సాక్షి, నెల్లూరు: దక్షిణ భారత దేశంలోనే మొట్ట మొదటిసారిగా నెల్లూరు జిల్లా పోలీస్ శాఖకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్ రావడం చాలా గర్వకారణంగా ఉందని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా పోలీసుల పని తీరు గతంతో పోల్చుకుంటే చాలా మెరుగ్గా ఉందన్నారు. టెక్నాలజీని ఉపయోగించి నేరాల సంఖ్య తగ్గించడంలో జిల్లా పోలీసులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని ప్రశంసించారు. దొంగతనాల కేసులను త్వరగా ఛేదించడంతో పాటు, రికవరీ కూడా బాగా చేస్తున్నారని తెలిపారు. రికవరీ రేటు 42 శాతం వరకు ఉందని, మహిళలకు సంబందించిన విషయంలో సమస్యలు వస్తే ‘దిశ’ పోలీసులు వెంటనే స్పందిస్తున్నారని పేర్కొన్నారు. ‘దిశ’ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు తక్షణం స్పందిస్తున్న తీరు హర్షణీయం అన్నారు. రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లలకు పూర్తి రక్షణ ఉండాలనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ‘దిశ’ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా ‘దిశ’ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి దిశ పోలిస్ స్టేషన్‌లో 40 వరకు సిబ్బంది, డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తున్నామని పేర్కొన్నారు. (ఏపీ విలేజ్ వారియర్స్‌పై సీఎం జగన్ ప్రశంసలు)
ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుతో పాటు, మూడు ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలపారు. రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెడుతున్నారని గుర్తుచేశారు. సంక్షేమ పథకాల ద్వారా రూ. 59 వేల కోట్లను ప్రజలు ఏదో ఒక రూపంలో పొందుతున్నారని తెలిపారు.అభివృద్ది, సంక్షేమం రెండు కన్నుల్లా పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయబోతున్నామని చెప్పారు.భారతదేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రుల్లో సీఎం వైఎస్ జగన్ మూడో స్థానంలో వున్నారని గుర్తుచేశారు. ఇది రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4 శాతం వరకు క్రైమ్ రేటు తగ్గిందని చెప్పారు. రానున్న రోజుల్లో క్రైమ్ రేట్ మరింత తగ్గించే విధంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని తెలిపారు. (ఆంధ్రజ్యోతి కథనంపై ఏపీ సర్కార్ సీరియస్)
Comments
Please login to add a commentAdd a comment