లక్ష కోట్లు చెల్లించండి.. సీఎం ఫడ్నవీస్‌ ప్రభుత్వానికి అల్టిమేటం! | Maharashtra State Contractors Association Ultimatum To Government Over Pending Bills | Sakshi
Sakshi News home page

లక్ష కోట్లు చెల్లించండి.. సీఎం ఫడ్నవీస్‌ ప్రభుత్వానికి అల్టిమేటం!

Published Thu, Jan 30 2025 5:09 PM | Last Updated on Thu, Jan 30 2025 8:48 PM

Maharashtra State Contractors Association Ultimatum To Government Over Pending Bills

ముంబై : ప్రభుత్వం తమతో పనులు చేయించుకుని సుమారు రూ.లక్ష కోట్ల విలువైన బకాయిలను చెల్లించడం లేదని మహరాష్ట్ర స్టేట్‌ కాంట్రాక్టార్‌ అసోసియేషన్‌ (ఎంఎస్‌సీఏ) ఆరోపించింది. సీఎం ఫడ్నవీస్‌ ప్రభుత్వం పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని, లేదంటే వారం రోజుల తర్వాత ఆందోళన చేపడతామని కాంట్రాక్ట్‌ అసోసియేషన్‌ సభ్యులు అల్టిమేట్టం జారీ చేశారు.

జూలై 2024 నుండి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) నుండి చెల్లించని బిల్లులు దాదాపు రూ. 46,000 కోట్లకు చేరాయని ఎంఎస్‌సిఎ ప్రెసిడెంట్ మిలింద్ బోస్లే పేర్కొన్నారు. తద్వారా 4 లక్షల కాంట్రాక్టర్లు, 4 లక్షల కార్మికులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు.  మా ఆందోళనలను పరిష్కరించడానికి బదులుగా, ప్రభుత్వం ప్రచారం కోసం ఉచితాలపై దృష్టి పెట్టింది’ అని భోస్లే ఆరోపించారు.

ముంబై సర్కిల్‌లోని మూడు డివిజన్లలో రూ.600 కోట్ల బిల్లులు చెల్లించలేదని ముంబై కాంట్రాక్టర్ల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దాదా ఇంగలే పేర్కొన్నారు. చాలా మంది చిన్న కాంట్రాక్టర్లు, నిరుద్యోగ యువత అభివృద్ధి ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టారు. అయితే చెల్లింపులు ఆలస్యం కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

వివిధ శాఖల వద్ద మొత్తం రూ.1,09,300 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సంఘం పేర్కొంది. కాంట్రాక్టర్ల సంఘం ప్రకారం, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (రూ. 46,000 కోట్లు), జల్ జీవన్ మిషన్ (రూ. 18,000 కోట్లు), గ్రామీణాభివృద్ధి (రూ. 8,600 కోట్లు), నీటిపారుదల శాఖ (రూ. 19,700 కోట్లు), పట్టణాభివృద్ధికి రూ.17,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. .

ప్రభుత్వం హామీ  
కాంట్రాక్టర్ల ఆగ్రహంపై గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి యోగేష్ కదమ్ స్పందించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా నిధుల పంపిణీ ఆలస్యమైందని, చెల్లింపులు జరగలేదనే ఆరోపణలను తోసిపుచ్చారు. వచ్చే బడ్జెట్ సెషన్‌లో నిధుల్ని విడుదల చేస్తామన్నారు. విడతల వారీగా పెండింగ్ బిల్లులను క్లియర్ చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందని పబ్లిక్ వర్క్స్ మంత్రి శివేంద్ర రాజే బోస్లే హామీ ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement