Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Key Comments AT YSRCP local bodies Representatives Meeting Updates1
హ్యాట్సాఫ్‌.. మీ నిబద్ధతకు ఎప్పుడూ రుణపడి ఉంటా: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ పాలనలో పేదల నోట్లోకి నాలుగు ముద్దలు వెళ్లేవని.. కానీ కూటమి ప్రభుత్వం వాళ్ల ముందు నుంచి ఉన్న కంచం లాగిపడేసిందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో బుధవారం తాడేపల్లిలోని కేంద్రకార్యాలయంలో భేటీ అయిన ఆయన.. ఈ సందర్భంగా కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వాళ్ల తెగువను అభినందించారు.‘‘మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటాను, పార్టీకూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నాను. ఉప ఎన్నికల్లో మీరు చూసిన తెగువకు, ధైర్యానికి హాట్సాఫ్‌. మొత్తం 50 చోట్ల ఎన్నికలు జరిగితే, 39 స్థానాలు వైఎస్సార్‌సీపీ గెలిచింది. కార్యకర్తలు తెగింపు చూపారు. తెలుగుదేశం పార్టీకి ఈ స్థానాల్లో ఎక్కడా గెలిచే నంబర్లు లేవు. వారికి సంఖ్యా బలం లేనే లేదు. కానీ.. భయాందోళనల ఈ ప్రభుత్వం మధ్య ఎన్నికలు నిర్వహించాలనుకుంది. పోలీసులతో భయపెట్టి, బెదిరించారు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకుంటున్న చంద్రబాబుకి బుద్ధిలేదు. వాస్తవంగా ఈ ఎన్నికలను టీడీపీ వదిలేయాలి. కానీ అధికార అహంకారంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూశారు. నిజంగా ఇది ధర్మమేనా? న్యాయమేనా?. చంద్రబాబు(Chandrababu) అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడా ఒక నాయకుడిలా చంద్రబాబు వ్యవహరించలేదు. ప్రజలకిచ్చిన హామీల విషయంలో మోసం చేశారు. ప్రజలకు 143 హామీలు ఇచ్చి మభ్యపెట్టారు. చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలే కనిపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ పాలనలో ఏదో ఒక బటన్‌ నొక్కేవాళ్లం. ఏదోరూపంలో ప్రతి కుటుంబానికీ మంచి జరిగింది. నాలుగువేళ్లూ నోట్లోకి పోయే పరిస్థితి ఉండేది. చంద్రబాబు ఇప్పుడు ఉన్న ప్లేటును కూడా తీసేశాడు. ప్రజల్లోకి టీడీపీ కార్యకర్తలను కూడా పంపే పరిస్థితి ఆయనకు లేదు. తిరుపతి మున్సిపల్‌ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలను ప్రజలంతా చూశారు. విశాఖపట్నంలో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి, అక్కడ అక్రమాలు చేస్తున్నారు. మన కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నం మనవాళ్లు చేశారు. అక్కడ 40వ వార్డు కార్పొరేటర్‌ ఇంటికి వెళ్లి.. ఆయన భార్యను భయపెట్టే ప్రయత్నం పోలీసులు చేశారు. రామగిరిలో 10 ఎంపీటీసీల్లో 9కి వైయస్సార్‌సీపీవే. కాని అక్కడ ఎన్నిక జరగనీయకుండా అడ్డుకుంటున్నారు. భద్రత పేరుతో పోలీసులు తీసుకెళ్లి.. దారి మళ్లించి, స్వయంగా ఎస్సై ఎంపీటీసీలను కిడ్నాప్‌చేసే పరిస్థితి కనిపిస్తోంది. అప్పటికీ వినకపోతే, ఏకంగా మండల కార్యాలయంలో నిర్బంధించి బైండోవర్‌ చేశారు. అంతటితో ఆగకుండా లింగమయ్య అనే బీసీ నాయకుడ్ని చంపేశారు. ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు ఇలాంటి దారుణాలు చేయిస్తున్నారు. ప్రభుత్వం అంటే ఇలాంటి పాలన చేస్తుందా?.. .. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 16కు 16 ఎంపీటీసీలు మనవాళ్లే. ఆరుగుర్ని ప్రలోభపెట్టి.. తీసుకెళ్లిపోయాడు. మరో 9 మంది వైఎస్సార్‌సీపీతోనే ఉన్నారు. వాళ్లను ఎన్నికల కేంద్రానికి వెళ్లనీయకుండా పోలీసులు, టీడీపీ వాళ్లు అడ్డుకున్నారు. కోరం లేకపోయినా.. గెలిచామని డిక్లేర్‌ చేయించుకున్నారు. రాష్ట్రానికి సీఎం, కుప్పంకు ఎమ్మెల్యే చంద్రబాబే.. అయినా సరే ఒక చిన్నపదవికోసం ఇన్ని దారుణాలు చేశారు.ఈ ఎన్నికల్లో నా చెల్లెమ్మలు, నా అక్కలు మరింత గట్టిగా నిలబడ్డారు. దీనికి నేను గర్వపడుతున్నాను. ఇలాంటి ఘటనలు జరుగుతున్న పార్టీ ప్రజాప్రతినిధులు గట్టిగా నిలబడి స్ఫూర్తిని చూపించారు. వీరు చూపించిన స్ఫూర్తి చిరస్థాయిగా ఉంటుంది. కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ జగన్‌ ఎప్పుడూ రుణపడి ఉంటాడు. చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాయి. P-4 అనే కొత్త మోసాన్ని మొదలుపెట్టాడు. సమాజంలో ఉన్న 20శాతం పేదవాళ్ల బాగోగులకు 10శాతం మందికి అప్పగిస్తాడంట!. రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డులు ఎన్ని ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా?. రాష్ట్రంలో 1.61 కోట్ల కుటుంబాలు ఉంటే అందులో 1.48శాతం కుటుంబాలకు తెల్ల రేషన్‌ కార్డుదారులు ఉన్నారు. వీరంతా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. రాష్ట్రంలో ఇన్‌కం ట్యాక్స్‌ కట్టేవారు ఎంతమంది ఉన్నారో చంద్రబాబుకు తెలుసా?. రాష్ట్రంలో 8.6 లక్షల మంది ఇన్‌కంట్యాక్స్‌ కడుతున్నారు. ఆయన చెప్పిన ప్రకారం.. ఈ 1.48 కోట్ల మంది కుటుంబాలను 8.6 లక్షల మందికి అప్పగించాలి కదా?. ఇన్ని రకాలుగా మోసాలు చేస్తాడు చంద్రబాబు. చివరకు చంద్రబాబు మీటింగ్‌ల నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారు. చంద్రబాబుకు అన్నీ తెలుసు, కాని కావాలనే మోసం చేస్తాడు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ గురించి అడిగితే రాష్ట్రం అప్పుల పాలు అంటాడు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ ఎగరగొట్టడానికి అప్పులపై అబద్ధాలు చెప్తున్నాడు. ప్రజలకు సమస్యలు వస్తే వాటి పరిష్కారంకోసం తపించే ప్రభుత్వం రావాలని ప్రజలు మళ్లీ కోరుకుంటారు. మాటచెప్తే.. ఆ మాటమీద నిలబడే ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తుంటారు. రాబోయే రోజులు మనవి. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. వైఎస్సార్‌సీపీ(YSRCP) అఖండ మెజార్టీతో గెలుస్తుంది. ఈసారి కార్యకర్తలకోసం కచ్చితంగా పార్టీ నిలబడుతుంది. కోవిడ్‌ కారణంగా నేను కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోవచ్చు. జగన్‌ 2.O దీనికి భిన్నంగా ఉంటుంది. కార్యకర్తలకోసం గట్టిగా నిలబడతాను’’ అని జగన్‌ అన్నారు.

Gold Prices To Drop 40 pc Market Analysts Predict Major Decline In Coming Years2
బంగారం భారీగా పడిపోతుందా? అనలిస్టుల కొత్త అంచనా

అంతర్జాతీయంగా బంగారం ధరలు అంతే లేకుండా పెరిగిపోతున్నాయి. ఇటీవల కొన్ని నెలలుగా రికార్డు గరిష్టాలకు చేరుకున్న బంగారం ధర ఇన్వెస్టర్లకు వరంగా ఉన్నా, ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారులకు మాత్రం భారంగా మారింది. అయితే ఇది ఎంతో కాలం ఉండదని, త్వరలోనే బంగారం ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. బంగారం ధరలు దాదాపు 40 శాతం తగ్గుతాయని కొన్ని అంచనాలు వెలువడ్డాయి.అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మార్నింగ్‌స్టార్‌లో మార్కెట్ స్ట్రాటజిస్ట్ జాన్ మిల్స్ బంగారం ధర ఔన్స్‌కు 1,820 డాలర్లకు పడిపోవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం (ఏప్రిల్‌ 2) ఒక ఔన్స్‌ పసిడి ధర 3,123 డాలర్ల వద్ద ఉంది. భారత్‌లో (ఢిల్లీ) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.92,990 వద్ద, 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.85,250 వద్ద ఉంది. ఇదే అంచనా నిజమైతే బంగారం ధరలు భారీగా దిగొస్తాయి.భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణ ఆందోళనల కలయికతో బంగారం ఇటీవల పుంజుకుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ మార్కెట్లలో ఒడిదుడుకులకు భయపడి ఇన్వెస్టర్లు సురక్షిత స్వర్గధామంగా బంగారం వైపు మొగ్గు చూపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాలనలో కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు ఈ ఆందోళనలను మరింత తీవ్రతరం చేశాయి. బంగారానికి డిమాండును మరింత పెంచాయి.తగ్గేందుకు చెబుతున్న కారణాలుబంగారానికి ప్రస్తుత బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతోంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా, గోల్డ్ మన్ శాక్స్ వంటి ప్రధాన ఆర్థిక సంస్థలు బంగారంపై బుల్లిష్ గా ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో బంగారం ధర ఔన్స్‌కు 3,500 డాలర్లకు చేరుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేయగా, గోల్డ్‌మన్ శాక్స్ ఈ ఏడాది చివరి నాటికి ఔన్స్ ధర 3,300 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. అయితే ఇందుకు భిన్నంగా మిల్స్‌తోపాటు మరికొందరు విశ్లేషకులు బంగారం ధరలలో గణనీయమైన తగ్గుదల వస్తుందని భావిస్తున్నారు. అందుకు కొన్ని కారణాలను పేర్కొంటున్నారు.పెరిగిన సరఫరా: ప్రపంచవ్యాప్తంగా బంగారం సరఫరా వేగంగా పెరుగుతోంది. 2024 రెండో త్రైమాసికంలో గోల్డ్ మైనింగ్ లాభాలు ఔన్స్‌కు 950 డాలర్లకు చేరుకున్నాయి. ఇది ఉత్పత్తిని పెంచింది. ప్రపంచ బంగారు నిల్వలు 9% పెరిగి 2,16,265 టన్నులకు చేరుకున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా తన బంగారం ఉత్పత్తిని పెంచగా, పాత బంగారం రీసైక్లింగ్ కూడా పెరిగింది. ఇది మరింత సరఫరాను జోడించింది.డిమాండ్ తగ్గే సంకేతాలు: సెంట్రల్ బ్యాంకులు, ఇన్వెస్టర్లు దూకుడుగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నప్పటికీ, ఈ ధోరణి కొనసాగకపోవచ్చని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. గత ఏడాది సెంట్రల్ బ్యాంకులు 1,045 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, వరుసగా మూడో ఏడాది 1,000 టన్నులకు పైగా కొనుగోళ్లు జరిగాయి. అయితే 71% కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుకోకూడదని భావిస్తున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సర్వే కనుగొంది.మార్కెట్ సంతృప్తత: పసిడి పరిశ్రమలో విలీనాలు, కొనుగోళ్లు పెరగడం తరచుగా మార్కెట్ గరిష్టాలను సూచిస్తుంది. 2024 లో, బంగారం రంగంలో డీల్ మేకింగ్ 32% పెరిగింది. ఇది మార్కెట్ వేడెక్కవచ్చని సూచిస్తుంది. అంతేకాకుండా, బంగారం ఆధారిత ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) పెట్టుబడులలో ఇటీవలి పెరుగుదల బంగారం ధరలు పుంజుకోకముందుటి పరిస్థితులకు దగ్గర ఉండటం ధరల పతనం తక్షణమే ఉండవచ్చనే వాదనలను బలపరుస్తోంది.

IPL 2025: RCB VS Gujarat Titans Live Updates And Highlights3
IPL 2025, RCB VS GT Updates: నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ 6.2వ ఓవర్‌: ఆర్సీబీ కష్టాలు మరింత తీవ్రతరమయ్యాయి. ఆ జట్టు 42 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (12) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. లివింగ్‌స్టోన్‌, జితేశ్‌ శర్మ క్రీజ్‌లో ఉన్నారు. పీకల్లోతు కష్టాల్లో ఆర్సీబీ.. 35 పరుగులకే 3 వికెట్లు డౌన్‌4.4వ ఓవర్‌: టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ జట్టు 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సిరాజ్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ కొట్టిన అనంతరం ఫిల్‌ సాల్ట్‌ (14) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. రజత్‌ పాటిదార్‌కు (6) జతగా లివింగ్‌స్టోన్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీఆర్సీబీ 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండో ఓవర్‌లో విరాట్‌ను ఆర్షద్‌‌ ఖాన్‌​ ఔట్‌ చేయగా.. మూడో ఓవర్‌లో సిరాజ్‌ అద్భుతమైన బంతితో పడిక్కల్‌ను (4) క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆర్సీబీ​కి షాక్‌.. రెండో ఓవర్‌లోనే విరాట్‌ ఔట్‌ఆర్సీబీకి రెండో ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (7) అర్షద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ప్రసిద్ద్‌ కృష్ణకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 2 ఓ‍వర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 12/1గా ఉంది. పడిక్కల్‌ (4), సాల్ట్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఓవర్‌లోనే సాల్ట్‌ బతికిపోయాడు..!సాల్ట్‌కు తొలి ఓవర్‌లోనే లైఫ్‌ లభించింది. సిరాజ్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ జోస్‌ బట్లర్‌ చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను వదిలేశాడు. అంతకుముందు తొలి బంతికే సాల్ట్‌ ఔట్‌ కావాల్సింది. అయితే బంతి ఫీల్డర్లు లేని చోట ల్యాండైంది.ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 2) గుజరాత్‌ టైటాన్స్‌, ఆర్సీబీ తలపడనున్నాయి. ఆర్సీబీ హోం గ్రౌండ్‌ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం గుజరాత్‌ ఓ మార్పు చేయగా.. ఆర్సీబీ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగిస్తుంది. గుజరాత్‌ తరఫున రబాడ స్థానంలో అర్షద్‌ ఖాన్‌ జట్టులోకి వచ్చాడు. రబాడ వ్యక్తిగత కారణాల చేత ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్(కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్‌కీపర్‌), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్‌), జోస్ బట్లర్(వికెట​్‌కీపర్‌), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మగుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్స్: షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, వాషింగ్టన్ సుందర్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్స్: సుయాష్ శర్మ, రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్.కాగా, ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతుంది. గుజరాత్‌ రెండింట ఓ మ్యాచ్‌ గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆర్సీబీ.. కేకేఆర్‌, సీఎస్‌కేపై విజయాలు సాధించగా.. గుజరాత్‌.. పంజాబ్‌ చేతిలో ఓడి, ముంబై ఇండియన్స్‌పై గెలుపొందింది.

Ysrcp Chief Ys Jagan Condemns Visakha Incident4
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం.. వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

సాక్షి, తాడేపల్లి: విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్కా దీపిక కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని ఘటన మరవకముందే.. విశాఖలో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు.విశాఖలో ప్రేమోన్మాది దాడిలో యువతి తల్లి నక్కా లక్ష్మి ప్రాణాలు కోల్పోవడం, యువతి దీపిక ప్రాణాపాయ స్థితిలో ఉండటం ఆవేదన కలిగిస్తోందన్నారు. ప్రేమోన్మాది నవీన్‌ను కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లక్ష్మి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Sensational Details Come To Light In The Ameenpur Case5
అమీన్‌పూర్ ముగ్గురు పిల్లల మృతి కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు

సాక్షి, సంగారెడ్డి: అ​మీన్‌పూర్‌ ముగ్గురు పిల్లల మృతి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముగ్గురు పిల్లల్ని తల్లే చంపినట్లు పోలీసులు తేల్చారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. వివాహితర సంబంధంతో భర్తతో పాటు ముగ్గురు పిల్లలను కూడా చంపాలని హంతకురాలు రజిత ప్లాన్ చేసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు పిల్లల్ని ఊపిరాడకుండా చేసి కన్నతల్లే చంపేసింది.ఇటీవలే పదవ తరగతి విద్యార్థుల గెట్ టుగెదర్‌ పార్టీలో స్నేహితుడితో రజితకు పరిచయం ఏర్పడింది. హంతకురాలు రజిత లావణ్య, ప్రియుడు సూరు శివ కుమార్‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య భార్యాపిల్లలతో సహా రాఘవేంద్ర కాలనీకి వచ్చి స్థానికంగా వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మార్చి 28వ తేదీ ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి.. ముగ్గురు పిల్లలు నోటి నుంచి నురగలు కక్కుతూ పడి కనిపించారు. పిల్లలు అచేతనంగా పడి ఉండగా.. భార్య రజిత కడుపు నొప్పితో విలవిలలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఫుడ్‌ పాయిజన్‌తో ముగ్గురు పిల్లలు నిద్రలోనే కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి.. ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నం చేసిందని తొలుత అంతా భావించారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంతో భర్త చెన్నయ్య పాత్రపై పోలీసులకు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పైగా భార్యాభర్తల మధ్య గతకొన్నేళ్లుగా తరచూ గొడవలు జరుగుతుండడంతో.. రజిత తల్లితో పాటు స్థానికులు ఈ విషయాన్ని నిర్ధారించడంతో ఆ కోణంలోనూ పోలీసులు దృష్టిసారించారు.కానీ విచారణలో చెన్నయ్య పాత్ర ఏం లేదని తేలడంతో పోలీసులు వదిలేశారు. ఆపై ఆస్పత్రిలో కోలుకుంటున్న రజితను పోలీసులు విచారించారు. ఆమె కదలికలు అనుమానంగా తోచడంతో లోతైన దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. అదే వివాహేతర సంబంధం. రజిత పదో తరగతి క్లాస్‌మేట్స్‌ ఈ మధ్య గెట్‌ టు గెదర్‌ చేసుకున్నారు. ఆ టైంలో రజిత స్కూల్‌ డేస్‌లో చనువుగా ఉండే ఓ వ్యక్తి మళ్లీ టచ్‌లోకి వచ్చాడు.అలా తన పాత క్లాస్‌మేట్‌తో రజిత చాటింగ్‌, ఫోన్లు మాట్లాడడం చేసింది. ఇది క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త, పిల్లలను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా జీవించవచ్చని అనుకుంది. మార్చి 27వ రాత్రి విషం కలిపిన భోజనం భర్త, పిల్లలకు పెట్టాలనుకుంది. అయితే భర్త మాత్రం పప్పన్నం మాత్రమే తిని పనికి వెళ్లిపోగా.. పిల్లలు ఆఖర్లో విషం ‍కలిపిన పెరుగన్నం పిల్లలు తిన్నారు. అలా ముగ్గురు పిల్లలు సాయి క్రిష్ణ (12), మధు ప్రియ(10), గౌతమ్ (8) నిద్రలోనే కన్నుమూశారు.

Latest News on Bird Flu In Telangana6
Bird Flu : హైదరాబాద్‌లో బర్డ్‌ఫ్లూ కలకలం.. వేల కోళ్లు మృత్యువాత

హైదరాబాద్‌,సాక్షి: హైదరాబాద్‌లో బర్డ్‌ప్లూ (bird flu) వైరస్‌ కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. నాలుగురోజుల క్రితం మండలంలోని ఓ పోల్ట్రీ ఫామ్‌లో వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో అప్రమత్తమైన వైద్య శాఖ అధికారులు కోళ్ల రక్త నమూనాలను సేకరించారు. తాజాగా, ఆ కోళ్ల రక్త నమూనా ఫలితాలు విడుదలయ్యాయి.బర్డ్‌ ఫ్లూ వల్లే ఆ కోళ్లు మృత్యువాత పడినట్లు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కోడి గుడ్లు కూడా ఎవరికీ అమ్మొద్దు అని పోల్ట్రీ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. బర్డ్‌ ఫ్లూ మనుషులకు సోకుతుందా?పక్షులకు వచ్చే జలుబు. ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా టైప్‌ –ఏ వైరస్‌లు వ్యాధి కారకాలు. కోవిడ్‌–19 కారక కరోనా వైరస్‌లో మాదిరిగానే ఈ వైరస్‌లోనూ పలు రకాలు ఉన్నాయి. తక్కువ ప్రభావం చూపేవి కొన్ని.. అధిక ప్రభావం చూపేవి మరికొన్ని. రెండో రకం వైరస్‌లు కోళ్లు ఇతర పక్షులకు తీవ్రస్థాయిలో ప్రాణ నష్టం కలిగిస్తాయి. సాధారణంగా ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లను ‘‘హెచ్‌’’, ‘‘ఎన్‌’’రకాలుగా వర్గీకరిస్తారు. సాధారణంగా ఈ వైరస్‌లు మనుషుల్లోకి ప్రవేశించవు కానీ.. కొన్నిసార్లు జలుబు నుంచి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు కలిగిస్తాయి. ప్రాణాలు కోల్పోవడమూ సంభవమే. కోళ్లు ఇతర పౌల్ట్రీ పక్షుల వ్యర్థాలను ముట్టుకోవడం ద్వారా వ్యాధి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువ.మనుషులకూ సోకుతుందా?మనుషులకు బర్డ్‌ ఫ్లూ సోకే అవకాశాలు అరుదు. కానీ హెచ్‌5, హెచ్‌7, హెచ్‌9 రకాల వైరస్‌లు మాత్రం మనుషుల్లోకి ప్రవేశిస్తాయని ఇప్పటికే రూఢీ అయ్యింది. వైరస్‌ సోకిన పక్షులను తాకడం, వాటి స్రావాలతో కలుషితమైన ఉపరితలాలను ముట్టుకోవడం ద్వారా మనుషులకూ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. బాగా వండిన కోడిగుడ్లు, చికెన్‌లతో వ్యాధి సోకే అవకాశాలు లేవు.ఇతరులకు సోకుతుందా? జలుబు లాంటి లక్షణాలే కనిపిస్తాయి. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి, వాంతులు, అతిసారం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో న్యుమోనియా, శ్వాస సమస్యలు, మరణమూ సంభవించవచ్చు. మనుషుల నుంచి ఇతరులకు బర్డ్‌ఫ్లూ సోకదు.ఎలాంటి పక్షులకు సోకుతుంది?కోళ్లు, బాతులు, హంసలు, నెమళ్లు, కాకుల వంటి పక్షులపై బర్డ్‌ఫ్లూ ప్రభావం ఉంటుంది. కోళ్లలో అతిసారం, కాలి పంజా ప్రాంతాలు వంకాయ రంగులోకి మారడం, తల, కాళ్లు వాచిపోవడం, వంటివి కనిపిస్తాయి. ముక్కు, ఊపిరితిత్తుల నుంచి వెలువడే ద్రవాల ద్వారా ఈ వ్యాధి పక్షుల్లో వ్యాపిస్తుంది. వ్యాధికి గురైన పక్షుల మలం తగిలినా చాలు. కలుషిత ఆహారం, నీరు ద్వారానూ వ్యాపిస్తుంది.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?బాగా ఉడికించిన తరువాత మాత్రమే చికెన్, గుడ్లు వంటివి తినాలి. ఉడికించని పక్షి మాంసాన్ని ఇతర ఆహార పదార్థాలకు దూరంగా ఉంచడం మేలు. పౌల్ట్రీ రంగంలో పనిచేసే వారు వ్యక్తిగత శుభ్రతను కచ్చితంగా పాటించాలి. కోళ్లఫారమ్‌లలో పనిచేసేటప్పుడు చేతులకు కచ్చితంగా తొడుగులు వేసుకోవడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, ఎన్‌95 మాస్కులు ధరించడం, పీపీఈ కిట్లు, కళ్లజోళ్లు వాడటం ద్వారా వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.

Karnataka Government Revised Office Timing Over Heatwave7
Heatwave Alert: భానుడి భగభగ .. మారిన ప్రభుత్వ కార్యాలయాల ఆఫీస్‌ టైమింగ్స్‌

బెంగళూరు,సాక్షి: మార్చి తొలి వారం నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. మాడు పగిలే ఎండలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. ఈ తరుణంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఆఫీస్‌ టైమింగ్స్‌ మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరో తరుముకొచ్చినట్టు ఈసారి చాలాముందుగానే ఎండాకాలం వచ్చిపడింది. ఫిబ్రవరి నుంచే సెగలూ పొగలూ ఎగజిమ్మిన సూరీడు అంతకంతకూ తన ప్రతాపాన్ని పెంచుతూ పోతున్నాడు. రోజూ నమోదవుతున్న ఉష్ణోగ్రతలను చూస్తుంటే భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించినట్టు నిరుటికన్నా వేసవితాపం మరింత అధికంగా వుంటుందని అర్థమవుతోంది. ఇంచుమించు రోజూ 39–41 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉష్ణోగ్రతలుంటున్నాయి.ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కలబురగి డివిజన్‌లోని ఏడు జిల్లాల్లో, బెళగావి డివిజన్‌లోని విజయపుర, బాగల్‌కోట్ జిల్లాల్లో వేడిగాలుల కారణంగా 2025 ఏప్రిల్, మే నెలల్లో ప్రభుత్వ కార్యాలయ సమయాలను ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. The Karnataka government has issued an order to change the government office timings from 8 am to 1.30 pm in April and May 2025 in 7 districts of Kalaburagi division and Vijayapura and Bagalkot districts of Belagavi division due to heatwave. Earlier proposal was kept by the… pic.twitter.com/5E6CkvfvPV— ANI (@ANI) April 2, 2025

RJ Mahvash was in Lucknow on Yuzvendra Chahal LSG vs PBKS IPL match 8
చాహల్‌తో డేటింగ్ రూమర్స్.. ఇలా దొరికిపోయిందేంటి?

ప్రముఖ యూట్యూబర్, ఆర్జే మహ్‌వశ్‌ పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్‌ తర్వాత అందరి దృష్టి ఆమెపైనే పడింది. అంతవరకు ముక్కు మొహం తెలియని ఆమె గురించి నెటిజన్స్ తెగ వెతికారు. ఇంతకీ ఆమె ఎవరంటూ ఆరా తీశారు. దీనికంతటికీ కారణం ఆ టీమిండియా క్రికెటరే. అతనితో కలిసి మ్యాచ్‌లో కనిపించడంతో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చేసింది. టీమిండియా స్పిన్నర్ చాహల్‌తో కలిసి ఛాంపియన్‌ ట్రోఫీలో సందడి చేసింది. ఇక అప్పటి నుంచి వరుసగా ఏదో ఒక సందర్భంలో టాక్ వినిపిస్తూనే ఉంది. అంతేకాకుండా వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా మరోసారి ఆర్జే మహ్‌వశ్‌ వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి చాహల్‌తో కలిసి మాత్రం కనిపించలేదు. అతని ఆడుతున్న ఐపీఎల్ మ్యాచ్ కోసం లక్నోలో వాలిపోయింది ముద్దుగుమ్మ. నగరంలో ప్రముఖ హోటల్‌లో ఆర్జే మహ్‌వశ్ ఈత కొడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది.అయితే చాహల్‌తో డేటింగ్‌ రూమర్స్ వస్తున్న వేళ.. ఐపీఎల్ మ్యాచ్‌ కోసం ఆర్జే మహ్‌వశ్‌ రావడంతో మరోసారి వీరిద్దరిపై రిలేషన్‌పై టాక్ నడుస్తోంది. నిజంగానే ఈ జంట డేటింగ్‌లో ఉన్నారా? అనే చర్చ మొదలైంది. కాగా.. చాహల్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌ తరఫున ఐపీఎల్‌ లీగ్‌ ‍ఆడుతున్నారు. ఇటీవలే తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు కూడా తీసుకున్నారు. మార్చి 20, 2025న ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.లక్నోలో ఆర్జే మహ్‌వశ్‌ కనిపించడంతో చాహల్‌తో డేటింగ్‌ నిజమేనంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పంజాబ్‌, లక్నో మ్యాచ్‌ జరుగుతున్న సందర్భంలో ఆమె కనిపించడంతో రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది. మీ రిలేషన్‌షిప్‌ను ఇంకెన్నాళ్లు సీక్రెట్‌గా ఉంచతారని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.ఎవరీ ఆర్‌జే మహ్‌వశ్‌?ఆర్జే మహ్‌వశ్‌ రేడియో మిర్చిలో రేడియో జాకీ(ఆర్‌జే)గా పని చేస్తోంది. సోషల్‌ మీడియాలో ప్రాంక్‌ వీడియోలు చేస్తూ పాపులర్‌ అయింది. చాహల్‌తో డేటింగ్‌ కథనాలు రావడంతో జనవరిలో 1.5 మిలియన్లు ఉండే ఫాలోవర్ల ఒక్కసారిగా అమాంతం పెరిగింది. అంతేకాకుండా నవాజుద్దీన్‌ సిద్దిఖీ, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన 'సెక్షన్‌ 108' సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. వీటితో పాటు హీరోయిన్‌గా ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తోంది.

whole villagers catching fishes in kothagudem9
ఊరంతా చేపల కూరే...!

వేసవి వచ్చిందంటే గ్రామాల్లోని చెరువుల్లో నీరు తగ్గుముఖం పడుతుంది. దీంతో స్థానికులు చేపల వేటకు ఉపక్రమిస్తారు. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కుర్నవల్లి గ్రామంలోని పెద్ద చెరువుకు మంగళవారం ఉదయమే చేరిన జనం జలపుష్పాలు వేటాడటంలో నిమగ్నమయ్యారు.ఊతలు, వలల సాయంతో చేపలు పట్టగా అందరికీ సరిపడా చేపలు (Fishes) దొరకడంతో ఉత్సాహంగా ఇళ్లకు బయల్దేరారు. దీంతో కుర్నవల్లి గ్రామమే కాక చుట్టుపక్కల గ్రామాల్లోని దాదాపు అందరి ఇళ్ల నుంచి మంగళవారం సాయంత్రానికి చేపల కూర (Fish Curry) వాసన ఘుమఘుమలాడింది. – కరకగూడెం అడుగంటిన మత్తడివాగుమార్చి మొదటివారం నుంచే భానుడు ప్రతాపం చూపడంతో ఆదిలాబాద్‌ జిల్లాలో ఎండలు (Summer) దంచికొడుతున్నాయి. దీంతో భూగర్భ జలమట్టం గతంలో ఎన్నడూలేని విధంగా పది మీటర్ల లోతుకు పడిపోయింది. తాంసి, తలమడుగు మండలాల్లోని పలు గ్రామాలకు తాగునీటిని అందించే తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీకి చేరింది.ప్రాజెక్టు నీటిమట్టం (Water Level) 0.571 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.111లకు పడిపోయింది. నీరంతా అడుగంటడంతో ప్రాజెక్టు పూర్తిగా నెర్రెలు వారింది. ఏటా ఏప్రిల్‌ నెలాఖరు, మే మొదటివారంలో అడుగంటాల్సిన ఈ ప్రాజెక్టు ఏప్రిల్‌ మొదటి వారానికే ఎండిపోవడం జిల్లాలోని భూగర్భజలాలు పడిపోతున్న తీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. – సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్‌చ‌దవండి: సైకిల్ చ‌క్రం.. బ‌తుకు చిత్రం

Michelin Star Restaurants Unusual Menu Goes Viral10
ప్రపంచ సమస్యలను-ఆర్ట్‌ని మిళితం చేసే వంటకాలు..చూస్తే మతిపోతుంది..!

ఎన్నో రకాల రెస్టారెంట్‌ వంటకాలు చూసుంటారు. కానీ ఇలాంటి వంటకాల తీరుని మాత్రం అస్సలు ?చూసుండరు. ఆర్డర్‌ చేస్తే ఎప్పుడొస్తుందా.. ? అని గంటలతరబడి వెయిట్‌ చేయాలి. తీరా ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ వచ్చాకా..తినడం మర్చిపోతాం. అలా ఉంటుంది ఆ రెస్టారెంట్‌ వడ్డించే తీరు. వంటకాలు లిస్ట్‌ పెద్దదే..ఆ డెజర్ట్‌లు వడ్డించే తీరు ఊహకు దొరకదు..ప్రశంసకు అందదు అన్నట్లుగా ఉంటాయి ఆ వంటకాలు. ఇంతకీ ఇదంతా ఎక్కడంటే..కోపెన్‌హాగన్‌లోని రెఫ్‌షాలియోన్ జిల్లాలో ఉన్న ఆల్కెమిస్ట్ అనే రెస్టారెంట్‌లో ఇలా చిత్రమైన రీతీలో వంటకాలను వడ్డిస్తారు. ఈ రెస్టారెంట్‌ రెండు మిచెలిన్‌ స్టార్‌లను దక్కించుకుంది. అక్కడ భోజనం ఓ గొప్ప విషయాన్ని బోధిస్తాయి. అందుకోసం అయినా అక్కడకు వెళ్లి తీరాల్సిందే అని చెప్పొచ్చు. అక్కడ ప్రతి వంటకాన్ని.. పాకకళకు థియేటర్‌​ అండ్‌ మల్టీమీడియా ఆర్ట్‌తో మిళితం చేసి.. కస్టమర్లకు సర్వ్‌ చేస్తుంది. ‍వడ్డించే ప్రతి వంటకం..ఆహార కొరత, పర్యావరణ ఆందోళనలు, సామాజిక న్యాయం వంటి ప్రపంచ సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించినట్లుగా క్రియేటివిటీగా అందిస్తారు. అంతేకాదండోయ్‌ మెనూలో మొత్తం 40 రకాల వంటకాలను అందిస్తుంది. ఆర్డర్‌ కోసం గంటల తరబడి వెయిట్‌ చేయక తప్పదు. పైగా ధరలు కూడా కళ్లు చెదిరిపోయే రేంజ్‌లో ఉంటాయి. ఈ హోటల్‌లో తినాలంటే ముందుగానే రిజర్వ్‌ చేసుకోవాలి..ఆర్డర్‌ కోసం ఎలాంటి వాళ్లైనా.. తప్పక వెయిట్‌ చేయాల్సిందే. అక్కడ తింటే సుమారు రూ. 60 వేలు పైనే ఖర్చు అవుతుందట. అత్యంత డిమాండ్‌ ఉన్న ఈ రెస్టారెంట్‌లో వంటకాలకు సంబధించిన వీడియోని ఓ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ నెట్టిట షేర్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో గతేడాది ఆ రెస్టారెంట్‌లో అందించిన వంటకాలు కనిపిస్తాయి. తినదగిన సీతాకోక చిలుకల రూపంలో డిజర్ట్‌ చూస్తే ప్రోటీన్‌ వనరులుగా కీటకాలును తినొచ్చు అని హైలెట్‌ చేస్తుంది. ఇంకా పచ్చి జెల్లీ ఫిష్, తినదగిన ప్లాస్టిక్‌లో చుట్టబడిన చేప (సముద్ర కాలుష్యం గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో), సోర్ క్రీంతో చదును చేయబడిన కోడి తల, పాడైనట్లు కనిపించే చీజ్, బోనులో కోడి పాదాలు (ఇది వ్యవసాయం పరిస్థితిని వివరించడం కోసం), పంది, జింక రక్తంలతో చేసిన స్వీట్‌(రక్తదానం ప్రాముఖ్యత కోసం)..ఇలా ప్రతి వంటకం ఒక్కో ప్రపంచ సమస్యను వివరించేలా అద్భుతమైన కళా నైపుణ్యంతో ప్రెజెంట్‌ చేశారు. వాటిని చూస్తే మతిపోవడం ఖాయం అనేలా ఉంటాయి. నెటిజన్లు మాత్రం మరీ ఇంత లగ్జరీయస్‌ గానా..! అని, మరికొందరూ..ఆహారం రూపంలో ప్రపంచ సమస్యలను హైలెట్‌ చేసేలా కళను కూడా జోడించడం అంటే మాటలు కాదు అని సదరు రెస్టారెంట్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Tiff (@greenonionbun)(చదవండి: పాపం ఆ సీఈవో.. ‘శరీరం’ చెప్పేది వినలేదు! ఆఖరికి ఇలా..)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement