంటువ్యాధులు ప్రబలకుండా తెలిపారు. ఆన్లైన్లో తప్పనిసరి కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో మంజూరైన ప్రతిపనిని ఆన్లైన్లో ఉంచాలని మంత్రి ఆదేశించారు. ఆన్లైన్లో పెట్టిన తర్వాతే ఆర్థిక పరమైన అనుమతులు వస్తాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, సబ్‌ప్లాన్ నిధులను కార్పొరేషన్, మున్సిపాలిటీలకు అత్యధికంగా కేటాయించడం జరిగిందని, చైర్మన్లు సమావేశాలు ఏర్పాటుచేసి పనుల నివేదికలను సిద్ధ చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, జేసీ ఏ మహమ్మద్ ఇంతియాజ్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. ఆదర్శంగా తీర్చిదిద్దాలి నెల్లూరు(పొగతోట) : అంగన్వాడీ కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదాద్దాలని మంత్రి నారాయణ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్‌హాలులో మున్సిపల్ కమిషనర్లు, సీడీపీపీఓలు, ఐసీడీఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కిలోమీటరు పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఒకే భవనంలోకి తీసుకువచ్చే ప్రక్రియ 15 రోజుల్లోగా పూర్తి కావాలని ఆదేశించారు. కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యలను పక్కనపెట్టి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. -
వర్దా తుపానుకు బస్సు కూడా
-
వర్దా బీభత్సానికి చెన్నై పరిస్థితి ఎలా ఉందంటే..
తీవ్ర తుఫాను వర్దా సృష్టించిన బీభత్సానికి అతలాకుతలమైన చెన్నపట్నం ఒక్కసారిగా ఓ అడవిలో మారిపోయింది. గంటకు 100 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో వీచిన భీకర గాలులకు కూకటివేళ్లతో సహా పెద్దపెద్ద వటవృక్షాలు నేలకొరిగాయి. దీంతో ఎక్కడ చూసినా నేలకూలిన చెట్లే దర్శనిమిస్తున్నాయి. ఈ గాలుల ధాటిని బహుళ అంతస్తుల భవంతులను సైతం తట్టుకోలేకపోయాయి. చెన్నపట్నంలో ఎక్కడచూసినా పడిపోయిన చెట్లే కనిపిస్తుండటంతో, మధ్యస్థ అడవిలో ఉన్న మాదిరి అనిపిస్తోందని చెన్నపట్నం వాసులు చెబుతున్నారు. ఈ తుఫాను సృష్టించిన బీభత్సానికి 4,000కు పైగా చెట్లు నేలకొరిగాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం చెప్పారు. నివాస ప్రాంతాల్లో కూలిన చెట్లను కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. లేచిన దగ్గర్నుంచి కాంపౌండ్‌లో విరిగిన, కూలిన చెట్లను తొలగించడం ప్రారంభించామని చెప్పారు. రోడ్లపై కూలిన చెట్ల వల్ల చాలా వాహనాలు వాటి కిందే నలిగిపోయాయి. ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి ప్రధాన రహదారులపై పడిపోయిన చెట్లను అధికారులు తొలగిస్తున్నారు. కానీ రెసిడెన్షియల్ ప్రాంతాల్లో కూడా చెట్లను తొలగించాలంటే మరో రెండు రోజుల పాటు సమయం పట్టే అవకాశముంటుందని అధికారులు చెబుతున్నారు. బస్సు సర్వీసులు ఎప్పటిమాదిరిగా సాధారణ స్థాయిలో నడవాలంటే మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలో అన్నీ విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దుకాణాలు, హోటల్స్ తెరుచుకున్నాయి. -
వార్దా ఎఫెక్ట్ : పలు రైళ్లు రద్దు
-
వర్దా బీభత్సం.. ఆయిల్ ట్యాంకర్ బోల్తా!
నెల్లూరు: వర్దా తుపాను బీభత్సం కొనసాగుతోంది. బలమైన గాలులు, శక్తిమంతమైన తుపాను ప్రభావంతో అటు తమిళనాడులోని చెన్నై.. ఇటు ఏపీలోని పలు జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. అతి భారీ తుపానుగా కొనసాగుతున్న వర్దాకు తోడుగా బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో అనేకచోట్ల చెట్లు, భవనాలు, హోర్డింగ్‌లు నేలమట్టమవుతున్నాయి. నెల్లూరుజిల్లా సూళ్లూరుపేటలో ఈదురుగాలుల తాకిడికి ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ మార్గంలో వాహనాలను నిలిపివేశారు. ట్యాంకర్‌లోని ఆయిల్ రోడ్డుపాలైంది. మరోవైపు వర్దా ఎఫెక్ట్‌తో తిరుమల, తిరుపతిలోనూ భారీ వర్షం కురుస్తోంది. నిన్న అర్ధరాత్రి నుంచి వర్షం పడుతుండగా.. ఈరోజు ఉదయం మంచు కమ్ముకుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో యాత్రికులు అవస్థలు పడుతున్నారు. -
తమిళనాడుకు కేంద్రం ఆపన్న హస్తం
చెన్నై: వర్దా తుపాను తాకిడికి గురైన తమిళనాడుకు అన్నిరకాలుగా సహాయపడతామని కేంద్ర ప్రభుత్వం భరోసాయిచ్చింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వంకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హామీయిచ్చారు. వర్దా తుపాను కారణంగా తమిళనాడులో తలెత్తిన పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు పన్నీరు సెల్వంకు రాజ్ నాథ్ ఫోన్ చేశారు. చెన్నై, కాంచిపురం, తిరువళ్లూరు ప్రాంతాల్లో భారీగా నష్టం వాటిల్లినట్టు రాజ్ నాథ్ కు సీఎం తెలిపారు. ముందుస్తుగా అన్ని చర్యలు చేపట్టామని, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్లను అప్రమత్తం చేశామని వివరించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నావికా దళాలను సిద్ధం చేశామని చెప్పారు. తుపాను ముప్పు ఎదుర్కొన్న తమిళనాడుకు అవసరమైన సాయం చేస్తామని రాజ్ నాథ్ సింగ్ హామీయిచ్చారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. -
ప్రచండ గాలులు.. తిరగబడ్డ కార్లు
-
చెన్నై చిన్నాభిన్నం
చెన్నై: వర్దా తుపాను ధాటికి చెన్నై మహానగరం చిగురుటాకులా వణికింది. తుపాను కారణంగా వీచిన ప్రచండ గాలులతో తమిళనాడు రాజధాని చిన్నాభిన్నమైంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో భవనాలు, వాహనాలపై చెట్లు కుప్పకులాయి. కార్లు తిరగబడ్డాయి. పైకప్పులు ఎగిరిపోయాయి. హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు విరిగిపడ్డాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు రహదారులపై అడ్డంగా పడిపోవడంతో రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగింది. కరెంట్ సరఫరా నిలిచిపోయింది. రైళ్లు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సహాయక చర్యల కోసం సైన్యం రంగంలోకి దిగింది. లోతట్టు ప్రాంతాల నుంచి దాదాపు 10 వేల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. తిరువళ్లూరు పళవేర్కాడులో సముద్రం ముందుకు వచ్చింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఏడు ఎన్డీఆర్ఎఫ్, రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. వర్దా తుపాను కారణంగా ఇప్పటివరకు చెన్నైలో ఏడుగురు మృతి చెందారు. [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] -
‘చెన్నైలో వరదలు వచ్చే అవకాశం లేదు’
-
‘చెన్నైలో వరదలు వచ్చే అవకాశం లేదు’
న్యూఢిల్లీ: వర్దా తుపాను ప్రభావంతో చెన్నైలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) డైరెక్టర్ జనరల్ కేజీ రమేశ్ తెలిపారు. అర్ధరాత్రి తర్వాత గాలుల తీవ్రత, వర్షాలు తగ్గుతాయని వెల్లడించారు. గతంలోలా చెన్నైని వరదలు ముంచెత్తే అవకాశం లేదని స్పష్టం చేశారు. చెన్నైకు ఉత్తర దిక్కుగా కేంద్రీకృతమై ఉందని, కొద్ది నిమిషాల్లో తీరం దాటుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పై వర్దా తుపాను ప్రభావం తక్కువేనని తెలిపారు. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు. నెల్లూరు జిల్లాలో రేపటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులకు చేరవేస్తున్నామని తెలిపారు. గతేడాది దాదాపు 15 రోజులు భారీ వర్షాలు కురవడంతో చెన్నై నగరం చాలా వరకు మునిగిపోయిన సంగతి తెలిసిందే. వర్దా తుపాను తీరం దాటుతుండగా 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీశాయని వాతావరణ శాఖ అదరనపు డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర తెలిపారు. చెన్నైలో గరిష్టంగా గంటకు 192 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచాయని వెల్లడించారు. -
వర్ధా బీభత్సం.. ఆయిల్ ట్యాంకర్ బోల్తా!
-
చెన్నైలో ‘వర్దా’ బీభత్సం
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో వర్దా తుపాను బీభత్సం సృష్టించింది. చైన్నె-పులికాట్ సరస్సు మధ్య తుపాను తీరం దాటుతుండడంతో చెన్నై సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయడంతో వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ముందు జాగ్రత్తగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ ను నిలిపివేశారు. గాలుల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తిరువళ్లూరులో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. సాయంత్రం వరకు ఇళ్లలోంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలతో చెన్నైలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. చెన్నై విమానాశ్రయంలో సాయంత్రం 6 గంటలకు రాకపోకలు నిలిపివేశారు. సహాయక కార్యక్రమాలకు సైన్యాన్ని సిద్ధంగా ఉంచారు. సాయంత్రం 6 గంటల కల్లా చెన్నైని తుపాను వీడనుందని సమాచారం. భారీ వర్షాలతో ఇప్పటివరకు చెన్నైలో ఇద్దరు చనిపోయారు. చెన్నైలో సబర్బన్ రైళ్లు రద్దు చెన్నై విమానాలు హైదరాబాద్, బెంగళూరుకు మళ్లింపు చెన్నైలో గరిష్టంగా 192 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం: వాతావరణ శాఖ -
చెన్నైలో వార్దా బీభత్సం
-
వర్దా ఎఫెక్ట్ : తమిళనాడు అతలాకుతలం
చెన్నై: వర్దా తుపాను తమిళనాడును అతలాకుతలం చేస్తోంది. సోమవారం ఉదయం నుంచి కురుస్తోన్న అతి భారీ వర్షాలతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. కుండపోత వర్షాలు, పెనుగాలులతో వందలాది చెట్లు నేలకూరాయి. పలు ప్రాంతాల్లో సహాయ సిబ్బంది, ఎన్డీఆర్ఫ్, ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి సేవలందిస్తున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో గాలులు మరింత పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. చెన్నైకు 50కి.మీ దూరంలో వర్దా తుపాను కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. వర్దా తుపాను పరిస్థితులపై తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సోమవారం సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. సాయంత్రం 4గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని అధికారులు ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నానికి శ్రీహరికోట-నెల్లూరు మధ్య తుపాను తీరం దాటే అవకాశముంది. చెన్నై విమానాశ్రయంలో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. సోమవారం సాయంత్రం 6గంటల వరకు విమాన రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ఎయిర్ లైన్ సంస్థలు ప్రకటించాయి. [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] -
రంగంలోకి దిగిన 15 ఎన్డీఆర్ఫ్ బృందాలు
-
తుఫాను పరిస్థితిపై కేంద్రం హెచ్చరిక
చెన్నై: తమిళనాడు రాష్ట్రాన్ని తుఫాను, భారీ వర్షాలు మరోసారి వణికిస్తున్నాయి. వార్దా తుఫాను విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. ముఖ్యంగా వార్దా తుఫాను, ఈదురుగాలులకు భారీ వర్షాలు కూడా తోడవ్వడంతో ప్రధాన జలాశయాల ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యంగా పూండి, చంబరం పక్కం ఇతర జలాశయాల ప్రాంతాల్లో దృష్టి పెట్టాలని కోరింది. తమిళనాడు లోని చెన్నె తిరువల్లూరు, కాంచీపురం జిల్లాల్లో వర్షపాతం తీవ్రత భారీగా ఉంది. కొన్ని ప్రదేశాలలో 7-19 సెం.మీ వర్షం నమోదైంది. ఇదిక్ర మంగా పెరుగుతూ 20 సెం.మీ వర్షపాతం నమోదు కావచ్చని అధికారులు సూచిస్తున్నారు. దీంతో చెన్నై నగరం చుట్టు పక్కల ఉన్న పూండి, చంబరం పక్కం రిజర్వాయర్లు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రిజర్వాయర్లు పూర్తిగా నిండనప్పటికీ, ఊహించని వర్షాలతో ప్రమాదకరంగా మారేఅవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించినట్టు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వర్షధాటికి భారీగా చెట్లు కూలిపోతున్నాయి. దీంతో నావీ రంగంలోకి దిగింది. సహాయక చర్యల నిమిత్తం ఇప్పటికే రెండు నౌకలు అందుబాటులో ఉంచామని, తక్షణం సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నేవీ ఛీప్ కెప్టెన్ డీకే శర్మ ప్రకటించారు. -
చైన్నైలో అయ్యప్ప భక్తుల ఇక్కట్లు
-
చెన్నైను వణికిస్తున్న వర్దా తుపాను
► తమిళనాడును ముంచెత్తిన అతి భారీ వర్షాలు ► విమానాశ్రయం మూసివేత ► పలు రైళ్లు దారి మళ్లింపు, రద్దు ► పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత ► ప్రజలు బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు చెన్నై: తమిళనాడు రాష్ట్రాన్ని వణికిస్తున్న వర్దా తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచే మీనంబాకం, చెన్నై విమానశ్రయం పరిసరాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనులున్న ప్రజలు బయటకు రావద్దని, పనులను వాయిదా వేసుకోవాలని అధికారులు ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చెన్నైకు 105కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమైందని తీరం దాటే సమయంలో పెనుతుపాను తీవ్ర ప్రభావం చూపనుందని హెచ్చరించారు. తుపాను తీరం దాటిన అనంతరం 36 గంటల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. తుపాను ప్రభావంతో చెన్నై విమానాశ్రయాన్ని సోమవారం మధ్యాహ్నం 3గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయగా కొన్నింటినీ దారి మళ్లించారు. తమిళనాడు ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న 7357 మంది ప్రజలను 54 సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. (తుఫాను పరిస్థితిపై కేంద్రం హెచ్చరిక) వర్దా తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు పడతాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెన్నై, ఎన్నోర్, కట్టుపల్లి పోర్టుల్లో పదో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుపాను సహాయ కార్యక్రమాల్లో 15 ఎన్డీఆర్ఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. చెన్నైకు సమీపంలో తీరం దాటే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 110కి.మీ వేగంతో గాలులు వీస్తాయన్నారు. 22 ఏళ్ల తర్వాత చెన్నైకు సమీపంలో తుపాను తీరం దాటనుంది. దీని ప్రభావంతో చెన్నై సహా తమిళనాడు ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు, పెనుగాలులు బీభత్సం సృష్టిస్తాయని అధికారులు హెచ్చరించారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారులకు అప్రమత్తం చేశారు. తుపాను పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. -
ప్రకాశం జిల్లాలో వర్దా ఎఫెక్ట్
-
వార్దా ఎఫెక్ట్ : పలు రైళ్లు రద్దు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో వార్దా తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని ప్రభావంతో గూడూరు, చెన్నైల మధ్య నడిచే పలు రైళ్లను దారి మళ్లించగా, మరి కొన్నింటిని సోమవారం రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రద్దైన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ-చెన్నై, చెన్నై-విజయవాడ మధ్య నడిచే రైలు నెంబర్లు 12711,12712 రైళ్లను గూడూరు, చెన్నైకు సోమవారం తాత్కాలికంగా రద్దు చేశారు. నెల్లూరు-సుళ్లూరుపేట ల మధ్య నడిచే రైలు నెంబర్ 66030, సుళ్లూరుపేట-చెన్నైల మధ్య నడిచే రైలు నెంబర్ 66026 రైళ్లను సోమవారం పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు. విజయవాడ-చెన్నైసెంట్రల్ పినాకినీ ఎక్స్‌ప్రెస్ రైలును గూడూరు, రేణిగుంట, అరక్కోణం మీదుగా చెన్నైకు దారి మళ్లించారు. -
వార్దా ఎఫెక్ట్ : ప్రత్యేక అధికారుల నియామకం
విజయవాడ : వార్దా తుపాను హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. నాలుగు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఆదివారం సాయంత్రం ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. వార్దా తుపాను పెను తుపానుగా మారింది. దీని ప్రభావంతో తీరప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా సృష్టిస్తోంది. అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దక్షిణ కోస్తాలో గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు, తీరం దాటే సమయంలో 80-100కి.మీ వేగంతో పెనుగాలులు వీయనున్నాయి. ప్రత్యేక అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా పేరు అధికారి పేరు ప్రకాశం ముఖేష్ కుమార్ మీనా నెల్లూరు బి.శ్రీధర్ చిత్తూరు రవిచంద్ర వైఎస్సార్ జిల్లా రామ్ గోపాల్