
సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్.. శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. శుక్రవారం మైల్డ్ స్ట్రోక్‌కు గురికావడంతో కుటుంబ సభ్యులు విశ్వరూప్‌ను వెంటనే రాజమహేంద్రవరం బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. అయితే అనంతరం, విశ్వరూప్‌ను హెల్త్ కండీషన్‌ను పరిశీలించిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
కాగా, శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. మంత్రి విశ్వరూప్‌ను ఫోన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా విశ్వరూప్ ఆరోగ్య పరిస్థితిపై సిటీన్యూరో వైద్యులను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment