సీఎం వైఎస్ జగన్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
యోగక్షేమాలు తెలుసుకున్న నేతలు.. పార్టీ నేతలకు ధైర్యం చెప్పిన సీఎం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో సోమవారం కేసరపల్లి క్యాంపునకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి ముఖ్యమంత్రికి సంఘీభావం తెలిపారు. హత్యాయత్నం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేసి, సీఎం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని, బస్సుయాత్రకు వస్తున్న విశేష ఆదరణ చూసి తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డారని పార్టీ నేతలు ముఖ్యమంత్రితో అన్నారు. ప్రజల ఆశీర్వాదంవల్లే అదృష్టవశాత్తూ దాడి నుంచి సీఎం తప్పించుకున్నారన్నారు.
ఇలాంటి దాడులు యాత్రను, వైఎస్సార్‌సీపీ విజయాన్ని ఆపలేవని ముఖ్యమంత్రి జగన్ నేతలతో అన్నారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయని ఆయన వారితో అన్నారు. ధైర్యంగా అడుగులు ముందుకువేద్దామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరంలేదన్నారు.
ఇక సీఎంను కలిసిన వారిలో మండలి చైర్మన్ మోషేన్‌రాజు, మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు కేశినేని నాని, అయోథ్యరామిరెడ్డి, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, మొండితోక జగన్మోహన్‌రావు, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కైలే అనిల్‌కుమార్, వల్లభనేని వంశీ, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, కల్పలతారెడ్డి, విజయవాడ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్, మైలవరం అభ్యర్థి సర్నాల తిరుపతిరావు, పెడన అభ్యర్థి ఉప్పాల రాము, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, డాక్టర్ దుట్టా రామచంద్రరావు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment