రాప్తాడుకు వైఎస్‌ జగన్‌.. పోలీసుల ఆంక్షలు! | AP Police Restrictions On YS Jagan Rapathadu Tour | Sakshi
Sakshi News home page

రాప్తాడులో వైఎస్‌ జగన్‌ పర్యటన.. పోలీసుల ఆంక్షలు!

Published Mon, Apr 7 2025 11:17 AM | Last Updated on Mon, Apr 7 2025 1:22 PM

AP Police Restrictions On YS Jagan Rapathadu Tour

సాక్షి, అనంతపురం: ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలులో భాగంగా వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అనంతపురం పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు ప్లాన్‌ చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మంగళవారం రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి వెళ్లనున్నారు. ఇటీవల దారుణ హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్‌ పరామర్శించనున్నారు. అయితే, వైఎస్ జగన్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. చెన్నేకొత్తపల్లిలో హెలిప్యాడ్‌ ఏర్పాటుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కుంటిమద్ది-పాపిరెడ్డిపల్లి వద్ద హెలిప్యాడ్‌కు అనుమతి ఇచ్చారు. అలాగే, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి రావద్దని పోలీసులు హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు పోలీసులు ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం.

ఇది కూడా చదవండి: రెడ్‌బుక్‌ రాజ్యాంగం.. ఏపీకి గుడ్‌బై!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement