
వార్దా ఎఫెక్ట్ : పలు రైళ్లు రద్దు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో వార్దా తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని ప్రభావంతో గూడూరు, చెన్నైల మధ్య నడిచే పలు రైళ్లను దారి మళ్లించగా, మరి కొన్నింటిని సోమవారం రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
రద్దైన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ-చెన్నై, చెన్నై-విజయవాడ మధ్య నడిచే రైలు నెంబర‍్లు 12711,12712 రైళ్లను గూడూరు, చెన్నైకు సోమవారం తాత‍్కాలికంగా రద్దు చేశారు. నెల్లూరు-సుళ్లూరుపేట ల మధ్య నడిచే రైలు నెంబర్ 66030, సుళ్లూరుపేట-చెన్నైల మధ్య నడిచే రైలు నెంబర్ 66026 రైళ్లను సోమవారం పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు. విజయవాడ-చెన్నైసెంట్రల్ పినాకినీ ఎక్స్ప్రెస్ రైలును గూడూరు, రేణిగుంట, అరక్కోణం మీదుగా చెన్నైకు దారి మళ్లించారు.