నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ఆధునికీకరణ పనులను మంగళవారం ప్రపంచబ్యాంకు బృందం పరిశీలించింది. ప్రపంచ బ్యాంకు నిధులతో కొనసాగుతున్న ఆధునీకీకరణ పనులు ఈఏడాది పూర్తి కానున్నాయి. ఆ పనుల ప్రగతిని పరిశీలించేందుకు బ్యాంకు ప్రతినిధులు వారం రోజులపాటు ఇప్పటి వరకు జరిగిన పనులను పరిశీలించి ప్రగతి నివేదికను తయారు చేయనున్నారు. అన్నిరంగాలకు సంబంధించిన నిపుణులు బృందంలో ఉన్నారు. అందులో భాగంగా బ్యాంకు ప్రతినిధుల బృందం సోమవారం సాగర్‌డ్యాంపై జరిగే పనులను, హాలియా, నిడమనూరు, మేళ్లచెరువు, హుజూర్‌నగర్ మండలంలోని వేపలసిం గారంలో ఎడమకాల్వ పనులను పరిశీలించారు. క్రస్ట్‌గేట్లు ఎత్తేందుకు మోటార్లు ఉంచే వంతెనతో పాటు 420 గ్యాలరీ, స్పిల్‌వే క్రస్ట్‌గేట్లు తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం టీంలీడర్ పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కాల్వల ప్రారంభం నుంచి చివరి వరకు పరిశీలించి ప్రగతి నివేదిక తయారు చేస్తామని తెలిపారు. వీరికి సాగర్‌డ్యాం అధికారులు జరిగిన పనులతో పాటు చేయాల్సిన పనులను చూయించారు. ఈబృందంలో నిపుణులు గౌతశివదాసిని, అనితకృష్ణ కరూర్, అర్జున్‌తోకేర్, తుమ్మర్‌దావా, పార్వతీశం, పాల్సింగ్‌సిద్ధు, జిన్‌జైన్, ఎస్.కె.జైన్, శాలిని అగర్వాల్ తదితరులున్నారు. వీరి వెంట సాగర్‌ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ సునీల్, ఎస్‌ఈ రమేశ్, ఈఈ వెంకట్‌రెడ్డి, డీఈలు సుదర్శన్‌రావు, విజయకుమార్, ఏఈలు రామారావు, జైల్‌సింగ్, కృష్ణయ్య, నర్సింహమూర్తి తదితరులున్నారు.
సాగర్ ఆధునికీకరణ పనుల పరిశీలన
Published Wed, Jan 18 2017 4:45 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
Advertisement