modernization works
-
జగన్ హయాంలోనే బుడమేరు ఆధునికీకరణ పనులు
సాక్షి, అమరావతి: వరద నియంత్రణతోపాటు సహాయక చర్యల్లోనూ ఘోరంగా విఫలమైన సీఎం చంద్రబాబు.. ఆ నెపాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెట్టేందుకు పచ్చి అబద్ధాలను వల్లె వేస్తున్నారు. బుడమేరు డైవర్షన్ చానల్ (బీడీసీ) ఆధునికీకరణ పనులను 2014–19 మధ్య వేగవంతం చేస్తే.. వాటిని రద్దు చేయడం వల్లే ఇప్పుడు గండ్లు పడ్డాయంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు.ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్ ఉన్నచోట మినహా బీడీసీ మట్టి తవ్వకం పనులను 2024 మార్చి నాటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. యాక్టివ్ పవర్ ప్లాంట్‌కు ఎన్వోసీని రద్దు చేస్తూ 2021 జనవరి 6న జారీ చేసిన ఉత్తర్వులపై రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించి.. ఆ ఉత్తర్వులు అమలు చేయకుండా స్టే తెచ్చుకున్నారు. రాధాకృష్ణ అడ్డుపడకపోయి ఉంటే 2024 మార్చి నాటికే బీడీసీ ఆధునికీకరణ పనులు మొత్తం పూర్తయ్యేవని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్ హయాంలోనే పనులకు శ్రీకారం కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం జమ్ములవోలు దుర్గం కొండల్లో పుట్టే బుడమేరు 130 కి.మీ. దూరం ప్రయాణించి కొల్లేరులో కలుస్తుంది. బుడమేరుకు గరిష్టంగా 24,500 క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేసిన ప్రభుత్వం.. విజయవాడకు ముంపు ముప్పును తప్పించేందుకు వెలగలేరు వద్ద రెగ్యులేటర్‌ను నిరి్మంచి.. అక్కడి నుంచి 7,500 క్యూసెక్కులను కృష్ణా నదిలో కలిపేలా 11.9 కి.మీ. పొడవున బీడీసీని 1957లో తవ్వారు. వెలగలేరు రెగ్యులేటర్‌కు 11 గేట్లను ఏర్పాటుచేసి.. దిగువకు 17,500 క్యూసెక్కులు వదిలేలా బుడమేరును అభివృద్ధి చేశారు.1990లో బీడీసీ సామర్థ్యాన్ని 15 వేల క్యూసెక్కులకు పెంచుతూ పనులు చేపట్టారు. వెలగలేరు రెగ్యులేటర్ ఎగువన పోలవరం కుడి కాలువ ద్వారా 11,255 క్యూసెక్కులను కలపాలని 2005లో నిర్ణయం తీసుకున్న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి.. బీడీసీ ప్రవాహ సామర్థ్యాన్ని 37,555 క్యూసెక్కులు (బుడమేరు 24,500, పోలవరం కుడి కాలువ 11,255, ఎన్టీటీపీఎస్ 1,800 క్యూసెక్కులు) పెంచే పనులను 2008లో రూ.241.45 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఈ పనుల కారణంగా బీడీసీపై 10.375 కి.మీ. వద్ద ఉన్న యాక్టివ్ పవర్ ప్లాంట్‌ను తొలగించాలి. ఈ నేపథ్యంలో దాన్ని తొలగించేందుకు 2009 ఆగస్టు 29న ఆ పవర్ ప్లాంట్‌కు ఎన్వోసీని ప్రభుత్వం రద్దు చేసింది. వేగంగా లైనింగ్ పనులు బీడీసీ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనుల్లో భాగంగా ఐదో రీచ్‌లో అంటే 10.3 నుంచి 11.9 కి.మీ. వరకూ చేపట్టిన పనుల్లో రాధాకృష్ణకు చెందిన పవర్ ప్లాంట్ ఉన్న 10.3 కి.మీ. నుంచి 10.475 కి.మీ. వరకూ మినహా మిగతా పనులు పూర్తి చేసింది. ఈ క్రమంలోనే బీడీసీకి రూ.206.79 కోట్లతో లైనింగ్ పనులను కూడా చేపట్టింది. రాధాకృష్ణ పవర్ ప్లాంట్‌ను తొలగించి.. బీడీసీ ఆధునికీకరణ పనులు పూర్తి చేసేందుకు 2021 జనవరి 6న ప్రభుత్వం నోటీసులు ఇచి్చంది.కానీ.. వాటిపై రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఉత్తర్వుల అమలును నిలుపుదల (స్టే) చేయాలని హైకోర్టు ఆదేశించడంతో పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. బీడీసీ లైనింగ్ పనుల్లో చేసిన పనులకు 2019 మే నాటికి రూ.23.89 కోట్ల బిల్లులు చెల్లించారు. ఇది వాస్తవం. రాధాకృష్ణకు లబ్ధి చేకూర్చడం కోసం 2014–19 మధ్య బీడీసీ ఆధునికీకరణ పనులను ఆపేసిన చంద్రబాబు.. ఇప్పుడు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పచ్చి అబద్ధాలు వల్లె వేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దు్రష్ఫచారం చేస్తుండటం గమనార్హం. రాధాకృష్ణ కోసం ఆధునికీకరణకు చంద్రబాబు మోకాలడ్డు మహానేత వైఎస్ మరణానంతరం సీఎ కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని తెలుగు–కాంగ్రెస్ ప్రభుత్వం రాధాకృష్ణ పవర్ ప్లాంట్ ఎన్వోసీని 2014 జనవరి 25న పునరుద్ధరించింది. ఆ తర్వాత అధికారంలోకి వచి్చన టీడీపీ ప్రభుత్వం బీడీసీ ఆధునికీకరణ పనులను ఆపేసింది. 2019లో అధికారంలోకి వచి్చన వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీడీసీ సామర్థ్యాన్ని 37,555 క్యూసెక్కులకు పెంచే పనుల్లో.. ఐదు రీచ్‌లలో 0–2.5 కి.మీ., 2.5 నుంచి 6 కి.మీ., 6.5 నుంచి 8.3 కి.మీ. వరకూ పూర్తి చేసింది. నాలుగో రీచ్‌లో 8.3 నుంచి 10.3 కి.మీ. గానూ ఎన్టీటీపీఎస్ అధికారులు అభ్యంతరం చెప్పిన 8.3 నుంచి 9.375 కి.మీ. మినహా మిగతా పనులు పూర్తి చేసింది. -
AP: ‘అంగన్వాడీ’ల ఆధునికీకరణ
సాక్షి, అమరావతి: మహిళలు, చిన్నారులకు సేవలందిస్తున్న అంగన్వాడీ కేంద్రాల ఆధునికీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మౌలిక వసతులతోపాటు ఆధునిక సౌకర్యాల కోసం నిధులు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో అనేక పథకాల కింద రూ.545 కోట్ల 97 లక్షల 55 వేలను బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రభుత్వం ఇప్పటివరకు రూ.205 కోట్ల 21 లక్షల 74 వేలను విడుదల చేసింది. నూతన విద్యావిధానంలో భాగంగా అంగన్వాడీలు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలతో కలిసి బోధన పద్ధతిలో సమన్వయాన్ని తీసుకురావడానికి, పిల్లల మెరుగైన అభ్యాస ఫలితాల కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. చదవండి: AP: సచివాలయాలు సూపర్.. కేంద్ర మంత్రి ప్రశంసలు ఈ నేపథ్యంలోనే మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో 27,620 కేంద్రాలను ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఆవరణలోనే నిర్వహిస్తున్నారు. మరో 27,987 కేంద్రాలను శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ (సొంతంగా అంగన్వాడీలు)గా నిర్వహిస్తున్నారు. పాఠశాలల ఆవరణలో నిర్వహిస్తున్న వాటిలో 1,803 అంగన్వాడీ కేంద్రాలకు నాడు–నేడు కార్యక్రమంలో 3,431 అదనపు తరగతి గదులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటి నిర్మాణానికి కసరత్తు మొదలైంది. వీటితోపాటు ఇప్పటికే 960 అంగన్వాడీ కేంద్రాల భవనాల ఆధునికీకరణ కోసం రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఆ నిధులతో పాత భవనాల మరమ్మతులు, మంచినీరు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతులు సమకూర్చనున్నారు. వీటిలో ఇప్పటివరకు 128 కేంద్రాల పనులు పూర్తయ్యాయి. 282 కేంద్రాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో సొంత భవనాలు కలిగిన అంగన్వాడీ కేంద్రాలకు 10,472 మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇందుకోసం రూ.15 వేల చొప్పున కేటాయించారు. 2,628 అంగన్వాడీ కేంద్రాలకు మంచినీటి కనెక్షన్లు ఏర్పాటు చేసేందుకు రూ.10 వేల వంతున నిధులు కేటాయించారు. అంగన్వాడీ కేంద్రాల తాజా పరిస్థితి రాష్ట్రంలో 257 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 55,607 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 21,197 కేంద్రాలు పాఠశాలల ఆవరణలో సొంత భవనాల్లో పనిచేస్తున్నాయి. మరో 10,652 అంగన్వాడీ కేంద్రాలు పాఠశాల తరగతి గదులు, పంచాయతీలు, ఇతర భవనాల్లో అద్దె లేకుండా నడుస్తున్నాయి. 23,758 అంగన్వాడీ కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. 55,607 కేంద్రాల్లో మంచినీటి వసతి ఉంది. 41,305 కేంద్రాల్లో మరుగుదొడ్లు ఉండగా.. 47,488 అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం ఉంది. అంగన్వాడీ కేంద్రాలకు ఇతోధిక నిధులు రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అవసరమైన నిధులు కేటాయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేంద్రంలోని పలు పథకాల ద్వారా నిధులను రాబట్టేందుకు కృషి జరుగుతోంది. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణంతోపాటు మంచినీరు, మరుగుదొడ్డి తదితర మౌలిక వసతులు కల్పించేందుకు గట్టి ప్రయత్నం సాగుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి కేటాయించిన రూ.15 వేలు సరిపోవనే వినతులు రావడంతో ఆ మొత్తాన్ని రూ.30 వేలకు పెంచే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వం నిధుల కోసం వెనుకడుగు వేయడంలేదు. – డాక్టర్ ఎ.సిరి, మహిళా శిశుసంక్షేమ శాఖ సంచాలకురాలు -
అద్దెగదుల ఆధునీకరణ
-
రైళ్ల రద్దు.. దారి మళ్లింపు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): ఆయా డివిజన్ పరిధిలో జరుగుతున్న ఆధునికీకరణ పనుల నిమిత్తం ఆయా మార్గాల్లో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసి, మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం జి.సునీల్‌కుమార్ తెలిపారు. బెంగళూరు డివిజన్లో జరుగుతున్న సాంకేతిక పనుల నిమిత్తం ఈ మార్గంలో నడిచే రైళ్లను దారి మళ్లిస్తున్నారు. ► యశ్వంత్‌పూర్‌లో ఈ నెల 25న బయల్దేరే యశ్వంత్‌పూర్–హౌరా(12246) దురంతో ఎక్స్‌ప్రెస్ వయా ఎల్లహంక, చన్నసంద్ర, కృష్ణరాజపురం మీదుగా నడుస్తుంది. ►24న హౌరాలో బయల్దేరిన హౌరా–యశ్వంత్‌పూర్(22863) ఎక్స్‌ప్రెస్ కూడా వయా కృష్ణరాజపురం, చన్నసంద్ర, ఎల్లహంక మీదుగా నడుస్తుంది. ►పూరీలో మార్చి 6న బయల్దేరే పూరీ–యశ్వంత్‌పూర్(22883) ఎక్స్‌ప్రెస్ వయా నంద్యాల, యర్రగుంట్ల, రేణిగుంట, మెల్పక్కం, జాలర్‌పేటల మీదుగా నడుస్తుంది. గమ్యం కుదించిన రైళ్లు ►మార్చి 4 నుంచి 25వ తేదీ వరకు సంబల్పూర్లో బయల్దేరే సంబల్పూర్–బాన్స్‌వాడి(08301)స్పెషల్ ఎక్స్‌ప్రెస్ కృష్ణరాజపురం వరకే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో(08302) ఎక్స్‌ప్రెస్ మార్చి 5 నుంచి 26వ తేదీ వరకు బాన్స్‌వాడి నుంచి కాకుండా కృష్ణరాజపురం నుంచి బయల్దేరుతుంది. ఈ తేదీలలో కృష్ణరాజపురం–బాన్స్‌వాడి మధ్య ఈ రైళ్ల రాకపోకలు ఉండవు. దానాపూర్ డివిజన్లో జరుగుతున్న భద్రతా పనుల నిమిత్తం ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నారు. ►ఎర్నాకుళంలో బయల్దేరే ఎర్నాకుళం–పాట్నా(22643) ఎక్స్‌ప్రెస్ మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు వయా అద్రా, నేతాజీ సుభాష్ చంద్రబోస్, గోమో, గయ మీదుగా ప్రయాణిస్తుంది. తిరుగు ప్రయాణంలో పాటా్నలో(22644) ఎక్స్‌ప్రెస్ మార్చి 19 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు వయా గయా, నేతాజీ సుభాస్‌చంద్రబోస్, గోమో, అద్రా మీదుగా నడిస్తుంది. సోమవారం ఎల్టీటీ రద్దు సెంట్రల్ రైల్వే పరిధిలో జరుగుతున్న ఆధునికీకరణ పనుల్లో భాగంగా విశాఖపట్నం–లోకమాన్యతిలక్ టెరి్మనస్–విశాఖపట్నం(18519/18520) మధ్య నడిచే ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ ఇటీవల గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తోంది. ఆదివారం విశాఖకు రావలసిన ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ ఆలస్యంగా చేరుకుంది. విశాఖలో రాత్రి 11.25 గంటలకు బయల్దేరవలసిన విశాఖపట్నం–లోకమాన్యతిలక్ టెరి్మనస్(ఎల్టీటీ) ఎక్స్‌ప్రెస్ సోమవారం సాయంత్రం 6.30 గంటలకు విశాఖ నుంచి బయల్దేరింది. అటు నుంచి రావలసిన మరో రైలు 10 గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా నడుస్తున్నందున సోమవారం రాత్రి 11.25 గంటలకు బయల్దేరవలసిన ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. -
బస్టాండ్ల ఆధునీకరణపై నివేదిక
సాక్షి, హైదరాబాద్: బస్టాండ్ల ఆధునీకరణలో భాగంగా ఇటీవల లక్నో బస్‌స్టేషన్‌ను సందర్శించిన ఆర్టీసీ అధికారుల బృందం శనివారం ఆర్టీసీ వీసీఎండీ సునీల్‌శర్మకు నివేదిక అందజేసింది. ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో లక్నో ఆలంబాగ్ బస్‌స్టేషన్‌ను శాలిమార్ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మించిందని, బస్టాండు రూపురేఖలతోపాటు పార్కింగ్ స్థలం, బస్ బేలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, సినిమా థియేటర్లు, విశ్రాంతి గదులు, సంస్థాగత కార్యాలయాలు, ప్రయాణికులకు అందిస్తున్న పలు రకాల సేవలను నివేదికలో వెల్లడించారు. రూ. 230 కోట్లు వెచ్చించి అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ బస్టాండును 33 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారని, బస్‌స్టేషన్ నిర్వహణ మొత్తాన్ని శాలిమార్ కంపెనీ భరిస్తోందని ప్రస్తావించారు. ఎయిర్పోర్ట్ తరహా సెక్యూరిటీ విధానాన్ని అమలుపరుస్తోందని పేర్కొన్నారు. నివేదిక సమర్పించిన వారిలో ఈడీ పురుషోత్తం, సీటీఎం రాజేంద్రప్రసాద్, ఈఈ సీతారాంబాబు తదితరులు ఉన్నారు. ఖాళీ స్థలాల సద్వినియోగం: సునీల్ శర్మ మహాత్మాగాంధీ బస్స్టేషన్లలో ఖాళీ స్థలాలను సద్వినియోగపరుచుకోవడం ద్వారా కమర్షియల్ రాబడిని పెంచుకోవడానికి గల అవకాశాలపై చర్యలు తీసుకోనున్నట్లు సునీల్‌శర్మ తెలిపారు. టీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఖాళీస్థలాలను ఏ రకంగా ఉపయోగించుకుంటే ఆదాయం సమకూరుతుందనే విషయంపై త్వరలో స్పష్టత రానుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో బస్టాండ్ల నిర్మాణా నికి శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. -
ఇంకెంత కాలమీ పనులు?!
ముందుకు సాగని హెచ్చెల్సీ ఆధునీకీకరణ పనులు నెల.. రెండు నెలలు కాదు.. ఏకంగా 96 నెలలకు పైగా తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ఆధునీకీకరణ పనులు సాగుతూ.. ఉన్నాయి! 2009లో జిల్లా సరిహద్తులోని 105వ కిలోమీటరు నుంచి 189వ కిలోమీటరు వరకూ ఆధునీకీకరణ పనుల కోసం రూ. 475 కోట్లను అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పనులు అనుకున్న స్థాయిలో జరిగి ఉంటే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఆధునీకీకరణ పనులు నత్తనడకన సాగుతుండడంతో పంటలకు సాగునీరు అందడం లేదు. పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాది కూడా పనులు పూర్తి అవుతాయనే నమ్మకం లేదు. హెచ్చెల్సీ ద్వారా జిల్లాకు 32 టీఎంసీల నీరు అందాల్సి ఉండగా ప్రస్తుతం 18 టీఎంసీలు మాత్రమే సరఫరా అవుతున్నాయి. ప్రధాన కాలువ వెడల్పు లేకపోవడంతో.. లైనింగ్ దెబ్బతినడం వల్ల తరచూ గండ్లు పడుతూ జిల్లాకు సాగునీరు సక్రమంగా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. దీంతో హెచ్చెల్సీ ఆధునీకీకరణకు ఎనిమిదేళ్ల క్రితం ప్రభుత్వం పనులు చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రధాన కాలువను వెడల్పు చేయడంతో పాటు సిమెంట్ లైనింగ్ చేయాల్సి ఉంది. మోపిడి వద్ద నత్తనడకన ఉరవకొండ మండలంలోని మోపిడి గ్రామం వద్ద డీప్ కట్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో కాలువ వెడల్పు 15 మీటర్లు ఉంది. ఇందులో 2,500 క్యూసెక్కుల నీటి ప్రవాహానికి అవకాశం ఉంది. కాలువ సామర్థ్యాన్ని 15 నుంచి 25 మీటర్లుకు పెంచడం ద్వారా 4,500 కూసెక్కుల నీటి ప్రవాహానికి అనుకూలం చేయాలని అధికారులు భావించారు. ఆ మేరకు చర్యలూ చేపట్టారు. ప్రస్తుతం మోపిడి వద్ద 172 కిలోమీటరు నుంచి 188 కిలోమీటరు వరకు పనులు సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో డీప్ కట్ వద్ద పెద్ద పెద్ద బండరాళ్లను తొలగించేందుకు డిటనేటర్లను ఉపయోగించాల్సి ఉంది. ఈ పనులను పూర్తి చేయకుండానే లైనింగ్ పనులు చేపట్టారు. హెచ్చెల్సీలో షట్టర్లు సైతం తుప్పుపట్టి శిథిలావస్థకు చేరాయి. కాలువ గట్లు ఎక్కడపడితే అక్కడ కోతకు గురవుతున్నాయి. పనులు వేగవంతం చేస్తాం.. : రామసంజప్ప, డీఈ, హెచ్చెల్సీ ఆరో ప్యాకేజీ పనులు వేగవంతం చేయనున్నాం. ప్రస్తుతం లైనింగ్, సూపర్ ప్యాసెస్ పనులు జరుగుతున్నాయి. 188వ కిలోమీటరు వద్ద బ్లాస్టింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులను కూడా త్వరలో పూర్తి చేస్తాం. నిధుల సమస్య లేదు. -
సాగర్ ఆధునికీకరణ పనుల పరిశీలన
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ఆధునికీకరణ పనులను మంగళవారం ప్రపంచబ్యాంకు బృందం పరిశీలించింది. ప్రపంచ బ్యాంకు నిధులతో కొనసాగుతున్న ఆధునీకీకరణ పనులు ఈఏడాది పూర్తి కానున్నాయి. ఆ పనుల ప్రగతిని పరిశీలించేందుకు బ్యాంకు ప్రతినిధులు వారం రోజులపాటు ఇప్పటి వరకు జరిగిన పనులను పరిశీలించి ప్రగతి నివేదికను తయారు చేయనున్నారు. అన్నిరంగాలకు సంబంధించిన నిపుణులు బృందంలో ఉన్నారు. అందులో భాగంగా బ్యాంకు ప్రతినిధుల బృందం సోమవారం సాగర్‌డ్యాంపై జరిగే పనులను, హాలియా, నిడమనూరు, మేళ్లచెరువు, హుజూర్నగర్ మండలంలోని వేపలసిం గారంలో ఎడమకాల్వ పనులను పరిశీలించారు. క్రస్ట్‌గేట్లు ఎత్తేందుకు మోటార్లు ఉంచే వంతెనతో పాటు 420 గ్యాలరీ, స్పిల్‌వే క్రస్ట్‌గేట్లు తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం టీంలీడర్ పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కాల్వల ప్రారంభం నుంచి చివరి వరకు పరిశీలించి ప్రగతి నివేదిక తయారు చేస్తామని తెలిపారు. వీరికి సాగర్‌డ్యాం అధికారులు జరిగిన పనులతో పాటు చేయాల్సిన పనులను చూయించారు. ఈబృందంలో నిపుణులు గౌతశివదాసిని, అనితకృష్ణ కరూర్, అర్జున్తోకేర్, తుమ్మర్దావా, పార్వతీశం, పాల్సింగ్సిద్ధు, జిన్జైన్, ఎస్.కె.జైన్, శాలిని అగర్వాల్ తదితరులున్నారు. వీరి వెంట సాగర్‌ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ సునీల్, ఎస్ఈ రమేశ్, ఈఈ వెంకట్‌రెడ్డి, డీఈలు సుదర్శన్‌రావు, విజయకుమార్, ఏఈలు రామారావు, జైల్‌సింగ్, కృష్ణయ్య, నర్సింహమూర్తి తదితరులున్నారు. -
ఏపీ సహకరించేలా చూడండి
♦ ఆర్డీఎస్‌పై కృష్ణానది యాజమాన్య బోర్డుకు తెలంగాణ లేఖ ♦ ఏపీ అధికారులు కర్ణాటకకు రాసిన లేఖను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆధునీకరణ పనులు వీలైనంత త్వరగా పూర్తయ్యేందుకు.. ఏపీ ప్రభుత్వం సహకరించేలా చూడాలంటూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సోమవారం బోర్డు సభ్య కార్యదర్శికి రాసిన లేఖను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తు పెంచడం ద్వారా కర్నూలు ప్రాంత రైతులకు నష్టం వాటిల్లదని లేఖలో పేర్కొన్నారు. ఆర్డీఎస్ పూర్వాపరాలను లేఖలో వివరించారు. ఈ ఆనకట్ట పరిధిలోని ఆయకట్టును స్థిరీకరించేందుకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తును అడుగు మేర పెంచడంతో పాటు కుడివైపు ఉన్న తూము, కాలువల స్థితిగతులను మెరుగుపరచాలని నిపుణుల కమిటీ సూచించిందని వివరించారు. ఈ నివేదిక ఆధారంగానే ఆర్డీఎస్ ఆధునీకరణకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని, తన వంతు వాటాగా రూ.58.93 కోట్లను కర్ణాటక ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసిం దన్నారు. ఆనకట్ట ఎత్తు పెంచడం, హెడ్‌వర్క్స్ మరమ్మతులను చేపట్టిన సంస్థ 20% పనులనే పూర్తి చేసిందన్నారు. కర్నూలు జిల్లా రైతులు తరచూ పనులను అడ్డుకోవడంతో ఆధునీకరణ ముందుకు సాగక, ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు రావాల్సిన 15.90 టీఎంసీల వాటా అందడం లేదని లేఖలో పేర్కొన్నారు. ఏపీ అభ్యంతరాలకు ఆధారాలివిగో..: ఆర్డీఎస్ ఆధునీకరణ పనులు నిలిపివేయాలంటూ కర్ణాటక ప్రభుత్వానికి తాము ఎలాంటి లేఖ రాయలేదని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్రావు చెబుతున్న మాటలను తెలంగాణ ప్రభుత్వం అసత్యాలుగా అభివర్ణించింది. ఆర్డీఎస్ పనులు ఆపాలంటూ ఈ నెల 16న కర్నూలు జిల్లా ఆదోని ఆర్డీవో ఓబులేశు, ఆదోని డీఎస్పీ శ్రీనివాసరావు రాసిన లేఖలను విడుదల చేసింది. ‘‘ఆర్డీఎస్ సైట్ వద్ద కర్ణాటక అధికారులు పనులు జరిపిస్తున్నారు. కర్నూలు జిల్లా రైతులు, ప్రజలు ఈ పనులను వ్యతిరేకిస్తున్నారు. ఏపీ వైపు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన తలెత్తుతుందని భావిస్తున్నాం. ఈ ఆందోళన ఆర్డీఎస్ వద్ద శాంతిభద్రతల సమస్యగా పరిణమించే అవకాశం ఉంది’’ అని ఇరువురు అధికారులు కర్ణాటకలోని రాయచూర్ (సింథనూరు) ఆర్డీఎస్ ఎస్ఈ శ్రీప్రకాశ్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు సింథనూరు ఎస్ఈ, కర్నూలు కలెక్టర్ నడుమ ఈ నెల 16న సాగిన ఎస్ఎంఎస్ సంభాషణ కూడా బహిర్గతమైంది. ‘‘కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో.. ఈ రోజు నుంచి ఆర్డీఎస్ పనులు ప్రారంభమయ్యాయి. మా డిప్యూటీ కలెక్టర్ మీతో మాట్లాడతారు..’ అని కర్నూలు కలెక్టర్‌కు సింథనూరు ఎస్ఈ మెసేజ్ ఇచ్చారు. ‘‘ఏపీ ప్రభుత్వ ఆదేశాలు లేకుండా ఎలాంటి పనులు ప్రారంభించవద్దు. ప్రారంభమైన పనులను వెంటనే నిలిపేయండి’’ అని కర్నూలు కలెక్టర్ సమాధానం ఇచ్చారు. దీనికి బదులుగా ‘‘మీ వైపు నుంచి అనుమతి లభించిన తర్వాతే పనులు ప్రారంభిస్తాం’’ అని సింథనూరు ఎస్ఈ సందేశం పంపారు. -
ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
పరిశీలించిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఎస్పీజీ కంట్రోల్లో నూతన విమానాశ్రయం రేణిగుంటకు చేరుకున్న {పత్యేక బలగాలు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన అదనపు డీజీపీ, ఐజీ మూడు మార్గాల్లో కాన్వాయ్ ట్రయల్ రన్ తిరుపతి: ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం తిరుపతికి రానుండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విమానాశ్రయ విస్తరణ, ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. అధునాతన హంగులతో విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. టెర్మినల్, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు, విమానాల పార్కింగ్, వాహనాల పార్కింగ్, గ్రీనరీ, లైటింగ్ ఏర్పాట్లను పూర్తి చేశారు. విమానాశ్రయానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ లైట్లతో అలంకరణ చేశారు. అలాగే తిరుపతిలో మొబైల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ శంకుస్థాపన పనులు కొలిక్కి వచ్చాయి. మొబైల్ తయా రీ సంస్థలు ఏర్పాటు చేసిన క్యూబికల్స్‌ను ప్రధానమంత్రి సందర్శించేం దుకు వీలుగా ఏర్పాట్లను పూర్తి చేశారు. అదేరోజు రాత్రి ప్రధాని తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు. భారీ బందోబస్తు.. ప్రధాన మంత్రి రాకను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అడిషనల్ డీజీపీ ఠాగూర్ మంగళవారం బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు వెళ్లేందుకు వీలుగా మూడు మార్గాల్లో పోలీసులు కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. విమానాశ్రయ ప్రారంభోత్సవం, మొబైల్ తయారీ సంస్థల యూనిట్లకు శంకుస్థాపన, తిరుమల ప్రాంతాలను ఎస్పీజీ సిబ్బంది ఆధీనంలోకి తీసుకున్నారు. ఎస్పీజీ అదనపు డీఐజీ వివేక్ ఆనంద్ కనుసన్నల్లో భద్రత పర్యవేక్షణ సాగుతోంది. రేణిగుంట విమానాశ్రయానికి మంగళవారం ఉదయానికే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. అదనపు డీఐజీ ఠాగూర్, ఐజీ వేణుగోపాలరావు పోలీసులతో సమావేశమై వారికి తగిన సూచనలు ఇచ్చారు.అనుమానాస్పద వ్యక్తులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పాసులు ఉన్న వారిని మాత్రమే విమానాశ్రయంలోకి అనుమతిస్తామని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పరిశీలన.. విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ పోలీసు ఉన్నతాధికారులకు తగు సూచనలు ఇచ్చారు. -
నేటినుంచి ఎడమకాల్వ ఆధునీకరణ పనులు
సాగర్ నీటి విడుదల నిలిపివేయడంతో నిర్ణయం {పధాన కెనాల్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ల పనులకు శ్రీకారం హైదరాబాద్: నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆధునీకరణ పనులు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం నుంచి నీటి విడుదలను పూర్తిగా నిలిపివేసిన నేపథ్యంలో ఆధునీకరణ పనులను ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. సాగర్ ఆధునీకరణ కోసం కేటాయించిన నిధుల్లో మిగిలి ఉన్న రూ.700 కోట్లతో వీలైనన్ని ఎక్కువ పనులు చేపట్టాలని నిర్ణయించారు. జూన్‌లో వర్షాలు ప్రారంభమయ్యేనాటికి పనులు పూర్తిచేయాలనే సంకల్పంతో అధికారులు ఉన్నారు. నిజానికి సాగర్ ఆధునీకరణను 2008 ఫిబ్రవరిలో రూ. 4,444.41 కోట్ల అంచనాతో ప్రారంభించారు. ఇందులో వరల్డ్ బ్యాంకు నుంచి 48 శాతం నిధులు అందనుండగా, మిగతా 52 శాతం నిధులను రాష్ట్రం సమకూర్చాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రాజెక్టు వ్యయంలో తెలంగాణ వాటా రూ.1,576.94 కోట్లుగా తేలగా అందులో 2014 వరకు 659.06 కోట్లు ఖర్చు చేసినట్లుగా తేల్చారు. ఇక గతేడాది మరో రూ.126.66 కోట్లతో పనులు చేపట్టగా... ఇంకా రూ.700 కోట్లతో చేపట్టాల్సిన పనులు మిగిలిఉన్నాయి. ఈ మొత్తం పనులను 2016 జూన్ నెలాఖరుకు పూర్తి చేయాల్సి ఉంది. నిర్ణీత అవసరాల మేరకు నీటి విడుదల గురువారంతో ముగియడంతో ప్రస్తుతం పనుల ప్రారంభించడానికి అధికారులు సిద్ధమయ్యారు. రెండు నెలల వ్యవధిలో 8 ప్యాకేజీల పరిధిలోని 25 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ల పనితో పాటు 4 ఎత్తిపోతల పథకాల ఆధునికీరణను వేగవంతం చేసేందుకు అధికారులు నిర్ణయించారు. -
సా...గరం గరం
నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాల్వ ఆధునికీకరణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిలదీశారు. ప్రపంచబ్యాంకు నిధులతో జరుగుతున్న ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయని, దీనివల్ల శివారు భూములకు నీరు అందడం లేదని నిలదీశారు. అసెంబ్లీలో నాలుగు రోజులుగా జరిగిన చర్చల్లో జిల్లా ఎమ్మెల్యేలు తమ వాణి వినిపించారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజున నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులపై అద్దంకి, సంతనూతలపాడు, కందుకూరు శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, పోతుల రామారావులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్ఎస్పీ ఆధునికీకరణ పనుల భౌతిక, ఆర్థిక పరిస్థితిపై నివేదిక కావాలని అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ వేసిన ప్రశ్నపై చర్చ జరిగింది. మెయిన్ కాల్వ పనులు 80 శాతం, బ్రాంచి కాల్వల పనులు 47 శాతం, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ పనులు 40 శాతం జరిగాయని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సుమారు 20 పేజీల సమాధానమిచ్చారు. అంకెలన్నీ వాస్తవ విరుద్ధం గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 0- 18 మైలురాయి వరకూ లైనింగ్ చేయాలని ప్రతిపాదించగా అందులో ఒక్క పైసా పని కూడా ప్రారంభం కాలేదు. జిల్లా పరిధిలో నాలుగు కిలోమీటర్ల మేర లైనింగ్‌కు ప్రతిపాదిస్తే అందులో 59.36 శాతం పూర్తయినట్లు ప్రభుత్వ నివేదికలో ఉందని, వాస్తవానికి 30 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. అధికారుల లెక్కలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. అద్దంకి నియోజకవర్గం విషయానికి వస్తే 18 డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఉంటే అందులో సగటున 20 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. అధికారులు ఇచ్చిన లెక్కల్లోనే 2.6 శాతం, ఏడు శాతం, 36 శాతం అని ఉన్నాయి. అధికారులు మంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారనడానికి ఈ ఉదాహరణలు. 2008లో లైనింగ్ పనులు చేస్తామని ప్రకటించినపుడు వేలాది మంది రైతులు గుప్పెడు మెతుకులు తినవచ్చని ఆశపడ్డారు, ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరు దీనికి పూర్తి భిన్నంగా ఉంది. సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లపై ఏ చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి దేవినేని ఉమా సమాధానమిస్తూ పనుల జాప్యంపై నోటీసులు ఇచ్చాం అని సమాధానమివ్వడంతో ఏడేళ్ల నుంచి పనులు చేయని ఏజెన్సీలను మార్చే ఆలోచన ఎందుకు చేయడం లేదని రవికుమార్ ప్రశ్నించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఆ పనులు తాము చేయకుండా, అనుభవం, అర్హతలేని సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వడం వల్ల కాల్వల వ్యవస్థ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2016 నాటికి ఈ పనులు ఏ విధంగా పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలను కాపాడేందుకు అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని రవికుమార్ విమర్శించారు. ప్రపంచబ్యాంకు నిబంధనల ప్రకారం వాటర్ రీడింగ్ మీటర్లను ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇప్పటికీ అవి ఏర్పాటు చేయకపోవడం వల్ల ఎక్కడ ఎంత నీరు వస్తుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. 30 ఏళ్లక్రితం కట్టిన సింగిల్‌లైన్ బ్రిడ్జిలను మార్చాల్సి ఉన్నా ఇంతవరకూ ఆ పనులు మొదలు పెట్టకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని రవికుమార్ చెప్పారు. షటర్లు కూడా సక్రమంగా లేకపోవడంతో ఎవరికి అవసరం ఉంటే వారు వాటిని పీకేస్తున్నారని, దీనిపై నియంత్రణ లేదన్నారు. ఈ పనులు సక్రమంగా అందించేందుకుగాను అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, రైతుసంఘాల నాయకులతో కమిటీ వేయాలని రవికుమార్ సూచించారు. ఆధునికీకరణ పనులకు ఎంత ఖర్చుపెట్టారు? ఆదిమూలపు సురేష్ : ఇప్పటి వరకూ ఎన్ఎస్పీ ఆధునికీకరణకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలి. ఏ మేరకు పనులు పూర్తయ్యాయి? పనులు జరగకపోతే ప్రపంచబ్యాంకు నుంచి రావల్సిన నిధులకు గండిపడే ప్రమాదం ఉంది? ఇందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారు? భారీ నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని: మొత్తం 2639 కోట్ల రూపాయల విలువైన ఈ పనులకు 48 శాతం ప్రపంచ బ్యాంకు, 52 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఇప్పటి వరకూ 801 కోట్లు అంటే 28.6 శాతం పనులు పూర్తయ్యాయి. పనులు జరగకపోతే 2016 నాటికి ప్రపంచబ్యాంకు నుంచి రావాల్సిన రూ.1359 కోట్లు రాకుండా పోయే ప్రమాదం ఉంది. అసలు కాల్వల పనులను పరిశీలించేందుకు తగిన యంత్రాంగం లేదు. అధికారుల నుంచి లస్కర్ల వరకూ అన్ని విభాగాల్లో ఉద్యోగుల కొరత ఉంది. ఎన్ని టీఎంసీల నీరు ఆదా అవుతుంది కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు: ప్రస్తుతం జరుగుతున్న ఎన్ఎస్పీ ఆధునికీకరణ పనులు పూర్తయితే ఎన్ని టీఎంసీల నీరు ఆదా అవుతుంది. ఎన్ఎస్పీ పేజ్ -2 పనులు ప్రారంభించే అవకాశం ఉందా. ఈ పనులు పూర్తి స్థాయిలో జరిగితే మూడు జిల్లాల రైతాంగానికి లబ్థి చేకూరుతుంది. అందువల్ల ఈ పనులపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. మంత్రి దేవినేని ఉమా : సాగర్ పనులు పూర్తి స్థాయిలో చేయడం కోసం అధికారులతో సమీక్షిస్తాను. రెండు రోజుల తర్వాత స్వయంగా వచ్చి కాల్వల్లో జరిగిన పనులను పరిశీలిస్తా. 2016 నాటికి పనులు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటా. స్పీకర్ కోడేల శివప్రసాద్ చర్చలో జోక్యం చేసుకొని ఈ పనుల ఆవశ్యకతను వివరిస్తూ పూర్తి దృష్టి పెట్టాలి. -
హార్బర్ లైన్లో ఆధునికీకరణ పనులు
సాక్షి, ముంబై : నగరంలో రైల్వేస్టేషన్లలల్లో ఆధునికీకరణ పనులు చేపట్టడానికి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగాంగా హర్బర్ లైన్ మార్గంలో త్వరలో లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లను నిర్మించాలని నిర్ణయించారు. డాక్‌యార్డ్ రోడ్, వడాలా, మాన్‌కుర్ద్, రేరోడ్, చెంబూర్, కింగ్స్సర్కిల్లల్లో 11 లిఫ్టులు, ఆరు ఫుట్ ఓవర్ బ్రిడ్జిల కోసం ప్రతిపాదనను తయారు చేశారు. ఈ నిర్మాణాల కోసం కాంట్రాక్టుకు ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టు మార్చి 2015 వరకు పూర్తి అవుతోందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. చెంబూర్, కింగ్స్ సర్కిల్ వద్ద ఇప్పటికే పనులు ప్రారంభించారు. అన్ని స్టేషన్లలో ఈ పనులు పూర్తి అయితే ప్రయాణికులు ఫ్లాట్‌ఫాంలకు వెళ్లడానికి సులభమవుతుంది. అంతేకాకుండా ప్రమాదాల నివారణకు తోడ్పడుతోంది. అన్ని స్టేషన్లలో సర్వే హర్బర్ మార్గాంలో రోజుకు 10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తారు. ఈ మార్గంలో గల అన్ని రైల్వే స్టేషన్ల సర్వే నిర్వహించారు. ఈ స్టేషన్లలో ప్రయాణికుల అవసరాల మేరకు సదుపాయాలను నవీకరిస్తున్నామని ముంబై రైల్వే వికాస్ కార్పోరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ చెర్మైన్ రాకేష్ సక్సేనా తెలిపారు. ఒక్కో లిఫ్టుకు రూ.20 లక్షలు ఖర్చు అవుతాయి. ఎస్కలేటర్లకు రూ.ఒక్క కోటి ఖర్చు అవుతోందని అధికారి తెలిపారు. చెంబూర్‌లో చాలా మంది ప్రయాణికులు రైలు పట్టాలను దాటుతుంటారు. లిఫ్టులను ఏర్పాటు చేయడం ద్వారా వీరిని కొంత మేర అరికట్టవచ్చని తెలిపారు. రద్దీ స్టేషన్లలో..: హర్బర్ మార్గంలో వడాలా రైల్వే స్టేషన్ చాలా రద్దీ గల స్టేషన్. ఈ స్టేషన్ పన్వేల్-సీఎస్టీ హర్బర్ లైన్ నుంచి సీఎస్టీ-అంధేరి లైన్‌ను కలుపనుంది. ఈ స్టేషన్లో మూడు ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. మూడు లిఫ్టులు, ప్లాట్‌ఫాం మధ్యలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. మాన్కూర్డ్ స్టేషన్లో అదనంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఇక్కడ రెండు లిఫ్టులు, ఒక ఎస్కలేటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. -
రేపటినుంచి సాగర్ ఆధునికీకరణ పనుల పరిశీలన
- తొమ్మిది రోజులపాటు పరిశీలించనున్న ప్రపంచబ్యాంకు ప్రతినిధులు - మధ్యంతర నివేదిక కోసం వస్తున్నారని పీడీ మల్సూర్ వెల్లడి నాగార్జునసాగర్ : ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులను ప్రపంచబ్యాంకు ప్రతినిధులు పరిశీలించనున్నట్లు సాగర్ ప్రాజెక్టు డెరైక్టర్ మల్సూర్ తెలిపారు. సోమవారం విజయవిహార్ అతిథిగృహంలో డ్యాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన ఆధునికీకరణ పనుల వివరాలను ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు అందజేసేందుకు వీలుగా అధికారుల నుంచి నివేదికలు తీసుకున్నారు. ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు అవసరమైన అన్ని వివరాలను తెలియజేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన డ్యాం అధికారులను కోరారు. అనంతరం మల్సూర్ విలేకరులతో మాట్లాడుతూ సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఇప్పటి వరకు నిర్వహించిన, ఆలస్యమైన పనులను వేగవంతం చేసేందుకు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన పనుల వివరాలకు సం బంధించి మధ్యంతర నివేదిక పొందుపరచడానికి ప్రపంచబ్యాంకు ప్రతిని ధులు వస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు ప్రధానకాలువకు సంబంధిం చి మూడు ప్యాకేజీలు నూరు శాతం పూర్తయినట్లు చెప్పారు. నాలుగు ప్యాకేజీలు 90శాతం పూర్తయ్యాయన్నారు. మిగిలినవి 60శాతం వరకు జరిగినట్లు తెలిపారు. డిస్ట్రిబ్యూటరీ పనులు 40శాతం పూర్తయినట్లు తెలిపారు. ఆధునికీకరణ పనులకు ఇప్పటివరకు రూ.3,300 కోట్లు వ్యయం చేసే పనులు ప్రతిపాదించగా 2,300కోట్ల రూపాయల విలువచేసే పనులను ప్రారంభించామని తెలిపారు. వీటిలో ఇప్పటివరకు రూ.1450కోట్లు ఖర్చయినట్లు వివరించారు.సాగర్ కాలనీలలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. సమావేశంలో డ్యాం ఎస్ఈ విజయభాస్కర్‌రావు, ఈఈ విష్ణుప్రసాద్, డీఈ చందునాయక్ తదితరులున్నారు. -
భావోద్వేగాలకు గురికావద్దు
కోసిగి రూరల్ : రాజోలి బండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) ఆధునికీకరణ పనులు జరగకుండా చూస్తామని కలెక్టర్ విజయమోహన్ పేర్కొన్నారు. ఇరు ప్రాంతాల రైతులు భావోద్వేగాలకు గురికాకుండా సహనం పాటించాలని సూచించారు. ఆధునికీకరణ పనులను తిరిగి ప్రారంభిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటనలు చేస్తుండటంతో మంగళవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ ఆర్డీఎస్ను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆధునికీకరణ పనుల్లో ఆనకట్ట ఎత్తు పెంచడం లేదన్నారు. అలా పెంచాల్సి వస్తే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని అన్నారు. తన పరిశీలనలో రైతులు, అధికారులు తెలిపిన సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపిస్తామని చెప్పారు. సీమ రైతులకు అన్యాయం చేయవద్దు.. ఆర్డీఎస్ ఆనకట్టు ఎత్తును పెంచి రాయలసీమ రైతులు, ప్రజలకు ఎలాంటి అన్యాయం చేయవద్దని కలెక్టర్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యుడు వై.ప్రదీప్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు బెట్టనగౌడ్, భీంరెడ్డి, మురళీరెడ్డి కోరారు. ఎత్తు పెంచితే దిగువ ప్రాంతానికి 1500 క్యూసెక్కుల నీటి సరఫరా తగ్గిపోతుందని, అలాగే ఎగువ ప్రాంతంలో 200 ఎకరాలు ముంపునకు గురవుతాయన్నారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ఇదిలా ఉండగా ఆర్డీఎస్ ఎత్తును పెంచుకోవడానికి నిజాం పాలకులు వీలు కల్పించినట్లు కలెక్టర్‌కు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్డీఎస్ ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి వివరిస్తుండగా సీమ రైతులు అడ్డుకున్నారు. సీమ ప్రాంత రైతులకు నీటి కష్టాలు వచ్చేలా చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సాగు, తాగునీటి వసతి కల్పించాలి తుంగభద్ర నది నుంచి సీమ ప్రాంత వాసులకు తాగు, సాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కోసిగి మండల రైతులు కలెక్టర్ విజయమోహన్‌ను కోరారు. చాలా కాలంగా ఆర్డీఎస్ నుంచి దాగువకు రావాల్సిన నీటి వాటా రాకపోవడంతో తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్నామని రైతులు కలెక్టర్ కాన్వాయ్‌ని అడ్డుకుని చుట్టుముట్టారు. ఎలాంటి సమస్య రాకుండా చూస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారు శాంతించి వెనుదిరిగారు. కలెక్టర్ వెంట ఆదోని డీఎస్పీ శివరామిరెడ్డి, కోసిగి సీఐ అస్రార్‌బాషా, కోసిగి, పెద్దకడుబూరు మండలాల ఎస్ఐలు కృష్ణమూర్తి, జగన్ మోహన్ యాదవ్ ఉన్నారు. రైతుల ఆందోళనకు కోసిగి వైఎస్సార్సీపీ నాయకులు మంగమ్మ, నాడుగేని నరసింహులు, హోళగుంద కోసిగయ్య, లచ్చప గోవిందు, బండల గోవిందు, ఆకాశ్‌రెడ్డి, దొడ్డి నరసన్న తదితరులు మద్దతు తెలిపారు. -
‘గ్రేటర్’ నిర్లక్ష్యం ఖరీదు రూ.160 కోట్లు
గడువులోగా పూర్తికాని నాలాల ఆధునీకరణ పనులు మురిగిపోయిన నిధులు ప్రజలకు తప్పని ఇబ్బందులు ఇదీ జీహెచ్‌ఎంసీఅధికారుల తీరు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చినుకు పడితే వణుకే. బస్తీ వాసులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి. మళ్లీ రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్. అయినా వరదముంపు సమస్యల పరిష్కారానికి ప్రతిపాదించిన నాలాల ఆధునీకరణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఈ పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో కేంద్రం జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా కేటాయించిన రూ. 266 కోట్లలో దాదాపు రూ. 160 కోట్ల రూపాయలు మురిగిపోయాయి. వర్షం కురిసిన ప్రతిసారీ బస్తీలు నీట మునగడానికి.. రహదారులు చెరువులుగా మారడానికి కారణమవుతున్న పలు నాలాలను ఆధునీకరించడమొక్కటే పరిష్కారమని భావించారు. నాలాలను ఆధునీకరిస్తే వర్షపునీరు సాఫీగా ప్రయాణిస్తుందని, తద్వారా వరద ముంపు తగ్గుతుందని భావించారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన కేంద్రం సైతం నాలాల ఆధునీకరణ పనుల కోసం రూ. 266 కోట్లు మంజూరు చేసింది. అందులో దాదాపు రూ. 106 కోట్లు మాత్రమే జీహెచ్ఎంసీ ఖర్చు చేయగలిగింది. మిగతా రూ. 160 కోట్లు ఖర్చు చేయకపోవడంతో ఆ నిధులు మురిగిపోయాయి. వాస్తవానికి 2011 నాటి కే ఈ ఆధునీకరణ పనులు పూర్తికావాల్సి ఉండగా, పలుమార్లు పొడిగింపు ఇచ్చారు. అంతిమంగా 2014 మార్చి నెలాఖరుతో ఈ గడువు ముగిసిపోయింది. దీంతో జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా నిధులందినా ఆశించిన ప్రయోజనం నెరవేరకుండా పోయింది. నాలాల ఆధునీకరణ పనుల్లో కీలకమైన భూసేకరణ ఈ పనులకు ప్రధాన ఆటంకంగా మారింది. దాంతో 70 కి.మీ. మేర నాలాలను విస్తరించి ఆధునీకరించాల్సి ఉండగా, అందులో దాదాపు 25 కి.మీ. మేర పనులు మాత్రమే జరిగాయి. మిగతా పనులు ఎక్కడివక్కడే మిగిలాయి. నాలాల ఆధునీకరణ కోసం మొత్తం 2,416 ఆస్తుల్ని సేకరించాల్సి ఉండగా.. గడువు ముగిసేనాటికి దాదాపు 800 ఆస్తులు మాత్రమే సేకరించగలిగారు. అంటే.. దాదాపు మూడింట రెండొంతుల ఆస్తుల సేకరణే పూర్తయింది. దీంతో.. ఆధునీకరణ పనులూ ఆగిపోయాయి. ప్రోత్సాహకాలిచ్చినా... నాలాల ఆధునీకరణ పనులు పూర్తి చేసేందుకు కేంద్రం ఏడేళ్లు గడువు ఇచ్చినప్పటికీ.. పనులు పూర్తి చేయలేక పోయారు. తీరా ఆర్నెల్ల ముందు మాత్రం భూసేక రణ కోసం లబ్ధిదారులకు తగిన ప్రోత్సాహకాలు ప్రకటించారు. అయినప్పటికీ గడువు తక్కువగా ఉండటంతో ఆశించిన ఫలితం కనిపించలేదు. భూసేకరణ కు ఆర్నెల్ల క్రితం ప్రకటించిన కొత్త ప్యాకేజీ ఇలా ఉంది. భూసేకరణలో భూమి కోల్పోయే వారికి మిగిలే భూమి 50 చదరపు గజాల కంటే తక్కువ ఉన్నా పక్కా ఇల్లు. ఉన్న ఇల్లు కోల్పోయి.. ప్రభుత్వం కే టాయించే పక్కా ఇంటికి వెళ్లేవారికి నెలకు రూ. 10 వేల వంతున ఆర్నెల్ల పాటు రూ. 60 వేల వేతనం. కాంట్రాక్టర్ల టెండరు ప్రీమియంను ఐదు నుంచి 10 శాతానికి పెంచారు.