ప్రతీకాత్మక చిత్రం
రాజమహేంద్రవరం క్రైం: ఆవారాగా తిరుగుతూ దోపిడీలు చేసే బ్లేడ్ బ్యాచ్ ఓ బాలికను బంధించి, చిత్ర హింసలకు గురిచేస్తూ నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన తూర్పుగోదావరిలో జరిగింది. శనివారం రాజమహేంద్రవరం నార్త్‌జోన్ డీఎస్పీ టీఎస్‌ఎన్ రావు తెలిపిన వివరాల ప్రకారం..
► కోరుకొండ మండలం మధురపూడికి చెందిన ఓ మహిళకు ముగ్గురు కుమార్తెలు. భర్త చాలాకాలం క్రితం మృతి చెందాడు.
► టెన్త్ పాసయిన రెండో కుమార్తెకు రాజమహేంద్రవరంలోని ఓ దుకాణంలో పని ఇప్పిస్తానని స్థానికంగా ఉండే అనిత ఈ నెల 12న తీసుకెళ్లింది. సాయంత్రం అనిత మాత్రమే తిరిగిరావడంతో తన కుమార్తె గురించి తల్లి ఆరా తీసింది.
► తనకు తెలియదని అనిత చెప్పడంతో ఆ తల్లి కోరుకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి 16వ తేదీ రాత్రి బాలిక ఆచూకీ గుర్తించారు.
► అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.
► కోలుకున్న తర్వాత ఆ బాలిక జరిగిన ఘటనను వివరించింది.
► మత్తు మందుకు అలవాటు పడ్డ అనితకు క్వారీ మార్కెట్ ప్రాంతానికి చెందిన బ్లేడ్ బ్యాచ్‌తో పరిచయాలు ఉన్నాయి.
► బాలికను ఆ బ్లేడ్ బ్యాచ్ యువకులకు అప్పగించింది.
► రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద ఓ రూమ్‌కు బాలికను తీసుకుని వెళ్లిన ఆ బ్యాచ్ యువకులు బాలికకు మత్తు మందు ఇచ్చి, ఆమెను బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా చిత్రహింసలకు గురి చేసినట్లు బాలిక ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
► అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులు ఎంతమంది ఉన్నా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment