Minister Kakani Govardhan Reddy Praises CM YS Jagan - Sakshi
Sakshi News home page

‘దశాబ్దాల సమస్యకు సీఎం జగన్‌ పరిష్కారం చూపారు’

Published Sun, Apr 2 2023 12:46 PM | Last Updated on Sun, Apr 2 2023 2:32 PM

Minister Kakani Govardhan Reddy Praises CM YS jagan - Sakshi

నెల్లూరు: చుక్కల భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ఏపీలో రైతులు ఎదుర్కొంటున్న చుక్కల భూమల సమస్యకు సీఎం జగన్‌ పరిష్కారం చూపారని అన్నారు. టీడీపీ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సీఎం జగన్‌ జీవో విడుదల చేయడంతో రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని కాకాణి పేర్కొన్నారు.

ఆదివారం మంత్రి కాకాణి ఆధ్వర్యంలో సీఎం జగన్‌ చిత్రపటానికి నెల్లూరు రైతులు పాలాభిషేకం చేశారు. దీనిలో భాగంగా జిల్లా పార్టీ కార్యాలయంలో రైతులతో కలిసి కాకాణి మీడియాతో మాట్లాడారు. ‘ చుక్కల భూములకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు .దశాబ్దాలుగా ఏపీలో రైతులు ఎదుర్కొంటున్న చుక్కల భూముల సమస్యకు సీఎం వైఎస్ జగన్ పరిష్కరించారు. చుక్కల భూముల విషయంలో వీఆర్‌ఓ నుంచి ఫైల్ రావాలంటే ఆరు నెలలు పట్టేది.

రైతాంగానికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. 2016 లో అప్పటి సీఎం చంద్రబాబు.. చుక్కల భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. నెల్లూరు జిల్లాలో 43 వేల 270 ఏకరాలకు పట్టాలు ఇవ్వనున్నారు. సీఎం చేతుల మీదుగానే రైతులకు పట్టాలు పంపిణీ చేయబోతున్నాం. చుక్కల భూముల వల్ల గత ప్రభుత్వంలో రైతుల మధ్య గొడవలు కూడా అనేకం జరిగాయి.. ఇప్పుడు అలాంటి సమస్యలు రాకుండా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. చాలా చోట్ల రైతులు భూములను సాగు చేసుకుంటున్నారు.  వీరికి పట్టాలు ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారు.  అభ్యంతరాలు లేని భూములను రెగ్యులర్‌ చేయమని సీఎం జగన్‌ చెప్పారు’ అని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement