Mekathoti Sucharitha
-
సీఎంకు దళిత, బహుజనులు వెన్నుదన్నుగా ఉండాలి
సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావజాలంతో కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వంలో దళిత, బహుజనులకు లభిస్తున్న ఆదరణ చరిత్రాత్మకమైందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. రాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరితను గుంటూరులోని ఆమె నివాసంలో నాగార్జున శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దళిత, బహుజనులందరూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాలని కోరారు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కిన నాగార్జునను సుచరిత అభినందించారు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం 10.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో మేరుగు నాగార్జున తన శాఖ బాధ్యతలు చేపడతారని ఆయన కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
తప్పుడు ప్రచారం చేశారు: మేకతోటి సుచరిత
సాక్షి, తాడేపల్లి: తాను పంపింది ఒక లేఖ అయితే.. రాజీనామా లేఖ అంటూ తప్పుడు ప్రచారం చేశారని ప్రత్యర్థులపై మాజీ మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. తాను రాజీనామా చేయలేదని, అవన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మేకతోటి సుచరిత బుధవారం సుమారు గంటన్నర భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో తనకు వీసమెత్తు అవమానం కూడా జరగలేదన్నారు. జడ్పీటీసీ స్థాయి నుంచి హోంమంత్రి వరకు తనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం ఇచ్చారని తెలిపారు. కేబినెట్లో కొంతమందిని మారుస్తామని సీఎం జగన్ ముందే చెప్పారని అన్నారు. కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యల వల్లే ఇంటి నుంచి బయటకు రాలేకపోయానని తెలిపారు. కేబినెట్ పునర్‌వ్యవస్థీరణలో సీఎం జగన్ నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని సుచరిత తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో మనిషిగా తనను ఎప్పుడూ ఆదరిస్తారని తెలిపారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం సీఎం జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. చదవండి: టీడీపీ, తోక పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: మంత్రి ఆర్కే రోజా -
పదవి పోయినందుకు ఎలాంటి బాధ లేదు..
గుంటూరు రూరల్: మంత్రి పదవి పోయినందుకు ఎలాంటి బాధ లేదని మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. మంత్రి పదవి రెండున్నరేళ్లు మాత్రమేనని సీఎం వైఎస్ జగన్ ముందే చెప్పారన్నారు. తన వల్ల పార్టీకి చెడ్డ పేరు రాకూడదని.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. ఈ మేరకు సోమవారం గుంటూరులోని ఆమె నివాసంలో సుచరిత మీడియాతో మాట్లాడారు. చదవండి: ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్ వెంటే: తిప్పేస్వామి మంత్రి పదవి పోయినందుకు తనకు బాధగా లేదని.. అయితే కొన్ని కారణాలు బాధ కలిగించాయన్నారు. వ్యక్తిగత కారణాలు, అనారోగ్య పరిస్థితుల వల్ల తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పంపానన్నారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం జగనన్నతోనే ఉంటానని చెప్పారు. పదవిలో ఉన్నా, లేకున్నా ప్రజలకు అందుబాటులోనే ఉంటానని సుచరిత స్పష్టం చేశారు. -
మహిళా సాధికారతలో ఏపీ విజయం: హోంమంత్రి సుచరిత
సాక్షి, అమరావతి: మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిజంగా నిశ్శబ్ద విప్లవంతో విజయం సాధించిందని, ఇది ముమ్మాటికీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనత అని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ)లో శుక్రవారం ‘జాతీయ మహిళా పార్లమెంట్–2022’ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సుచరిత మాట్లాడుతూ.. నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పనుల్లోను మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం తేవడం చారిత్రాత్మకమన్నారు. మహిళల రక్షణ కోసం దిశా యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు దిశా చట్టం అమలు చేసేందుకు రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి కేంద్రం ఆమోదం కోసం పంపిన విషయాన్ని గుర్తు చేశారు. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, విద్యా దీవెన, విద్యా వసతి, గోరుముద్ద, పౌష్టికాహారం, మహిళల చేతికే ఇళ్ల పట్టాలు వంటి అనేక పథకాలతో మహిళలు, బాలికలు, చిన్నారులకు నేరుగా మేలు చేస్తున్నారని చెప్పారు. నవరత్నాల పథకాలన్నీ మహిళలను దృష్టిలో పెట్టుకొని రూపొందించినవేనని అన్నారు. పదవుల్లో 50 శాతం వాటా మాత్రమే కాకుండా మహిళను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం వైఎస్ జగన్ అనేక సంస్కరణలు తెచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళలు రాజకీయ, సామాజిక, ఆర్థిక తదితర రంగాల్లో పురోగమిస్తున్నారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలతో సాధికారత సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ మహిళలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. ఆధునిక మహిళ అన్ని రంగాల్లోను పురోగమించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సుచరిత అన్నారు. ప్రారంభ సభకు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అధ్యక్షత వహించారు. మహిళా కమిషన్ ఆధ్వర్యంలో రానున్న ఏడాది కాలంలో చేపట్టబోయే కార్యక్రమాలపై ‘సబల’ అనే ప్రణాళికను ఈ నెల 8న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఆవిష్కరిస్తామని ప్రకటించారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కల్పలతారెడ్డి, పాఠశాల విద్యా మానిటరింగ్ కమిషన్ వైస్ చైర్పర్సన్ ఆరిమండ విజయ శారదారెడ్డి, యునిసెఫ్ ప్రతినిధి సోనీజార్జి, నాగార్జున యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రాజశేఖర్ తదితరులు మాట్లాడారు. ఐదు అంశాలపై చర్చ.. తీర్మానం మహిళ సంక్షేమం కోసం ఐదు ప్రధాన అంశాలను ‘మాక్ పార్లమెంట్’ ముందు చర్చకు ఉంచారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిన దిశ బిల్లును, 50 శాతం మహిళా రిజర్వేషన్, 21 సంవత్సరాల వివాహ వయసు పెంపు తదితర బిల్లులను మాక్ పార్లమెంట్లో చర్చించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు చట్ట రూపంలో రావడానికి పార్లమెంట్లో పెండింగ్‌లో ఉందని, మహిళలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని మాక్ పార్లమెంట్ తీర్మానం చేసింది. కాగా, ఇప్పటికే ఉన్న చట్టాలను బలోపేతం చేయడంలో భాగంగా గృహహింస చట్టం, 125 సీఆర్పీసీ, పోష్ చట్టం, వివాహ అర్హత వయసు పెంపు, దిశ బిల్లు తదితర చట్టాలకు సంబంధించి సిఫార్సు చేసిన అవకాశాలతో లోపాలను పూరించడంపై చర్చించారు. మహిళల ఆర్థిక సాధికారత అంశంపై ప్రధానంగా చర్చించారు. పార్లమెంట్‌కు స్పీకర్‌గా వాసిరెడ్డి పద్మ వ్యవహరించగా కేంద్ర మంత్రులుగా రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు గజ్జల వెంకటలక్ష్మి, కర్రి జయశ్రీ, బూసి వినీత, గడ్డం ఉమ, షేక్ రుకియాబేగం వ్యవహరించారు. ఎంపీలుగా వాసవ్య మహిళా మండలి ప్రతినిధులు కీర్తి, పోలిశెట్టి సుభాషిణి, రష్మి, కుమారి, వర్సిటీ ప్రొఫెసర్లు విమల, సరస్వతి, నాగార్జున విశ్వవిద్యాలయ అధ్యాపకులు, హెచ్వోడీలు, న్యాయవాదులు, పోలీసు అధికారులు, ఎన్జీవో ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ∙ -
కుటుంబ విలువల గురించి మాట్లాడేది వెన్నుపోటుదారులా?
