సాక్షి, సికింద్రాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని హౌరా మార్గంలో నడిచే 15 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం నుంచి బుధవారం వరకు నడిచే 15 రైళ్లను రద్దు చేసినట్లు వివరించింది. అయితే, ఇటీవల ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో దాదాపు 280మందికి పైగా మృతిచెందగా.. అనేకమంది గాయపడిన విషయం తెలిసిందే.
కాగా, రైలు ప్రమాదంలో టాక్ మొత్తం దెబ్బతిన్నది. ప్రస్తుతం బహనాగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆది, సోమ, మంగళ, బుధవారాల్లో మొత్తంగా 15 రైళ్లు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఓ ప్రటకనలో పేర్కొంది. అలాగే, ఈ నెల 12న చెన్నై సెంట్రల్ -షాలిమార్ (12842)రైలు సర్వీసు సేవలను పునరుద్ధరిస్తున్నట్టు తెలిపింది. అయితే, రైలు ప్రమాద ఘటన తర్వాత వందలాది మంది కార్మికులు రాత్రింభవళ్లు కష్టపడి ట్రాక్ పునరుద్ధరణ చేపట్టడంతో దాదాపు 50 గంటల తర్వాత మళ్లీ మార్గంలో రైలు ప్రయాణాలు మొదలయ్యాయి.
రద్దయిన రైళ్ల వివరాలు..
- ఈ నెల 11న (ఆదివారం) మైసూరు- హౌరా (22818) రైలు రద్దు,
- 12వ తేదీన హైదరాబాద్-షాలిమార్ (18046),
- ఎర్నాకుళం-హౌరా (22878),
- సంత్రగాచి-తంబ్రం(22841),
- హౌరా-చెన్నై సెంట్రల్ (12839),
- ఈ నెల 13న సంత్రగాచి-చెన్నై సెంట్రల్(22807),
- హౌరా- ఎఎంవీటీ బెంగళూరు(22887),
- షాలిమార్-చెన్నై సెంట్రల్ (22825),
- షాలిమార్-హైదరాబాద్(18045),
- సికింద్రాబాద్-షాలిమార్(12774),
- హైదరాబాద్-షాలిమార్ (18046),
- విల్లుపురం-ఖరగ్‌పూర్(22604),
- ఈనెల 14వ తేదీన సర్వీసులందించే ఎస్‌ఎంవీటీ బెంగళూరు-హౌరా (22864),
- భాగల్పూర్ -ఎస్‌ఎంవీటీ బెంగళూరు(12254),
- షాలిమార్-సికింద్రాబాద్ (12773) సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.
Bulletin no. 28, SCR PR No.146 dt.11.06.2023 on "Cancellation / Restoration of Trains" @drmhyb @drmsecunderabad @drmvijayawada pic.twitter.com/nrm4V2PqbJ
— South Central Railway (@SCRailwayIndia) June 11, 2023
ఇది కూడా చదవండి: బిపర్‌జోయ్ తుపాను మహోగ్రరూపం
Comments
Please login to add a commentAdd a comment