ప్రయాణికులకు అలర్ట్‌.. మరో 48 రైళ్లు రద్దు.. వివరాలివే! | SCR cancels Trains, diverts due to heavy rains water logging Details Inside | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు అలర్ట్‌.. మరో 48 రైళ్లు రద్దు.. వివరాలివే!

Published Tue, Sep 3 2024 10:18 AM | Last Updated on Tue, Sep 3 2024 11:50 AM

SCR cancels Trains, diverts due to heavy rains water logging Details Inside

సాక్షి, హైదరాబాద్‌:  తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం రైల్వే వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాల్లో రైల్వే లైన్లు పాడయ్యాయి. పలుచోట్ల రైలు పట్టాలపై వరదనీరు ప్రవహించడంతో ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే వందలాది రైళ్లు రద్దయ్యాయి.

మంగళవారం మరో 28 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో 24 రైళ్లను దారి మళ్లించారు అధికారులు. ఈ మేరకు సీపీఆర్వో శ్రీధర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.  తాజాగా 28 రైళ్లు రద్దు చేశారు. అయితే ముందుగా దారి మళ్లించిన పలు రైళ్లతోపటు మరో 18  రైళ్లను రద్దు చేస్తున్నట్లు తాజాగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దు చేసిన రైళ్ల వివరాలు ఈ కింద ఉన్నాయి. గమనించగలరు.

కాగా వర్షాల ప్రభావంతో ఇప్పటి వరకు దాదాపు 500కుపైగా రైళ్లు రద్దు కాగా..160 సర్వీసులను దారి మళ్లించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement