rajamahedravaram
-
AP: పోలీసులు బకరా.. సినీ ఫక్కీలో దొంగ నోట్ల ముఠా డాన్ పరారీ
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో సినీ ఫక్కీలో దొంగ నోట్ల ముఠా సభ్యులు పోలీసుల నుంచి తప్పించుకున్నారు. ముఠా సభ్యులు పోలీసుల అదుపులోకి ఉన్న నిందితుడి తప్పించారు. దీంతో, నడిరోడ్డుపై అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది.వివరాల ప్రకారం..దొంగ నోట్ల కేసులో భీమవరంలో ఉన్న ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు శుక్రవారం రాత్రి శ్రీకాకుళం బయలుదేరారు. అదే సమయంలో పోలీసు వాహనాన్ని రెండు కార్లు, నాలుగు బైకులు వెంబడించాయి. కొంత దూరం వరకు వెళ్లిన తర్వాత అర్ధరాత్రి సమయంలో రాజమండ్రిలోని వీఎల్‌పురం వద్ద నిందితుడిని తీసుకెళ్తున్న శ్రీకాకుళం పోలీసుల వాహనాన్ని వారు అడ్డుకున్నారు. సినిమా ఫక్కీలో ఈకేసులో ఉన్న నిందితుడిని వారు తప్పించి.. తమ కారులో తీసుకెళ్లారు.అనంతరం, సదరు పోలీసులు.. 100కు కాల్ చేసి ఈ విషయాన్ని రాజమండ్రి పోలీసులకు చెప్పారు. దీంతో, కేసు నమోదు చేసిన రాజమండ్రి పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులను వెంబండించిన కార్ల నెంబర్లను సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక, దొంగ నోట్ల ముఠా డాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
అంతర్జాతీయ తెలుగు మహాసభలకు విచ్చేయనున్న హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ
రాజమహేంద్రవరం: ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ , చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అంధ్రమేవ జయతే! అన్న నినాదంతో తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా తేదీలు 5,6,7 జనవరి 2024 శ్రీ రాజరాజనరేంద్రుల వారి పట్టాభిషేక మహోత్సవ సహస్రాబ్ది సందర్భంగా సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం, గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహా సభలకు హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ విచ్చేయనున్నారని పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, చైతన్య విద్యా సంస్థల అధినేత శ్రీ చైతన్యరాజులు తెలిపారు. వారిని హైదరాబాద్ లో మహా సభల సమన్వయకర్త శ్రీ కేశిరాజు రామప్రసాద్ ,ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కలసి ఆహ్వానించినట్లు తెలిపారు. 6 జనవరి 2024 సాయంత్రం 6 గంటలకు జరిగే తెలుగు తోరణం సభకు వారు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రముఖులకు "రాజరాజ నరేంద్ర విశిష్ట పురస్కారాలను" ప్రదానం చేసి వారి ఆత్మీయ సందేశాన్ని ఇవ్వనున్నారని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. -డా.గజల్ శ్రీనివాస్, అధ్యక్షులు, 9849013697 -
అంతర్జాతీయ తెలుగు మహా సభలకు విచ్చేయన్ను నాగలాండ్ గవర్నర్
రాజమహేంద్రవరం: ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ , చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అంధ్రమేవ జయతే! అన్న నినాదంతో తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా తేదీలు5,6,7 జనవరి 2024 శ్రీ రాజరాజనరేంద్రుల వారి పట్టాభిషేక మహోత్సవ సహస్రాబ్ది సందర్భంగా సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం, గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహా సభలకు నాగాలాండ్ గవర్నర్ శ్రీ లా గణేషన్ విచ్చేయనున్నారని పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ చైతన్య రాజులు తెలిపారు. 7 జనవరి 2024 మధ్యాహ్నం 2 గంటలకు జరిగే "ఆంధ్రమేవ జయతే " సభలో వారు ముఖ్య అతిధిగా పాల్గొంటారు. అంధ్ర వాఙ్మయ వైజయంతి ప్రత్యేక సంచికను ఆవిష్కరించి, సౌజన్యం అందించిన వదాన్యులను సత్కరిస్తారని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. -డా.గజల్ శ్రీనివాస్,అధ్యక్షులు,9849013697 -
‘స్కిల్ స్కామ్ కేసుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది’
సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ స్కామ్ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ జరగాలన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్కిల్ స్కాం జరిగిందని జీఎస్టీ డీజీ తేల్చినట్టు ఉండవల్లి చెప్పుకొచ్చారు. కాగా, ఉండవల్లి అరుణ్‌కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ స్కామ్ కేసును జీఎస్టీ అధికారులు వెలికితీశారు. ఈ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరగాలి. స్కిల్ స్కామ్‌లో ఫైళ్లు మాయం చేశారని చెబుతున్నారు. స్కిల్ స్కామ్ కేసుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. పూణే జీఎస్టీ అధికారుల విచారణలో ఇది బయటపడింది. స్కిల్ స్కామ్ కేసును జీఎస్టీ అధికారులు వెలికితీశారు. ఈ ప్రాజెక్ట్‌తో సంబంధంలేదని సీమెన్స్ కంపెనీ చెప్పింది. ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని సీమెన్స్ తెలిపింది. ఒప్పందంపై సంతకం పెట్టిన వ్యక్తి తమ కంపెనీలో పనిచేయడం లేదని వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే జీఎస్టీ లేఖ రాసింది. చంద్రబాబు ఎందుకు ఎవరి మీదా చర్యలు తీసుకోలేదు?. బెయిల్ ఇవ్వలేదని జడ్జిపై ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడారు. ప్రాథమిక సాక్ష్యాధారాలతో రిమాండ్‌కు పంపించారు. సీబీఐ విచారణ చేస్తే ఫైళ్లు ఎలా తగటబడ్డాయో తెలుస్తుంది. టీడీపీలో మంత్రులుగా చేసిన వాళ్లు కూడా చౌకబారుగా విమర్శలు చేశారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ దేశం వదిలి పారిపోయారు. బెయిల్‌పై పిటిషన్ వేయకుండా కేసు కొట్టేయాలని వాదిస్తున్నారు. స్కిల్ స్కామ్‌లో వాస్తవాలు బయటకు రావాలి. ఈ కేసులో సీబీఐ ఎంక్వైరీ అడిగితే తప్పేంటి?. నేను సీబీఐ విచారణ కోరితే టీడీపీకి ఎందుకు కోపం వస్తోంది?. స్కిల్ స్కాంలో ఉన్నవి సూటుకేసు కంపెనీలు. చంద్రబాబుకు సౌకర్యాలు కావాలంటే కోర్టు ద్వారా అడగొచ్చు. రాజమండ్రి జైలులో చాలా సౌకర్యాలు ఉన్నాయి. లైబ్రరీ ఉంది.. వాకింగ్ చేయవచ్చు. కేసు ఒక పద్దతిలో వెళ్తోంది. స్కిల్ స్కామ్‌లో అవినీతి జరిగిందనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. చంద్రబాబుకు తెలియకుండా స్కామ్ జరిగిదంటే ఎవరూ నమ్మరు. చంద్రబాబు తనకు తాను సీఈవో అనుకుంటాడు’ అంటూ కామెంట్స్ చేశారు. -
రాజమహేంద్రవరానికి సీఎం జగన్
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ తొలి రోజు సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పర్యటించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద బాధితులను పరామర్శించిన అనంతరం సీఎం వైఎస్ జగన్ సోమవారం సాయంత్రం 6.24 గంటలకు హెలికాప్టర్లో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ సీఎం వైఎస్ జగన్‌కు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌కు చేరుకొన్నారు. రాత్రి అక్కడే బస చేశారు. బాధితులకు అండగా.. హెలిపాడ్ నుంచి గెస్ట్ హౌస్‌కు వచ్చే మార్గంలో సీఎం వైఎస్ జగన్‌ను చూసేందుకు ప్రజలు బారులు తీరారు. రోడ్లకు ఇరువైపులా నిలుచొని ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. సీఎం జగన్ వారికి అభివాదం చేశారు. దారిలో ఇద్దరు అనారోగ్య బాధితులను పలకరించారు. వారి సమస్య విని తక్షణం సహాయం చేయాలని జిల్లా కలెక్టర్ మాధవిలతను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్ ఆ కుటుంబాలకు వైద్య సేవల నిమిత్తం ఒక్కొక్కరికీ రూ. లక్ష సాయం అందజేశారు. కోనసీమ జిల్లాలో పర్యటన ఇలా.. సీఎం జగన్ మంగళవారం ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి అర్ట్స్ కళాశాలకు చేరుకుంటారు. 9.10కి ఆర్ట్స్ కళాశాల వద్ద హెలికాప్టర్లో బయలుదేరి 9.40కి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గురజపులంక చేరుకుంటారు. 10.25 వరకు గ్రామంలో వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. 10.35కు రామాలయపేటకు రోడ్డు మార్గానికి చేరుకుని, 11.10 వరకు రామాలయపేటలో వరద బాధితులతో మాట్లాడతారు. 11.10 గంటలకు అక్కడి నుంచి అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామానికి చేరుకుంటారు. 11.20 నుంచి 11.50 గంటల వరకు అక్కడ వరద బాధితులతో మాట్లాడతారు. 11.50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో గురజపు లంక గ్రామానికి 12.15 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో తాడేపల్లికి వెళతారు. -
రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లు
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ, రాజానగరం, కాకినాడలలో మంత్రులు రజిని, చెల్లుబోయిన వేణు, తానేటి వనిత సోమవారం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాజమహేంద్రవరంలో రూ.475 కోట్లతో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాల భవనాలు, ప్రభుత్వాస్పత్రిని పరిశీలించి రోగులకు అందుతున్న సేవలను మంత్రి రజిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలోనే రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్లు ప్రారంభమవుతాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, నంద్యాలల్లో మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. వీటిలో 750 సీట్లకు గాను 300 సీట్లకు అనుమతులు మంజూరు కాగా, మిగతా 450 సీట్లకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు రావాల్సి ఉందన్నారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళలను చిన్నచూపు చూడటం మానుకోవాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి రజిని సూచించారు. గోదావరి గట్టుపై జ్యోతిరావుపూలే, అంబేడ్కర్ భవన నిర్మాణానికి మంత్రులు రజిని, చెల్లుబోయిన వేణు, తానేటి వనితలు శంకుస్థాపన చేశారు. రాజానగరం నియోజకవర్గం కోటికేశవరంలో రూ.1.54 కోట్లతో నాడు–నేడులో నిర్మించిన పీహెచ్సీ భవనాన్ని మంత్రి రజిని ప్రారంభించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీరంగపట్నం కళాకారులు నలుగురి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన 8 మందికి రూ.లక్ష వంతున సీఎం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని రజిని, వేణు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అందించారు. కాకినాడ జీజీహెచ్‌లో రంగరాయ పూర్వ విద్యార్థులు సమకూర్చిన రూ.50 కోట్లతో మదర్ అండ్ చైల్డ్‌బ్లాక్, గాంధీనగర్‌లో రూ.1.20 కోట్లతో అర్బన్ హెల్త్ సెంటర్, ఆర్ఎంసీలో మెన్స్ హాస్టల్‌ను మంత్రి రజిని ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఎంపీలు వంగా గీత, మార్గాని భరత్ రామ్, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి) -
రాజమండ్రి జైలు చూశారా? ఎంతలో ఎంత మార్పు.?
(డెస్క్–రాజమహేంద్రవరం): చదువు దారి చూపుతుంది. దారి తప్పిన వారిని సన్మార్గంలోనూ నడుపుతుంది. రాజమహేంద్రవరంలోని కేంద్రకారాగారంలోని కొందరు ఖైదీల గురించి తెలుసుకుంటే ఇది అక్షర సత్యమని అర్థమవుతుంది. వివిధ పరిస్థితుల నేపథ్యంలో.. క్షణికావేశంలో కొందరు నేరానికి పాల్పడుతుంటారు. వీరంతా జైలుకు వచ్చి శిక్ష అనుభవిస్తారు. అయితే ఇక్కడి కారాగారం అధికారులు మాత్రం వీరి శిక్షను శిక్షణగా మారుస్తున్నారు. ఇందులో భాగంగా వీరిలో విద్యావెలుగులు నింపుతున్నారు. జైలులో జీవితం వృథా కాకుండా ఖైదీలను విద్యాబాట పట్టిస్తున్నారు. పరివర్తన దిశగా అడుగులు వేయిస్తున్నారు. ఆగిన చదువకు నడక సెంట్రల్ జైలుకు రాకమునుపు ఆపేసిన విద్యను చాలామంది ఇక్కడికి వచ్చాక కొనసాగించగలుగుతున్నారు. డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ ద్వారా వీరంతా పట్టభద్రులవుతున్నారు. కొందరు పోస్టు గ్రాడ్యుయేషన్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం 135 మంది డిగ్రీ చదువుతుండగా 87మంది ఎంఏ చదువుతున్నారు. 638 మంది ఇప్పటికే డిగ్రీ పూర్తి చేయడం విశేషం. వీరికోసం జైలు ప్రాంగణంలోనే పరీక్ష సెంటరు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్‌గా వీరికి క్లాసులు చెప్పడానికి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుంచి ఫ్యాకల్టీ సేవలను వినియోగించుకుంటున్నట్లు సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ రాజకుమార్ ‘సాక్షి’కి తెలిపారు. పెద్ద వయసుండీ నిరక్షరాస్యులైన ఖైదీలకు సైతం రాయడం చదవడం నేర్పుతున్నారు. ప్రస్తుతం 28మంది ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి అనంతలక్ష్మి అనే టీచరు బోధిస్తున్నారు. అబ్బురపరిచే లైబ్రరీ ఖైదీలు చదువుకునేందుకు లైబ్రరీ ఉంది. ఇందులో 4,300 పుస్తకాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు..ఆధ్మాత్మిక భావన కలిగించేందుకు దోహదపడే పుస్తకాలు ఉన్నాయి. లక్ష రూపాయల విలువైన పుస్తకాలను జైలు అధికారులు కొనుగోలు చేశారు. చదువుతోపాటు వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచేందుకు ఒక సెంటరును నిర్వహిస్తున్నారు. వెల్డింగ్..ప్లంబింగ్ కోర్సులకు ఇందులో శిక్షణ ఇస్తున్నారు. ఖరీదైన శిక్షణ పరికరాలను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం 30 మంది వంతున ఖైదీలు ఈ కోర్సులు నేర్చుకుంటున్నారు. గోల్డు మెడలిస్టులూ ఉన్నారు సెంట్రల్‌జైలులో శిక్షను అనుభవిస్తూ పట్టభద్రులైన కొందరు విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. షేక్ అజారుద్దీన్ బీఏలో స్వర్ణ పతకాన్ని సాధించారు. షేక్ సుభానీ ..టి వెంకటేశ్వరరావులు కూడా ఇదీ డిగ్రీలో గోల్డు మెడల్ సాధించారు. విజయవాడకు చెందిన జీ విజయరామ్ జైలులోనే పీజీ చదివి విడుదలయ్యాక వీఆర్ఓ ఉద్యోగాన్ని పొందారు. సారేపల్లి శ్రీనివాస్ మూడు డిగ్రీలు చదివారు. రంపచోడవరానికి చెందిన శ్రీనివాస్ కూడా మూడు పీజీలు చేశారు. ఇక్కడ పీజీ చదివాను మాది గుంటూరు. 30సంవత్సరాలుగా ఇక్కడ జైలులో ఉంటున్నాను. జైలుకు రాకమునుపు కరస్పాండెన్స్ కోర్సు డిగ్రీ చేయాలనుకున్నాను. ఇక్కడకు వచ్చాక పూర్తిగా చదువుపై దృష్టి పెట్టాను. ఎంఏ చదివాను. ఇక్కడి అధికారుల ప్రోత్సాహం నాలో ఉత్సాహాన్ని పెంచింది. నాకు ఇప్పుడు 54 సంవత్సరాల వయసు వచ్చింది. చదవడం వల్ల చాలా తెలుసుకున్నాను. విద్య మనిషిలో సత్ప్రవర్తనను పెంచుతుందని గ్రహించాను. విడుదల కోసం ఎదురుచూస్తున్నాను. – గంటెల విజయవర్దన్ మూడు ఎంఏలు చేశాను మాది రంప చోడవరం. నేను జైలుకు వచ్చి 11 సంవత్సరాలు అవుతోంది. ఓ హత్య కేసులో నాకు శిక్ష పడింది. జైలుకు వచ్చే ముందు ఎమ్మెస్సీ బీఈడీ చదివాను. ఇప్పుడు మూడు ఎంఏలు చేశాను. పాలిటిక్స్..పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్..సోషియాలజీలతో ఈ పీజీలు చదివాను. ఈ శిక్షా కాలం నా జీవితంలో ఊరికే పోలేదని భావిస్తున్నాను. జైలు అధికారుల తోడ్పాటుతో మళ్లీ చదువుకోగలిగాను. చదువు వల్ల ఆత్మవిశ్వాసం పెరిగింది. గౌరవమూ పొందగలుగుతుండటం నాకు సంతోషం కలిగిస్తోంది. – శ్రీనివాస దొర పరివర్తనే ధ్యేయంగా.. ఖైదీలలో పరివర్తనే ధ్యేయంగా పనిచేస్తున్నాం. శిక్షాకాలంలో విద్య లేదా నైపుణ్య కోర్సు నేర్చుకునో బయటకు వెళ్లాక ఉపాధిబాట పట్టేలా తీర్చిదిద్దేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. ఈ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలను రూపొందించి అనుసరిస్తున్నాం. మళ్లీ నేరాల వైపు మనసు మళ్లకుండా ఉద్యోగం లేదా ఉపాధి వైపు దృష్టి పెట్టాలనేది మా అభిమతం. అందుకే జైలులో శిక్షాకాలం వృథా కానీయడం లేదు. ప్రభుత్వం నుంచి కూడా ఇందుకు మంచి సహకారం లభిస్తోంది. ఖైదీలు చదువుకోడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. వీరిని ఉత్సాహపరిచేలా సహకారం అందిస్తున్నాం. – రాజారావు, జైలు సూపరింటెండెంట్ -
అతివల ఆర్థికాభివృద్ధికి ‘ఆసరా’!
సాక్షి, రాజమహేంద్రవరం: స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తితో జీవించేలా ప్రోత్సహించేందుకు ‘వైఎస్సార్ ఆసరా’ పథకానికి రూపకల్పన చేశారు. సంఘాల్లో మహిళలు తీసుకున్న రుణాలను విడతల వారీగా మాఫీకి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో రూ. 485 కోట్లు అక్కచెల్లెమ్మలకు అందజేశారు. తాజాగా శనివారం మూడో విడతలో రూ.242.85 కోట్లు రుణమాఫీ చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను డీఆర్డీఏ అధికారులు పూర్తి చేశారు. ఆదివారం నుంచి ఆసరా సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్దేశం ఇదీ.. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన సమయంలో తాను అధికారంలోకి వస్తే దశల వారీగా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 11, 2019 నాటికి వారు తీసుకున్న రుణాలను ఎంతైతే అప్పు నిల్వ మిగిలి ఉంటుందో వాటిని నాలుగు విడతలుగా ఆయా సంఘాలకు చెల్లించేందుకు ఆసరా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే ఆచరణలోకి తీసుకొచ్చారు. తూర్పు గోదావరిలో ఇలా.. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల పరిధిలో 19 మండలాలున్నాయి. తొలి దశలో 27,297 సంఘాలకు రూ.241.98 కోట్లు, రెండో దశలో 27,417 సంఘాలకు రూ.244.04 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరింది. వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా శనివారం మూడో విడత కింద జిల్లాలో 27,413 స్వయం సహాయక సంఘాలకు లబ్ది చేకూరనుంది. రూ.242.85 కోట్ల నగదు మహిళల ఖాతాల్లో జమ కానుంది. సీఎం జగన్ నేరుగా బటన్ నొక్కి ప్రక్రియ ప్రారంభిస్తారు. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం కృషి చేసింది. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా జాబితా రూపకల్పన చేశారు. సచివాలయాల వద్ద జాబితాను అందుబాటులో ఉంచారు. సభ్యులు చనిపోయినా నామినీ వివరాలు అధికారులకు అందజేస్తే పరిష్కరించి సొమ్ము అందజేసేలా చర్యలు తీసుకుంటారు. రేపటి నుంచి వారోత్సవాలు ఆదివారం నుంచి వాడవాడలా ఆసరా సంబరాలు నిర్వహించేందుకు డీఆర్డీఏ సన్నద్దం చేస్తోంది. గ్రామం, మండల కేంద్రం, పట్టణం, నగరం మెదలు అన్ని ప్రాంతాల్లో ‘గడప గడపకు ఆసరా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 25 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ప్రజలకు, మహిళలకు వివరించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళలకు చేస్తున్న ఆర్థిక సాయంపై అవగాహక కల్పించనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశారు. టీడీపీ హయాంలో మోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాలకు తీరని అన్యాయం జరిగింది. 2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని ప్రకటించారు. దీంతో మహిళలు రుణాలు చెల్లించలేదు. అనంతరం అధికారంలోకి వచ్చిన బాబు హామీ ఊసే ఎత్తలేదు. చేసేది లేక మహిళలు చేసిన అప్పుకు వడ్డీతో సహా చెల్లించాల్సిన దుస్థితి తలెత్తింది. అప్పుకోసం బ్యాంకర్ల ద్వారా వేధింపులకు గురయ్యారు. తిరిగి 2019 ఎన్నికల సమంయలో మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకునేందుకు బాబు కొత్త పన్నాగం పన్నారు. ఎన్నికల సమయంలో తాయిలాలుగా పసుపూకుంకుమ కింద నగదు అందజేసి చేతులు దులుపుకున్నారు. గ్రహించిన డ్వాక్రా మహిళలు ఎన్నికల్లో బాబును దూరం పెట్టారు. వైఎస్సార్సీపీకి అధికారం కట్టబెట్టారు. స్వయం ఉపాధి దిశగా అడుగులు ప్రభుత్వం అంజేస్తున్న ఆసరా సొమ్ముతో మహిళలు స్వయం ఉపాధి దిశగా దృష్టి సారిస్తున్నారు. దీంతో పాటు స్త్రీనిధి ద్వారా వచ్చిన సొమ్మును జమ చేసుకుని పాడి పశువుల పెంపకం, కిరాణా దుకాణం, గుడ్లు విక్రయించడం, టెంట్లు అద్దెకు ఇస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. జీవన ప్రమాణాల మెరుగునకు కృషి మహిళల జీవన ప్రమాణాలు, ఆర్థిక ప్రగతి సాధించేందుకు ఆసరా పథకం ఎంతగానో దోహదం చేస్తుంది. రుణమాఫీ ద్వారా వచ్చే నగదుతో పాడి పరిశ్రమ, చిరు వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నాం. స్వయం ఉపాధి పొందేలా అవగాహన కల్పిస్తున్నాం. ఫలితంగా మహిళలు కుటుంబ పోషణకు భర్తకు చేదోడుగా నిలుస్తున్నారు. ఇప్పటికే రెండు దశల్లో ఆసరా నిధులు విడుదలయ్యాయి. ఆసరా వారోత్సవాల సందర్భంగా అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రతి గ్రామంలో వివరిస్తాం. –ఎస్.సుభాషిణి, పీడీ డీఆర్డీఏ. -
Viral Wedding Card: వి‘వాహ్’ శుభలేఖ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ లవ్
రెండు వేల రూపాయల నోటు తరహాలో పెళ్లి శుభలేఖ అచ్చు వేయించి అందర్నీ ఆశ్చర్యపరిచారు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఏడిద వెంకటేష్. తన చిన్న కుమార్తె పెళ్లికి పరిమాణంలో.. రూపంలో అచ్చం రెండు వేల రూపాయల నోటును పోలినట్లుంది పెళ్లి కార్డు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అక్షరాలుండే చోట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ లవ్ అనే పదముంది. ‘మేము ఇరువురం వివాహం చేసుకుంటున్నాం.. జీవితపు చివరి శ్వాసవరకూ కలసి ఉంటామని వాగ్దానం చేస్తున్నాం’ అని సింపుల్‌గా సారాంశం ఉంది. నోటుకు మరోవైపు పెళ్లి వివరాలు ముద్రించారు. కొందరికి శుభలేఖ చేతిలో పెడుతుంటే నిజంగా రెండు వేల నోటు అనుకుని నోటు తీసుకునేందుకు మొహమాటపడ్డారు. శుభలేఖేనని తెలుసుకుని వారి సృజనశైలిని మెచ్చుకున్నారు. కాగా, 2017లో వెంకటేష్ తన పెద్ద కుమార్తె పెళ్లికి ఆహ్వాన పత్రికను బ్యాంక్ ఏటీఎం కార్డు తరహాలో ముద్రించి ఆకట్టుకున్నారు. తక్కువ ఖర్చు, సృజనాత్మకత కోసమే తాను ఇలా చేశానని వెంకటేష్ ‘సాక్షి’కి తెలిపారు. – రాజమహేంద్రవరం సిటీ -
నేను విన్నాను.. నేను ఉన్నాను...
సాక్షి, రాజమహేంద్రవరం: తమ ప్రియతమ నేత.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ కష్టం చెప్పుకుంటే పరిష్కారమవుతుందని వారంతా భావించారు. ఈ నెల 3న రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాలలో పింఛన్ వారోత్సవాలకు వచ్చిన సీఎంకు తమ సమస్యలను నివేదించారు. వారి సమస్యలను విన్న జగన్ వెంటనే స్పందించారు. కలెక్టర్ మాధవీలతను పిలిచి పరిష్కరించాలని ఆదేశించారు. కాన్వాయ్ ఆపించి కిందకు దిగి మరీ సమస్యను విన్నారు. తక్షణమే న్యాయం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సీఎంకు ఇచ్చిన వినతులపై కలెక్టర్ వెంటనే కసరత్తు ప్రారంభించారు. నాలుగు రోజుల వ్యవధిలోనే చకచకా పరిష్కారం చూపారు. బాధితులకు కలెక్టర్ మాధవీలత శనివారం ప్రభుత్వ సాయం అందజేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలు, చెక్కులను, ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. తమ కష్టం చెప్పగానే సీఎం స్పందించి పరిష్కారం చూపడంతో బాధిత కుటుంబీకుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. మా అబ్బాయి ఆరోగ్యానికి భరోసా రాజమహేంద్రవరం లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 16 ఏళ్ళ సాయి గణేష్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. వైద్యం చేయించడానికి పడుతున్న ఇక్కట్లను సీఎంను కలిసి బాధితుడి తండ్రి వివరించాడు. జగన్ ఆదేశాల మేరకు తక్షణ ఆర్థిక సహాయం కింద రూ.లక్ష కలెక్టర్ అందజేశారు. ప్రతినెలా రూ.5 వేలు పెన్షన్ అందేలా ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం జగనన్నను కలిసినప్పుడు మా అబ్బాయి ఆరోగ్యానికి భరోసా ఇచ్చారు. ఆయన చెప్పడంతో కలెక్టర్ రూ.5 వేలు పెన్షన్ సౌకర్యం కల్పించారు. ఆరోగ్యశ్రీ కింద వైద్య సహయం అందిస్తామన్నారు. ముఖ్యమంత్రికి, కలెక్టర్‌కు కృతజ్ఞతలు. – గులిన శ్రీ సాయి గణేష్ తండ్రి, లాలాచెరువు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు.. నిడుదవోలు శెట్టిపేటకు చెందిన రెండేళ్ల డయానా శాంతి స్పైనల్ మసు్క్యలర్ వ్యాధితో బాధపడుతోంది. ఈ బాలిక కష్టం గురించి తెలుసుకున్న సీఎం చలించిపోయారు. ఆయన ఆదేశాల మేరకు బాలిక తల్లి సూర్యకుమారికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని కలెక్టర్ అందజేశారు. సూర్యకుమారికి నిడదవోలు పీహెచ్సీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం, పాపకి ప్రత్యేక కేటగిరీ కింద నెలకు రూ.5 వేలు పెన్షన్ సౌకర్యం మంజూరు చేశారు. మా అమ్మాయి శాంతి వైద్య సహాయం కోసం సీఎం హామీ ఇచ్చారు. కానీ ఇంత తొందరగా ఆ హామీ నేరవేరుస్తారనుకోలేదు. మా కుటుంబ జీవనానికి భరోసా ఇచ్చేలా ఉద్యోగం కూడా ఇచ్చారు. నిడదవోలు మండలంలో ఇంటి స్థలం ఇస్తామన్నారు. సీఎం జగనన్న చల్లగా ఉండాలి. – సి. సూర్యకుమారి, బాధితురాలి తల్లి, నిడదవోలు పాప ఆరోగ్యానికి ఆర్థిక సాయం రాజమహేంద్రవరం దేవిచౌక్‌కు చెందిన సిరికొండ దుర్గా సురేష్ కుమార్తె గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. మున్సిపల్ కార్పొరేషన్లో దుర్గా సురేష్‌కు ఉన్న చిరుద్యోగం కూడా ఇటీవల పోయింది. ఆయన సీఎం జగన్ దృష్టికి తన సమస్య నివేదించారు. సీఎం ఆదేశాల మేరకు దుర్గా సురేష్‌కు ఆర్ఎంసీలో డ్రైవర్ ఉద్యోగం కల్పిస్తూ పునర్ నియామక ఉత్తర్వులు కలెక్టర్ అందచేశారు. పాప ఆరోగ్యం కోసం రూ.లక్ష ఆర్థిక సహాయంతో ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. చాలామంది అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం కలుగలేదు. సీఎం జగనన్నను కలిశాను. ఆయన వెంటనే స్పందించి కలెక్టరమ్మకు ఆదేశాలు ఇచ్చారు. ఆమె వెంటనే మనసు పెట్టి మా సమస్యలు పరిష్కరించారు. జగనన్న ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను. – సిరికొండ దుర్గా సురేష్, రాజమహేంద్రవరం జగనన్న మాటతోఉద్యోగం వచ్చింది... రాజానగరం నామవరానికి చెందిన కాశాని దుర్గా శ్రీదేవి భర్త గతేడాది మార్చిలో మరణించాడు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పిల్లల్ని చదువులు చదివించేందుకు ఆర్థిక భరోసా కల్పించాలని దుర్గా శ్రీదేవి సీఎం జగన్‌ను కలిసి కోరింది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో కడియం మండలం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆమెకు డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగమిస్తూ నియామక ఉత్తర్వులను కలెక్టర్ శనివారం అందజేెశారు. 3వ తేదీన ముఖ్యమంత్రి జగనన్నను కలిసే అదృష్టం వచ్చింది.నాకు కష్టాలను చెప్పాను. పెద్ద మనసుతో ముఖ్యమంత్రి జగనన్న స్పందించారు. ఇంత త్వరగా నాకు ఉద్యోగం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాను. – కాశాని దుర్గా శ్రీదేవి, నామవరం జగనన్న మనసున్న మారాజు... రాజమహేంద్రవరం చర్చిపేటకు చెందిన క్రిస్టఫర్ 25 సంవత్సరాలుగా ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిసి ఇటీవల కలిశారు. సీఎం తెలుసుకుని న్యాయం చేయాలని ఆదేశించారు. వెలుగుబంద జగనన్న కాలనీలో ప్లాట్ నంబర్ 53లో 77 చదరపు గజాల స్థలానికి చెందిన పట్టాను కలెక్టర్ మాధవీలత అందచేశారు. ఒంటరిగా ఉంటున్న నాకు గతంలో ఎవరూ ఇంటి స్థలం ఇవ్వలేదు. జగనన్నను కలిసి కష్టం చెప్పుకున్నాను. ఆయన అంతా విన్నారు. ఇంటి స్థలమిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెళ్లిన వెంటనే నాకు ఇంటి స్థలం వస్తుందని అనుకోలేదు. ముఖ్యమంత్రి‡ జగనన్నకు ధన్యవాదాలు. – కె. క్రిస్టఫర్, రాజమహేంద్రవరం (చదవండి: మసకబారుతున్న ‘స్వర్ణ’కారుల బతుకులు) -
నిత్యసాహితీ ప్రవాహి
ఒకసారి నలభయ్యేళ్లు వెనక్కి వెడితే... విశాఖ సాహితిలో పనిచేసిన ప్రముఖ కథారచయిత మల్లాప్రగడ రామారావు ఉద్యోగరీత్యా రాజ మహేంద్రవరం వచ్చారు. అంతలో కొడవటిగంటి కుటుంబరావు (కొ.కు.) కన్ను మూసినట్టు వార్త వచ్చింది. ఒకనాటి తెలుగువారి సాహిత్య రాజధాని అయిన రాజమహేంద్రవరంలో కొ.కు. సంతాప సభ జరగక పోవడం ఆయనకు తలవంపుగా అనిపించింది. ఒక సాహితీ సంస్థను ఏర్పరచాలన్న వారి ఆలోచనకి మరికొందరు ఔత్సాహికులు కలిశారు. 1980 డిసెంబర్ 25న ‘సాహితీ వేదిక’ అవతరించింది. ఆ తర్వాత నాతో సహా మరెందరో చేరికతో అది మరింత వైశాల్యాన్ని తెచ్చుకుని యేడెనిమిదేళ్లు ఉనికిని చాటుకుంది. సభ్యుల్లో అనేకమంది తలోవైపుకీ చెదిరిపోవడంతో వేదిక క్రమంగా కనుమరుగై ఒక తీపి జ్ఞాపకంగా మిగిలింది. ఇప్పుడు మళ్ళీ ఈ నెల 25, 26 తేదీల్లో వేదిక సభ్యులం వేదిక ప్రస్థానాన్ని పునశ్చరణ చేసుకునేందుకు కలుసుకోబోతున్నాం. అనేక ప్రత్యేకతలున్న సంస్థ ‘సాహితీవేదిక’. అందరూ వక్తలు, శ్రోతలుగా ఉండే ఒక ప్రజాస్వామిక వేదికగా ఉండేది. భిన్న భావాలు, సిద్ధాం తాలు, ఆచరణలు, ఆకాంక్షలు ఉన్న... రచయితలూ, చదువరులతో, ‘నూరు ఆలోచనలు సంఘర్షించనీ వెయ్యి పువ్వులు వికసించనీ’ అన్నట్టుగా భావప్రకటనా స్వేచ్ఛతో ప్రభాత గౌతమిలా తళతళలాడుతుండేది. ఉత్తమ సాహిత్య ప్రమాణాలను పాటించడంలో వేదిక ఎన్నడూ రాజీపడలేదు. వామపక్షవాదులు మొదలు కొని సాంప్ర దాయవాదుల వరకూ సభ్యులుగా ఉండేవారు. ఒకరినొ కరం సహనంగా చెవొగ్గి వినటం, గౌరవించాల్సిన విష యాల్ని గౌరవించటం, విమర్శించాల్సిన వాటిని విమర్శించే పద్ధతిని పాటించాం. వేదిక కార్యక్రమాలు ఎంతో ఆసక్తిగొలిపేవి. వాటి కోసం ఉత్సాహంగా ఎదురు చూసే వాళ్ళం. ‘నిరుడు కురిసిన హిమ సమూహములు’ అనే విభాగం కింద వెనుకటి తరం రచయితల కథో, కవితో చదవడంతో సమావేశాన్ని ప్రారంభించేవారం. ప్రతినెలా రెండవ ఆదివారం జరిపే ‘సమాలోచన’ కార్యక్రమంలో ఆయా విశిష్ట రచనలపై ప్రసంగ వ్యాసాలు చదివేవారం. ఉగాది రోజున సాయంత్రం ‘ఇష్ట కవితా పఠనం’లో తనకి ఇష్టమైన కవి నుండి తాము ఎన్నుకున్న కవితని గోదావరి నదీతీరంలో మెట్ల మీద కూర్చుని పఠించే వాళ్ళం. వేదిక తొలి కథాసంకలనం ‘కథావేదిక’ను ఆర్ఎస్ సుదర్శనం, రెండవ కథాసంకలనం ‘కథాగౌతమి’ని కె. వాసమూర్తి, మొదటి ‘కవితావేదిక’ను గుంటూరు శేషేంద్ర శర్మ, ‘ఆర్కెష్ట్రా’ను వేగుంట మోహనప్రసాద్ ఆవిష్కరించడం వేదిక సభ్యులకి విలువైన జ్ఞాపకం. రెండవ వార్షికో త్సవ సభకు ముఖ్య అతిథిగా కాళీపట్నం రామారావు పాల్గొనటం ఓ మధురస్మృతి. నేటి పునస్సమాగమాన్ని పురస్కరించుకుని వేదిక గురించిన ఒక విశేష సంచికను, కొంతమంది సభ్యుల పుస్తకాలను ఆవిష్కరించుకోబోతున్నాం. ‘సాహితీ వేదిక’ అందమంతా తన విశాలత్వమే. అది మా తలపుల్లో గోదావరిలా నిత్యప్రవాహి. కుప్పిలి పద్మ వ్యాసకర్త కవయిత్రి, కథకురాలు -
ఆ రైళ్లను ఆపండి.. రైల్వే బోర్డు ఛైర్మన్‌కు ఎంపీ భరత్ విజ్ఞప్తి
సాక్షి, ఢిల్లీ: రాజమండ్రి, కొవ్వూరు రైల్వే స్టేషన్లలో పలు ప్రధానమైన రైళ్లు హాల్టులు, స్టాప్లకు అనుమతి ఉత్తర్వులు జారీ చేయాలని రైల్వే బోర్డు ఛైర్మన్ అండ్ సీఈవో వీకే త్రిపాఠిని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ కోరారు. ఢిల్లీలో రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవోలను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. రాజమండ్రి నగర ప్రాధాన్యత, సుదూర ప్రాంతాల నుండి నిత్యం ఇక్కడకు వచ్చే వ్యాపార, వాణిజ్య, యాత్రికులకు కావలసిన రైళ్లు అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారని ఎంపీ భరత్ త్రిపాఠికి తెలిపారు. హౌరా టు శ్రీ సత్య సాయి నిలయం ఎక్స్‌ప్రెస్, భువనేశ్వరం టు రామేశ్వరం ఎక్స్‌ప్రెస్, భువనేశ్వరం - పూణే ఎక్స్‌ప్రెస్, చెన్నై-జాల్పిగురి సూపర్-ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కామాక్య యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్, పాండిచ్చేరి హెచ్ డబ్ల్యూ హెచ్ ఎక్స్‌ప్రెస్‌లు హాల్ట్స్, స్టాప్స్‌కు అనుమతి కోరారు. విమానాశ్రయం, ఓఎన్జీ బేస్ కాంప్లెక్స్, ఏపీ పేపర్ మిల్స్, జీఎస్కే హార్లిక్స్, మూడు గ్యాస్ పవర్ ప్రాజెక్ట్స్ తదితర అనేక పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కూడా రాజమండ్రికి చేరువలోనే ఉందన్నారు. విశాఖపట్నం- విజయవాడ నగరాలకు మధ్యలో ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన కేంద్రంగా రాజమండ్రి నగరం అన్ని రంగాలలోనూ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. టూరిజం హబ్ గా శరవేగంగా రాజమండ్రి, పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అయితే ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి వచ్చే యాత్రికులకు, టూరిస్టులకు, వ్యాపార, వాణిజ్య, వివిధ రంగాల వారికి అనువైన విధంగా రైళ్లు సదుపాయం లేకపోవడంతో చాలా కష్టంగా ఉంటోందని రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో త్రిపాఠికి వివరించినట్టు ఎంపీ భరత్ తెలిపారు. అలాగే కొవ్వూరు రైల్వే స్టేషన్లో కొన్ని రైళ్లకు హాల్ట్స్, స్టాప్స్ ఆపివేశారని, వాటిని కూడా పునరుద్ధరించాలని త్రిపాఠిని కోరినట్లు ఎంపీ భరత్ తెలిపారు. బొకారో, సింహాద్రి, తిరుమల, తిరుపతి-పూరి, సర్కార్, కాకినాడ- తిరుపతి, మచిలీపట్నం- విశాఖ, రాయగడ-గుంటూరు, బిలాస్పూర్ ఎక్స్‌ప్రెస్ లను పునరుద్ధరించాల్సిందిగా ఎంపీ భరత్ కోరారు. కొవ్వూరు, గోపాలపురం, తాళ్ళపూడి, పోలవరం మండలాలకు చెందిన సుమారు 60 గ్రామాల ప్రజలు కొవ్వూరు రైల్వే స్టేషను నుండి ప్రయాణం చేయాలని, అటువంటిది రైళ్ల హాల్ట్స్, స్టాప్స్ లేకపోవడంతో మరో 15 కిలోమీటర్లు అదనపు దూరం ప్రయాణించి రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు రావలసి వస్తోందన్నారు. నిలిచిపోయిన రైళ్లను పునరుద్ధరించి, ఆరు నెలలు పరిశీలించాలని.. అప్పటికీ రైల్వే శాఖకు తగిన ఆదాయ వనరులు రాకుంటే మీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకోవచ్చని త్రిపాఠికి ఎంపీ భరత్ సూచించారు. అలాగే అనపర్తి, నిడదవోలులో జన్మభూమి ఎక్స్‌ప్రెస్, రాజమండ్రి నుండి లోకల్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు కొనసాగించమని కోరినట్టు ఎంపీ భారత్ వివరించారు. తన అభ్యర్థనలపై రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈవో త్రిపాఠి సానుకూలంగా స్పందించారని ఎంపీ భరత్ తెలిపారు. చదవండి: చంద్రబాబు ‘ఆఖరు మాటలు’ దేనికి సంకేతం? -
రాజమండ్రి: గూడ్స్ ప్రమాదం ఎఫెక్ట్.. 9 రైళ్లు రద్దు
సాక్షి, రాజమండ్రి: బాలాజీపేట వద్ద గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. విశాఖ నుంచి విజయవాడవైపు వెళ్తున్న గూడ్స్ రైలు భోగి పట్టాలపై పడిపోయింది. దీంతో, పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు 9 రైళ్లను రద్దు చేశారు. 2 రైళ్లను పాక్షికంగా రద్దుచేసినట్టు తెలిపారు. రైళ్ల వివరాలు ఇవే.. - విజయవాడ-విశాఖ, విశాఖ-విజయవాడ రైళ్లు రద్దు. - గుంటూరు-విశాఖ, విశాఖ-గుంటూరు. - గుంటూరు-విజయవాడ, కాకినాడ పోర్టు-విజయవాడ రైళ్లు రద్దు - కాకినాడ పోర్టు-విజయవాడ రైలు పాక్షికంగా రద్దు. - విజయవాడ-రాజమండ్రి రైలు పాక్షికంగా రద్దు. ఇక, పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. -
పట్టాలు తప్పిన రైలు.. విశాఖ వైపు వెళ్లే పలు ట్రైన్స్ ఆలస్యం!
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి బాలాజీపేట వద్ద గూడ్స్ రైలు పట్టింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, బుధవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు భోగి పూర్తిగా పట్టాలపై పడిపోయింది. ఇక, ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని భోగిని పట్టలాపై నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం కారణంగా విశాఖ వైపునకు వెళ్లు ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అత్తిలి వద్ద పలు రైళ్లు నిలిచిపోయాయి. -
మీసం మెలేసి.. చెప్పులు విసిరి
సాక్షి, రాజమహేంద్రవరం: అమరావతి యాత్ర ముసుగులో టీడీపీ, జనసేన నేతలు రాజమహేంద్రవరంలో బీభత్సం సృష్టించారు. వికేంద్రీకరణకు మద్దతుగా శాంతియుతంగా సభ నిర్వహించి నిరసన వ్యక్తంచేస్తున్న స్థానికులపై ఆ పార్టీల శ్రేణులు విరుచుకుపడ్డారు. మీసం మెలేసి మరీ రెచ్చగొట్టారు. ‘యాత్రను ఆపేదెవరు’ అంటూ పాటలు పెట్టుకుని మరీ రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శించారు. వాటర్ ప్యాకెట్లు, చెప్పులు విసిరి రౌడీయిజానికి తెర తీశారు. రాళ్ల దాడికీ తెగబడ్డారు. మురికినీళ్ల బాటిళ్లు విసిరారు. అప్పటివరకు సహనంగా ఉన్న స్థానికులు ఒక్కసారిగా ప్రతిఘటించడంతో నగరంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ చేపట్టిన పాదయాత్ర మంగళవారం రాజమహేంద్రవరం నగరంలోకి ప్రవేశించింది. దేవీచౌక్ మీదుగా ఆజాద్ చౌక్ వద్దకు యాత్ర చేరుకుంది. అప్పటికే ఆజాద్ చౌక్ వద్ద యాత్ర వెళ్లే ప్రాంతానికి కొంతదూరంలో వికేంద్రీకరణకు మద్దతుగా స్థానికులు శాంతియుతంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. పాదయాత్ర ఆజాద్ చౌక్ వద్దకు చేరుకోగానే స్థానికులు నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. ‘వికేంద్రీకరణ ముద్దు.. ఒకే రాజధాని వద్దు’ అని నినదించారు. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన అమరావతి పాదయాత్రలోని కొందరు టీడీపీ, జనసేన నేతలు యాత్ర వెంట తెచ్చుకున్న వాటర్ ప్యాకెట్లను స్థానికులపైకి విసిరారు. మీసం మెలేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ప్రత్యేక వాహనాన్ని అక్కడ నిలిపి ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేక పాటలతో హోరెత్తించారు. బాణాసంచా కాలుస్తూ హంగామా సృష్టించారు. దీంతో ఒక్కసారిగా స్థానికులు ప్రతిఘటించి నిరసన వ్యక్తం చేశారు. యాత్ర ముసుగులో వాటర్ ప్యాకెట్లు, బాటిళ్లు, చెప్పులు విసురుతున్న వాటిని పట్టుకుని తిరిగి వాళ్లపైకి విసిరారు. టీడీపీ బినామీలు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇలా సుమారు గంటపాటు ప్రతిఘటన ఎదురైంది. అక్కడే ఉన్న టీడీపీ రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి సైతం దాడిని ప్రోత్సహించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు కలగజేసుకుని పాదయాత్రను ముందుకు కదలనివ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇద్దరు కార్యకర్తలకు తీవ్రగాయాలు.. మరోవైపు.. అమరావతి రైతుల ముసుగులో టీడీపీ, జనసేన నేతలు జరిపిన రాళ్ల దాడిలో కొండా సాయి, కె. నూకరాజు అనే వ్యక్తులకు తలపై, ఎడమ కంటి వద్ద బలమైన గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని ఎంపీ మార్గాని భరత్ వైద్యులకు సూచించారు. రాజమహేంద్రవరం చరిత్రలో ఇది చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. అలాగే, దాడిని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్‌రావు దాడిని ఖండించారు. -
లోన్ యాప్ ఘటనలో ఏడుగురి అరెస్ట్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): లోన్ యాప్ వేధింపులకు బలైన దంపతుల సంఘటనలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. రాష్ట్రంలో రుణ యాప్ బాధితులు పెరుగుతుండటంతో సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. లోన్ యాప్‌లతో వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ నెల ఏడో తేదీన రాజమహేంద్రవరానికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి, వారంలోనే నిందితుల్ని పట్టుకున్నారు. స్థానిక దిశా పోలీస్ స్టేషన్లో సోమవారం మీడియాకు జిల్లా ఇన్చార్జి ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి వివరాలు తెలిపారు. భార్యాభర్తల ఆత్మహత్యకు కారణమైన హాండీ లోన్, స్పీడ్ లోన్ యాప్‌లపై పోలీసులు ఆరా తీశారు. దీనికి సంబంధించి మూడు పోలీసు బృందాలు పనిచేశాయి. యాప్‌లకు, లోన్ తీసుకునే వారికి మధ్యవర్తులుగా పని చేస్తున్న వారిని గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం గండిపేట మండలం మానికొండకు చెందిన లంబాడీ నరేష్, మియాపూర్‌కు చెందిన కొల్లూరు శ్రీనివాస్‌యాదవ్, కాకినాడ జిల్లా తిమ్మాపురానికి చెందిన మేడిశెట్టి పృథ్వీరాజ్, ఏలేశ్వరానికి చెందిన నక్కా సుమంత్, అన్నవరానికి చెందిన మండా వీరవెంకటహరిబాబు, విశాఖ జిల్లా కేకే అగ్రహారానికి చెందిన కోరుపోలుత రామకృష్ణ, అనకాపల్లి సమీపంలోని సిరసపల్లికి చెందిన దానబోయిన భాస్కర్లు నిందితులని పోలీసులు గుర్తించారు. వీరి బ్యాంకు ఖాతాలను పరిశీలించగా నెలలోనే రూ.కోటి లావాదేవీలు చేసినట్టు గుర్తించారు. బ్యాంకు అధికారులకు అనుమానం రాకుండా ప్రతి నెలా వేర్వేరు ఖాతాలను వీరు నిర్వహిస్తున్నారు. పోలీసులకు ఇతర రాష్ట్రాల్లోని యాప్ నిర్వాహకుల సమాచారం కూడా లభిం చడంతో ఆ దిశగా కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. త్వర లోనే వీరిని కూడా పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. -
AP: మంత్రి విశ్వరూప్‌కు అస్వస్థత.. హైదరాబాద్‌కు తరలింపు
సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం మైల్డ్ స్ట్రోక్‌కు గురికావడంతో కుటుంబ సభ్యులు విశ్వరూప్‌ను వెంటనే రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. అనంతరం, విశ్వరూప్‌ను హెల్త్ కండీషన్‌ను పరిశీలించిన వైద్యులు.. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఎన్ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స అందించారు. కాగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈరోజు(శుక్రవారం) వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా మంత్రి విశ్వరూప్.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన చేయి లాగుతుందని నాయకులకు చెప్పడంతో విశ్వరూప్‌ను వెంటనే రాజమహేంద్రవరంకి తీసుకు వెళ్లారు. ఇది కూడా చదవండి: బయటకు పొక్కని ‘రహస్యం’.. ఆ విషయంలో చేతులెత్తేశారా? -
ఖైదీలపై అనంతబాబు దాడి పూర్తి అవాస్తవం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నించాలని, అవాస్తవాలతో కట్టుకథలు అల్లి, లేనిని ఉన్నట్టు చెప్పడం సరికాదని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావు అన్నారు. జైల్లోని ఖైదీలను ఎమ్మెల్సీ అనంతబాబు కొట్టారని, జైల్లో రాచమర్యాదలు.. అని కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు పూర్తి అవాస్తవమని పేర్కొంటూ జైళ్ల శాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును కేంద్ర కారాగారంలోని ఓ బ్లాకులో సింగిల్ సెల్లో ఉంచినట్టు రాజారావు తెలిపారు. సెక్యూరిటీ రీత్యా సెల్లో 24 గంటలూ సిబ్బంది పహారా, నిత్య పర్యవేక్షణ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అందువలన తోటి ఖైదీలతో ఎలాంటి వివాదాలు, ఘర్షణలు పడే అవకాశమే లేదన్నారు. ఇతర ఖైదీలకు కల్పించే సదుపాయాలనే ఆయనకూ కల్పించామని.. పడుకునేందుకు పరుపు ఏర్పాటు చేశామన్నది పూర్తి అబద్ధమన్నారు. నిబంధనల ప్రకారం అందరు ఖైదీల మాదిరే దిండు, డర్రీ, వులెన్ బ్లాంకెట్, దుప్పటి ఇచ్చామని, మెనూ ప్రకారమే ఆహారం అందిస్తున్నామని తెలిపారు. అనంతబాబును కలిసేందుకు వస్తున్న వారికి నిబంధనల ప్రకారమే ములాఖత్, ఇంటర్వ్యూ అవకాశాలిస్తున్నట్టు చెప్పారు. అలా వచ్చిన వారి పూర్తి వివరాలు, ఆధార్ కార్డు పరిశీలించాకనే అనుమతిస్తున్నట్టు వెల్లడించారు. ములాఖత్‌కు వస్తున్న వారి ఫోన్‌తో అనంతబాబు మాట్లాడారనేది కూడా పూర్తి అవాస్తవమని రాజారావు స్పష్టం చేశారు. -
సీఎంపై అభిమానంతో.. 2,745 మంది రక్తదానం
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2,745 మంది సోమవారం రక్తదానం చేసి రాష్ట్ర చరిత్రలో రికార్డు సృష్టించారు. రక్తదానం చేయడం ద్వారా జననేత జగన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన జగన్ అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి వరుసగా మూడో ఏడాది కూడా ఒరవడిని కొనసాగించారు. మంగళవారం సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు కావడంతో ఒకరోజు ముందే సోమవారం రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానంలో జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ ప్రతినిధి జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేస్తున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ శిబిరాన్ని ప్రారంభించగా సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, శాప్ చైర్మన్ బైర్రెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్రహౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దివంగతనేత జక్కంపూడి రామ్మోహనరావు తనయుడు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, శాప్‌చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి తొలుత రక్తదానం చేశారు. జగన్ సీఎం అయ్యాక తొలుత 2019లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 2,043 మంది రక్తదానం చేయగా, 2020లో 2,143 మంది రక్తదానం చేశారు. ఈ ఏడాది 2,745 మంది రక్తదానం చేసి రికార్డు నెలకొల్పారు. ఉభయ గోదావరి జిల్లాల జెడ్పీ చైర్మన్లు విప్పర్తి వేణుగోపాలరావు, కౌరు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
బుచ్చిరాజ్యంలో.. ఆదిపత్య పోరు
వందల ఏళ్ల చరిత్ర కలిగి.. రాజరాజనరేంద్రుడు ఏలిన పురాతన రాజమహేంద్రవరం నగరంలో ఆధిపత్యం కోసం ఇద్దరు సామంతులు ‘ఎత్తుల’ కత్తులు దూస్తున్నారు. ఒక సామంతుడు ‘బుచ్చి’రాజు. మరొకరు ‘ఆది’రాజు. రాజులు పోయినా.. రాజ్యాలు పోయినా రాచరికపు వాసనలు వారిని వీడటం లేదు. బుచ్చిరాజును సైన్యంతో సహా పదేళ్ల క్రితమే పొరుగు రాజ్యానికి ఆదిరాజు తరిమేశారు. అప్పటి నుంచీ కోల్పోయిన రాజ్యంలో పట్టు సాధించాలనే ఆరాటంతో.. అవకాశం వచ్చినప్పుడల్లా అలక పాన్పు ఎక్కేస్తున్నారు బుచ్చిరాజు. వందిమాగధులతో రకరకాల తంత్రాలు పన్నుతున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవంతో రాజకీయ మాయోపాయాలు పన్ని, ఆదిరాజును ఇరుకున పెట్టి, రాజ్యంలో పట్టు సాధించాలన్నది ఆయన వ్యూహం. సాక్షి,రాజమహేంద్రవరం: ఉత్తరాంధ్ర పరగణాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన ఆజానుబాహుడైన ఓ నాయుడికి స్వయానా బంధువైన ఆదిరాజు ఏమైనా తక్కువ తిన్నారా? బుచ్చిరాజు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తన రాజ్యంలో వేలు పెడితే యుద్ధం తప్పదని వేగుల ద్వారా బుచ్చిరాజుకు సందేశం పంపించారు. అలనాడు దుర్యోధనుడు చెప్పినట్టు ‘‘సూది మొన మోపినంత స్థలం కూడా వదులుకోన’’ని స్పష్టంగా చెప్పాడు. విషయం ఆ నోటా ఈ నోటా రాజ్యం నలుమూలలా పాకడంతో సామంతులు, ఆంతరంగికుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. భటుల ద్వారా ఇది తెలుసుకున్న బుచ్చిరాజు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అలాగని వందిమాగధులతో యుద్ధానికి సై అని సాహసించడం లేదు. తన రాజ్యంలోని సైనిక సంపత్తి, మంత్రాంగం సరిపోదనే కారణంతో.. అలకబూని.. రాజప్రసాదం తలుపులు తెరవకుండా మూడు రోజులుగా అంతఃపురానికే పరిమితమైపోయారు. ఈ తరహా రాజకీయ తంత్రం బుచ్చిరాజుకు కొత్తేమీ కాదు. రాజమహేంద్రవర రాజ్యాన్ని కోల్పోయిన గాయం ఇంకా మానకున్నా.. ‘చంద్ర’వంశ రాజదర్బార్‌లో కనీస మర్యాద కూడా దక్కడం లేదని ఏడు పదుల వయస్సులో ఉన్న ఈ సామంతరాజు కుమిలిపోతున్నారు. గతంలో కూడా ఇలానే కనీసం వయస్సుకు కూడా విలువ ఇవ్వడం లేదంటూ అంతఃపురంలో ఏకాంతంగా అంతర్మధనం చెందిన సందర్భాలు చాలానే ఉన్నాయని ఆంతరంగికులు గుసగుసలాడుకుంటున్నారు. దాదాపు పదేళ్లుగా అవమాన భారంతో రగిలిపోతున్న బుచ్చిరాజు కోల్పోయిన చోటే వెతుక్కోవాలనే సూత్రాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ ఆయన ఎత్తులు ఆదిరాజు రాజకీయ తంత్రం ముందు చిత్తవుతున్నాయి. భవిష్యత్‌లో రాజమహేంద్రవరంలోని 52 పరగణాలకు జరిగే పోరు కోసమే సామంతుల మధ్య ఇంతటి రాజ్యకాంక్ష నెలకొందనే చర్చ రాజదర్బారులో నడుస్తోంది. బుచ్చిరాజు రాజ్యంలోకి వచ్చే తొమ్మిది పరగణాలతో పాటు, మిగిలిన 43 పరగణాల్లో తన సుబేదారులకే పట్టు ఎక్కువ ఉండటంతో.. వారిని యుద్ధరంగంలోకి దింపాలనేది బుచ్చిరాజు వ్యూహం. అయినప్పటికీ ఆదిరాజు సిక్కో లు రాజుల బంధుత్వం దన్నుతో ధీమాగా ఉన్నారని ఆ రాజప్రసాదంలోని భటులు చెప్పుకొంటున్నారు. సామంతుల మధ్య సంధి కోసం ‘చంద్ర’వంశ రాజు పంపించిన దూతలు బుచ్చిరాజు అంతఃపురంలో గంటన్నర చర్చించినా చివరకు తలలు పట్టుకుని వచ్చిన దారినే పలాయనం చిత్తగించారు. పైకి మాత్రం సామంతుల మధ్య యుద్ధ వాతావరణం లేదని, బుచ్చిరాజుకు అసలు అసంతృప్తే లేదని చెప్పారు. ‘చంద్ర’వంశ సామంతులు నిమ్మకాయల చినరాజు, బెజవాడలో ‘గద్దె’నెక్కిన రామ్మోహనరాజు, రాజమహేంద్రవరం రాజ్యంలో గోదావరి అవతల ఒడ్డున ప్రజలకు చుక్కలు చూపించిన హర్రర్రాజు, అనపర్తి రెడ్డి రాజు వంటి దూతల సంధి విఫలమైంది. అసలు సామంతుల మధ్య చిచ్చు పెట్టిందే ‘చంద్ర’వంశ రాజు. సంధి కోసం వెళ్లిన దూతలు మధ్యలో అంతఃపురం బయట చెప్పుకొన్న మాటలను రహస్యంగా విన్న రాజభటులు బుచ్చిరాజు చెవిన వేశారు. నాడు పిల్లనిచ్చి, మంత్రిని చేసిన మామ రాజ్యాన్నే కూల్చేసి, సింహాసనం అధిíÙ్ఠంచి, ఇన్నేళ్లవుతున్నా.. తన వ్యతిరేక కూటమితో చేతులు కలిపిన బుచ్చిరాజును ఒకప్పటి ‘చంద్ర’వంశ రాజు ఇప్పటికీ వదిలిపెట్టలేదని వేగుల ద్వారా వచ్చిన సమాచారం. అందుకే ఈ సంధి యత్నాలు ‘చంద్ర’వంశ అంతఃపురం సాక్షిగా రక్తి కట్టిస్తున్న ఎత్తుగడగా కనిపిస్తున్నాయి. చక్రవర్తిగా బుచ్చిరాజు చలామణీ అయ్యే రోజుల్లో అతడికి ఆదిరాజు సామంతుడు కావడమే విచిత్రం. సామంతుల మ«ధ్య చిచ్చు చివరకు ఏ తీరానికి చేరుతుందోనని ఇరుగు, పొరుగు రాజ్యాల్లోని నాయకులు, ప్రజలు కోటగోడలెక్కి మరీ ఆసక్తిగా చూస్తున్నారు. -
అధిష్టానంపై ‘గోరంట్ల’ తీవ్ర అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి గోరంట్ల రాజీనా మా చేస్తున్నట్లు గురువారం సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. ఈ సమాచారంపై మీడియా వద్ద స్పందించేం దుకు గోరంట్ల తొలుత నిరాకరించారు. సీని యర్ అయిన తనను పార్టీ అధిష్టానం అవ మానానికి గురిచేస్తోందనే ఆవేదనతో రాజమ హేంద్రవరంలో ఇంటికే పరిమిత మయ్యారు. విషయం తెలుసుకుని ఆ పార్టీ మరో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీమంత్రి జవహర్ ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. చంద్రబాబుతో మాట్లాడి సర్దుబా టు చేస్తామని, గోరంట్ల రాజీనామా ప్రస్తావన రాలేదని, అసంతృప్తి మాత్రమేనని చిన రాజప్ప, జవహర్ ప్రకటించారు. అయినా.. అలక వీడని గోరంట్ల పార్టీలో తాను ఒంటరినని, చంద్రబాబును మాత్రం కలిసేది లేదని, నాయకులే కలుస్తారని స్పష్టంచేశారు. పార్టీ పదవులు, పీఏసీ చైర్మన్లో ప్రాధాన్యం ఇవ్వక పోవడంతో చంద్రబాబుపై గోరంట్ల తీవ్ర అసంతృప్తితో రాజీనామాకు సిద్ధపడుతు న్నట్లు సమాచారం. దీనిపై గోరంట్ల స్పందిస్తూ.. రాజీనామా విషయంపై వారం, పది రోజుల్లో స్పష్టతనిస్తానని చెప్పారు. -
బాలికపై సామూహిక అత్యాచారం
రాజమహేంద్రవరం క్రైం: ఆవారాగా తిరుగుతూ దోపిడీలు చేసే బ్లేడ్ బ్యాచ్ ఓ బాలికను బంధించి, చిత్ర హింసలకు గురిచేస్తూ నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన తూర్పుగోదావరిలో జరిగింది. శనివారం రాజమహేంద్రవరం నార్త్‌జోన్ డీఎస్పీ టీఎస్ఎన్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. ► కోరుకొండ మండలం మధురపూడికి చెందిన ఓ మహిళకు ముగ్గురు కుమార్తెలు. భర్త చాలాకాలం క్రితం మృతి చెందాడు. ► టెన్త్ పాసయిన రెండో కుమార్తెకు రాజమహేంద్రవరంలోని ఓ దుకాణంలో పని ఇప్పిస్తానని స్థానికంగా ఉండే అనిత ఈ నెల 12న తీసుకెళ్లింది. సాయంత్రం అనిత మాత్రమే తిరిగిరావడంతో తన కుమార్తె గురించి తల్లి ఆరా తీసింది. ► తనకు తెలియదని అనిత చెప్పడంతో ఆ తల్లి కోరుకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి 16వ తేదీ రాత్రి బాలిక ఆచూకీ గుర్తించారు. ► అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ► కోలుకున్న తర్వాత ఆ బాలిక జరిగిన ఘటనను వివరించింది. ► మత్తు మందుకు అలవాటు పడ్డ అనితకు క్వారీ మార్కెట్ ప్రాంతానికి చెందిన బ్లేడ్ బ్యాచ్‌తో పరిచయాలు ఉన్నాయి. ► బాలికను ఆ బ్లేడ్ బ్యాచ్ యువకులకు అప్పగించింది. ► రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద ఓ రూమ్‌కు బాలికను తీసుకుని వెళ్లిన ఆ బ్యాచ్ యువకులు బాలికకు మత్తు మందు ఇచ్చి, ఆమెను బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా చిత్రహింసలకు గురి చేసినట్లు బాలిక ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ► అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులు ఎంతమంది ఉన్నా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. (ప్రేమకు లాక్డౌన్ అడ్డంకి.. ఆపై ప్రియురాలి హత్య..) -
‘నేను స్పెషలాఫీసర్‌ని.. ఇది నా ఐడీ’
సాక్షి, సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం) : సచివాలయాల పరిశీలనకు వచ్చిన ప్రత్యేక అధికారినంటూ ఓ వ్యక్తి స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయం, వార్డు సచివాలయాల్లో సోమవారం హల్చల్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి బాలాజీపేటకు చెందిన 40వ వార్డు సచివాలయ కార్యదర్శులను వెంటబెట్టుకుని ఓ వ్యక్తి వచ్చాడు. నేరుగా తహసీల్దార్ గదిలోకి వెళ్లి ఆయన సీట్లో కూర్చున్నాడు ‘‘నేను సీఎం కార్యాలయం నుంచి వచ్చిన స్పెషలాఫీసర్‌ను, ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించింది’’ ఇది నా ఐడీ అని చూపించాడు. తన పేరు ఉపేంద్ర రోషన్ అని తన సెల్ నంబర్: 6301814060గా చెప్పాడు. తహసీల్దార్ సుస్వాగతం అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఉన్న డిప్యూటీ తహసీల్దార్ బాపిరాజును పిలిచి వివరాలు అడిగాడు. బుధవారం మళ్లీ వస్తానని అప్పటికి అన్ని రికార్డులు సిద్ధం చేసి ఉంచాలని చెప్పి వెళ్లిపోయాడు. (టార్గెట్ వైఎస్సార్సీపీ! ) సందేహం కలిగిన డిప్యూటీ తహసీల్దార్ బాపిరాజు ప్రభుత్వ కార్యాలయానికి ఫోన్ చేసి ఆరా తీయగా అటువంటి వ్యక్తి ఎవరూ లేరని చెప్పారు. దీంతో సాయంత్రం ఆ వ్యక్తికి ఫోన్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి రావాలని కోరగా, తొలుత వీలుపడదని చెప్పాడు. అయితే డిప్యూటీ తహసీల్దార్ గట్టిగా చెప్పడంతో రాత్రి ఏడు గంటలకు కార్యాలయానికి వచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న టూటౌన్ పోలీసులు అతడిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇతడు రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామానికి చెందిన వాడని, బీఎడ్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడని టూటౌన్ సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. నాలుగురోజులుగా రాజమహేంద్రవరంలో పలు సచివాలయాలకు వెళ్లి, తాను సీఎం పేషీ నుంచి వచ్చానని అక్కడి సిబ్బందిపై హడావుడి చేస్తూ వస్తున్నాడని తెలిపారు. జిల్లాలోని రెవెన్యూ, కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన వారి ఫోన్ నంబర్లన్నీ అతడి ఫోన్లో ఉండడం కొసమెరుపు. నకిలీ అధికారిని అరెస్ట్ చేసిన పోలీసులు -
జగన్‌కు ప్రజల్లో 51 శాతం ఆదరణ
రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర ప్రజల్లో జగన్‌కు 51 శాతం ఆదరణ ఉందని, అతనిని ఎవరూ ఏమీ చేయలేరని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజమహేంద్రవంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. మాజీ సీఎం రాజశేఖరరెడ్డి తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు జగన్ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యంగా ఉండాలన్నారు. రాజశేఖరరెడ్డి చొరవతో కాలువల నిర్మాణం జరగడం వల్లనే చంద్రబాబు పట్టిసీమ ద్వారా నీరు ఇవ్వగలిగాడన్నారు. వైఎస్సార్ ఆలోచనను 14 ఏళ్ల తరువాత జగన్ నిజం చేశారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయమై జగన్‌కు బుధవారం లేఖ రాశానని చెప్పారు. -
పెన్నుల్లో రాజా..‘రత్నం’!
ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన జర్మన్ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఓ పెన్ను బహుమతిగా ఇచ్చారు. అది ఏ అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన మాంట్ బ్లాంక్, పార్కర్ పెన్నో కాదు.. పూర్తి స్వదేశీది. పైగా.. అచ్చమైన తెలుగు నేలపై తయారైన ‘రత్నం’ పెన్ను అది. ఎనిమిది దశాబ్దాలకు పైగా చరిత్ర.. మూడు తరాల వారసత్వం దీని ఘనత. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేదికగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఈ కలం పుట్టుపూర్వోత్తరాలు ఇవిగో.. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం : దేశంలో సిరా పెన్నుల తయారీకి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తొలి అడుగు పడింది. ఈ ఘనత రత్నం పెన్నుకే దక్కింది. మూడు తరాలుగా రత్నం పెన్నులు తయారై దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ పెన్నుల తయారీ కేంద్రం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కోటగుమ్మం రంగిరీజు వీధిలో ఉంది. స్వాతంత్య్ర సమరానికి ముందు దేశీయంగా పెన్నుల తయారీ రంగంపై తనదైన ముద్ర వేసిన రత్నం సన్స్ కుటీర పరిశ్రమగా ఉంది. ఇక్కడ తయారైన ‘గైడర్’, ఫౌంటెన్ పెన్నులు ఖండాంతర ఖ్యాతిని ఆర్జించాయి. అనేక మోడల్ పెన్నులు మార్కెట్లోకి వస్తున్నా రత్నం సన్స్ పెన్నుకున్న ప్రాచుర్యం ఇప్పటికీ తగ్గలేదు. భారతావనిలో ప్రప్రథమంగా రత్నం పెన్ను రాజమహేంద్రవరంలో 1932లో కోసూరి రత్నం ఆవిష్కరించారు. రత్నం మరణానంతరం అతని రెండో కుమారుడు కోసూరి వెంకటరమణమూర్తి, మూడో తరంలో రత్నం మనుమలు గోపాలరత్నం (గోపీ), చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పెన్నుల తయారీని కొనసాగిస్తున్నారు. రత్నం పెన్ను పుట్టుపూర్వోత్తరాలు.. స్వాతంత్య్రానికి పూర్వం సిరా పెన్నులు విడిభాగాలు విదేశాల నుంచి రప్పించుకుని కొంతమంది తయారుచేసే వారు. ఒకసారి అప్పటి ఉమ్మడి గోదావరి జిల్లాకు కృష్ణమాచార్య అనే సబ్ జడ్జి కలం కిందపడి పాళీ వంగిపోయింది. 14 క్యారెట్ల బంగారంతో చేసిన పాళీ అది. స్వర్ణకారుడైన కేవీ రత్నం, సోదరుడు సత్యం కొత్త పాళీని తయారుచేసి ఇచ్చారు. వీరి ప్రతిభను చూసి సబ్జడ్జికి ముచ్చటేసింది. ముడిసరుకు తాను తెప్పిస్తానని కలాల తయారీ చేపట్టమని సబ్‌జడ్జి రత్నంను ప్రోత్సహించారు. అలా 1932లో రత్నం పెన్నులు మార్కెట్లోకి ప్రవేశించాయి. కాలక్రమంలో వెండి, బంగారంతో పెన్నులు తయారుచేస్తూ రత్నం పెన్నులకు ఒక బ్రాండ్‌ను తీసుకువచ్చారు. గాంధీ మెచ్చిన పెన్ను అప్పట్లో అఖిల భారత గ్రామీణ పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు జేసీ కుమారప్ప రాజమహేంద్రవరంలో మూడు రోజులు మకాం చేసి దగ్గరుండి రెండు పెన్నులు తయారుచేయించుకుని తీసుకువెళ్లారు. ఒక పెన్నును ఆయన గాంధీజీకి బహూకరించారు. పెన్నును వాడి చూసిన గాంధీ మెచ్చుకుని స్వదస్తూరితో అభినందనల లేఖ రాసి 1935 జూలై 16న రత్నంకు పంపించారు. ‘‘ప్రియమైన రత్నం.. కుమారప్ప ద్వారా ఫౌంటెన్ పెన్ను పంపినందుకు మీకు కృతజ్ఞతలు తెలపాలి. బజారులో దొరికే విదేశీ కలాలకు ఇది మంచి ప్రత్యామ్నాయం’’.. అంటూ అభినందిస్తూ వార్ధా నుంచి రత్నంకు లేఖ పంపించారు. అంతేకాదు.. ప్రముఖులు బాబూ రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి, జవహర్లాల్ నెహ్రు, లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ.. సినీ నటులు ఎన్టీరామారావు నుంచి చిరంజీవి వరకు రత్నం పెన్ను వినియోగించి ఆయన్ను అభినందించిన వారే. విదేశాల నుంచి యంత్రాల దిగుమతి 1930లో ఇంగ్లాండ్ నుంచి రత్నం దిగుమతి చేసుకున్న లెగ్ ఆపరేటర్ మెషిన్, జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న మైఫోర్డ్ మెషీన్లనే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. అలాగే, పెన్నుల తయారీకి రబ్బర్ చెట్టు పాలు నుంచి తయారుచేసే మెటీరియల్ గుజరాత్ నుంచి, ఇరిడియమ్ను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మార్పులకు అనుగుణంగా పెన్నుల తయారీలోను మార్పులు తీసుకురావాలని డిమాండ్ వచ్చిందని రత్నం మనుమడు గోపీ చెప్పారు. కానీ, నాడు తాత జాతీయభావంతో ఏర్పాటుచేసిన ఈ పెన్నులో ఎటువంటి మార్పులు చేయకూడదనే ఉద్దేశంతో అదే ఒరవడిని కొనసాగిస్తున్నామన్నారు. వ్యాపారాత్మక ధోరణితో కాకుండా పెట్టుబడి, రెక్కల కష్టం చేతికొస్తే చాలని సరిపెట్టుకుంటున్నామని ఆయన వివరించారు. కాగా, ఈ పెన్నుల కోసం ఇప్పటికీ దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. 1948లో తొలిసారి యునైటెడ్ కింగ్డమ్ హై కమిషనర్ సర్ ఆల్డ్బాల్క్ పెన్నుకు ఆర్డర్ రావడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల ప్రధాని కార్యాలయం నుంచి 10 పెన్నుల ఆర్డర్ రాగా వాటిని పంపించారు. అందులో ఒక పెన్ను జర్మనీ చాన్సలర్‌కు ప్రధాని అందజేశారు. ప్రపంచంలోనే తొలి సూక్ష్మ పెన్నుకూ శ్రీకారం 3.5సెం.మీ.ల పొడవు, 1.7 గ్రాముల బరువుతో రత్నం సన్స్ తయారుచేసిన పెన్ను ప్రపంచంలో అతిచిన్న పెన్నుగా 2012 అక్టోబర్‌లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఈ పెన్నులో 2.22 క్యారెట్ల బంగారం పాళీ వాడారు. 5 గ్రాముల బంగారుతో తయారుచేసిన పెన్నుపై భరతమాత, జాతీయ జెండా, జాతిపిత గాంధీ చిత్రాలను చెక్కి భారతీయతను ప్రతిబింబింపజేశారు. రత్నం సన్స్‌లో అంగుళం మొదలు 36 అంగుళాల సైజు వరకూ రత్నం పెన్నులు తయారుచేస్తున్నారు. విభజనకు ముందున్న కోస్తా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల సంస్కృతిని అద్దంపట్టేలా గోదావరి వంతెన, తిరుపతి గోపురం, కాకతీయుల శిలాతోరణంతో ఒక కలాన్ని తయారుచేశారు. రూ.300లు నుంచి రూ.35వేల వరకూ.. స్టీల్ పాళీతో తయారుచేసిన రత్నం పెన్ను తొలినాళ్లలో రూ.2.25లు ఉండేది. ప్రస్తుతం రూ.300 నుంచి రూ.3,500 వరకూ లభిస్తోంది. బంగారం పాళీలతో తయారుచేసిన పెన్ను రూ.3,000 నుంచి రూ.35వేలు వరకూ లభిస్తున్నాయి. కాగా, మార్కెట్లో తక్కువ ధరలకు లభించే బాల్ పెన్నుల పోటీని తట్టుకుని ఇప్పటికీ రత్నం పెన్ను నిలుస్తోంది. జర్మనీ చాన్సలర్‌కు మోదీ కానుక ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన జర్మనీ చాన్సలర్ యాంజిలా మార్కల్‌కు ప్రధాని మోదీ.. రత్నం సన్స్ తయారుచేసిన సిరా పెన్నును ఢిల్లీలో బహూకరించారు. స్వాతంత్య్రానికి పూర్వం స్వదేశీ వస్తువులను మాత్రమే వినియోగించాలనే తలంపుతో నాడు గాంధీజీ కూడా రత్నం తయారుచేసిన స్వదేశీ పెన్నును ఉపయోగించారని ప్రధాని ఆమెకు వివరించడం విశేషం. పెన్నుల తయారీలో మూడోతరం గోపి, చంద్రశేఖర్ ప్రోత్సాహం కావాలి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన రత్నం పెన్నుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కాస్త గుర్తింపు, ప్రోత్సాహం కావాలి. ఇప్పటివరకూ ఎవరిపై ఆధారపడకుండా సొంతంగానే దీనిని నిర్వహించుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం మమ్మల్ని ఇప్పుడు ప్రోత్సహించి విద్యుత్, పన్ను మినహాయింపుల్లో రాయితీలు ఇస్తే బాగుంటుంది. అలాగే, మేం ఎలాంటి మార్కెటింగ్ పద్ధతులను అవలంబించం. కావల్సిన వారు నేరుగా వచ్చి పట్టుకెళ్తారు. విదేశాల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయి. మాకు ఎలాంటి వెబ్సైటూ లేదు. కొనుగోలుదారుల మౌఖిక ప్రచారమే మాకు వెబ్సైటు. – వెంకటరమణమూర్తి, రత్నం కుమారుడు