గుంటూరు రూరల్: వెన్నుపోటుదారు నాయకత్వంలో పనిచేసేవారు, కుటుంబ విలువలే లేని వ్యక్తులు, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కుటుంబం గురించి, ఆయన కుటుంబసభ్యుల గురించి మాట్లాడితే ప్రజలు మరింతగా అసహ్యించుకుంటున్నారని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గుంటూరు జిల్లా పేరేచర్లలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుకు కుటుంబ అనుబంధాలు లేవు కాబట్టి, ఎవరికీ ఉండకూడదనుకుంటాడని చెప్పారు. చంద్రబాబుకు చెల్లెళ్ల మీద, తోబుట్టువుల మీద ప్రేమ లేదు కాబట్టి, ఎవరికీ చెల్లెళ్ల మీద ప్రేమలేదని ప్రచారం చేయిస్తాడన్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఏ స్థాయికి దిగజారతాడో 40 ఏళ్ల రాజకీయ జీవితంలో వందల ఉదాహరణలు దొరుకుతాయన్నారు. అందరూ తనలాగే ప్రవర్తిస్తారని పదేపదే ఆరోపణలు చేయిస్తుంటాడని చెప్పారు. మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం జగన్ రాష్ట్రంలో మహిళా సాధికారత ఏంటనేది చేసి చూపించింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న మేలును పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి జగన్ సతీమణి మీద కూడా ప్రతిపక్షం అవాకులు చెవాకులు పేలుతోందన్నారు. జగనన్న సోదరి షర్మిల పక్క రాష్ట్రంలో పార్టీ పెడితే రాష్ట్రానికి రాకుండా తరిమేశారని నోటికొచ్చినట్లు, అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఒక మహిళగా షర్మిల సొంతగా పార్టీ పెట్టుకుంటే అది తప్పుగా ఎలా అనిపిస్తుందని ప్రశ్నించారు. దాన్ని కూడా రాజకీయం చేయటం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కార్యక్రమాలు చూసి ప్రతిపక్షాలు ఇటువంటి చెత్త రాజకీయాలను తెరపైకి తెస్తున్నాయన్నారు. అలాంటి సీఎం మీద ఆరోపణలు, అసత్యాలు మాట్లాడి నంత మాత్రాన రాష్ట్ర ప్రజలు వాటిని నమ్మేందుకు సిద్ధంగా లేరని చెప్పారు. మహిళా భద్రత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌ను దాదాపు 1.1 కోట్లమందికిపైగా మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. వాళ్లు ఎక్కడ నుంచి అయినా, ఏ ఆపదలో ఉన్నా, సాయం కోరితే తక్షణమే స్పందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో మహిళలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, అధికారంలోకి వచ్చాక పట్టించుకోకుండా, మహిళల జీవితాలతో చెలగాటమాడినందుకే గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు, మహిళలు టీడీపీని 23 స్థానాలకే పరిమితం చేశారన్న విషయం గుర్తుంచుకుంటే మంచిదని ఆమె హితవు పలికారు. -
‘హోదా’ కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్
ప్రత్తిపాడు: ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు నిజంగా కష్టపడుతున్న వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో సోమవారం గ్రామ సచివాలయ భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీల్లో పెట్టిన ప్రత్యేక హోదా రావాలని రాష్ట్రం విడిపోయిన నాటినుంచీ ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సైతం ప్రత్యేక హోదా కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని మంత్రి గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కూడా పలుసార్లు మోదీని నేరుగా కలిసి హోదా అంశాన్ని గుర్తు చేశారని, ముఖ్యమంత్రులతో మోదీ మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ ఇదే అంశంపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడారని వివరించారు. అయితే, ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని, ప్రత్యేక ప్యాకేజీ చాలని గత ప్రభుత్వం చెప్పడం వల్లే ఈ అంశాన్ని పక్కన పెట్టామని కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు చాలాసార్లు చెప్పారని హోంమంత్రి అన్నారు. కేంద్రం వెనక్కిపోవడం బాధాకరం విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే చాలా లాభాలున్నాయని, అందుకోసమే ఎప్పటి నుంచో హోదా అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నిలదీస్తున్నారని హోం మంత్రి సుచరిత చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర హోం శాఖ అజెండాలో పెట్టిన ప్రత్యేక హోదా అంశంపై వెనక్కిపోవడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ చెప్పిందన్నారు. 2014లో మోదీనే స్వయంగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని, అధికారంలోనికి వచ్చిన తరువాత దాటవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని చెప్పారు. ఎందుకంటే మనం అడిగే పరిస్థితుల్లో ఉన్నామని, వారు అడిగించుకునే పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొన్నారు. -
మత సామరస్యానికి ప్రతీక జిన్నా టవర్
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) : మత సామరస్యానికి ప్రతీక గుంటూరులోని జిన్నాటవర్ అని, ఎందరో మహానుభావుల త్యాగం వల్లే నేడు అందరం స్వాతంత్య్ర ఫలాలు అనుభవిస్తున్నామని హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. ప్రశాంతంగా ఉన్న గుంటూరు నగరంలో జిన్నా టవర్ పేరుతో కొన్ని మతతత్వ శక్తులు కులమతాల మధ్య చిచ్చు పెట్టాలనుకోవడం సిగ్గుచేటన్నారు. జిన్నాటవర్ పేరు మార్చాలని, లేకుంటే కూల్చేస్తామంటూ కొందరు బీజేపీ నాయకులు చేస్తున్న రాద్ధాంతాలకు ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టింది. గురువారం సర్వమత పెద్దల ప్రార్థనల అనంతరం అక్కడ జాతీయ జెండాను హోం మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ జిన్నా టవర్‌కు త్రివర్ణ పతాక రంగులు వేయడం చరిత్రాత్మకమన్నారు. దేశ పాలకులు కులమతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం బాధాకరమన్నారు. జిన్నా దేశభక్తుడంటూ అద్వానీ కీర్తించలేదా? ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ గాంధీజీని హత్య చేసిన గాడ్సేను పూజించే బీజేపీ నేతలకు దేశభక్తి గురించి మాట్లాడే నైతికత లేదన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ అద్వానీ పాకిస్తాన్ వెళ్లి జిన్నా దేశ భక్తుడంటూ కొనియాడిన సంగతి బీజేపీ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. గుంటూరు నగర మేయర్ కావటి మనోహరనాయుడు, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరిధర్‌లు మాట్లాడుతూ గుంటూరు నగరంలోని ప్రజలు కులమతాలకు అతీతంగా అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తుంటే.. ఓర్వలేక వారి మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని స్వార్థపూరిత శక్తులు విఫలయత్నాలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు జియాఉద్దీ¯న్, వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు, డిప్యూటీ మేయర్లు బాలవజ్రబాబు, షేక్ సజీల, కమిషనర్ నిశాంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మత విద్వేషాలు రెచ్చగొట్టిన వ్యక్తికి జైలుకెళ్లి కేంద్ర మంత్రి పరామర్శా?
గుంటూరు రూరల్: కర్నూలు జిల్లా ఆత్మకూరులో మత విద్వేషాలను రెచ్చగొట్టి, అల్లర్లకు కారణమైన వ్యక్తిని పరామర్శించేందుకు కేంద్రమంత్రి మురళీధరన్ సబ్ జైలుకు వెళ్లడం విస్మయానికి గురి చేసిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ఆ సందర్భంగా కేంద్ర మంత్రి మురళీధరన్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయన్నారు. సోమవారం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో సుచరిత మాట్లాడుతూ.. బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందని మండిపడ్డారు. బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి అనే వ్యక్తి ఆత్మకూరులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మత విద్వేషాలు రెచ్చగొడుతూ గొడవకు ప్రధాన కారకుడయ్యాడని పోలీసుల విచారణలో తేలినట్లు తెలిపారు. అక్కడ మసీదు నిర్మాణానికి సంబంధించి అభ్యంతరాలుంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిలువరించే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేదన్నారు. అలా కాకుండా మందీమార్బలంతో మసీదు నిర్మాణం వద్దకు వెళ్లి అక్కడి వారితో గొడవకు దిగడం, నిర్మాణాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించటం లాంటి చట్టవ్యతిరేకమైన పనులకు పాల్పడటం ఆమోద యోగ్యం కాదన్నారు. అదే సమయంలో పోలీసులు వెళ్లి శ్రీకాంత్‌రెడ్డిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని కోరారన్నారు. అయినా అక్కడే తిరగడం వల్ల గొడవ మరింత పెద్దదైందన్నారు. అతడి ప్రాణాల్ని కాపాడింది పోలీసులే మసీదు నిర్మాణ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి శ్రీకాంత్‌రెడ్డి వాహనంపై దాడి చేయడంతో పోలీసులు వెంటనే స్పందించి శ్రీకాంత్, అతని అనుచరులను స్టేషన్‌కు తరలించి రక్షణగా ఉండి ప్రాణాలు కాపాడారని హోంమంత్రి వివరించారు. శ్రీకాంత్‌రెడ్డి, అతడి ఐదుగురు అనుచరులతోపాటు అతడిపై దాడికి పాల్పడిన దాదాపు 70 మంది ముస్లింలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు వివరించారు. వాస్తవాలు ఇలా ఉంటే.. కేంద్రమంత్రి మురళీధరన్ ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందని, ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిందని అనడం బాధ్యతా రాహిత్యమని ఆమె మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌పై బురద చల్లాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. చిత్తూరు ఘటనపై హోంమంత్రి ఆరా చిత్తూరులో ఎస్సీ మహిళపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారనే ఘటనపై విచారణ జరపాలని హోంమంత్రి సుచరిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఒక కేసు విచార ణలో పోలీసులు తనను కొట్టారన్న ఎస్సీ మహిళ ఉమామహేశ్వరి ఆరోపణలపై మంత్రి వివరాలు తెలుసుకున్నారు. -
అన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు
-
హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే
గుంటూరు ఎడ్యుకేషన్: అధికారంలో ఉండగా ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు కొత్త డ్రామాకు తెరతీశారని హోం మంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. ఆదివారం గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఏరోజూ మాట్లాడలేదన్నారు. హోదా వద్దు ప్యాకేజీ ఇస్తే చాలంటూ కేంద్రం నుంచి నిధులు తెచ్చి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. బీజేపీతో విడిపోయిన తరువాత దొంగ దీక్షలు చేయడం మినహా చంద్రబాబు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఆనాడు కేంద్రం స్పష్టం చేసినప్పుడు టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించని చంద్రబాబు.. ఇప్పుడు రాజీనామాలు అంటున్నారని విమర్శించారు. ప్రజలు ఆయన మాటలను నమ్మే స్థితిలో లేరన్నారు. ‘ఉక్కు’పై చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ప్రశ్నించు పవన్.. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం దీక్ష చేస్తున్నానని చెబుతున్న పవన్ కల్యాణ్.. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని మంత్రి మేకతోటి సుచరిత సూచించారు. బీజేపీకి మద్దతు పలుకుతున్న పవన్‌కల్యాణ్.. విశాఖ ఉక్కుపై ముందు కేంద్రంతో మాట్లాడాలన్నారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. కాగా, కల్తీ విత్తనాలు, తెగుళ్లు, వరదల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. రైతులకు కల్తీ విత్తనాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
యూనిఫాంతోనే సమాజంలో గుర్తింపు
సాక్షి, అమరావతి : పోలీస్ యూనిఫాం వల్ల తమకు సమాజంలో మరింత గుర్తింపు, గౌరవం, రక్షణ లభిస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులు పేర్కొన్నారు. తమకు యూనిఫాం విధానాన్ని కొనసాగించాలని మహిళా పోలీసుల సంఘం ప్రతినిధులు శుక్రవారం రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరితను కలిసి వినతి పత్రం సమర్పించారు. రెండేళ్లుగా నిబద్ధతతో పని చేస్తూ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో మహిళల ఆదరణ పొందామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు యూనిఫాం లేకపోతే విధి నిర్వహణలో సమస్యలు తలెత్తుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు దురుద్దేశంతో చేస్తున్న దుష్ప్రచారాన్ని పట్టించుకోవద్దని కోరారు. -
మహిళా సాధికారత నినాదం కాదు.. మా విధానం
సాక్షి, అమరావతి: మహిళా సాధికారత అనేది నినాదం కాదని, తమ ప్రభుత్వ విధానమని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టంచేశారు. గత ప్రభుత్వాల్లా కాకుండా అన్ని రంగాల్లోనూ మహిళా సాధికారతను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని చెప్పారు. శాసనమండలిలో గురువారం ‘మహిళా సాధికారత’ అంశంపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో ఆమె మాట్లాడారు. కులం, మతం, ప్రాంతం అనేవేవీ చూడకుండా రాష్ట్రంలోని మహిళలు అందరికీ వివిధ సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అందిస్తోందన్నారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వివిధ సంక్షేమ పథకాల ద్వారా మహిళల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేస్తోందని చెప్పారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ► రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇంటి స్థలాలను ఇస్తే అందులో 80 శాతంపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మహిళలు ఉన్నారు. ► రాష్ట్రంలో 2.65 లక్షల మంది గ్రామ, వార్డు వలంటీర్లలో 1.33 లక్షల మంది మహిళలు. ► నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ వర్క్‌లలో 50 శాతం మహిళలకు కేటాయిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదే. ► ప్రభుత్వ పాఠశాలల్లో రెండు లక్షల మంది విద్యార్థులు అదనంగా చేరడం, స్వయం సహాయక సంఘాల నిరర్థక ఆస్తులు తగ్గి, గ్రేడింగ్ పెరగడం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలకు నిదర్శనం. ► దిశ చట్టంపై కేంద్రం లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసి పంపాం. రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే ఈ చట్టం అమల్లోకి వస్తుంది. దిశ చట్టం అమల్లోకి వచ్చే లోగా ఆ స్ఫూర్తి దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. మహిళలు జయహో జగనన్న అంటున్నారు జయహో జగనన్న.. సాహో జగనన్న అంటూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ‘మహిళా సాధికారత’పై చర్చను ప్రారంభిస్తూ.. సీఎం వైఎస్ జగన్ రెండున్నరేళ్ల పాలనలో మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి మనసున్న ముఖ్యమంత్రిగా మన్ననలు అందుకున్నారని చెప్పారు. వరుస ఎన్నికల్లో మహిళలు వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించి జగన్‌కు అండగా నిలిచారన్నారు. మహిళలకు నామినేటెడ్ పదవులతోపాటు అనేక రంగాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. సీఎం జగన్ చూపిన దార్శనికత వల్లే చట్ట సభల్లో మహిళల ప్రాధాన్యత పెరిగిందని చెప్పారు. ఈ చర్చలో కల్పలతారెడ్డి, రామారావు, కత్తి నరసింహారెడ్డి, మాధవ్, జకియా ఖానంలు మాట్లాడుతూ మహిళల రక్షణ, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. మాటలు కాదు.. చేతలు చట్టం చేయకుండానే అత్యధిక సంఖ్యలో మహిళలను చట్ట సభలకు పంపిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కితాబిచ్చారు. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అనే మాటలను ఆచరణలో పాటించిన నేత జగన్ అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మహిళను హోం మంత్రిని చేస్తే.. ఇప్పుడు వైఎస్ జగన్ దళిత మహిళకు ఆ శాఖ అప్పగించారని, ఇదే మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనమన్నారు. ‘కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా’ అని వ్యాఖ్యానించిన చంద్రబాబుకు మహిళల పట్ల ఎంత వివక్ష ఉందో ఇట్టే తెలుస్తోందని చెప్పారు. -
టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు
-
‘రాజకీయ లబ్ధికోసమే కొందరు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు’
గుంటూరు: అసమానతలు తలెత్తకూడదనే అభివృద్ధి వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు.. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. అమరావతి కూడా ఒక రాజధానిగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్ తరాలకు అభివృద్ధి ఫలాలు లభించాలనే లక్ష్యంతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా విశాఖ, అమరావతి,కర్నూలు సహా.. రాష్ట్రంలోని అన్నిప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మేకతోటి సుచరిత తెలిపారు. రాజకీయ లబ్ధికోసమే కొందరు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో ఎవరిపైనా ఒత్తిడిలేదు: మంత్రి అవంతి -
కరోనా కట్టడిలో పోలీసుల పాత్ర భేష్
సాక్షి, అమరావతి/గుంటూరు రూరల్: కరోనా కట్టడికి పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని హోం మంత్రి మేకతోటి సుచరిత అభినందించారు. పోలీసుల సేవలకు ప్రభుత్వం తగిన విధంగా గుర్తింపునిస్తోందని చెప్పారు. పౌర సమాజం కూడా పోలీసుల కృషిని గుర్తించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో కరోనా వల్ల మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.3.72 కోట్ల ఆర్థిక సాయాన్ని మ్యాన్‌కైండ్ ఫార్మా సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ చెక్కులను హోం మంత్రి సుచరిత బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వర్చువల్‌గా నిర్వహించిన సమావేశంలో ఆమె గుంటూరు నుంచి పాల్గొన్నారు. కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి పోలీసు సంక్షేమ నిధి నుంచి రూ.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల చొప్పున సాయం అందించామని చెప్పారు. మ్యాన్‌కైండ్ ఫార్మా సంస్థ కూడా ఉదారంగా స్పందించడం ప్రశంసనీయమన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేయడం, వలస కూలీలకు సహాయం చేయడం, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం తదితర విధులను పోలీసులు నిబద్ధతతో నిర్వర్తించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. పోలీసుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఉద్యోగి హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రమూ చేయని రీతిలో ఏపీ ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి చర్యలు తీసుకుందన్నారు. కార్యక్రమంలో మ్యాన్‌కైండ్ ఫార్మా సీఈవో రాజీవ్ జునేజా, గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, రూరల్ ఎస్పీ విశాల్ గున్ని తదితరులు పాల్గొన్నారు. -
పట్టాభి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం: సుచరిత
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం జగన్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కోవిడ్ సమయంలో సీఎం తీసుకున్న నిర్ణయాలకు ప్రశంసలు వచ్చాయన్నారు. కుట్ర ప్రకారం ముఖ్యమంత్రిని టీడీపీ నేతలు దూషిస్తున్నారన్నారు. (చదవండి: ‘ఏపీలో అలజడులకు చంద్రబాబు కుట్ర’) ‘‘డ్రగ్స్ విషయంలో టీడీపీ ఆరోపణలు పూర్తిగా నిరాధారం. అసత్యాలను వండివార్చి టీడీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. వారు విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు. గంజాయి, డ్రగ్స్‌పై మా ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని’’ మంత్రి సుచరిత అన్నారు. ‘‘టీడీపీ నేత నక్కా ఆనందబాబు తప్పుడు ప్రకటనలపై నోటీసులిచ్చాం. పదేపదే బురద జల్లి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. తప్పుడు ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. విధానపరంగా ప్రశ్నించకుండా.. కుట్రలు చేస్తున్నారు. పట్టాభి వ్యాఖ్యలను సభ్య సమాజం హర్షించదు. చంద్రబాబు ఫిర్యాదుపై డీజీపీ స్పందించలేదనడం అవాస్తవం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని’’ హోంమంత్రి సుచరిత హెచ్చరించారు. చదవండి: పట్టాభి అనుచిత వ్యాఖ్యలు: ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆందోళన -
పవన్ కళ్యాణ్‌పై హోంమంత్రి సుచరిత మండిపాటు
-
పవన్ కల్యాణ్‌పై ప్రజలకు పూర్తి క్లారిటీ ఉంది: హోంమంత్రి సుచరిత
సాక్షి, గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియని పరిస్థితి ఉందని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. పవన్ మాట్లాడే భాష ఎలా ఉందో ఒకసారి ఆయనే ఆలోచించుకోవాలని హితవు పలికారు. పవన్ కల్యాణ్ తోలు తీస్తాను అంటున్నారని, తోలు తీయించుకోవడానికి ఎవరు రెడీగా ఉంటారని వ్యంగ్యంగా విమర్శించారు. ఆయన రెండు స్థానాల్లో నిలబడితే ప్రజలు రెండు చోట్లా తిరస్కరించారని ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ఎన్ని చోట్ల నిలబడతారో, ఆయన్ను అంగీకరిస్తారో లేదో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. చదవండి: బద్వేల్ ఉప ఎన్నికపై సీఎం జగన్ ప్రత్యేక సమావేశం ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేనకు వచ్చిన ఒకటి, రెండు సీట్లు కలుపుకొని రెండు పార్టీలు ఎంపీపీ పదవులు ఎలా పంచుకున్నారో అందరికీ తెలుసని హోంమంత్రి ఎద్దేవా చేశారు. జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నాయని అక్కడే అర్థమైపోతుందని దుయ్యబట్టారు. ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారని, పవన్ నిలకడలేని వ్యక్తి అని ఆయన మాటల్లోనే అర్థమవుతుందన్నారు. ఒకసారి లెఫ్టిస్టు అంటాడు, మరోసారి బీజేపీతో చేతులు కలుపుతాడు, ఇంకోసారి టీడీపీతో వెళ్తాడని విమర్శించారు. పవన్ కల్యాణ్ పట్ల ప్రజలకు పూర్తి క్లారిటీ ఉందని ఈ సందర్భంగా సుచరిత పేర్కొన్నారు. చదవండి: ‘పవన్ ఆ సమయంలో మందు కొట్టి పడుకున్నారా?’: పిఠాపురం ఎమ్మెల్యే తమ పాలన ఎలా ఉందో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తీర్పు ద్వారా అర్థమవుతుందన్నారు. అధికారంలోకి రావాలంటే పార్టీ విధి విధానాన్ని ప్రజలకు చెప్పాలని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పి అధికారంలోకి వచ్చారని సుచరిత గుర్తు చేశారు. -
కాపు కాసి.. కళ్లల్లో కారం కొట్టారు..
పెదనందిపాడు (ప్రత్తిపాడు): గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో ఈ నెల 20న వినాయక నిమజ్జన కార్యక్రమంలో పక్కా పథకం ప్రకారం వంద మంది టీడీపీ కార్యకర్తలు కాపు కాసి వైఎస్సార్సీపీ కార్యకర్తల కళ్లలో కారం కొట్టి దాడికి పాల్పడ్డారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఈ ఘటనలో గాయపడిన పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను గురువారం ఆమె పరామర్శించారు. మేదరమెట్ల వెంకటప్పయ్య చౌదరి, ఇంటూరి శ్రీకాంత్, ఇంటూరి హనుమంతరావుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పారు. ఇతరత్రా బాధితులు, స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దెబ్బలు తగిలిన వారితో, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమం చేసుకుంటున్న సమయంలో, మాజీ జెడ్పీటీసీ ఇంట్లో పక్కా పథకం ప్రకారం వంద మంది టీడీపీ శ్రేణులు కాపుకాసి వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టి, రాళ్లు వేసి ఘర్షణ వాతావరణం సృష్టించారన్నారు. ఇదేమని ప్రశ్నించిన హనుమంతరావుపై దాడికి పాల్పడ్డారని, అడిగేందుకు వెళ్లిన ఆయన కుమారుడు శ్రీకాంత్‌ను 20, 30 మంది కలిసి దాడి చేస్తూ.. ఇంట్లోకి లాక్కెళ్లారన్నారు. శ్రీకాంత్ స్పృహ కోల్పోయిన పరిస్థితుల్లో, చనిపోయారనుకుని వైఎస్సార్సీపీ శ్రేణులు కంగారు పడి తలుపులు పగలగొట్టి పోలీసుల సాయంతో బయటకు తీసుకువచ్చారని వివరించారు. ఇంత జరిగినా దెబ్బలు తిని గాయాలపాలైన వారిని ఓ వర్గం మీడియాలో చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వాస్తవ పరిస్థితిని గమనించేందుకే కొప్పర్రుకు వచ్చానని తెలిపారు. హోం మంత్రి ఇంకా ఏమన్నారంటే.. అధికారం అంటే బాధ్యత అనుకుంటున్నాం ► పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నానని ప్రతిపక్షనేత చంద్రబాబు వ్యాఖ్యానిస్తుండటం దారుణం. అదే నిజమైతే ఈ రెండున్నరేళ్లలో ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగాయా? ► మా వైఎస్సార్సీపీ కార్యకర్తలంటే శాంతి కాముకులు. ఎక్కడా ఘర్షణలు జరగాలని మేం అనుకోవడం లేదు. మేము అధికారం అంటే బాధ్యత అనుకుంటున్నాం. ► కొప్పర్రులో 2014లో జెడ్పీటీసీగా గెలుపొందిన వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్న వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేసే కొత్త సంస్కృతిని అలవాటు చేశారు. ఇంత మందిపై దాడి చేయడమే కాకుండా, వాళ్లపైనే బురద జల్లాలని అనుకోవడం దురదృష్టకరం. ► మా వాళ్ల మీదే దాడి చేసి, మా వాళ్ల మీదే తప్పుడు కేసులు పెట్టి.. అన్యాయంగా శిక్షలు ఖరారు చేయించాలన్న గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో పోలీసులు వాస్తవాల మేరకు చర్యలు తీసుకుంటే హోం మినిస్టర్ బలవంతంగా మా వాళ్లపై కేసులు పెట్టించారని ఆరోపిస్తారు. అందుకే వాస్తవాలేమిటో బాహ్య ప్రపంచానికి చెబుతున్నాం. ► సమావేశంలో వైఎస్సార్సీపీ మండల పార్టీ కన్వీనర్ మదమంచి వాసు, కొప్పర్రు సర్పంచ్ సాతులూరి సురేష్, ఉప సర్పంచ్ ఏలూరి శ్రీకాంత్, ఎంపీటీసీ సభ్యుడు షేక్ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
మహిళలను గౌరవిస్తే 23 సీట్లేనా?
సాక్షి, అమరావతి: ‘ఐదేళ్ల పాలనలో మహిళలను మీరు గౌరవించి ఉంటే.. మీకు 23 సీట్లు మాత్రమే వచ్చేవా?’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడును హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్.. దళిత మహిళనైన నన్ను హోం మంత్రిని చేస్తే మీకు ఎందుకు కడుపు మంట? అని నిలదీశారు. ‘హోంమంత్రినైన నన్నే మనుషులు పలకకూడని మాటలతో, సభ్యసమాజం తల దించుకునేలా దూషించే మీరు ఇక సాధారణ మహిళలను ఎలా గౌరవిస్తారో అర్థమవుతోంది’ అంటూ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న మహిళను ‘బట్టలిప్పి కొడతా’ అని దూషించిన అయ్యన్నపాత్రుడు వంటి సంస్కారహీనుడి నుంచి ఇంతకంటే గొప్ప మాటలు వస్తాయని ఆశించలేమన్నారు. ఇతని వ్యాఖ్యలపై స్పందించడమంటే అశుద్ధంపై రాయి వేయడమేనన్నారు. వైఎస్సార్సీపీకి ప్రజలు ఆఖండ విజయాన్ని కట్టబెట్టడం వల్లే ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టారని.. అలాంటి సీఎంను దూషించడమంటే ప్రజాతీర్పును అగౌరవ పరిచినట్లేనని చెప్పారు. ఎవరు ఏం చేస్తున్నారన్నది ప్రజలు గమనిస్తున్నారని.. ఇప్పటికైనా టీడీపీ నేతలు నోటిని అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా హోం మంత్రి ఇంకా ఏమన్నారంటే.. దళిత జాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నా ► వాస్తవానికి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై నేను స్పందించకూడదని అనుకున్నాను. కానీ స్పందించాల్సి వచ్చింది. దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా.. అని స్వయంగా చంద్రబాబు దళితజాతిని అవమాన పరిచారు. ► రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు అంబేడ్కర్ జన్మించిన, ఆత్మాభిమాం ఉన్న జాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నాం. మీరు మాట్లాడిన భాషను, మేము ఈ జన్మలోనే కాదు. వచ్చే జన్మలోనూ మాట్లాడలేము. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి. గొప్పతనం అనేది మన ప్రవర్తనను బట్టి వస్తుంది కానీ.. కులం, జాతి వల్ల రాదు. చంద్రబాబు, అయ్యన్నల సంస్కారం ఏమిటన్నది అందరికీ తెలిసింది. ఐదేళ్లు బాగు చేసి ఉంటే ఎలా ఓడారు? ► మీరు ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. అన్నీ బాగా చేసి ఉంటే, ఎందుకు ఓడిపోయారు? టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై వైఎస్ జగన్‌ను జైలుకు పంపేలా కుట్ర చేశారన్నది ప్రజలందరికీ తెలుసు. ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టే.. 151 సీట్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించారు. ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్‌పై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం ప్రజాతీర్పును అవమానించడమే. ► వంగవీటి రంగా హత్య మీ హయాంలో జరిగింది. ఆ తర్వాత మీరు అధికారంలో ఉన్నప్పుడే ఒక ఎమ్మెల్యేను, మరో మాజీ ఎమ్మెల్యేను హత్య చేశారు. శాంతిభద్రతలపై మీరా మాకు చెప్పేది? ► చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తిరుపతిలో ఆయనపై హత్యాయత్నం జరిగితే.. అప్పుడు విపక్షనేతగా ఉన్న దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా వచ్చి ఆయన్ను పరామర్శించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు విపక్షనేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే చవకబారు విమర్శలు చేశారు. ఇదీ.. మీకూ మాకు మధ్య ఉన్న తేడా. రాజీనామా చేయమనడానికి మీరెవరు? సామాజిక న్యాయాన్ని చేతల్తో చూపిస్తూ సీఎం వైఎస్ జగన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లోనూ పెద్దపీట వేస్తున్నారు. వైఎస్ జగన్ నన్ను రాజీనామా చేయాలని కోరితే.. ఒక్క క్షణంలో చేస్తా.. నన్ను రాజీనామా చేయాలని కోరడానికి మీరెవరు? ► ఒక వ్యక్తి సంస్మరణ సభకు వచ్చి అయ్యన్న పాత్రుడు ఇలా మాట్లాడటం సభ్య సమాజం ఇష్టపడుతుందని అనుకుంటున్నారా? మల్లెపూలు కట్టుకుని అమ్మే వాళ్లు మనుషులు కారా? ► మా పని తీరు బాగా లేదని మీరనుకుంటే ప్రశ్నించండి. అన్నింటికీ స్పష్టంగా సమాధానం చెబుతాం. దిశ చట్టం ఇంకా అమలులోకి రాలేదు. దాని గురించి అడగండి చెబుతాం. మీ పాలనలో మహిళలకు ఏమేర న్యాయం చేశారో చెప్పండి. ► చంద్రబాబుకు మహిళలపై గౌరవం ఉంటే, ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. నాడు వనజాక్షిని కొట్టి, ఆమెనే తప్పు పట్టిన చంద్రబాబు ఇప్పుడు అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై స్పందిస్తారని ఆశించలేం. విన్నవించడానికి వెళ్లిన ఎమ్మెల్యేపై దాడి చేస్తారా? ► అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలని.. బాష మార్చుకోవాలని చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌పై రౌడీలతో దాడి చేయిస్తారా? జోగి రమేష్ సింగిల్‌గానే వెళ్లారు.. కానీ అప్పటికే కరకట్టపై టీడీపీ నేతలు భారీ ఎత్తున పోగయ్యారు. జోగి రమేష్ కారు దిగక ముందే కారు అద్దాలు పగలగొట్టారు. ఆయనపై దాడి చేశారు. ఇదీ వాస్తవం. పోలీసులు ఏకపక్షంగా కేసులు నమోదు చేస్తున్నారన్నది అవాస్తవం. ► నాడు మీరు (చంద్రబాబు) అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అవన్నీ ప్రజలు చూశారు కాబట్టే, మిమ్మల్ని విపక్షంలో కూర్చోబెట్టారు. ఇప్పటికైనా మాటలు అదుపులో పెట్టుకోండి. ► రాష్ట్రంలో 15 శాతం నేరాలు తగ్గాయని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డులు చెబుతున్నాయి. కానీ దాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా మాస్కులు ధరించని వాటికి సంబంధించి నమోదైన 80 వేల కేసులను కూడా నేరాలుగా చూపి, రాష్ట్రంలో 64 శాతం కేసులు పెరిగాయని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తుండటం దారుణం. -
మహిళలను గౌరవిస్తే మీకు 23 సీట్లు వచ్చేవి కావు: హోంమంత్రి సుచరిత
సాక్షి, అమరావతి: ఎంతో సీనియర్, ఎన్నో పదవులు చేసిన అయ్యన్నపాత్రుడు ఒక దళిత మహిళ గురించి మాట్లాడిన తీరు అందరూ చూశారని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ కమిషనర్‌ను బట్టలు ఊడదీసి కొడతా అన్న వ్యక్తి ఇంతకంటే గొప్పగా మాట్లాడతాడని తాను అనుకోవడం లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. అతడి వ్యాఖ్యలపై స్పందించకూడదనుకున్నా.. కానీ వాళ్లు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని తెలిపారు. దళిత జాతిలో పుట్టినందుకు తాను గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఒక దళిత మహిళగా ఏ జన్మలోనూ ఇలాంటి భాష మాట్లాడలేనని వివరించారు. గొప్పతనమనేది మన ప్రవర్తన బట్టి వస్తుంది.. అతడి సంస్కారం ఏమిటో అర్థం అవుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి ఇచ్చింది సీఎం జగన్.. తనను గెలిపించింది నియోజకవర్గ ప్రజలు అని పేర్కొన్నారు. చదవండి: విద్యార్థినికి ఘోర అవమానం.. పొట్టి దుస్తులు వేసుకోవడం నేరమా? ‘సీఎం జగన్‌ని మీరు మాట్లాడిన మాటలు ఏమిటి..? మీరు మహిళలను గౌరవించి ఉంటే మీకు 23 సీట్లు వచ్చేవి కాదు’ హోంమంత్రి సుచరిత విమర్శించారు. ‘వంగవీటి రంగాను చంపింది మీ హయాంలోనే కదా..? మీ హయాంలో ఒక హోంమంత్రిని హత్య చేశారు.. అప్పుడు మీకు శాంతి భద్రతలు గుర్తుకురాలేదా..? మీ మీద హత్యాయత్నం జరిగితే మీకు మద్దతుగా వైఎస్సార్ ఆందోళన చేశారు. మీరేమో జగన్‌పై దాడి జరిగితే కోడి కత్తి అన్నారు. జగన్ ఈ రోజు రాజీనామా చేయమంటే వెంటనే చేస్తాను.. మీరెవరు అడగడానికి..? మల్లెపూలు అమ్ముకునే వాళ్లు మనుషులు కదా...? గంజాయి అమ్ముకునే నువ్వే ద్రోహివి. ఒక దళిత మహిళను హోంమంత్రి చేస్తే మీకెందుకు కడుపు మంట.’ చదవండి: అమిత్ షా సభలో ‘ఈటల’ స్పెషల్ అట్రాక్షన్ ‘ఆత్మాభిమానమే ముఖ్యంగా బతుకుతున్న దళిత మహిళను నేను. ఏదైనా శాఖాపరంగా అడగండి సమాధానం చెప్తా! మీ పరిపాలనలో మహిళకు ఏ మేరకు న్యాయం చేశారు..? నా మీద మీరు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఏమి చేస్తారో తేల్చుకోవాలి. లోపాలు ఉంటే ఎత్తి చూపండి సమాధానం చెప్తామ్. కానీ వ్యక్తిగత దూషణకు వెళ్తే సహించేది లేదు. ఒక మహిళా హోంమంత్రినే ఇలా మాట్లాడుతున్నారంటే ఇక సామాన్య మహిళలపై ఎలా ప్రవర్తిస్తారు..? జోగి రమేశ్ ఒక లేఖ ఇవ్వడానికి వెళ్తే ఆయన కారు అద్దాలు పగలగొట్టారు. గతంలో కూడా అసెంబ్లీలో పాతరేస్తా అని మాట్లాడిన వాళ్లు ఇంతకంటే ఎలా ప్రవర్తిస్తారు?’ అని హోంమంత్రి సుచరిత ప్రశ్నించారు. -
మంత్రులు, మహిళలపై అయ్యన్న ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు
-
Disha App: ‘దిశ’ యాప్ కేరాఫ్ మన అన్న..
గుంటూరు రూరల్: ‘దిశ’ యాప్ తమ ఫోనులో ఉంటే మన అన్న మనవెంట ఉన్నట్లేనని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శుక్రవారం నగరంలోని హోం మంత్రి నివాసంలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన దిశ ఆర్గనైజేషన్ పోస్టర్లను ఆవిష్కరించారు. హోం మంత్రి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థిని తమ ఫోన్లో దిశయాప్‌ను ఏవిధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో వివరించారు. మహిళలు ఆటోలో, కార్లలో వెళ్లే సమయాల్లో వాహనదారుడిపై అనుమానం వస్తే వెంటనే దిశ యాప్‌లోని రెడ్ బటన్ ప్రెస్ చేయాలన్నారు. దీని ద్వారా వెంటనే పోలీసులకు ఇతర అధికారులకు సమాచారం అందుతుందని, నిమిషాల వ్యవధిలో పోలీసులు వచ్చి రక్షణ కల్పిస్తారని తెలిపారు . ప్రతి విద్యారి్థని, మహిళ, ఉద్యోగిని దిశ యాప్‌ను వినియోగించి రక్షణ పొందాలని కోరారు. సుమారు కోటి మందికి పైగా దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారని తెలిపారు. ఆయా జిల్లాల వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
రమ్య కుటుంబానికి ఐదు సెంట్ల ఇంటి స్థలం
గుంటూరు ఈస్ట్: మృగాడి చేతిలో హత్యకు గురైన రమ్య కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఐదు సెంట్ల నివేశన స్థలం మంజూరైంది. ఇంటి స్థలం పట్టాను శనివారం హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పరమాయ కుంటలోని రమ్య నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు. గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు గ్రామంలోని 5 లే అవుట్లో స్థలాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతగానో స్పందించి.. రమ్య కుటుంబానికి అండగా అనేక చర్యలు చేపట్టారని చెప్పారు. రమ్య తల్లిదండ్రులు కోరిన విధంగా నిందితుడికి త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని వివరించారు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం రమ్య తల్లిదండ్రులకు త్వరలో ఐదెకరాల భూమిని ప్రభుత్వం అందజేస్తుందని స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం రమ్య సోదరి మౌనిక డిగ్రీ పూర్తవుతుందని, అయితే మానవీయ కోణంలో సీఎం సూచన మేరకు డిగ్రీ పూర్తికాక ముందే సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగం ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రమ్య కుటుంబానికి అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో సహాయం అందజేశాక, వారితో కలిసి టీ తాగుతానని సీఎం చెప్పారని వివరించారు. అందరూ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ప్రతి మహిళ, యువతి సహా పురుషులు సైతం ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, అనుకోని ఘటనలు జరిగినప్పుడు పోలీసుల సాయం కోరవచ్చని హోం మంత్రి సూచించారు. మేడికొండూరు ఘటనలో పోలీసులు సమర్థవంతంగా విచారణ చేస్తున్నారని, ఆ విషయాలు బయటపెడితే నేరస్తుడు తప్పించుకునే అవకాశం ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. రమ్య ఘటనలో సీఎం స్పందించిన తీరు తమందరి హృదయాల్లో నిలిచి పోతుందన్నారు. అట్రాసిటీ యాక్ట్‌లో పేర్కొన్న పరిహారం కన్నా ఎక్కువగా సహాయం చేయడం సీఎం గొప్పతనాన్ని చాటిందన్నారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా.. అంటూ గత ప్రభుత్వ పెద్దలు చేసిన వ్యాఖ్యలు ఎవరూ మరచిపోలేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు షేక్ మొహమ్మద్ ముస్తఫా, మద్దాళి గిరిధర్, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), తూర్పు తహసీల్దారు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
రమ్య కుటుంబానికి ఐదు సెంట్ల ఇంటిపట్టా అందజేత