samara sankharavam
-
మార్పునకు ఓటు.. విలువలకు పట్టం
‘‘మార్పునకు ఓటు వేయండి, విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టండి అని ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికీ చెప్పాలి. విలువలకు, విశ్వసనీయతకు ఓటు వేయండి అని చెప్పాలి. పోగొట్టుకున్న సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ అమలు కావాలంటే, రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే ఓటు వేయండి అని చెప్పాలి. అభివృద్ధి వైపు పరుగెత్తాలంటే ఓటు వేయండి అని చెప్పాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలను అభ్యర్థించాలి. ఈ ఐదేళ్ల టీడీపీ పాలనలో నష్టపోయామా లేదా అనే దానిపై గుండెలపై చేయి వేసుకుని ఆత్మవిమర్శ చేసుకోండి అని ప్రజలను కోరాలి. ఆలోచించాల్సిన సమయం వచ్చిందని గుర్తుచేయాలి. చంద్రబాబు పరిపాలన గురించి చెప్పాలి. రాష్ట్రాన్ని విడగొట్టేందుకు సహకరించింది చంద్రబాబే. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంలో ఉండి, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబు పార్టీయే. ఇలాంటి పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలి. కాకినాడ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: మార్పునకు ఓటు వేయాలి, విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. పోగొట్టుకున్న సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ అమలు కావాలంటే, రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే వైఎస్సార్సీపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో నష్టపోయామా లేదా అనే దానిపై ప్రజలంతా గుండెలపై చేయి వేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలను దగా చేసిన చంద్రబాబు పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. నేతలు, కార్యకర్తల సాక్షిగా వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు. మరో నెల రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గాలి సునామీలో ప్రత్యర్థులు చిత్తు కావడం తథ్యమని తేల్చిచెప్పారు. వైఎస్సార్సీపీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఎన్నికల్లో విజయం కోసం అలుపెరగని కృషి సాగించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఒక్కో ఓటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చే రూ.3,000కు మోసపోవద్దని ప్రజలను అప్రమత్తం చేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన సమర శంఖారావం సభలో జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. టీడీపీ అవినీతి పరిపాలనకు శాంతియుతంగా సమాధి కట్టేందుకు ఎన్నికల రూపంలో రాజ్యాంగం గొప్ప అవకాశం ఇచ్చిందని, దీన్ని ఉపయోగించుకోవాలని కోరారు. సమర శంఖారావం సభలో జగన్ ఏం మాట్లాడారంటే... అక్రమ కేసులు ఉపసంహరిస్తాం.. తొమ్మిదేళ్లపాటు పార్టీ కార్యకర్తలంతా నాతోపాటు నడిచారు. అండగా నిలిచారు. తొమ్మిది సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. అధికారంలో ఉన్నవాళ్లు మనల్ని ఎన్ని కష్టాలు, బాధలు పెట్టారో నాకు తెలుసు. మీరు ఎంతగా నష్టపోయారో నాకు బాగా తెలుసు. కొందరు ఆస్తులు పోగొట్టుకున్నారు. మరికొందరు కుటుంబ సభ్యులను కూడా కోల్పోయిన సంఘటనలు నాకు తెలుసు. మీ ప్రతి కష్టాన్ని, నష్టాన్ని చూశా. మీ అందరికీ తగిలిన ప్రతి గాయం నా గుండెకు తగిలినట్టే. మీరంతా నా కుటుంబ సభ్యులే. మీ బాగోగులు చూసుకుంటానని మాట ఇస్తున్నా. మిమ్మల్ని అన్ని రకాలుగా పైకి తీసుకొచ్చుకుంటానని హామీ ఇస్తున్నా. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మిమ్మల్ని పైకి తెచ్చుకుంటా. రేపు మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మీపై పెట్టిన అక్రమ కేసులు, దొంగ కేసులు అన్నీ ఉపసంహరిస్తామని గట్టిగా చెబుతున్నా. మన పాలన భిన్నంగా ఉంటుంది మన పాలనలో ప్రతి సంక్షేమ కార్యక్రమం, పథకం ప్రతి పేదవాడికీ సక్రమంగా అందాలి. సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబు ప్రభుత్వం మాదిరిగా మన ప్రభుత్వం వ్యవహరించదు. మన పార్టీ పాలన భిన్నంగా ఉంటుంది. సంక్షేమ పథకాలు అందించేటప్పుడు ప్రతి పేదవాడికీ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడం అని అందరికీ గర్వంగా చెబుతున్నా. అవినీతి లేని స్వచ్ఛమైన పరిపాలన అందిస్తాం. మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, రైతులను, గ్రామాలను, మన కుటుంబాలను, వందలాది సామాజిక వర్గాలను, ప్రతి ఒక్కరినీ వంచించి, హింసించి, దోచుకున్న ఈ తెలుగుదేశం పార్టీ పరిపాలనకు శాంతియుతంగా సమాధి కట్టేందుకు భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన అవకాశం ఈ ఎన్నికలు. వీటిని ప్రజలంతా ఉపయోగించుకోవాలి. మోసకారి బాబుకు బుద్ధి చెప్పాలి అధికారంలోకి వస్తే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. బ్యాంకుల్లో కుదువ పెట్టిన బంగారాన్ని విడిపిస్తానని, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని అన్నారు. అధికారంలోకి వచ్చాక దారుణంగా వంచించారు. అలాంటి పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రైతుల రుణాలు అక్షరాలా రూ.87,612 కోట్లు ఉండేవి. అవన్నీ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ రుణాల మొత్తాన్ని ఏకంగా రూ.24 వేల కోట్లకు కుదించారు. ఆ సొమ్ము కూడా పూర్తిగా ఇవ్వలేదు. నాలుగో విడత, ఐదో విడత కింద రూ.10 వేల కోట్లు బాకీ పడ్డాడు చంద్రబాబు. ఆయన చేసిన రుణ మాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోలేదు. రైతులను మోసం చేయడానికి ఎన్నికల ప్రకటన వచ్చాక ఆదివారం మళ్లీ జీవో ఇచ్చాడు. ఇలాంటి మోసకారి వ్యక్తికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. ఓటర్లను ప్రలోభపెట్టడానికే బాబు డ్రామాలు ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో మనం ఎలా ఉన్నాం అనేదానిపై ప్రతి కుటుంబం కూడా ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. చంద్రబాబు గత ఎన్నికల ముందు ఏం చెప్పారు? గద్దెనెక్కాక ఏం చేశారు అనేదానిపై ఆలోచన చేయాలి. ప్రతి కుటుంబంలోనూ ఈ చర్చ జరగాలి. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం నాయకులు నోటికి ఏదొస్తే అది చెప్పడం, ఎన్నికలు అయ్యాక ప్రజలను మోసం చేయడం ధర్మమేనా? అని ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలి. మీ పట్టణంలో, మీ గ్రామంలో టీడీపీ నాయకులు ఐదేళ్లలో ఎలాంటి వాతావరణం సృష్టించారో చర్చించాలి. అధికార పార్టీ చేస్తున్న అన్యాయాలపై, జన్మభూమి కమిటీలు అనే మాఫియాలను పెట్టి ఎలాంటి దుర్మార్గాలు చేస్తున్నారో చర్చించాలి. ఇప్పుడు ఎన్నికల ముందు టీడీపీ నేతలు ప్రజలను ప్రలోభ పెట్టేందుకు చూపిస్తున్న డ్రామాలు, సినిమాలపై చర్చించాలి. ఇలాంటి విషయాలపై ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలి. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటూ ఒక పుస్తకం విడుదల చేస్తాడు. 2014లో బాబు విడుదల చేసిన పుస్తకాన్ని ప్రతి గ్రామంలోనూ చూపించాలి. టీడీపీ మేనిఫెస్టోలో ప్రతి కులానికి హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయకుండా ఎలా మోసం చేయాలనే దానిపై పీహెచ్డీ చేసిన చంద్రబాబు తీరుపై అన్నిచోట్లా చర్చ జరగాలి. టీడీపీ గత మేనిఫెస్టోలో 650 హామీలు ఇచ్చింది. ఇప్పుడు వాటి పరిస్థితి ఏమిటో ప్రజలంతా చర్చించాలి. రాక్షస పాలన అవసరమా? రాష్ట్రంలో ఇవాళ మట్టిని వదలడం లేదు, ఇసుకను వదలడం లేదు. మద్యం, బొగ్గు వదలడం లేదు, కాంట్రాక్టర్లను వదలడం లేదు. గుడి భూములను, దళితుల భూములను కూడా వదలడం లేదు. పైన చంద్రబాబు కూర్చుంటారు, కింద టీడీపీ వాళ్లు ఉంటారు. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల మంజూరు, చివరకు మరుగు దొడ్లలోనూ దారుణంగా దోచేస్తున్నారు. అన్నిట్లోనూ లంచాలు గుంజుకుంటున్న ఇలాంటి ప్రభుత్వానికి ఓటు వేయవచ్చా అనేదానిపై చర్చ జరగాలి. ప్రజల ఆస్తులను, భూములను, దేవుడి మాన్యాలను, స్థలాలను కొట్టేసే రాక్షస పాలన మనకు కావాలా అనేదానిపై చర్చించాలి. రాజధాని గారడీ పునాది గోడలను దాటి పోలవరం ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు. అటువైపు చూస్తే రాజధాని అంటూ 50 వేల ఏకరాల భూములను అడ్డగోలుగా సేకరించారు. అందులో 49 వేల ఎకరాల్లో ఇవాళ గడ్డి, పిచ్చి మొక్కలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పాలనలో రాజధాని గారడీ కనిపిస్తోంది. పూర్తికాని పోలవరం ప్రాజెక్టులో బీటలు కనిపిస్తున్నాయి. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల్లో కూడా బీటలే దర్శనమిస్తున్నాయి. అక్కడ బయట 3 సెంటీమీటర్ల వర్షం పడితే, లోపల 6 సెంటీమీటర్ల నీళ్లు కనిపిస్తాయి. రాష్ట్రంలో ఏ ఒక్కటీ వదలకుండా దారుణంగా దోచుకుంటున్న చంద్రబాబు పాలనపై ప్రజల్లో చర్చ జరగాలి. శవ రాజకీయాల్లో చంద్రబాబు దిట్ట చంద్రబాబుకు మమతలు లేవు, మానవత్వం లేదు. వీటికి అర్థం ఆయనకు తెలియదు. ఎన్టీఆర్ శవంపై రాజకీయాలు చేస్తాడు, హరికృష్ణ శవం పక్కనే పెట్టుకుని రాజకీయాలు చేస్తాడు. ఇలాంటి మనిషి రాజకీయాల్లో అవసరమా అనే అంశంపై చర్చ జరగాలి. ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న వారం ముందు చంద్రబాబు చేసిందేమిటో తెలుసా? అయనకు కావాల్సిన వ్యక్తులకు, బినామీలకు భూముల కేటాయింపులు చేస్తాడు, రాయితీలు ఇస్తాడు. ఎవరికి ఎన్ని భూములు, రాయితీలు ఇవ్వాలి, అందులో ఎన్ని లంచాలు గుంజాలి.. చంద్రబాబు నిర్వహించే కేబినెట్ సమావేశాల్లో మనకు కనిపించేది ఇదే. ఇలాంటి అంశాలపై చర్చ జరగాలి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చేస్తున్న పాలన ఎలా ఉందో చర్చ జరగాలి. బెల్టు షాపులు ఎక్కడ రద్దయ్యాయి బాబూ! పిల్లల చదువులకు ఆశాకిరణం ఫీజు రీయింబర్స్మెంట్. పిల్లలు పెద్ద చదువులు చదవాలి, పేదరికం పోవాలి. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పరిస్థితి ఏమిటో అందరూ చర్చించాలి. మన ఆస్తులు అమ్ముకోకుండా, అప్పుల పాలు కాకుండా మన పిల్లలను చదివించుకోగలుగుతున్నామా? అనేది చర్చించాలి. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగారుస్తున్న వైనంపైనా చర్చ జరగాలి. అప్పులు చేయకుండా ఇవాళ వైద్యం చేయించుకోగలుగుతున్నామా? ‘108’కు ఫోన్ కొడితే కుయ్ కుయ్ కుయ్ అంటూ అంబులెన్స్ వచ్చే పరిస్థితి ఉందా? అనే అంశాలపై చర్చ జరగాలి. ఇప్పుడు ప్రతి పల్లెలో కనీసం మూడు నాలుగు మద్యం బెల్టు షాపులు కనిపిస్తున్నాయి. బెల్టు షాపులను రద్దు చేస్తానంటూ మొదటి సంతకం చేసి తర్వాత దగా చేసిన చంద్రబాబు తీరుపై ప్రజలంతా చర్చించాలి. గ్రామాల్లో రాత్రి 7 గంటలు దాటితే మహిళలు బయట తిరగ్గలిగే పరిస్థితి ఉందా అనే దానిపై చర్చ జరగాలి. ప్రపంచంలోనే నంబర్ వన్ అవినీతిపరుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై (ఈవీఎం) చంద్రబాబు తరచూ మాట్లాడుతూ ఉంటాడు. ఈవీఎంలను దొంగిలించాడని కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తిని చంద్రబాబు తన సలహాదారుడిగా నియమించుకున్నాడు. రూ.వేల కోట్లు కుమ్మరిస్తున్నాడు, ఉన్న ఓట్లను తొలగిస్తున్నాడు. లేని ఓట్లను చేర్పిస్తున్నాడు. ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని మోసం చేసిన మోసగాడు, ప్రపంచంలోనే నంబర్ వన్ అవినీతిపరుడు చంద్రబాబు నాయుడు. ఓటుకు రూ.కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన నేరగాడు. తనకు ఓటు వేయరని భావించిన ప్రజల ఓట్లను తీసివేయించిన నంబర్ వన్ క్రిమినల్. ఇలాంటి వ్యక్తిని కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు తలపై పెట్టుకుని మోస్తున్నాయి. పచ్చ మీడియా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఇతర చానళ్లు బాబును భుజాన మోస్తున్నాయి. ఎల్లో మీడియా చంద్రబాబుతో కుమ్మక్కైంది. వీళ్లంతా కలిసి చేసేది ఏమిటో తెలుసా? రాబోయే రోజుల్లో లగడపాటి సర్వేలు తెరపైకి వస్తాయి. తెలంగాణ ఎన్నిల్లో లగడపాటి ఏం చేశాడో గుర్తుందా? ఎన్నికలకు కేవలం 36 గంటల ముందు లగడపాటి మీడియా ముందుకొచ్చాడు. ఓ సర్వేను చూపించాడు. లగడపాటి సర్వేను ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకుంది. ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ పత్రిక చూసినా లగడపాటి చెప్పాడంటూ సర్వే వివరాలే. చివరకు దేవుడు మొట్టికాయలు వేశాడు. లగడపాటి ఎలాంటివాడు, అతడి సర్వేలు ఎలాంటివి, ఈనాడు ఎలాంటిది, ఆంధ్రజ్యోతి ఎలాంటిది, టీవీ5 ఎలాంటిది అనేది అర్థమయ్యేటట్టుగా దేవుడు చేశాడు. బాబు తయారు చేసిన జిత్తులమారి నక్కలు చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ పోలీసులు రాష్ట్రాన్ని కాపాడడానికి, శాంతిభద్రతలను కాపాడడానికి లేరు. వాచ్మెన్ల కంటే దారుణంగా చంద్రబాబు వారిని వాడుకుంటున్నాడు. ఇంటెలిజెన్స్ వాళ్లు గ్రామాలకు వచ్చి సర్వేలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు? 50, 100, 500 ఓట్లను ప్రభావితం చేసే వాళ్లు ఎవరు? వాళ్లను ఏ రేటుకు కొనాలి? ఎలా కొనాలి? అనే దానిపై సర్వేలు చేస్తున్నారు. చంద్రబాబు తయారు చేసిన జిత్తులమారి నక్కల గురించి ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలి. తనకు ఓట్లు వేస్తారు అనుకుంటే చంద్రబాబు ఒకే ఓటర్‌కు రెండు ఓట్లు ఇప్పిస్తాడు. తనకు ఓటు వేయరు అనుకుంటే సామాజికవర్గాల వారీగా తీసేయిస్తాడు. ఇలాంటి వ్యక్తిని సైబర్ క్రిమినల్ అంటారు. మీరు చర్చ పెడుతూ అడగండి. మా ఆధార్ వివరాలు దొంగిలించడానికి, తనకు సంబంధించిన ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఎవరు అని ప్రశ్నించండి. మన బ్యాంకు ఖాతా వివరాలు దొంగిలించడానికి, వాటిని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఎవరు అని నిలదీయండి. మన అనుమతి లేకుండా ఇవాళ మన వ్యక్తిగత డేటా చంద్రబాబుకు చెందిన ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉంది. దీనిపై గ్రామాల్లో ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించిన చంద్రబాబు పార్టీని రద్దు చేయాలి. చంద్రబాబు సేవామిత్ర అనే యాప్ తీసుకొచ్చాడు. ప్రజల వ్యక్తిగత డేటాను తన కంపెనీల్లో స్టోర్ చేసుకున్నాడు. ఇవన్నీ చేసిన వ్యక్తి రేపోమాపో జైలుకు వెళ్లే నేరాలు ఇవి. ఇలాంటి వ్యక్తికి ఓటు వేయాలా అని గ్రామాల్లో చర్చ పెట్టండి. బాబు సీఎంగా కొనసాగడానికి అర్హుడేనా? ఓటుకు రూ.కోట్లు ఇస్తూ దొరికిపోయాడు చంద్రబాబు. అలాగే మన వ్యక్తిగత సమాచారాన్ని అన్యాయంగా, అనైతికంగా దొంగిలిస్తూ దొరికిపోయాడు. ఉన్న ఓట్లు తీసేస్తూ, దొంగ ఓట్లు చేరుస్తూ అడ్డంగా దొరికాడు. దేశంలో ఇలాంటి వ్యక్తిని ఎక్కడైనా చూశామా? ఇలాంటి అన్యాయమైన రాజకీయాల గురించి విన్నామా? అనేది చర్చించండి. దొంగ ఓట్లను తొలగించండి అని ఎన్నికల సంఘాన్ని కోరిన వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్లపై చంద్రబాబు అన్యాయంగా కేసులు పెడుతున్నాడు. ఇలాంటి మనిషి సీఎంగా కొనసాగడానికి అర్హుడా అని చర్చ జరపండి. దొంగ ఓట్లను తొలగించాలి దొంగ ఓట్ల విషయంలో చంద్రబాబు తీరు ఎలా ఉందంటే.. తానే దొంగతనం చేస్తాడు, మిద్దెలెక్కి దొంగా దొంగా అని అరుస్తాడు, ఇతరులపై నేరం మోపుతాడు. రాష్ట్రంలో ఇవాళ అక్షరాలా 59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి. ఇందులో 20 లక్షల ఓట్లు తెలంగాణలోనూ, మన రాష్ట్రంలోనూ కలిపి ఉన్నాయి. మిగిలిన 39 లక్షల దొంగ ఓట్లు ఒక్క ఏపీలోనే ఉన్నాయి. దొంగ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి, తెలుగుదేశం పార్టీ కూటమికి మధ్య ఓట్ల తేడా ఎంతో తెలుసా? కేవలం 5 లక్షల ఓట్లు. ఇక చాలా సినిమాలు చూడబోతున్నాం.. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు చేయని మోసం, చెప్పని అబద్ధం, వేయని డ్రామా ఉండదు. ఈ నెల రోజుల్లో మనం చాలా సినిమాలు చూడబోతున్నాం. ఇవన్నీ ఎల్లో మీడియాలో కనిపిస్తాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో కనిపిస్తాయి. వాళ్లంతా చంద్రబాబుకు అమ్ముడు పోయినవాళ్లే. మనం యుద్ధం చేస్తున్నది చంద్రబాబుతోపాటు ఎల్లో మీడియాపై కూడా. ఈనాడుతో చేస్తున్నాం, ఆంధ్రజ్యోతితో చేస్తున్నాం, టీవీ5తో చేస్తున్నాం, ఎల్లో మీడియాలోని ఇతర ఛానళ్లపై చేస్తున్నాం. నిరుద్యోగులు దగా పడ్డారు రాష్ట్రంలో 2.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ కోసం చంద్రబాబు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఉద్యోగం లేదా ఉపాధి కల్పిస్తానని, అలా ఇవ్వకపోతే ప్రతి ఇంటికీ రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చాడు. కానీ, అమలు చేసిన పాపానపోలేదు. ఇప్పటిదాకా 60 నెలలకు గాను ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షల చొప్పున బాకీ పడ్డాడు. ఎన్నికలకు మూడు నెలల ముందు జనాన్ని మోసం చేయడానికి పన్నాగం పన్నాడు. రాష్ట్రంలో 1.70 కోట్ల ఇళ్లు ఉన్నాయి. కానీ, వాటిని 3 లక్షలకు తగ్గించేశాడు. ఎన్నికలకు మూడు నెలల ముందు కేవలం ఆ 3 లక్షల ఇళ్లకే నిరుద్యోగ భృతి అంటూ మోసం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ప్రతి గ్రామంలో చాటిచెప్పాలి. ‘ఫ్యాన్’ ప్రతి ఇంటికీ వెళ్లాలి బూత్ కన్వీనర్లు తమ పరిధిలోని 35 ఇళ్లకు వెళ్లినప్పుడు ఒక విషయం తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. మన పార్టీ గుర్తు ఫ్యాన్ అని ప్రజలకు తెలియజేయాలి. మన గుర్తు ప్రతి ఇంటికీ వెళ్లాలి, ఫ్యాన్ గుర్తు తెలియని వ్యక్తి ఎవరూ ఉండకూడదు. ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీ పీఠాలు కదిలిపోవాలి. ఎన్నికల సంఘం వాళ్లు సీ–విజిల్ అనే యాప్‌ను ప్రవేశపెట్టారు. ఈ యాప్‌ను ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ వాళ్లు ఏదైనా అన్యాయం చేస్తున్నట్లు మీరు గుర్తిస్తే దాన్ని సెల్ఫోన్లో రికార్డు చేసి, సీ–విజిల్ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి పంపించవచ్చు. తర్వాత 15 నిమిషాల్లోనే మీ దగ్గరికి ఒక టీమ్ వస్తుంది. చట్ట ప్రకారం.. దానిపై ఎలాంటి చర్య తీసుకున్నారో వివరిస్తూ రిటర్నింగ్ అధికారి 100 నిమిషాల్లోనే నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికలు కాదని ప్రజలకు గట్టిగా చెప్పండి. ప్రజలకు, రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పండి. నీతికి, అవినీతి మధ్య, విశ్వసనీయతకు, అవకాశవాదానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పండి. ప్రజాస్వామ్యానికి, అరాచకానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పండి. రాజకీయ వ్యవస్థలో విలువలు, విశ్వసనీయతను కాపాడాలంటే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలని చెప్పండి. రేపు నవరత్నాలతో ప్రతి పేదవాడి జీవితాన్ని మార్చాలన్నా, ఈ వ్యవస్థను మార్చాలన్నా మీరంతా ఒక్కటై జగన్‌కు తోడుగా నిలబడాలి. ఒక రాజకీయ నాయకుడు చంద్రబాబు లాగా కేవలం విలన్ పాత్రే కాదు, మంచివాడు అధికార పీఠంపైకి వస్తే హీరో పాత్ర కూడా పోషించగలడని ప్రజలకు చెప్పండి. ఇది జరగాలంటే మీ అందరి తోడ్పాటు, సహాయం కావాలి’’ అని జగన్మోహన్రెడ్డి అభ్యర్థించారు. ఓటు హక్కును సాధించుకోవాలి చంద్రబాబు నిన్ననే ప్రెస్‌మీట్ నిర్వహించాడు. ఆ ప్రెస్‌మీట్ చూసినప్పుడు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన తర్వాత తానే తెలంగాణ ప్రభుత్వంతో రాజీ పడ్డానని, విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన సంస్థల్లో కొన్నింటిని తానే వదిలేశానని చెప్పాడు. ఓట్ల కోసమే పసుపు–కుంకుమ కింద అధికారికంగా డబ్బులు పంచుతున్నానని ఒప్పుకున్నాడు. ఎన్నికలు వస్తేగానీ ప్రజలు గుర్తుకు రాని ఇలాంటి నయవంచకుడికి, తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి ఏమాత్రం సంకోచించని ఇలాంటి వ్యక్తికి ఓటు వేయాలా అని ప్రతి ఇంట్లోనూ చర్చ జరిగేలా చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో మనమేం చేయాలి అనేది ఆలోచించండి. మనమంతా గ్రామాల్లోకి వెళ్లాలి. ప్రతి 35 ఇళ్లకు చొప్పున మన పార్టీ తరçఫున ఒక బూత్ కమిటీ సభ్యుడు ఉన్నారు. ప్రతి బూత్ కమిటీ సభ్యుడు తన పరిధిలోని 35 ఇళ్లకు వెళ్లాలి. ఆ ఇళ్లల్లోని నివాసితుల ఓట్లు ఉన్నాయో లేదో చూడాలి. ప్రతి ఓటర్ గుర్తింపు కార్డుపై ‘ఎపిక్’ నంబరు ఉంటుంది. ఆ నంబర్‌ను ‘1950’ అనే నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. దాంతో ఓటు ఉందో లేదో తెలిసిపోతుంది. ఓటు లేకపోతే వెంటనే జాగ్రత్త పడాలి. ఓటు కోసం ఫారం–6 సమర్పించాలి. ఎమ్మార్వో ఆఫీసుల్లో, మన గ్రామాల్లో బూత్ లెవల్ అధికారి వద్ద కూడా ఫారం–6 ఉంటుంది. దాన్ని పూర్తి చేసి, సంబంధిత అధికారికి అందజేయాలి. ఓటు హక్కు కోసం ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ చంద్రబాబు మన ఓటును తీసివేయిస్తే మళ్లీ మనం ఓటు హక్కు పొందాలి. ఓటర్ల నమోదుకు ఐదు రోజుల గడువు ఇచ్చారు. ఆ తర్వాత నమోదు నిలిపివేస్తారట. ఈ ఐదు రోజుల గడువును ఉపయోగించుకోవాలి. మన ఓటు హక్కును మనం సాధించుకోవాలి. మన ఊళ్లల్లో ఎవరికైనా రెండు ఓట్లు ఉన్నాయని తెలిస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలి. గ్రామాలకు బాబు డబ్బు మూటలు పంపిస్తాడు ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి చంద్రబాబు చేయని అన్యాయాలు ఉండవు. మన గ్రామాలకు మూటల కొద్దీ డబ్బులొస్తాయి. చంద్రబాబు డబ్బు మూటలు పంపిస్తాడు. ప్రతి ఓటర్ చేతిలో కనీసం రూ.3,000 పెడతాడు. ఇలాంటి పరిస్థితుల్లో మన పార్టీ నేతలు, కార్యకర్తలు గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లాలి, ప్రతి అమ్మకు, అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అన్నకూ చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే రూ.3,000కు మోసపోవద్దని చెప్పాలి. రేపు అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పిల్లలను కేవలం బడికి పంపిస్తే చాలు సంవత్సరానికి రూ.15,000 ఇస్తాడని చెప్పాలి. వైఎస్సార్ చేయూత అనే పథకాన్ని తీసుకొస్తాడు, ప్రతి అక్క చేతిలో రూ.75,000 నాలుగు విడతల్లో పెడతాడని చెప్పండి. ఎన్నికల తేదీ నాటికి మీ అప్పులు ఎంతైతే ఉన్నాయో ఆ సొమ్మును అన్న ముఖ్యమంత్రి అయ్యాక నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తాడని చెప్పండి. పసుపు–కుంకుమ పేరుతో చంద్రబాబు చేస్తున్నది మోసమని వివరించండి. సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన సొమ్ము ఎగ్గొట్టాడని చెప్పండి. సున్నా వడ్డీకే రుణాలను అన్న మళ్లీ తీసుకొస్తాడని మహిళలకు చెప్పండి. బ్యాంకర్లు చిరునవ్వుతో మీకు అప్పులిచ్చేలా చేస్తాడని చెప్పండి. రాజన్న కుమారుడు జగనన్నతోనే ఇది సాధ్యమని ప్రతి అక్కకు, చెల్లెమ్మకు చెప్పండి. చంద్రబాబుకు ఐదేళ్లు అవకాశం ఇస్తే మనల్ని మోసం చేశాడని తెలియజేయండి. చంద్రబాబు ఇచ్చే రూ.3,000కు మోసపోవొద్దని ప్రతి రైతన్నకూ చెప్పండి. రేపు అన్న ముఖ్యమంత్రి అయ్యాక రైతు భరోసా కింద ప్రతి రైతు చేతిలో రూ.12,500 పెడతాడని చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరకు, ప్రతి తాత దగ్గరకు వెళ్లండి. అన్నను ముఖ్యమంత్రి చేసుకుంటే పెన్షన్ రూ.3,000కు పెంచుకుంటూ పోతాడని చెప్పండి. పేదలకు ఇల్లు రావాలంటే అన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పండి. నవరత్నాల్లోని అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. నవరత్నాల గురించి చెప్పండి. నవరత్నాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు చూస్తామని గట్టిగా నమ్ముతున్నా. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ నవరత్నాలు అందేలా చేస్తానని మాట ఇస్తున్నా. -
మోసపూరిత కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
అన్నా.. రైతులకు రుణమాఫీ చేస్తామంటూ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని అమలుచేయకపోగా, ఇప్పుడు పసుపు–కుంకుమ పేరుతో మరో కొత్త మోసానికి అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. దగాపడ్డ రైతన్నకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయి? ఇలాంటి పరిస్థితులను ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎలా ఎదుర్కోవాలి?.. అంటూ తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ క్రియాశీల కార్యకర్తలు వేసిన ప్రశ్నలకు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం కాకినాడలో జరిగిన ‘సమర శంఖారావం’ సభలో తనదైన శైలిలో సమాధానమిస్తూ పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. వీరి ప్రశ్నలకు ఆయన స్పందించిన తీరు పార్టీ శ్రేణులను ఆకట్టుకుంది. సభా వేదిక పైనుంచి వైఎస్ జగన్ వారితో జరిపిన సంభాషణ ఇలా సాగింది.. – సాక్షి ప్రతినిధి, కాకినాడ ప్రశ్న: అన్ని రాజకీయ పార్టీలు కలిసి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయి. అవకాశవాద రాజకీయాలు చేస్తూ రాజకీయ లబ్ధి కోసం తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుతున్నాయి. ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి? – నిడిగట్ల చింతలరావు, విరవ, పిఠాపురం మండలం జగన్: అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయని చంద్రబాబు సర్కార్ మోసపూరిత విధానాలను ప్రతి అక్కచెల్లెమ్మకు, అన్నలకు చెప్పండి. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదాపై మాట్లాడిన మాటలు, ఎన్నికల తరువాత మారిన చంద్రబాబు వైఖరి.. మళ్లీ ఎన్నికలు దగ్గరపడడంతో ప్రత్యేక హోదా నినాదాన్ని వినిపించడం వంటి చంద్రబాబు విధానాలపై ఆలోచన చేయాలని వివరించండి. ప్రత్యేక హోదా సంజీవిని కాదంటూ మాటమార్చి నాలుగేళ్లపాటు బీజేపీతో సంసారం చేసి అప్పుడు అడగని ప్రత్యేక హోదా ఇప్పుడు అడగడంలో బాబు ఆంతర్యమేమిటని గట్టిగా నిలదీయాలని ప్రజలకు వివరించండి. కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు గుర్తుకురాలేదో గట్టిగా నిలదీయమనండి. బీజేపీకి విడాకులు ఇచ్చాక పసుపు చొక్కాలు వదిలి నల్ల చొక్కాలు ధరించిన చంద్రబాబు వైఖరిని ప్రశ్నించమనండి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినప్పుడు ప్రత్యేక హోదాను కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టి ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించైనా న్యాయపోరాటం చేసి సాధించుకునే వాళ్లం. కాంగ్రెస్ అలా చేయకపోవడంవల్లే ఇప్పుడు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని తిరుపతి సభలో ప్రకటించిన ప్రధాని మోదీ.. హోదాను ఇవ్వగలిగే స్థానంలో ఉండి కూడా రాష్ట్రానికి మోసం చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయానికి వస్తే గత ఎన్నికల్లో చంద్రబాబుకు, బీజేపీకి ఓటు వేయాలని, న్యాయం చేస్తానంటూ ప్రజలను కోరారు. నాలుగేళ్లపాటు వాళ్లతో సంసారం చేసి ఎన్నికలు రావడంతో ఇప్పుడు ఆయన కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ వాస్తవాలన్నింటినీ ప్రజలకు వివరిస్తూ ‘అంతా దోషులేనని’ ప్రజలకు అర్థమయ్యేలా వివరించండి. ప్రత్యేక హోదా అనే మనిషిని.. ఒకరు కదలకుండా పట్టుకుంటే మరొకరు కత్తితో పొడిచి చంపారంటూ జగన్ వ్యాఖ్యానించారు. ప్రశ్న: గత ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. ఎన్నికలయ్యాక ఆ విషయాన్ని విస్మరించారు. గత హామీలే అమలుచేయని చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు రావడంతో హడావుడిగా పసుపు–కుంకుమ పేరుతో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి మరీ పంపిణీ చేస్తున్నారు. వీటిని ఎలా అడ్డుకోవాలి? – రొక్కాల గణేష్, జి.భావారం, కరప మండలం, చోడిశెట్టి సత్యనాగేశ్వరరావు తుని మండలం జగన్: పూటకో అబద్ధం, రోజుకో మోసం చేసే అలవాటున్న చంద్రబాబు.. రైతులను కూడా అదే తరహాలో దగా చేశారు. పసుపు–కుంకుమ పేరుతో నిజంగా అక్కాచెల్లెమ్మలకు డబ్బిచ్చే ఉద్దేశ్యమే ఉంటే నాలుగేళ్ల తొమ్మిది నెలల్లో ఈ అక్కచెల్లెమ్మలు ఎందుకు గుర్తుకురాలేదో గట్టిగా అడగమనండి. ఎన్నికలు సమీపించడంతో చెక్కులు ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటో గుర్తించమని చెప్పండి. రుణమాఫీ పేరుతో విదిల్చిన కొద్దిపాటి సొమ్ము కనీసం వడ్డీ కట్టేందుకు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఎన్నికలు దగ్గరపడడంతో చంద్రన్న బాబా అన్నదాత సుఖీభవ అంటూ మరో పథకాన్ని ప్రకటించడంలో ఆంతర్యమేమిటో అర్థమయ్యేలా వివరించండి. ప్రశ్న: వ్యవసాయమే ఆధారంగా జీవించే సాధారణ రైతులు ఇప్పుడు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రైతులకు ఇచ్చిన హామీలు, రుణమాఫీ అమలుకావడంలేదు. మహానేత వైఎస్ కాలంలో రైతే రాజు అన్న ధీమా ఉండేది. మీరు ముఖ్యమంత్రి అయ్యాకే అలాంటి రోజులు వస్తాయని ఆశిస్తున్నాం? – బాలచర్ల వెంకన్న,జెడ్.రాగంపేట, జగ్గంపేట మండలం జగన్: ప్రజల ఆశీస్సులతో మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు ప్రభుత్వంగా ఉంటామని హామీ ఇస్తున్నా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎంతో నమ్మకం ఉంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయం. ప్రతీ రైతు ముఖంలో చిరునవ్వును చూసేలా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాను. నవరత్నాలలో రైతు సంక్షేమం కోసం చేసిన ప్రతిపాదనలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అర్థమయ్యేలా వివరించండి. -
నేడు కాకినాడలో సమర శంఖారావం
-
11న వైఎస్సార్సీపీ సమర శంఖారావం
సాక్షి ప్రతినిధి, కాకినాడ/హైదరాబాద్: వైఎస్సార్సీపీ సమర శంఖారావం సభ ఈ నెల 11న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు సర్పవరంలో మొదలయ్యాయి. బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సభలో ప్రతిపక్ష నేత జగన్ ప్రసంగిస్తారు. వచ్చే ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేస్తారు. అంతకు ముందు ఉదయం 11 గంటలకు నాగమల్లి తోటలోని ద్వారంపూడి భాస్కరరెడ్డి పద్మావతి కళ్యాణ మండపంలో తటస్తులతో జరిగే సమావేశంలో జగన్ పాల్గొంటారు. కాగా, సమర శంఖారావం సభ కోసం సర్పవరంలోని జ్యూయల్ మెడల్స్ అపార్ట్మెంట్స్ వద్ద ఉన్న ఐదు ఎకరాల స్థలాన్ని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు శుక్రవారం పరిశీలించారు. కాగా స్వతంత్ర జర్నలిజం ముసుగులో ఎల్లో మీడియాగా మారి టీడీపీకి వత్తాసు పలుకుతున్న టీవీ5 చానల్‌ను బహిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం తమ పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది. -
సినిమా –2కి బాబు సిద్ధం!
నెల్లూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు ఇప్పుడు సినిమా –2 చూపించేందుకు సిద్ధమవుతున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. భూములు అమ్ముకోవడం, కమీషన్లను కాజేయటంపైనే ఆయన యావ అంతా అని మండిపడ్డారు. చంద్రబాబు ప్రజా కంటక పాలనకు ముగింపు పలికేందుకు అంతా తనకు అండగా నిలవాలని కోరారు. మంగళవారం నెల్లూరులో సమర శంఖారావం సభ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ సభ్యులకు వైఎస్ జగన్ పలు కీలక సూచనలు చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. బాబు కనిపిస్తే నిలదీయండి.. ‘2014 ఎన్నికల్లో చంద్రబాబు మనందరికీ ఓ సినిమా చూపించారు. ఓట్ల కోసం మేనిఫెస్టోలో పలు హామీలిచ్చారు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. బ్యాంకుల్లో కుదువ పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నాడు. డ్వాక్రా మహిళల రుణాలు రద్దు కావాలంటే బాబే అధికారంలోకి రావాలన్నాడు. బెల్ట్ షాపులను తొలగిస్తూ తొలి సంతకం చేస్తానన్నాడు. రూ 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తానన్నాడు. ఈ సినిమా ఇంతటితో ఆగి పోలేదు. పిల్లలు కేజీ నుంచి పీజీ వరకూ చదవాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఇంటికి ఒక ఉద్యోగం లేదంటే రూ. 2 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. చంద్రబాబు ఎప్పుడైనా కనిపిస్తే దీనిపై నిలదీయండి. ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా ఉన్నవే ఊడగొట్టారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తానని మాట మార్చాడు. మత్సకారులను ఎస్సీల్లో చేరుస్తామన్న హామీని నిలబెట్టుకోలేదు. సీఎం కాగానే కమీషన్ల గురించే ఆలోచించారు... మూడేళ్లల్లో పోలవరం పూర్తి చేస్తానని 2014లో బాబు చెప్పారు. ఆపదలో ఉన్న మహిళ ఎవరైనా ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో సాయం అందిస్తామన్నారు. అన్ని ప్రధాన నగరాల చుట్టూ రింగు రోడ్లంటూ ఊరించారు. ఇంతటితో ఆగకుండా బుల్లెట్ రైలు అన్నాడు. అద్భుతమైన రాజధాని కడతానంటూ గ్రాఫిక్స్ చూపించారు. రాజధాని ఎక్కడుంది? అని అడిగితే ఐదేళ్ల తరువాత మళ్లీ అవే గ్రాఫిక్స్ చూపిస్తూ బాహుబలి సినిమా చూశారా? అని ఎదురు ప్రశ్నిస్తారు. గత ఎన్నికలప్పుడు ఇలా చాలా చెప్పాడు చంద్రబాబు. కానీ వీటిలో ఏ ఒక్కటైనా చంద్రబాబు నెరవేర్చారా? అని ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికలు ముగిశాక ఆయన ముఖ్యమంత్రి కాగానే చేసిందేమిటో తెలుసా..? భూములు ఎలా అమ్ముకోవాలి? ఏ కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఎంత దోచుకోవాలి? మట్టి, ఇసుక ఎంతకి అమ్మాలి? బొగ్గులో కమీషన్ ఎలా తీసుకోవాలి? కరెంట్ కొనుగోలులో ఎంత కమీషన్ కాజేయాలి? అని ఆలోచించారు. అమరావతి నుంచి విశాఖపట్నం వరకు భూములు దోచుకోవాలన్న దురాలోచనతో చివరకు దేవాలయ భూములు, దళితుల భూములను కూడా వదిలిపెట్టలేదు. అది చాలక జన్మభూమి కమిటీలను మాఫియాలా గ్రామాలపైకి వదిలారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రావడంతో రెండో సినిమాకు సిద్ధమయ్యారు. అలాంటి వాళ్లను ఏమనాలి? చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాటు ప్రత్యేక హోదాని ఖూనీ చేశాడు. ఎన్నికలు రావడంతో నల్ల చొక్కాలు వేసుకుంటున్నాడు. ధర్మపోరాట దీక్ష అని అంటూ మరో సినిమా చూపిస్తాడు మనందరికీ. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రుణమాఫీ సంగతి మాత్రం ఎత్తడు. ఆ రుణాలు వడ్డీలు పెరిగి తడిసి మోపిడై చంద్రబాబు హయాంలో మొదట్లో రూ.14,200 కోట్లు ఉన్న రుణాలు ఈరోజు రూ.25 వేల కోట్లకు చేరాయి. తాను చేసిన మోసానికి అక్కచెల్లెమ్మలను కనీసం క్షమించమని కూడా అడగడు. ఎన్నికల ముందు పసుపు– కుంకుమ అంటూ ఇంకొక డ్రామా. రైతులందరికి ఏటా రూ.12,500 ఇస్తామని, ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు ఇస్తామని, అండగా ఉంటామని మేం చెబుతున్నాం. కానీ ఈ పెద్దమనిషి ఐదేళ్ల పాటు రైతులకు ఏమీ ఇవ్వకుండా మోసం చేస్తాడు. ఇప్పుడు మళ్లీ రైతుల్ని మోసం చేసేందుకు ఎన్నికల ముందు అన్నదాతా సుఖీభవ అంటాడు. ఆయన ప్రవేశ పెట్టింది మధ్యంతర బడ్జెట్ మాత్రమే. అవ్వా తాతలకు ఫించన్లు పెంచుతామని నేను పాదయాత్ర మొదలు పెట్టకముందు దాదాపు రెండేళ్ల క్రితమే గుంటూరులో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో ప్రకటిస్తే అప్పుడు చంద్రబాబు నోరు మెదపలేడు. ఎవరైనా 57 నెలలపాటు కడుపు మాడ్చి చివరి మూడు నెలలు అన్నం పెడతామంటే వారిని అన్నా అంటామా? లేక దున్నా అంటామా? అని మిమ్మల్ని అడుగుతున్నా. అమ్మకు అన్నం పెట్టనివాడు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తానన్నాడనే సామెత ఇలాంటి వ్యక్తులను చూసే పుట్టింది. జగన్‌కు మీ అందరి తోడు కావాలి.. ఎన్టీఆర్ 1983లో ఎన్నికలకు ఆరు నెలలకు ముందు ప్రజల్లోకి వెళ్లి తిరుగుతూ తాను అధికారంలోకి వస్తే కిలో బియ్యం రూ.2కే ఇస్తా అని చెప్పారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ నేత విజయభాస్కర్‌రెడ్డి ఎన్నికలకు మూడు నెలల ముందుగా కిలో బియ్యం రూ.1.90కే తాను ఇస్తానని చెప్పినా ప్రజలు ఆయనకు గట్టి గుణపాఠం చెప్పారు. నాలుగున్నరేళ్లు నువ్వు ఏమీ చేయలేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు చంద్రబాబుకు కూడా జరగబోయేది అదే. ఈ పెద్ద మనిషి మోసాలు, అబద్ధాలు ఏస్థాయిలో ఉన్నాయో మీ అందరికీ తెలుసు. వీటికి చరమ గీతం పాడాల్సిన సమయం వచ్చింది. ఈ పని జరగాలంటే జగన్‌కు మీ అందరి తోడు కావాలి. మీరంతా గ్రామాలకి వెళ్లి బాబు మోసాల గురించి చెప్పాలి. ఒక్కో బూత్ కమిటీ సభ్యుడు 35 ఇళ్లకు వెళ్లాలి. అన్యాయాల్ని సరిచేయాలంటే ప్రతి ఒక్కరి ఓటు భద్రంగా ఉందో లేదో చూడాలి. ఓటరు లిస్ట్‌లో ఓటు లేకుంటే ఎలా చేర్పించాలో తెలుసుకోవాలి. మొదట ఓటరుకార్డు ఉన్నవారు కార్డుపై ఉన్న ఎపిక్ నెంబర్‌ను 1950కి మెసేజ్ చేయాలి. ఓటు నమోదు కోసం ఫాం 6 పూర్తి చేసి ఓటరుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఫాం 6 లభిస్తుంది. తహసీల్దార్ కార్యాలయాల్లో, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో బీఎల్ఓల దగ్గర కూడా ఓటు నమోదు చేసుకోవచ్చును. దొంగ ఓట్లు ఉంటే ఫారమ్ 7 ద్వారా తొలగించాలి. ప్రతి ఇంటికి వెళ్లి మనల్ని ప్రేమించే ప్రతి ఒక్కరి ఓటు ఉందా లేదా అని పరిశీలించడంలో మీరంతా క్రియాశీలక పాత్ర పోషించాలి. ఎందుకంటే ఇవాళ మనం చంద్రబాబు అనే మాయావితో యుద్ధం చేస్తున్నాం. ఈ విషయాన్ని మరచిపోకండని చెబుతున్నా. ప్రతి ఓటు మనకు కీలకమే.. ఇటీవల నేను కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి రాష్ట్రంలో 59 లక్షలకుపైగా దొంగ ఓట్లు ఉన్నాయని అర్జీ ఇచ్చా. ఇవాళ టీడీపీ అధికారంలోకి ఉండటానికి, మనం ప్రతిపక్షంలో ఉండటానికి తేడా కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే. 1.30 కోట్ల ఓట్లు వైఎస్సార్సీపీకి వస్తే 1.35 కోట్ల ఓట్లు టీడీపీకి వచ్చాయి. కాబట్టి ప్రతి ఓటు మనకు చాలా కీలకం. చంద్రబాబు ఒక్కరితోనే కాదు అమ్ముడు పోయిన మీడియాతో కూడా నేడు మనం యుద్ధం చేస్తున్నాం. ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ–5 మీడియాతో, ఇంకా అనేక ఛానెళ్లతో యుద్ధం చేస్తున్నాం. వీరంతా అబద్దాన్ని నిజంగా.. నిజాన్ని అబద్ధంగా చూపే కార్యక్రమాన్ని చేస్తున్నారు. గ్రామాలకు నిఘా అధికారులను పంపుతున్నారు.. తెలంగాణా ఎన్నికలప్పుడు 36 గంటల ముందు ఏం జరిగింది? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 ఇతర ఎల్లో మీడియాలన్నీ లగడపాటి సర్వే అంటూ కేసీఆర్ దిగిపోయి కాంగ్రెస్ – చంద్రబాబు అధికారంలోకి వస్తున్నారంటూ చూపించారు. ఆ తరువాత లగడపాటి సర్వే ఏమైందో అందరికీ తెలిసిందే. ఈ జిత్తుల మారి నక్కల గురించి అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల సమయం సమీపించడంతో చంద్రబాబు ప్రతి గ్రామానికి ఇంటెలిజెన్స్ అధికారులను పంపుతున్నారు. ప్రభావితం చేసే వైఎస్సార్సీపీ నాయకులను ఎలా కొనాలి? ఎంత డబ్బు ఇవ్వాలి? అనే దిక్కుమాలిన ఆలోచనలో ఈప్రభుత్వం ఉంది. మరో రెండు నెలలు అగండి.. మన అన్న వస్తాడు మనందరి జీవితాలు బాగుపడతాయని అందరికీ చెప్పాలని కోరుతున్నా. మీకు కేటాయించిన 35 ఇళ్లకు వెళ్లి నవరత్నాల గురించి తెలియజెప్పండి. మీకు తగిలిన ప్రతి గాయం నా గుండెకూ తగిలింది... ఈ సందర్భంగా నా కుటుంబ సభ్యులైన ప్రతి బూత్ కమిటీ సభ్యునికీ ముందుగా రెండు చేతులు జోడించి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. ప్రతిపక్షంలో ఉన్న 9 ఏళ్లలో మీరంతా నాకు అండగా నిలిచారు. అధికారంలో ఉన్న వారు మిమ్మల్ని ఎన్ని కష్టాలు, బాధలు పెట్టారో, మీరెంత నష్ట పోయారో నాకు బాగా తెలుసు. మన ప్రతి కార్యకర్తా ఎన్ని కష్టాలు పడ్డారో... ఎన్ని అవమానాలను సహించారో కూడా తెలుసు. కొందరు లాఠీ దెబ్బలు తిన్నారు. మరి కొందరు ఆస్తులు పోగొట్టుకున్నారు. కొందరు తమ కుటుంబ సభ్యులను కూడా పోగొట్టుకున్నారు. మీ ప్రతి కష్టాన్ని, నష్టాన్ని నేను చూశా. మీకు తగిలిన ప్రతి గాయం నా గుండెకూ తగిలింది. రేపు దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ బాగోగులను చూసుకుంటానని మాట ఇస్తున్నా. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా మీకు అండగా ఉండి పైకి తీసుకొచ్చుకుంటా అని హామీ ఇస్తున్నా. ప్రతి బూత్ కమిటీ సభ్యుడికీ ఇదే చెబుతున్నా. మీమీద పెట్టిన అక్రమ కేసులు, దొంగ కేసులన్నింటినీ పూర్తిగా ఎత్తేస్తామని హామీ ఇస్తున్నా. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంక్షేమ పథకం ప్రజలందరికీ అందాలి. ఆ పథకాలను పేదవాడికి అందించేటపుడు కులాన్ని చూడకూడదు, మతాలు చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు. చివరకు ఏ పార్టీ వారు? అనేది కూడా చూడకూడదని మీ అందరికీ చెబుతున్నా. మీరే ముందుండి ఈ పథకాలన్నీ ప్రజలకు అందించేలా చేస్తానని చెబుతున్నా. అవినీతి లేని స్వచ్ఛమైన పాలన మన హయాంలో రావాలి. అలాంటి పాలనకు దిక్సూచిగా మీరే నిలబడతారని హామీ ఇస్తున్నా. సీ–విజిల్ యాప్‌ను ఉపయోగించండి స్మార్ట్ ఫోన్ ఉన్న వారంతా ‘సీ–విజిల్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. టీడీపీ అక్రమాలను రికార్డు చేసి యాప్‌లో సెండ్ బటన్ నొక్కండి. మీరు బటన్ నొక్కిన వెంటనే రిటర్నింగ్ అధికారి వంద నిమిషాల్లోపే మీ వద్దకు వచ్చి పైవారికి నివేదిక ఇస్తారు. ఇది చట్టంలో ఉంది. వంద నిమిషాల్లో ఫలితం కనిపిస్తుంది’ -
దుగరాజపట్నం పోర్టు నిర్మించి తీరుతాం
సాక్షి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దుగరాజపట్నం పోర్టును నిర్మించి తీరుతామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులో మంగళవారం సాయంత్రం జరిగిన సమర శంఖారావం సభలో పోలింగ్‌బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో నిర్వహించిన ముఖాముఖీ సందర్భంగా ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ముఖాముఖీలో భాగంగా బూత్ కమిటీ సభ్యులు పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. దుగరాజుపట్నం పోర్టు నిర్మిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు దానిని నెరవేర్చలేదు. మీరు అధికారంలోకి వస్తే దాని నిర్మాణం చేపడతారా? – వెంకటేష్ (సూళ్లూరుపేట నియోజకవర్గం–కొమ్మూరు) జగన్: ఇక్కడే కృష్ణపట్నం పోర్టు ఉంది. తడలో సెజ్‌లు ఉన్నాయి. ఇవి ఉన్నా ఇక్కడ చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఎక్కడో గుజరాత్, రాజస్థాన్, తమిళనాడుకు చెందిన పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి.. ‘మీ అందరికీ ఒకటే చెపుతున్నా.. మీరు గ్రామాల్లోకి వెళ్లండి, అన్నా అక్క చెల్లి అని ఆప్యాయంగా పలకరిస్తూ చెప్పండి.. మన అన్న సీఎం అవుతాడు.. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పండి.. ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు చేసి పదిమంది పిల్లలకు అక్కడే ఉద్యోగాలిప్పించే ప్రయత్నం చేస్తాడని చెప్పండి. గ్రామ్లాల్లో రేషన్ కార్డు, ఇళ్లు కావాలన్నా, ఎవరికి ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్, నవరత్నాల్లో చేయూత, రైతు భరోసా, బియ్యం కావాలన్నా అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లో అనుమతి చేయిస్తాడని చెప్పండి. ఎవరి సిఫారసు అవసరం లేదు. మనం అధికారంలోకొస్తే ప్రతి 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వలంటీర్‌గా నియమించి.. రూ.5 వేలు జీతమిస్తాం. అంతకంటే పెద్ద ఉద్యోగమొస్తే దీన్ని వదులుకోవచ్చు. వీరిద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా మీకు ఇంటికొచ్చి అందించేలా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రం ఏర్పడినప్పుడు 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తారని నిరుద్యోగులు ఇంతకాలం ఎదురుచూశారు. వేలకు వేలు ఖర్చుచేసి కోచింగ్‌లు తీసుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్ ఇవ్వదు. ఇక ఐదేళ్లలో ఉద్యోగ విరమణ చేసిన 90 వేల మంది ఉన్నారు. మొత్తంగా 2.30 లక్షల ఉద్యోగాలున్నాయి. అవన్నీ అన్నొస్తే భర్తీ చేస్తాడని చెప్పండి. అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టం చేసి, పరిశ్రమలు ఉన్న ప్రాంతంలో 70 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చేస్తాం. చివరగా దుగరాజపట్నం పోర్టును కచ్చితంగా కట్టితీరుతాం. నెల్లూరులో పాదయాత్ర చేసినప్పుడు మరిచిపోలేని సంఘటన చెప్పండి.. – సుబ్బారెడ్డి (ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు) జగన్: నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు మర్చిపోలేని సంఘటన ఒకటి చూశా.. పాదయాత్రలో కలచివేసిన సంఘటన. ఉదయగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుంటే ఒక పెద్దాయన, పెద్దమ్మ ఏడ్చుకుంటూ నా దగ్గరకొచ్చారు. పక్కనే వారి గుడిసె. ఆ గుడిసెలో ఒక ఫొటో ఉంది. వారి కొడుకు ఫొటో వేలాడి తీసి ఉంది. అతని పేరు గోపాల్ అనుకుంటా.. అన్నా, ఈ ఫొటోకు దండ వేసి ఉంది నా కొడుకు. ఆత్మహత్య చేసుకొని చనిపోయాడన్నా అని ఏడుస్తూ చెప్పాడు. నాకు చాలా బాధేసింది.. ఎలా చనిపోయాడన్నా అని అడిగితే.. అన్నా నా కొడుక్కి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చాయన్నా. మంచి స్టూడెంట్ కావడంతో ఇంజనీరింగ్ చదువుతానంటే చేర్పించానన్నా.. ఇంజనీరింగ్ చదివితే తాను బాగుపడతాడు, తనతోపాటు మా బతుకులు బాగుపడుతాయని ఆశపడ్డానన్నా.. ఇంజనీరింగ్‌కు సంవత్సరానికి రూ.లక్ష ఖర్చవుతుందని చెప్పాడు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత ఇస్తున్నారని అడిగితే.. రూ.30 వేల నుంచి రూ.35 వేలు వస్తుందన్నా, అది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి అన్నాడు. ఇంజనీరింగ్ చదవాలంటే సంవత్సరానికి రూ.70 వేలు అదనంగా అవుతుందని.. నాలుగేళ్లలో రూ.3 లక్షలు చెల్లించాలన్నా ఆ స్థోమత మాకుందాన్నా అని అడిగాడు. నా కొడుకు మొదటి సంవత్సరంలో చదవనంటే చదవమని చెప్పి రూ.70 వేలు తెచ్చిచ్చానన్నా, రెండో సంవత్సరం సెలవులకు ఇంటికొచ్చి నాన్నా రెండో ఏడాదికి కూడా రూ.70 వేలు కావాలని అడిగితే అప్పోసప్పో చేసి తెచ్చిస్తానని చెప్పానని తెలిపాడు. అన్నా నాకొడుకును కాలేజీకి పంపించా. అలా వెళ్లిన నా కొడుకు నా అవస్థ చూడలేక ఆత్మహత్య చేసుకున్నాడని గోపాలన్న ఏడుస్తూ చెప్పాడు. బహుశా నా జీవితకాలంలో మర్చిపోలేని సంఘటన ఇది. ఆ తర్వాత గోపాలన్న చెప్పింది నవరత్నాల్లో చేర్చా. ప్రతి పేదవారికీ హామీ ఇస్తున్నా. పేదరికానికి, చదువులకు సంబంధం లేకుండా చేస్తా, మన ఇళ్లలో నుంచి ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్ కావాలి.. చదువుకోసం పేదరికం అడ్డుకాకుడదు.. గోపాలన్న పడే బాధ ఏతండ్రికీ రాకూడదని చెపుతున్నా.. ప్రతి తల్లికి, తండ్రికి చెపుతున్నా.. చదవాలనుకునే పిల్లాడికి ఉచితంగా చదివించడమే కాకుండా హాస్టల్లో ఉండి చదువుకొనేవారికి మెస్‌చార్జీలకు గాను ఏడాదికి రూ.20 వేలు ఇస్తానని చెపుతున్నా.. గోపాలన్నా.. నష్టాన్ని వెనక్కి తీసుకురాలేను కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చేస్తానని హామీ ఇస్తున్నా. అన్నా మన కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఎలా బయటపడాలి? – హరికృష్ణ (సర్వేపల్లి–బ్రహ్మదేవం) జగన్: ఇదే సమస్య ప్రతి గ్రామంలో ఉంది. మంచీచెడు లేకుండా అన్యాయంగా అక్రమ కేసులు పెడుతున్నారు. దేవుడు దయవల్ల మన పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి అక్రమ కేసును ఉపసంహరిస్తామని హామీ ఇస్తున్నా.. రెండునెలల్లో మంచిరోజులు రాబోతున్నాయి. దగ్గరకు వచ్చేశాం.. కాస్త ఓపిక పట్టండి మన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుందాం. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు కదా.. మనం ఎలా ఎదుర్కోవాలి? – శరత్‌కుమార్ (నెల్లూరు సిటీ నియోజకవర్గం) జగన్: ఈ ప్రశ్న ప్రతి మనస్సులో ఉంది. ఒకటే ఒకటి చెపుతున్నా. అన్యాయం ఎక్కువ రోజులు నిలబడదు. అన్యాయం చేసేవారికి దేవుడు శిక్ష వేస్తాడు.. రాత్రి పోయాక పగలు వస్తుంది.. మనం చేయాల్సింది ఒకటే.. ప్రతీ ఇంటికీ వెళ్లండి. చంద్రబాబు ఇచ్చే డబ్బుకు మోసపోవద్దని చెప్పండి. అన్న సీఎం అయితే జరిగే మేలును వారికి వివరించి చెప్పండి.. నచ్చజెప్పండి. అన్యాయమైన చంద్రబాబు ప్రభుత్వం ఎంత డబ్బు ఇచ్చినా బంగాళాఖాతంలో కలసిపోయేలా దేవుడే చేస్తాడు. నెల్లూరుజిల్లాలో యువత ఉద్యోగాలకోసం చెన్నై లాంటి నగరాలకు వెళ్తున్నారు. వారికి ఎలా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు? – గణేష్ (వెంకటగిరి–టీచర్స్ కాలనీ) జగన్: గణేష్ అడిగిన ప్రశ్నకు ఇంతకుముందే చెప్పా. రేప్పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏవిధంగా ఉద్యోగాలకోసం పాకులాడుతామో చెప్పాను. ప్రత్యేక హోదా గురించి చెపుతా.. హోదా ఇస్తామంటూ రాష్ట్రాన్ని విడగొట్టడం జరిగింది. ఆ తర్వాత మన రాష్ట్రాన్ని పట్టించుకోకుండా వదిలేయడం చూశాం. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ప్రత్యేకహోదాను చట్టంలో పొందుపరిచి ఉంటే కోర్టుకెళ్లి అయినా ప్రత్యేక హోదా తెచ్చుకునేవాళ్లం. తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చి మోసం చేసింది. టీడీపీని చూశాం. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండి పోరాటం చేయాల్సిన వ్యక్తి.. నాలుగేళ్లపాటు బీజేపీతో చిలకా గోరింకల్లా కాపురం చేసి ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి ఎన్నికల ముందు నల్లచొక్కా వేసుకుని ధర్మపోరాట దీక్షలంటూ మోసం చేస్తున్నాడు. ఇదే పవన్‌కల్యాణ్‌ను చూశాం.. ఎన్నికల ముందు బీజేపీ, చంద్రబాబుతో హామీలు అమలు చేయిస్తానని చెప్పాడు. తర్వాత వెన్నుపోటు పొడిచిన వారిలో భాగస్వామ్యమయ్యాడు. ఇక ఎవరినీ నమ్మొద్దు. మన రాష్ట్రానికి సంబంధించిన 25 మంది ఎంపీలను మొత్తంగా మన పార్టీయే తెచ్చుకునేలా చేయండి. అప్పుడు కేంద్రంలో ప్రత్యేక హోదా ఇస్తానని సంతకం పెట్టిన వారికే మద్దతిస్తాం.. ప్రత్యేక హోదా వస్తే హైదరాబాద్‌లా ఉద్యోగ విప్లవం వస్తుంది.. రాయితీలు వస్తాయి.. హోటళ్లు, పరిశ్రమలు, హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకుంటే ఇన్‌కంటాక్స్, జీఎస్టీలు చెల్లించాల్సిన అవసరం లేదు. -
రాష్ట్రంలో నేరగాళ్ల పాలన!
మీ సంతకాలూ ఫోర్జరీ కావచ్చు చంద్రబాబుకు మీ బ్యాంకు ఖాతా నెంబరు, మీ చెక్కు బుక్కు నెంబరు తెలుసు. మీ సంతకాలనే రేపు ఫోర్జరీ చేయవచ్చు. మీ ఆధార్ నెంబరు చంద్రబాబుకు తెలుసు. ప్రజల వ్యక్తిగత వివరాలు చంద్రబాబుకు సంబంధించిన ప్రైవేట్ కంపెనీల కంప్యూటర్లలో దొరుకుతుంటే ఇలాంటి వ్యక్తి సీఎంగా పని చేయడానికి అర్హుడేనా? – ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నెల్లూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: గోప్యంగా ఉంచాల్సిన ప్రజల వ్యక్తిగత డేటాను తనకు సన్నిహితులైన ఐటీ కంపెనీలకు బదలాయించి దొంగతనానికి పాల్పడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దొంగ... దొంగ!.. అని తమను తప్పుబడుతూ యాగీ చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తను చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు మన రాష్ట్ర పోలీసులను చంద్రబాబు వాచ్మెన్ల కన్నా దారుణంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండేందుకు ఒక్క క్షణం కూడా అర్హుడు కాదని ధ్వజమెత్తారు. ప్రజలకు సంబంధించిన ఆధార్, యూఐడీ డేటా ప్రభుత్వం వద్ద ఉంటుందని అలాంటి డేటా ప్రైవేట్ కంపెనీల కంప్యూటర్లలో దొరకడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబుతో సన్నిహితంగా వ్యవహరించే యాజమాన్యాలకు చెందిన బ్లూఫ్రాగ్, ఐటీ గ్రిడ్ అనే రెండు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ డేటా బదలాయించారని, సుప్రీంకోర్టు తీర్పునకు ఇది పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌ను ఈ రెండు సంస్థలే రూపొందించాయని గుర్తు చేశారు. అలాంటి సంస్థలకు ప్రజల వ్యక్తిగత డేటాను అప్పగించి టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారి ఓట్లను తొలగించే కార్యక్రమం చేపట్టారని, అదే రీతిలో దొంగ ఓట్లను కూడా చేరుస్తున్నారని చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయినప్పుడు చంద్రబాబు ఎలాగైతే మాట్లాడారో ఇపుడు డేటా తస్కరణలో చిక్కినప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం నెల్లూరులోని ఎస్వీజీఎస్ కళాశాల సెంటర్ మైదానంలో నిర్వహించిన సమర శంఖారావం సభలో జగన్ ప్రసంగిస్తూ చంద్రబాబు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే.... దొంగఓట్లను తొలగించమంటే వ్యవస్థలను నాశనం చేసినట్లా? ‘‘చంద్రబాబు పాలనలో ఇటీవల చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనలు వింటూ ఉంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఫలానా మంచి పని చేశా కాబట్టి ఓట్లేయండి అని అడిగే పరిస్థితి ఈ ముఖ్యమంత్రికి లేనే లేదు. ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేస్తే తనకు ఓట్లు పడతాయన్న నమ్మకం చంద్రబాబుకు లేదు. రాష్ట్రంలో అక్షరాలా 59.16 లక్షల దొంగ ఓట్లు నమోదయ్యాయంటే చంద్రబాబు ఏ స్థాయిలో వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారో తెలిసిపోతోంది. ఇందుకు వేరే ఉదాహరణ కూడా అవసరం లేదు. ఈ ఓట్లలో 20 లక్షల ఓట్లు తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రెండు చోట్లా ఓటర్లుగా నమోదైన వారికి. మరో 39 లక్షల పైచిలుకు ఓట్లు ఒక్క మన రాష్ట్రంలోనే రెండేసి ప్రాంతాల్లో ఉన్నాయని, ఈ డూప్లికేట్ ఓట్లను తొలగించాలని ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. దొంగ ఓట్లను ఏరి వేయాలని, తొలగించిన అర్హుల ఓట్లను మళ్లీ చేర్చాలని ఎన్నికల సంఘానికి అర్జీలు దాఖలు చేస్తే వ్యవస్థలను నాశనం చేస్తున్నట్లు చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు ఒకపక్క దొంగ ఓట్లను చేరుస్తూ మరోపక్క తనకు ఓట్లు వేయరని భావించే వారి ఓట్లను తొలగిస్తున్నారు. తానే దొంగతనం చేసి... దొంగ దొంగ దొంగ... అని మిద్దెలెక్కి అరవడం మొదలు పెడతారు. రాష్ట్రంలో ఈ పరిస్థితి కొనసాగుతోంది. మా చిన్నాన్న పేరూ తొలగించారు... ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారిలో మా చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి పేరు కూడా ఉంది. తాను ఓటరును కాదని, జాబితా నుంచి తొలగించాలని మా చిన్నాన్న అర్జీ పెట్టాడట. తాను ఏమన్నా చెల్లుబాటు అవుతుందని, ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు తోడుగా ఉన్నాయని, టీవీ–5తోపాటు ఎల్లో మీడియా తోడుగా ఉందని చంద్రబాబు ఆడుతున్నారు. తాను అన్యాయం చేస్తూ ఎదుటి వాళ్లు అన్యాయం చేస్తున్నారని అంటారు. తొలగించిన ఓటర్ల జాబితాలో వైఎస్ వివేకానందరెడ్డి పేరు ఉంది కానీ నారా లోకేష్ పేరు మాత్రం ఎక్కడా కనిపించదు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ వేల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వరకూ ఈ కుట్ర విస్తరించి ఉంది. ఓటర్ల కలర్ ఫోటోలతో కూడిన ఎన్నికల డేటా కేవలం ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉంటుంది. అలాంటి ఈ డేటా చంద్రబాబుకు సన్నిహితులైన ప్రైవేట్ కంపెనీల దగ్గర కూడా దొరుకుతోంది. ఆధార్, యూఐడీ డేటా కూడా ఈ ప్రైవేట్ కంపెనీల కంప్యూటర్లలో దొరుకుతోంది. ఇలాంటి డేటా చంద్రబాబుతో సన్నిహితంగా వ్యవహరించే ప్రైవేట్ కంపెనీల దగ్గర దొరుకుతూ ఉందంటే ఇదెంత పెద్ద నేరమో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నిస్సిగ్గుగా బుకాయింపు.... ప్రజలకు సంబంధించిన ఇలాంటి సున్నితమైన డేటా ప్రైవేట్ వ్యక్తులు, కంపెనీల ఆధీనంలో ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. అలాంటిది చంద్రబాబు ప్రైవేట్ కంపెనీల దగ్గర ఈ డేటా దొరుకుతూ ఉందంటే వీళ్లు ఏ స్థాయిలో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారో, నాశనం చేస్తున్నారో చెప్పటానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలా? అని అడుగుతున్నా. ఈరోజు ఒక దొంగ మన రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఒక రాక్షసుడు ఇవాళ మన రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఒక నేరగాడు పరిపాలిస్తూ ఉన్న అన్యాయమైన పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొని ఉంది. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తూ ఉన్నారు. ఓవైపు చేయకూడని పనులు చేస్తూ మరోవైపు నిస్సిగ్గుగా బుకాయిస్తున్నారు. అంతా కలసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం.. మనమంతా కలసి ఒక్కటై ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి సమయంలో కూడా చంద్రబాబును ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా మోస్తూనే ఉంది. చంద్రబాబు ఏం చేసినా ఈనాడుకు మాత్రం తప్పుగా అనిపించదు. ఆంధ్రజ్యోతికి తప్పుగా అనిపించదు. టీవీ –5కి తప్పుగా అనిపించదు. ఇలాంటి సున్నితమైన, ప్రజలకు సంబంధించిన డేటా చంద్రబాబు ప్రైవేటు కంపెనీల కంప్యూటర్లలో కనిపిస్తే మామూలుగా అయితే గొడవ చేయాలి, గోల చేయాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడానికి ఈ పత్రికలు, మీడియా ముందుండాలి. కానీ చంద్రబాబునాయుడినే వారు భుజాన పెట్టుకుని మోస్తూ ఉంటారు. బాబు చేసింది తీవ్రమేన నేరమే.. చంద్రబాబు ఇప్పుడు చేసిన నేరం చాలా తీవ్రమైనది. మీ బ్యాంకు ఖాతా నెంబరు, మీ చెక్కుబుక్కు నెంబరు చంద్రబాబుకు తెలుసు. మీ సంతకాలనే రేపు ఫోర్జరీ చేయవచ్చు. మీ ఆధార్ నెంబరు చంద్రబాబుకు తెలుసు. ఇలాంటి సున్నితమైన వివరాలు చంద్రబాబుకు సంబంధించిన ప్రైవేట్ కంపెనీల కంప్యూటర్లలో దొరుకుతుంటే ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పని చేయడానికి అర్హుడేనా? అని మీ అందరి తరపునా అడుగుతున్నా. సాధారణంగా ఇలాంటి నేరాలు చేసేవారిని దొంగ అని అంటాం. మీకు తెలియకుండా మీ బ్యాంకు ఖాతా వివరాలు ఇతరుల దగ్గర ఉన్నాయంటే ఆ వ్యక్తిని మనం దొంగ అంటాం. కానీ ఈరోజు మన ఖర్మ ఏంటంటే ఈ వ్యక్తిని మనం ముఖ్యమంత్రి అంటున్నాం. ఆయన కుమారుడిని ఐటీ మంత్రి అని అంటూ ఉన్నాం. ప్రజల డేటా ప్రైవేట్ కంపెనీలకా? బదలాయించ కూడని ఈ డేటాను ప్రైవేటు కంపెనీలకు ఎందుకు ఇచ్చావు? అని మీ అందరి తరపున చంద్రబాబును అడుగుతున్నా. బ్లూ ఫ్రాగ్, ఐటీ గ్రిడ్స్ ఇండియా ఈ రెండూ ప్రైవేటు కంపెనీలే. ఈ రెండు కంపెనీల వాళ్లే టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌ను కూడా రూపొందించారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన గోప్యమైన డేటా ఈ రెండు కంపెనీల దగ్గర ఎలా ఉంది? అని మీ అందరి తరపునా చంద్రబాబును అడుగుతున్నా. ఈ కంపెనీలు ఎవరివి? ఎవరు పెట్టించినవి? ఆ కంపెనీల యజమానులకు చంద్రబాబుకు, లోకేష్ కు ఉన్న సంబంధాలేమిటి? అని మీ అందరి తరపున నిలదీస్తున్నా. ఈ కంపెనీల యాజమాన్యాలు వందల సార్లు సీఎంను కలిశాయి. ఈ కంపెనీల యాజమాన్యాలతో చంద్రబాబు, లోకేష్ దిగిన ఫోటోలు ఏం సంకేతాలు ఇస్తున్నాయి? రాష్ట్ర పౌరుల వ్యక్తిగత డేటాతో ఈ కంపెనీలకు ఏం సంబంధం ఉంది? వాటికి ఈ డేటాను ఎవరు ఇచ్చారు? ఎందుకు బదలాయించారు? అని అడుగుతున్నా. చట్ట విరుద్ధంగా ఈ డేటా ఆ కంపెనీల దగ్గర ఎందుకు ఉంది? అని ప్రశ్నిస్తున్నా. డేటా చౌర్యానికి శిక్ష విధించవద్దా? ఈ డేటాను దొంగతనం చేయడం నేరం కాదా? ఈ నేరం చేసిన కంపెనీలకు, చేయించిన చంద్రబాబుకు శిక్ష పడాల్సిన పని లేదా? అని అడుగుతున్నా. ఈ కంపెనీలు చేస్తున్నది అన్యాయమని గుర్తించిన తెలంగాణ పోలీసులు దాడులు చేస్తే.. ఆ కంపెనీల యాజమాన్యాలు చంద్రబాబుకు వాట్సాప్‌లో మెసేజ్ పంపించాయి. మెసేజ్ అందిన క్షణాల్లోనే చంద్రబాబు ఏపీ పోలీసులను అక్కడికి పంపించారు. తను చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు, డేటా బయటకు రాకుండా మన రాష్ట్ర పోలీసులను చంద్రబాబు వాచ్మెన్ల కన్నా దారుణంగా వాడుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తి అసలు ముఖ్యమంత్రి పదవిలో ఉండదగ్గ వ్యక్తేనా? పోలీసులకు గౌరవం ఇవ్వాల్సింది పోయి వారిని రౌడీ మూకల మాదిరిగా వాడుకునే కార్యక్రమం చేస్తున్న ఈ పెద్దమనిషి ముఖ్యమంత్రి పదవిలో ఒక్క క్షణం కూడా కూర్చోవడానికి అర్హుడు కాదు. టీడీపీ యాప్‌తో ఆ నాలుగు డేటాల అనుసంధానం ఆధార్, ఫోటో ఎలక్టోరల్ డేటా, పల్స్ సర్వే డేటా, బ్యాంకు ఖాతాల డేటాలను టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌తో అనుసంధానం చేశారు. టీడీపీ యాప్‌లో రిజిస్టర్డ్ అయి ఉన్న టీడీపీ నేతలకు ఆ డేటాను పంపి ఆయా గ్రామాల్లో ఈ ఓటర్లు ఎవరు? ఏ పార్టీకి చెందిన వారు? ఎవరికి అనుకూలం? అని సర్వేలు చేస్తూ వ్యతిరేకుల ఓట్లను తొలగించడం, దొంగ ఓట్లను నమోదు చేయడం లాంటి చర్యలకు దిగుతున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి? అని చంద్రబాబును అడిగితే జవాబు చెప్పడు కానీ సెల్‌ఫోనే నేనే కనిపెట్టా, హైదరాబాద్‌ను నేనే కట్టా అని అంటాడు. డేటా గురించి నాకు నేర్పుతారా? అంటాడు. డేటా అనేది ఆయన సొత్తు అన్నట్లుగా మాట్లాడతాడు. డేటాను దొంగతనం చేస్తూ పట్టుబడిన చంద్రబాబు ప్రజలకు కనీసం క్షమాపణ చెబుతామన్న ఆలోచన కూడా రాదు. దొంగ దొంగ.. అని అరుస్తూ ఇతరులపై నెపాన్ని నెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అర్హులను ఓటర్లుగా చేర్చడంతోపాటు దొంగ ఓట్లను తొలగించాలని మనం ఈసీని కోరుతుంటే మనం అడిగేది తప్పు అని చంద్రబాబు అంటున్నారు. ఈనాడు పత్రిక చూసినపుడు ఆశ్చర్యం కలిగింది.. ఈరోజు ఈనాడు పత్రిక చూసినపుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు ఎవరు తప్పు చేశారు? ఎవరిని అంటున్నారు? అని ఆశ్చర్యం అనిపించింది. అందుకు కారణం ఏమిటంటే ఆ ప్రైవేటు కంపెనీలు చంద్రబాబుకు సన్నిహితమైనవి కావడమే. చట్ట విరుద్ధంగా ఈ డేటాను ప్రభుత్వం ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా ఇది నేరం. తప్పు చేసి పట్టుబడిన చంద్రబాబు తాను క్షమాపణ చెప్పాల్సింది పోయి మనదే తప్పు అంటూ మాట్లాడుతున్నాడు. మనదే తప్పనట్లుగా చంద్రబాబు బురద జల్లడానికి కారణం ఉంది. వీటిపై ఎంక్వయిరీ జరగ కూడదు, దొంగ ఓట్లు అలాగే కొనసాగాలి అని దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలకు చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు , టీవీ 5 లాంటి ఎల్లో మీడియా వంత పాడుతోందంటే అసలు వీళ్లంతా కూడా మనుషులేనా? అని మీ అందరి తరపున ప్రశ్నిస్తున్నా. ఓటుకు కోట్లులో చిక్కినప్పుడు కూడా ఇలాగే.. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయినపుడు కూడా చంద్రబాబు ఇలాగే మాట్లాడారు. సెక్షన్ 8 అంటాడు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంటాడు. ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఆంధ్రా కంపెనీలపై దాడులు చేయడం ఏమిటని ఈ పెద్దమనిషి ప్రశ్నిస్తాడు. ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపుల సాక్షిగా అడ్డంగా దొరికి పోయి ఆ వివరాలు టీవీల్లో ప్రసారం అయ్యేటప్పుడు కూడా చంద్రబాబు ఇలాగే మాట్లాడారు. మళ్లీ ఇవాళ దొంగతనం చేస్తూ పట్టుబడినపుడు కూడా మళ్లీ అవే మాటలు మాట్లాడుతున్నాడు. ఇలాంటి సిగ్గుమాలిన మనిషి చంద్రబాబు. తనకు ఓట్లేయరనుకుంటే చంపిస్తాడేమో! ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎవరైనా తనకు ఓటు వేయని మనుషులను కూడా చంద్రబాబు చంపిస్తారేమో! గ్రామాలను కూడా తగల బెట్టిస్తారేమో! ఈ పెద్దమనిషి పాలన చూస్తూంటే పూర్వకాలంలో బకాసురుడి పాలన, నరకాసురుడి పాలనకు సంబంధిన కథలు గుర్తుకొస్తున్నాయి. ఈ రోజు రాష్ట్రంలో నారాసురుడి పాలనను చూస్తున్నాం. చంద్రబాబు పాలనలో వ్యవస్థ ఎంతగా దిగజారి పోయిందంటే... తన పార్టీ వారు కాదనుకున్న వారికి మొదట రేషన్ కార్డులు తీసేశాడు. తన పార్టీ వాళ్లు కాదనుకుంటే పింఛన్లు కూడా కత్తిరిస్తూ ఉన్నారు. తన పార్టీ వారు కాదనుకుంటే నిరుపేదలు కట్టుకుంటున్న ఇళ్లకు చివరకు డబ్బులివ్వకుండా ఆపేస్తున్నారు. తన పార్టీ వారు కాదనుకుంటే వెబ్‌ల్యాండ్ పేరుతో ప్రతి ఒక్కరి భూములకు ఎసరు పెట్టే కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. తన పార్టీ వారికి గ్రామాలను దోచుకునేందుకు లైసెన్సులు ఇచ్చేశాడు. జన్మభూమి కమిటీలని పేరు పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లుగా కొనుగోలు చేశాడు. వారితో రాజీనామా చేయించడు, అనర్హత వేటు వేయడు. వారిని ఎన్నికల్లో తన పార్టీ గుర్తుపై పోటీ చేయించే ధైర్యం చేయడు. వారిలో నలుగురిని మంత్రులుగా కూడా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశాడు. మీకు తగిలిన ప్రతి గాయం నా గుండెకూ తగిలింది... ఈ సందర్భంగా నా కుటుంబ సభ్యులైన ప్రతి బూత్ కమిటీ సభ్యునికీ ముందుగా రెండు చేతులు జోడించి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. ప్రతిపక్షంలో ఉన్న 9 ఏళ్లలో మీరంతా నాకు అండగా నిలిచారు. అధికారంలో ఉన్న వారు మిమ్మల్ని ఎన్ని కష్టాలు, బాధలు పెట్టారో నాకు తెలుసు. మీరెంత నష్ట పోయారో కూడా నాకు బాగా తెలుసు. 13 జిల్లాల్లో మన ప్రతి కార్యకర్తా ఎన్ని కష్టాలు పడ్డారో... ఎన్ని అవమానాలను సహించారో కూడా తెలుసు. కొందరు లాఠీ దెబ్బలు తిన్నారు. మరి కొందరు ఆస్తులు పోగొట్టుకున్నారు. కొందరు తమ కుటుంబ సభ్యులను కూడా పోగొట్టుకున్నారు. మీ ప్రతి కష్టాన్ని, నష్టాన్ని నేను చూశా. మీకు తగిలిన ప్రతి గాయం నా గుండెకూ తగిలింది. రేపు దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మీ బాగోగులను నేను చూసుకుంటానని మాట ఇస్తున్నా. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా మీకు అండగా ఉండి పైకి తీసుకొచ్చుకుంటా అని హామీ ఇస్తున్నా. ప్రతి బూత్ కమిటీ సభ్యుడికీ ఇదే చెబుతున్నా. మీమీద పెట్టిన అక్రమ కేసులు, దొంగ కేసులన్నింటినీ పూర్తిగా ఎత్తేస్తామని హామీ ఇస్తున్నా. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి సంక్షేమ పథకం ప్రజలందరికీ అందాలి. ఆ సంక్షేమ పథకాలను పేదవాడికి అందించేటపుడు కులాన్ని చూడకూడదు, మతాలు చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు. చివరకు ఏ పార్టీ వారు? అనేది కూడా చూడకూడదని మీ అందరికీ చెబుతున్నా. మీరే ముందుండి ఈ పథకాలన్నీ ప్రజలకు అందించేలా చేస్తానని చెబుతున్నా. అవినీతి లేని స్వచ్ఛమైన పాలన మన హయాంలో రావాలి. అలాంటి పాలనకు దిక్సూచిగా మీరే నిలబడతారని హామీ ఇస్తున్నా‘‘ -
నేడు నెల్లూరులో సమర శంఖారావం
-
నేడు నెల్లూరులో సమర శంఖారావం
నెల్లూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ఏ క్షణం లోనైనా వెలువడనున్న తరుణంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళ వారం వైఎస్సార్సీపీ సమర శంఖారావం పూరిం చనుంది. కార్యక్రమం నిర్వహణ కోసం జిల్లా కేంద్రంలో భారీగా ఏర్పాట్లు జరుగు తున్నాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్తేజితులను చేస్తూ దిశా నిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో సమర శంఖారావ సభలు నిర్వహించిన వైఎస్సార్సీపీ నెల్లూరులో నాలుగో సభకు సన్నాహాలు పూర్తి చేసింది. జిల్లాలోని పది శాసనసభా నియోజకవర్గాల్లో ఇప్పటికే అన్ని పోలింగ్ బూత్‌లకూ కమిటీలు వాటికి కన్వీనర్లను నియమించారు. వీరంతా మంగళవారం సాయంత్రం జరిగే శంఖారావం సభకు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా పేర్ల తొలగింపు, ఓటర్ల డూప్లికేటింగ్‌తో పాటుగా అనేక అవకతవకలు జరిగినట్లుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులను దిగువ క్షేత్ర స్థాయిలో మరింత అప్రమత్తంగా ఉండే విధంగా వారిని జగన్ కార్యశీలురను చేయనున్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటూ ఉందో లేదో తెలుసుకోవడంతో పాటుగా ఎక్కడైనా అక్రమాలు జరిగి పేర్లు తొలగింపునకు గురై ఉంటే వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని జగన్ ఉద్భోదించబోతున్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐదేళ్ల పాలనలో అందరినీ మోసగించిన తీరుపై ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేసేలా జగన్ పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేయనున్నారు. నాలుగో శంఖారావం జగన్ ఇప్పటికి మూడు జిల్లాల్లో సమర శంఖారావం కార్యక్రమాలను నిర్వహించారు. గత నెల 6వ తేదీన తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామి పాదాల చెంత తొలి సమర శంఖారావాన్ని పూరించారు. ఫిబ్రవరి 7వ తేదీన కడపలోనూ, 11వ తేదీన అనంతపురంలోనూ సమర శంఖారావం కార్యక్రమాలను నిర్వహించి కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపారు. నాలుగో శంఖారావాన్ని నెల్లూరులో నిర్వహించబోతున్నారు. పార్టీ సీనియర్ నేతలు, సజ్జల రామకృష్ణారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, కాకాణి గోవర్థన్‌రెడ్డితో సహా పలువురు నేతలు మంగళవారం జరగాల్సిన శంఖారావం కార్యక్రమ ఏర్పాట్లను ఇప్పటికే సమీక్షించారు. నేటి కార్యక్రమం ఇలా... పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో బయలుదేరి ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా నెల్లూరు నగరంలోని ఎస్వీజీఎస్ కళాశాల సెంటర్ వద్ద మైదానం చేరుకుని మధ్యాహ్నం 1 గంటకు జరిగే ‘సమర శంఖారావం’ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తరువాత బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. -
సమర శంఖారావానికి సింహపురి సిద్ధం
సాక్షి, నెల్లూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న సమర శంఖారావం సభకు నెల్లూరు ముస్తావుతోంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, బూత్‌కమిటీ సభ్యులతో మాట్లాడనున్నారు. ఎన్టీఆర్ నగర్ సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో మంగళవారం జరిగే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభకు వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తదితరులు సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ.. నెల్లూరులో సమర శంఖారావం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదస్సును విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ....ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారు. ఓటర్ల జాబితాలో వైఎస్సార్ సీపీ అభిమానుల ఓట్లను తొలగిస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లో పలువురికి ఓట్లు ఉన్నాయి. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. ఎన్నికలలో బూత్ కమిటీ సభ్యులే కీలకపాత్ర పోషించాలని అని పిలుపునిచ్చారు. -
హామీల గురించి ప్రశ్నిస్తే దాడులా?
సాక్షి, అనంతపురం: సీఎం చంద్రబాబు నాయుడు నోరు విప్పితే అన్నీ అబద్దాలేనని, అబద్ధాలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజే ముద్దన్న చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ది చెప్పాలన్నారు. ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో తలపెట్టిన ఎన్నికల ‘సమర శంఖారావం’లో పాల్గొన్న ఆయన మోసపూరిత చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా 600కిపైగా హామీలిచ్చారని, కానీ అందులో ఆరు హామీలు కూడా అమలు చేయలేదని ఆరోపించారు. టీడీపీ హామీల గురించి ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేసే ప్రసక్తే లేదని సాక్షాత్తు మంత్రి పరిటాల సునీతే ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గుర్తు చేశారు. -
వాచ్మెన్, స్వీపర్లకే నిరుద్యోగులు పరిమితమా : జగన్
సాక్షి, అనంతపురం : వాచ్మెన్లు, స్వీపర్లకే అనంతపురం నిరుద్యోగులను పరిమితం చేయడం దుర్మార్గమని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అన్న పిలుపు’లో భాగంగా సోమవారం ఆయన అనంతపురంలో తటస్థులతో సమావేశమయ్యారు. నగరంలోని శ్రీ 7 కన్వెన్షన్ హాలులో జరిగిన ఈ ముఖాముఖిలో తటస్థులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై వైఎస్ జగన్ భరోసా కల్పించారు. కియా కార్ల పరిశ్రమతో.. కియా కార్ల పరిశ్రమ వల్ల ఏం ప్రయోజనం లేదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు. అనంతపురం నిరుద్యోగులను వాచ్మెన్లు, స్వీపర్లకే పరిమితం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చట్టం చేస్తామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లను మూసివేస్తోందని, విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు ఇవ్వడం లేదని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్య, వైద్య సదుపాయాలు పెంచుతామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని, ఉపాధి హామీ కూలీల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల కొరత సిగ్గు చేటని, రూ. 20 కోట్ల బకాయిలు తనకే రావాలని సాక్షాత్తు మోహన్ బాబు వంటి వారు ఆవేదన చెందుతున్నారన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే కాలేజీలు ఎలా నడుస్తాయని ప్రశ్నించారు. తాను ప్రభుత్వాస్పత్రికి వెళ్లేలా.. ప్రభుత్వ ఆసుపత్రులన్నీ వృథా అన్నట్లు టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, లోకేష్ కనుసన్నల్లో నడిచే మెడాల్ సంస్థకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తపరీక్ష కాంట్రాక్టు పనులు అప్పగించి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే వైద్య వ్యవస్థలో సమూల ప్రక్షాళన చేస్తామన్నారు. తాను కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేసుకునే స్థాయికి తీసుకెళ్తానన్నారు. సర్కార్ ఆసుపత్రుల్లో అన్ని మౌళిక సదుపాయాలు కల్పించి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం చేయించుకునేలా వ్యవస్థలో మార్పు తీసుకొస్తామన్నారు. రాజకీయాల్లో విలువలు తేవాలన్న వైఎస్ జగన్ సంకల్పం అభిందనీయమని, తమ అభిప్రాయం తీసుకోవడం శుభపరిణామమని ఈ సందర్భంగా తటస్థులు కొనియాడారు. -
అనంతలో తటస్థులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అనంతపురం : ‘అన్న పిలుపు’లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తటస్థులతో సమావేశం అయ్యారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న తటస్థులతో ఆయన నగరంలోని శ్రీ 7 కన్వెన్షన్ హాలులో ముఖాముఖి నిర్వహించారు. ప్రతి జిల్లాలోనూ ఏ రాజకీయ పార్టీకి చెందని తటస్థ వర్గాలతో స్థానిక సమస్యలు, సమాజంలోని ఇతర అంశాలపై సమస్యలను ఆసక్తిగా తెలుసుకుని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జరిగే మేలు గురించి వైఎస్ జగన్ వివరించారు. ఈ సమావేశం అనంతరం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో ‘సమర శంఖారావం’ సభలో పాల్గొంటారు. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో సమర శంఖారావం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
నేడు అనంతపురంలో ‘సమర శంఖారావం’
-
అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు: వైఎస్ జగన్
సాక్షి, కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. సీపీఎస్‌పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వైఎస్ జగన్ గురువారం కడపలోని గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో తటస్థులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. కమిటీల పేరుతో జాప్యం చేయమని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రెగ్యులరైజ్ చేస్తామని, వ్యవస్థల్లో అవినీతి లేకుండా, పరిపాలనలో పారదర్శక విధానానికి పెద్దపీట వేస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో న్యాయవాది జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... 2008లో వెయ్యి పోస్టులతో మాత్రమే జూనియర్ లెక్చరర్ పోస్టులు వేశారని తెలిపారు. పదేళ్లుగా జూనియర్ లెక్చరర్ పోస్టుల ఊసే లేదన్నారు. ‘రాష్ట్రంలో 5 లక్షల మంది పోస్టు గ్రాడ్యుయేట్లు ఉన్నారు. కేవలం మొన్న మాత్రమే 240 పోస్టులు చంద్రబాబు వేశారు. ఇది చాలా అన్యాయం. యూనివర్శిటీలో విద్యార్థులకు ఫెలోషిప్‌లు రావడంలేదు. జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీ లేనందువల్లే రాష్ట్రంలో కార్పొరేట్ విద్య వేళ్లూనుకుంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక నోటిఫికేషన్లు ఇచ్చి పోస్టులు భర్తీ చేయాలని కోరారు. అదే విధంగా ఫీజు బకాయిలు రద్దు చేసి, పీహెచ్డీ స్కాలర్స్‌కు రూ.5 వేలు, పీజీ విద్యార్థులకు రూ.3వేలు ఇవ్వాలని కోరుతున్నాన్నారు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం జగదీశ్వర్ రెడ్డి ప్రస్తావించిన అంశాలపై వైఎస్ జగన్ స్పందిస్తూ... ‘జూనియర్ లెక్చరర్ పోస్టులే కాదు.. ఐదేళ్లుగా ఏ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. మేము అధికారంలోకి రాగానే ఉద్యోగాల భర్తీ మీద పూర్తి డ్రైవ్ చేస్తాం. 2.42 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామన్న అంశంపై లెక్కలు కూడా చూపుతాం. గ్రామ సెక్రటేరియట్లలో 10 మంది అదే గ్రామానికి చెందిన వారికి ఉద్యోగాలు ఇస్తాం. లంచాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ పథకాలు ఇస్తాం. నవరత్నాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను నేరుగా వీరి ద్వారా డోర్ డెలివరీ చేస్తాం. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తాం. ఈ విషయంపై మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకువస్తాం’ అని హామీ ఇచ్చారు. సీపీఎస్‌ను రద్దు చేస్తాం ముఖాముఖిలో భాగంగా చిన్నారెడ్డి అనే రిటైర్డ్ విద్యాధికారి ఉద్యోగుల సమస్యల గురించి ప్రస్తావించారు. ‘2018 నాటి మొదటి డీఏ ఫిబ్రవరిలో ఇచ్చారు. మళ్లీ దీన్ని ఏప్రిల్ నుంచి అమలు చేస్తారంట. దాన్ని కూడా మూడు విడతలుగా చేస్తారంట. ఆరు నెలలకు ఇచ్చే డీఏ కూడా సక్రమంగా ఇవ్వడం లేదు’ అని వాపోయారు. 2018 లో పీఆర్సీతో పాటు ఐఆర్ కూడా ఇవ్వాల్సిందన్నారు. గతంలో వైఎస్సార్ 22 శాతం ఇచ్చారని గుర్తుచేశారు. సీపీఎస్‌ను తొలగించాలని కోరారు. పాత పెన్షన్ విధానాన్ని తీసుకువస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రైతులకు ప్రతీ మేలో రూ.12500 ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం అని ప్రశంసించారు. ఇందుకు స్పందనగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... ‘ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా ఉన్నాను. అనేక సందర్భాల్లో ఈ సమస్యలపై నేను స్పందించాను. సీపీఎస్ మీద ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోగా సీపీఎస్‌ను తొలగిస్తాం. చంద్రబాబుకు ఈ విషయంపై చిత్తశుద్ది లేదు. అందుకే కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నాడు. నాన్నగారిని ఇవ్వాల్టికీ ఉద్యోగులు అభిమానిస్తారు. ఆయన పేరు నిలబెట్టేలా నేను ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉంటాను. ఉద్యోగస్తులు చల్లగా ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని నమ్మే మనిషిని నేను’ అని వ్యాఖ్యానించారు. రైతులకు గుర్తింపు నంబరు ఉండాలి.. మార్కెటింగ్ విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చైతన్య మహిళా సొసైటీకి చెందిన లక్ష్మి మాట్లాడుతూ... ‘రైతుకు గుర్తింపు నంబరు ఉండాలి. తద్వారా ఏ పంట వేస్తున్నాడు. దిగుబడి ఎంత వస్తోంది అన్న అంశాలు సులభంగా తెలుసుకోవచ్చు. వచ్చే పంటను గ్రేడింగ్ చేయాలి. దీనివల్ల చాలావరకు దళారీ వ్యవస్థను నిర్మూలించవచ్చు. రైతులు మోసపోకుండా కూడా చూడవచ్చు’ అని అభిప్రాయపడ్డారు. ప్రతి రైతుకు మద్దతు ధర లభించాలని.. మార్కెటింగ్ విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై వైఎస్ జగన్ మాట్లాడుతూ... ‘ మార్కెటింగ్ పరంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పాదయాత్రలో అనేకసార్లు ప్రస్తావించాను. దళారుల కారణంగా రైతులు నష్టపోతున్నారు. అదే పంట హెరిటేజ్ షాపులోకి వెళ్లే సరికి ధరలు భారీగా ఉంటున్నాయి. పలాస జీడిపప్పే దీనికి ఉదాహరణ. అక్కడి ధరకు, మార్కెట్ ధరకు రెట్టింపు తేడా ఉంటోంది. ముఖ్యమంత్రి అనే వ్యక్తి దళారీ వ్యవస్థను కట్టడి చేయాలి. మన ఖర్మ ఏంటంటే.. మన ముఖ్యమంత్రికి హెరిటేజ్ షాపులు ఉన్నాయి. తానే దళారీలకు కెప్టెన్ అయ్యాడు. నాన్న హయాంలో రైతులకు మంచి గిట్టుబాటు ధరలు వచ్చాయి. చిత్తూరులో తోతాపురి రైతులకు ఇదే జరుగుతుంది. గల్లా, ఆదికేశవుల కుటుంబాలే.. రైతులనుంచి మామిడిని కొంటున్నాయి. ఇక రైతుకు గిట్టుబాటు ధరలు ఎలా వస్తాయి? మేం అధికారంలోకి వచ్చాక వీటన్నింటినీ సమీక్షిస్తాం’ అని హామీ ఇచ్చారు. అవినీతికి తావులేని వ్యవస్థలను తీసుకొస్తాం ముఖాముఖి కార్యక్రమంలో డిగ్రీ కాలేజీ లెక్చరర్ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ సైనికులు ఎలా పనిచేస్తున్నారో మేం కూడా సమాజం కోసం అంతే చేస్తున్నాం. కానీ ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తోంది. కర్ణాటక సహా కొన్ని రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను తప్పకుండా రెగ్యులరైజ్ చేయాలని కోర్టులు చెప్తున్నాయి. యనమల రామకృష్ణుడు కమిటీ అంతా ఒక బోగస్‌లా నడుస్తోంది. సేవారంగం, సంక్షేమ పథకాలపై మీరు చాలా దృష్టిపెడుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై మీ భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించాలి’ అని కోరారు. ఇందుకు స్పందనగా వైఎస్ జగన్.. ‘ కాంట్రాక్ట్ ఉద్యోగులపై చాలా పాజిటివ్‌గా ఉన్నాం. ఎక్కడ అవకాశం ఉంటే.. అక్కడ వారిని రెగ్యులరైజ్ చేస్తాం. వారి అర్హత, పనిచేసిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. విద్యుత్, విద్యా రంగాలు.. మరే ఇతర రంగమైనా కావచ్చు ఇవి అమలు చేస్తాం. గ్రామ సెక్రటేరియట్ సంక్షేమ పథకం కాదు. విప్తవాత్మక అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామ సెక్రటేరియట్ కీలకంగా వ్యవహరిస్తుంది. పెన్షన్ల నుంచి మరుగు దొడ్ల వరకూ లంచాలు వసూలు చేస్తున్నారు. జన్మభూమి కమిటీల మాఫియా భరించలేని స్థాయికి చేరింది. ఈ వ్యవస్థలు ఇలా ఉంటే.. అభివృద్ధి సాధ్యం కాదు కదా. మనం అధికారంలోకి రాగానే అభివృద్ధి అజెండాలో భాగంగానే అవినీతికి తావులేని వ్యవస్థలను తీసుకొస్తాం’ అని పేర్కొన్నారు. -
తటస్థులతో వైఎస్ జగన్ సమావేశం
కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తటస్థులు, మేధావులు, సామాజిక కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించారు. కడపలో ఇవాళ మధ్యాహ్నం గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో తటస్థ ప్రభావితులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘మిమ్మల్ని అందర్నీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ ప్రాంతాల్లో మీరంతా మంచి చేయడం చాలా సంతోషం. మిమ్మల్ని అందర్నీ కలవాలని మీకు లేఖలు రాశాను. ప్రజలకు మరింత మంచి చేసేలా సలహాలు, సూచనలు ఇవ్వండి. మీతో అనుబంధం ఈ ఒక్క సమావేశానికే పరిమితం చేయాలని అనుకోవడంలేదు. ఈ ప్రయాణం జీవితకాలం అంతా ఉండాలని కోరుకుంటున్నా. రాష్ట్రంలో కొనసాగుతున్న పాలన, ఈ పరిస్థితిని మార్చేందుకు సలహాలు, సూచనలు ఇవ్వండి’ అంటూ వైఎస్ జగన్ తటస్థులను కోరారు. ఈ సమావేశం అనంతరం బూత్ కమిటీ కన్వీనర్లు, పార్టీ శ్రేణులతో మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొంటారు. -
నేడు కడపలో సమర శంఖారావం
-
నాన్నగారు చనిపోతూ ఇచ్చిన అతిపెద్ద కుటుంబం మీరే
-
కడపలో నేడు సమరశంఖారావం
సాక్షి ప్రతినిధి కడప: కడపలో వైఎస్సార్సీపీ నేతృత్వంలో సమరశంఖారావం చేపట్టనున్నారు. మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి 13 జిల్లాల్లో కేడర్‌ను కార్యోన్మోఖులను చేసేందుకు సమరశంఖారావం సభలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. ఆ మేరకు కడపలో గురువారం నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుంచి కడపకు విమానంలో రానున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 11 గంటలకు గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో తటస్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. మ. 1 గంటకు బూత్ కమిటీ కన్వీనర్లు, పార్టీ శ్రేణులతో మున్సిపల్ స్టేడియంలో సభ ఏర్పాటు చేశారు. బూత్ కమిటీ సభ్యులతో సంభాషించేలా నాలుగు వైపులా ర్యాంపులు ఏర్పాటు చేశారు. ఇది వరకు ఏ బహిరంగ సభలకూ లేని విధంగా ఈ సభకు ఇలాంటి ప్రత్యేక సదుపాయం కల్పించారు. జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల వారికి ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి 2,500 మంది చొప్పున 25 వేల మందికి ఏర్పాట్లు చేశారు. సభా వేదికతోపాటు, ప్రాంగణాన్నంతా వైఎస్సార్సీపీ జెండాలోని ఆకుపచ్చ, తెలుపు, నీలివర్ణాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కాగా, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
సమర శంఖారావం గ్రాండ్ సక్సెస్
తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించడమే లక్ష్యంగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తిరుపతి వేదికగా పూరించిన సమర శంఖారావం సభ గ్రాండ్ సక్సెస్ అయింది. వైఎస్ జగన్ ప్రసంగంతో కార్యకర్తలు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేసింది. వేలాది మంది బూత్ కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులతో సమర శంఖారావం సభ కిటకిటలాడింది. వచ్చే ఎన్నికల సమరాన్ని ఎదుర్కోవడానికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడంలో ప్రతిపక్ష నేత సఫలీకృతమయ్యారు. ప్రజా సమస్యలపైనా, రాష్ట్ర ప్రయోజనాలపైనా వైఎస్ జగన్ చేసిన పోరాటాలు ఫలించాయని కార్యకర్తల కదన కుతూహలంతో స్పష్టమైంది. ప్రజా సమస్యలపైనే కాకుండా పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా వైఎస్ జగన్ అంతర్లీనంగా ఎంత దృష్టి సారించారో వెల్లడైంది. వేలాది మంది బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లు, ముఖ్య కార్యకర్తలు, నేతలు హాజరైన సభను చూసినప్పుడు ప్రతి పల్లెలోనూ అధికార పార్టీ దాష్టీకాలకు ఎదురొడ్డి పోరాడే కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీకి లభించారని తేటతెల్లమైంది. కార్యకర్తల్లోనే కాకుండా పార్టీ నేతల్లోనూ, ఎమ్మెల్యేల్లోనూ, ప్రజాప్రతినిధుల్లోనూ ఆత్మవిశ్వాసం అదే స్థాయిలో కనిపించింది. కీలక సమయాల్లో దిశానిర్దేశం చేయగలిగిన నాయకుడుగా వైఎస్ జగన్ ఉండటం, ఆయన సై అంటే ముందుకు ఉరికే కార్యకర్తల బలం చూస్తే వచ్చే ఎన్నికలను అలవోకగా ఎదుర్కోగలమనే ధీమాను పలువురు సీనియర్ నాయకులు వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. అధికార పార్టీకి ఎప్పుడు గుణపాఠం చెబుదామా అని కార్యకర్తలు ఎదురుచూస్తున్నట్లుగా ఉందని సమర శంఖారావం సభ విజయవంతం అయిన తీరు చెప్పకనే చెప్పింది. తిరుపతిలో తొలి సమర శంఖారావం సభ భారీగా విజయవంతమైన నేపథ్యంలో ఇక నేడు వైఎస్సార్ జిల్లాలో కూడా అదే స్థాయిలో సభ జరుగుతుందని పార్టీ నేతలు అంటున్నారు. -
11, 12, 13 తేదీల్లో వైఎస్సార్సీపీ సమరశంఖారావం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 11, 12, 13వ తేదీల్లో అనంతపురం, పీఎస్సార్ నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖారావం సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారు. ‘జగనన్న పిలుపు’అనే కార్యక్రమంలో భాగంగా తటస్తులైన ఓటర్లకు ఆయన ఇదివరకే లేఖలు రాసిన విషయం తెలిసిందే. తటస్తులు హాజరయ్యే ఈ సమావేశంలో వైఎస్ జగన్ తొలుత పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత పోలింగ్ బూత్ స్థాయి పార్టీ శ్రేణుల సమావేశంలో జగన్ పాల్గొని, వారిని ఎన్నికలకు సమాయత్తం చేస్తారు. 6, 7 తేదీల్లో చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ముందుగా ప్రకటించిన విధంగానే ఈ నెల 6న తిరుపతి (చిత్తూరు జిల్లా)లో సమరశంఖారావం సమావేశాలు జరుగుతాయి. ఈ నెల 7న వైఎస్సార్ కడప జిల్లాలో జరుగుతాయి. ఈరెండు చోట్లా జగన్ పాల్గొని తటస్తులు, పార్టీ శ్రేణులతో విడిగా సమావేశమై ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
నేడే సార్వత్రిక శంఖారావం
ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్న కలెక్టర్ 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ 19 వరకు స్వీకరణ జ21న పరిశీలన, 23న ఉపసంహరణ మే 7న పోలింగ్, 16న కౌంటింగ్ విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికల సమర శంఖారావం మోగనుంది. శనివారం నోటిఫికేషన్ వెలువడనుంది. జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈ నెల 19 వరకు స్వీకరిస్తారు. 21న పరిశీలన, 23న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మే 7వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే నెల 16న నగరంలో ఏర్పాటు చేస్తున్న మూడు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 5 రోజులే నామినేషన్ల స్వీకరణ నామినేషన్ల సమర్పించేందుకు షెడ్యూ ల్ ప్రకారం 8 రోజులు సమయముంది. సెలవు రోజుల్లో నామినేషన్లను స్వీకరించరు. ఈ నెల 13 ఆదివారం, 14న అంబేద్కర్ జయంతి, 18న గుడ్‌ఫ్రైడే కారణంగా కేవలం అయిదు రోజులు మాత్రమే స్వీకరించనున్నారు. ఇప్పటికే పార్టీల నాయకులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ పత్రాలను తీసుకువెళ్లారు. బుధవారం నుంచి నామినేషన్ల జోరు ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కార్యాలయాలకు వంద మీటర్లు పరిధిలో బారికేడ్లను పెడుతున్నారు. ప్రధానంగా జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ చాంబర్లో విశాఖ పార్లమెంట్, అనకాపల్లి పార్లమెంట్‌కు జాయింట్ కలెక్టర్ చాంబర్లో నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులు, వారి అనుచరులను కలెక్టరేట్ గేటు బయటే నిలిపివేస్తారు. అభ్యర్థితో పాటు మరో నలుగురు ప్రపోజర్లను మాత్రమే అనుమతిస్తారు. కలెక్టరేట్లోనే అదనపు జాయింట్ కలెక్టర్ చాంబర్లో విశాఖ-తూర్పు నియోజవర్గం పోటీదారుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. వారు కలెక్టరేట్లో ఎస్బీఐ బ్యాంకు రోడ్డులో సివిల్‌సప్లయిస్ కార్యాలయం వైపున ఉండే మెట్ల నుంచి ఏజేసీ చాంబర్‌కు అనుతిస్తారు. నామినేషన్లు సమర్పించిన తరువాత తిరిగి అదే దారి నుంచి వెనక్కు వెళ్లాల్సి ఉంటుంది. కలెక్టరేట్లో మీడియా పాయింట్ నామినేషన్లు సమర్పించిన తరువాత పార్టీల అభ్యర్థులు మీడియాతో మాట్లేందుకు కలెక్టరేట్లోనే మీడియా పాయింట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కలె క్టరేట్ ప్రాంగణంలో టీ క్యాంటిన్ పక్కన్న ఉన్న ఖాళీ స్థలాన్ని ఇందుకు కేటాయించారు. అభ్యర్థులు మీడియాతో మాట్లాడాలంటే అక్కడ మాత్రమే అనుమతిస్తారు.