trains cancelled
-
పెద్దపల్లి గూడ్స్ ప్రమాదం: వందేభారత్ సహా రద్దైన రైళ్ల వివరాలివే..
పెద్దపెల్లి, సాక్షి: గూడ్స్ రైలు ప్రమాదంతో కాజీపేట-బలార్ష రూట్(ఢిల్లీ–చెన్నై) రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ మార్గంలో ఎటువైపు రైలు అటువైపు నిలిచిపోయాయి. వందేభారత్ సహా పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇంకొన్నింటిని రీషెడ్యూల్ చేశారు. పునరుద్ధరణకు ఒక్కరోజు పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పునరుద్ధరణ పనులు చేపట్టారు. క్లియరెన్స్‌కు మరో 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన రాఘవాపూర్ స్టేషన్ వద్దకు ఈ ఉదయం దక్షిణ మధ్య రైల్వే అధికారులు చేరుకుని పునరుద్ధరణ పనులను ముమ్మరం చేయించారు.ట్రాక్స్ పునరుద్ధరణకు ప్రత్యేక మిషనరీ తెప్పించారు. బల్లార్షా, కాజీపేట, సికింద్రాబాద్ నుంచి సుమారు 500 మంది సిబ్బందిని తీసుకొచ్చి రైల్వే ట్రాక్స్ పునరుద్ధరణ పనుల్లో స్పీడ్ పెంచారు. ట్రాక్స్ పై అదుపు తప్పి కిలోమీటర్ మేర చెల్లాచెదురుగా పడిన బోగీలను భారీ క్రేన్స్ సాయంతో తొలగిస్తున్నారు.రద్దు.. డైవర్షన్.. రీషెడ్యూల్ఇదిలా ఉంటే.. దక్షిణ మధ్య రైల్వే 31 రైళ్లు రద్దు చేయడంతో పాటు 10కి పైగా రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది. ఇంకొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసింది. ప్రయాణికులంతా ఇది గమనించాలని.. ఏమైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించాలని సూచించింది.నర్సాపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-నాగ్‌పుర్, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్-కాగజ్‌నగర్, కాజీపేట-సిర్పూర్ టౌన్, సిర్పూర్ టౌన్-కరీంనగర్, కరీంనగర్-బోధన్, సిర్పూర్ టౌన్-భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్-బల్లార్షా, బల్లార్షా-కాజీపేట, యశ్వంత్‌పూర్-ముజఫర్‌పూర్ రైళ్లను రద్దు చేశారు.అలాగే.. రామగిరి ఎక్స్ ప్రెస్, సింగరేణి ఎక్స్ ప్రెస్, వందే భారత్ ఎక్స్ ప్రెస్, బీదర్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్, కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్‌లను రద్దు చేశారు.దారి మళ్లించిన రైల్వే వివరాలు జీటీ, కేరళ, ఏపీ, గోరఖ్ పూర్, సంఘమిత్ర, దక్షిణ్, పూణే, దర్భంగా ఎక్స్ ప్రెస్ SCR PR No.610 dt.13.11.2024 on "Railway Helpline Numbers provided in View of Accident Of Goods Train" @drmsecunderabad pic.twitter.com/M7pjbq4GXP— South Central Railway (@SCRailwayIndia) November 12, 2024 Bulletin No.2 SCR PR No.611 dt.13.11.2024 on "Cancellation/Diversion of Trains due to Goods Train Derailment" @drmsecunderabad @drmvijayawada pic.twitter.com/cMrk7XTS9d— South Central Railway (@SCRailwayIndia) November 12, 2024 "Cancellation/PartialCancellation/Diversion/Reschedule of Trains due to Goods Train Derailment" @drmsecunderabad @drmvijayawada pic.twitter.com/vfOqjCyLvR— South Central Railway (@SCRailwayIndia) November 12, 2024ఏం జరిగిందంటే..మంగళవారం నిజామాబాద్ నుంచి ఘజియాబాద్ వైపు 43 వ్యాగన్లతో ఐరన్ కాయల్స్ లోడుతో వెళుతున్న గూడ్స్ రైలులోని 11 వ్యాగన్లు పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్–కన్నాల గేట్ మధ్యలో 282/35 పోల్ వద్ద పట్టాలు తప్పాయి. రైలు ఇంజిన్, గార్డ్ వ్యాగన్ పట్టాలు తప్పలేదు. దీంతో.. ఈ ప్రమాదం నుంచి లోకోపైలెట్లు ఇద్దరు, గార్డు సురక్షితంగా బయటపడ్డారు. రైలు ఇంజిన్‌వైపు ఉన్న 8 వ్యాగన్లతోసహా గూడ్స్‌ను రామగుండంకు తరలించారు. ప్రమాద తీవ్రతకు పట్టాలు విరిగిపోయి చెల్లాచెదురయ్యాయి. కరెంట్ పోల్స్ సైతం విరిగిపోయాయి. వ్యాగన్లు ఒక్కదానిపైకి ఒక్కటి ఎక్కడంతో ట్రాక్ పునరుద్ధరణ పనులు కష్టంగా మారాయి. భాగ్యనగర్ రైలు రాఘవాపూర్‌కు చేరుకోగా, దానిని వెనుకకు మళ్లించి పెద్దపల్లిలో ప్రయాణికులను దింపివేశారు. దీంతో మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, ఓదెల, జమ్మికుంట తదితర రైల్వే స్టేషన్లలో రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పటికప్పుడు.. వరంగల్ వైపు వెళ్లే మరికొన్ని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రామగుండం, మంచిర్యాల రైల్వేస్టేషన్లలో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. -
తమిళనాడులో రైలు ప్రమాద ఘటన.. 18 రైళ్ల రద్దు
తమిళనాడులో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్నవిషయం తెలిసిందే. మైసూర్-దర్భంగా భాగమతి ఎకస్ప్రెస్ చెన్నై సమీపంలోని తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్లై రైల్వే ష్టేషన్ వద్ద గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 19 గాయాలయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.ప్రమాద సమయంలో 1,360 మంది ప్రయాణికులు ఉన్నారని తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ టీ ప్రభుశంకర్ తెలిపారు. 19 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే రైలు మెయిన్‌లైన్‌కు బదులు లూప్ లైన్‌లోనిక ప్రవేశించడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.కాగా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో క్షిణ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. తిరుపతి-పుదుచ్చేరి మెము(16111), పుదుచ్చేరి-తిరుపతి మెము(16112), డా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- తిరుపతి ఎక్స్‌ప్రెస్(16203), తిరుపతి-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్(16204), ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-తిరుపతి(16053), తిరుపతి- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్(16054), ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-తిరుపతి(16057), తిరుపతి-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్(16058)అరక్కం-పుదుచ్చేరి మెము(16401), కడప-అరక్కోణం మెము(16402), డా. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- తిరుపతి మెము(06727), , తిరుపతి-డా. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మెము(06728), అరక్కోణం-తిరుపతి మెము(06753), తిరుపతి-అరక్కోణం మెము(06754), విజయవాడ-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్‌ప్రెస్(12711), ఎంజీఆర్ సెంట్రల్-విజయవాడ పినాకిని ఎక్స్‌ప్రెస్(12712) సూళ్లూరుపేట-నెల్లూరు మెము ఎక్స్‌ప్రెస్(06745), నెల్లూరు-సూళ్లూరుపేట మెము ఎక్స్‌ప్రెస్(06746) రైళ్లు రద్దయ్యాయి.The Following Trains are cancelled due to train accident of Train No.12578 #Mysuru – Darbhanga Bagmati Express at Kavaraipettai in #Chennai Division Passengers are requested to take note on this and plan your #travel #SouthernRailway pic.twitter.com/zhgmRo84l3— Southern Railway (@GMSRailway) October 11, 2024Bulletin No.4 PR NO.517 dt. 12-10-2024 @drmvijayawada @drmgnt @drmgtl @drmsecunderabad @drmhyb pic.twitter.com/oOAH0JBgji— South Central Railway (@SCRailwayIndia) October 12, 2024 -
ప్రయాణికులకు అలర్ట్.. మరో 48 రైళ్లు రద్దు.. వివరాలివే!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం రైల్వే వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాల్లో రైల్వే లైన్లు పాడయ్యాయి. పలుచోట్ల రైలు పట్టాలపై వరదనీరు ప్రవహించడంతో ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే వందలాది రైళ్లు రద్దయ్యాయి.మంగళవారం మరో 28 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో 24 రైళ్లను దారి మళ్లించారు అధికారులు. ఈ మేరకు సీపీఆర్వో శ్రీధర్ ఓ ప్రకటన విడుదల చేశారు. తాజాగా 28 రైళ్లు రద్దు చేశారు. అయితే ముందుగా దారి మళ్లించిన పలు రైళ్లతోపటు మరో 18 రైళ్లను రద్దు చేస్తున్నట్లు తాజాగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దు చేసిన రైళ్ల వివరాలు ఈ కింద ఉన్నాయి. గమనించగలరు.కాగా వర్షాల ప్రభావంతో ఇప్పటి వరకు దాదాపు 500కుపైగా రైళ్లు రద్దు కాగా..160 సర్వీసులను దారి మళ్లించారు. Revised -Bulletin No. 31 - SCR PR No. 359 on "Cancellation of Trains due to Heavy Rains" pic.twitter.com/OHNw9itaD7— South Central Railway (@SCRailwayIndia) September 3, 2024Bulletin No.30: SCR PR No.358, Dt.03.09.20024 on "Cancellation/diversion of Trains due to Heavy Rains" pic.twitter.com/AHcCOghiuK— South Central Railway (@SCRailwayIndia) September 3, 2024 -
కాజీపేట-బల్లార్ష రూట్లో పనులు.. పలు రైళ్లు రద్దు
హైదరాబాద్, సాక్షి: దక్షిణ మధ్య రైల్వేజోన్ పరిధిలోని కాజీపేట-బల్లార్ష సెక్షన్లో భారీగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. ఆసిఫాబాద్-రేచ్ని స్టేషన్ల మధ్య మూడో లైను నిర్మాణం కారణంగా.. వేర్వేరు రోజుల్లో మొత్తం 78 రైళ్లను రద్దు చేశారు. అలాగే 26 ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించి నడపనున్నారు. వాటి వివరాలను ద.మ.రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. రద్దయిన రైళ్లు ఇవే.. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్‌ల మధ్య తిరిగే కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు (నం.12757/12758) జూన్ 26 నుంచి జులై 6 వరకు రద్దు. పుణె-కాజీపేట ఎక్స్‌ప్రెస్ (నం.22151) ఈ నెల 28, జులై 5న.. కాజీపేట-పుణె ఎక్స్‌ప్రెస్ (నం.22152) జూన్ 30, జులై 7న.. హైదరాబాద్-గోరఖ్‌పుర్ (నం.02575) జూన్ 28న, గోరఖ్‌పుర్-హైదరాబాద్ (నం.02576) ఎక్స్‌ప్రెస్ జులై 30న రద్దు ముజఫర్‌పుర్-సికింద్రాబాద్ (నం.05293) జులై 2న, సికింద్రాబాద్-ముజఫర్‌పుర్ (నం.05294) జూన్ 27, జులై 4న రద్దు గోరఖ్‌పుర్-జడ్చర్ల (నం.05303) రైలు జూన్ 29న, జడ్చర్ల-గోరఖ్‌పుర్ (నం.05304) రైళ్లు జులై 1న రద్దుసికింద్రాబాద్-రాక్సల్ మధ్య తిరిగే వేర్వేరు మూడు రైళ్లు జూన్ 26, 27, 28 తేదీల్లో.. సికింద్రాబాద్-దానాపుర్ల మధ్య తిరిగే వేర్వేరు ఆరు రైళ్లు జూన్ 27, 28, 29, జులై 1 తేదీల్లో.. సికింద్రాబాద్-సుభేదార్‌గంజ్ మధ్య తిరిగే రైళ్లు జూన్ 27, 29 తేదీల్లో రద్దయ్యాయి.దారి మళ్లింపు..కాజీపేట మీదుగా వెళ్లే సికింద్రాబాద్-న్యూఢిల్లీ (నం.12723) తెలంగాణ ఎక్స్‌ప్రెస్.. జులై 4, 5, 6 తేదీల్లో నిజామాబాద్, ముద్కేడ్ మీదుగా దారి మళ్లించనున్నారు. అంటే.. కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి స్టేషన్లను ప్రయాణం ఉండదు. న్యూఢిల్లీ-సికింద్రాబాద్ (నం.12724) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను జులై 3, 4, 5 తేదీల్లో ముద్కేడ్, నిజామాబాద్ మీదుగా నడిపిస్తారు. ఆ తేదీల్లో బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, కాజీపేట స్టేషన్ల మీదుగా రైలు వెళ్లదు.సికింద్రాబాద్-నిజాముద్దీన్ (దిల్లీ), నిజాముద్దీన్-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లను (నం.12285/12286) జులై 4, 5 తేదీల్లో నిజామాబాద్ మీదుగా దారి మళ్లించి నడిపిస్తారు. -
విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ, గుంటూరు డివిజన్లలో జరుగుతున్న ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఆయా మార్గాల్లో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్ఓ నుస్రత్ మండ్రూప్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15 నుంచి 26 వరకు రాజమండ్రి–విజయవాడ (07466/07467), నర్సాపూర్–నిడదవోలు (07897/07771), నర్సాపూర్–విజయవాడ (17270/07862), నర్సాపూర్–రాజమండ్రి (07883/07884), విశాఖపట్నం–గుంటూరు (22701/22702/17239) రైళ్లు, 16 నుంచి 27 వరకు విశాఖపట్నం–గుంటూరు (17240), 16 నుంచి 31 వరకు నర్సాపూర్–గుంటూరు (17282), 17 నుంచి జూన్ 1 వరకు గుంటూరు–నర్సాపూర్ (17281), 16 నుంచి 31 వరకు హుబ్లీ–విజయవాడ (17329), 17 నుంచి జూన్ 1 వరకు విజయవాడ–హుబ్లీ (17330) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. అదే విధంగా రామవరప్పాడు–నర్సాపూర్ (07861) రైలును భీమవరం–నర్సాపూర్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. -
TS, AP: రైలు ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు
సాక్షి, కాజీపేట: రైలు ప్రయాణికులకు అలర్ట్. మౌలాలీ - సనత్‌నగర్ రైల్వే స్టేషన్ల మధ్య డబ్లింగ్, నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. దీంతో, ఈ నెల 11వ తేదీ వరకు కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. మరికొన్నింటిని పాక్షికంగా నడుపుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్(ప్రతీరోజు నడిచే) నుండి రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ వెళ్లే ప్రయాణికులకు పలు రైళ్లు రద్దయ్యాయి. హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ ఇంటర్ సిటీ(17011/12), కాగజ్‌నగర్ సూపర్‌ఫాస్ట్ (12757/58), సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్ సిటీ(12705/06) ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్- గుంటూరు శాతవాహన ఎక్స్‌ప్రెస్(12714/13), కాకతీయ ఎక్స్‌ప్రెస్(17659/60) పూర్తిగా రద్దు చేశారు. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్(17233/14)ను, సికింద్రాబాద్-గుంటూరు మధ్య నడిచే 17201/02 గోల్కొండ ఎక్స్‌ప్రెస్ కాజీపేట నుంచి బయలుదేరనున్నాయి. ఈ మేరకు ప్రయాణికులు రైళ్ల రద్దును గమనించాలని తెలిపారు. -
ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో చేపట్టనున్న ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లు పూర్తిగాను, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసి, కొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ శనివారం తెలిపారు. ఈ నెల 29– ఫిబ్రవరి 25 వరకు గుంటూరు–విశాఖ (17239/17240), కాకినాడ పోర్టు–విశాఖ (17267/17268), మచిలీపట్నం–విశాఖ (17219/17220), గుంటూరు–రాయగఢ్ (17243/ 17244), బిట్రగుంట–విజయవాడ (07977/ 07978) రైళ్లు రద్దయ్యాయి. బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238) రైళ్లు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు, 5 నుంచి 9 వరకు, 12 నుంచి 16 వరకు, 19 నుంచి 23 వరకు రద్దు చేశారు. అలాగే, ఈ నెల 29– ఫిబ్రవరి 25 వరకు మచిలీపట్నం–విజయవాడ (07896/07769), నర్సాపూర్–విజయవాడ (07863), విజయవాడ–మచిలీపట్నం (07866), మచిలీపట్నం–విజయవాడ (07770), విజయవాడ–భీమవరం జంక్షన్ (07283), మచిలీపట్నం–విజయవాడ (07870), విజయవాడ–నర్సాపూర్ (07861) రైళ్లు రామవరప్పాడు నుంచి బయలుదేరి, తిరుగు ప్రయాణంలో కూడా ఈ స్టేషన్ వరకే నడవనున్నాయి. -
ప్రయాణికులకు అలర్ట్: మిచాంగ్ తుపాన్ ఎఫెక్ట్.. 142 రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: మిచాంగ్ తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే విభాగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో దాదాపు 142 రైళ్లను రద్దు చేస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల మూడో తేదీ నుంచి ఆరో తేదీ వరకూ ఈ రైలు సర్వీసులు రద్దు చేసినట్టు సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ చెప్పారు. వివరాల ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్ప పీడనం శుక్రవారం వాయుగుండంగా మారి.. ఆదివారానికి తుపానుగా బల పడనున్నది. ఈ తుఫాన్‌కు మిచౌంగ్ అని భారత వాతావరణ విభాగం పేర్కొంది. దీంతో ఆదివారం, సోమవారాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. రేపటికి తుపానుగా మారే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆ తర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుందని, మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముంది. Passengers Please Note: Cancellation of Trains in View of #CycloneMichaung pic.twitter.com/RjI1X4hXAg — South Central Railway (@SCRailwayIndia) December 2, 2023 ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులను దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) అలర్ట్ జారీ చేసింది. మిచాంగ్ తుపాన్ తీరాన్ని దాటనున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) పరిధిలో 142 రైళ్లు రద్దు చేశామని సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ చెప్పారు. ఈ నెల మూడో తేదీ నుంచి ఆరో తేదీ వరకూ ఈ రైలు సర్వీసులు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని కోరారు. మరికొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు రాకేశ్ తెలిపారు. (3/3) Passengers Please Note: Cancellation of Trains in View of #CycloneMichaung pic.twitter.com/qKREufE9R1 — South Central Railway (@SCRailwayIndia) December 2, 2023 Cancellation / Partial Cancellation of Trains in View of #CycloneMichaung pic.twitter.com/LHKg9gExjD — South Central Railway (@SCRailwayIndia) December 2, 2023 -
తమిళనాడులో భారీ వర్షం.. స్కూల్స్ బంద్, పలు రైళ్లు రద్దు
చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్థంభించిపోయింది. వరదల కారణంగా పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. 12 జిల్లాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే, తమిళనాడువ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. కోయంబత్తూరు, తిరువూర్, మధురై, థేనీ, దినిదిగుల్ జిల్లాల్లో గురువారం కుండపోత వాన కురిసింది. ఇక, నీలగిరి జిల్లాలోని ఐదు తాలుకాలను వర్షం ముంచెత్తింది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో శుక్రవారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తంజావూర్, తిరువారూర్, నాగపట్నం, మైలదుత్తురై, పుదుకోట్టై, శివగంగై, రామనాథపురం, విరుదునగర్, తూత్తుకుడి, తెంకాసి, తిరునెల్వేలి, కన్యాకుమారి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. Due to severe rains #Madurai is water logged #TamilNadu #Rains pic.twitter.com/eTvH8oK4JW — Ashok Varma (@AshokVarmaAA) November 10, 2023 ఇక, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. తాజాగా తిరువారూర్ జిల్లా, పుదుచ్చేరిలోని కారైక్కల్లోని పాఠశాలలను నేటి నుంచి మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదే సమయంలో వర్షం కారణంగా పలు రైళ్లను కూడా రద్దు చేశారు రైల్వే అధికారులు. నీలగిరి మౌంటైన్ రైల్వేలోని కల్లార్, కూనూర్ సెక్షన్ల మధ్య ట్రాక్‌పై కొండచరియలు, చెట్లు కూలిపడటంతో నవంబర్ 16 వరకు ఆ రూట్స్‌లో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. మెట్టుపాళయం నుంచి ఉదగమండలం వరకు నడిచే 06136, 06137 ప్యాసింజర్ ప్రత్యేక రైళ్లను నవంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. VIDEO | Schools across Tamil Nadu’s Coimbatore shut due to heavy rains in the region. pic.twitter.com/Y0q73Zw1R7 — Press Trust of India (@PTI_News) November 9, 2023 -
HYD: రైలు ప్రయాణికులకు అలర్ట్.. 28 రైళ్లు రద్దు
సికింద్రాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రైలు ప్రయాణీకులకు ముఖ్య గమనిక. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 19(సోమవారం) నుంచి 25వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే, హైదరాబాద్ జంటనగరాల్లో ప్రజలకు సర్వీసులందించే 23 ఎంఎంటీఎస్ రైళ్లను సోమవారం నుంచి వచ్చే ఆదివారం వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటనలో స్పష్టంచేశారు. వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాలకు సర్వీసులందించే పలు రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ప్రకటించింది. ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. అయితే, 28 రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేయగా.. ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఇక, హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల నిర్వహణకు సంబంధించిన పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. గుంతకల్-బోధన్ రైలు సమయంలో తాత్కాలికంగా మార్పులు చేసినట్టు తెలిపారు. దీంతో పాటు హైదరాబాద్ జంటనగరాల్లో 23 ఎంఎంటీఎస్ రైళ్లను సోమవారం నుంచి వచ్చే ఆదివారం వరకు రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. రైళ్ల రద్దను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు. Cancellation / Partial Cancellation / Rescheduling of Train @drmhyb @drmsecunderabad pic.twitter.com/KXdebBaGpq — South Central Railway (@SCRailwayIndia) June 18, 2023 ఇది కూడా చదవండి: మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ కవితకు తప్పిన ప్రమాదం -
ప్రయాణీకులకు అలర్ట్: ఆ రూట్లో 15 రైళ్లు రద్దు పూర్తి లిస్ట్ ఇదే..
సాక్షి, సికింద్రాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని హౌరా మార్గంలో నడిచే 15 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం నుంచి బుధవారం వరకు నడిచే 15 రైళ్లను రద్దు చేసినట్లు వివరించింది. అయితే, ఇటీవల ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో దాదాపు 280మందికి పైగా మృతిచెందగా.. అనేకమంది గాయపడిన విషయం తెలిసిందే. కాగా, రైలు ప్రమాదంలో టాక్ మొత్తం దెబ్బతిన్నది. ప్రస్తుతం బహనాగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆది, సోమ, మంగళ, బుధవారాల్లో మొత్తంగా 15 రైళ్లు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఓ ప్రటకనలో పేర్కొంది. అలాగే, ఈ నెల 12న చెన్నై సెంట్రల్ -షాలిమార్ (12842)రైలు సర్వీసు సేవలను పునరుద్ధరిస్తున్నట్టు తెలిపింది. అయితే, రైలు ప్రమాద ఘటన తర్వాత వందలాది మంది కార్మికులు రాత్రింభవళ్లు కష్టపడి ట్రాక్ పునరుద్ధరణ చేపట్టడంతో దాదాపు 50 గంటల తర్వాత మళ్లీ మార్గంలో రైలు ప్రయాణాలు మొదలయ్యాయి. రద్దయిన రైళ్ల వివరాలు.. - ఈ నెల 11న (ఆదివారం) మైసూరు- హౌరా (22818) రైలు రద్దు, - 12వ తేదీన హైదరాబాద్-షాలిమార్ (18046), - ఎర్నాకుళం-హౌరా (22878), - సంత్రగాచి-తంబ్రం(22841), - హౌరా-చెన్నై సెంట్రల్ (12839), - ఈ నెల 13న సంత్రగాచి-చెన్నై సెంట్రల్(22807), - హౌరా- ఎఎంవీటీ బెంగళూరు(22887), - షాలిమార్-చెన్నై సెంట్రల్ (22825), - షాలిమార్-హైదరాబాద్(18045), - సికింద్రాబాద్-షాలిమార్(12774), - హైదరాబాద్-షాలిమార్ (18046), - విల్లుపురం-ఖరగ్‌పూర్(22604), - ఈనెల 14వ తేదీన సర్వీసులందించే ఎస్ఎంవీటీ బెంగళూరు-హౌరా (22864), - భాగల్పూర్ -ఎస్ఎంవీటీ బెంగళూరు(12254), - షాలిమార్-సికింద్రాబాద్ (12773) సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. Bulletin no. 28, SCR PR No.146 dt.11.06.2023 on "Cancellation / Restoration of Trains" @drmhyb @drmsecunderabad @drmvijayawada pic.twitter.com/nrm4V2PqbJ — South Central Railway (@SCRailwayIndia) June 11, 2023 ఇది కూడా చదవండి: బిపర్జోయ్ తుపాను మహోగ్రరూపం -
Secunderabad: పలు రైళ్లు రద్దు.. వివరాలివే!
సాక్షి, హైదరాబాద్: నిర్వహణపరమైన కారణాలు, ఒడిశాలో రైలు ప్రమాద ఘటన దృష్ట్యా ఈ నెల 7 నుంచి 13 వరకు పలు రైళ్లను రద్దుచేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ–నిజామాబాద్ (07596), నిజామాబాద్–కాచిగూడ (07593), నాందేడ్–నిజామాబాద్ (07854), నిజామాబాద్–నాదేడ్ (07853) రైళ్లను ఈ నెల 7 నుంచి 13 వరకు రద్దుచేసినట్టు పేర్కొన్నారు. కాచిగూడ–షాలిమార్–వాస్కోడిగామా (17603/18047), షాలిమార్–హైదరాబాద్ (18045/18046) రైళ్లు ఈ నెల 7న రద్దు కానున్నాయి. వాస్కోడిగామా–షాలిమార్–కాచిగూడ (18048/17604) రైలు 9వ రద్దు కానుంది. దౌండ్–నిజామాబాద్ (11409), నిజామాబాద్–పంఢర్‌పూర్ (01413) రైళ్లను ముద్ఖేడ్–నిజామాబాద్ మధ్య పాక్షికంగా రద్దుచేశారు. ప్రత్యేక రైళ్ల పొడిగింపు వేసవి రద్దీ దృష్ట్యా కాచిగూడ–తిరుపతి (070 61 / 07062), కాచిగూడ–కాకినాడ (07417 / 07418), కాచిగూడ–నర్సాపూర్ (07653 / 07654) ప్రత్యేక రైళ్లను ఈ నెల 30 వరకు పొడిగించనున్నట్లు సీపీఆర్వో తెలిపారు. బెంగళూరు ఎక్స్‌ప్రెస్ చక్రాలకు మంటలు బాలానగర్: కాచిగూడ నుంచి బెంగళూరు వెళ్లే బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ స్టేషన్లో 16 నిమిషాలు ఆగింది. 8.26 గంటలకు బాలానగర్‌కు వచ్చిన రైలు 8.43 గంటలకు తిరిగి బయలుదేరింది. రైల్లో ఎక్కువ మోతాదులో స్పార్క్స్ (మంటలు) రావడంతో ముందు జాగ్రత్తగా రైలును బాలానగర్‌లో నిలిపినట్లు సమాచారం. ట్రైన్ బ్రేకులు వేసిన సమయంలో వీల్స్‌లో స్పార్క్స్ వచ్చాయని, సాధారణంగా చిన్నపాటి స్పార్క్స్ వస్తుంటాయన్నారు. లోకో పైలెట్ 16 నిమిషాలపాటు వాటిని సరిచేసుకుని బయలుదేరి వెళ్లారు. దీంతో కాచిగూడ టు కర్నూలు టౌన్ ట్రైన్‌కు సైతం అరగంట అంతరాయం కలిగినట్లు ప్రయాణికులు చెప్పారు. దీనికితోడు బాలానగర్ రైల్వేస్టేషన్లో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో స్టేషన్లో అంధకారం నెలకొంది. చదవండి: Telangana: కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం తీపికబురు -
రాజమండ్రి: గూడ్స్ ప్రమాదం ఎఫెక్ట్.. 9 రైళ్లు రద్దు
సాక్షి, రాజమండ్రి: బాలాజీపేట వద్ద గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. విశాఖ నుంచి విజయవాడవైపు వెళ్తున్న గూడ్స్ రైలు భోగి పట్టాలపై పడిపోయింది. దీంతో, పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు 9 రైళ్లను రద్దు చేశారు. 2 రైళ్లను పాక్షికంగా రద్దుచేసినట్టు తెలిపారు. రైళ్ల వివరాలు ఇవే.. - విజయవాడ-విశాఖ, విశాఖ-విజయవాడ రైళ్లు రద్దు. - గుంటూరు-విశాఖ, విశాఖ-గుంటూరు. - గుంటూరు-విజయవాడ, కాకినాడ పోర్టు-విజయవాడ రైళ్లు రద్దు - కాకినాడ పోర్టు-విజయవాడ రైలు పాక్షికంగా రద్దు. - విజయవాడ-రాజమండ్రి రైలు పాక్షికంగా రద్దు. ఇక, పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. రూట్ల వారీగా వివరాలు ఇవిగో..
సాక్షి, హైదరాబాద్: ఈ నెల14వ తేదీ ఆదివారం 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు లేకపోవడంవల్ల ఈ మేరకు ఫలక్‌నుమా–లింగంపల్లి, సికింద్రాబాద్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్‌నుమా–నాంపల్లి, తదితర రూట్లలో నడిచే రైళ్లు రద్దు కానున్నాయి. పలు రైళ్లు రద్దు.. లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని తాటిచెర్ల–జంగాలపల్లి డబ్లింగ్ పనుల నేపథ్యంలో పలు రైళ్ల రద్దు, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం ఆంజనేయులు గురువారం తెలిపారు. గుంతకల్–హిందూపూర్ డెమూ రైలు 12 నుంచి 19 వరకు, హిందూపూర్–గుంతకల్ డెమూ రైలును 13 నుంచి 20 వరకు రద్దు చేసినట్లు చెప్పారు. తిరుపతి–గుంతకల్ రైలు ఈ నెల 12 నుంచి 19వ వరకు ధర్మవరం–గుంతకల్ మీదుగా, గుంతకల్–తిరుపతి రైలు ఈ నెల 12 నుంచి 19 వరకు గుంతకల్–ధర్మవరం మీదుగా తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. (క్లిక్: ఇంజనీరింగ్‌లో సీట్లపై ఉత్కంఠ.. పదివేలు దాటినా సీఎస్సీ పక్కా) -
భారత్ బంద్ ఎఫెక్ట్: వందల సంఖ్యలో రైళ్లు రద్దు
అగ్నిపథ్ స్కీమ్‌పై దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే రాజకీయ పార్టీల నేతలు నేడు(సోమవారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బంద్ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా రైల్వేశాఖ ఆర్పీఎఫ్ బలగాలను అప్రమత్తం చేసింది. అంతే కాకుండా భారీగా రైళ్లను రద్దు చేసింది. జూన్ 20న బయల్దేరాల్సిన 736 రైళ్ల ప్రయాణాలను నిలిపివేసినట్లు ఐఆర్సీటీసీ పేర్కొంది. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారికి సంఘీభావం తెలిపేందుకు దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహం చేపట్టారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా.. నిరసనల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ పోలీసులు హెచ్చరించారు. పంజాబ్‌లో అగ్నిపథ్‌పై తప్పుడు ప్రచారం చేస్తే ఆందోళనలను ప్రేరేపించే సమాచారాన్ని సోషల్ మీడియా వ్యాప్తి చెందనివ్వకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇక, బీహార్ ప్రభుత్వం పార్టీ కార్యాలయాల వద్ద భద్రతను పెంచింది. ప్రస్తుతం బీహార్‌లోని 20 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. మరోవైపు.. అగ్నిపథ్‌కు నిరసనగా భారత్ బంద్ నేపథ్యంలో జార్ఖండ్‌లో విద్యా సంస్థలను మూసివేసి, ఈరోజు జరిగే పరీక్షలను రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్, హర్యానా, కేరళ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌లలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ఫరీదాబాద్, నోయిడాలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమావేశాన్ని నిషేధిస్తూ పోలీసులు 144 సెక్షన్ విధించారు. Agnipath protest: Railways cancel over 700 trains amid Bharat Bandh, check full list here#Railways #CancelledTrains #Agnipath #BharatBandh https://t.co/26vMAOhrIn — APN NEWS (@apnnewsindia) June 20, 2022 ఇది కూడా చదవండి: భారత్ బంద్ ఎఫెక్ట్: విద్యా సంస్థలు మూసివేత, పరీక్షలు రద్దు -
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అదనపు బలగాల మోహరింపు
-
సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత.. బలగాల ఎంట్రీతో సీన్ రివర్స్
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, రైల్వే అధికారులు.. నిరసనకారులను చర్చలకు ఆహ్వానించడంతో ఆందోళనకారులు ఒప్పుకున్నారు. అయితే, అధికారులే రైల్వే స్టేషన్‌కు రావాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. దీంతో, వారి డిమాండ్ అధికారులు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మరోసారి రైల్వేస్టేషన్లో ఉద్రిక్తత నెలకొంది. కాగా, ఆందోళనకారులను స్టేషన్ నుంచి తరలించేందుకు అక్కడ.. అదనపు పోలీసు బలగాలు మోహరించాయి. బలగాలు రైల్వే స్టేషన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఆందోళనకారులను స్టేషన్ నుంచి బయటకు పంపించేస్తున్నారు. ఎక్కడికక్కడ ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసులు కూడా మరోసారి లాఠీ ఝళిపించడంతో నిరసనకారులు స్టేషన్ బయటకు పరుగులు తీశారు. కాగా, రైల్వే ట్రాక్‌లను సైతం పోలీసులు.. క్లియర్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. రైళ్ల రాకపోకలపై దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. రైళ్ల రాకపోకల పునరుద్ధరణకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విజయవాడ, కాజీపేట నుంచి వచ్చే రైళ్లను మౌలాలీ నుంచి దారి మళ్లించినట్టు స్పష్టం చేశారు. ఈస్‌కోస్ట్, శబరి, ఫలక్నామా, ధనాపూర్, షిర్డీ, ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: సికింద్రాబాద్ ఆందోళన; ఈ ప్రశ్నలకు బదులేది? -
అసని తుపాను ఎఫెక్ట్.. 37 రైళ్లు రద్దు.. వివరాలు ఇవే..
South Central Railway Cancelled Trains List, సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అసాని తీవ్ర తుపాను బలహీన పడి తుపానుగా కేంద్రీకృతమైంది. దిశను మార్చుకుని నరసాపురం, కాకినాడ, విశాఖకు సమాంతరంగా సముద్రంలో ప్రయాణం చేయనుంది. దీని ప్రభావం ఉత్తర కోస్తాలోని విశాఖపట్నం, గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చదవండి: తుపాను అలజడి: ఏపీ ప్రభుత్వం అప్రమత్తం తుపాను ప్రభావంతో 37 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే పలు రైళ్ల రద్దు అయ్యాయి. విజయవాడ-మచిలీపట్నం, విజయవాడ-నర్సాపూర్, నర్సాపూర్- నిడదవోలు, విజయవాడ నర్సాపూర్, నిడదవోలు-భీమవరం జంక్షన్, మచిలీపట్నం-గుడివాడ, భీమవరం జంక్షన్-మచిలీపట్నం, భీమవరం-విజయవాడ, గుంటూర్-నర్సాపూర్, గుడివాడ-మచిలీపట్నం, కాకినాడ పోర్ట్-విజయవాడ మార్గాల్లో వెళ్లే డెము, మెము సర్వీసులు రద్దు అయ్యాయి. షెడ్యూల్ మార్పు.. నర్సాపూర్-నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్ రైలు (12787)ని షెడ్యూల్‌ని మార్చారు. నర్సాపురం నుంచి బుధవారం 11.05 గంటలకు బయలుదేరాల్సిన రైలు మధ్యాహ్నం 2.05 గంటలకు వెళ్లనుంది. బిలాస్పూర్ తిరుపతి, కాకినాడ పోర్ట్-చెంగల్పట్టు రైళ్లను నిడదవోలు, ఏలూరు, విజయవాడ మీదుగా దారిమళ్లించారు. -
పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): చెన్నై–గూడూరు సెక్షన్లో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను పూర్తిగా రద్దు చేయడంతో పాటు మరి కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు, దారి మళ్లించి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. నెల్లూరు–సూళ్లూరుపేట మధ్య నడిచే మెమూ రైళ్లను (06746/06745) ఈ నెల 22న పూర్తిగా రద్దు చేశారు. విజయవాడ–చెన్నై సెంట్రల్ (12711/12712) రైళ్లను ఈ నెల 22న గూడూరు–చెన్నై సెంట్రల్ మధ్య, హైదరాబాద్–తాంబరం (12760) రైలును ఈ నెల 26న చెన్నైబీచ్–తాంబరం మధ్య పాక్షికంగా రద్దు చేశారు. దారి మళ్లించిన రైళ్లు.. ► పుదుచ్చేరి–న్యూఢిల్లీ (22403) ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 16న చెంగల్పట్టు, అరక్కోణం, పెరంబూర్, కొరుక్కుపేట స్టేషన్ల మీదుగా దారి మళ్లింపు. ► ఇండోర్–కొచువేలి ఎక్స్‌ప్రెస్ (22645) ఈ నెల 21న గూడూరు, రేణిగుంట, మేల్పాక్కం, కాట్పాడి స్టేషన్ మీదుగా మళ్లింపు. ► ధన్‌బాద్–అలప్పుజ ఎక్స్‌ప్రెస్ (13351) ఈ నెల 21న గూడూరు, రేణిగుంట, మేల్పాక్కం మీదుగా దారి మళ్లింపు. ► కాకినాడ–చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్ (17644) ఈ నెల 26న పెరంబూర్, అరక్కోణం మీదుగా మళ్లింపు. ► కాకినాడ–చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్ (17652) ఈ నెల 26న అరక్కోణం, కాంచీపురం మీదుగా దారి మళ్లింపు. ► చెన్నై ఎగ్మోర్–ముంబై సీఎస్టీ ఎక్స్‌ప్రెస్ (22158) ఈ నెల 27న తాంబరం, చెంగల్పట్టు మీదుగా దారి మళ్లింపు. -
జావద్ తుపాన్ ఎఫెక్ట్: 95 రైళ్లు రద్దు
సాక్షి, భువనేశ్వర్: జావద్ తుపాను ఎఫెక్ట్ కారణంగా తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తం అయింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. ఈ మేరకు మొత్తం 95 రైళ్లను రద్దు చేసింది. గురువారం రద్దు చేసిన రైళ్లు.. ►సిల్చార్ త్రివేండ్రం సెంట్రల్, త్రివేండ్రం శాలీమార్, బెంగుళూరు కంటోన్మెంట్- గౌహతి, అహ్మదాబాద్-పూరి ఎక్స్‌ప్రెస్, కన్యాకుమారి- దిబ్రుఘర్ శుక్రవారం రద్దు చేసిన రైళ్లు ►పూరి- గుణుపూర్, భువనేశ్వర్-రామేశ్వరం, హౌరా-సికింద్రాబాద్ పలకనామ ఎక్స్‌ప్రెస్, పూరి-యశ్వంత్‌పూర్ గరీబ్ రథ్, హౌరా-యశ్వంత్ పూర్-దురంతో, భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్ ప్రెస్, పురిలీయా-విల్లుపురం ఎక్స్ ప్రెస్, పురీ-తిరుపతి, హౌరా-హైదరాబాద్ -ఈస్ట్ కోస్ట్, హౌరా-చెన్నై కోరమండల్, హౌరా-మైసూర్ వీక్లీ, సంత్రాగాచ్చి-చెన్నై, విశాఖపట్నం హౌరా ఎక్స్ ప్రెస్, హౌరా-యశ్వంత్ పూర్, హౌరా-చెన్నై మెయిల్, పాట్నా-ఎర్నాకులం ఎక్స్ ప్రెస్, రాయగఢ్-గుంటూరు ఎక్స్ ప్రెస్, సంబల్ పూర్-నాందేడ్ ఎక్స్ ప్రెస్, కొర్బా-విశాఖ. ►ధన్ బాద్-అలిప్పీ, టాటా-యశ్వంత్ పూర్, పూరీ-అహ్మదాబాద్, భువనేశ్వర్-జగదల్పూర్, చెన్నై సెంట్రల్-హౌరా, హైదరాబాద్-హౌరా, చెన్నై-భువనేశ్వర్, 1226 యశ్వంత్ పూర్-హౌరా-దూరంతో, సికింద్రాబాద్-హౌరా-ఫలక్ నుమా, తిరుపతి-పూరీ, యశ్వంత్ పూర్-హౌరా, సికింద్రాబాద్-భువనేశ్వర్-విశాఖ ఎక్స్‌ప్రెస్, చెన్నై-హౌరా, వాస్కో-హౌరా, తిరుచురాపల్లి-హౌరా, బెంగళూర్-భువనేశ్వర్, ముంబై-భువనేశ్వర్, విశాఖ-కొర్బా, విశాఖ-రాయగఢ్, గుంటూరు-రాయగఢ్, జగడల్ పూర్-భువనేశ్వర్, జునాఘర్ రోడ్-భువనేశ్వర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం రోజు రద్దు అయిన రైళ్లు ►భువనేశ్వర్-ప్రశాంతి నిలయం, హాతియా-బెంగుళూరు, భువనేశ్వర్-విశాఖ, భువనేశ్వర్-సికింద్రాబాద్, గుణపూర్-పూరీ, విశాఖ – నిజాముద్దీన్- సమత ఎక్స్ ప్రెస్, విశాఖ-కిరండోల్ రైళ్లను రద్దు చేశారు. మొత్తంగా 95 రైళ్లను రద్దు చేసినట్టు తూర్పు కోస్తా రైల్వే అధికారులు ప్రకటించారు. -
AP: గులాబ్ తుపాన్‌తో పలు రైళ్లు రద్దు
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ‘గులాబ్ తుపాన్’ కొనసాగుతోంది. గోపాలపూర్‌కు 310కిలో మీటర్లు, కళింగపట్నానికి 380 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. సాయంత్రానికి కళింగపట్నం-గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ‘గులాబ్’ తుపాను నేపథ్యంలో పలు రైళ్లు రద్దయ్యాయి. పలు రైళ్ల రాకపోకలు మల్లింపు, కొన్ని రైళ్లను రద్దు చేసిన తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. 08463 భువనేశ్వర్-కే.ఎస్.ఆర్ బెంగళూరు స్పెషల్ ట్రైన్, 02845 భువనేశ్వర్- యస్వంత్ పూర్ స్పెషల్ ట్రైన్‌ను రద్దు చేసినట్లు పేర్కొంది. -
ఆదాయం, ప్రయాణికులు లేరని రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణాలను విరమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రైళ్లకు ప్రయాణికుల తాకిడి తక్కువగా ఉంది. ఆదాయం, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా లేని ప్రాంతాల్లో రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. పది రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ రద్దు తాత్కాలికం మాత్రమేనని గుర్తుచేసింది. ఏప్రిల్ 28 నుంచి మే 31వ తేదీ వరకు ఆ రైళ్లు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే రైళ్లు రద్దు చేసినట్లు తెలుస్తోంది. రద్దు చేసిన రైళ్లు.. నర్సాపూర్-నిడదవోలు నిడదవోలు- నర్సాపూర్ సికింద్రాబాద్- బీదర్ బీదర్ - సికింద్రాబాద్ సికింద్రాబాద్- కర్నూలుసిటీ కర్నూల్ సిటీ- సికింద్రాబాద్ మైసూర్- రేణిగుంట రేణిగుంట- మైసూర్ సికింద్రాబాద్ - ముంబై ఎల్టీటీ ముంబై ఎల్టీటీ- సికింద్రాబాద్ చదవండి: కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు చదవండి: మాస్క్ లేదని చితక్కొట్టిన ఆర్టీసీ బస్ డ్రైవర్ -
రైలు ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: రైలు ప్రయాణికులకు మరోసారి నిరాశ ఎదురయింది. మే 3 తర్వాత స్వస్థలాలకు వెళ్లాలని భావిస్తున్న ప్రయాణికుల ఆశలపై రైల్వే శాఖ నీళ్లు చల్లింది. ప్రయాణికుల రైళ్లు, సబర్బన్ రైళ్ల రద్దును మే 17 వరకు కొనసాగించనున్నట్టు దక్షిణమధ్య రైల్వే శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించడంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పార్శిల్, రవాణా రైళ్లుయథాతథంగా నడుస్తున్నాయని దక్షిణమధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సీహెచ్ రాకేష్ స్పష్టం చేశారు. (స్పెషల్ ట్రైన్ ఎక్కాలంటే.. ఇవి పాటించాలి) టిక్కెట్ల కోసం రైల్వే స్టేషన్లకు రావొద్దు లాక్‌డౌన్‌తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు, తీర్థయాత్రికులు, ఇతర వ్యక్తులను శ్రామిక్ ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల అభీష్టం మేరకు, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు లోబడి శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు తెలిపింది. ఈ రైళ్లలో ప్రయాణం చేయదలచిన వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి, నమోదు చేసుకున్న వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతించే ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించింది. ‘వ్యక్తులకు టికెట్లు జారీ చేయడం వీలు పడదు. బృందాలకు కూడా టిక్కెట్లు ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి టిక్కెట్ల కోసం ఎవరూ నేరుగా రైల్వే స్టేషన్లకు రావొద్ద’ని దక్షిణమధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది. (విమాన ప్రయాణాల్లో భారీ మార్పులు) -
కరోనా.. కేంద్రం మరో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : కరోనా వైరస్ పాజిటివ్ కోసుల సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31వరకు అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. గూడ్స్ రైళ్లను యథావిథిగా నడపనున్నట్టు తెలిపింది. ఇప్పటికే ప్రారంభమైన రైళ్లు మాత్రం గమ్యస్థానాలకు చేరుకునే వరకు అనుమతించినట్టు పేర్కొంది. అయితే కొన్ని సబ్అర్బన్, కోల్కత్తా మెట్రో రైలు సర్వీసులు మాత్రం మార్చి 22 అర్ధరాత్రి వరకు కొనసాగుతాయని ప్రకటించింది. ఆ తర్వాత వాటిని కూడా మార్చి 31 వరకు నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఇప్పటికే జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం రోజున దాదాపు 3,700 సర్వీసులను రైల్వే శాఖ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 341గా నమోదు కాగా, మృతుల సంఖ్య 6 కి చేరింది. మరోవైపు ప్రధాని పిలుపు మేరకు చేపట్టిన జనతా కర్ఫ్యూకు విశేషమైన స్పందన లభిస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ప్రధాన నగరాలన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. -
కరోనా ఎఫెక్ట్: రైళ్లు రద్దు
-
కోవిడ్ నేపథ్యంలో పలు రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ముందస్తుగా పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారం ప్రకటించింది. ఈనెల 22 నుంచి వచ్చే నెల 20 వరకు పలు రైళ్లను రద్దు చేసింది. అత్యవసరం కాని ప్రయాణాలను నిరోధించే క్రమంలో భాగంగా యూటీఎస్, పీఆర్ఎస్ టిక్కెట్లకు వర్తించే రాయితీలను అన్ని కేటగిరీల్లో విద్యార్థులు, 4 కేటగిరీల దివ్యాంగులు, 11 కేటగిరీలకు చెందిన రోగులకు మినహా, మిగతా కేటగిరీల్లోని ప్రయాణికులకు మార్చి 20 నుంచి తదుపరి సూచనలు వచ్చేంత వరకు తాత్కాలికంగా రద్దు చేసింది. ఇప్పటికే రద్దు చేయబడిన రైళ్లలో రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులకు పూర్తి రీఫండ్ చేస్తామని ప్రకటించింది. -
కరోనా ఎఫెక్ట్ : 168 రైళ్లు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిపై ఆందోళనతో ప్రజలు ప్రయాణాలకు దూరంగా ఉండటంతో రవాణా రంగంపై పెను ప్రభావం చూపుతోంది. పలు రైళ్లలో ప్రయాణీకుల సంఖ్య నామమాత్రంగా ఉండటంతో భారతీయ రైల్వేలు ఈనెల 20 నుంచి 31 వరకూ 168 రైళ్లను రద్దు చేశాయి. ఇక రద్దయిన రైళ్లలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులందరికీ ఈ సమాచారం వ్యక్తిగతంగా చేరవేశామని అధికారులు పేర్కొన్నారు. ఇక వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముందు జాగ్రత్త చర్యగా రైల్వే స్టేషన్లలో జనసమ్మర్ధాన్ని తగ్గించేందుకు పలు రైల్వే జోన్ల పరిధిలో ఫ్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచారు. మరోవైపు మహమ్మారి వైరస్‌ను అడ్డుకునేందుకు ప్రజలు సామాజిక దూరం పాటించాలని, సమూహాల్లో కలవకుండా ఉండాలని అత్యవసరమైతే మినహా ప్రయాణాలు చేయరాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య నిపుణులు ప్రజలకు సూచిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి : ‘ఈ సంక్షోభం చాలా పెద్దది’ -
రైళ్ల రద్దు.. దారి మళ్లింపు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): ఆయా డివిజన్ పరిధిలో జరుగుతున్న ఆధునికీకరణ పనుల నిమిత్తం ఆయా మార్గాల్లో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసి, మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం జి.సునీల్‌కుమార్ తెలిపారు. బెంగళూరు డివిజన్లో జరుగుతున్న సాంకేతిక పనుల నిమిత్తం ఈ మార్గంలో నడిచే రైళ్లను దారి మళ్లిస్తున్నారు. ► యశ్వంత్‌పూర్‌లో ఈ నెల 25న బయల్దేరే యశ్వంత్‌పూర్–హౌరా(12246) దురంతో ఎక్స్‌ప్రెస్ వయా ఎల్లహంక, చన్నసంద్ర, కృష్ణరాజపురం మీదుగా నడుస్తుంది. ►24న హౌరాలో బయల్దేరిన హౌరా–యశ్వంత్‌పూర్(22863) ఎక్స్‌ప్రెస్ కూడా వయా కృష్ణరాజపురం, చన్నసంద్ర, ఎల్లహంక మీదుగా నడుస్తుంది. ►పూరీలో మార్చి 6న బయల్దేరే పూరీ–యశ్వంత్‌పూర్(22883) ఎక్స్‌ప్రెస్ వయా నంద్యాల, యర్రగుంట్ల, రేణిగుంట, మెల్పక్కం, జాలర్‌పేటల మీదుగా నడుస్తుంది. గమ్యం కుదించిన రైళ్లు ►మార్చి 4 నుంచి 25వ తేదీ వరకు సంబల్పూర్లో బయల్దేరే సంబల్పూర్–బాన్స్‌వాడి(08301)స్పెషల్ ఎక్స్‌ప్రెస్ కృష్ణరాజపురం వరకే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో(08302) ఎక్స్‌ప్రెస్ మార్చి 5 నుంచి 26వ తేదీ వరకు బాన్స్‌వాడి నుంచి కాకుండా కృష్ణరాజపురం నుంచి బయల్దేరుతుంది. ఈ తేదీలలో కృష్ణరాజపురం–బాన్స్‌వాడి మధ్య ఈ రైళ్ల రాకపోకలు ఉండవు. దానాపూర్ డివిజన్లో జరుగుతున్న భద్రతా పనుల నిమిత్తం ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నారు. ►ఎర్నాకుళంలో బయల్దేరే ఎర్నాకుళం–పాట్నా(22643) ఎక్స్‌ప్రెస్ మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు వయా అద్రా, నేతాజీ సుభాష్ చంద్రబోస్, గోమో, గయ మీదుగా ప్రయాణిస్తుంది. తిరుగు ప్రయాణంలో పాటా్నలో(22644) ఎక్స్‌ప్రెస్ మార్చి 19 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు వయా గయా, నేతాజీ సుభాస్‌చంద్రబోస్, గోమో, అద్రా మీదుగా నడిస్తుంది. సోమవారం ఎల్టీటీ రద్దు సెంట్రల్ రైల్వే పరిధిలో జరుగుతున్న ఆధునికీకరణ పనుల్లో భాగంగా విశాఖపట్నం–లోకమాన్యతిలక్ టెరి్మనస్–విశాఖపట్నం(18519/18520) మధ్య నడిచే ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ ఇటీవల గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తోంది. ఆదివారం విశాఖకు రావలసిన ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ ఆలస్యంగా చేరుకుంది. విశాఖలో రాత్రి 11.25 గంటలకు బయల్దేరవలసిన విశాఖపట్నం–లోకమాన్యతిలక్ టెరి్మనస్(ఎల్టీటీ) ఎక్స్‌ప్రెస్ సోమవారం సాయంత్రం 6.30 గంటలకు విశాఖ నుంచి బయల్దేరింది. అటు నుంచి రావలసిన మరో రైలు 10 గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా నడుస్తున్నందున సోమవారం రాత్రి 11.25 గంటలకు బయల్దేరవలసిన ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. -
విజయవాడ మీదుగా వెళ్లే 24 రైళ్ల రద్దు
సాక్షి, అమరావతి బ్యూరో: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగుతున్న అల్లర్లతో రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. ఆదివారం సాయంత్రానికి అసోంలోని వివిధ ప్రధాన స్టేషన్లతో పాటు హౌరా నుంచి విజయవాడ మీదుగా వెళ్లే 24 రైళ్లు రద్దయ్యాయి. ఆదివారం నాటికి రద్దయిన రైళ్ల వివరాలు నంబర్ 12840 (చెన్నై–హౌరా), 12842 (చెన్నై–హౌరా), 12864 (యశ్వంత్‌పూర్–హౌరా), 20889 (హౌరా–తిరుపతి), 22877 (హౌరా–ఎర్నాకుళం), 12841 (హౌరా–చెన్నై), 12245 (హౌరా–యశ్వంత్‌పూర్), 18645 (హౌరా–హైదరాబాద్), 20890 (తిరుపతి–హౌరా హమ్‌సఫర్), 22878 (ఎర్నాకుళం–హౌరా), 12246 (యశ్వంత్‌పూర్–హౌరా), 18646 (హైదరాబాద్–హౌర్టా), 22852 (మంగుళూరు–సంత్రగచ్చి), 12513 (సికింద్రాబాద్–గౌహతి), 22502 (న్యూ తీన్సుకియా–బెంగళూరు), 06010 పాండిచ్చేరి–సంత్రగచ్చి, 18048 (వాస్కోడిగామా–హౌరా), 22812 (మైసూర్–హౌరా) ఎక్స్‌ప్రెస్‌లున్నాయి. అలాగే 12666 (కన్యాకుమారి–హౌరా), 12253 (యశ్వంత్‌పూర్–భాగల్పూర్), 02842 (చెన్నై–సంత్రగచ్చి స్పెషల్), 12704 (సికింద్రాబాద్–హౌరా) ఎక్స్‌ప్రెస్ రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. దారి మళ్లించిన రైళ్లలో 22641 (త్రివేండ్రం–షాలిమార్), 22832 సత్యసాయి ప్రశాంతి నిలయం–హౌరా ఎక్స్‌ప్రెస్, 12863 (హౌరా–యశ్వంత్‌పూర్) ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ రైల్వేస్టేషన్లో ప్రత్యేక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. -
కాచిగూడ వద్ద ప్రమాదం.. పలు రైళ్ల రద్దు
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైల్వేస్టేషన్లో ఎంఎంటీఎస్ రైలు, హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న ప్రమాద ఘటన నేపథ్యంలో సోమవారం కాచిగూడ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశారు. 12 ఎంఎంటీఎస్ రైళ్లు, 16 ప్యాసింజర్ రైళ్లు, మరో 3 ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. అలాగే 38 రైళ్లు పాక్షికంగా రద్దు కాగా, మరో 7 రైళ్లను వివిధ మార్గాల్లో మళ్లించారు. 6 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఎంఎంటీఎస్ రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వరకూ రాకపోకలు సాగించే ఎంఎంటీఎస్ సర్వీసులు సికింద్రాబాద్ వరకే పరిమితమయ్యాయి. నాంపల్లి నుంచి ఫలక్‌నుమా మధ్య సర్వీసులు కూడా నిలిచిపోయాయి. కొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. రద్దయిన రైళ్లు.. కాచిగూడ–చెంగల్పట్టు (17652), కాచిగూడ–టాటానగర్ (07438/07439), కాచిగూడ–చిత్తూరు (12797/12798) ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. కాచిగూడ–గుంటూరు ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నుమా–ఉందానగర్, ఉందానగర్–సికింద్రాబాద్, కాచిగూడ–కర్నూల్ సిటీ, మహబూబ్‌నగర్–మీర్జాపల్లి, మహబూబ్‌నగర్–కాచిగూడ రైళ్లు రద్దయ్యాయి. షోలాపూర్–ఫలక్‌నుమా (57659) రైలును సనత్‌నగర్ వరకే పరిమితం చేశారు. బోధన్–మహబూబ్‌నగర్ ప్యాసింజర్ రైలు మల్కాజిగిరి వరకే పరిమితమైంది. మల్కాజిగిరి–మహబూబ్‌నగర్ మధ్య నడిచే రైలును రద్దు చేశారు. మిర్యాలగూడ–కాచిగూడ ప్యాసింజర్ రైలు ను సీతాఫల్మండి వద్ద నిలిపివేశారు. కాచిగూడ నుంచి మిర్యాలగూడ వెళ్లవలసిన రైలును సీతాఫల్మండి నుంచి నడిపారు. బోధన్–మహబూబ్‌నగర్, నిజామాబాద్–కాచిగూడ రైళ్లను మల్కాజిగిరి వరకు పరిమితం చేశారు. వికారాబాద్–కాచిగూడ రైలు సికింద్రాబాద్ వరకు పరిమితమైంది. మేడ్చల్–కాచిగూడ రైలును బొల్లారం వరకే నడిపారు. నడికుడి–కాచిగూడ రైలు మల్కాజిగిరి వరకు నడిపారు. పలు రైళ్ల దారి మళ్లింపు.. అమరావతి–తిరుపతి బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ (12766)ను బొల్లారం–సికింద్రాబాద్–గుంతకల్–గుత్తి మీదుగా మళ్లించారు. కాచిగూ డ–చెంగల్పట్టు (17652) ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్–రాయ్‌చూర్–గుంతకల్–గుత్తి మీదుగా మళ్లించారు. కోయంబత్తూర్–హజ్రత్ నిజాముద్దీన్ (12647) ఎక్స్‌ప్రెస్‌ను డోన్–గుంతకల్–సికింద్రాబాద్ మార్గంలో మళ్లించారు. నాగర్సోల్–చెన్నై (16004) ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్, రాయచూర్, గుంతకల్ మీదుగా మళ్లించారు. కాచిగూడ–రేపల్లె (17625) రైలు సోమవారం రాత్రి 10.10కి బయలుదేరవలసి ఉండగా దీనిని అర్ధరాత్రి 12.30కి మార్చారు. -
ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు
-
ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు
సాక్షి, ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంపై వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపాడు. నగర శివారు ప్రాంతాల్లో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో నగర జీవనం అస్తవస్థంగా మారింది. వర్షం, వరద నీటితో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 24 గంటల్లో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. మరోవైపు రైళ్ల రాకపోకలతో పాటు రోడ్డు రవాణాపై కూడా తీవ్ర ప్రభావం పడింది. విమానాశ్రయ పరిసరాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక ముంబై నుంచి బయల్దేరవలసిన అనేక రైళ్లు రద్దు చేయగా, పుణెలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోనావాలాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ సందర్భంగా సెంట్రల్ రైల్వే సీపీఆర్వో సునీల్ ఉదేశీ మాట్లాడుతూ... గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో నడిచే రెండు రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు. ఓ రైలును మరో మార్గంలోకి మళ్లించగా, మరో రెండు రైళ్ల రాకపోకలను రీ షెడ్యూల్ చేసినట్లు వెల్లడించారు. -
‘ఫొని’ తుపాను ఎఫెక్ట్; 81 రైళ్ల రద్దు
సాక్షి, విశాఖపట్నం: ‘ఫొని’ తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న వాతావారణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో 81 రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. రెండు రైళ్లను దారి మళ్లించినట్టు వెల్లడించింది. రేపటి నుంచి భద్రక్ -విజయనగరం మధ్య రైలు సర్వీసులు నిలిపివేస్తున్నట్టు తెలిపింది. భువనేశ్వర్ - పూరీ రైళ్ల సర్వీసులపై రేపు రాత్రి నుంచి ఆంక్షలు విధిస్తున్నట్టు వెల్లడించింది. మే 3న పూరీ, భువనేశ్వర్ నుంచి నడిచే అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రయాణికులకు టిక్కెట్ డబ్బులు తిరిగి ఇవ్వనున్నట్టు తెలిపింది. విజయనగరం జిల్లాలో అప్రమత్తం ప్రచంఢంగా తీరం వైపు దూసుకొస్తున్న ఫోని తుపాను ప్రభావంతో జిల్లాలో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ అన్నారు. అత్యంత తీవ్రమైన తుపాను కావడంతో విస్తారమైన వర్షాలు భారీగా ఈదురు గాలుల నేపధ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. ప్రధానంగా తీరప్రాంత గ్రామాల్లో మంచినీరు, విద్యుత్తు సరఫరా వంటి సహాయ చర్యలకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది సహకారంతో వెంటనే సహాయ పునరావాస చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జాతీయ రహదారులతో పాటు రోడ్డు మార్గంలో ఎక్కడ అవాంతరాలు ఏర్పడ్డా వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనడానికి జిల్లా పోలీసులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. -
రైలు పట్టాలపైనే టెంట్ వేసి ఆందోళన
ఢిల్లీ/రాజస్థాన్ : రిజర్వేషన్ల కోసం గుజ్జర్ల ఆందోళన రైల్వే వ్యవస్థపై ప్రభావం చూపింది. గుజ్జర్ల ఆందోళన నేపథ్యంలో 15 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేయగా, మరో అయిదు రైళ్లను దారి మళ్లించింది. రాజస్థాన్ ప్రభుత్వం అయిదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ గుజ్జర్లు రైలు పట్టాలపై టెంట్లు వేసి నిరసన తెలుపుతున్నారు. విద్యా, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ గుజ్జర్లు నిన్నటి నుంచి సవాయి మాదోపూర్ జిల్లాలో మలర్నా దుంగార్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌లపై టెంట్లు వేసుకుని ధర్నాకు దిగారు. దీంతో వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో కొన్ని రైళ్లు రద్దు కాగా, మరికొన్ని రద్దు అయ్యాయి. ఐదు శాతం రిజర్వేషన్ కోసం తాము చాలా కాలంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తాము తిరిగి ఆందోళన చేపట్టామని, తమ కోటాను ప్రభుత్వం ఎలాగైనా ఇచ్చి తీరాల్సిందేనని గుజ్జర్ల నేత కిరోరి సింగ్ భైంస్లా స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం గుజ్జర్లు సహా గొదియా లొహర్, బంజారా, రైకా, గదారియా కులాల వారికి 50 శాతం కోటాలోనే అత్యంత వెనుకబడిన వర్గాల కింద ప్రత్యేకంగా ఒక శాతం రిజర్వేషన్ అమలవుతోంది. అయితే తమ కులాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్ధల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ గుజ్జర్లు జనవరిలో రాజస్ధాన్ సర్కార్‌కు ఇరవై రోజుల గడువిస్తూ అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వానికి ఇచ్చిన డెడ్‌లైన్ ముగియడంతో సవాయి మధోపూర్ జిల్లాలో గుజ్జర్లు ఆందోళన బాట పట్టారు. -
పెథాయ్ ఎఫెక్ట్: ఏపీలో పలు రైళ్లు రద్దు
సాక్షి, అమరావతి: ఏపీకి పెథాయ్ తీవ్ర తుపాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్) అప్రమత్తమైంది. ఏపీలో రాకపోకలు సాగించే పలు ప్యాసింజర్ రైళ్లను సోమవారం రద్దు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా తుపాన్‌పై అప్రమత్తంగా ఉండాలని ఎస్సీఆర్ జీఎం వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. రైలు పట్టాల వెంబడి నిరంతరం గస్తీని కొనసాగించాలన్నారు. అలాగే గుంటూరు, విజయవాడల్లో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. మరోవైపు తీవ్ర తుపాన్‌గా మారిన పెథాయ్ శరవేగంగా దూసుకొస్తుంది. కాకినాడకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాన్ తూర్పు గోదావరి జిల్లా వైపు వేగంగా కదులుతుంది. పెథాయ్ సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తుని, యానాం లమధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాన్ తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. తుపాన్ ప్రభావంతో తూర్పుగోదారి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. వర్షాలకు ఇప్పటికే పలు జిల్లాలో పంట నీట మునిగింది. సోమవారం రద్దైన రైళ్ల వివరాలు.. 1. ట్రైన్ నెం. 67300, విజయవాడ-రాజమండ్రి, మెము ప్యాసింజర్ 2. ట్రైన్ నెం. 67295, రాజమండ్రి-విశాఖపట్నం, మెము ప్యాసింజర్ 3. ట్రైన్ నెం. 67244, విశాఖపట్నం-కాకినాడ పోర్టు, మెము ప్యాసింజర్ 4. ట్రైన్ నెం. 67242, కాకినాడ పోర్టు-విజయవాడ, మెము ప్యాసింజర్ 5. ట్రైన్ నెం. 67221, విజయవాడ-తెనాలి, మెము ప్యాసింజర్ 6. ట్రైన్ నెం. 67222, తెనాలి-గుంటూరు, మెము ప్యాసింజర్ 7. ట్రైన్ నెం. 67225, గుంటూరు-తెనాలి, మెము ప్యాసింజర్ 8. ట్రైన్ నెం. 67226, తెనాలి-విజయవాడ, మెము ప్యాసింజర్ 9. ట్రైన్ నెం. 67227, విజయవాడ-తెనాలి, మెము ప్యాసింజర్ 10. ట్రైన్ నెం. 67228, తెనాలి-గుంటూరు, మెము ప్యాసింజర్ 11. ట్రైన్ నెం. 67296, విశాఖపట్నం-రాజమండ్రి, మెము ప్యాసింజర్ 12. ట్రైన్ నెం. 67241, విజయవాడ-కాకినాడ పోర్ట్, మెము ప్యాసింజర్ 13. ట్రైన్ నెం. 77242, రాజమండ్రి-భీమవరం, డెము ప్యాసింజర్ 14. ట్రైన్ నెం. 77237, భీమవరం-రాజమండ్రి, డెము ప్యాసింజర్ 15. ట్రైన్ నెం. 77238, రాజమండ్రి-భీమవరం, డెము ప్యాసింజర్ 16. ట్రైన్ నెం. 77231, భీమవరం-నిడదవోలు, డెము ప్యాసింజర్ 17. ట్రైన్ నెం. 77240, నిడదవోలు-భీమవరం, డెము ప్యాసింజర్ 18. ట్రైన్ నెం. 77206, భీమవరం-విజయవాడ, డెము ప్యాసింజర్ 19. ట్రైన్ నెం. 77294, రాజమండ్రి-నర్సాపూర్, డెము ప్యాసింజర్ 20. ట్రైన్ నెం. 77295, నర్సాపూర్-గుంటూరు, డెము ప్యాసింజర్ 21. ట్రైన్ నెం. 77230, గుంటూరు-విజయవాడ, డెము ప్యాసింజర్ 22. ట్రైన్ నెం. 77269, విజయవాడ-మచిలీపట్నం, డెము ప్యాసింజర్ చదవండి: ప్రజలు తస్మాత్ జాగ్రత్త: ఆర్టీజీఎస్ హెచ్చరికలు అవనిగడ్డలో ఆకలి కేకలు తరుముకొస్తున్న పెథాయ్ -
నేడు 149 రైళ్లు రద్దు
సాక్షి, ముంబై: భారతీయ రైల్వే భారీసంఖ్యలో రైళ్లను రద్దు చేసింది. రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన( ఐఆర్సీటీసీ) రద్దు చేసిన రైళ్ల జాబితాను ప్రకటించింది. అక్టోబర్ 4 న వివిధ రకాల కారణాల రీత్యా 149 రైళ్లను రద్దు చేసింది. దీనికి సంబంధించి సమాచారాన్ని రైల్వేలు ప్రయాణీకులకు ఎస్ఎంఎస్ ద్వారా అందించింది. అయినప్పటికీ రద్దైన లేదా ఆలస్యమవుతున్న రైళ్ల వివరాలను తనిఖీ చేసుకొని, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రద్దయిన రైళ్ల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, నిర్వహణాపనుల కారణంగా పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం పట్నా నుంచి బయలుదేరిన పట్నా– ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశామన్నారు. నిర్వహణాపనుల వల్ల విజయవాడ–మచిలీపట్నం ప్యాసింజర్ ఈనెల 20 నుంచి 31 వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 21 నుంచి సెప్టెంబరు 1 వరకు మచిలీపట్నం– విజయవాడ ప్యాసింజర్ రైలును మచిలీపట్నం– గుడివాడ పరిధిలో రద్దు చేశామన్నారు. మరోవైపు మచిలీపట్నం నుంచి ఉదయం 2.55కు వెళ్లే మచిలీపట్నం– విజయవాడ ప్యాసింజర్ ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 1 వరకు ఉదయం 3.25కి బయలుదేరనుందని వివరించారు. -
‘ప్రయాణం’పై వర్షం దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: కేరళ, ఇతర ప్రాంతాల్లోని వరదలు, భారీ వర్షాల ప్రభావం ఇంకా తగ్గలేదు. ఫలితంగా ఈ ప్రభావం నగరం నుంచి కేరళకు వెళ్లే.. వివిధ రైళ్లు, విమాన సర్వీసులపై పడింది. శుక్రవారం కూడా పలు రైళ్లు, విమానాలు రద్దయ్యాయి. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, ఇంకొన్నింటిని దారి మళ్లించారు. పాక్షికంగా రద్దయిన రైళ్లివే.. సేలం– త్రివేండ్రం రాకపోకలకు అంతరాయం కలగడంతో హైదరాబాద్–త్రివేండ్రం సెంట్రల్ శబరి ఎక్స్‌ప్రెస్‌ను సేలం వరకు పరిమితం చేశారు. కోయంబత్తూరు– ఎర్నాకుళం మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో పట్నా–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లను కొయంబత్తూరు వరకు పరిమితం చేశారు.తిరువనంతపురం– పాలక్కడ్ల మధ్య వరదల కారణంగా హైదరాబాద్ నుంచి శుక్రవారం బయల్దేరాల్సిన హైదరాబాద్– త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్‌ను తిరుపతి వరకే పరిమితం చేశారు.మంగళూరు–కాచిగూడ మెయిల్ ఎక్స్‌ప్రెస్‌ను శనివారం తాత్కాలికంగా రద్దు చేశారు.కొల్లాం– విశాఖ మెయిల్ ఎక్స్‌ప్రెస్‌ను కొల్లాం–కోయంబత్తూరు మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు.బనస్వాడి– సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్ (ఈస్ట్‌కోస్ట్ రైల్వే) శుక్రవారం తాత్కాలికంగా రద్దు చేశారు. వీటిని దారి మళ్లించారు.. ముంబై సీఎస్ఎంటీ – కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ– త్రివేండ్రం సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, కొబ్రా– త్రివేండ్రం సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, త్రివేండ్రం సెంట్రల్ – న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్, కన్యాకుమారి– ముంబై సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్‌లను ఈరోడ్, దిండిగల్, మదురై, తిరునల్వేలి, నాగర్‌కోయిల్‌టౌన్, త్రివేండ్రం సెంట్రల్ మీదుగా దారి మళ్లించారు.శ్రీగంగానగర్ –హజుర్ సాహిబ్ ఎక్స్‌ప్రెస్ నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను(ఈస్ట్‌కోస్ట్ రైల్వే) శనివారం కొదియార్, చండ్లోడియా, సబర్మతీ మీదుగా దారి మళ్లించారు. సమయ వేళల్లో మార్పులు.. లోకమాన్య తిలక్ – కోయంబత్తూరు ఎక్స్‌ప్రెస్ (ఈస్ట్‌కోస్ట్ రైల్వే) శుక్రవారం 1.10 గంటలు ఆలస్యంగా బయల్దేరింది. వాతావరణ మార్పుల కారణంగా ఈ మార్పులు జరిగాయని, అసౌకర్యానికి చింతిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. కొచ్చికి రద్దయిన విమానాలు..! కేరళలో కొచ్చి ఎయిర్‌పోర్టు రన్‌వే పూర్తిగా మునిగిపోవడంతో పలు విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి కొచ్చికి వెళ్లాల్సిన 4 విమానాలు నేడు కూడా రద్దయ్యాయి. వరుసగా రెండోరోజూ కొచ్చి వెళ్లాల్సిన విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కొచ్చి విమానాశ్రయంలో రన్‌వే శనివారం మధ్యాహ్నం తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశముందని సమాచారం. -
రైళ్ల రద్దుతో ప్రయాణికుల అవస్థలు
మంచిర్యాలక్రైం: కాజీపేట బల్లార్షాల మధ్య రైల్వేలైన్ల మరమ్మతు కారణంగా మంగళవారం, బుధవారం పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ సమాచారం ప్రయాణికులకు తెలియకపోవడంతో మంచిర్యాల రైల్వేస్టేషన్‌కు మంగళవారం వచ్చిన వారంతా ఇబ్బందులుపడ్డారు. రైళ్ల రద్దు దృష్ట్యా ఆర్టీసీ అధికారులు హైదరాబాద్, వరంగల్ ప్రయాణికులకోసం అదనపు బస్సులు నడపకపోవడంపై జనం మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్, కాజిపేట, వరంగల్ వెళ్లాల్సిన ప్రయాణికులు రైల్వేస్టేషన్ వరకు వచ్చి నానాతంటాలుపడ్డారు. నాగ్‌పూర్ వెళ్లాల్సిన ప్రయాణికులు స్టేషన్లోనే హోటళ్ల నుంచి భోజనం తెప్పించుకొని వేచి ఉండాల్సి వచ్చింది. రద్దయిన రైళ్లు... కాజిపేట్, బల్లార్షాల మధ్య చేపట్టిన రైల్వేలైన్ల మరమ్మతులో భాగంగా మంగళ, బుధవారం రెండురోజులపాటు కాజీపేట నుంచి బల్లార్షాలమధ్య నడిచే రామగిరి ప్యాసింజర్‌ను రద్దుచేశారు. భద్రాచలంరోడ్డు, బల్లార్షా మధ్య నడిచే సింగరేణి ప్యాసింజర్‌ను, భద్రాచలం రోడ్డు నుంచి వరంగల్ మధ్య నడుపుతున్నారు. కాగజ్‌నగర్ నుంచి హైదరాబాద్ మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాజీపేట వరకే నడుపుతున్నారు. కాజీపేట నుంచి నాగ్‌పూర్ మధ్య నడిచే అజ్నీ నాగ్‌పూర్ ప్యాసింజర్‌ను రామగుండం వరకే నడిపిస్తున్నారు. మంచిర్యాల నుంచి రైలు ప్రయాణం చేసే ప్రయాణికులకు రెండురోజులపాటు ఇంటర్సిటీ, భాగ్యనగర్, రామగిరి, సింగరేణి, నాగ్‌పూర్ అజ్నీ ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు. ఒకేఒక్క రైలు... కాగజ్‌నగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే ఒకేఒక్క కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ ఉండడంతో హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులందరూ సాయంత్రం వర కు బిక్కుబిక్కుమంటూ స్టేషన్లో పడిగాపులు కా యాల్సి వచ్చింది. నాగ్‌పూర్ వైపు, హైదరాబాద్ వైపు వెళ్లే మిగతా రైళ్లు రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్, వరంగల్, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లేందుకు మంచిర్యాల రైల్వేస్టేషన్ నుంచి అనుకూలమైన రైళ్లు ప్రధానంగా రద్దుకావడంతో జిల్లాలో జన్నారం, కోటపెల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట ప్రాంతాల వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం 5గంటలకు కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రావడంతో ప్రయాణికులతో రైలు నిండింది. అన్నయ్య పెళ్లికి వెళ్లలేకపోయా.. రైళ్లు రద్దు కావడంతో అన్నయ్య పెళ్లికి వెళ్లలేకపోయా. వరంగల్‌లో మా అన్నయ్యది పెళ్లి ఉంది. మా అమ్మనాన్నలు అందరూ వెళ్లారు. నేను తమ్ముడు ఇద్దరం ఈ రోజు ఇంటర్సిటీకి వెల్దామని ఆగినం. నీల్వాయి నుంచి సుమారు 70 కిలో మీటర్ల దూరం నుంచి వచ్చాం. రైళ్లు రద్దు అయ్యాయని చె ప్పారు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు సరిపడా డబ్బు లేదు. – రవళి, నీల్వాయి -
నేటి నుంచి పలు రైళ్లు రద్దు, మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: షోలాపూర్–వాడి సెక్షన్‌లోని అక్కల్కోట్–నాగన్సూర్ రైల్వేస్టేషన్ల మధ్య చేపట్టిన డబ్లింగ్ పనుల వల్ల ఈ నెల 25 నుంచి 30 వరకు పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు, కొన్నింటిని దారి మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్ కుమార్ గురువారం తెలిపారు. హైదరాబాద్–బీజాపూర్, బొలారం–బీజాపూర్, బొలారం–హైదరాబాద్, బీజాపూర్–రాయ్‌చూర్, షోలాపూర్–గుంతకల్, గుంతకల్–గుల్బర్గా, గుంతకల్–షోలాపూర్ రైళ్లు రద్దు కానున్నాయి. యశ్వంతపూర్–షోలాపూర్ ఎక్స్‌ప్రెస్‌ను గుల్బర్గా వరకే నడుపుతారు. షోలాపూర్–ఫలక్‌నుమా ప్యాసింజర్ గుల్బర్గా నుంచి రాకపోకలు సాగిస్తుంది. దారి మళ్లించిన రైళ్లు ఇవే..: లోకమాన్యతిలక్–విశాఖపట్టణం ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్–ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–ముంబై హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–రాజ్‌కోట్ ఎక్స్ ప్రెస్, ముంబై–బెంగళూర్ ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్–ముంబై తదితర రైళ్లను పలు మార్గాల్లో దారి మళ్లించనున్నారు. -
ఢిల్లీలో పొగమంచు.. 22 రైళ్లు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. సమీప దూరంలోని వస్తువులు, వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని నడపాల్సి వస్తున్నది. అలాగే పొగమంచు కారణంగా 22 రైళ్లను రద్దు చేయగా 32 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రెండు రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. -
ఢిల్లీని కప్పేసిన మంచు దుప్పటి
న్యూఢిల్లీ: దేశ రాజధానిని దట్టమైన మంచు దుప్పటి కప్పేసింది. చీకట్లు కమ్మిన ఉదయంతో ఢిల్లీ నగర ప్రజలు మేల్కొన్నారు. పొగమంచు కారణంగా 21 రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేయగా 59 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రత 7.4 డిగ్రీలు కొనసాగుతోంది. ఉదయం 5.30 గంటలకు 500 మీటర్ల దూరంలో మాత్రమే కనిపిస్తుండగా 8.30 గంటలకు 800 మీటర్ల వరకు కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటోంది. మంగళవారం కనిష్ఠ ఉష్ణోగ్రత 8.4 కాగా గరిష్ఠ ఉష్ణోగ్రత 17.7గా ఉంది. -
ఢిల్లీ.. కూల్‌కూల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లో అతి చల్లని వాతావరణం నెలకొంది. కనిష్ట ఉష్ణోగ్రత 7.6 డిగ్రీలుగా బుధవారం నమోదైంది.ఈ సీజన్లో సగటు కనిష్ట ఉష్ణోగ్రతకంటే ఒక పాయింట్ అధికంగా ఉంది. ఉత్తర ప్రాంతంలో మంచు కారణంగా మొత్తం 18 రైళ్లను రద్దు చేయగా 6 రైళ్ల రాకపోకల వేళల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో ఈ ఉదయం 8.30 గంటలకు వాతావరణంలో తేమ 95 శాతంగా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత 23.7 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది ఈ సీజన్లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత కంటే 3 పాయింట్లు అధికం. -
డేరా హింస: పలు రైళ్లు రద్దు
న్యూఢిల్లీ: డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ అనుచరుల హింసాత్మక చర్యల నేపథ్యంలో వందలాది సంఖ్యలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. శాంతి భద్రతలకు దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ నుంచి హర్యానా, పంజాబ్ వైపు వెళ్లే 309 రైళ్లను, అలాగే, హర్యానా వైపు వెళ్లే 294 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశామని ఉత్తర రైల్వే తెలిపింది. దీంతో పాటు 58 రైళ్లను దారి మళ్లించినట్లు వివరించింది. -
భారీవర్షాలు.. పలు రైళ్లు రద్దు
రాయ్‌గడ: భారీ వర్షాలతో వరదల కారణంగా రాయ్‌గడ-తితిలాగర్ సెక్షన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఒడిశాలోని రాయగడ జిల్లాలో వరదల కారణంగా ఆదివారం ఉదయం తెరువలి-సింగాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న 585 నంబరు రైలు వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అధికారులు ట్రాక్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ కారణంగా కొన్ని రైళ్లను క్రమబద్ధీకరించి, కొన్నిటిని రద్దు చేశారు. క్రమబద్ధీకరించిన రైళ్లు: 18006 జగదల్పూర్-హౌరా సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్, 22847 విశాఖ-ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్, 12756 నాందేడ్-సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్, 57271 విజయవాడ-రాయగడ ప్యాసింజర్, 18301 సంబల్పూర్-రాయగడ ఎక్స్‌ప్రెస్, 12755 సంబల్పూర్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్, 58527 రాయ్‌పూర్-విశాఖపట్నం ప్యాసింజర్ ఉన్నాయి. రద్దయిన రైళ్లు: 18211 దుర్గ్-జగదల్పూర్ ప్యాసింజర్(దుర్గిలో ఆదివారం బయలుదేరింది), 18212 జగదల్పూర్-దుర్గ్ ఎక్స్‌ప్రెస్(సోమవారం జగదల్పూర్లో బయలుదేరాల్సి ఉంది). పాక్షికంగా రద్దు: 18301 సంబల్పూర్-రాయ్‌గడ ఎక్స్‌ప్రెస్(ఆదివారం బయలుదేరింది)ను మునిగూడ స్టేషన్ వరకు నడుపుతారు. అక్కడినుంచి 18302 నెంబరుతో రాయగడ-సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్‌గా మునిగూడ-సంబల్పూర్ మధ్య నడుపుతారు. 18301/18302 సంబల్పూర్-రాయగడ-సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్‌ను మునిగూడ-రాయగడ స్టేషన్ల మధ్య రాకపోకలను రద్దు చేశారు. 58527 రాయ్‌పూర్-విశాఖపట్నం ప్యాసింజర్(ఇప్పటికే బయల్దేరింది)ను తితాల్‌గర్ వద్ద పాక్షికంగా రద్దు చేశారు. 18005 హౌరా-జగదల్పూర్ సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్ (నిన్ననే హౌరానుంచి బయల్దేరింది)ను రాయగడ వరకు నడుపుతారు. అక్కడినుంచి 18006 నెంబరుతో జగదల్పూర్-హౌరా సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌గా తితాల్‌గర్-హౌరా మధ్య నడిపిస్తారు. 18006 నెంబరు హౌరా-సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్(జగదల్పూర్లో ఈరోజు బయల్దేరింది) రాయగడ వరకు నడుస్తుంది. అక్కడినుంచి 18005 నెంబరు హౌరా-జగదల్పూర్ సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌గా రాయగడ నుంచి జగదల్పూర్ వరకు నడుపుతారు. 18005/18006 హౌరా-జగదల్పూర్ సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌ను తితాల్‌గర్-రాయగడ మధ్య రెండువైపులా ఈరోజు రద్దు చేశారు. 58301 సంబల్పూర్-కోరాపుట్ ప్యాసింజర్‌ను ఈరోజు లంజిగర్ రోడ్డు వద్ద ఆపివేస్తారు. 58302 కోరాపుట్-సంబల్పూర్ ప్యాసింజర్ (రేపు కోరాపుట్‌లో బయల్దేరాలి)ను కోరాపుట్ బదులు లంజిగర్ రోడ్డు నుంచి సంబల్పూర్ వరకు నడుపుతారు. 58301/58302 సంబల్పూర్-కోరాపుట్-సంబల్పూర్ ప్యాసింజర్ లంజిగ్ రోడ్డు, కోరాపుట్‌ల మధ్య రెండు వైపులా రద్దు చేశారు. -
రద్దయిన రైళ్ల వివరాలివీ..
కాజీపేట- బలార్షా మార్గంలోని విహిర్‌గావ్ స్టేషన్ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో కొన్ని రైళ్లను పూర్తిగాను, మరికొన్నింటిని పాక్షికంగాను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తిగా రద్దయిన రైళ్లు 12615 చెన్నై సెంట్రల్-ఢిల్లీ సరాయ్ రోహిల్లా గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ 12621 చెన్నై సెంట్రల్-ఢిల్లీ తమిళనాడు ఎక్స్ ప్రెస్ 57136 కాజీపేట-అజ్నీ పాసింజర్ 57135 అజ్నీ-కాజీపేట పాసింజర్ పాక్షికంగా రద్దయిన రైళ్లు 57121 కాజీపేట-బలార్షా రాంగిరి పాసింజర్ 57124 బలార్షా-భద్రాచలం రోడ్ పాసింజర్ 57123 భద్రాచలం-సిర్పూర్ టౌన్ సింగరేణి పాసింజర్ 57122 సిర్పూర్ టౌన్-కాజీపేట రాంగిరి పాసింజర్ -
ఆలస్యంగా నడుస్తున్న 70 రైళ్లు
న్యూఢిల్లీ: ఉత్తరాదిలో పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా పలు రైళ్ల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఏడు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. మరో 70 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే మరో 22 రైళ్లు రీషెడ్యూల్ చేసినట్లు వెల్లడించింది. రద్దు చేసిన ఏడు రైళ్లలో ఇవాళ, రేపు బయలుదేరాల్సి ఉంది. రద్దైన రైళ్లలో వారణాసి– జోధ్‌పూర్, న్యూఢిల్లీ–వారణాసి కాశీ విశ్వనాథ్, డెహ్రాడూన్–హౌరా ఉపాసన ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ– రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. అలాగే ఢిల్లీ జంక్షన్– మల్దా టౌన్ ఫరక్కా ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ– పూరీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. మరోవైపు పొగమంచు ప్రభావం విమాన సర్వీసుల మీద ప్రభావం చూపుతోంది. గత కొన్ని రోజులనుంచి పలు ఢిల్లీ రైలు సర్వీసులకు, విమాన సర్వీసులకు సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. -
పొగమంచు ఎఫెక్ట్: 69 రైళ్లు ఆలస్యం
ఢిల్లీ: దట్టమైన పొగమంచు కారణంగా పలు రైళ్ల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీకి 69 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, మరో 16 రైళ్ల వేళలలో మార్పులు చేశారు. కాగా, 4 రైళ్ల సర్వీసులను రైల్వే అధికారులు రద్దుచేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఉదయం రన్ వే సరిగా కనిపించడం లేని అధికారులు చెప్పారు. పొగమంచు కారణంగా 9 అంతర్జాతీయ, 3 డొమెస్టిక్ విమాన సర్వీసులు ఆలస్యం కానున్నాయి. ఒక అంతర్జాతీయ, రెండు డొమెస్టిక్ విమాన సర్వీసులను రద్దు చేశారు. గత కొన్ని రోజులనుంచి పలు ఢిల్లీ రైలు సర్వీసులకు, విమాన సర్వీసులకు సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. -
వార్దా ఎఫెక్ట్ : పలు రైళ్లు రద్దు
-
వార్దా ఎఫెక్ట్ : పలు రైళ్లు రద్దు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో వార్దా తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని ప్రభావంతో గూడూరు, చెన్నైల మధ్య నడిచే పలు రైళ్లను దారి మళ్లించగా, మరి కొన్నింటిని సోమవారం రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రద్దైన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ-చెన్నై, చెన్నై-విజయవాడ మధ్య నడిచే రైలు నెంబర్లు 12711,12712 రైళ్లను గూడూరు, చెన్నైకు సోమవారం తాత్కాలికంగా రద్దు చేశారు. నెల్లూరు-సుళ్లూరుపేట ల మధ్య నడిచే రైలు నెంబర్ 66030, సుళ్లూరుపేట-చెన్నైల మధ్య నడిచే రైలు నెంబర్ 66026 రైళ్లను సోమవారం పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు. విజయవాడ-చెన్నైసెంట్రల్ పినాకినీ ఎక్స్‌ప్రెస్ రైలును గూడూరు, రేణిగుంట, అరక్కోణం మీదుగా చెన్నైకు దారి మళ్లించారు. -
రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
కాన్పూర్: పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం కారణంగా ఝాన్సీ-లక్నో-కాన్పూర్ సహా పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆరు రైలు సర్వీసులను రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు. కాన్పూర్ కు సమీపంలో పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 91 మంది మృతి చెందగా,100 మందిపైగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతుండడంతో ఘటనా మార్గం గుండా వెళ్లాల్సిన రైళ్లను రద్దు చేశారు. మరి కొన్నింటిని దారి మళ్లించారు. తుండగా-కాన్పూర్ మార్గంలో మూడు... కాన్పూర్-బండా-ఝాన్సీ మార్గంలో నాలుగు... ఝాన్సీ-బండా, మాణిక్ పూర్-అలహాబాద్ మార్గంలో ఐదు రైళ్లను దారి మళ్లించారు. లక్నో-ముంబై పుష్పక్ ఎక్స్ ప్రెస్ ను కూడా మరో మార్గం గుండా నడుపుతున్నారు. రద్దు చేసిన రైలు సర్వీసులు 11109 ఝాన్సీ-లక్నో ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ 11110 లక్నో-ఝాన్సీ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ 51803 ఝాన్సీ-కాన్పూర్ పాసింజర్ 51804 కాన్పూర్- ఝాన్సీ పాసింజర్ 51813 ఝాన్సీ-లక్నో పాసింజర్ 51814 లక్నో-ఝాన్సీ పాసింజర్ -
27 వరకు పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు
సత్తెనపల్లి–పిడుగురాళ్ల మధ్య ట్రాక్ పునరుద్ధరణ పనులు విజయవాడ (రైల్వేస్టేషన్): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సత్తెనపల్లి–పిడుగురాళ్ల మధ్య రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో ట్రాక్ పునురుద్ధరణ పనుల దృష్ట్యా పలు రైళ్లను ఈ నెల 25, 26, 27వ తేదీల్లో రద్దు చేస్తున్నట్లు విజయవాడ డివిజన్ ఇన్చార్జ్ పీఆర్వో జేవీఆర్కే రాజశేఖర్ శనివారం తెలిపారు. రైలు నంబరు 12795 విజయవాడ–సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ (26, 27వ తేదీల్లో రద్దు), 12796 సికింద్రాబాద్–విజయవాడ ఎక్స్‌ప్రెస్ (26, 27వ తేదీల్లో రద్దు), 12747 గుంటూరు–వికారాబాద్ (25, 26, 27వ తేదీల్లో రద్దు), 12478 వికారాబాద్–గుంటూరు (25, 26, 27వ తేదీల్లో రద్దు), రైలు నంబరు 07757 సికింద్రాబాద్–వికారాబాద్ ప్రత్యేక రైలు (25వ తేదీ రద్దు), 07758 వికారాబాద్–సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (25వ తేదీ రద్దు), 77676 మిర్యాలగూడ–పిడుగురాళ్ల ప్యాసింజర్ (25, 26, 27వ తేదీల్లో రద్దు), 77677 పిడుగురాళ్ల–మిర్యాలగూడ ప్యాసింజర్ (25, 26, 27వ తేదీల్లో రద్దు), రైలు నంబరు 22118 (27వ తేదీ రద్దు), కాచిగూడ–గుంటూరు (నంబరు 22117) డబుల్ డెక్కర్ రైలు 27వ తేదీ రద్దు), గుంటూరు–కాచిగూడ డబుల్ డెక్కర్, రైలు నంబరు 57318 మాచర్ల–భీమవరం ప్యాసింజర్ (25, 26, 27వ తేదీల్లో రద్దు), రైలు నంబరు 57317 గుంటూరు–మాచర్ల (25, 26, 27వ తేదీల్లో రద్దు), రైలు నంబరు 57324 మాచర్ల–నడికుడి ప్యాసింజర్ (24, 25, 26, 27వ తేదీల్లో రద్దు), రైలు నంబరు 57323 నడికుడి–మాచర్ల ప్యాసింజర్ (25, 26, 27 తేదీల్లో రద్దు), రైలు నంబరు 57320 మాచర్ల–గుంటూరు ప్యాసింజర్ (25, 26, 27వ తేదీల్లో రద్దు), రైలు నంబరు 57319 గుంటూరు–మాచర్ల ప్యాసింజర్ రైలు (25, 26, 27 తేదీల్లో రద్దు). ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు పీఆర్వో రాజశేఖర్ వివరించారు. దారిమళ్లించినవి ఇవే.. గుంటూరు (నగరంపాలెం): సత్తెనపల్లి, పిడుగురాళ్ల మధ్యలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నందున గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఆదివారం (25.09.2016) నుంచి మంగళవారం (27.09.2016) వరకు పలు రైళ్లను దారి మళ్లించినట్లు గుంటూరు రైల్వే సీనియర్ డివిజనల్ మేనేజరు కె.ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. 25, 26 తేదీల్లో ట్రైన్ నంబరు 12603 చెన్నై–హైదరాబాద్, 25, 26, 27 తేదీల్లో 12604 హైదరాబాద్–చెన్నై చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలును, 25, 26, 27 తేదీల్లో 12734/12733 సికింద్రాబాద్–తిరుపతి–సికింద్రాబాద్ నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ఖాజీపేట, విజయవాడ, న్యూ గుంటూరు స్టేషను మీదుగా తెనాలి వైపునకు దారిమళ్లించారు. 25, 26 తేదీల్లో 17229 త్రివేండ్రం–హైదరాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్, 25, 26, 27 తేదీల్లో 17230 హైద్రాబాద్–తివేండ్రం శబరి ఎక్స్‌ప్రెస్, 25, 26, 27 తేదీల్లో 17016 భువనేశ్వర్–సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్, 25, 26 తేదీల్లో 17015 సికింద్రాబాద్–భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్, 25, 26 తేదీల్లో 12704/12703 సికింద్రాబాద్–హౌరా–సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, 25, 26, 27 తేదీల్లో 12805/12806 విశాఖపట్నం– సికింద్రాబాద్– విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్, 25, 26 తేదీల్లో 12705/12706 సికింద్రాబాద్–గుంటూరు–సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, 25, 26, 27 తేదీల్లో 17255/17256 నర్సాపూర్– హైదరాబాద్– నర్సాపూర్, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, 25న 12764 సికింద్రాబాద్– తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్, 26న 12763 తిరుపతి– సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్‌ప్రెస్, 26న 07438 కొచ్చివెల్లి–టాటా స్పెషల్ ఎక్స్‌ప్రెస్, 25న 17222 లోక్మాన్యతిలాక్–కాకినాడ ఎక్స్‌ప్రెస్, 26న 17232 నాగర్సోల్– నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, 26న నర్సాపూర్–నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్‌లను ఖాజీపేట మీదుగా విజయవాడ వైపు మళ్లించారు. -
భారీ వర్షాలు : పలు రైళ్లు రద్దు
హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా ఆదివారం పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మాచర్ల - గుంటూరు ప్యాసింజర్, నడికుడి - మాచర్ల ప్యాసింజర్ రైళ్లను ఆదివారం, సోమవారం, మంగళవారం రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే సికింద్రాబాద్ - విజయవాడ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్, విజయవాడ - సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లును రద్దు చేసినట్లు పేర్కొంది. కాచిగూడ - గుంటూరు డబుల్ డెక్కర్ రైలు మంగళవారం రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు
గుంటూరు: భారీ వర్షాల కారణంగా గుంటూరు-నంద్యాల మార్గంలో కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు రైల్వే శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కొన్ని రైళ్ల రాకపోకల్లో కూడా మార్పులు చేసినట్టు పేర్కొంది. రేపు ఉదయం 6 గంటలకు కర్నూల్ డోన్ నుంచి గుంటూరు వెళ్లే ప్యాసింజర్‌ను రద్దు చేశారు. అదే రోజు రాత్రి 7.45 గంటలకు వెళ్లాల్సిన విజయవాడ-హుబ్లి అమరావతి ఎక్స్‌ప్రెస్ రాత్రి 10.30 గంటలకు బయలుదేరనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. -
కరీంనగర్ జిల్లాలో పలు రైళ్లు రద్దు
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో రైల్వే లైన్ మరమ్మతుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. సిర్పూర్, కాగజ్ నగర్, ఖాజీపేట మార్గంలో రైల్వే లైన్ మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దీంతో కరీంనగర్-కుష్పుల్ ప్యాసింజర్, రామగిరి ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. సింగరేణి, ఇంటర్సిటీ, కాగజ్ నగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మంచిర్యాల వరకు మాత్రమే నడుపుచున్నారు. -
జాట్ల ఆందోళన... పలు రైళ్ల రద్దు
విశాఖపట్నం: హర్యానాలో జాట్ల ఉద్యమం హింసాత్మకంగా మారడం రైల్వే అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. గత కొన్ని రోజులుగా రిజర్వేషన్ల కోసం ఆందోళన బాట పట్టిన జాట్ ఆందోళనకారులు ఉద్యమాన్ని తీవ్రతరం చేసి రైల్వే స్టేషన్లు, రైళ్లు, బస్సులు, సంస్థలకు నిప్పుపెట్టి విధ్వంస సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ అధికారులు ప్రకటించారు. రద్దయిన రైలు సర్వీసులు: రేపు (సోమవారం) ఉదయం 8:20 గంటలకు బయలుదేరాల్సిన 12803 విశాఖ - నిజాముద్దీన్ స్వర్ణజయంతి ఎక్స్ ప్రెస్ రద్దు ఈ నెల 23న రాత్రి 11:50 గంటలకు బయలుదేరాల్సిన 18507 విశాఖ - అమృత్ సర్ హీరాకుడ్ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. -
ఈ నెల 28, 29 తేదీల్లో పలు రైళ్లు రద్దు
హైదరాబాద్ : కాచిగూడ-నడికుడి రైలు మార్గంలో చేపట్టనున్న నిర్మాణ పనుల నేపధ్యంలో ఫిబ్రవరి 28, 29 తేదీల్లో పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడంతో పాటు, కొన్నింటిని కాజీపేట్ మీదుగా మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కాచిగూడ-మిర్యాలగూడ, పిడుగురాళ్ల-మిర్యాలగూడ ప్యాసింజర్ రైళ్లను ఆ రెండు రోజులు రద్దు చేయనున్నారు. కాచిగూడ-రేపల్లె డెల్టా ప్యాసింజర్, హైదరాబాద్-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కాజీపేట్ మీదుగా మళ్లించనున్నారు. -
పట్టాలు తప్పిన గూడ్స్: పలు రైళ్లు రద్దు
గరివిడి: విజయనగరం జిల్లా గరివిడి మండలం లక్ష్మీపురం వద్ద సోమవారం గూడ్సు రైలు పట్టాలు తప్పింది. విశాఖపట్నం నుంచి ఫర్టిలైజర్స్(యూరియా, డీఏపీ)తో హౌరా వైపు వెళ్తున్న గూడ్స్ రైలు చీపురుపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో బోల్తా కొట్టింది. దీంతో ఆరు వ్యాగెన్లు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యాయి. రైల్వే ట్రాక్‌పై యూరియా బస్తాలు చెల్లాచెదురయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే శాఖ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా ఆ మార్గంలో వెళ్లవలసిన పలు రైళ్లను రద్దు చేయగా.. మరి కొన్నింటిని దారి మళ్లించారు. ఈ మేరకు రైల్వే శాఖ వివరాలు తెలియజేసింది. రద్దయిన రైళ్లు : పలాస నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన ప్యాసింజర్ (58525 ) విశాఖపట్నం నుంచి పలాస వెళ్లాల్సిన ప్యాసింజర్ (67293 ) విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్లాల్సిన ప్యాసింజర్ (67296) భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన ప్యాసింజర్ (18495) దారి మళ్లించిన రైళ్లు : రామేశ్వరం నుంచి భువనేశ్వరం వెళ్లాల్సిన రైలును వయా విజయనగరం - రాయగడ - సంబల్పూర్ - తిట్లానగర్ మీదుగా భువనేశ్వర్ వెళ్లే ఏర్పాట్లు చేశారు. చెన్నై నుంచి హౌరా వెళ్లాల్సిన హౌరా మెయిల్‌ను వయా రాయగడ సంబల్పూర్ మీదుగా దారి మళ్లించారు. -
చెన్నైలో భారీవర్షాలు, పలు రైళ్లు రద్దు
చెన్నై : తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించక పోవడంతో దక్షిణ రైల్వే అధికారులు పలు రైలు సర్వీసులను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు. చెన్నై-గూడూరు మధ్య పలుచోట్ల రైల్వే బ్రిడ్జ్లపై నీళ్లు నిలిచి, ప్రమాద స్థాయికి చేరుకోవడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. గత కొద్దిరోజులుగా తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. రద్దయిన రైళ్ల వివరాలు: *ట్రయిన్ నెంబర్-17644: కాకినాడ-చెన్నై ఎగ్మూర్ ఎక్స్‌ప్రెస్ *12604: హైదరాబాద్-చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ *12760: హైదరాబాద్-చెన్నై సెంట్రల్-చార్మినార్ ఎక్స్‌ప్రెస్ *17652 : కాచిగూడ-చెన్నై ఎగ్మూర్ ఎక్స్‌ప్రెస్ *16031: చెన్నై సెంట్రల్- శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా అండమాన్ ఎక్స్‌ప్రెస్ *12621: చెన్నైసెంట్రల్-న్యూఢిల్లీ తమిళనాడు ఎక్స్‌ప్రెస్ *12840: చెన్నై సెంట్రల్- హౌరా మెయిల్ *12842: చెన్నై సెంట్రల్- హౌరా కోరమండల్ ఎక్స్‌ప్రెస్ *12656: చెన్నై సెంట్రల్- అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్ *22611: చెన్నై సెంట్రల్- న్యూ జల్పైగురి ఎక్స్‌ప్రెస్ *22403: పుదుచ్చేరి-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్ దారి మళ్లించిన రైళ్లు... 12898: భువనేశ్వర్- పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్... 12507: త్రివేండ్రం సెంట్రల్- గౌహతి ఎక్స్‌ప్రెస్ 16351: సీఎస్టీ ముంబయి-నాగర్ కోయిల్ ఎక్స్‌ప్రెస్ తాత్కాలికంగా రద్దు అయిన రైళ్లు... * 12711 - విజయవాడ-చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్‌ప్రెస్ (గూడూరు వరకు మాత్రమే) * 12712 - చెన్నై సెంట్రల్ - విజయవాడ పినాకిని (చెన్నై నుంచి గూడురు వరకూ రద్దు) -
భారీ వర్షాలు : పలు రైళ్లు రద్దు
-
భారీ వర్షాలు : పలు రైళ్లు రద్దు
హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లును రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంగళవారం ప్రకటించింది. విశాఖపట్నం - తిరుపతి (తిరుమల ఎక్స్‌ప్రెస్ :17488), మద్రాస్ - హౌరా (కోరమండల్ ఎక్స్‌ప్రెస్ : 12842), అలెప్పి - ధన్‌బాద్ (బొకారో ఎక్స్‌ప్రెస్ : 13352 ), చెన్నై సెంట్రట్ - కాకినాడ పోర్ట్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్ - చప్రా (గంగా కావేరి ఎక్స్‌ప్రెస్)తోపాటు చెన్నై సెంట్రల్ - పూరీ ఎక్స్‌ప్రెస్ సర్వీసు కూడా రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా వైఎస్ఆర్ జిల్లాలో ఒంటిమిట్ట మండలం మంటపల్లి వద్ద గౌహతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. అయితే ప్రమాదంలో ప్రయాణికులకు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కాకుంటే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
తిరుపతి నుంచి బయలుదేరాల్సిన పలు రైళ్లు రద్దు
తిరుపతి : జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు కట్టలు నిండిపోవడంతోపాటు పొంగి పొర్లుతూ ప్రమాద స్థితికి చేరుకున్నాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు మరి కొద్దిసేపట్లో తిరుపతి నుంచి మచిలీపట్నం వెళ్లాల్సిన మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్, తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. ఈ మేరకు తిరుపతి రీజియన్ ఆఫీసర్ కుప్పాల సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. -
డబ్లింగ్ పనులతో పలు రైళ్లు రద్దు
గుంతకల్లు(అనంతపురం జిల్లా): కోసిగి-మంత్రాలయం స్టేషన్ల మధ్య డబ్లింగ్ పనుల్లో భాగంగా నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ నెల 11 వరకు పలు రైళ్లను రద్దుచేయగా, మరి కొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు రైల్వే వర్గాలు శనివారం తెలిపాయి. గుంతకల్లు- రాయచూర్ ప్యాసింజర్‌ను రద్దు చేశారు. గుంతకల్లు-గుల్బర్గా మధ్య నడిచే ైరె లును గుల్బర్గా నుంచి వాడి స్టేషన్ వరకు మాత్రమే నడపనున్నారు. యశ్వంత్‌పూర్-దిల్లిసారై మధ్య నడిచే దురంతా ఎక్స్‌ప్రెస్‌ను డోన్-గుత్తి మీదుగా దారి మళ్లించారు. -
విశాఖ మార్గంలో 26 రైళ్ల రద్దు
హుదూద్ తుఫానుకు అల్లకల్లోలంగా మారిన విశాఖపట్నం మార్గంలో బుధవారం వెళ్లాల్సిన 26 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్, విశాఖ నుంచి కాజీపేట వెళ్లే లింక్ ఎక్స్‌ప్రెస్, విశాఖ నుంచి రేణిగుంట వెళ్లే స్పెషల్ రైలు రద్దయ్యాయి. అలాగే, రేణిగుంట నుంచి విశాఖపట్నం వెళ్లే స్పెషల్ రైలు, విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే స్పెషల్ రైలు కూడా రద్దయ్యాయి. అలాగే, గురువారం నాడు వెళ్లాల్సిన సికింద్రాబాద్ - విశాఖ స్పెషల్ రైలు, ఈరోజు, రేపు తిరగాల్సిన భువనేశ్వర్ - సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్, విశాఖ- సికింద్రాబాద్ గరీబ్‌రథ్, భువనేశ్వర్ - ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్, రేపటి చెన్నై -షాలిమార్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రద్దయిన జాబితాలో ఉన్నాయి. -
ఉత్తరాంధ్రలో హై అలర్ట్.. పలురైళ్లు రద్దు
హుదూద్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేశారు. తుఫాను కారణంగా పలు జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. మరోవైపు హుదూద్ తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రత కోసం ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్లైన్లను ఏర్పాటు చేశారు. తుఫాను కారణంగా 30 రైళ్లను రద్దు చేయగా, మరి కొన్నింటిని దారి మళ్లించారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే పరిధిలో 37 రైలు సర్వీసులు రద్దయ్యాయి, 31 రైళ్లను దారి మళ్లించారు. కంట్రోల్ రూంల నెంబర్లు తూర్పుగోదావరి- 0884 2359173; విశాఖ- 1800 4250 0002; శ్రీకాకుళం ౦ 1800 4256625; విజయనగరం - 08922 276888; పార్వతీపురం - 08963 221006 -
భారీగా మంచు.. పలు రైళ్ల రద్దు
ఉత్తరాదిలో మంచు వణికిస్తోంది. ఢిల్లీ ప్రాంతంలో కన్ను పొడుచుకున్నా ముందు ఏముందో కనిపించడం లేదు. దీంతో ఏడు రైళ్లను రద్దు చేయగా మరో ఆరు రైళ్లు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. జార్ఖండ్, ఉజ్జయిని, హౌరా జనతా ఎక్స్‌ప్రెస్‌లతో సహా మొత్తం ఏడు రైళ్లను రద్దు చేశారు. కనీసం పది మీటర్ల ముందు ఏముందో కూడా కనిపించకపోవడంతో రైళ్లను నడిపించడం చాలా కష్టంగా ఉందని, ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకే రైలు సర్వీసులను రద్దు చేశామని రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. భాగల్పూర్ గరీబ్ రథ్, మహాబోధి ఎక్స్‌ప్రెస్ రైళ్లు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. -
భారీగా రైళ్ల రద్దు....
సాక్షి, ముంబై: గోటీ-ఇగత్పురి రైల్వే స్టేషన్ల మధ్య మంగళ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం పట్టాలు తప్పి ముగ్గురు మరణించిన నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించి నడుపుతున్నారు. రద్దు చేసిన రైళ్లలో అప్, డౌన్ ఎల్టీటీ-మన్మాడ్ రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్, అప్, డౌన్ సీఎస్టీ-మన్మాడ్ పంచవటి ఎక్స్‌ప్రెస్, అప్, డౌన్ సీఎస్టీ-బుసావల్ ప్యాసింజర్ రైళ్లతోపాటు నాందేడ్-సీఎస్జీ తపోవన్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. మరోవైపు సీఎస్టీ నుంచి నాందేడ్‌కు బయలుదేరిన తపోవన్ ఎక్స్‌ప్రెస్‌ను కళ్యాణ్ వద్ద నిలిపివేశారు. 12 రైళ్ల మళ్లింపు... మంగళ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాల తప్పిన అనంతరం ఇగత్పురి-గోటీ రైల్వేస్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. దీంతో కొన్ని రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని పుణే, దౌండ్, మన్మాడ్ మీదుగా నడిపించారు. అప్, డౌన్ మార్గాల్లో నడిచే మొత్తం 12 రైళ్లను పుణే, దౌండ్ మీదుగా నడిపించారు. నాలుగు నెలల్లో రెండో ఘటన... ఇగత్పురి రైల్వే స్టేషన్ సమీపంలో నాలుగు నెలలు తిరగకుండానే మరో ఘటన జరిగింది. ఇదే సంవత్సరం జూలై ఐదున సికింద్రాబాద్-దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు ఇగత్పురి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. రైల్వేస్టేషన్ సమీపంలో ఈ సఘటన జరగడం, వేగం కూడా తక్కువగా ఉన్నందున ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటన జరిగి నాలుగు నెలలు కాకముందే మంగళ ఎక్స్‌ప్రెస్ కూడా శుక్రవారం పట్టాలు తప్పింది. ఈ ప్రమాదానికి కారణమేంటన్నది ఇంత వరకు తెలియరాలేదు. ప్రత్యేక రైళ్లో ప్రయాణికుల తరలింపు ఘటనాస్థలంలో ఇరుక్కుపోయిన ప్రయాణికులను ప్రత్యేక రైళ్లో ఎర్నాకుళంకు పంపించారు. సెంట్రల్ రైల్వే పీఆర్ఓ ఎకె సింగ్ అందించిన వివరాల మేరకు సుమారు 450 ప్రయాణికులను 10 బస్సుల ద్వారా ముందుగా ఇగత్పురి రైల్వేస్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం ఓ ప్రత్యేక రైళ్లో మధ్యాహ్నం 12.30 గంటలకు గమ్యస్థానాలకు పంపించారు. మృతులు, గాయపడిన వారి వివరాలు.. మృతుల్లో హర్యానా పథోడాకు చెందిన సత్యబీర్ సింగ్ (40), ఉత్తరప్రదేశ్ అలీగఢ్వాసి రాజు కుషువా (34) ఉన్నారు. మూడో వ్యక్తి వివరాలు తెలియరాలేదు. గాయపడినవారు.. మహిళలుః కమలా రమణి (70), మాధవి భైరన్ (28), సిమ్రన్ రమానీ (35),అశ్వినీ పురగావ్కర్ (50), రింకూశర్మ (25), సుని తా రాథోడ్ (28), నేహా రమానీ (19) ఉన్నారు. చిన్నారులు (బాలికలు)ః శుభి రాథోడ్ (1.5 ఏళ్లు), రియా రమానీ (రెండున్నరేళ్లు). పురుషులుః ముర ళీధర్ (60), రాహుల్ రమానీ (10), తెక్సింగ్ (60), సూరజ్ గౌతమ్ (30), సూర్తాజ్ కుమార్ (38), ఉత్తమ్‌చంద్ ఖండేల్వాల్ (40), రాజేష్‌కుమార్ (25), పురుషోత్తం బన్వారీ (54), కుమార్ బన్వారీ (44), రామ్ రమానీ (38), ప్రకాష్ రమానీ (35) ఉన్నారు. మిగతా ఆరుగురి వివరాలు అందాల్సి ఉంది. -
భారీ వర్షాలతో పలు రైళ్ల రద్దు
భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్ మీదకు నీళ్లు రావడంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సోమవారం నాడు బయల్దేరాల్సిన ఈ రైళ్ల సర్వీసులను రద్దుచేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి కె.సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి... చెన్నైలో ఉదయం 8.45 గంటలకు బయల్దేరాల్సిన నెం. 12842 చెన్నై- హౌరా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రద్దయింది. చెన్నైలో రాత్రి 9.40 గంటలకు బయల్దేరాల్సిన నెం. 12840 చెన్నై- హౌరా మెయిల్ రద్దయింది. తిరుపతిలో రాత్రి 7.55కు బయల్దేరాల్సిన తిరుపతి - కోల్‌కతా సంత్రాగచి ఎక్స్‌ప్రెస్ రద్దయింది. కోల్‌కతా షాలిమార్‌లో ఉదయం 11 గంటలకు బయల్దేరాల్సిన కోల్‌కతా షాలిమార్ - యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రద్దయింది. -
ఎక్కడి రైళ్లు అక్కడే..
రైల్వే స్టేషన్ (రాజమండ్రి), న్యూస్‌లైన్ :వరద ఉధృతి కారణంగా రైలు పట్టాలు నీటమునగడంతో జిల్లాలోని వివిధ రైల్వే స్టేషన్లలో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తుపాను ప్రభావంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనకాపల్లి-యలమంచిలి రైళ్లు ల్వేస్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ ధ్వంసం కావడంతో విశాఖపట్నం-రాజమండ్రి స్టేషన్ల మధ్య అనేక రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపివేశారు. రాజమండ్రిలో విశాఖ, తిరుమల, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేసి, ప్రయాణికులకు టికెట్ సొమ్మును వాపసు చేశారు. ప్రయాణికుల సౌకర్యార ్థం ఆర్టీసీ అధికారులతో మాట్లాడి, ఏడు ప్రత్యేక బస్సులను తుని వరకు ఏర్పాటు చేశారు. విశాఖపట్నం వైపు నుంచి రాజమండ్రి వైపు రావాల్సిన కొన్ని రైళ్లను బలార్షా, నాగ్‌పూర్ మీదుగా మళ్లించారు. జిల్లావ్యాప్తంగా అనేక స్టేషన్లలో నిలిచిపోయిన రైళ్లను షెడ్యూల్ ప్రకారం నడపడం కోసం తిరిగి వెనక్కి పంపే చర్యలను అధికారులు చేపట్టారు. రాజమండ్రి నుంచి తిరుమల, రత్నాచల్, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లను షెడ్యూల్ ప్రకారం నిర్ణీత స్టేషన్లకు తరలించారు. తుని నుంచి గోదావరి, గరీబ్‌ర థ్, విశాఖ-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్‌ను కాకినాడ నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలుగా నడిపారు. విశాఖపట్నం వైపు రైళ్లు వెళ్లకపోవడంతో ఆర్ఆర్బీ రాతపరీక్షకు వెళ్లాల్సిన అభ్యర్థులు రాజమండ్రి స్టేషన్లో చిక్కుకుపోయారు. దెబ్బతిన్న ట్రాక్‌ను పరిశీలించేందుకు విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రదీప్‌కుమార్ ప్రత్యేక రైలులో వచ్చారు. విండో ఇన్స్పెక్షన్ నిర్వహించి, ట్రాక్ దెబ్బతిన్న చోట పరిస్థితిని సమీక్షించారు. రైళ్లు రద్దు కావడంతో రాజమండ్రి రైల్వేస్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం ెహ ల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ఆదివారం రాజమండ్రి రైల్వేస్టేషన్లో 1736 మంది ప్రయాణికులు రిజర్వేషన్ టికెట్లను రద్దు చేసుకోగా, వారికి రూ.4,97,580 అధికారులు వాపసు చేశారు. జన్మభూమి, సింహాద్రి, భువనేశ్వర్, కొల్లాం రైళ్లు రద్దయ్యాయి. సికింద్రాబాద్-గౌహతి, హైదరాబాద్-హౌరా, ముంబై-భువనేశ్వర్, బొకా రో, హౌరా-యశ్వంత్‌పూర్, అమరావతి, ప్రశాంతి, వివేక్, త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్‌లను బలార్షా, నాగపూర్ మీదుగా మళ్లించారు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో రైళ్లు నిలిచిపోవడంతో ఆర్డీఓ వేణుగోపాలరెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్ పరిస్థితి సమీక్షించారు. -
పలు రైళ్లు రద్దు... కొన్ని దారి మళ్లింపు
సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం/విజయవాడ: భారీ వర్షాల కారణంగా శుక్రవారం కూడా దక్షిణమధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. పలుచోట్ల పట్టాల మీదుగా వరద నీరు పారుతుండడంతో ఆయా మార్గాల గుండా వెళ్లే రైళ్లకు తీవ్ర అంతరాయం ఎదురైంది. దారి మళ్లింపుతో రైళ్లు గంటలకొద్దీ ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులకు సరైన సమాచారం తెలియక తీవ్ర ఇక్కట్లు పడ్డారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. హౌరా-మైసూరు ఎక్స్‌ప్రెస్‌ను శుక్రవారం రద్దు చేశారు. సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లు నాలుగు గంటలు ఆలస్యంగా నడిచాయి. యశ్వంతపూర్-హౌరా ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గౌహతి ప్రత్యేక రైలు, బెంగళూరు-గౌహతి ఎక్స్‌ప్రెస్‌లను వరంగల్, బలార్షా, నాగ్‌పూర్, ఖరగ్‌పూర్‌ల మీదుగా మళ్లించారు. ఆ రైళ్లన్నీ 20 నుంచి 24 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. నల్లగొండ-తిప్పర్తి మధ్య వరద ఉధృతి కారణంగా లైన్ బలహీనపడడంతో ఆ మార్గం గుండా రైళ్ల రాకపోకలను నిలిపేశారు. గుంటూరు-సికింద్రాబాద్ రైళ్లను విజయవాడ మీదుగా మళ్లించారు. శబరి ఎక్స్‌ప్రెస్‌ను చాలాసేపు నల్లగొండలో నిలిపివేశారు. సికింద్రాబాద్-విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను వెనక్కు రప్పించి మళ్లించారు. కాగా, తూర్పు కోస్తా రైల్వే పరిధిలో శుక్రవారం కూడా పదకొండుకుపైగా రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పలాస-ఖుర్దారోడ్డు మార్గంలో పలు చోట్ల రైలుమార్గాలు దెబ్బతిన్నందున ఒడిశా, కోల్‌కతా వైపు వెళ్లాల్సిన రైళ్లు ఆగిపోయాయి. శుక్రవారం విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన సమైక్య శంఖారావం స్పెషల్ రద్దయింది. అలాగే 12703 ఫలక్‌నుమా, 12839 హౌరా-చెన్నై సెంట్రల్ మెయిల్ రైళ్లను పూర్తిగా రద్దుచేశారు. విశాఖ నుంచి వెళ్లే 12864 యశ్వంత్‌పూర్-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి 7.35 గంటలకు బదులుగా శనివారం ఉదయం 7 గంటలకు బయలు దేరుతున్నట్లు ప్రకటించారు. 18464 బెంగుళూర్సిటీ-భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు బదులుగా శనివారం తెల్లవారుజామున ఒంటిగంటకు బయలుదేరనుంది. 12864 యశ్వంత్‌పూర్-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి 7.35 గంటలకు బదులుగా శనివారం ఉదయం 7 గంటలకు బయలుదేరుతుంది. 12702 హౌరా-సికింద్రాబాద్-ఫలక్‌నుమా శనివారం గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉండగా ఆదివారం ఉదయం చేరుకుంటుందని అధికారులు ప్రకటించారు. హెల్ప్‌లైన్ సెంటర్ల వివరాలు నల్లగొండ : 0868 2224392 మిర్యాలగూడ: 08689 242627 నడికుడి : 08649 257625 గుంటూరు : 0863 2222014 పిడుగురాళ్ల : 08649 252255 -
విశాఖ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల పడిగాపులు
-
విశాఖ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల పడిగాపులు
విశాఖ : సీమాంధ్రలోని సమైక్య ఉద్యమం రైల్వే వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. విద్యుత్ జేఏసీ నిరవధిక సమ్మెతో మూడోరోజు మంగళవారం కూడా గ్రిడ్ నుంచి రైల్వేకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖపట్నం నుంచి విజయనగరం వరకు విద్యుత్ సరఫరా పూర్తిగా షట్‌డౌన్ అవ్వడంతో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొన్ని రైళ్లను మాత్రం డీజిల్ లోకోమోటివ్‌లతో నడిపించారు. అవీ సరిపోను లేక పలు రైళ్లను రద్దు చేశారు. దాంతో రైల్వే అధికారులు మంగళవారం పలు రైళ్లను రద్దు చేశారు. 12 ప్యాసింజర్ రైళ్లు, రెండు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లు, గోదావరి, విశాఖ, దురంతో, గరీబ్ రథ్, తిరుమల ఎక్స్‌ప్రెస్‌లు రద్దు అయ్యాయి. రైళ్లు రద్దు కావటంతో విశాఖ రైల్వేస్టేషన్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు విజయవాడ-విశాఖపట్నం మధ్య విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో గూడ్సు రవాణాను నిలిపివేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గు, ఎరువులు, పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసరాల రవాణా స్తంభించిపోయింది. -
‘విద్యుత్’ సమ్మెతో రైళ్లకు బ్రేక్
డీజిల్ ఇంజిన్లతో కొన్ని రైళ్లను నడిపించిన అధికారులు సాక్షి నెట్వర్క్: సీమాంధ్రలోని సమైక్య ఉద్యమం రైల్వే వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. విద్యుత్ జేఏసీ నిరవధిక సమ్మెతో రెండోరోజు సోమవారం కూడా గ్రిడ్ నుంచి రైల్వేకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖపట్నం నుంచి విజయనగరం వరకు విద్యుత్ సరఫరా పూర్తిగా షట్‌డౌన్ అవ్వడంతో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొన్ని రైళ్లను మాత్రం డీజిల్ లోకోమోటివ్‌లతో నడిపించారు. అవీ సరిపోను లేక పలు రైళ్లను రద్దు చేశారు. ఉదయం 10 గంటల నుంచి ఈస్ట్‌కోస్ట్ రైల్వేపై విద్యుత్ సరఫరాలోపం ప్రభావం పడడంతో ఉదయం విజయవాడ మీదుగా వెళ్లిన లింకు, బొకారో ఎక్స్‌ప్రెస్‌లను తాడి, అనకాపల్లిలో నిలిపివేశారు. అనంతరం విశాఖపట్నానికి చెందిన రెండు డీజిల్ ఇంజిన్లను ఏర్పాటు చేసి ఆ రైళ్లను నడిపించారు. దీని ప్రభావంతో ప్రశాంతి, రత్నాచల్, తిరుమల వంటి పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు 3 గంటల నుంచి 4 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విజయవాడ నుంచి గూడూరు వైపు వెళ్లాల్సిన అన్ని రైళ్లను రైల్వే అధికారులు యథావిధిగా నడిపారు. ఆదివారం కొన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు ఇక్కట్లకు గురయ్యారు. ప్రయాణికుల నిరసనల నేపధ్యంలో ఐదు ప్యాసింజర్ రైళ్లను విజయవాడ-గూడూరు, విజయవాడ-గుంటూరు, విజయవాడ-మచిలీపట్నం, మచిలీపట్నం-విజయవాడ మధ్య నడిపారు. డీజిల్ ఇంజిన్లతో నడపడంతో తీవ్ర నష్టం వాటిల్లుతోందని, అయితే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పైనే దృష్టి కేంద్రీకరించినట్లు విజయవాడలో ఏడీఆర్ఎం ఎన్.సీతారామప్రసాద్ పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా వివిధ జోన్ల నుంచి 34 డీజిల్ ఇంజిన్లను రప్పించారు. వాటిని గూడూరు, బిట్రగుంట, విజయవాడ, రాజమండ్రి ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేశారు. స్తంభించిన గూడ్సు రవాణా విజయవాడ-విశాఖపట్నం మధ్య విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో గూడ్సు రవాణాను నిలిపివేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గు, ఎరువులు, పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసరాల రవాణా స్తంభించిపోయింది. కొనసాగిన ‘రద్దు’లు... సోమవారం కూడా పలు రెళ్లు రద్దయ్యాయి. విజయవాడ-చెన్నై పినాకిని ఎక్స్‌ప్రెస్, విజయవాడ-చెన్నై జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్, గుంటూరు-కాచిగూడ, తిరుపతి-మచిలీపట్నం, తిరుపతి-నర్సాపూర్, చెన్నై-గూడూరు, విశాఖపట్నం- కోరాపుట్, విశాఖపట్నం-రాయగఢ్, విశాఖపట్నం- పలాస, విశాఖపట్నం - దుర్గ్, విశాఖపట్నం- రాయ్‌పూర్, విశాఖపట్నం- విజయనగరం ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. భువనేశ్వర్ - విశాఖపట్నం రైలు సోంపేట వరకు, పూరి- గున్పూర్ ప్యాసింజర్‌ను రాంభా వరకు డీజిల్ ఇంజిన్లతో నడిపారు. విజయవాడ-విశాఖపట్నం ప్యాసింజర్, రాజమండ్రి-విశాఖపట్నం ప్యాసింజర్ లను అనకాపల్లి-విశాఖపట్నం మధ్య రద్దు చేశారు. విశాఖపట్నంలో మధ్యాహ్నం 1-30కి బయల్దేరిన విశాఖ- విజయవాడ రత్నాచల్ రైలు కొద్దిదూరం వెళ్లి సాయంత్రం 4-30కి మళ్లీ విశాఖ స్టేషన్‌కు వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలోనూ పలు రైళ్లు నిలిచిపోయాయి. సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లాల్సిన విశాఖ ఎక్స్‌ప్రెస్ దూసి రైల్వేస్టేషన్లో ఉదయం 9.30కి నిలిచిపోగా, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ నౌపడా దగ్గర, గువహతి వీక్లీ ఎక్స్‌ప్రెస్, మెయిల్, ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లు సోంపేట దగ్గర మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆగిపోయూరుు. తర్వాత ఒడిశా నుంచి డీజిల్ ఇంజిన్లు రప్పించి ఆ రైళ్లను గమ్యస్థానాలకు పంపారు. -
'దారి మళ్లించి అయినా రైళ్లను నడుపుతాం'
విజయవాడ : సీమాంధ్రలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం దక్షిణ మధ్య రైల్వేపై పడింది. దాంతో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ఇతర సబ్ స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరాను పునరుద్దరించుకుంటోంది. పరిస్థితి చేయి దాటిపోతే దారి మళ్లించి అయినా రైళ్లను నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. కాగా విజయవాడ-గూడూరు మధ్య ప్యాసింజర్ రైలుతో పాటు, విజయవాడ-మచిలీపట్నం మధ్య రెండు ప్యాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. మరోవైపు పూర్తిస్థాయిలో గూడ్స్ రవాణా నిలిచిపోయింది. కాగా శ్రీకాకుళంలో విద్యుత్ సరఫరా అంతరాయంతో ఆముదాలవలస వద్ద విశాఖ ఎక్స్‌ప్రెస్‌తో పాటు రెండు గూడ్స్ రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే లైన్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విజయవాడ, గుంతకల్ తదితర డివిజన్లలో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. నిన్న తెల్లవారుజామున 5.30 నుంచి 6.30 గంటల మధ్య రైళ్లు ఒక్కటి కూడా కదలలేదు. ఇప్పటికే బస్సులు లేకపోవడంతో రైళ్లపైనే ఆధారపడుతున్న ప్రయాణికులు, దీంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇదిలాఉండగా, చెన్నై నుంచి పది డీజిల్ ఇంజన్లను రప్పించి నెల్లూరు జిల్లా పడుగుపాడు లూప్లైన్లో ఉంచారు. రద్దయిన రైళ్లు: విద్యుత్ అంతరాయం వల్ల సోమవారం కూడా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ‘చెన్నై-విజయవాడ, పినాకిని ఎక్సప్రెస్: చెన్నై- విజయవాడ, శతాబ్ది ఎక్సప్రెస్: విజయవాడ-బిట్రగుంట, బిట్రగుంట-చెన్నై, చెన్నై-గూడూరు, విజ యవాడ-యశ్వంత్‌పూర్, యశ్వంత్‌పూరు-విజయవాడ(8వతేదీ), గుంటూరు-కాచిగూడ, నర్సాపూర్-తిరుపతి, తిరుపతి- మచిలీపట్నం’ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. రైళ్ల సమాచారం తెలుసుకోవడానికి విజయవాడ డివిజన్ పరిధిలోని కొన్ని రైల్వేస్టేషన్లలో హెల్ప్‌లైన్ సెంటర్లను ప్రారంభించినట్లు రైల్వే ముఖ్య పౌర సంబంధాల అధికారి ఎఫ్.ఆర్.మైకేల్ తెలిపారు. విజయవాడ:0866-2576796, 0866-2575038, 9701373073 నెల్లూరు:0861-234866, 2345864 ఒంగోలు:08592-280202, 280203 రాజమండ్రి:0883-2420541, 24205543