తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): ఆయా డివిజన్ పరిధిలో జరుగుతున్న ఆధునికీకరణ పనుల నిమిత్తం ఆయా మార్గాల్లో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసి, మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం జి.సునీల్‌కుమార్ తెలిపారు. బెంగళూరు డివిజన్‌లో జరుగుతున్న సాంకేతిక పనుల నిమిత్తం ఈ మార్గంలో నడిచే రైళ్లను దారి మళ్లిస్తున్నారు.
► యశ్వంత్‌పూర్‌లో ఈ నెల 25న బయల్దేరే యశ్వంత్‌పూర్–హౌరా(12246) దురంతో ఎక్స్‌ప్రెస్ వయా ఎల్లహంక, చన్నసంద్ర, కృష్ణరాజపురం మీదుగా నడుస్తుంది.
►24న హౌరాలో బయల్దేరిన హౌరా–యశ్వంత్‌పూర్(22863) ఎక్స్‌ప్రెస్ కూడా వయా కృష్ణరాజపురం, చన్నసంద్ర, ఎల్లహంక మీదుగా నడుస్తుంది.
►పూరీలో మార్చి 6న బయల్దేరే పూరీ–యశ్వంత్‌పూర్(22883) ఎక్స్‌ప్రెస్ వయా నంద్యాల, యర్రగుంట్ల, రేణిగుంట, మెల్‌పక్కం, జాలర్‌పేటల మీదుగా నడుస్తుంది.
గమ్యం కుదించిన రైళ్లు
►మార్చి 4 నుంచి 25వ తేదీ వరకు సంబల్‌పూర్‌లో బయల్దేరే సంబల్‌పూర్–బాన్స్‌వాడి(08301)స్పెషల్ ఎక్స్‌ప్రెస్ కృష్ణరాజపురం వరకే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో(08302) ఎక్స్‌ప్రెస్ మార్చి 5 నుంచి 26వ తేదీ వరకు బాన్స్‌వాడి నుంచి కాకుండా కృష్ణరాజపురం నుంచి బయల్దేరుతుంది. ఈ తేదీలలో కృష్ణరాజపురం–బాన్స్‌వాడి మధ్య ఈ రైళ్ల రాకపోకలు ఉండవు.
దానాపూర్ డివిజన్‌లో జరుగుతున్న భద్రతా పనుల నిమిత్తం ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నారు.
►ఎర్నాకుళంలో బయల్దేరే ఎర్నాకుళం–పాట్నా(22643) ఎక్స్‌ప్రెస్ మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు వయా అద్రా, నేతాజీ సుభాష్ చంద్రబోస్, గోమో, గయ మీదుగా ప్రయాణిస్తుంది. తిరుగు ప్రయాణంలో పాటా్నలో(22644) ఎక్స్‌ప్రెస్ మార్చి 19 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు వయా గయా, నేతాజీ సుభాస్‌చంద్రబోస్, గోమో, అద్రా మీదుగా నడిస్తుంది.
సోమవారం ఎల్‌టీటీ రద్దు
సెంట్రల్ రైల్వే పరిధిలో జరుగుతున్న ఆధునికీకరణ పనుల్లో భాగంగా విశాఖపట్నం–లోకమాన్యతిలక్ టెరి్మనస్–విశాఖపట్నం(18519/18520) మధ్య నడిచే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ ఇటీవల గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తోంది. ఆదివారం విశాఖకు రావలసిన ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ ఆలస్యంగా చేరుకుంది. విశాఖలో రాత్రి 11.25 గంటలకు బయల్దేరవలసిన విశాఖపట్నం–లోకమాన్యతిలక్ టెరి్మనస్(ఎల్‌టీటీ) ఎక్స్‌ప్రెస్ సోమవారం సాయంత్రం 6.30 గంటలకు విశాఖ నుంచి బయల్దేరింది. అటు నుంచి రావలసిన మరో రైలు 10 గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా నడుస్తున్నందున సోమవారం రాత్రి 11.25 గంటలకు బయల్దేరవలసిన ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment