సమావేశంలో మంత్రులు పినిపే విశ్వరూప్, మేకతోటి సుచరిత, తానేటి వనిత, సురేష్, డీజీపీ తదితరులు
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో భాగంగా దళితులు, గిరిజనుల రక్షణ కోసం రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ)తో సత్వర న్యాయం అందుతుందని మంత్రులు పినిపే విశ్వరూప్, మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్ అభిప్రాయపడ్డారు. ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. బుధవారం సచివాలయంలో హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి హాజరైన ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వీటిపై అవగాహన క్పలించారు. గత ఏడేళ్లలో ఎన్నడూ జరగని ఈ కమిటీ సమావేశాలను తమ ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై ముఖ్యమంత్రి జగన్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు ఇది నిదర్శనమన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి రాష్ట్ర స్థాయిలో, మూడు నెలలకొకసారి జిల్లా స్థాయిలో హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారన్నారు. ఆగస్టులో రాష్ట్ర స్థాయి సమావేశానికి సీఎం హాజరు కానున్నట్లు చెప్పారు.
నేరాలు 13 శాతం తగ్గుముఖం: డీజీపీ సవాంగ్
రాష్ట్రంలో క్రైమ్ రేట్ 13 శాతం తగ్గిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిందితులుగా ఉన్న వారు తమ శాఖకు చెందిన వారైనా ఉపేక్షించకుండా ఇటీవల ఇద్దరు ఎస్‌ఐలు, ఒక సీఐపై చర్యలు తీసుకున్నామన్నారు. దర్యాప్తును 38 రోజుల్లో పూర్తి చేస్తున్నామన్నారు.
ఉద్వేగానికి గురైన ఎమ్మెల్యే పద్మావతి
అనంతపురంలో జోగిని, మాతంగి వ్యవస్థ పేరుతో ఎస్సీ మహిళలను బలి పశువులుగా మారుస్తున్నారని సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల బాలికలను సైతం విడిచి పెట్టడం లేదంటూ ఉద్వేగానికి గురయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు.
కేసుల నమోదులో నిర్లక్ష్యాన్ని సహించం: హోంమంత్రి సుచరిత
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదులో నిర్లక్ష్యం చూపే పోలీసు అధికారులను క్షమించేది లేదని హోం మంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. అట్రాసిటీ చట్టం వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. కేసు దర్యాప్తు, పురోగతిపై ఎప్పటికప్పుడు బాధితులకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశాలకు మంత్రులు హాజరు కావాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎంతో ఉపయోగపడుతుందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. దీన్ని రూపొందించిన అధికారులను అభినందించారు. 24 గంటల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో పాటు బాధితులకు 7 రోజుల్లోగా ఎక్స్‌గ్రేíÙయా అందుతుందని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సునీత పేర్కొన్నారు. 60 రోజుల్లో చార్జిïÙట్ దాఖలు చేసేలా నిబంధనలు రూపొందించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment