
కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తటస్థులు, మేధావులు, సామాజిక కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించారు. కడపలో ఇవాళ మధ్యాహ్నం గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో తటస్థ ప్రభావితులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘మిమ్మల్ని అందర్నీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ ప్రాంతాల్లో మీరంతా మంచి చేయడం చాలా సంతోషం. మిమ్మల్ని అందర్నీ కలవాలని మీకు లేఖలు రాశాను. ప్రజలకు మరింత మంచి చేసేలా సలహాలు, సూచనలు ఇవ్వండి. మీతో అనుబంధం ఈ ఒక్క సమావేశానికే పరిమితం చేయాలని అనుకోవడంలేదు. ఈ ప్రయాణం జీవితకాలం అంతా ఉండాలని కోరుకుంటున్నా. రాష్ట్రంలో కొనసాగుతున్న పాలన, ఈ పరిస్థితిని మార్చేందుకు సలహాలు, సూచనలు ఇవ్వండి’ అంటూ వైఎస్ జగన్ తటస్థులను కోరారు. ఈ సమావేశం అనంతరం బూత్ కమిటీ కన్వీనర్లు, పార్టీ శ్రేణులతో మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment