ఆదాయం, ప్రయాణికులు లేరని రైళ్లు రద్దు | South Central Railway Cancelled 10 Trians | Sakshi
Sakshi News home page

ఆదాయం, ప్రయాణికులు లేరని రైళ్లు రద్దు

Published Mon, Apr 26 2021 5:19 PM | Last Updated on Mon, Apr 26 2021 7:43 PM

South Central Railway Cancelled 10 Trians - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణాలను విరమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రైళ్లకు ప్రయాణికుల తాకిడి తక్కువగా ఉంది. ఆదాయం, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా లేని ప్రాంతాల్లో రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. పది రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ రద్దు తాత్కాలికం మాత్రమేనని గుర్తుచేసింది. ఏప్రిల్‌ 28 నుంచి మే 31వ తేదీ వరకు ఆ రైళ్లు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే రైళ్లు రద్దు చేసినట్లు తెలుస్తోంది.

రద్దు చేసిన రైళ్లు..

  • నర్సాపూర్-నిడదవోలు
  • నిడదవోలు- నర్సాపూర్
  • సికింద్రాబాద్- బీదర్
  • బీదర్ - సికింద్రాబాద్
  • సికింద్రాబాద్- కర్నూలుసిటీ 
  • కర్నూల్ సిటీ- సికింద్రాబాద్
  • మైసూర్- రేణిగుంట
  • రేణిగుంట- మైసూర్
  • సికింద్రాబాద్ - ముంబై ఎల్‌టీటీ
  • ముంబై ఎల్‌టీటీ- సికింద్రాబాద్

చదవండి: కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు
చదవండి: మాస్క్‌ లేదని చితక్కొట్టిన ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement