సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వేకు బెదిరింపులతో లేఖ వచ్చినట్లు తెలుస్తోంది. ఒడిశా బాలాసోర్ తరహాలో వారం రోజుల్లో ప్రమాదం జరగబోతోందని లేఖలో సందేశం ఉన్నట్లు సమాచారం.
ఈ మేరకు గత వారం లేఖ రాగా.. దర్యాప్తు కోసం రాష్ట్ర పోలీసులకు ఆ లేఖను దక్షిణమధ్య రైల్వే అందించినట్లు సమాచారం. ఢిల్లీ-హైదరాబాద్ మార్గంలో ఈ ఘటన జరుగుతుందని లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ లేఖను వెస్ట్‌జోన్ డీసీపీ చందనా దీప్తి ధృవీకరించారు. మూడు రోజుల కిందట దక్షిణ మధ్య రైల్వే తమకు సమాచారం అందించిందని.. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనేదానిపై విచారణ చేపటినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment