సాక్షి, నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న సమర శంఖారావం సభకు నెల్లూరు ముస్తావుతోంది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, బూత్‌కమిటీ సభ్యులతో మాట్లాడనున్నారు. ఎన్‌టీఆర్ నగర్ సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో మంగళవారం జరిగే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తదితరులు సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఎమ‍్మెల్యే కాకాణి మాట్లాడుతూ.. నెల్లూరులో సమర శంఖారావం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదస్సును విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ....ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారు. ఓటర్ల జాబితాలో వైఎస్సార్ సీపీ అభిమానుల ఓట్లను తొలగిస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లో పలువురికి ఓట్లు ఉన్నాయి. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. ఎన్నికలలో బూత్ కమిటీ సభ్యులే కీలకపాత్ర పోషించాలని అని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment