డబ్బింగ్ జానకికి సత్కారం
డబ్బింగ్ జానకికి సత్కారం
Published Fri, Aug 26 2016 8:35 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
రాజమహేంద్రవరం కల్చరల్ :
నేటితరం నటీనటులు ఎటువంటి శిక్షణా లేకుండా కెమెరాల ముందుకు రావడంతో నటనలో ప్రమాణాలు తగ్గిపోతున్నాయని డబ్బింగ్ జానకి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నారాయణపురంలోని విశ్రాంత హిందీ అధ్యాపకురాలు పార్వతి గృహంలో ఆమెను నగరానికి చెందిన కళాకారులు, గాయకులు, ప్రముఖులు సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాటి తరం నటీమణులు వాణిశ్రీ, శారదలకు తాను సమకాలీనురాలినని, కళాతపస్వి విశ్వనాథ్ దర్శకత్వం వహించిన పలు సినిమాల్లో నటించానని తెలిపారు. ప్రముఖ దర్శకుడు జంధ్యాలకూడా తనను ప్రోత్సహించేవారన్నారు. దక్షిణాది భాషలన్నింటిలో సుమారు వేయిచిత్రాలలో నటించానన్నారు. ‘ఎస్ బ్యాంక్’ మేనేజర్ ఘంటసాల శ్యామలాకుమారి, గాయకుడు రాయుడు చంద్రకుమార్, పాత్రికేయుడు సన్నిధానం శాస్త్రి, కొప్పర్తి రామకృష్ణ తదితరులు జానకిని సత్కరించారు.
Advertisement
Advertisement