రూ.241.45 కోట్లతో 2008లో చేపట్టిన మట్టి పనులు ‘యాక్టివ్ పవర్’ ప్లాంట్ వద్ద మినహా మిగిలిన చోట్ల పూర్తి
రూ.206.79 కోట్లతో 2019లో చేపట్టిన లైనింగ్ పనులు వేగవంతం.. రూ.23.89 కోట్ల బిల్లులు చెల్లింపు
కానీ.. ఆధునికీకరణ పనులను వైఎస్సార్‌సీపీ రద్దు చేసిందంటూ సీఎం చంద్రబాబు దు్రష్ఫచారం
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించకపోతే ఆధునికీకరణ పనులు పూర్తయ్యేవని అధికారుల స్పషీ్టకరణ
సాక్షి, అమరావతి: వరద నియంత్రణతోపాటు సహాయక చర్యల్లోనూ ఘోరంగా విఫలమైన సీఎం చంద్రబాబు.. ఆ నెపాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నెట్టేందుకు పచ్చి అబద్ధాలను వల్లె వేస్తున్నారు. బుడమేరు డైవర్షన్ చానల్ (బీడీసీ) ఆధునికీకరణ పనులను 2014–19 మధ్య వేగవంతం చేస్తే.. వాటిని రద్దు చేయడం వల్లే ఇప్పుడు గండ్లు పడ్డాయంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు.
ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్ ఉన్నచోట మినహా బీడీసీ మట్టి తవ్వకం పనులను 2024 మార్చి నాటికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. యాక్టివ్ పవర్ ప్లాంట్‌కు ఎన్వోసీని రద్దు చేస్తూ 2021 జనవరి 6న జారీ చేసిన ఉత్తర్వులపై రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించి.. ఆ ఉత్తర్వులు అమలు చేయకుండా స్టే తెచ్చుకున్నారు. రాధాకృష్ణ అడ్డుపడకపోయి ఉంటే 2024 మార్చి నాటికే బీడీసీ ఆధునికీకరణ పనులు మొత్తం పూర్తయ్యేవని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
వైఎస్ హయాంలోనే పనులకు శ్రీకారం
కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం జమ్ములవోలు దుర్గం కొండల్లో పుట్టే బుడమేరు 130 కి.మీ. దూరం ప్రయాణించి కొల్లేరులో కలుస్తుంది. బుడమేరుకు గరిష్టంగా 24,500 క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేసిన ప్రభుత్వం.. విజయవాడకు ముంపు ముప్పును తప్పించేందుకు వెలగలేరు వద్ద రెగ్యులేటర్‌ను నిరి్మంచి.. అక్కడి నుంచి 7,500 క్యూసెక్కులను కృష్ణా నదిలో కలిపేలా 11.9 కి.మీ. పొడవున బీడీసీని 1957లో తవ్వారు. వెలగలేరు రెగ్యులేటర్‌కు 11 గేట్లను ఏర్పాటుచేసి.. దిగువకు 17,500 క్యూసెక్కులు వదిలేలా బుడమేరును అభివృద్ధి చేశారు.
1990లో బీడీసీ సామర్థ్యాన్ని 15 వేల క్యూసెక్కులకు పెంచుతూ పనులు చేపట్టారు. వెలగలేరు రెగ్యులేటర్ ఎగువన పోలవరం కుడి కాలువ ద్వారా 11,255 క్యూసెక్కులను కలపాలని 2005లో నిర్ణయం తీసుకున్న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి.. బీడీసీ ప్రవాహ సామర్థ్యాన్ని 37,555 క్యూసెక్కులు (బుడమేరు 24,500, పోలవరం కుడి కాలువ 11,255, ఎన్‌టీటీపీఎస్ 1,800 క్యూసెక్కులు) పెంచే పనులను 2008లో రూ.241.45 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఈ పనుల కారణంగా బీడీసీపై 10.375 కి.మీ. వద్ద ఉన్న యాక్టివ్ పవర్ ప్లాంట్‌ను తొలగించాలి. ఈ నేపథ్యంలో దాన్ని తొలగించేందుకు 2009 ఆగస్టు 29న ఆ పవర్ ప్లాంట్‌కు ఎన్వోసీని ప్రభుత్వం రద్దు చేసింది.
వేగంగా లైనింగ్ పనులు
బీడీసీ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనుల్లో భాగంగా ఐదో రీచ్‌లో అంటే 10.3 నుంచి 11.9 కి.మీ. వరకూ చేపట్టిన పనుల్లో రాధాకృష్ణకు చెందిన పవర్ ప్లాంట్ ఉన్న 10.3 కి.మీ. నుంచి 10.475 కి.మీ. వరకూ మినహా మిగతా పనులు పూర్తి చేసింది. ఈ క్రమంలోనే బీడీసీకి రూ.206.79 కోట్లతో లైనింగ్ పనులను కూడా చేపట్టింది. రాధాకృష్ణ పవర్ ప్లాంట్‌ను తొలగించి.. బీడీసీ ఆధునికీకరణ పనులు పూర్తి చేసేందుకు 2021 జనవరి 6న ప్రభుత్వం నోటీసులు ఇచి్చంది.
కానీ.. వాటిపై రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఉత్తర్వుల అమలును నిలుపుదల (స్టే) చేయాలని హైకోర్టు ఆదేశించడంతో పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. బీడీసీ లైనింగ్ పనుల్లో చేసిన పనులకు 2019 మే నాటికి రూ.23.89 కోట్ల బిల్లులు చెల్లించారు. ఇది వాస్తవం. రాధాకృష్ణకు లబ్ధి చేకూర్చడం కోసం 2014–19 మధ్య బీడీసీ ఆధునికీకరణ పనులను ఆపేసిన చంద్రబాబు.. ఇప్పుడు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పచ్చి అబద్ధాలు వల్లె వేస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దు్రష్ఫచారం చేస్తుండటం గమనార్హం.
రాధాకృష్ణ కోసం ఆధునికీకరణకు చంద్రబాబు మోకాలడ్డు
మహానేత వైఎస్ మరణానంతరం సీఎ కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని తెలుగు–కాంగ్రెస్ ప్రభుత్వం రాధాకృష్ణ పవర్ ప్లాంట్ ఎన్వోసీని 2014 జనవరి 25న పునరుద్ధరించింది. ఆ తర్వాత అధికారంలోకి వచి్చన టీడీపీ ప్రభుత్వం బీడీసీ ఆధునికీకరణ పనులను ఆపేసింది. 2019లో అధికారంలోకి వచి్చన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీడీసీ సామర్థ్యాన్ని 37,555 క్యూసెక్కులకు పెంచే పనుల్లో.. ఐదు రీచ్‌లలో 0–2.5 కి.మీ., 2.5 నుంచి 6 కి.మీ., 6.5 నుంచి 8.3 కి.మీ. వరకూ పూర్తి చేసింది. నాలుగో రీచ్‌లో 8.3 నుంచి 10.3 కి.మీ. గానూ ఎన్‌టీటీపీఎస్ అధికారులు అభ్యంతరం చెప్పిన 8.3 నుంచి 9.375 కి.మీ. మినహా మిగతా పనులు పూర్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment