తమిళనాడులో రైలు ప్రమాద ఘటన.. 18 రైళ్ల రద్దు | Derailment of Bagmati Express: list Of Trains cancelled And diverted | Sakshi
Sakshi News home page

తమిళనాడులో రైలు ప్రమాద ఘటన.. 18 రైళ్ల రద్దు

Published Sat, Oct 12 2024 8:08 AM | Last Updated on Sat, Oct 12 2024 9:20 AM

Derailment of Bagmati Express: list Of Trains cancelled And diverted

తమిళనాడులో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్నవిషయం తెలిసిందే. మైసూర్‌-దర్భంగా భాగమతి ఎకస్‌ప్రెస్‌ చెన్నై సమీపంలోని తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్లై రైల్వే ష్టేషన్‌ వద్ద గూడ్స్‌ రైలును ఢీకొట్టింది. దీంతో 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 19  గాయాలయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాద సమయంలో 1,360 మంది ప్రయాణికులు ఉన్నారని తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ టీ ప్రభుశంకర్‌ తెలిపారు. 19 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే రైలు మెయిన్‌లైన్‌కు బదులు లూప్‌ లైన్‌లోనిక ప్రవేశించడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

కాగా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో  క్షిణ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. తిరుపతి-పుదుచ్చేరి మెము(16111), పుదుచ్చేరి-తిరుపతి మెము(16112), డా ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- తిరుపతి ఎక్స్‌ప్రెస్‌(16203), తిరుపతి-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌(16204), ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-తిరుపతి(16053), తిరుపతి- ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌(16054), ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-తిరుపతి(16057), తిరుపతి-ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌(16058)

అరక్కం-పుదుచ్చేరి మెము(16401), కడప-అరక్కోణం మెము(16402), డా. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- తిరుపతి మెము(06727), , తిరుపతి-డా. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ మెము(06728), అరక్కోణం-తిరుపతి మెము(06753), తిరుపతి-అరక్కోణం మెము(06754), విజయవాడ-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ పినాకిని ఎక్స్‌ప్రెస్‌(12711), ఎంజీఆర్‌ సెంట్రల్‌-విజయవాడ  పినాకిని ఎక్స్‌ప్రెస్‌(12712) సూళ్లూరుపేట-నెల్లూరు మెము ఎక్స్‌ప్రెస్‌(06745), నెల్లూరు-సూళ్లూరుపేట మెము ఎక్స్‌ప్రెస్‌(06746) రైళ్లు రద్దయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement