
సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం మైల్డ్ స్ట్రోక్‌కు గురికావడంతో కుటుంబ సభ్యులు విశ్వరూప్‌ను వెంటనే రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. అనంతరం, విశ్వరూప్‌ను హెల్త్ కండీషన్‌ను పరిశీలించిన వైద్యులు.. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఎన్ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స అందించారు. కాగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు తెలిపారు.
కాగా, ఈరోజు(శుక్రవారం) వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా మంత్రి విశ్వరూప్.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన చేయి లాగుతుందని నాయకులకు చెప్పడంతో విశ్వరూప్‌ను వెంటనే రాజమహేంద్రవరంకి తీసుకు వెళ్లారు.
ఇది కూడా చదవండి: బయటకు పొక్కని ‘రహస్యం’.. ఆ విషయంలో చేతులెత్తేశారా?
Comments
Please login to add a commentAdd a comment