
మాట్లాడుతున్న పైలా నరసింహయ్య
సాక్షి, అనంపురం(తాడిపత్రి) : అధికారం కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య ఎద్దేవా చేశారు. సోమవారం భగత్‌సింగ్‌నగర్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పైలా నరసింహయ్య మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణతో చేతులు కలిపి పత్రికల్లో పిచ్చిరాతలు రాయిస్తున్నాడని మండి పడ్డారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉద్యోగాల విప్లవం తీసుకొచ్చారని, ఇందులో భాగంగానే 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారన్నారు. అయితే సీఎం పదవికి రాజీనామా చేయాలని చంద్రబాబు లేఖరాయడం విడ్డూరంగా ఉందన్నారు. జనం బుద్ధి చెప్పినా చంద్రబాబు తన పద్ధతిని మార్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ^ సమావేశంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం పట్టణాధ్యక్షుడు మనోజ్, నాయకులు రేగడి కొత్తూరు ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment