
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ కొనసాగుతుందని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇంకా రాలేదని.. అది వచ్చిన తర్వాతే పీఎం రిపోర్టు వస్తుందని ఆయన తెలిపారు. విచారణలో భాగంగా సేకరించిన వీడియో ఫుటేజ్ విశ్లేషణ జరుగుతుందన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వారి కుటుంబ సభ్యులకి ఎవరికీ ఇవ్వలేదని.. అలాంటి ప్రచారాలను నమ్మొద్దన్నారు.
పాస్టర్ ప్రవీణ్ మృతి దర్యాప్తుపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఇప్పటికీ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా సమగ్రంగా పాస్టర్ ప్రవీణ్ మృతిపై దర్యాప్తు నిర్వహిస్తోందన్నారు. క్రికెట్ బెట్టింగ్‌పై రాజమండ్రిలో ఒక కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశామని.. విచారణ కొనసాగుతోందన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లో ఎవరు కూడా ఇరుక్కోవద్దని ఎస్పీ నర్సింహ కిషోర్ అన్నారు.