pinipe viswaroop
-
మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ కు నవంబర్ 4 వరకు రిమాండ్
-
హత్య కేసులో నా కుమారుడికి ఎలాంటి సంబంధం లేదు..
-
సామాజిక న్యాయం పరిఢవిల్లుతోంది
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో సామాజిక న్యాయం పరిఢవిల్లుతోందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సామాజిక సాధికారత కలను సాకారం చేసిన సీఎం వైఎస్ జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారని తెలిపారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార సభలో మంత్రి మాట్లాడారు. దశాబ్దాలుగా రాజకీయ, సామాజిక అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ న్యాయం చేశారని మంత్రి అన్నారు. సీఎం జగన్ ఈ వర్గాలకు అన్ని విధాలుగా అండగా నిలబడటంతోపాటు రాజకీయంగా సముచిత స్థానం కల్పించారని తెలిపారు. చెబితే తప్పకుండా చేసే నేత సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏదైనా చెబితే దానిని తప్పకుండా చేసే నాయకుడని మంత్రి పినిపే విశ్వరూప్ చెప్పారు. అధికారంలోకి వస్తే పింఛన్‌ను అంచెలంచెలుగా రూ.3 వేలు చేస్తానని చెప్పారని ఆ విధంగానే పెంచి ఈ జనవరి నుంచి రూ.3 వేలు ఇవ్వనున్నారని వివరించారు. 2014లో జగన్ రూ.750 పెన్షన్ ఇస్తానని మేనిఫెస్టోలో ముందుగానే ప్రకటించడంతో చంద్రబాబు రూ.1,000 ఇస్తానని ప్రకటించాడే తప్ప ప్రజలపై ప్రేమ లేదని అన్నారు. 2019లో కూడా జగన్ పెన్షన్‌ను రూ.2 వేలు చేస్తానని ప్రకటించగానే ఎన్నికలకు సరిగ్గా 3 నెలల ముందు చంద్రబాబు రూ.2 వేలు చేసి ప్రజలను మోసం చేయాలని చూశాడని తెలిపారు. సీఎం జగన్ 4.40 లక్షల మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇచ్చిన మనసున్న నేత అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకొని, వారి ఉన్నతికి పాటుపడుతున్న సీఎం జగన్‌కు అందరం మరోసారి మద్దతివ్వాలని కోరారు. సంక్షేమం అభివృద్ధి జరగాలంటే 2024లో కూడా సీఎం జగన్‌కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. పాలకొల్లులో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర సభకు హాజరైన జనసందోహంలో ఒక భాగం సంక్షేమం అందిస్తున్న సీఎం జగన్: మండలి చైర్మన్ మోషేన్‌రాజు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏ విధంగా సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని అంబేడ్కర్ భావించారో, అలాగే సీఎం జగన్ ఈ వర్గాలను అభివృద్ధిలోకి తెస్తున్నారని తెలిపారు. ఈ వర్గాలను సామాజికంగా, రాజకీయంగా ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. ఇంగ్లిష్ మీడియం విద్య, అమ్మఒడి వంటి పథకాలతో పేదలను విద్యాధికులను చేస్తున్నారని తెలిపారు. బడుగుల నాయకుడు సీఎం జగన్ : ఎంపీ నందిగం సురేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బడుగుల నాయకుడని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు ఎన్నో విధాలుగా సంక్షేమాన్ని అందిస్తున్నారన్నారు. విజయవాడలో ఏర్పాటు చేస్తున్న అంబేడ్కర్ వేలు తాడేపల్లిలోని జగన్మోహన్రెడ్డిని చూపిస్తూ ఆయన ఆలోచనలు, ఆశయాలు కలిగిన వ్యక్తి తాడేపల్లిలో ఉన్నట్లు ఎప్పుడూ చెబుతుందని అన్నారు. చంద్రబాబు తమను జైల్లో పెట్టాలని చూస్తే వైఎస్ జగన్ వాళ్లు ఉండాల్సింది జైల్లో కాదు పార్లమెంటులో అంటూ తనను లోక్‌సభలో కూర్చోబెట్టారని తెలిపారు. ప్రతి పేద పిల్లవాడు ఐఏఎస్, ఐపీఎస్ అయ్యేలా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ స్కూళ్లను అత్యున్నతంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీలు సహా అన్ని వర్గాలు బాగుపడాలంటే 2014లోనూ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ఉభయ గోదావరి జిల్లాల వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, టీటీడీ పాలకమండలి సభ్యుడు మేకా శేషుబాబు తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలకు చిరునామా వై.ఎస్.ఆర్
-
తెలంగాణ అభివృద్ధిపై బీఆర్ఎస్ నేతలు చెబుతున్న మాటలు హాస్యాస్పదం
-
మంత్రి విశ్వరూప్‌కు గుండె శస్త్రచికిత్స విజయవంతం
అమలాపురం టౌన్: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌కు ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన గుండె శస్త్రచికిత్స విజయవంతమైంది. ఆయనకు గుండెలో ఆరు చోట్ల వాల్వులు బ్లాక్ అయ్యాయి. దీంతో వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకూ ఈ శస్త్రచికిత్స జరిగిందని మంత్రి విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి తెలిపారు. మంత్రి శస్త్రచికిత్స విజయవంతం కావాలని.. ఆయన తొందరగా కోలుకోవాలని అమలాపురం నియోజకవర్గంతో పాటు కోనసీమలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో పార్టీ నాయకులు, అభిమానులు మోటార్ సైకిళ్ల ర్యాలీగా వెళ్లి పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. మసీదులు, చర్చిలో ఆయా మత పెద్దలతో ప్రార్థనలు చేయించారు. -
మంత్రి విశ్వరూప్‌ను ఫోన్లో పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్.. శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. శుక్రవారం మైల్డ్ స్ట్రోక్‌కు గురికావడంతో కుటుంబ సభ్యులు విశ్వరూప్‌ను వెంటనే రాజమహేంద్రవరం బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. అయితే అనంతరం, విశ్వరూప్‌ను హెల్త్ కండీషన్‌ను పరిశీలించిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. కాగా, శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మంత్రి విశ్వరూప్‌ను ఫోన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా విశ్వరూప్ ఆరోగ్య పరిస్థితిపై సిటీన్యూరో వైద్యులను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. -
మంత్రి విశ్వరూప్‌కు అస్వస్థత
-
AP: మంత్రి విశ్వరూప్‌కు అస్వస్థత.. హైదరాబాద్‌కు తరలింపు
సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం మైల్డ్ స్ట్రోక్‌కు గురికావడంతో కుటుంబ సభ్యులు విశ్వరూప్‌ను వెంటనే రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. అనంతరం, విశ్వరూప్‌ను హెల్త్ కండీషన్‌ను పరిశీలించిన వైద్యులు.. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఎన్ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స అందించారు. కాగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈరోజు(శుక్రవారం) వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా మంత్రి విశ్వరూప్.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన చేయి లాగుతుందని నాయకులకు చెప్పడంతో విశ్వరూప్‌ను వెంటనే రాజమహేంద్రవరంకి తీసుకు వెళ్లారు. ఇది కూడా చదవండి: బయటకు పొక్కని ‘రహస్యం’.. ఆ విషయంలో చేతులెత్తేశారా? -
వరదల్లోనూ చంద్రబాబు బురద రాజకీయాలు : మంత్రి విశ్వరూప్
-
ఆటో డ్రైవరన్నలు మీ పాత్ర చాలా కీలకం
-
అల్లర్ల వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదు
అమలాపురం రూరల్: అమలాపురంలో అల్లర్ల వెనుక ఎవరున్నా ఉపేక్షించేది లేదని మంత్రి పినిపే విశ్వరూప్ స్పష్టం చేశారు. బుధవారం అమలాపురంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కోనసీమ సాధన సమితి పేరుతో ఎవరైతే ర్యాలీకి పిలుపు ఇచ్చారో వారే దీనికి బాధ్యత వహించాలన్నారు. కోనసీమ ప్రజలు, అమలాపురం పట్టణ ప్రజలు చాలా మంచివారని, శాంతి కాముకులని అన్నారు. శాంతియుతంగా జరుగుతున్న ధర్నాలో కొంతమంది రౌడీషీటర్లు, సంఘ విద్రోహ శక్తులు చేరి ఒక ఉద్యమాన్ని డైవర్ట్ చేసి.. తన ఇంటిపైన, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపైన దాడి చేసి ఇళ్లు తగులబెట్టారని చెప్పారు. పొన్నాడ సతీష్, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే ఇంటికి నిప్పంటించారన్నారు. ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉండటంతో వెంటనే వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారని తెలిపారు. ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటన అని, కోనసీమ చరిత్రలో 50 ఏళ్లలో ఎప్పుడూ ఇటువంటి ఘటన జరగలేదన్నారు. కోనసీమ సాధన సమితి వారికి గానీ, విద్యార్థులకు గానీ తమ ఇళ్లపై దాడి చేయడం లక్ష్యం కాదని పేర్కొన్నారు. రౌడీషీటర్లు పెట్రోల్‌తో వచ్చారని, వాళ్లు ఇంటిని, తన ఇంటికి 500 మీటర్ల దూరంలో ఉన్న ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపై దాడి చేసి తగులబెట్టారన్నారు. కానీ.. సతీష్ ఇంటికి కేవలం పది మీటర్ల దూరంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆనందరావు ఇంటిపై ఎందుకు దాడి చేయలేదని మంత్రి ప్రశ్నించారు. ఈ ఘటనలో ద్వితీయ శ్రేణి టీడీపీ నాయకులు ఉన్నారని, వారి పేర్లు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. వాళ్ల కాల్‌డేటా బయటకు వస్తుందని, ఐక్యవేదిక ముసుగులో తమ పార్టీ నాయకులను ఎవరు సంప్రదించారో వాళ్ల వివరాలు కూడా ఉన్నాయన్నారు. ప్రజలెవరూ రౌడీషీటర్ల ఉచ్చులో పడొద్దని విజ్ఞప్తి చేశారు. -
సంఘవిద్రోహ శక్తులే దారి మళ్లించి విధ్వంసం సృష్టించారు: మంత్రి విశ్వరూప్
-
అమలాపురంలోని నివాసానికి మంత్రి విశ్వరూప్
-
‘ప్లాన్ ప్రకారమే విధ్వంసం సృష్టించారు’
అమలాపురం: కొన్ని శక్తులు నిరసనకారుల్ని రెచ్చగొట్టి అమలాపురంలో విధ్వంసం సృష్టించాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. బుధవారం మంత్రి విశ్వరూప్ ఇంటిని పరిశీలించిన సజ్జల.. మీడియాతో మాట్లాడారు.‘ప్లాన్ ప్రకారమే అమలాపురంలో విధ్వంసం సృష్టించారు. అంబేద్కర్ పేరు పెట్టాలని అన్ని వర్గాలు కోరాయి. ప్రధాన పార్టీలన్నీ మద్దతు పలికాయి. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.కులాల మధ్య చిచ్చుపెట్టాలని విపక్షాలు కుట్ర పన్నాయి. కొన్ని శక్తులు నిరసనకారులను రెచ్చగొట్టాయి. ఈ తరహా శక్తుల్ని ఎలా హ్యాండిల్ చేయాలి ప్రభుత్వానికి తెలుసు.రాష్ట్ర ప్రభుత్వం సంయమనం పాటించడంతోనే ఈ కుట్రను అదుపులోకి తెచ్చాం’ అని ఆయన తెలిపారు. -
తాళ్లరేవులో కొవ్వొత్తుల ర్యాలీ
తాళ్లరేవు: కోనసీమ జిల్లా అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ వెంకటసతీష్‌కుమార్ ఇళ్లకు నిప్పుపెట్టడాన్ని నిరసిస్తూ తాళ్లరేవులో మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి దళిత, ప్రజాసంఘాల నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. దళిత నాయకులు కాశి లక్ష్మణస్వామి, జక్కల ప్రసాద్, రెడ్డి బాబు మాట్లాడుతూ అంబేడ్కర్ కోనసీమ జిల్లాను కొనసాగించాలని కోరారు. అరాచక శక్తులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విశ్వజన కళామండలి జిల్లా అధ్యక్షుడు వడ్డి ఏడుకొండలు, ప్రజాసంఘాల నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, కె.ఈశ్వరీబాయి పాల్గొన్నారు. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి అమానుషం అమలాపురంలో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ వెంకటసతీష్‌కుమార్ ఇళ్లపై దాడిచేసి తగులబెట్టడం అమానుషమని తాళ్లరేవు ఎంపీపీ రాయుడు సునీత పేర్కొన్నారు. శాంతియుత మార్గంలో నిరసన తెలియజేయాలి తప్ప ఇటువంటి ఘటనలకు పాల్పడడం దురదృష్టకరమని చెప్పారు. -
అంబేడ్కర్ పేరుపై అగ్గి రాజేసిన 'కుట్ర'!
అమలాపురం నుంచి సాక్షి ప్రతినిధి: కోనసీమ భగ్గుమంది. జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలు మంగళవారం రెచ్చిపోయాయి. పక్కా స్కెచ్‌తో జిల్లాలోని దళిత, బీసీ నేతలను టార్గెట్ చేసుకుంటూ పెట్రేగిపోయాయి. ఇది కొన్ని కులాలు, వర్గాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావటంతో పోలీసులు పూర్తిస్థాయిలో సంయమనం పాటించగా... దాన్ని అలుసుగా తీసుకున్న ఆ వర్గాలు విచ్చలవిడిగా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తుల్ని ధ్వంసం చేశాయి. జిల్లాకు చెందిన దళిత మంత్రి పినిపె విశ్వరూప్, బీసీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను తగలబెట్టాయి. పక్కా పథకం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం వరకూ చడీచప్పుడూ లేకుండా... ఒక్కసారిగా వేల మంది యువకులు రోడ్లమీదకు వచ్చి హింసకు తెగబడ్డారు. జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడానికి నిరసనగా శాంతియుతంగా ర్యాలీ చేస్తామని రెండుమూడు రోజులుగా కోనసీమ జిల్లా పరిరక్షణ సమితి చెబుతూ వస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో మెసేజులు పంపింది. కానీ సోషల్ మీడియాలో మెసేజీలు అందుకున్న వేల మంది యువకులు మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి రాళ్లు రువ్వుతూ... పెట్రోలు డబ్బాలతో ఆస్తుల్ని తగలబెడుతూ రెచ్చిపోవటంతో ఇదంతా ముందస్తు కుట్ర మేరకే జరిగిందన్న అనుమానాలకు బలం చేకూరింది. అల్లరి మూకలు రాళ్ల దాడులకు దిగటంతో సాక్షాత్తూ జిల్లా ఎస్పీ, డీఎస్పీతో పాటు ఏకంగా 30 మంది పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపు చేయడానికి విధిలేక ఒకచోట లాఠీచార్జి చేయటంతో పాటు ఒకదశలో గాల్లోకి కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది.ఆందోళనకారులు అమలాపురంలో దాదాపు ఆరున్నర గంటలపాటు వి«ధ్వంసానికి తెగబడి భయానక వాతావరణాన్ని సృష్టించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన విధ్వంసం... రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు కొనసాగింది. అమలాపురంలో ర్యాలీగా వెళుతున్న ఆందోళనకారులు ర్యాలీగా మొదలై.. విధ్వంసం వరకు.. ‘కోనసీమ జిల్లాకు మరో పేరు పెట్టవద్దు.. ఆ పేరే ముద్దు’ అనే నినాదంతో కోనసీమ జిల్లా పరిరక్షణ సమితి జేఏసీ అమలాపురంలోని కలశం సెంటర్ నుంచి మంగళవారం మూడు గంటలకు ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి వినతిపత్రం ఇవ్వనున్నట్లు రెండు రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు మంగళవారం అమలాపురం సహా ఆ జిల్లాలోని పలు సున్నిత ప్రాంతాల్లో సెక్షన్ 144, సెక్షన్ 30 విధించారు. అమలాపురానికి బయట వ్యక్తులు రాకుండా చర్యలు తీసుకున్నారు. సరిహద్దుల్లో పికెట్లు ఏర్పాటు చేసి.. సుమారు 450 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వరకూ ప్రశాంతంగా ఉన్నా... దాదాపు 3 గంటలకు పట్టణంలోని సందులు, చిన్న చిన్న వీధుల్లోంచి ఆందోళనకారులు ఒక్కసారిగా అమలాపురం మెయిన్ రోడ్డులోకి దూసుకొచ్చారు. ఆర్టీసీ బస్‌స్టేషన్, గడియారం స్తంభం, హైస్కూలు సెంటర్లు, తదితర ప్రాంతాల నుంచి ఒకేసారి వేల మంది రోడ్లపైకి రావడంతో పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా లెక్క చేయకుండా ఆందోళనకారులు కలెక్టరేట్ సమీపంలోని నల్లవంతెన వద్దకు వచ్చేసరికి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి అదుపు తప్పింది. వీరంతా పాతికేళ్ల లోపు యువకులేనని, అంబేడ్కర్ పేరు వద్దని నినాదాలు చేస్తూ చెలరేగిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు. బస్సుల ధ్వంసం.. ప్రజాప్రతినిధుల ఇళ్లకు నిప్పు.. నల్లవంతెన వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను, పోలీసు వలయాన్ని ఛేదించుకుని ఆందోళనకారులు వారితో వాదనకు, తోపులాటలకు దిగారు. కలెక్టరేట్ వైపు దూసుకెళ్లారు. ఈ సమయంలో రాళ్లు రువ్వడంతో పోలీసులకు గాయాలయ్యాయి. అనంతరం లాఠీఛార్జ్ చేసి పోలీసులు ఆందోళనకారులను కొంతమేరకు చెదరగొట్టారు. రోడ్డుకు అడ్డంగా పెట్టిన రెండు ప్రైవేటు బస్సులను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అమలాపురంలో ఆందోళనకారుల దాడితో మంటల్లో కాలిపోతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇల్లు అంతేకాక కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై ఉన్న ఒక ప్రైవేటు బస్సును తగులబెట్టారు. అనంతరం అమలాపురం ఎర్ర వంతెన సమీపంలో మంత్రి పినిపే విశ్వరూప్ అద్దెకు ఉంటున్న ఇంటిపై దాడికి దిగి నిప్పు పెట్టారు. అల్లరి మూకలు తమ చేతిలోని పెట్రోల్ డబ్బాలను ఇంట్లోకి విసరటంతో ఇంటిలో ఉన్న వంట గ్యాస్ సిలిండర్ పేలిపోయి మంటలు బీభత్సంగా వ్యాపించాయి. ఇంటిలో ఉన్న మంత్రి గన్‌మెన్ శ్రీనివాస్, వంట మనిషి ప్రకాష్‌కు గాయాలయ్యాయి. ఈ సమయంలో మంత్రి విశ్వరూప్‌తోపాటు కుటుంబ సభ్యులెవరూ ఇంటిలో లేకపోవటంతో వారికి ప్రాణాపాయం తప్పింది. ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లి అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఇంటికి నిప్పు పెట్టారు. ఎమ్మెల్యేపై దాడి జరగకుండా ఆ సమయంలో అక్కడున్న ఆయన అనయాయులు అడ్డుకోగలిగారు. ఇంటిలో ఉన్న ఎమ్మెల్యే, ఆయన భార్య, కుమారుడిని పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆందోళనకారులను అడ్డుకుంటున్న పోలీసులు మంత్రి పినిపె విశ్వరూప్ నివాసం పెచ్చరిల్లిన విధ్వంసం... ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటి నుంచి ఎర్ర వంతెన వద్దకు వెళ్లిన ఆందోళనకారులు రెండు ఆర్టీసీ బస్సులకు నిప్పు పెట్టారు. మరో రెండు బస్సులతో పాటు జిల్లా ఎస్పీ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. పోలీసులు చెదరగొట్టేందుకు ప్రయత్నించగా వారిపై తీవ్ర స్థాయిలో రాళ్లు రువ్వారు. దీంతో ఎస్పీ సుబ్బారెడ్డి, భీమవరం డీఎస్పీ రవిప్రకాష్, అమలాపురం రూరల్ సీఐ వీరబాబు, రూరల్ ఎస్ఐ పరదేశీతో పాటు 30 మంది పోలీసులకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ ఎస్పీ సుబ్బారెడ్డి ఎస్పీని కిమ్స్ ఆస్పత్రికి, ఇతర పోలీసులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మంత్రి విశ్వరూప్ అద్దెకు ఉంటున్న ఇంటిని తగలబెట్టడంతో ఊరుకోని ఆందోళనకారులు ఎర్రవంతెన దిగువన జాతీయ రహదారికి ఆనుకుని మంత్రి నిర్మించుకుంటున్న ఇంటికి కూడా నిప్పంటించారు. పోలీసులు వారిని చెదరగొట్టడానికి ప్రయత్నించగా వారు మరింత రెచ్చిపోయారు. ఇంతలో కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చిన అదనపు పోలీసు బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఏలూరు రేంజ్ డీఐజీ పాల్రాజు పర్యవేక్షణలో కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు. దీంతో రాత్రి తొమ్మిది గంటల సమయంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలీసులపై రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులు పోలీసు వలయంలో కోనసీమ – వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు – సమస్యాత్మక ప్రాంతాలన్నింటిలో పోలీసు పిక్కెట్లు కోనసీమ అంతటా పోలీసులు మొహరించారు. కోనసీమ కేంద్రం అమలాపురంలో చోటు చేసుకున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపధ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఈ పరిణామాలను రాష్ట్ర డిజిపి తీవ్రంగా పరిగణించారు. ఆయన ఆదేశాల మేరకు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి కోనసీమ జిల్లాకు పోలీసులను హుటాహుటిన తరలించారు. ఇప్పటికే అక్కడ ఉన్న 450 మంది పోలీసు బలగాలకు అదనంగా సుమారు వెయ్యి మంది పోలీసులను మొహరించారు. కోనసీమలోని అమలాపురం సహా ముఖ్యమైనన కూడళ్లలో పికెట్లు ఏర్పాటు చేశారు. అమలాపురంలో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పంటించడంతో ఆ జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రామచంద్రాపురంలో చెల్లుబోయిన వేణు, అమలాపురంలో మంత్రి విశ్వరూప్‌తో పాటు కోనసీమ ఎమ్మెల్యేల ఇంటి వద్ద ఎస్సై, కానిస్టేబుళ్లతో ముందు జాగ్రత్త చర్యగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు పోలీసు యంత్రాగాన్ని సిద్ధం చేశారు. ఏలూరు రేంజి డీఐజీ పాలరాజ్ ఆధ్వర్యంలో కాకినాడ, రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీలు ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఐశ్వర్య రస్తోగి, అమలాపురంలోని పలు కీలక ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. -
ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. స్పందించిన మంత్రి విశ్వరూప్
సాక్షి, కోనసీమ: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టారు. దీనిపై మంత్రి విశ్వరూప్ స్పందిస్తూ.. 'నా ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరం. జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ డిమాండ్ చేశాయి. అంబేడ్కర్ పేరు పెట్టాలని జనసేన నిరసనలు కూడా చేసింది. అయితే ఇప్పుడు కార్యకర్తలను రెచ్చగొట్టి అల్లర్లను సృష్టిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాలు చేస్తున్న కుట్రలివి. జిల్లాకు అంబేడ్కర్ పేరును వ్యతిరేకించడం సరికాదు. ఆయన పేరు పెట్టడంపై అందరూ గర్వపడాలి. ప్రస్తుత సమయంలో అందరూ సంయమనం పాటించాలి' అని మంత్రి విశ్వరూప్ కోరారు. చదవండి: (Konaseema: మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు) -
Konaseema: మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు
సాక్షి, కోనసీమ: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. అయితే ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనం రాళ్లదాడి చేశారు. ఈ దాడుల్లో కొంతమంది పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. 2 ప్రైవేట్ కాలేజ్ బస్సులు దగ్ధం చేశారు. మంత్రి విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇల్లు దగ్ధం అమలాపురంలో విధ్వంసం కొనసాగుతోంది. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిని ఆందోళనకారులు దగ్ధం చేశారు. చదవండి: (MLC Ananta Babu Case: చట్టం ముందు ఎవరైనా ఒక్కటే: సజ్జల) -
అన్ని పక్షాలు కోరాకే పేరు మార్పు
సాక్షి, అమలాపురం: ‘రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కోరాకనే కోనసీమ జిల్లా పేరు మార్పునకు ప్రభుత్వం డ్రాఫ్ట్రు నోటిఫికేషన్ విడుదల చేసిందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. అమలాపురం క్షత్రియ కళ్యాణ మండపంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా ముఖ్యమంత్రి జగన్ నేరుగా ప్రకటించలేదని, మార్పు చేయాలని అన్ని పార్టీలు విస్తృతంగా డిమాండ్ చేశాయన్నారు. అంబేడ్కర్ పేరు పెట్టాలని జనసేన డిమాండ్ చేసిందని, పేరు మార్పును బీజేపీ ఆహ్వానించిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రాన్ని, విభజన తర్వాత రాష్ట్రాన్ని 14 ఏళ్ల పాటు పాలించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు తాళ్లరేవులో జరిగిన సమావేశంలో అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పేరు ప్రకటించిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. పేరు మార్పు మీద అభ్యంతరం ఉంటే కలెక్టర్, ఆర్డీవోలకు చెప్పుకొనే స్వేచ్ఛ అందరికీ ఉందన్నారు. శాంతి భద్రతలు దృష్టిలో పెట్టుకుని ఏ విధమైన కవ్వింపు చర్యలు చేపట్టవద్దని, ర్యాలీలు, ధర్నాలు చేయకుండా ఇక్కడి ప్రత్యేకతను కాపాడాలని మంత్రి విశ్వరూప్ కోరారు. -
ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తా: పినిపే విశ్వరూప్
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో మళ్లీ చోటు దక్కడంతో ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ తన రాజకీయ ప్రయాణంలో నాలుగోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సచివాలయంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి సాయంత్రానికి అమలాపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్‌తో ‘సాక్షి’ ముచ్చటించింది. ప్రశ్న: ఆర్టీసీ నష్టాల్లో ఉంది. డీజిల్ ధర పెరిగి సంస్థకు భారమవుతున్న తరుణంలో మీ ప్రణాళికలు ఏంటి? మంత్రి: డీజిల్ ధరల పెరుగుదలే ఆర్టీసీకి పెనుభారం. ఉన్నతాధికారులతో సమీక్షించి సంస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తా. ప్రశ్న: ఆర్టీసీని ప్రభుత్వపరం చేసి సంస్థకు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. తదుపరి మీ చర్యలు ఎలా ఉంటాయి? జవాబు: ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం చరిత్రాత్మకం. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆర్టీసీని మరింత సంరక్షిస్తాను. ప్రశ్న: శాఖాపరంగా కొత్త నిర్ణయాలుంటాయా? జవాబు: వాహన కాలుష్య నివారణపై ప్రత్యేక దృష్టి పెడతాం. దశల వారీగా విద్యుత్ బస్సులను ప్రవేశపెడతాం. టీటీడీ బస్సుల నుంచే ఈ విధానానికి శ్రీకారం చుడతాం. కొండ పైన, కిందన 50 చొప్పున వంద బస్సులను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. మే 15వ తేదీ నుంచి స్వామివారి సన్నిధి నుంచే తొలి బస్సును సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ప్రశ్న: విద్యుత్ బస్సుల ప్రయోగాన్ని ఎలా కొనసాగిస్తారు? జవాబు: తిరుపతిలో విజయవంతమైతే వాహన కాలుష్య నివారణే లక్ష్యంగా రాష్ట్రంలో దశల వారీగా ఎంపిక చేసిన నగరాల్లో, ఆ తర్వాత పట్టణాల్లో ఈ బస్సులను ప్రారంభిస్తాం. ప్రశ్న: రవాణా రంగంలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలేమిటి? జవాబు: ఆర్టీఏ లేదా అధికారిక కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ– బ్రేక్ ఇన్స్పెక్టర్లు) పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. త్వరలోనే 90 పోస్టులను భర్తీ చేస్తాం. ప్రశ్న: ప్రైవేటు రంగ రవాణా, హైటెక్ బస్సులకు అనుమతులు తదితర విషయాల్లో అక్రమాల నివారణకు చర్యలేమిటి? జవాబు: ప్రైవేటు ట్రాన్స్‌పోర్టుపై తొలుత ప్రత్యేక దృష్టి పెడతాను. బస్సులకు నిర్ణీత కాలంలో అనుమతులు (పర్మిట్లు) తీసుకోకుండా ఒకే నంబరుతో నాలుగైదు రిజిస్ట్రేషన్లు చేయించి, హైటెక్ బస్సులను అక్రమంగా నడపడానికి అడ్డుకట్ట వేస్తాను. ప్రశ్న: ఆటో, చిన్న రవాణా వాహనాలతో జీవనోపాధి పొందే చిన్న కుటుంబాల వారి విషయంలో? జవాబు: ప్యాసింజర్ ఆటోలు, గూడ్స్ ఆటోల వంటి వాహనాలు రవాణా రంగంపై ఆధారపడి వేలాది వాహనదారులు, కారి్మకులు జీవనోపాధి పొందుతున్నారు. వీరికి పోలీసులు లేదా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వేధింపులు లేకుండా సాధ్యమైనంత వరకూ మానవతా దృక్పథంతో చూసేలా అధికారులతో సమీక్షించి ఆదేశాలిస్తాను. ప్రశ్న: వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో రెండోసారి మంత్రి అయ్యారు. మీ స్పందన? జవాబు: చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్ నాపై ఉంచిన బాధ్యతలను అప్పుడు ప్రతిపక్షంలో.. ఇప్పుడు ప్రభుత్వంలో నెరవేర్చాను. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో నాకు మంత్రి పదవి ఇచ్చారు. ఆయన లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తూనే విధేయుడిగా ఉంటాను. -
AP New Cabinet: జగన్ మార్క్.. సామాజిక న్యాయం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కేబినెట్ పునర్వవస్థీకరణలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు అగ్రాసనం వేశారు. కేబినెట్ కూర్పులో పార్టీ అజెండా ప్రకారం ఎస్సీ, బీసీ వర్గాలకు మూడొంతులు ప్రాతినిధ్యం కల్పిస్తూనే సామాజిక సమతూకాన్ని కూడా పాటించారు. తొలి కేబినెట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహించగా జిల్లాల పునర్విభజన తరువాత ఏర్పడుతున్న కేబినెట్లో ప్రాతినిధ్యం నాలుగుకు పెరిగింది. పార్టీపై నిబద్ధత, పనితీరు, సీనియారీటీ, నాయకత్వ పటిమ, సమర్థతలే కొలమానంగా మంత్రుల ఎంపిక జరిగింది. రెండేళ్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల టీమ్‌గా సీఎం కేబినెట్లోకి ఏరికోరి మంత్రులను తీసుకున్నారు. జిల్లాల విభజన తరువాత ఏర్పడ్డ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి నలుగురుకి ప్రాతినిధ్యం లభించడంపై జిల్లాల్లో పార్టీ శ్రేణులు సంబరాలలో మునిగితేలుతున్నాయి. తొలి కేబినెట్లో మంత్రులుగా ఉన్న పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనితలకు మరోసారి చోటు కల్పించారు. కాకినాడ జిల్లా నుంచి ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు తొలిసారి కేబినెట్లో అవకాశం లభించింది. ఉమ్మడి జిల్లా నుంచి నలుగురుకి ప్రాతినిధ్యం కలి్పంచగా ఎస్సీల నుంచి ఇద్దరికి, బీసీల నుంచి ఒకరికి అవకాశం కల్పించారు. నాలుగోసారి మంత్రిగా విశ్వరూప్ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అనుంగ శిష్యుడైన విశ్వరూప్ నాలుగోసారి మంత్రి అవుతున్నారు. 2009లో వైఎస్ కేబినెట్లో తొలిసారి మంత్రిగా నియమితులైన విశ్వరూప్ వైఎస్ మరణానంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో కూడా కొనసాగారు. మంత్రిగా పదవీ కాలం ఆరు నెలలుండగానే మహానేతతో ఉన్న అనుబంధంతో పదవిని తృణప్రాయంగా విడిచిపెట్టి జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. ఆవిర్భావం నుంచి పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసి కోనసీమలో ఎస్సీ సామాజికవర్గంతో పాటు ఇతర సామాజికవర్గాల్లో మంచి పట్టు సాధించి సమర్థత కలిగిన నేతగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే తొలి కేబినెట్లో ఉన్న విశ్వరూప్‌ను రెండోసారి కేబినెట్లోకి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకున్నారు. విశ్వరూప్‌ను కేబినెట్లో కొనసాగించడం ద్వారా కోనసీమ జిల్లాలో బలమైన సామాజికవర్గాల పరంగా మంచి ముద్ర వేస్తారని నేతలు విశ్లేషిస్తున్నారు. విశ్వరూప్ వివాదరహితుడిగా ఉండడం రెండోసారి మంత్రి పదవి దక్కడానికి ఒక కారణమైంది. మరోసారి కేబినెట్లోకి వేణు బీసీ సంక్షేమశాఖా మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రెండోసారి కేబినెట్లోకి తీసుకున్నారు. వేణు ఎంపిక ద్వారా బలహీనవర్గాలలో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గానికి సీఎం సముచిత ప్రాతినిధ్యం కల్పించారు. దివంగత మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు ముఖ్య అనుచరుడిగా ఆయన ఉండేవారు. కోనసీమలో రాజోలు ప్రాంతానికి చెందిన వేణు సమర్థతను గుర్తించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడిగా చేశారు. అనంతరం ఓదార్పు యాత్రలో జగన్మోహన్రెడ్డి వెంట నడిచిన వేణు నాటి నుంచి పార్టీ పట్ల విధేయతతో పనిచేశారు. శెట్టిబలిజల్లో బలమైన నేతగా ఉన్న వేణును రామచంద్రపురం నుంచి పోటీచేయించి ఎమ్మెల్యేను చేసి తొలి కేబినెట్లో మంత్రిగా కూడా చేశారు. ఇప్పుడు రెండోసారి కేబినెట్లో కూడా ప్రాతిని«ధ్యం కలి్పంచడం ద్వారా ఆ సామాజికవర్గానికి సముచిత స్థానం దక్కింది. వేణు వాగ్ధాటితో పార్టీ వాణిని బలంగా వినిపించడం, బీసీ సంక్షేమశాఖను సమర్థంగా నిర్వహించడం కూడా కలిసి వచ్చింది. శ్రమించిన వనితకు మరో చాన్స్ కొవ్వూరు నియోజకవర్గం ఏర్పాటు తరువాత తొలి మహిళా ఎమ్మెల్యే, మంత్రిగా తానేటి వనితకు రెండోసారి సీఎం జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో అవకాశం కలి్పంచారు. 2012లో వైఎస్సార్ సీపీలో చేరిన వనిత అప్పటి నుంచి పార్టీ కోసం శ్రమించారు. సాధారణ గృహిణిగా ఉన్న వనిత తండ్రి, మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని పార్టీ ప్రగతిలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2019లో వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్యే అయిన వనిత తొలి కేబినెట్లో స్త్రీశిశుసంక్షేమశాఖ మంత్రిగా సమర్థవంతమైన సేవలందించారు. జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా మహిళలకు ఆది నుంచి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కొవ్వూరు నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎమ్మెల్యేగా ఉన్న వనితకు మంత్రి పదవి కట్టబెట్టారు. సమర్థత, పార్టీలో సామాజిక సమతూకాలను బేరీజు వేసుకుని వనితకు మరోసారి అవకాశం కల్పించడం ద్వారా ఎస్సీలలో మాదిగ సామాజిక వర్గానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రాతినిధ్యం కల్పించడంపై హర్షం వ్యక్తమవుతోంది. నిబద్ధతకు గుర్తింపు మూడు దశాబ్దాలపాటు తునిలో రాజకీయాలను శాసించిన యనమల వంటి రాజకీయ వటవృక్షాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేసిన తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాను ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్లో తొలిసారి తీసుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో ఒక సైనికుడిలా పనిచేస్తూ వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో పోరాట పటిమతో పార్టీని విజయ పథం వైపు నడింపించడం తాజా మంత్రి వర్గంలో తీసుకోవడానికి దోహదం చేసింది. వాస్తవానికి తొలి కేబినెట్లోనే చాన్స్ దక్కుతుందని పార్టీ శ్రేణులు ఆశించాయి. చివరకు వివిధ సమీకరణల్లో ప్రభుత్వ విప్ లభించింది. అప్పుడే మలివిడత కేబినెట్లో బెర్త్ ఖాయమైంది. అందుకు అనుగుణంగానే కాకినాడ జిల్లా నుంచి రాజాను మంత్రి పదవి వరించింది. తుని నియోజకవర్గం నుంచి వరుసగా రెండు పర్యాయాలు యనమల సోదరుడిపై గెలుపొందడమే కాకుండా నియోజకవర్గ టీడీపీ నేతలకు సింహస్వప్నంగా నిలిచారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వంటి అక్రమ కేసులతో వేధింపులు ఎదుర్కొన్నారు. వైఎస్సార్ సీపీని వీడి పారీ్టలోకి రావాలని పలు ప్రలోభాలకు గురిచేసినా లెక్క చేయకుండా పార్టీ పైన, అధినేత జగన్‌పైన ఎంతో విశ్వాసంతో పార్టీ వెన్నంటి నిబద్ధతతో నిలవడం కలిసి వచ్చింది. కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాలుంటే ఆరు నియోజకవర్గాల నుంచి కాపు సామాజిక వర్గీయులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మలి కేబినెట్లో రాజాకు అవకాశం కల్పించి ఆ సామాజిక వర్గానికి పెద్ద పీటేశారు. తునిలో ఆ సామాజికవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం ఇదే ప్రథమం. మంత్రి పదవి కూడా జగన్మోహన్రెడ్డి కేబినెట్లో దక్కడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆ సామాజికవర్గీయుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కోనసీమకు జోడు పదవులు... జిల్లాల విభజన తరువాత కోనసీమకు జోడు పదవులు దక్కాయి. జిల్లాల పునర్విభజన తరువాత దాదాపు ఒకో జిల్లాకు ఒకో మంత్రి పదవి దక్కిన క్రమంలో కోనసీమ జిల్లాకు ఒకేసారి రెండు బెర్త్‌లు దక్కాయి. ఆ రెండు కూడా ఎస్సీ, బీసీలకే కట్టబెట్టడం ద్వారా ఆ వర్గాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఉన్న అభిమానం తేటతెల్లం అవుతోంది. కోనసీమ జిల్లాలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వు›కావడంతో ఆ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్టయ్యింది. అమలాపురం నుంచి విశ్వరూప్, రామచంద్రపురం నుంచి వేణులను కేబినెట్లోకి తీసుకోవడం ద్వారా సీనియర్లను కొనసాగించినట్టయింది. వైఎస్సార్ సీపీకి తొలి నుంచి వెన్నంటి నిలుస్తోన్న ఎస్సీ, బీసీ సామాజికవర్గాలకు ఈ కేబినెట్లో సముచిత స్థానం కల్పించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న బీసీలు, కాపులు, మాల, మాదిగలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడంపై పార్టీ శ్రేణుల్లోనే కాకుండా మూడు జిల్లాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
వాళ్ళు ఎగ్గొట్టారు.. విద్యార్థుల కోసం జగనన్న కట్టారు
-
గురుకులాల గురి కుదిరింది
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) గురుకుల విద్యాలయాల్లో మంచి ఫలితాలు లభిస్తున్నాయి. దీంతో ఎస్సీ గురుకులాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు గురి కుదిరింది. ఎస్సీ గురుకులాల్లో సాధిస్తున్న మెరుగైన ఫలితాలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆదరణ పెరుగుతోంది. గురుకులాల విద్యార్థులు మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది అత్యధిక మెడికల్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లోను తమ సత్తా చాటారు. నీట్లో అత్యంత ప్రతిభ కనబరిచిన గురుకుల విద్యార్థులు 17 మందికి ఎంబీబీఎస్‌లోను, 21 మందికి బీడీఎస్‌లోను సీట్లు లభించే అవకాశం ఉంది. ఏకంగా 13 మంది విద్యార్థులు నేరుగా ఐఐటీ అడ్మిషన్‌కు అర్హత సాధించారు. 34 మంది ప్రిపరేటరీ ఐఐటీ (ఏడాది తర్వాత ఎటువంటి పరీక్ష లేకుండా అడ్మిషన్)కి అర్హత సాధించగా 37 మంది ఎన్ఐటీకి అర్హత సాధించడం రాష్ట్ర చరిత్రలోనే రికార్డు. అదే 2014లో మన రాష్టంలోని ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో సాధించిన ఐఐటీ సీటు ఒక్కటి మాత్రమే కావడం గమనార్హం. ఆరోగ్యానికీ ప్రాధాన్యం గురుకులాల విద్యార్థులకు విద్యతోపాటు ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ ఏడాది ‘కంటివెలుగు’ ద్వారా ఎస్సీ గురుకులాల్లో చదివే లక్షమంది విద్యార్థులకు ఉచిత పరీక్షలు నిర్వహించారు. 3,326 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి వారికి ఉచితంగా కళ్లజోడు అందించారు. ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ద్వారా 55,763 మంది బాలికలకు ప్రతినెల పది చొప్పున నాణ్యమైన శానిటరీ న్యాప్కిన్స్ను ఉచితంగా అందిస్తున్నారు. ప్రత్యేక శ్రద్ధతోనే ఇది సాధ్యమైంది అట్టడుగు వర్గాలకు మెరుగైన విద్యావకాశాలు అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ తీసుకున్న ప్రత్యేకశ్రద్ధ వల్లే ఇది సాధ్యమైంది. రాష్ట్రంలోని 192 ఎస్సీ గురుకులాల్లోను మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రత్యేకశ్రద్ధ వహిస్తున్నాం. విద్యార్థులను సబ్జెక్టుల వారీగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారికి ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ఉపాధ్యాయులతో బోధన, ప్రైవేట్ క్లాస్‌లు పెట్టిస్తున్నాం. ఈ ఏడాది ఐఐటీ, ఎన్ఐటీ, మెడికల్ సీట్లు సాధించడమే ఇందుకు నిదర్శనం. అమ్మఒడి వంటి పథకాలతోపాటు అనేక తోడ్పాటు చర్యలు తీసుకోవడం ద్వారా ఎస్సీ విద్యార్థులకు ఉన్నత చదువులను చేరువచేసే ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. – పినిపే విశ్వరూప్, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి -
'ఎస్వోపీ'తో సత్వర న్యాయం
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో భాగంగా దళితులు, గిరిజనుల రక్షణ కోసం రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ)తో సత్వర న్యాయం అందుతుందని మంత్రులు పినిపే విశ్వరూప్, మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్ అభిప్రాయపడ్డారు. ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. బుధవారం సచివాలయంలో హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి హాజరైన ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వీటిపై అవగాహన క్పలించారు. గత ఏడేళ్లలో ఎన్నడూ జరగని ఈ కమిటీ సమావేశాలను తమ ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై ముఖ్యమంత్రి జగన్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు ఇది నిదర్శనమన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి రాష్ట్ర స్థాయిలో, మూడు నెలలకొకసారి జిల్లా స్థాయిలో హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారన్నారు. ఆగస్టులో రాష్ట్ర స్థాయి సమావేశానికి సీఎం హాజరు కానున్నట్లు చెప్పారు. నేరాలు 13 శాతం తగ్గుముఖం: డీజీపీ సవాంగ్ రాష్ట్రంలో క్రైమ్ రేట్ 13 శాతం తగ్గిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిందితులుగా ఉన్న వారు తమ శాఖకు చెందిన వారైనా ఉపేక్షించకుండా ఇటీవల ఇద్దరు ఎస్ఐలు, ఒక సీఐపై చర్యలు తీసుకున్నామన్నారు. దర్యాప్తును 38 రోజుల్లో పూర్తి చేస్తున్నామన్నారు. ఉద్వేగానికి గురైన ఎమ్మెల్యే పద్మావతి అనంతపురంలో జోగిని, మాతంగి వ్యవస్థ పేరుతో ఎస్సీ మహిళలను బలి పశువులుగా మారుస్తున్నారని సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల బాలికలను సైతం విడిచి పెట్టడం లేదంటూ ఉద్వేగానికి గురయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. కేసుల నమోదులో నిర్లక్ష్యాన్ని సహించం: హోంమంత్రి సుచరిత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదులో నిర్లక్ష్యం చూపే పోలీసు అధికారులను క్షమించేది లేదని హోం మంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. అట్రాసిటీ చట్టం వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. కేసు దర్యాప్తు, పురోగతిపై ఎప్పటికప్పుడు బాధితులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశాలకు మంత్రులు హాజరు కావాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎంతో ఉపయోగపడుతుందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. దీన్ని రూపొందించిన అధికారులను అభినందించారు. 24 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు బాధితులకు 7 రోజుల్లోగా ఎక్స్‌గ్రేíÙయా అందుతుందని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సునీత పేర్కొన్నారు. 60 రోజుల్లో చార్జిïÙట్ దాఖలు చేసేలా నిబంధనలు రూపొందించామన్నారు.