
చెన్నై: జనాభా ప్రతిపాదికన కేంద్రం నియోజక వర్గాల పునర్విభజన (Delimitation) జరపబోతోందన్న ప్రచారం దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఒక్కటిగా తొలి అడుగు వేశాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలో చెన్నైలో శనివారంనాడు దక్షిణాది రాష్ట్రాల పార్టీల సమావేశం జరిగింది.
కేంద్రం చేపట్టబోయే డీలిమిటేషన్‌ను తాము వ్యతిరేకించడం లేదని.. అది న్యాయంగా ఉండాలన్నదే తమ అభిమతమని అని అక్కడ హాజరైన ప్రతినిధుల తరఫున స్టాలిన్ ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు ఏకం అయ్యాయని, ఈ ఘనత స్టాలిన్‌కే దక్కుతుందని సీఎం రేవంత్ అన్నారు. ఈ క్రమంలో తెలంగాణలోనూ డీలిమిటేషన్ మీటింగ్ పెట్టాలని ఆయన ప్రతిపాదించారు.
ఆ ప్రతిపాదనకు స్టాలిన్ అంగీకారం తెలిపారు. చెన్నై మీటింగ్‌కు కొనసాగింపుగా తదుపరి జేఏసీ సమావేశం హైదరాబాద్(Hyderabad Delimitation Meeting)లో ఉండనుందని స్టాలిన్ ప్రకటించారు. సమావేశంతో పాటు బహిరంగ సభ కూడా ఉంటుందని సీఎం రేవంత్ ప్రకటించారు. ఏప్రిల్ 15వ తేదీన ఈ సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక.. చెన్నైలో జరిగిన జేఏసీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Please login to add a commentAdd a comment