
సాక్షి, రాజమండ్రి: బాలాజీపేట వద్ద గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. విశాఖ నుంచి విజయవాడవైపు వెళ్తున్న గూడ్స్ రైలు భోగి పట్టాలపై పడిపోయింది. దీంతో, పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు 9 రైళ్లను రద్దు చేశారు. 2 రైళ్లను పాక్షికంగా రద్దుచేసినట్టు తెలిపారు.
రైళ్ల వివరాలు ఇవే..
- విజయవాడ-విశాఖ, విశాఖ-విజయవాడ రైళ్లు రద్దు.
- గుంటూరు-విశాఖ, విశాఖ-గుంటూరు.
- గుంటూరు-విజయవాడ, కాకినాడ పోర్టు-విజయవాడ రైళ్లు రద్దు
- కాకినాడ పోర్టు-విజయవాడ రైలు పాక్షికంగా రద్దు.
- విజయవాడ-రాజమండ్రి రైలు పాక్షికంగా రద్దు. ఇక, పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment