
సాక్షి, అనంతపురం : ‘అన్న పిలుపు’లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తటస్థులతో సమావేశం అయ్యారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న తటస‍్థులతో ఆయన నగరంలోని శ్రీ 7 కన్వెన్షన్ హాలులో ముఖాముఖి నిర్వహించారు. ప్రతి జిల్లాలోనూ ఏ రాజకీయ పార్టీకి చెందని తటస్థ వర్గాలతో స్థానిక సమస్యలు, సమాజంలోని ఇతర అంశాలపై సమస్యలను ఆసక్తిగా తెలుసుకుని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జరిగే మేలు గురించి వైఎస్ జగన్ వివరించారు.
ఈ సమావేశం అనంతరం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో ‘సమర శంఖారావం’ సభలో పాల్గొంటారు. త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో సమర శంఖారావం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.