
సాక్షి, రాజమండ్రి: ఏపీలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజమండ్రి సమీపంలోని జాతీయ రహదారిలో గామన్ బ్రిడ్జ్‌పై ప్రవీణ్ మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండటంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ శరీరంపై గాయాలు కనిపించడంతో ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పాస్టర్లు ఆందోళనకు దిగారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిన చోట ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ను విడుదల చేయాలని పాస్టర్లు కోరుతున్నారు. బైక్ మీద వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఢీకొట్టి, దాడి చేసి ఉంటారంటూ ప్రవీణ్ పగడాల సన్నిహితులు, అనుచరులు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ ఒంటిపై గాయాలు ఉండటంతో సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment