సాక్షి, నెల్లూరు: ఏపీ వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తుంటే, పంట నష్ట నివారణ చర్యలపై ఈనాడు, కొన్ని తోక పత్రికలు ఇష్టమొచ్చినట్లు కథనాలు రాస్తున్నాయని, ఇదంతా చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లోనే జరుగుతోందని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. పంట నష్ట నివారణ చర్యలపై ఇప్పటికే అధికారులను ఆదేశించామని, వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారన్నారు.
అకాల వర్షాలు, పంటనష్ట నివారణ చర్యలపై ‘సాక్షి’తో మాట్లాడిన మంత్రి కాకాణి.. ‘ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల నుంచి అకాల వర్షాలు కురుస్తున్నాయి.పంట నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాము. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
అన్ని చోట్లా వర్షాలు తగ్గిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం. తడిచిన ధాన్యాన్ని గింజ కూడా వదలకుండా కొనుగోలు చేస్తాం.ప్రతిపక్షాల అనవసర విమర్శలు పట్టించుకోవలసిన అవసరం లేదు.చంద్రబాబు డైరెక్షన్‌లో ఈనాడు , కొని తోక పత్రికలు పని చేస్తున్నాయి.మాది రైతుల ప్రభుత్వం.. వారికి అండగా సీఎం వైఎస్ జగన్ ఉంటారు.- పంట నష్టపోయిన రైతులకు ఆ సీజన్ లోనే పరిహారం అందిస్తున్న ఘనత మా ప్రభుత్వానిది’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment