సాక్షి, ముంబై : నగరంలో రైల్వేస్టేషన్లలల్లో ఆధునికీకరణ పనులు చేపట్టడానికి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగాంగా హర్బర్ లైన్ మార్గంలో త్వరలో లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లను నిర్మించాలని నిర్ణయించారు. డాక్యార్డ్ రోడ్, వడాలా, మాన్‌కుర్ద్, రేరోడ్, చెంబూర్, కింగ్స్‌సర్కిల్‌లల్లో 11 లిఫ్టులు, ఆరు ఫుట్ ఓవర్ బ్రిడ్జిల కోసం ప్రతిపాదనను తయారు చేశారు.
ఈ నిర్మాణాల కోసం కాంట్రాక్టుకు ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టు మార్చి 2015 వరకు పూర్తి అవుతోందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. చెంబూర్, కింగ్స్ సర్కిల్ వద్ద ఇప్పటికే పనులు ప్రారంభించారు. అన్ని స్టేషన్లలో ఈ పనులు పూర్తి అయితే ప్రయాణికులు ఫ్లాట్‌ఫాంలకు వెళ్లడానికి సులభమవుతుంది. అంతేకాకుండా ప్రమాదాల నివారణకు తోడ్పడుతోంది.
అన్ని స్టేషన్లలో సర్వే
హర్బర్ మార్గాంలో రోజుకు 10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తారు. ఈ మార్గంలో గల అన్ని రైల్వే స్టేషన్ల సర్వే నిర్వహించారు. ఈ స్టేషన్లలో ప్రయాణికుల అవసరాల మేరకు సదుపాయాలను నవీకరిస్తున్నామని ముంబై రైల్వే వికాస్ కార్పోరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ చెర్మైన్ రాకేష్ సక్సేనా తెలిపారు. ఒక్కో లిఫ్టుకు రూ.20 లక్షలు ఖర్చు అవుతాయి. ఎస్కలేటర్లకు రూ.ఒక్క కోటి ఖర్చు అవుతోందని అధికారి తెలిపారు. చెంబూర్‌లో చాలా మంది ప్రయాణికులు రైలు పట్టాలను దాటుతుంటారు. లిఫ్టులను ఏర్పాటు చేయడం ద్వారా వీరిని కొంత మేర అరికట్టవచ్చని తెలిపారు.
రద్దీ స్టేషన్లలో..: హర్బర్ మార్గంలో వడాలా రైల్వే స్టేషన్ చాలా రద్దీ గల స్టేషన్. ఈ స్టేషన్ పన్వేల్-సీఎస్టీ హర్బర్ లైన్ నుంచి సీఎస్టీ-అంధేరి లైన్‌ను కలుపనుంది. ఈ స్టేషన్‌లో మూడు ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. మూడు లిఫ్టులు, ప్లాట్‌ఫాం మధ్యలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. మాన్‌కూర్డ్ స్టేషన్‌లో అదనంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఇక్కడ రెండు లిఫ్టులు, ఒక ఎస్కలేటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
హార్బర్ లైన్‌లో ఆధునికీకరణ పనులు
Published Mon, Sep 15 2014 10:03 PM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM
Advertisement
Advertisement