pending bills
-
లక్ష కోట్లు చెల్లించండి.. సీఎం ఫడ్నవీస్ ప్రభుత్వానికి అల్టిమేటం!
ముంబై : ప్రభుత్వం తమతో పనులు చేయించుకుని సుమారు రూ.లక్ష కోట్ల విలువైన బకాయిలను చెల్లించడం లేదని మహరాష్ట్ర స్టేట్ కాంట్రాక్టార్ అసోసియేషన్ (ఎంఎస్‌సీఏ) ఆరోపించింది. సీఎం ఫడ్నవీస్ ప్రభుత్వం పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, లేదంటే వారం రోజుల తర్వాత ఆందోళన చేపడతామని కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులు అల్టిమేట్టం జారీ చేశారు.జూలై 2024 నుండి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పిడబ్ల్యుడి) నుండి చెల్లించని బిల్లులు దాదాపు రూ. 46,000 కోట్లకు చేరాయని ఎంఎస్సిఎ ప్రెసిడెంట్ మిలింద్ బోస్లే పేర్కొన్నారు. తద్వారా 4 లక్షల కాంట్రాక్టర్లు, 4 లక్షల కార్మికులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. మా ఆందోళనలను పరిష్కరించడానికి బదులుగా, ప్రభుత్వం ప్రచారం కోసం ఉచితాలపై దృష్టి పెట్టింది’ అని భోస్లే ఆరోపించారు.ముంబై సర్కిల్లోని మూడు డివిజన్లలో రూ.600 కోట్ల బిల్లులు చెల్లించలేదని ముంబై కాంట్రాక్టర్ల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దాదా ఇంగలే పేర్కొన్నారు. చాలా మంది చిన్న కాంట్రాక్టర్లు, నిరుద్యోగ యువత అభివృద్ధి ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టారు. అయితే చెల్లింపులు ఆలస్యం కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.వివిధ శాఖల వద్ద మొత్తం రూ.1,09,300 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సంఘం పేర్కొంది. కాంట్రాక్టర్ల సంఘం ప్రకారం, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (రూ. 46,000 కోట్లు), జల్ జీవన్ మిషన్ (రూ. 18,000 కోట్లు), గ్రామీణాభివృద్ధి (రూ. 8,600 కోట్లు), నీటిపారుదల శాఖ (రూ. 19,700 కోట్లు), పట్టణాభివృద్ధికి రూ.17,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. .ప్రభుత్వం హామీ కాంట్రాక్టర్ల ఆగ్రహంపై గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి యోగేష్ కదమ్ స్పందించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా నిధుల పంపిణీ ఆలస్యమైందని, చెల్లింపులు జరగలేదనే ఆరోపణలను తోసిపుచ్చారు. వచ్చే బడ్జెట్ సెషన్లో నిధుల్ని విడుదల చేస్తామన్నారు. విడతల వారీగా పెండింగ్ బిల్లులను క్లియర్ చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందని పబ్లిక్ వర్క్స్ మంత్రి శివేంద్ర రాజే బోస్లే హామీ ఇచ్చారు. -
బిల్లులు ఇస్తారా.. చావమంటారా?
కరీంనగర్: ‘గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవడం, అప్పులు తెచ్చి పనులు చేయడమే తప్పా. తక్షణమే మా బిల్లులు చెల్లించండి’అంటూ మాజీ సర్పంచ్‌లు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలంటూ మాజీ సర్పంచులు దశలవారీగా కలెక్టరేట్ వద్దకు చేరుకుని ప్లకార్డులతో నిర్వహించిన ప్రదర్శన ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయం నుంచే పోలీసులు ప్రధాన గేట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజావాణికి వచ్చే వారిని సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తూ లోపలికి పంపించారు.మాజీ సర్పంచ్‌లు దఫదఫాలుగా బృందాలుగా ఏర్పడి ప్రధాన గేట్ ముందుకు చొచ్చుకురావడంతో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పీటీసీ సెంటర్‌కు తరలించారు. తాజా మాజీ సర్పంచ్‌లు పంజాల జగన్మోహన్గౌడ్, శ్రీధర్, సమ్మయ్య, మల్లారెడ్డి తదితరులు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల బిల్లులు ఏడాదిగా మంజూరు చేయకపోవడంతో ఇక్కట్లు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బిల్లుల మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు. బిల్లులు ఇవ్వకపోతే చావే శరణ్యమన్నారు. -
పెండింగ్ బిల్లులు చెల్లించామనడం అవాస్తవం
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో గతంలో సర్పంచ్‌లు చేసిన అభి వృద్ధి పనులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయనప్పటికీ రూ.750 కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించేశామని ప్రభు త్వం పేర్కొనడం అవాస్తవమని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆరోపించింది. పెండింగ్ బిల్లులు చెల్లించామని అబద్ధాలు చెప్పడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థాయికి తగదని సంఘం నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డిలు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘2024 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ (ఎస్డీఎఫ్) నిధులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ) నిధులు ఇవ్వలేదు. జనరల్ నిధులపైనా ఫ్రీజింగ్ ఇంకా ఎత్తివేయలేదు. ఇప్పటికీ గత సర్పంచుల చెక్కులు ట్రెజరీలోనే ఉన్నాయి’అని వారు పేర్కొన్నారు. ఆందోళనకు దిగుతాం.. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడుస్తున్నా.. సర్పంచ్‌లపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆరోపించింది. డిసెంబర్ 1వ తేదీ వరకు పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే తెలంగాణ మొత్తం 12,769 సర్పంచ్ల కుటుంబ సభ్యులతోపాటు ప్రజలను కూడగట్టుకొని ఆందోళనకు దిగుతామని స్పష్టం చేసింది. -
తెలంగాణ మాజీ సర్పంచ్ల ఆందోళన
-
మాజీ సర్పంచ్ల చలో హైదరాబాద్ భగ్నం
బంజారాహిల్స్/ రసూల్‌పురా (హైదరాబాద్): గ్రామ పంచాయతీల్లో చేసిన వివిధ పనులకు సంబంధించి తమకు రావాల్సి ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలంటూ సర్పంచుల సంఘం చేపట్టిన చలో హైదరాబాద్ పోరుబాట కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. సోమవారం ఆందోళనకు సిద్ధమైన మాజీ సర్పంచులను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చేరుకుని, పోరుబాటకు సిద్ధమైన మాజీ సర్పంచులు, సంఘం నేతలను బంజారాహిల్స్ పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. చలో పోరుబాట పేరుతో సీఎం రేవంత్‌రెడ్డిని కలసి వినతిపత్రాన్ని అందజేస్తామని వారు కోరినా పోలీసులు వినిపించుకోలేదు. ఈ సమయంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ఇతర నేతలు మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించకుండా.. ప్రభుత్వం వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలకు వెళతామనడం సరికాదని పేర్కొన్నారు. 2019 నుంచి హరిత హారం, మిషన్ భగీరథ, నర్సరీల పెంపకం, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డుల, రైతు వేదికలు, సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు ఇతర అభివృద్ధి పనులకు అప్పటి సర్పంచులు అప్పులు చేశారని.. పెండింగ్‌లో ఉన్న ఆ బిల్లు లు ఇవ్వకుండా ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించా రు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే మాజీ సర్పంచుల కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని వాపోయారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, మాట్ల మధు, కార్యదర్శి రాపాక నాగయ్య, నవీన్‌గౌడ్, సుభా‹Ùగౌడ్, గణేశ్ ముదిరాజ్, రాజేందర్, మల్లేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్‌లకు మద్దతుగా హరీశ్‌రావు నిరసన పోలీసులు మాజీ సర్పంచ్‌లను అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనితో మాజీ మంత్రి హరీశ్‌రావు, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు అక్కడికి చేరుకుని మాజీ సర్పంచులకు మద్దతుగా ఆందోళనకు దిగారు. దీనితో పోలీసులు హరీశ్‌రావు, ఇతర నేతలను అదుపులోకి తీసుకుని తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనితో వారు పోలీస్‌స్టేషన్ ఎదుట రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. చలో హైదరాబాద్‌కు పిలుపునిచి్చన మాజీ సర్పంచులను ఎక్కడికక్కడ దొంగలనో, టెర్రరిస్టులనో అరెస్టు చేసినట్టుగా అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మాజీ సర్పంచుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. వారు అప్పులు చేసి, భార్యాపిల్లల మీద బంగారం అమ్మి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశారని.. ఆ పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి. పద్మా దేవేందర్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.సర్పంచ్ల బకాయిలకు మాదీ గ్యారంటీ» పొలిటికల్ ట్రాప్‌లో పడకండి: పొన్నం» సర్పంచుల ఆత్మహత్యలకుకారణం బీఆర్ఎస్ ప్రభుత్వమే సాక్షి, హైదరాబాద్: సర్పంచులు పొలిటికల్ ట్రాప్ లో పడొద్దని, వారి బకాయిలను చెల్లించే గ్యారంటీ తాము తీసుకుంటామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. నాడు సర్పంచ్ల ఆత్మహత్యలకు కారణమైన బీఆర్ఎస్ ఇప్పుడు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్‌గాంధీ పర్యటన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించేందుకు సోమవారం గాంధీభవన్‌కు వచ్చిన ఆయన మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు.సర్పంచులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఓపిక పట్టాలని, మార్చి నెలాఖరులోగా సర్పంచుల బకాయిలు దఫాలవారీగా చెల్లిస్తామని అన్నారు. సర్పంచులకు నిధుల బకాయిలు బీఆర్ఎస్ చేసిన పాపమేనని, వారి ఆత్మహత్యలకు బీఆర్ఎస్ కారణం కాదా అని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డిది తెలంగాణ డీఎన్ఏ కాదు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణ డీఎన్ఏ లేదని, ఆ డీఎన్ఏ ఉంటే తెలంగాణ కోసం ఆయన ఏదైనా చేసేవారని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో అమరవీరుల స్తూపం వద్ద చర్చకు రావాలని ఆ పార్టీ నేతలకు పొన్నం సవాల్ విసిరారు. కేసీఆర్ సలహాతో బీజేపీ అధ్యక్షుడు అయిన కిషన్‌రెడ్డి విమర్శలు చేస్తే తాము ఊరుకోవాలా అని ప్రశ్నించారు. -
‘ఎన్నికల’ పెండింగ్ బిల్లులకు రూ.286.36 కోట్లు
సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల నిర్వహణ పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు జిల్లాల వారీగా రూ.286.36 కోట్లు అదనపు నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పెండింగ్ బిల్లులకే అదనపు నిధులను చెల్లించాలని, ఇతర శాఖల పనులకు ఈ నిధులను వ్యయం చేయరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లాల వారీగా ఏ పద్దు కింద ఎన్ని నిధులను విడుదల చేసింది కూడా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ఖర్చు వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
Supreme Court: బిల్లులు ఎందుకు ఆపేశారో చెప్పండి
న్యూఢిల్లీ: కేరళ, పశి్చమ బెంగాల్ శాసనసభల్లో ఆమోదించిన బిల్లులకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు అంగీకారం తెలియజేయకుండా సుదీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టడం పట్ల సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గవర్నర్ల వైఖరిని సవాలు చేస్తూ కేరళ, పశి్చమ బెంగాల్ ప్రభుత్వాలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. కేంద్ర హోం శాఖకు, కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్, బెంగాల్ గవర్నర్ ఆనందబోసు కార్యదర్శులకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. బిల్లులను ఎందుకు పెండింగ్‌లో కొనసాగిస్తున్నారో మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే పిటిషన్లో కేంద్ర హోంశాఖను సైతం ఒక పార్టీగా చేర్చాలని బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది. తమ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్ అంగీకారం తెలియజేయడం లేదంటూ కేరళ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
నాంపల్లి (హైదరాబాద్): సర్పంచ్‌లకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాలక, ప్రతిపక్షాలు నోరు మెదపకపోవడం బాధాకరమని తెలంగాణ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్య ధ్వజమెత్తారు. గురువారం నాంపల్లిలోని గన్‌పార్కు వద్ద తెలంగాణ సర్పంచ్ల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన తాజా మాజీ సర్పంచ్‌లు ముందుగా పబ్లిక్‌గార్డెన్స్‌కు చేరుకున్నా రు. అక్కడి నుంచి ర్యాలీగా గన్‌పార్కుకు వచ్చారు. నిరసన సభ ఉద్రిక్తతకు దారితీయకుండా పోలీసులు భారీగా మోహరించారు. గన్‌పార్కు వద్ద మాజీ సర్పంచ్‌లు నిరసన వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడికక్కడే అరెస్టు చేసి, నాంపల్లి పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా సుర్వి యాదయ్య విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం సర్పంచ్‌లను మోసం చేస్తే...అధికారంలోకి రాగానే సర్పంచ్‌లను ఆదుకుంటామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని రెండు పర్యాయాలు కలిసి వినతిపత్రం అందజేశామని చెప్పా రు. పార్లమెంట్ ఎన్నికలలోపు సర్పంచ్‌లకు అందాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశా రు. లేకపోతే ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో వందకు పైగా నామినేషన్లు దాఖలు చేసి ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో సర్పంచ్ల సంఘం నేతలు కొలను శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీతో గంటన్నర పాటు సాగిన సీఎం జగన్ భేటీ
-
మూడేళ్లు ఏం చేసినట్లు?
న్యూఢిల్లీ: ఆమోదముద్ర కోసం తన వద్దకు వచ్చిన బిల్లులకు మూడేళ్లుగా ఇంకా ఏ నిర్ణయమూ వెల్లడించని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఆగ్రహం వ్యక్తంచేసింది. డీఎంకే సర్కార్ అసెంబ్లీలో ఆమోదింపజేసిన బిల్లులను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారంటూ తమిళనాడు రాష్ట్ర ప్రభత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారించింది. ‘ పంజాబ్ ప్రభుత్వ కేసులో మేం ఆదేశాలు జారీచేసేదాకా తమిళనాడు గవర్నర్ మేలుకోలేదు. 2020 జనవరి నుంచి తన వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ఆమోదముద్ర వేయలేదు. మూడేళ్లు ఆయన ఏం చేసినట్లు? ఇదే తరహా పంజాబ్ ప్రభుత్వ కేసులో నవంబర్ 10న మేం ఆదేశాలిచ్చాకే అది చూసి ఆర్ఎన్ రవి పాత బిల్లులపై నిర్ణయం తీసుకున్నారు. ఇంతటి తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రమాదకరం’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఐదే ఉన్నాయి కోర్టు వ్యాఖ్యానాలపై గవర్నర్ తరఫున హాజరైన అటార్నీ జనరల్(ఏజీ) ఆర్. వెంకటరమణి వాదనలు వినిపించారు. ‘ ఈ బిల్లుల్లో ఎన్నో సంక్షిష్టమైన అంశాలున్నాయి. అయినా ఇవి పాత బిల్లులు. ప్రస్తుత గవర్నర్ 2021 నవంబర్ 18న బాధ్యతలు స్వీకరించకముందు నాటివి. బిల్లుల ఆమోదం ఆలస్యాన్ని ఈ గవర్నర్‌కు ఆపాదించొద్దు. ప్రస్తుతం గవర్నర్ వద్ద కేవలం ఐదు బిల్లులే పెండింగ్‌లో ఉన్నాయి. మిగతా 10 బిల్లులను శనివారమే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మళ్లీ ఆమోదించింది’ అని వాదించారు. కేరళ గవర్నర్, కేంద్రానికి నోటీసులు పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలపకుండా ఆలస్యం చేస్తున్నారని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌పై ఆ రాష్ట్ర సర్కార్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. దీనిపై స్పందన తెలపాలని కేరళ గవర్నర్, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ‘గవర్నర్ రాష్ట్రానికి అతీతులుగా వ్యవహరిస్తున్నారు. ఆరిఫ్ వద్ద 7–21 నెలలుగా ఎనిమిది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి’ అని కేరళ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వొకేట్ కేకే వేణుగోపాల్ వాదించారు. -
Tamil Nadu: గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య రగులుతున్న వివాదం మరింత ముదురుతోంది. అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను గవర్నర్ ఆమోదించడంలో జాప్యం చేస్తున్నారంటూ స్టాలిన్ ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో సర్కార్ వర్సెస్ గరర్నర్ మధ్య వైరం తారాస్థాయికి చేరింది. తాజాగా గవర్నర్‌కు వ్యతిరేకంగా సీఎం స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైన తమిళనాడు అసెంబ్లీ.. గతంలో తీర్మానించిన 10 బిల్లులను మరోసారి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించిన 10 బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ వెనక్కి పంపిన నేపథ్యంలో ఆర్ఎన్ రవి చర్యపై తమిళనాడు ప్రభుత్వం శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించింది. అయితే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు అన్న డీఎంకే, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. బిల్లులపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో స్టాలిన్ మాట్లాడుతూ గవర్నర్‌పై నిప్పులు చెరిగారు. ప్రజాప్రతినిధులతో కూడిన అసెంబ్లీ తీర్మానించిన బిల్లులకు ఆమోదం తెలపడం గవర్నర్ బాధ్యత అని తెలిపారు. అయనకు ఏవైనా సందేహాలు ఉంటే దానిని ప్రభుత్వానికి తెలియజేయవచ్చని సూచించారు. గతంలో గవర్నర్ కొన్ని బిల్లులపై ప్రశ్నలు లేవనెత్తినప్పుడు రాష్ట్రం వెంటనే స్పందించించి వివరణ ఇచ్చిందని గుర్తు చేశారు. గవర్నర్ కోరిన వివరణను ప్రభుత్వం ఇవ్వని సందర్భం ఎప్పుడూ లేదని ప్రస్తవించారు. గవర్నర్ వద్ద 12 బిల్లులు పెండింగులో ఉన్నామని, ఎలాంటి కారణం చెప్పకుండా బిల్లులను నిలిపివేయడం తమిళనాడు ప్రజలను అవమానించడం, రాష్ట్ర అసెంబ్లీని అవమానించారని దుయ్యబట్టారు. చదవండి: వరల్డ్‌కప్ ఫైనల్.. క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే శుభవార్త గవర్నర్ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్టాలిన్ మండిపడ్డారు. గవర్నర్‌గా నియమితులైన వ్యక్తి రాష్ట్ర సంక్షేమం కోసం పని చేయాలని, ప్రభుత్వానికి అండగా ఉండాలని సూచించారు. అలా కాకుండా రాష్ట్ర పథకాలను ఎలా నిలిపివేయాలనే దాని గురించే గవర్నర్ ఆలోచిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది అప్రజాస్వామికం, ప్రజావ్యతిరేకమని విమర్శించారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను అడ్డం పెట్టుకొని కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కారణాలు చెప్పకుండా గవర్నర్ తిప్పి పంపిన 10 బిల్లులను మరోసారి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. తాజాగా ఆమోదం పొందిన బిల్లులలో 2020, 2023లో అసెంబ్లీ తీర్మానించిన రెండేసి బిల్లులు ఉండగా.. మరో ఆరు బిల్లులు 2022లోనే ఆమోదించినవి ఉన్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వైస్ ఛాన్సలర్ల నియామకంలో గవర్నర్ అధికారాలను తగ్గించేలా తీసుకొచ్చిన తీర్మానం, వ్యవసాయం, ఉన్నత విద్య వంటి అంశాలకు చెందినవి ఉన్నాయి. . ఇదిలా ఉండగా అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్ జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. బిల్లుల విషయంలో గవర్నర్లు వ్యవహరంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్లు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని.. వారికి ఆత్మపరిశీలన అవసరమని పేర్కొంది. ఇది తీవ్ర ఆందోళనకరమైన అంశమని పేర్కొంది. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులపై నిర్దేశిత సమయంలో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచి గత బిల్లులను ఆమోదించడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
సుప్రీంకోర్టు మొట్టికాయ.. మరోసారి తమిళనాడు గవర్నర్ వివాదాస్పద నిర్ణయం
చెన్నై: ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ల వైఖరి రోజురోజుకీ వివాదాస్పదంగా మారుతుంది. పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోని గవర్నర్లు, ప్రభుత్వాల మధ్య వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. పంజాబ్, తమిళనాడులో బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్ల జాప్యంపై ఇప్పటికే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్లు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని.. వారికి ఆత్మపరిశీలన అవసరమని పేర్కొంది. ఇది తీవ్ర ఆందోళనకరమైన అంశమని పేర్కొన్న అత్యున్నత ధర్మాసనం.. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులపై నిర్దేశిత సమయంలో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్లను ఆదేశించింది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ వివాదం మరో మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు మొట్టికాయ వేసిన వారం రోజుల్లోనే గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. చాలా కాలంగా తన వద్ద పెండింగ్‌లో ఉన్న 10 బిల్లులను గవర్నర్ వెనక్కి పంపారు. వీటిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్‌ను నియమించడంలో గవర్నర్‌కు ఉన్న అధికార పరిధిని తగ్గించడం ఒకటి అయితే గత అన్న డీఎంకే ప్రభుత్వంలోని మంత్రులను విచారించేందుకు అనుమతి కోరుతూ పంపిన బిల్లులు కూడా ఉన్నాయి. గవర్నర్ చర్యపై శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. గవర్నర్ ఆర్ఎన్ రవి తిప్పి పంపిన బిల్లులను మరోసారి అసెంబ్లీలో ఆమోదించి ఆయనకు పంపనున్నట్లు స్పీకర్ ఎం అప్పావు తెలిపారు. బీజేపీ నియమించిన గవర్నర్ ఉద్ధేశపూర్వకంగా బిల్లల ఆమోదంలో ఆలస్యం చేస్తున్నారని, ఇది ప్రజల ద్వారా ఎన్నికైన పాలనను అణగదొక్కడమేనని డీఎంకే ప్రభుత్వం విమర్శిస్తోంది. కాగా అంతకముందు కూడా గవర్నర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) వ్యతిరేక బిల్లును సైతం వెనక్కి పంపిన విషయం తెలిసిందే. చదవండి: 'ఐక్యమయ్యాం.. విజయం సాధిస్తాం: రాహుల్ గాంధీ -
గవర్నర్‌పై సుప్రీంకోర్టులో కేరళ పిటిషన్
న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లులకు అంగీకారం తెలపడంలో రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్ విపరీతమైన జాప్యం చేస్తున్నారని కేరళ ప్రభుత్వం ఆక్షేపించింది. బిల్లులకు త్వరగా అంగీకారం తెలిపేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖ లు చేసింది. ప్రజల హక్కులను గవర్నర్ అగౌరవపరుస్తున్నారని పేర్కొంది. ప్రస్తుతం 8 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది. వాటిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తెలియజేసింది. ఇవన్నీ ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులేనని ఉద్ఘాటించింది. -
పార్లమెంట్ 'ప్రత్యేక' భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. దేశ ప్రజల్లో ఒక్కసారిగా ఆసక్తిని పెంచేసింది. ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ప్రకటించారు. సెప్టెంబర్ 18 నుంచి 22 దాకా ఈ సమావేశాలు (17వ లోక్‌సభకు 13వ సెషన్, రాజ్యసభకు 261వ సెషన్) జరుగుతాయని అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రస్తుత అమృతకాలంలో పార్లమెంట్లో అర్థవంతమైన, ఫలప్రదమైన చర్చల కోసం తాము ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. అయితే, పార్లమెంట్ ప్రత్యేక భేటీల ఎజెండా ఏమిటన్నది ప్రభుత్వం బయట పెట్టలేదు. దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10న జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. కూటమి దేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. జీ20 సదస్సు తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం తలపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. సెపె్టంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం. ఆ మరుసటి రోజే ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానుండడం విశేషం. కొత్త భవనంలోనే సమావేశాలు ప్రత్యేక సమావేశాలు పార్లమెంట్ నూతన భవనంలోనే జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మే 28న ఈ కొత్త భవనాన్ని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. సాధారణంగా ప్రతిఏటా మూడుసార్లు (బడ్జెట్, వర్షాకాల, శీతాకాల) పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తుంటారు. అయితే, ఈసారి ప్రత్యేక సమావేశాల వెనుక కారణంగా ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 85 ప్రకారం.. ఏడాదిలో కనీసం రెండుసార్లు పార్లమెంట్‌ను సమావేశపరచాల్సి ఉంటుంది. రెండు భేటీల మధ్య వ్యవధి 6 నెలలకు మించరాదు. దానికి అనుగుణంగానే ప్రతిఏటా ఫిబ్రవరి–మే నెలల మధ్యలో బడ్జెట్, జూలై–ఆగస్టు మధ్య వర్షాకాల, నవంబర్–డిసెంబర్ల మధ్య శీతాకాల సమావేశాలను నిర్వహిస్తారు. ఈసారి ఏకంగా ఐదు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుండడం పట్ల దేశవ్యాప్తంగా ఉత్కంఠ పెరిగిపోయింది. పెండింగ్‌లో ఉన్న బిల్లుకు మోక్షం! మరోవైపు సార్వత్రిక ఎన్నికల కంటే ముందే దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా పార్లమెంట్లో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అయితే, రాజకీయ అవసరాల కోసమే బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతిని తెరపైకి తీసుకొస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కూడా ఈ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లు గత రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లోనే ఉండిపోయింది. వివిధ వర్గాల నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చంద్రయాన్–3 మిషన్ చరిత్ర సృష్టించడం, ‘అమృతకాలం’లో భారతదేశ లక్ష్యాలతోపాటు ఇతర ముఖ్యమైన అంశాలపైనా ప్రత్యేక సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రజల దృష్టిని మళ్లించడానికే: జైరామ్ రమేశ్ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సమావేశాలు, అదానీ గ్రూప్‌లో అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఐదు రోజుల ప్రత్యేక సమావేశాల పేరిట మోదీ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెర తీసిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ విమర్శించారు. ‘ఇండియా’ కూటమి సమావేశాల వార్తలకు మీడియాలో ప్రాధాన్యం లేకుండా చేయడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడు వారాల క్రితమే ముగిశాయని, ఇంతలోనే మళ్లీ భేటీ కావడం వెనుక మతలబు ఏమిటని నిలదీశారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై విచారణ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేయాలంటూ పార్లమెంట్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని జైరామ్ రమేశ్ చెప్పారు. వినాయక చవితి ఉత్సవాలు జరిగే సమయంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం సరైంది కాదని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నేత ప్రియాంక చతుర్వేది అన్నారు. ఆ బిల్లుల ఆమోదానికేనా? వన్ నేషన్–వన్ ఎలక్షన్, మహిళా రిజర్వేషన్, ఉమ్మ డి పౌరస్మృతి(యూసీసీ) బిల్లులను మోదీ ప్రభు త్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుందని ఢిల్లీలో చర్చ జరుగుతోంది. ఇందులో వన్ నేషన్–వన్ ఎలక్షన్ బిల్లు అత్యంత ముఖ్యమైనది. దీన్ని ప్రవేశపెట్టడం వెనుక అసలు ఉద్దేశం వచ్చే ఏడాది జరిగే సార్వ త్రిక ఎన్నికలను ముందుకు జరపడమేనని రాజకీ య పరిశీలకులు చెబుతున్నారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్లో తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు సార్వత్రిక ఎన్నికలను నిర్వహించాలన్న ప్రతిపాదనపై బలమైన చర్చ జరుగుతోంది. కేంద్రం ముందస్తుకు వెళ్లే యత్నాల్లో ఉందని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు చెబుతున్నాయి. మరోవైపు దేశంలో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ విధానమే మార్గమని బీజే పీ నాయకులు అంటున్నారు. దేశమంతటా లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సూచిస్తున్నారు. ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ అమలుకు కనీసం 5 కీలక రాజ్యాంగ సవరణలు చేయాలి. అందుకు అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కావాలి. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అంశం జాతీయ లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర న్యా య శాఖ మంత్రి మేఘ్వాల్ గతంలోనే చెప్పారు. ప్రత్యేక సమావేశాలు కొత్తేమీ కాదు పార్లమెంట్ బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలు కాకుండా, ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం అసాధారణమేమీ కాదు. 2017 జూన్ 30న అర్ధరాత్రి పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపర్చారు. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. కానీ, ఇది లోక్‌సభ, రాజ్యసభ ఉమ్మడి సమావేశం. 50వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని 1997 ఆగస్టులో ఆరు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. క్విట్ ఇండియా ఉద్యమానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1992 ఆగస్టు 9న, స్వాతంత్య్ర దినోత్సవ సిల్వర్ జూబ్లీ సందర్భంగా 1972 ఆగస్టు 14–15న అర్ధరాత్రి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరిగింది. ఇది కూడా చదవండి: తెలంగాణలో ఎన్నికల ఎఫెక్ట్.. AICC కీలక నిర్ణయం -
తెలంగాణలో ప్రభుత్వం, గవర్నర్ మధ్య మళ్లీ పెండింగ్ బిల్లుల లొల్లి...!
-
బిల్లుల లొల్లి.. మళ్లీ!.. గవర్నర్ వద్ద నిలిచిపోయిన 12 బిల్లులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మధ్య పెండింగ్ బిల్లుల జగడం మళ్లీ రాజుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, మండలిలో 12 బిల్లులను పాస్ చేసి గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం పంపించగా.. వారం రోజుల నుంచి రాజ్‌భవన్‌లోనే పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఉద్దేశించిన టీఎస్ఆర్టీసీ చట్ట సవరణ బిల్లు–2023 కూడా వీటిలో ఉంది. గవర్నర్ ఆమోదించాక, ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్లను జారీ చేశాక ఈ బిల్లులు చట్టరూపం దాల్చి, అమల్లోకి రానున్నాయి. రెండోసారి పంపినా నిరీక్షణ గవర్నర్ తమిళిసై గతంలో తిప్పి పంపిన 3 బిల్లులు, తిరస్కరించిన మరో బిల్లుతో కలిపి మొత్తం 4 బిల్లులను ప్రభుత్వం ఇటీవల రెండోసారి అసెంబ్లీలో ఆమోదించింది. వీటితోపాటు మరో 8 కొత్త బిల్లులను సైతం ఆమోదించి.. మొత్తం 12 బిల్లులను రాజ్‌భవన్‌కు పంపింది. వీటి విషయంలో గవర్నర్ కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను అసెంబ్లీ మళ్లీ ఆమోదించి పంపిస్తే.. గవర్నర్ ఆమోదించక తప్పదని రాజ్యాంగంలోని నిబంధనలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు సదరు నాలుగు బిల్లులను ఆమోదించడం తప్ప గవర్నర్‌కు గత్యంతరం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మరికొన్ని రోజులు గవర్నర్ స్పందన కోసం నిరీక్షించిన అనంతరం.. పెండింగ్ బిల్లుల వ్యవహారంపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. రెండు నెలల్లో శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో.. ఆలోగానే బిల్లులను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్థులపై ‘పరిశీలన’! గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎరుకల సామాజికవర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణ, బలహీనవర్గాల నుంచి దాసోజు శ్రవణ్‌లను నామినేట్ చేయాలని రాష్ట్ర కేబినెట్ గత నెల 31న తీర్మానం చేసి పంపినా.. గవర్నర్ తమిళిసై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్సీలుగా నియమించేందుకు వారికి ఉన్న అర్హతలను గవర్నర్ పరిశీలిస్తున్నారని రాజ్‌భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు గతంలో కొంతకాలం బీజేపీలో పనిచేసి.. తర్వాత బీఆర్ఎస్లో చేరినవారే. గతంలో కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు గవర్నర్ సమ్మతించకపోవడం నేపథ్యంలో.. ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. నెలల తరబడి పరిశీలనలోనే..! పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై న్యాయ సలహా కోరినట్టు సమాచారం. బిల్లులు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా? లేదా? అన్న అంశంపై పరిశీలన కోసం తనకు అవసరమైనంత సమయం తీసుకుంటానని గవర్నర్ గతంలో పలుమార్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో నెలల తరబడి బిల్లులు రాజ్‌భవన్ ‘పరిశీలన’లో ఉండిపోతున్నాయి. రాజ్‌భవన్‌లో ఉన్న బిల్లులు ఇవీ.. రెండోసారి ఆమోదించి పంపినవి.. తెలంగాణ మున్సిపల్ బిల్లు–2022 తెలంగాణ ప్రైవేటు వర్సిటీల బిల్లు–2022 రాష్ట్ర పంచాయతీరాజ్ బిల్లు–2023 తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యూయేషన్) బిల్లు–2022 తొలిసారిగా ఆమోదించి పంపినవి.. తెలంగాణ పంచాయతీరాజ్ (మూడో సవరణ) బిల్లు – 2023 తెలంగాణ మున్సిపాలిటీల (రెండో సవరణ) బిల్లు–2023 తెలంగాణ ఆర్టీసీ బిల్లు (సర్కారులో ఉద్యోగుల విలీనం) – 2023 తెలంగాణ పంచాయతీరాజ్ (రెండో సవరణ) బిల్లు–2023 తెలంగాణ జీఎస్టీ చట్ట సవరణ బిల్లు–2023 తెలంగాణ స్టేట్ మైనారిటీస్ కమిషన్ బిల్లు–2023 ఫ్యాక్టరీల చట్ట సవరణ బిల్లు–2023 టిమ్స్ వైద్య సంస్థల బిల్లు–2023 -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ఇటీవల పోలీసు ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు రూ. 554 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖలోని ప్రతి అధికారి, సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని సీఎం జగన్ తెలపడంతో పోలీసు అధికారుల సంఘం ప్రతినిధుల హర్షం వ్యక్తం చేశారు. సీఎంను కలిసిన వారిలో పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎండి.మస్తాన్‌ఖాన్, ట్రెజరర్ ఎం.సోమశేఖర రెడ్డి, ఉప్పు శంకర్, కే.రామునాయుడు, బి.స్వర్ణలత, పి.శేషయ్య, సీహెచ్.హజరత్తయ్య, డి.సురేష్, ఆర్.నాగేశ్వరరావు, జి.అక్కిరాజు, పి.ఓంకార్, కే.నాగిని, టి.మాణిక్యాలరావు ఉన్నారు. చదవండి: ఇదేం తీరు.. ఇదేం హింస? అవినాష్‌రెడ్డిపై విషం కక్కుతున్న ఎల్లో మీడియా -
మరో 3 బిల్లుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలతో రాజ్‌భవన్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండిపోయిన బిల్లుల వ్యవహారంలో మరికొంత కదలిక వచ్చింది. మొత్తం 10 బిల్లులు పెండింగ్‌లో ఉండగా, 7 బిల్లులపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయాలు తీసుకుని పరిష్కరించినట్టు ఈ నెల 10న సుప్రీంకోర్టుకు రాజ్‌భవన్ నివేదించింది. తాజాగా మిగిలిన 3 బిల్లులపై సైతం గవర్నర్ నిర్ణయాలు తీసుకుని పరిష్కరించారని సోమవారం వెల్లడించింది. రాజ్‌భవన్ వర్గాల ప్రకారం.. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ ఏన్యుయేషన్) చట్ట సవరణ బిల్లు–2022ను గవర్నర్ తిరస్కరించారు. తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు–2022తో పాటు తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు–2022పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణలు కోరుతూ తిప్పి పంపారు. ప్రస్తుతం తమ వద్ద ఎలాంటి ప్రభుత్వ బిల్లులు పెండింగ్‌లో లేవని రాజ్‌భవన్ అధికారవర్గాలు వెల్లడించాయి. ఇలావుండగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు–2023 పై వివరణలు కోరుతూ గతంలోనే తిప్పి పంపడంతో.. ఈ విధంగా ప్రభుత్వానికి తిప్పి పంపిన బిల్లుల సంఖ్య మూడుకు పెరిగింది. కేవలం 3 బిల్లులకే ఆమోదం .. తెలంగాణ మోటారు వాహనాల పన్నుల చట్ట సవరణ బిల్లు–2022, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లు–2023, తెలంగాణ మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లు–2023కు గవర్నర్ తమిళిసై ఈ నెల 9న ఆమోదం తెలిపారు. కీలకమైన తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు–2022, తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం బిల్లు–2022లను రాష్ట్రపతి పరిశీలన, ఆమోదం కోసం పంపించారు. ఆజామాబాద్ పారిశ్రామిక ప్రాంత (లీజుల నియంత్రణ, రద్దు) చట్ట సవరణ బిల్లు–2022 న్యాయశాఖ నుంచి చేరలేదని రాజ్‌భవన్ అధికారులు పేర్కొంటున్నారు. -
సుప్రీంకోర్టులో ముగింపుకొచ్చిన తెలంగాణ సర్కార్, గవర్నర్ పంచాయితీ
న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసుపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లులు లేనందున కేసు పరిష్కారం అయినట్లు సీజేఐ ధర్మాసనం ప్రకటించింది. కేసును ముగిస్తూ.. బిల్లుల విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 200(1) ప్రకారం సాధ్యమైనంత త్వరగా అనే అంశం ప్రాధాన్యతను గవర్నర్లు గుర్తించాలని సీజేఐ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. విచారణ సందర్భంగా తమవద్ద ఏ బిల్లులు పెండింగ్‌లో లేవని గవర్నర్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. రెండు బిల్లుల విషయంలో ప్రభుత్వం నుంచి అదనపు సమాచారం, క్లారిఫికేషన్ కోరినట్లు పేర్కొన్నారు. కాగా కీలక బిల్లులను తిప్పి పంపారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఎన్నికైన చట్ట సభల ప్రతినిధులు గవర్నర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వ తరపు లాయర్ వాదించారు. బిల్లులు తిప్పి పంపాలంటే వీలైనంత వెంటనే పంపొచ్చని, కానీ తన వద్దనే పెండింగులో పెట్టుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో ఒక వారంలో, గుజరాత్లో ఒక నెలలో బిల్లులన్నీ క్లియర్ అవుతున్నాయన్న విషయాన్ని కోర్టుకు తెలిపారు. గవర్నర్లు కూడా రాజ్యాంగం ప్రకారం నడచుకోవాలని సూచించారు. గవర్నర్లు నిర్ణీత కాలవ్యవధిలోగా బిల్లులపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. వివరణ కోసం గవర్నర్ బిల్లులు తిప్పి పంపే అధికారం ఉందని స్పష్టం చేసింది. అయినా ప్రస్తుతం గవర్నర్ వద్ద ఏదీ పెండింగులో లేదని తెలిపింది. అయితే రాజ్యంగంలోని 200(1)వ అధికరణను గవర్నర్లు దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని సీజేఐ ధర్మాసనం వ్యాఖ్యానించింది. చదవండి: ఎవడెన్ని ట్రిక్‌లు చేసిన హ్యాట్రిక్ కొట్టడం ఖాయం: మంత్రి హరీష్ రావు -
పెండింగ్ బిల్లుల వ్యవహారం.. షాకిచ్చిన గవర్నర్ తమిళిసై
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో కేసీఆర్ సర్కార్ వర్సెస్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నట్టుగా పొలిటికల్ హీట్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లుల పిటిషన్‌పై విచారణ జరుగనుంది. కాగా, బిల్లులను గవర్నర్ తమిళిసై పెండింగ్‌లో పెట్టడంపై తెలంగాణ ప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక, సొలిసిటర్ జనరల్.. గవర్నర్ తమిళిసై వద్ద బిల్లుల పొజిషన్‌ను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే, ఇప్పటికే పలు బిల్లులకు ఆమోదం తెలిపిన గవర్నర్.. తాజాగా తన వద్ద ఉన్న మరికొన్ని బిల్లుల్లో ఒకదాన్ని తిరస్కరించగా.. మిగతావాటిపై ప్రభుత్వ వివరణ కోరారు. ప్రభుత్వం ఆమోదించి తన వద్దకు పంపిన డీఎంఈ పదవీ విరమణ వయసు పెంపు బిల్లును ఆమె తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరిన వాటిలో పురపాలక నిబంధనల చట్ట సవరణ, ప్రైవేటు వర్సిటీల చట్ట సవరణ బిల్లులు ఉన్నాయి. మొత్తం 10 బిల్లులలో మూడింటిని మాత్రమే ఆమె ఆమోదించారు. -
బిల్లులపై విచారణ 24కు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్ తన వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో మూడింటిని ఇప్పటికే ఆమోదించారని, రెండు బిల్లులను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారని సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. మరో రెండింటిపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరుతూ వెనక్కి తిప్పి పంపారని, ఇంకో మూడు బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్డీవాలాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే అందుబాటులో లేని కారణంగా.. విచారణ వాయిదా వేయాలని జూనియర్ న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అయితే గవర్నర్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వర్చువల్‌గా హాజరుకావడంతో వాదనలు వినిపించాలని ధర్మాసనం సూచించింది. గవర్నర్ నుంచి తనకు అందిన వివరాలను కోర్టుకు సమర్పిస్తున్నట్టు తుషార్ మెహతా తెలిపారు. ‘శాసనసభ గతేడాది సెపె్టంబరులో పాస్ చేసిన కొన్ని బిల్లులు ఉన్నాయి కదా.. వాటిపై తుది నిర్ణయం ఏమైనా గవర్నర్ కార్యాలయం నుంచి అందిందా?’అని చీఫ్ జస్టిస్ ప్రశ్నించగా.. ఈ అంశాలపై ప్రస్తుతం తానేమీ చెప్పలేనని తుషార్ మెహతా వివరించారు. ఈ క్రమంలో ధర్మాసనం.. సొలిసిటర్ జనరల్ అందజేసిన వివరాలను రికార్డుల్లోకి తీసుకుంటున్నామని పేర్కొంటూ, తెలంగాణ తరఫు న్యాయవాది విజ్ఞప్తి మేరకు విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. సొలిసిటర్ జనరల్ కోర్టుకు ఇచ్చిన వివరాలివీ.. ‘‘మూడు బిల్లులు.. తెలంగాణ మోటారు వాహనాల పన్ను సవరణ బిల్లు–2022, తెలంగాణ మున్సిపాలిటీస్ చట్ట సవరణ బిల్లు– 2023, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లు–2023లను గవర్నర్ ఆమోదించారు. యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్రీ తెలంగాణ బిల్లు–2022, తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు–2022.. ఈ రెండింటిని రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపివేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయాలు (స్థాపన, నియంత్రణ) సవరణ బిల్లు–2022, తెలంగాణ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు–2022, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (వయసు నియంత్రణ, పదవీ విరమణ) సవరణ బిల్లు–2022 గవర్నర్ క్రియాశీల పరిశీలనలో ఉన్నాయి. తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లు–2023కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గవర్నర్ వివరణ కోరారు. ఆజామాబాద్ ఇండ్రస్టియల్ ఏరియా (టర్మినేషన్, రెగ్యులేషన్ ఆఫ్ లీజు) సవరణ బిల్లు–2022కు న్యాయ విభాగం నుంచి వివరణపై స్పందన రాలేదు’’అని కోర్టుకు సొలిసిటర్ జనరల్ తెలిపారు. -
TS: పెండింగ్ బిల్లుల అంశం.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ బిల్లుల విషయంపై తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య కొద్ది రోజులుగా విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో, అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు నివేదిక అందజేశారు. ఈ క్రమంలో ఇప్పటికే మూడు బిల్లులకు ఆమోదం తెలిపారని గవర్నర్ తరఫు న్యాయవాది తెలిపారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లు, ఆజామాబాద్ మిల్లు బిల్లు, మెడికల్ బిల్లులపై వివరణ కోరారని గవర్నర్ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. ఇక, ఇదే సమయంలో గవర్నర్ వద్ద 10 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. విషయ తీవ్రత, ప్రాధాన్యత దృష్ట్యా విధిలేకనే కోర్టును ఆశ్రయించినట్టు ప్రభుత్వం తెలిపింది. కాగా, వాదనల అనంతరం.. తదుపరి విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిలను పేర్కొన్నారు. బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం ప్రజాస్వామ స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షకు విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. ఇప్పటికే పెండింగ్ బిల్లుల ఆమోదంపై గవర్నర్ కార్యదర్శితో అడిషనల్ సోలిసిటరి జనరల్ చర్చించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ బిల్లును ఆమోదించడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. అయితే సుప్రీంకోర్టులో ఈ విషయంపై విచారణ జరగడానికి కొన్ని గంటలముందే రాష్ట్రపతి వీటిపై నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మొత్తం పది బిల్లులకూ గాను మూడింటికి మాత్రమే ఆమె ఆమోద ముద్ర వేయడం మరోసారి చర్చనీయాంశమైంది. -
Telangana: పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం..
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన ఆమె.. మరో రెండు బిల్లులను ప్రభుత్వానికి తిప్పి పంపారు. మరో మూడు బిల్లులకు మాత్రం ఆమోద ముద్ర వేశారు. ఇంకా రెండు బిల్లులను పెండింగ్‌లోనే ఉంచారు. కాగా.. పెండింగ్ బిల్లుల విషయంపై తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య కొద్ది రోజులుగా విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ పంచాయితీని తేల్చుకునేందుకు తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ పిటిషన్‌పై నేడే(సోమవారం) విచారణ జరగనుంది. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిలను పేర్కొన్నారు. బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం ప్రజాస్వామ స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షకు విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. విషయ తీవ్రత, ప్రాధాన్యత దృష్ట్యా విధి లేకే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపింది. గవర్నర్ వద్ద 10 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని నివేదించింది. ఇప్పటికే పెండింగ్ బిల్లుల ఆమోదంపై గవర్నర్ కార్యదర్శితో అడిషనల్ సోలిసిటరి జనరల్ చర్చించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ బిల్లును ఆమోదించడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. అయితే సుప్రీంకోర్టులో ఈ విషయంపై విచారణ జరగడానికి కొన్ని గంటలముందే రాష్ట్రపతి వీటిపై నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మొత్తం పది బిల్లులకూ గాను మూడింటికి మాత్రమే ఆమె ఆమోద ముద్ర వేయడం మరోసారి చర్చనీయాంశమైంది. చదవండి: 24 గంటలు దుకాణాలు తెరిచి ఉంచడంపై కీలక ప్రకటన -
తెలంగాణ పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టులో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పెండింగ్ బిల్లుల ఆమోదం పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిలను పేర్కొన్నారు. బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం ప్రజాస్వామ స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షకు విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. విషయ తీవ్రత, ప్రాధాన్యత దృష్ట్యా విధి లేకే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపింది. గవర్నర్ వద్ద 10 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని నివేదించింది. ఇప్పటికే పెండింగ్ బిల్లుల ఆమోదంపై గవర్నర్ కార్యదర్శితో అడిషనల్ సోలిసిటరి జనరల్ చర్చించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ బిల్లును ఆమోదించడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. చదవండి: బండి సంజయ్ ఫోన్ ఎక్కడ? దానితోనే ఏ–2 ప్రశాంత్‌తో సంభాషణ!.. అసలు ఆ రోజు ఏం జరిగింది? -
తెలంగాణ గవర్నర్ వ్యవహారం.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దగ్గర ఉన్న పెండింగ్ బిల్లులపై విచారణలో కీలక మలుపు చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి తాజాగా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పది బిల్లులను గవర్నర్ తమిళిసై పెండింగ్‌లో ఉంచారు. అయితే.. వాటిని ఆమోదించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ తెలంగాణ సర్కార్ సుప్రీంను ఆశ్రయించింది. ఈ తరుణంలోనే కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీం. రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రకారం.. ఉభయ సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ముద్ర పడాల్సి ఉంటుంది. అలా జరిగితేనే.. వాటి అమలుకు వీలు ఉంటుంది. ఈ క్రమంలోనే పది బిల్లులను పంపితే.. తిరస్కరించడమో లేదంటే సూచనలు చేయడమో లేదంటే వెనక్కి తిప్పి పంపడం లాంటివేం చేయకుండా ఆమె పెండింగ్ ఉంచారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటిషన్లో గవర్నర్‌తో పాటు గవర్నర్ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చింది టీ సర్కార్. అయితే.. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్‌కు తాము నోటీసులు జారీ చేయలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కాకపోతే.. ఆలస్యంపై వివరణ కోరుతూ కేంద్రానికి నోటీసులు జారీ చేసే వీలుందని చెబుతూ ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో.. కేంద్రం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మోహతా కలుగుజేసుకుని తెలంగాణ గవర్నర్ నుంచి పూర్తి వివరాలు తెలుసుకుని బదులిస్తానంటూ ధర్మాసనాన్ని కోరారు. అయినప్పటికీ సుప్రీం కోర్టు ధర్మాసనం.. కేంద్రానికి నోటీసులు జారీ చేయడం గమనార్హం. మార్చి 27వ తేదీ సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. -
గవర్నర్‌పై తెలంగాణ ప్రభుత్వం పిటీషన్.. సుప్రీం కోర్టు స్పందన ఇదే!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్‌కు నోటీసులు జారీ చేయబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తన వద్దకు పంపిన పలు బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టారంటూ రాష్ట్ర గవర్నర్‌పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం ప్రధానన్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్డీవాలాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇదే తరహా అంశాన్ని విచారణకు తీసుకున్నారని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ సెక్రటరీ, కేంద్రానికి నోటీసులు జారీచేయాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే గవర్నర్‌కు నోటీసులు ఇవ్వబోమని, ప్రస్తుతం కేంద్రానికి మాత్రమే జారీచేస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. సాధారణంగా గవర్నర్‌కు నోటీసులు జారీచేయమని తెలిపారు. గవర్నర్‌కు కాకుండా సెక్రటరీకి జారీచేయాలని దవే మరోసారి కోరారు. తెలంగాణ గవర్నర్ బిల్లులు పెండింగ్‌లో ఉంచారని దాఖలైన ఈ పిటిషన్లో నోటీసులు జారీ చేయొచ్చా అని సీజేఐ ప్రశ్నించగా, అవసరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. గవర్నర్ లాంటి రాజ్యాంగ వ్యవస్థలకు నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని మెహతా స్పష్టం చేశారు. దీంతో గవర్నర్‌కు నోటీసులు జారీ చేయడంలేదని జస్టిస్ పీఎస్ నరసింహా పేర్కొన్నారు. తాను ఇక్కడే ఉన్నందున పిటిషన్ కాపీని తనకు సర్వ్ చేయాలని మెహతా ధర్మాసనాన్ని కోరారు. అనంతరం ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీచేస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
పోలీసులకు బకాయిలు విడుదల చేసిన ఏపీ సర్కార్
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం.. పోలీసులకు బకాయిలను విడుదల చేసింది. పోలీస్ సిబ్బంది టీఏ నిధులను ఆర్థిక శాఖ విడుదల చేసింది. పోలీస్ ఉద్యోగుల జీపీఎఫ్ లోన్లను క్లియర్ చేసింది. పెడింగ్ నిధుల విడుదల పట్ల పోలీస్ అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. చదవండి: ఎకనమిక్ కారిడార్‌కు లైన్‌క్లియర్ -
గవర్నర్ వ్యవస్థతో అణచివేతకు పాల్పడుతున్న కేంద్రం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో.. కేంద్రం గవర్నర్ వ్యవçస్థతో అణచివేతకు పాల్పడుతోందని, ప్రభుత్వాలను కూలదోసే ప్రయత్నాలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ గవర్నర్ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం సిగ్గుచేటని, గవర్నర్ బిల్లులు పెండింగ్‌లో పెట్టడం సరికాదన్నారు. మహబూబ్‌నగర్‌లోని సీపీఐ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాటా్లడారు. బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయని, అధికారం ఉందని కేంద్రం అడ్డదారులు తొక్కడం సమంజసం కాదన్నారు. బీజేపీకి చెక్ పెట్టడమే ధ్యేయంగా ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు దేశవ్యాప్తంగా ప్రజల వద్దకు సీపీఐ పేరుతో లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష పార్టీలతో కలిసి పాదయాత్ర నిర్వహించనున్నట్లు చాడ వెల్లడించారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రంలో సీపీఐ సమరశంఖం పూరిస్తుందని చాడ హెచ్చరించారు. -
నిధుల ‘పంచాయితీ’.. బిల్లులు పెండింగ్‌తో సర్పంచ్ల గగ్గోలు..
ఇటీవల నల్లగొండ జిల్లా మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సిబ్బందితో కలిసి భిక్షమెత్తారు. సర్పంచ్ నయ్యా ‘దానం చేయండి’అంటూ బ్యానర్ పట్టుకుని, డప్పు కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని పడగల్ వడ్డెర కాలనీ సర్పంచ్ ముత్తెమ్మ భర్త మల్లేష్ పంచాయతీ అభివృద్ధి కోసం అప్పులు చేశాడు. బిల్లులు రాకపోవడంతో, తెచ్చిన అప్పులు కట్టలేక ఈ మధ్యనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సాక్షి, హైదరాబాద్ / నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో సర్పంచ్ల పరిస్థితి అటు చెంపదెబ్బ, ఇటు గోడ దెబ్బ అన్నట్టుగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన ఆర్థిక సంఘాల నిధులు రూ.వందల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. నిధుల్లేకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. సిబ్బంది వేతనాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపు, పారిశుధ్య పనుల నిర్వహణ కష్టంగా మారుతోంది. కొన్నిచోట్ల రక్షిత మంచినీటి సరఫరా చేసే విద్యుత్ మోటార్లు పాడైతే మరమ్మతు చేసే పరిస్థితి కూడా లేదు. మరికొన్ని చోట్ల లక్షల్లో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచ్‌లు.. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకంతో వడ్డీలు కట్టలేక, కుటుంబ పోషణ కూడా భారమై దినసరి కూలీలుగా మారుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 1,692 గ్రామ పంచాయతీలున్నాయి. ఎస్ఎఫ్సీ నుంచి రూ.89.63 కోట్ల నిధులు రావాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.45 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా.. ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లో 589 గ్రామ పంచాయతీలున్నాయి. కేంద్రం, రాష్ట్రం నుంచి నెలకు రూ.13 కోట్లు వస్తున్నాయి. ఏప్రిల్ నుంచి కేంద్రం నిధులు, గత రెండు నెలలుగా రాష్ట్ర నిధులు రాలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 481 పంచాయతీలున్నాయి. ప్రతినెలా విడుదలయ్యే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.10.30 కోట్లు రావాలి. కానీ ఈ మార్చి నుంచి నిధులు రాలేదు. ఇక చేపట్టిన పనులకు సర్పంచులకు ఏడాదిన్నరగా బిల్లులు రాలేదు. చిన్న జీపీలకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల దాకా, పెద్ద జీపీలకు రూ.12 నుంచి రూ.18 లక్షల దాకా పెండింగులో ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.. మొత్తం జీపీలు 1,507. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కేంద్ర, రాష్ట్రాల నుంచి రూ.203.39 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా బేల మండల సర్పంచ్‌లు నిధుల విడుదలలో జాప్యానికి నిరసనగా ధర్నాకు దిగారు. సూర్యాపేట జిల్లా.. సూర్యాపేట జిల్లాలో 475 జీపీలున్నాయి. నెలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.8.75 కోట్లు, ఎస్ఎఫ్సీ నిధులు రూ.8.25 కోట్లు రావాల్సి ఉంది. కానీ కొన్ని నెలలుగా నిధులు రావడం లేదు. అయితే ఇటీవలే ఎస్ఎఫ్సీ ఒక నెల నిధులు రూ.8.25 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా 15 ఆర్థిక సంఘం నిధులు రూ.70 కోట్లు, ఎస్ఎఫ్సీ నిధులు రూ. 24.75 కోట్లు పెండింగులో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర నిధులు రూ.2 వేల కోట్లు పెండింగ్! నిధుల విడుదల, బిల్లుల చెల్లింపులో జాప్యానికి తాము కారణం కాదంటే తాము కారణం కాదని అంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. తాము ఇచి్చన డబ్బుల వల్లే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని చెప్పుకుంటున్నాయి. కేంద్రం 15వ ఆర్థిక సంఘం ద్వారా ఇస్తున్న నిధులకు సమానంగా తాము కూడా రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ఎఫ్సీ) ద్వారా ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నామని రాష్ట్ర సర్కార్ చెబుతోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఆదాయం అంతగా లేని కొన్ని చిన్న పంచాయతీల్లో ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి (గత ఏప్రిల్ నుంచి) 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదు. మరోవైపు పలు గ్రామ పంచాయతీలకు దాదాపు 3, 4 నెలలుగా రాష్ట్ర ఆర్థిక కమిషన్ నిధులు ఆగిపోయాయి. కేంద్రం నుంచి వచి్చన నిధులకు సంబంధించిన వినియోగ సరి్టఫికెట్లు (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీలు) రాష్ట్రం సమర్పించలేదని, అందుకే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 12,769 గ్రామ పంచాయతీల్లో (జీపీలు) 7,100కు పైగా మైనర్ పంచాయతీలు, వాటిలో కొత్తగా ఏర్పాటైన జీపీలు 4,383 ఉన్నాయి. ఈ పంచాయతీల్లో ఐదారు వందల లోపు జనాభా ఉన్న పంచాయతీలే ఎక్కువగా ఉండగా, సొంత ఆదాయ వనరులు లేక ఈ పంచాయతీలన్నీ పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే నిధులపైనే ఆధారపడి ఉన్నాయి. కాగా 15వ ఆరి్ధకసంఘం నిధులు గత ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు రూ.1,000 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది. అలాగే నాలుగు నెలల కాలానికి సంబంధించిన రాష్ట్ర ఆర్థిక కమిషన్ నిధులు పంచాయతీలకు విడుదల కాలేదు. అవి కూడా దాదాపుగా అంతే మొత్తంలో ఉన్నట్టుగా సర్పంచ్‌లు చెబుతున్నారు. ఇక జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు పెండింగ్ కూలి రూ.160 కోట్లతో పాటు, మెటీరియల్ కాంపోనెంట్ కూడా ఆరేడు వందల కోట్లు కేంద్రం నుంచి రాలేదు. వీటితో పాటు దాదాపు రూ.1,000 కోట్లకు పైగా ఉపాధి బకాయిల కోసం కూడా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే నిబంధలను విరుద్ధంగా ఇతర పనులకు ఉపయోగించిన ఉపాధి హామీ పథకం నిధులు రూ.152 కోట్లు తమకు తిరిగి చెల్లించాలంటూ రాష్ట్రానికి కేంద్రం నోటీసులిచి్చంది. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్ల గొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నిధులతో పాటు పల్లెప్రగతి నిధులు కూడా ఇవ్వడం లేదు. జిల్లాలో దాదాపు 80% దాకా చేసిన పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల ఉమ్మడి కరీంనగర్లో సర్పంచ్ల సమస్యలపై ఇటీవల ధర్నాచేశాం. – ఉప్పల అంజనీప్రసాద్, రాష్ట్ర సర్పంచ్ల సంఘం గౌరవ అధ్యక్షుడు, పంచాయతీరాజ్ చాంబర్ జనరల్ సెక్రటరీ రూ.4.50 లక్షల బిల్లులు రావాలి ఈ ఏడాది మా గ్రామంలో రూ.2.50 లక్షలతో సీసీ రోడ్డు, రూ.2.80 లక్షలతో డ్రైనేజీ నిర్మించాం. రూ.1.50 లక్షలతో లైట్లు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం పంచాయతీకి రూ.4.50 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. మలీ్టపర్పస్ వర్కర్ల వేతనాలు, విద్యుత్ బిల్లు, పారిశుధ్య పనుల నిర్వహణ కష్టంగా ఉంది. – కిష్ట్యానాయక్, పల్లెగడ్డతండా సర్పంచ్, నారాయణపేట జిల్లా ట్రాక్టర్ డీజిల్‌కూ అప్పు! నిధులు రాకపోవడంతో పంచాయతీ ట్రాక్టర్ రోజువారీ డీజిల్ ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సి వస్తోంది. ఇక గతంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లుల జాడే లేదు. అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టి మరీ పనులు చేస్తే ఇదీ పరిస్థితి. – కాశీ విశ్వనాథ్, 4 ఇంక్లైన్ సర్పంచ్, భద్రాద్రి జిల్లా ప్రభుత్వం ఆదుకోవాలి.. 8 నెలల క్రితం రూ.4 లక్షలు అప్పు తెచ్చి మురుగు కాల్వలను నిర్మించాం. ఇప్పటివరకు బిల్లులు రాలేదు. జీపీకి ప్రభు త్వం ఇచ్చే నిధులు ట్రాక్టర్ కిస్తీకి, గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుల జీతాలకు కూడా సరిపోని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదుకోవాలి. నిధుల విడుదలపై దృష్టి సారించాలి. – తూముల శ్వేత, పెన్ పహాడ్ మండల కేంద్ర సర్పంచ్, సూర్యాపేట జిల్లా -
రూ.30 లక్షల బిల్లులు రాక.. ఇన్చార్జ్ సర్పంచ్ భిక్షాటన
కౌడిపల్లి (నర్సాపూర్): గ్రామాభివృద్ధి కోసం చేసిన పనులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో ఓ ఇన్చార్జి సర్పంచ్ భిక్షాటన చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెల్మకన్నలో సోమవారం చోటు చేసుకుంది. వెల్మకన్న గ్రామ ఇన్చార్జ్ సర్పంచ్ కాజిపేట రాజేందర్ మాట్లాడుతూ.. గతేడాది మార్చి నుంచి సుమారు రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. సీసీ రోడ్లు, మురికి కాల్వలు, క్రీడాప్రాంగణం, పారిశుధ్యం పనులు, హరితహారం, వీధి దీపాలు తదితర పనులు పూర్తి చేశామని తెలిపారు. అప్పులు తెచ్చి పనులు చేస్తే, ఇంత వరకు బిల్లులు రాలేదని, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చేసేది లేక గ్రామంలో పంచాయతీ కారి్మకులతో కలిసి భిక్షాటన చేస్తున్నట్లు తెలిపారు. రెండున్నర నెలల క్రితం రూ.ఆరు లక్షలకు సంబంధించి ఎంబీలు పూర్తి చేయగా చెక్కులు ఇచ్చారని, అయినా డబ్బులు మాత్రం రాలేదని తెలిపారు. అధికారులను ఎన్నిసార్లు అడిగిన ఫ్రీజింగ్లో ఉందని, వచ్చాక ఇస్తామని చెబుతున్నారని అన్నారు. చదవండి: కరీంనగర్లో వింతవ్యాధి కలకలం..! ఉన్నట్టుండి వాంతులు విరేచనాలు, ఆపై -
పెండింగ్ అంశాలపై నేడు కేంద్రం సమీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలపై బుధవారం కేంద్ర, రాష్ట్ర సమన్వయ కమిటీ సమీక్ష చేయనుంది. సమన్వయ కమిటీ వద్ద ఉన్న పెండింగ్ అంశాలతో పాటు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ (సమన్వయ) కార్యదర్శి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఉన్నతాధికారులతో ఈ సమావేశం జరుగుతుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ డైరెక్టర్ ఎం. చక్రవర్తి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం పంపించారు. ఈ–సమీక్ష పోర్టల్‌లో పొందుపరిచిన అంశాలపై సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర సమన్వయ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న 34 అంశాలతో పాటు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న 15 అంశాలను అజెండాలో చేర్చారు. రాష్ట్ర విభజన జరిగిన ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు భర్తీ, పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారులు, రైల్వే లైన్లను అజెండాలో చేర్చారు. విశాఖలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, జాతీయ ఫార్మాస్యూటికల్ విద్యా సంస్ధ ఏర్పాటు, పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి పన్ను రాయితీలు, ఆర్ అండ్ ఆర్తో సహా పోలవరం పూర్తి వ్యయాన్ని భరించడం తదితర అంశాలు కూడా ఉన్నాయి. -
ఏడు బిల్లులు పెండింగ్‌లోనే.. సర్కారుకు గవర్నర్ తమిళిసై షాక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు, వివాదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. శాసనసభ, శాసనమండలి ఆమోదం పొందిన బిల్లులను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నెలన్నర రోజులుగా పెండింగ్‌లో ఉంచడం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు తన సొంత ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోరాదని గవర్నర్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీపావళి సందర్భంగా సోమవారం రాజ్‌భవన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన గవర్నర్, సామాన్యప్రజానీకం నుంచి పండుగ శుభాకాంక్షలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ బిల్లుల విషయమై చేసిన వ్యాఖ్యలు చర్చనీ యాంశమమ్యాయి. ‘శాసనసభలో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం పూర్తిగా నా పరిధిలోనిది. గవర్నర్‌గా నాకు విస్తృత అధికారాలుంటాయి. నా పరిధిలోనే నేను నడుచుకుంటున్నాను..’ అని తమిళిసై స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులను త్వరలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, గవర్నర్‌గా తన బాధ్యతల మేరకే నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. నెలన్నర రోజులుగా...: గత నెల 13న రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో ఆమోదించిన మొత్తం 8 బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం మరుసటి రోజు గవర్నర్ ఆమోదముద్ర కోసం పంపించింది. గవర్నర్ వాటిని పరిశీలించి, ఆమోదించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంటుంది. అప్పుడే బిల్లులు చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన 8 బిల్లుల్లో కేవలం జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు మాత్రమే తమిళిసై ఆమోదం తెలిపారు. మిగిలిన ఏడు బిల్లులను పెండింగ్‌లో ఉంచారు. ములుగు అటవీ కళాశాల పేరును తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్చడం, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లోని కొలువుల భర్తీకి ఉమ్మడి బోర్డు ఏర్పాటు వంటి రెండు కొత్త బిల్లులు కూడా ఇందులో ఉన్నాయి. ఇక ప్రైవేటు వర్సిటీల చట్టం, పురపాలికల చట్టం, అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్టం, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టం, మోటార్ వాహనాలపై పన్నులు సంబంధిత చట్టం సవరణ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. గవర్నర్ ఆమోదిస్తే ఈ బిల్లులను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిరీక్షిస్తుండడం గమనార్హం. గవర్నర్ సోదరి విషయంలో అధికారుల అభ్యంతరం! రాష్ట్ర గవర్నర్‌గా రాజ్‌భవన్‌లో తన ఖర్చులు మొత్తం తానే భరిస్తున్నట్లు తమిళిసై ఇటీవల చెన్నైలో వ్యాఖ్యానించారు. ప్రతినెలా తనకయ్యే ఖర్చును తానే సొంతంగా చెల్లిస్తున్నానని, ప్రభుత్వ సొమ్మును ఉపయోగించుకోవడం లేదని తెలిపారు. గవర్నర్ సోదరి ఒకరు కొంత కాలం పాటు రాజ్‌భవన్‌లో తమిళిసై కుటుంబంతో కలిసి ఉన్నారు. అయితే ఇది ప్రోటోకాల్ నిబంధనలకు వ్యతిరేకమని రాజ్‌భవన్ అధికారులు అభ్యంతరం తెలిపినట్టు తెలిసింది. దీంతో గవర్నర్ తన సోదరిని పంపించి వేశారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే తన ఖర్చులను స్వయంగా భరించాలని గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. -
GHMC సమావేశంలో బీజేపీ నిరసనలు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ్టి(మంగళవారం) సమావేశంలో.. బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. సుమారు 43 మంది బీజేపీ కార్పొరేటర్లు నల్లబ్యాడ్జీలతో సమావేశానికి వచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను విడుదల చేయాలంటూ.. ప్లకార్డులతో కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు వాళ్లంతా. ఇదిలా ఉంటే.. కాంట్రాక్టర్ల జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. రూ. 800 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని వాళ్లంతా నిరసనలకు దిగారు. ఈ క్రమంలో.. పోలీసులకు, కాంట్రాక్టర్లకు మధ్య తీవ్రవాగ్వాదం నెలకొనగా, ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరోవైపు కాంట్రాక్టర్లకు మద్దతుగా బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. ఇదీ చదవండి: కేసీఆర్‌కు అంబేడ్కర్‌తో పోలికా? -
ఏపీకి పెండింగ్ బకాయిలు చెల్లించండి: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు అకాడమీ విజభన కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెండింగ్‌లో ఉన్న రూ. 33 కోట్లు వడ్డీతో సహా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే పిటిషన్‌కు వెనక్కి తీసుకునేందుకు తెలంగాణకు కోర్టు అనుమతినిచ్చింది. కాగా, ఏపీకి ఇప్పటికే రూ. 92.94కోట్లు చెల్లించినట్టు తెలంగాణ సర్కార్ తెలిపింది. అయితే, మిగిలిన డబ్బు మొత్తానికి 6శాతం వడ్డీ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇది కూడా చదవండి: సీఎం స్టాలిన్ కుమారుడికి భారీ ఊరట -
డీఎస్సీ నిర్వహించాలి!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని, విద్యా బోధనలో నాణ్యత పడి పోకుండా వచ్చే జూన్‌లోగా ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయాలని టీఆర్ఎస్ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య, బీజేపీ సభ్యుడు రఘునందన్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాఠశాలల్లో పారిశుధ్య సిబ్బందిని తిరిగి నియమించాలని సూచించారు. విద్య, వైద్యం, పురపాలక, ఆబ్కారీ, అటవీ, దేవాదాయ తదితర శాఖల 2021–22 వార్షిక బడ్జెట్ పద్దులపై బుధవారం శాసనసభలో జరిగిన చర్చలో పలువురు అధికార, విపక్ష పార్టీల సభ్యులు మాట్లాడారు. మధ్యాహ్న భోజనం పెండింగ్ బిల్లులు చెల్లించాలని సండ్ర కోరారు. జూనియర్ కళాశాలలు లేని మండల కేంద్రాల్లో వాటిని ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల జీతాల చెల్లింపులపై ప్రభుత్వ నియంత్రణ ఉండే విధానం తీసుకురావాలన్నారు. ఎంఈఓ ఖాళీలు భర్తీ చేయాలన్నారు. జిల్లా, మండల కేంద్రాల్లో విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సోషల్ మీడియా, యూట్యూబ్ జర్నలి స్టులు వస్తున్నారని, ఎవరు జర్నలిస్టులనేది ప్రభు త్వం నిర్వచించాలన్నారు. టీఆర్టీ పోస్టులకు ఎంపి కైన 250 మందిని పక్కనపెట్టారని, వీరిలో అర్హులను గుర్తించి ఉద్యోగాల్లో నియమించాలని రఘునందన్‌రావు కోరారు. ప్రతి నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడకల ఆస్పత్రుల నిర్మాణాన్ని సత్వరం పూర్తిచేసి స్పెషలిస్టు వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని నియమించాలన్నారు. కరోనా నేపథ్యంలో గాంధీ, టిమ్స్, జిల్లా ఆస్ప త్రుల్లో నియమించిన తాత్కాలిక పారా మెడికల్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలన్నారు. ధూపదీప నైవేద్యాల పథకం కింద ఇస్తున్న నిధులను పెంచాలన్నారు. ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన దేవాలయ, వక్ఫ్ భూములను తిరిగి ఆయా సంస్థలకు అప్పగిం చాలని సూచిం చారు. కిడ్నీ రోగుల అవసరాలను తీర్చడానికి డయాలసిస్ కేంద్రాల్లో పరికరాల సంఖ్య పెంచాలని సంజయ్ సూచించారు. -
ఆర్టీసీకి ఆయిల్ చిక్కులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి చమురు సమస్య నెలకొంది. ప్రస్తుతం ఆదాయం చాలా తక్కువగా ఉండటంతో రెండు నెలలుగా చమురు సంస్థలకు డీజిల్ తాలూకు పూర్తి బిల్లులు చెల్లించలేక పోతోం ది. దీంతో దాదాపు రూ.70 కోట్ల వరకు బకాయిలు ఏర్పడ్డాయి. ఇంతపెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో చమురు సంస్థలు బిల్లుల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో చమురు సర ఫరాను నిలిపేయనున్నట్లు ఆ సంస్థలు హెచ్చరిం చాయి. ఒకట్రెండు రోజులు నిలిపేశాయి కూడా. దీంతో ఆర్టీసీలో ఆందోళన మొదలైంది. చమురు సంస్థల ప్రతినిధులతో చర్చించి కొంతమేర చెల్లిం చేందుకు సిద్ధమయ్యింది. దీంతో తాత్కాలి కంగా సరఫరాను ఆయా సంస్థలు పునరుద్ధరిం చాయి. పక్షం రోజుల్లో బిల్లులు చెల్లించే హామీతో సరఫరా ను పునరుద్ధరించినట్లు తెలిసింది. ఆలోగా డబ్బు లు చెల్లించకుంటే డీజిల్ సరఫరాను ఆపేయను న్నట్టు ఆయిల్ కంపెనీలు హెచ్చరించాయి. 4.5 కోట్లకు చేరుకున్న ఆదాయం.. లాక్‌డౌన్‌తో బస్సు సర్వీసులు నిలిచిపోవటంతో ఆర్టీసీకి ఆదాయం లేకుండా పోయింది. దాదాపు రెండున్నర నెలలు చిల్లిగవ్వ ఆదాయం లేదు. మే చివరలో జిల్లా బస్సు సర్వీసులు మొదలైనా కరో నా కేసుల తీవ్రత కారణంగా జనం బస్సులెక్కేం దుకు భయపడ్డారు. ఆక్యుపెన్సీ రేషియో 25 శాతంగా ఉండటంతో నామమాత్రపు ఆదాయంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత పక్షం రోజులుగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో 55 శాతానికి చేరడంతో రోజువారీ ఆదాయం రూ.4 కోట్లను మించుతోంది. మూడు రోజుల క్రితం సిటీ బస్సులు ప్రారంభమయినా.. పావు శాతమే తిరుగుతుండటంతో రూ.30 లక్షల ఆదాయం ఉంటోంది. కార్గో బస్సుల రూపంలో రూ.10 లక్షల అదనపు ఆదాయం సమకూరుతోంది. ఇవి తప్ప ఆర్టీసీ వద్ద వేరే నిధులు లేకపోవటంతో చమురు » కాయిలు తీర్చేందుకు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. 2.6 కోట్ల లీటర్ల చమురు ఖర్చు... ప్రస్తుతం ఆర్టీసీ నిత్యం 16.6 లక్షల కిలోమీటర్ల మేర బస్సులను తిప్పుతోంది. దీనికి 2.6 కోట్ల లీటర్ల చమురు ఖర్చవుతోంది. గతంలో ఎప్పటి కప్పుడు బిల్లులు చెల్లించే పద్ధతి ఉండేది. ఇప్పుడు రోజుకు కొంతమేర మాత్రమే చెల్లిస్తున్నా రు. దీంతో ఎక్కువ మొత్తం పేరుకుపోతూ రూ.70 కోట్లకు బకాయి చేరుకుంది. ఆర్టీసీకి ఇతర ఆదా యం లేకపోవటంతో చమురు కంపెనీలు కూడా ఆలోచనలో పడ్డాయి. గతంలో ఎప్పుడూ లేనట్టు ఒత్తిడి పెంచి, ఆర్టీసీ చరిత్రలో తొలిసారి చమురు సరఫరాను నిలిపివేయటంలాంటి సీరియస్ నిర్ణ యం తీసుకున్నాయి. ఈ కారణంగానే ఆదాయం పెంపునకు సిటీలో ఆగమేఘాల మీద బస్సు సర్వీ సులు ప్రారంభించాల్సి వచ్చింది. క్రమంగా వీటి సంఖ్యను పెంచుతూ ఆదాయాన్ని పెంచుకు నేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దయతో వ్యవహరించండి.. లాక్డౌన్ వేళ సర్వీసులు పూర్తిగా నిలిచిపోవటంతో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో బిల్లులు చెల్లించలేదని చమురు సరఫరా నిలిపివేసేలా ఆ సంస్థలు వ్యవహరించటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చమురు కంపెనీలకు అతిపెద్ద వినియోగదారు ఆర్టీసీనే. నిత్యం లక్షల లీటర్ల డీజిల్ వినియోగించే ఆర్టీసీ విషయంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల స్వయంగా ఆర్టీసీ సొంతంగా పెట్రోలు బంకులు స్థాపించి చమురు కంపెనీలకు డీలర్‌గా మారిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రజా సేవలో ఉండే ఆర్టీసీ విషయంలో కంపెనీలు దయతో వ్యవహరించాలని పేర్కొంటున్నారు. -
రూ.11 వేల కోట్లకు పైగా బకాయిలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో బిల్లులన్నీ కొండలా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ ప్రభావంతో కార్యకలాపాలు స్తంభించిపోవడంతో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు పేరుకుపోయాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొద్దికొద్దిగా పుంజుకుంటున్నా, ప్రభుత్వం ఇతర ప్రధాన పథకాలకు ఎక్కువగా నిధులు వెచ్చిస్తుండటంతో సాగునీటి బిల్లులకు మోక్షం కలగడంలేదు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో కొన్ని ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టుల కింద చెల్లింపులు చేసినప్పటికీ ఇంకా రూ.11,989 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. కొంత ఇచ్చినా..ఇంకా చాలా పెండింగ్.. ఈ ఏడాది మార్చిలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో సాగునీటి శాఖకు రూ.11 వేల కోట్ల కేటాయింపులు చేశారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ నుంచి కరోనా విస్తృతి పెరిగిన అనంతరం ఆ ప్రభావం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పడటంతో బిల్లుల చెల్లింపు పూర్తిగా నిలిచిపోయింది. జూన్ రెండోవారం నుంచి పరిస్థితి కొంత మెరుగైనా రైతుబంధు, ఇతర ప్రాధాన్య పథకాలకు నిధులు ఇవ్వాల్సి రావడంతో సాగునీటి ప్రాజెక్టుల బిల్లుల చెల్లింపు జరగలేదు. దీంతో బిల్లులు భారీగా పేరుకుపోయాయి. జూన్ చివరలో కేవలం రూ.785 కోట్ల మేర మాత్రమే చెల్లింపులు జరగ్గా, జూలై, ఆగస్టు నెలల్లో రూ.3,300 కోట్ల మేర బిల్లులు చెల్లించారు. అయినప్పటికీ మరో రూ.11,989 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో కరెంట్ బిల్లులు, భూసేకరణ బిల్లులు రూ.5 వేల కోట్ల మేర ఉన్నా, పనులకు సంబంధించిన బిల్లులు రూ.6వేల కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అధికంగా కాళేశ్వరం పరిధిలోనే రూ.4,648 కోట్లు పెండింగ్‌లో ఉండగా, పాలమూరు–రంగారెడ్డిలో రూ.1,993 కోట్లు, డిండిలో రూ.298 కోట్లు, దేవాదులలో రూ.700 కోట్లు మేర పెండింగ్‌లో ఉన్నాయి. ఇక చెరువులకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్ కింద రూ.775 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో మిషన్ కాకతీయకు సంబంధించినవే రూ.350 కోట్ల వరకు ఉన్నాయి. ఈ బిల్లులకోసం ఏజెన్సీల ప్రతినిధులు, చిన్న కాంట్రాక్టర్లు నీటి పారుదల శాఖ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే చెల్లింపులు జరుగుతుండటంతో కాంట్రాక్టర్లు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ బిల్లులు ఇప్పించాలంటూ మొర పెట్టుకుంటున్నారు. కిస్తీల చెల్లింపులకోసం ఒత్తిళ్లు పెరుగుతుండటం, బ్యాంకుల్లో కొత్త రుణాలు దొరక్కపోవడం, బయట వడ్డీలు పెరుగుతుండటంతో వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. చాలా చోట్ల ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్ల మేరకే టెండర్లు వేసిన కాంట్రాక్టర్లు, ఇప్పుడు బ్యాంకు గ్యారంటీలు సమర్పించి అగ్రిమెంట్లు చేసుకునేందుకు వెనకాడుతున్నారు. ముఖ్యంగా నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బకాయిల చెల్లింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై వేచి చూస్తున్నారు. -
గ్రాంట్ల రూపంలో రూ.2,19,695 కోట్లు కావాలి
సాక్షి, అమరావతి: విభజన అనంతరం రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, భారీ రెవెన్యూ లోటు ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఉదారంగా నిధుల మంజూరుకు సిఫారసు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధి కోసం 15వ ఆర్థిక సంఘం కాల వ్యవధిలో రూ.2,19,695 కోట్లను గ్రాంట్ల రూపంలో అందేలా చూడాలని కోరింది. గతంలో 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు నిధుల అవసరానికి సంబంధించి కొంత సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. తాజాగా మరిన్ని వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం నివేదికను సమర్పించింది. గత ప్రభుత్వం భారీగా పెండింగ్ బిల్లులను వదిలిపెట్టడాన్ని, అదే సమయంలో బడ్జెట్‌కు బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో వేల కోట్ల రూపాయల అప్పులు చేయడాన్ని నివేదికలో ప్రస్తావించింది. రాజధాని నిర్మాణం, విద్య, వైద్య రంగాల్లో చేపట్టాల్సిన మౌలిక వసతుల ప్రాజెక్టులు, రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాల ప్రత్యేక అభివృద్ధికి అవసరమైన నిధులను గ్రాంట్ల రూపంలో కేంద్రం నుంచి వచ్చేలా సిఫారసు చేయాలని నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. -
ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తున్నాం
-
రెండో విడతకు సన్నాహాలు
సాక్షి, యాదాద్రి : రెండో విడత గొర్రెల పంపిణీకి జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. గత ఏడాది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టింది. గొర్రెల కాపరుల కుటుంబాలకు ఆర్థికంగా చేయూతను ఇవ్వడంతోపాటు మాంసం ఉత్పత్తిని పెంచాలన్నది ప్రభుత్వం ధ్యేయం. అందుకోసం గత ఏడాది మొదటి విడతలో 75శాతం సబ్సిడీతో 18 ఏళ్లు నిండిన గొల్ల,కురుమ సామాజిక వర్గానికి చెందిన వారికి గొర్రెలను పంపిణీ చేసింది. త్వరలో రెండో విడత చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. గత ఏడాది ఇలా.. గొర్రెల పెంపకానికి ముందుకు వచ్చే గొల్ల, కురుమ కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. జిల్లాలో 342 గొర్రెల,మేకల పెంపకందారుల సంఘాలు ఉన్నాయి. 2017జూన్‌లో గ్రామ సభలు నిర్వహించి సంఘంలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరినీ ఎంపిక చేశారు. సభ్యత్వం లేని వారికి సభ్యత్వం ఇచ్చి గొర్రెలను అందజేశారు. గ్రామ సభల ద్వారా ఏ, బీ రెండు జాబితాలను తయారు చేసి మొదటి విడతలో ఏ జాబితాలోని యూAనిట్లకు గొర్రెలను పంపిణీ చేశారు. ముందుగా జిల్లాలో గల మండలాలు, గ్రామాలు, లబి ్ధదారుల ఎంపిక పూర్తిగా అధికారులు, సంఘాల ప్రతినిధుల సమక్షంలో లాటరీ పద్ధతిలో జరిగా యి. ఏ లిస్టులోని లబ్ధిదారులకు 17వేలకుపైగా గొర్రెలను పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గొర్రెలను కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందజేశారు. ఇంకా కొందరికి పంపిణీ చేయాల్సి ఉంది. బి జాబితాలో.. ప్రస్తుతం బి జాబితాలోని 15,000 మందికి రెండో విడతలో గొర్రెలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రెండో జాబితాలో 1,543మంది డీడీలు చెల్లించి సిద్ధంగా ఉన్నారు. 1,700 మందికి బి జాబితా లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. మిగతా వారికి పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పశు వైద్యాధికారులు చెబుతున్నారు. రెండో విడతలో గొర్రెలను మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నియమాలను పాటించాలి ఒకే కుటుంబంలోని ఎంత మంది సభ్యులున్నా వారు సంఘాల్లో ఉండవచ్చు. సంఘాల్లో ఉన్న వారందరికీ సబ్సిడీ గొర్రెల యూనిట్ మంజూరు చేస్తారు. గొర్రెలు ఉన్నవారికి, ఉద్యోగం చేస్తున్న కుటుంబాలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలుతో కలిపి 21 ఇస్తారు. యూనిట్ విలువ రూ.1.25లక్షలు. బ్యాంకులతో నిమిత్తం లేకుండా లబ్ధిదారులకు ఈ పథకం వర్తిస్తుంది. యూనిట్ మొత్తంలో 25శాతం (రూ.31,250) లబ్ధిదారుడి వాటా, 75 శాతం (రూ.93.750) ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. లాటరీ పద్ధతిలో గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక చేశారు. ఉదాహరణకు ఒక గ్రామంలో 60 మంది సభ్యులుంటే అందులో 30 మందిని సంఘాల సభ్యుల సమక్షంలోనే లాటరీ ద్వారా గుర్తించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ పర్యవేక్షణ ఉంటుంది. మండల స్థాయిలో తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారి, స్థానిక పశువైద్యుడితో కూడిన త్రి సభ్య కమిటీలు ఉంటాయి. పంపిణీ చేసే గొర్రెలను పక్క రాష్ట్రం నుంచే కొనుగోలు చేయాలన్న నిబంధన సడలించారు. గొర్రెల రవాణా, వాటి బీమా ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుంది. కొత్తగా ఇచ్చే గొర్రెలతో పాటు పాత జీవాలకు కూడా ఉచితంగా బీమా చేస్తున్నారు. గొర్రె ఆరోగ్య పరిరక్షణకు ఏడాదికి మూడుసార్లు టీకాలు, నట్టల మందు సరఫరా చేస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున సంచార పశువైద్యశాలలు ఏర్పాటు చేశారు. గొర్రెల మార్కెటింగ్ కోసం ప్రత్యేక చర్యలు ప్రతి రెండు మూడు మండలాలకు ఒకటి చొప్పున గొర్ల అంగడి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఆదేశాల కోసం చూస్తున్నాం మొదటి దశ లబ్ధిదారులను ఎంపిక చేసిన సమయంలోనే రెండో విడతకు లబ్ధిదారులను ఎంపిక చేశాం. నిబంధనల ప్రకారం లబ్ధిదారుల నుంచి వారి వాటాధనం డీడీలు ఆహ్వానిస్తాం. ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీ కోసం ఇచ్చే ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం. –మదన్‌కుమార్, జిల్లా పశు వైద్యాధికారి -
స్వాహానే ఎజెండా!
ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ ఈసీ, సీఎస్‌లపై ఒత్తిడి తెచ్చి మంత్రివర్గ సమావేశం నిర్వహించడం ద్వారా రూ.1,920 కోట్ల ఉపాధిహామీ పెండింగ్ బిల్లులను పార్టీ నేతలకు చెల్లించాలనేది సీఎం చంద్రబాబు ఎత్తుగడగా అధికారవర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఈనెల 14వ తేదీన నిర్వహించాలని భావిస్తున్న మంత్రివర్గ సమావేశం అజెండాలో ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లుల అంశం కూడా ఉండటం గమనార్హం. – సాక్షి, అమరావతి ఇవన్నీ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా అధికార పార్టీ నేతలు నామినేషన్ పద్ధతిలో సిద్ధం చేసుకున్న ఉపాధి హామీ పథకం బిల్లులు. టీడీపీ గ్రామ స్థాయి నేతలు గత అర్నెళ్లుగా రూ.1,920 కోట్ల విలువైన పనులు చేసినట్లు ఎన్నికల ముందు రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ బిల్లుల చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీఎం చంద్రబాబు పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే ఉపాధి హామీ పనుల పేరుతో ఈనెల 14వ తేదీన నిర్వహించాలని భావిస్తున్న క్యాబినెట్ భేటీలో చర్చించి ఈ బిల్లులకు ఆమోదం తెలిపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతుండటంతో ‘ఉపాధి’ డబ్బులను టీడీపీ నేతలకు వెదజల్లేందుకు అధికార పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. పెండింగ్‌లో భారీగా బిల్లులు ఉన్నా పనులు మాత్రం జరుగుతున్నాయి. కొత్త సర్పంచులు వస్తే బెడిసికొడుతుందనే.. ఉపాధి హామీ పథకంలో కాంట్రాక్టర్ల వ్యవస్థకు తావుండదు. ఉపాధి హామీలో చేపట్టే ఏ పనికైనా ఆ గ్రామ పంచాయితీకే నిధులు చెల్లించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయితీనే ఏ అవసరానికి ఎంత ఖర్చు అయిందో లెక్కలు వేసి డబ్బులు చెల్లిస్తోంది. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల ద్వారా టీడీపీ నేతలు అక్రమంగా ఉపాధి పనులు దక్కించుకుంటూ గ్రామ పంచాయతీ పేరుతో సొమ్ము చేసుకోవడం ఐదేళ్లుగా కొనసాగుతోంది. డబ్బులు తమ పేరుతో మార్చినందుకు టీడీపీ నేతలు వాటాలు చెల్లిస్తున్నారు. గత ఆగస్టు 1వ తేదీ నుంచి సర్పంచుల పదవీ కాలం ముగిసి ప్రత్యేకాధికారుల పాలన రావడంతో టీడీపీ నేతల పని మరింత సులభం అయిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో నిధులు లేకపోయినా గత ఆగస్టు నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు దాదాపు రూ.1,800 కోట్ల బిల్లులు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అందులో రూ.1,615 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారులు అంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలలో జరిగిన పనులతో కలిపి అది రూ.1,920 కోట్లకు చేరుకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం మారితే బిల్లులు చెల్లింపులో జాప్యం జరుగుతుందనే ఆందోళన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. కొత్త సర్పంచులు వస్తే టీడీపీ నేతల ప్లాన్ బెడిసికొడుతుంది. అందువల్లే బిల్లుల చెల్లింపుల కోసమే సీఎం చంద్రబాబు అత్యవసరంగా మంత్రివర్గ సమావేశ నిర్వహణకు సిద్ధమైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. అత్యధిక బిల్లులు లోకేష్ శాఖలోనే.. ఉపాధి హామీ పెండింగ్ బకాయిలుగా చెబుతున్న రూ.1,920 కోట్ల బిల్లుల్లో రూ.1,400 కోట్లు ఒక్క పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా గ్రామీణ రహదారులు, ఇతర నిర్మాణ పనులకు చెల్లించాల్సినవని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్, మే నెలలలో రూ.305 కోట్ల ఉపాధి హామీ మెటీరియల్ పనులు జరగగా అందులో రూ.196 కోట్లు పంచాయతీరాజ్ రోడ్లు బిల్లులుగా చెబుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, స్కూళ్ల ప్రహరీ గోడల నిర్మాణం, గ్రామాల్లో శ్మశాన వాటికల నిర్మాణాలు, అటవీశాఖ ఆధ్వరంలో చేపట్టిన మొక్కల పెంపకం కింద రూ.500 కోట్లకుపైగా బిల్లులను టీడీపీ నేతలు చూపిస్తున్నారు. -
కొత్త బిల్లులు కట్!
-
కొత్త బిల్లులు కట్!
సాక్షి, అమరావతి: శాసనసభ ఆమోదించిన విధంగా నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం అత్యవసర బిల్లుల చెల్లింపులు మాత్రమే చేయాలని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు అన్ని శాఖలకు అల్టిమేటం జారీ చేశారు. మరికొద్ది రోజుల్లో నూతన ప్రభుత్వం కొలువుదీరనున్న తరుణంలో హడావుడిగా ప్రవేశపెట్టే కొత్త బిల్లులకు చెల్లింపులు చేయరాదని స్పష్టం చేశారు. కేవలం అత్యవసరమైన పాత బిల్లులే చెల్లించాలని, అది కూడా ఓటాన్ అకౌంట్ మేరకే ఉండాలని అన్ని శాఖలకు నిర్దేశించారు. మిగతా బిల్లుల గురించి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాతే ఆలోచించాలని ఆదేశించారు. ఈమేరకు ఆర్థిక శాఖ కార్యదర్శులు రెండు రోజుల క్రితం అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కింద ఏప్రిల్ నుంచి జూలై వరకు ఏ శాఖకు ఎన్ని నిధులు వస్తాయి? ఇప్పటి వరకు ఏ శాఖకు ఎంత బడ్జెట్ విడుదలైంది? తదితర వివరాలతోపాటు గత ఆర్థిక ఏడాది బకాయి బిల్లులపై ఆర్థిక శాఖ కార్యదర్శులు పీయూష్ కుమార్, సత్యనారాయణలు ఈ సమావేశంలో చర్చించారు. పూర్తి స్థాయి బడ్జెట్ తరువాతే మిగతావి.. ఏప్రిల్ నుంచి మే నెల 1వ తేదీ వరకు అన్ని శాఖలకు చెందిన రూ.14,888.42 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమావేశంలో ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. వీటిని ఎలా చెల్లించాలనే విషయంపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు స్పష్టత ఇచ్చారు. అవసరమైన బిల్లులను మాత్రమే చెల్లించాలని, నాలుగు నెలల ఓటాన్ బడ్జెట్ కేటాయింపుల ఆధారంగా అత్యవసరం కాని పెండింగ్ బిల్లులుంటే వాటిని పక్కన పెట్టాలని సూచించారు. పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చిన తరువాతనే వాటి గురించి ఆలోచించాలని ఆదేశించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేటాయింపుల పరిధిలోనే వ్యయం ఉండాలని, ప్రాధాన్యం మేరకు అత్యవసరాలకు బిల్లులు చెల్లించాలని ఆర్థిక శాఖ కార్యదర్శులు పేర్కొన్నారు. మెస్ చార్జీలు, స్కాలర్షిప్లు లాంటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మిగతా పనులకు సంబంధించిన బిల్లులకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సరిపోకపోతే వాటిని పక్కన పెట్టాలని, అలాంటి వాటికి పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చిన తరువాత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ కార్యదర్శులు స్పష్టం చేశారు. ప్రాధాన్యం మేరకే పంపాలి ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,26,17,753 కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలలకు మాత్రమే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నాలుగు నెలలకు అన్ని శాఖలకు కలిపి రూ.76,816.86 కోట్లను ఆర్థిక శాఖ పంపిణీ చేసింది. ఇప్పటివరకు రూ.52,997.97 కోట్లను ఆయా శాఖలకు విడుదల చేస్తూ జీవోలను జారీ చేసింది. ఇందులో రూ.20,584 కోట్లను వ్యయం చేశారు. మిగిలిన పెండింగ్ బిల్లులు రూ.14,888.42 కోట్లకు సంబంధించి ప్రాధాన్యం మేరకు మాత్రమే ఆర్థిక శాఖకు పంపించాలని ఆర్థిక శాఖ కార్యదర్శులు తాజాగా నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు. సీఎఫ్ఎంఎస్కు లింక్ ద్వారా బిల్లుల వివరాలు.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పంపిణీ, పెండింగ్ బిల్లుల వివరాలను సీఎఫ్ఎంఎస్ పోగ్రామ్‌లో పొందుపరచడంలో ఆర్థిక శాఖ విఫలమైంది. దీంతో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పోగ్రామ్‌లోనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పంపిణీ, పెండింగ్ బిల్లుల వివరాలను రూపొందించి ఆ లింక్‌ను సీఎఫ్ఎంఎస్కు ఇచ్చారు. అన్ని శాఖలు ఆ లింక్‌ను పరిశీలించి ఓటాన్ బడ్జెట్ కేటాయింపులు, వ్యయాలను పర్యవేక్షించాలని ఆర్థికశాఖ కార్యదర్శులు సూచించారు. ఇదిలా ఉండగా సంక్షేమ రంగాలతో పాటు మంచినీటి సరఫరా తదితర బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఓట్ల పథకాలకే బాబు చెల్లింపులు టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కేవలం నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు మాత్రమే అసెంబ్లీ ఆమోదం లభించింది. గత ఆర్థిక ఏడాది చివరి మూడు నెలల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను కలిగించే బిల్లులనే భారీగా చెల్లించడంతో బడ్జెట్ కేటాయింపులు ఉన్నప్పటికీ మిగతా బిల్లులు నిలిచిపోయాయి. దీంతో వీటిని ఆర్థికశాఖ ఈ ఆర్థిక ఏడాదికి బదిలీ చేసింది. అయితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నాలుగు నెలల బడ్జెట్ కేటాయింపుల మేరకు మాత్రమే వ్యయం చేయాల్సి ఉంది. -
ఏపీ ఆర్థిక వ్యవస్థ కుదేలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, అస్తవ్యస్త విధానాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యిందని ఆర్థిక శాఖ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆర్థిక ఏడాది చేపట్టే పనులు, కార్యక్రమాల కోసం పైసలకు తడుముకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది ముగిసిన ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన దాదాపు 14వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్‌లో పెట్టేశారు. అలాగే మార్చి చివరి రోజుల్లో వచ్చిన రూ. 8 వేల కోట్ల బిల్లులనూ ఆర్థిక శాఖ తిరస్కరించింది. హడావిడిగా మార్చి 18, 19, 20వ తేదీల్లో బిల్లులను సమర్పించడం అంటే వాస్తవంగా పనులు జరిగాయా లేదా అనే విషయం తెలియదు. ఈ బిల్లులను స్క్రూటినీ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ రూ. 8 వేల కోట్ల బిల్లులను తిరస్కరిస్తూ మళ్లీ ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా బిల్లులు సమర్పించాల్సిందిగా ఆర్థిక శాఖ సంబంధిత శాఖలకు సూచించింది. ఇవన్నీ కూడా వివిధ కేంద్ర పథకాల ద్వారా వచ్చిన నిధులకు మ్యాచింగ్ గ్రాంటుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులతో పాటు వివిధ కార్పొరేషన్ల నుంచి తీసుకున్న నిధులకు సంబంధించిన బిల్లులని ఆయా వర్గాలు చెబుతున్నాయి. అలాగే వివిధ శాఖల నిర్వహణకు సంబంధించిన బిల్లులు గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోకి తీసుకొచ్చారు. మొత్తంగా 22 వేల కోట్ల రూపాయల బిల్లుల భారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై పడుతోంది. ఈ ఏడాది తొలి నాలుగు నెలలకే ఓటాన్ అకౌంట్ కేటాయింపులకు అసెంబ్లీ ఆమోదం తీసుకున్నారు. ఇప్పుడు ఆ బిల్లులు చెల్లించడానికి ఆయా శాఖలకు నాలుగు నెలలకు కేటాయించిన నిధులు కూడా సరిపోని పరిస్థితి నెలకొందని ఆర్థిక శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. గతేడాది పలు పథకాలకు కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో రూ. 4 వేల కోట్ల వరకు ఇతర అవసరాలకు మళ్లించేశారని, ఇప్పుడు ఆ నిధులనూ ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సి ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చంద్రబాబు అతి తెలివితేటలకు, రాజకీయ ప్రయోజనాలకు రాష్ట్ర ఖజానాను అస్థవ్యస్తం చేసేశారనే అభిప్రాయాన్ని ఆర్థిక శాఖ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి. అన్ని విభాగాల్లో అదే తీరు.. గత ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాల్సిన బిల్లులు రాకపోవడంతో అనేకమంది ఇప్పుడు సచివాలయంలోని ఆర్థిక శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘వివిధ రంగాల కార్పొరేషన్లకు చెందిన నిధులను లాగేసుకోవడంతో ఆయా కార్పొరేషన్ల వ్యక్తిగత ఖాతాల్లో నిధులు ఖాళీ అయ్యాయి. ఆఖరికి గ్రామీణాభివృద్ధి సెస్‌ను కూడా దారి మళ్లించేశారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల మేరకు కాకుండా ప్రభుత్వ పెద్దల ఇష్టారాజ్యం మేరకు నిధులు ఇవ్వడంతో ఆ బడ్జెట్‌కు విశ్వసనీయత లేకుండా పోయింది. ఈ ఆర్థిక ఏడాది కేటాయింపులు గతేడాది బిల్లుల చెల్లింపులకే సరిపోతాయి. ప్రస్తుతం వివిధ శాఖల్లో చేపట్టే సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది’ అని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పరిస్థితిని చక్కదిద్దడానికి కొత్త ప్రభుత్వానికి చాలా సమయం.. ‘గతేడాది పేదల గృహ నిర్మాణాలకు బిల్లులను చెల్లించలేదు. విద్యుత్ సబ్సిడీ కూడా చెల్లించకుండా ట్రాన్స్‌కో ద్వారా బయట అప్పులు చేయించారు. రేషన్ బియ్యానికి ఇవ్వాల్సిన సబ్సిడీ నిధులనూ ఇవ్వకుండా పౌర సరఫరాల సంస్థ ధాన్యం కొనుగోలుకు చేస్తున్న అప్పుల నుంచి సబ్సిడీ భరించాల్సిందిగా సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తలకిందులైపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి పరిస్థితిని చక్కదిద్దాలంటే చాలా సమయం పడుతుంది’ అని సీనియర్ ఐఏఎస్ అధికారులు అంటున్నారు. ఈ నెలలో ఇప్పటికే మూడు రోజులు ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లారంటే పరిస్థితిని చంద్రబాబు సర్కారు ఎంతగా దిగజార్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 5న రూ. 92.08 కోట్లు, 6న రూ. 2,513.77 కోట్లు, 9న రూ. 650.61 కోట్ల మేర ఓడర్ డ్రాఫ్ట్‌కు వెళ్లడం గమనార్హం. -
బకాయి చెల్లించకుండా బుకాయింపు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ విద్యుత్తు సంస్థలు రూ.5 వేల కోట్లకుపైగా బకాయి పడ్డాయంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఆరోపణలు అబద్ధమని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. ఏపీ విద్యుత్తు సంస్థలే తెలంగాణకు బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఆ విషయాన్ని పక్కనపెట్టి ‘ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే’తరహాలో ఏపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆయన శుక్రవారం ఇక్కడ విద్యుత్‌సౌధలో మీడియాతో మాట్లాడారు. రెండు వైపుల నుంచి బకాయిలు ఇచ్చిపుచ్చుకోవాల్సి ఉన్నందున చాలాకాలంగా పరిష్కారం కోసం ఆహ్వానిస్తున్నా ఏపీ అధికారులు సహకరించటం లేదన్నారు. సెటిల్మెంట్ కోసం ముందుకు రాకుండా ఇప్పుడేమో తెలంగాణ విద్యుత్తు సంస్థలే బకాయి పడ్డాయని ఆరోపించటం హాస్యాస్పదమన్నారు. ‘ఏపీ డిస్కంల నుంచి తెలంగాణ డిస్కంలకు రూ.1,659 కోట్లు, ఏపీ ట్రాన్స్‌కో నుంచి తెలంగాణ ట్రాన్స్‌కోకు రూ.101 కోట్లు, ఏపీ జెన్కో నుంచి తెలంగాణ జెన్కోకు రూ.3,096 కోట్లు, ఏపీ పవర్ యుటిలిటీస్ నుంచి తెలంగాణ పవర్ యుటిలిటీస్‌కు రూ.929 కోట్లు వెరసి రూ.5,785 కోట్లు రావాల్సి ఉంది. విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రూ.3,379 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం పోను ఏపీ సంస్థలు తెలంగాణ సంస్థలకు రూ.2,406 కోట్లు చెల్లించాల్సి ఉంది. మరో రూ.1,100 కోట్ల వరకు తెలంగాణకు ఏపీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వీటిని మరుగున పడేసి తెలంగాణనే బకాయిపడ్డట్టు తప్పుడు వాదనను తెరపైకి తెచ్చారు. ఈ లెక్కలు బహుశా అక్కడి ప్రభుత్వానికి తెలియకపోవచ్చు. అధికారులకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయలోపం ఉన్నట్టుంది. తెలిసి ఉంటే ప్రభుత్వ వాదన అలా ఉండదు కదా’అని ప్రభాకరరావు అన్నారు. ఎన్సీఎల్టీని ఎందుకు ఆశ్రయించినట్టో... వాస్తవాలను పక్కన పెట్టి ఏపీ జెన్కో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించటం విడ్డూరంగా మారిందని ప్రభాకర్‌రావు అన్నారు. దివాలా తీసిన సమయంలో ఈ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి లెక్కలు సరిచేసుకునేందుకు వాటి ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ నిర్వహిస్తారని, మరి తెలంగాణ విద్యుత్తు సంస్థలను ఏపీ స్వాధీనం చేసుకోవాలని చూస్తోందా... అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఈ బకాయిలకు సంబంధించి సెటిల్ చేసుకునేందుకు రావాలంటూ ఇప్పటికే ఏడెనిమిది లేఖలు రాశామని, తాను స్వయంగా ఏపీ అధికారులతో మాట్లాడానని, కానీ అక్కడి నుంచి స్పందన లేదని ఆరోపించారు. ఏపీ అధికారులు ముందుకొస్తే 24 గంటల్లో పరిష్కరించుకునేందుకు తాము సిద్ధమని, ఆ తర్వాత తాము చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించేందుకు కూడా సిద్ధమన్నారు. ఏపీ తెలంగాణకు చెల్లించేది డబ్బు... తెలంగాణ ఏపీకి చెల్లించాల్సింది డబ్బు కాదా... డబ్బుకు కూడా రంగు, రుచి, వాసన వేర్వేరుగా ఉంటాయని ఏపీ అధికారులు భావిస్తున్నట్టున్నారంటూ ఎద్దేవా చేశారు. -
బాబును నమ్మితే అప్పులే మిగిలాయి...
సాక్షి, దత్తిరాజేరు: గజపతినగరం నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో మంది ఎన్టీఆర్ గృహకల్ప లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. గృహాలు నిర్మించుకోమని అధికారులు చెప్పిన వెంటనే అప్పులు చేసి మరీ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. తీరా నిర్మాణాలు పూర్తయినా నేటికీ బిల్లులు పూర్తి స్థాయిలో అందలేదని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మందికి 2018లో ఎన్టీఆర్ ఇళ్లు మంజూరు చేశారు. ఒక్కో ఇంటికి లక్షన్నర రూపాయలు మంజూరు చేస్తామని అధికారులు ప్రకటించడంతో లబ్ధిదారులు ఎంతో ఆనందంతో నిర్మాణాలు చేపట్టారు. అయితే వారి ఆనందం ఎంతో కాలం నిలువలేదు. కొంతమంది ఒక బిల్లు అయితే మరికొంతమందికి రెండు బిల్లులు మాత్రమే అయ్యాయి. ఎవ్వరికీ పూర్తిస్థాయిలో బిల్లులు అయిన దాఖలాలు లేవు. బిల్లుల కోసం అధికారులను ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పుల భారం.. సొంతింటి కల నెరవేరుతుందనే ఆశతో చాలామంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు నడుంబిగించారు. పునాదులు, స్లేడు, శ్లాబు దశల్లో మొత్తం లక్షన్నర రూపాయలు అందజేస్తామని అధికారులు చెప్పారు. దీంతో లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టారు. వాస్తవానికి ప్రభుత్వం చెల్లించే మొత్తం ఎందుకూ సరిపోదు. కాని సొంత ఇల్లు కావాలనే ఉద్దేశంతో చాలామంది అప్పులు చేసి మరీ నిర్మాణాలు చేపట్టారు. అయితే ప్రభుత్వం ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. అటు చేసిన అప్పులుకు వడ్డీలు కట్టలేక.. ఇటు బిల్లులు కాక తలలు పట్టుకుంటున్నారు. చాలామంది ఇళ్ల నిర్మాణాలు దాదాపు పూర్తయిన డబ్బుల్లేక గృహ ప్రవేశాలు చేసుకోలేని దుస్థితి నెలకొంది. ఈ విషయమై గృహ నిర్మాణ శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ రామారావు వద్ద ప్రస్తావించగా.. ఉపాధి పథకం నుంచి బిల్లులు రావాల్సి ఉందన్నారు. అవి కూడా రెండు విడతల్లో మంజూరవుతాయని చెప్పారు. అయితే అధికారులు స్పందించి బిల్లులు త్వరగా మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఎప్పుడు అందుతాయో.. నాకు పక్కా గృహం మంజూరైంది. మొదట విడత రూ. 19 వేలు.. రెండో విడత రూ.42 వేలు చెల్లించారు. తర్వాత బిల్లు మంజూరు కాలేదు. బిల్లులు త్వరగా మంజూరవుతాయనే ఉద్దేశంతో రెండు లక్షల రూపాయలు అప్పు చేసి మరీ నిర్మాణం పూర్తి చేశాను. వడ్డీలు కట్టలేకపోతున్నాను. – గంగిరెడ్ల లక్ష్మి, సిరిపురం, గంట్యాడ ఒక్క బిల్లే అందింది.. నాపేరు మీద 2018లో ఇళ్లు మంజూరైంది. ప్రస్తుతం శ్లాబు దశలో ఉంది. ఇప్పటికి ఒక్క బిల్లు మాత్రమే అందించి. బయట అప్పులు చేసి నిర్మాణం చేపట్టాను. వడ్డీలు కట్టలేకపోతున్నాను. అధికారులు స్పందించి బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలి. – పల్లా శారద, పెదమానాపురం, త్వరలోనే బిల్లులు నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులందరికీ త్వరలోనే బిల్లులు వారి బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతాయి. బిల్లుల విషయంలో ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నిధులు మంజూరవ్వగానే పంపిణీ చేస్తాం. – ఉమామహేశ్వరరావు గృహనిర్మాణ అధికారి, దత్తిరాజేరు -
గోదావరి జిల్లాల్లో నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ సేవలు
-
బకాయిలు వచ్చేశాయ్
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : రేషన్ డీలర్ల కమీషన్ బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. బియ్యం పంపిణీ చేసిన డీలర్లకు పెంచిన కమీషన్‌కు సంబంధించి బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో రేషన్ డీలర్‌కు ఎంత రావాల్సి ఉందనే లెక్కలు తేలుస్తున్నారు. ఇదివరకు రేషన్ బియ్యం పంపిణీపై కిలోకు 20 పైసల చొప్పున కమీషన్ ఇచ్చేవారు. అయితే కమీషన్ పెంపుతో పాటు గౌరవ వేతనాన్ని ఇవ్వాలనే డిమాండ్‌తో రేషన్ డీలర్లు ప్రభుత్వంపై దశలవారీగా వత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకు ప్రభుత్వం 2015 అక్టోబర్ నుండి కేజీ బియ్యానికి కమీషన్‌ను 70 పైసలు చెల్లించేందుకు నిర్ణయించింది. ఇదివరకు చెల్లించిన 20 పైసలు పోను మిగతా 50 పైసలు ఇప్పుడు చెల్లించేందుకు నిర్ణయించడంతో బకాయి మొత్తాలను చెల్లించే చర్యల్లో వేగం పెంచారు. జిల్లా డీలర్లకు రూ.10.80 కోట్లు గతంలో ఇచ్చిన 20 పైసల కమీషన్‌ను 70 పైసలకు పెంచిన ప్రభుత్వం ఈ మొత్తాన్ని అక్టోబర్ 2015 నుండి చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలోని డీలర్లకు రూ.10.80 కోట్లు చెల్లించనున్నారు. ఈ బకాయిలను తహసీల్దార్ల నివేదికల ఆధారంగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో బకాయిలు చెల్లించే పీరియడ్‌లో రేషన్ డీలర్లు ఎవరైనా సెలవులో వెళ్లినా, 6ఏ కేసులు నమోదైనా, చనిపోయిన వారున్నా... వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. ఇలాంటి కేసుల్లో ఇన్చార్జిలకు బకాయి కమీషన్ అందనుంది. ఈ అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే బకాయిలు చెల్లిస్తామని అధికారులు ప్రకటించారు. మొదటి విడతలో ఎలాంటి ఆక్షేపణలు లేకుండా కొనసాగుతున్న రేషన్ డీలర్లకు, రెండో విడతలో మిగిలిన వారికి బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా కాలం నాటి బకాయిలు ఇక్కడే... ప్రభుత్వం 2015 అక్టోబర్ నుండి రేషన్ డీలర్లకు పెంచిన కమీషన్ చెల్లించాలని నిర్ణయించారు. అయితే, జిల్లాల విభజనకు ముందు సమయం నాటి కమీషన్‌ను డీలర్లు అందరూమహబూబ్‌నగర్ డీసీఎస్ఓ కార్యాలయం నుండే పొందాల్సి ఉంటుంది. అయితే నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల పరిధిలోని ఆర్డీఓల నుండి జిల్లాల విభజన సమయం వరకు పనిచేసిన రేషన్ డీలర్ల వివరాలతో కూడిన నివేదిక పంపించాల్సి ఉంది. 2016 అక్టోబర్ 12న జిల్లాల పునర్విభజన జరిగింది. అంతకు ముందు రోజు వరకు పనిచేసిన రేషన్ డీలర్ల వివరాలను సంబంధింత ఆర్డీఓల ద్వారా నివేదిక రాగానే కమీషన్ చెల్లిస్తారు. జిల్లాల విభజన అనంతరం కమీషన్‌ను అక్కడి డీసీఎస్‌ఓల ద్వారానే పొందాల్సి ఉంటుంది. డీలర్లతో సమావేశం ప్రభుత్వం బకాయిల చెల్లింపునకు నిర్ణయం తీసుకున్న దృష్ట్యా మొదటి విడతలో 730 మంది డీలర్లకు చెల్లింపులు చేయనున్నట్లు డీసీఎస్ఓ శారదాప్రియదర్శిని తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లోని డీసీఎస్ఓ కార్యాలయంలో శుక్రవారం ఆమె మండలానికి ఇద్దరు డీలర్లతో సమావేశమయ్యారు. ఎలాంటి కేసులు లేకుండా రెగ్యూలర్‌గా బియ్యం పంపిణీ చేసిన రేషన్ డీలర్లు 730 మంది ఉండగా కేసులు, సెలవులు, చనిపోయిన వారు 74 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఎలాంటి కేసులు లేని వారికి మొదటి విడతగా రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేయిస్తామని ఆమె తెలిపారు. అదే పనిలో ఉన్నాం... రేషన్ డీలర్లకు బకాయి కమీషన్ డబ్బులు కిలో రేషన్ బియ్యానికి 50 పైసల చొప్పున చెల్లించనున్నాం. 2015 అక్టోబర్ నుంచి డీలర్లకు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాలో రేషన్ డీలర్లకు రావాల్సిన బకాయి కమీషన్ డబ్బు చెల్లింపునకు కసరత్తు చేస్తున్నాం. తహసీల్దార్లు, ఆర్డీఓల ద్వారా నివేదికలు అందాల్సి ఉంది. మా కార్యాలయ సిబ్బంది అదే పనిలో నిమగ్నమయ్యారు. – శారదా ప్రియదర్శిని, డీసీఎస్ఓ -
ఆన్లైన్.. ఆలస్యం
బిల్లుల కోసం ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంకా ఎదురుచూపులు తప్పడంలేదు. వైఎస్ హయాంలో ఈ పథకం ప్రారంభించగా.. ‘డబుల్’ ఇళ్ల రాకతో బిల్లులు నిలిచిపోయాయి. ఆందోళన చెందిన లబ్ధిదారులు అధికారులను వేడుకోవడంతో ప్రభుత్వం తహసీల్దార్లతో సర్వే చేయించింది. ఆ వివరాల ఆన్లైన్.. జాప్యం జరుగుతోంది. ఫలితంగా చెల్లింపు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ప్రతీ నిరుపేదకు సొంత ఇల్లు ఉండాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టారు. దశలవారీగా ఇళ్లకు సంబంధించిన బిల్లులు విడుదల చేసేవారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు డబుల్బెడ్రూం ఇళ్లను మంజూరు చేసింది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల విడుదల నిలిచిపోయింది. దీంతో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు. అప్పులు చేసి మరీ ఇళ్లను నిర్మించుకున్నామని, ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నామని, ఇప్పుడు బిల్లులు నిలిపిస్తే తమ పరిస్థితి ఏమిటని అధికారు యంత్రాంగం చుట్టూ తిరిగి విన్నవించుకున్నారు. స్పందించిన ప్రభుత్వం అర్హులైన వారిని గుర్తించేందుకు తహసీల్దార్లతో సర్వే చేపట్టింది. నివేదిక ఇచ్చి ఏడాది.. 2008వ సంవత్సరం నుంచి 2015 వరకు ఇందిరమ్మ పథకం కింద 6,724మంది నిర్మాణాలు వివిధ దశల్లో పూర్తి చేసుకుంటున్నారు. అయితే వాటికి సంబంధించిన బిల్లులు లబ్ధిదారులకు అందలేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, కొంతమంది అసలు ఇళ్లను నిర్మించకుండానే బిల్లులు తీసుకున్నారనే ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో అర్హులను గుర్తించేందుకు తహసీల్దార్లతో విచారణ చేయించారు. బృందాలుగా ఏర్పడిన తహసీల్దార్లు గ్రామాల్లో విచారణ చేపట్టారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఆ వివరాలను కలెక్టరేట్‌కు పంపించారు. విచారణ పూర్తయి సుమారు ఏడాది కావస్తున్నా ఆన్లైన్లో జాప్యం కారణంగా లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. నత్తనడకన ఆన్లైన్.. ఇందిరమ్మ లబ్ధిదారుల ఆన్లైన్ అంశం ఎప్పటికప్పుడు ఆలస్యమవుతోంది. తహసీల్దార్లు విచారణ నివేదికను కలెక్టరేట్‌కు పంపించిన ఏడాది కావొస్తోంది. అయినా ఆన్లైన్ చేయటంలో మాత్రం జాప్యం జరుగుతోంది. ఇప్పటికే ఆలస్యమవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాల కోసం తెచ్చుకున్న అప్పులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 6,724మంది ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్నారు. వాటిలో 1,874కు సంబంధించి ఆన్లైన్ కాగా, వారికి సంబం«ధించిన రూ.2.06కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. మిగిలిన 4,845మంది లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు ఇంకా ఆన్లైన్ కాలేదు. సిబ్బంది కొరత కారణంగా ఆన్లైన్ చేయడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం ఐదుగురు ఉద్యోగులు మాత్రమే ఈ ఆన్లైన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. దీంతో వివరాల నమోదు, నత్తనడకన సాగుతోంది. -
తమ్ముళ్ల బిల్లుల గోల!
నీరు చెట్టు... అధికార పార్టీ కార్యకర్తల ఉపాధికి తొలిమెట్టు.. అక్షరాలా దానిని నమ్మిన తమ్ముళ్లు ఇప్పుడు లబోదిబో మంటున్నారు. జిల్లాలో మంజూరైన పనులన్నీ వారే చేజిక్కించుకున్నారు. చకచకా పనులు చేసేసి ఎంచక్కా బిల్లులకోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఏడునెలలయింది. ఒక్క పైసా విదల్చట్లేదు. మన సర్కారే కదా... బిల్లులు వెంటనే వచ్చేస్తాయిలే అంటూ ఎంతో ఆత్రంగా అప్పుచేసి మరీ పనులు చేస్తే ఇదేంటిలా.. అంటూ అప్పుడు ఉసూరుమంటున్నారు. విజయనగరం గంటస్తంభం: నీరు చెట్టు పథకం కింద జిల్లాలో చెరువుల్లో మట్టితీత, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి, చెక్‌డ్యాంల నిర్మాణం వంటి పనులు చేపట్టిన విషయం విదితమే. జిల్లాలో విజయనగరం, పార్వతీపురం డివిజన్లలో మొత్తం 1632 పనులు మంజూ రు చేస్తూ... ఇందుకోసం రూ.145 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.50.50కోట్లు విలువైన 617 పనులు చేపట్టారు. ఈ పనులను çసుమారు సగం సాగునీటి సంఘాలు చేయగా మిగతా సగం జన్మభూమి కమిటీల పేరుతో అధికారపార్టీ నాయకులు, కాంట్రాక్టర్లు చేపట్టారు. ఒక్కపైసా బిల్లు అందలేదు ఈ ఏడాది చేపట్టిన పనులకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏప్రిల్ నెల నుంచి ఇంతవరకు ఒక్క బిల్లు కూడా అందలేదు. వాస్తవానికి నీటిపారుదలశాఖ అధికారులు రూ. 50.50 కోట్ల విలువైన బిల్లులు పేఅండ్ అకౌంట్స్ కా ర్యాలయానికి పంపించారు. అందులో విజయనగరం డివిజన్‌కు సంబంధిం చి రూ. 28కోట్లు విలువైన బిల్లులుంటే పార్వతీపురం డివిజన్‌కు సంబంధిం చి రూ. 22.5కోట్ల విలువైన బిల్లులున్నాయి. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చిన బిల్లులు సంబంధిత అధికారులు ప్రభుత్వానికి పంపుతున్నా నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేగానీ బిల్లులు చెల్లించే అవకాశం లేదు. నిర్వాహకుల అందోళన ఏప్రిల్ నెల నుంచి బిల్లులు అందకపోవడంతో పనులు చేసిన నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. పనులు చేసిన వారిలో సగంమంది వరకు సాగునీటిసంఘాల సభ్యులే ఉన్నారు. వాస్తవానికి జిల్లాలో సాగునీటిసంఘాల్లో ఉన్న అధ్యక్ష, కార్యదర్శులతోపాటు సభ్యుల్లో ఆర్థికంగా పటిష్టంగా ఉన్న వారు 20శాతం మాత్రమే. వీరు పనులు చేసేందుకు చేతి సొమ్ము వినియోగించారు. మిగతావారు పనుల కోసం అప్పు చేయాల్సి వచ్చింది. ఆభరణాలు తాకట్టు పెట్టి మరీ పనులు చేపట్టారు. ఇప్పుడు బిల్లులు అందకపోవడంతో లబోదిబోమంటున్నారు. ప్రభుత్వ వైఖరిపై వారు మండిపడుతున్నారు. వాస్తవానికి సాగునీటి సంఘాల్లో అధికారపార్టీ నేతలే 85 శాతం వరకు ఉన్నారు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోయినా పార్టీ పరువు పోకుండా ఉండేందుకు బయటకు చెప్పకపోయినా ఆర్థిక సమస్యలు ఎదురవడంతో ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏమి ప్రభుత్వమంటూ నిట్టూర్చుతున్నారు. ఇన్ని నెలలు పెండింగ్‌లో పెడితే ఎలా... ఇదిలాఉంటే జన్మభూమి కమిటీల పేరుతో చేసిన వారిలో శ్రీమంతులు 40శాతం మించి ఉండరు. మిగతావారు చేతిలో సొమ్ములు లేకపోయినా ఇతరులపై ఆధారపడి పనులు చేశారు. ఇప్పుడు బిల్లులు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమదని, పనులు చేయాలని సరదా పడి చేస్తే ఇప్పుడు ఆ సరదా తీరిందని మదన పడుతున్నారు. ఇన్ని నెలలు బిల్లులు పెండింగా? అంటూ ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తున్నారు. కాంట్రాక్టర్లదీ అదే పరిస్థితి. ఇప్పుడు అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఇలాగే పరిస్థితులుంటే తర్వాత పనులు చేయడానికి ఎవరూ ముందుకు రారని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం నీటిపారుదలశాఖ ఈఈ ఎం.వి.రమణ వద్ద సాక్షి ప్రస్తావించగా బిల్లులు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమని, ఆ విషయం తమ పరిధిలో లేదన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉందని, వారం, పదిరోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందన్నారు. -
హౌసింగ్ శాఖకు దిక్కెవరు?
డిప్యుటేషన్‌పై ఇతర శాఖలకు ఏఈలు, కార్యాలయాలకు తాళాలు పెండింగ్ బిల్లుల కోసం తిరుగుతున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపైనే పేదల ఆశలు యాచారం: గృహ నిర్మాణ శాఖ దిక్కు లేకుండా తయారైంది. బాధ్యులైన ఏఈలు డిప్యుటేషన్‌పై వెళ్లారు. రూ. లక్షలు ఖర్చు చేసిన ఆ శాఖ కార్యాలయాలు నేడు తాళాలు పడి దర్శనమిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరైన రోజుల్లో ఒక వెలుగు వెలిగిన హౌసింగ్ శాఖ నేడు దిక్కే లేకుండా పోవడంతో ఇక ఈ ప్రభుత్వంలో ఇంటి నిర్మాణాలు కలగానే మిగులుతాయని పేద ప్రజలు అయోమయంలో పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రభుత్వం పేర్కొనడంతో పేదల్లో ఆశ పెరిగింది. నేడు హౌసింగ్ శాఖనే ఎత్తేసే పరిస్థితి నెలకొనడంతో తమ కలల సౌధాల కోసం ఎదురుచూసే పేదలు పరిస్థితి నేడు నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించుకున్న ఇళ్లకు కొత్తగా కొలువుదీరిన తెలంగాణ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు, కనీసం లబ్ధిదారుల ఎంపిక సైతం ముందుకు సాగకపోవడంతో పేదల్లో అసంతృప్తి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి మండలంలో హౌసింగ్ శాఖ మోడల్ గృహాలను నిర్మించి ప్రభుత్వ సహయం చేసే నిధులతోనే చక్కటి ఇంటిని నిర్మించుకోవచ్చనే భావన ప్రజల్లో కల్పించేలా కృషి చేసింది. మోడల్ గృహాలను నిర్మించిన తర్వాత నేటి తెలంగాణ ప్రభుత్వంలో ఆ శాఖలో పనిచేస్తున్న ఏఈలను, ఇతర సిబ్బందిని ఇతర శాఖలకు డిప్యుటేషన్‌పై పంపింది. మండల స్థాయిలో పర్యవేక్షణ చేసే ఏఈలు డిప్యుటేషన్‌పై వెళ్లడంతో కార్యాలయాలు దిక్కు లేకుండా పోయాయి. కార్యాలయాల్లో రికార్డులకు సైతం భద్రత లేదు. ఇబ్రహీంపట్నం డివిజన్లో గృహ నిర్మాణ పనులను పర్యవేక్షణ చేయడానికి ప్రభుత్వం మంచాల ఏఈ రాంచంద్రయ్యను నియమించింది. ఆయన కూడా తన విధులకు ఎక్కడ ముప్పు వస్తుందోనని ఏదో తూతూ మాత్రంగా విధులు నిర్వర్తిస్తూ వస్తున్నాడు. ఆయన కూడా త్వరలో ఏదో ఒక శాఖకు బదిలీపై వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. రూ. 50 లక్షల పెండింగ్ బిల్లులు ఇబ్రహీంపట్నం డివిజన్లోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల్లో దాదాపు 150 మంది లబ్ధిదారులకు రూ. 50 లక్షల వరకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు సంబంధించి పెండింగ్ బిల్లులున్నట్లు సమాచారం. ఈ బిల్లులు కూడా 2014 జనవరికి ముందు ఇంటి నిర్మాణాలు వివిధ దశల్లో నిర్మించుకున్నవి మాత్రమే. గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ పథకం కింద అనుమతులు పొంది తెలంగాణ ప్రభుత్వంలో ఆయా మండలాల్లో వందలాది మంది ఇంటి నిర్మాణాలను చేపట్టడం జరిగింది. మొదట్లో తెలంగాణ ప్రభుత్వం పేదలందరికీ బిల్లులు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చి ఆయా మండలాల తహసీల్దార్ల ద్వారా నిజమైన లబ్ధిదారుల సర్వే కూడా చేయించింది. తహసీల్దార్ సర్వేతో ఇక తమకు ఇంటి నిర్మాణ బిల్లులు వస్తాయని కలలు కన్న పేదలు నేడు బిల్లులు మంజూరు కాకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు చేపట్టిన వారంతా నిత్యం రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు. అప్పట్లో అప్పలు చేసి ఇంటి పనులు ప్రారంభించుకున్నారు. నేడు ఆ నిర్మాణాలకు సంబంధించి బిల్లులు రాకపోవడం, చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకోలేక అల్లాడిపోతున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిస్థితి కూడా ముందుకు సాగే పరిస్థితి లేకపోవడంతో ఇక తమకు ఇంటి మంజూరు కలగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొందని పేదలు అంటున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి పెండింగ్ బిల్లులు వచ్చేలా, త్వరలో డబుల్బెడ్రూం ఇంటి నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా కృషి చేయాలని పేదలు కోరుతున్నారు. ఇదే విషయమై హౌసింగ్ ఇన్చార్జి రాంచంద్రయ్యను సంప్రదించగా తామే అయోమయంలో ఉన్నామని అన్నారు. దిక్కే లేకుండా పోయిందని వాపోయా రు. తాను కూడా ఇతర శాఖలోకి వెళ్లేం దుకు చూస్తున్నానని చెప్పుకురావడం కొసమెరుపు. -
పంచాయతీలకు ’పవర్’ కట్
బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్ శాఖ నోటీసులు చీకట్లో మగ్గుతున్న పల్లెలు చింతలపూడి/జంగారెడ్డిగూడెం : జిల్లాలోని పల్లెలు చీకట్లో మగ్గాల్సిన దుస్ధితి తలెత్తింది. గ్రామాలను స్మార్ట్ విలేజ్‌లుగా అభివృద్ధి చేస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లుల భారాన్ని పంచాయతీలపైనే రుద్దుతోంది. అసలే నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న పంచాయతీలకు విద్యుత్ బిల్లులు తలబొప్పి కట్టిస్తున్నాయి. బకాయిలు ఉన్న గ్రామ పంచాయతీలకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్న ఘటనలు 10 రోజులుగా జిల్లాలో పెరుగుతున్నాయి. బకాయిలు చెల్లించాలంటూ గ్రామ పంచాయతీలకు, జిల్లా పంచాయతీ అధికారికి నోటీసులు పంపించామని, సరైన స్పందన రాకపోవడంతో గత్యంతరం లేక విద్యుత్ నిలిపివేస్తున్నామని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. గతంలో 13వ ఆర్థిక సంవత్సరం నిధులు పంచాయతీల విద్యుత్ బిల్లులకు కొంత సొమ్ము జమ చేశారు. అయినా.. బకాయిలు తీరలేదు. మేజర్ పంచాయతీల మాటెలా ఉన్నా మైనర్ పంచాయతీల పరిస్థితి అధ్వానంగా ఉంది. మైనర్ పంచాయతీలకు ఆదాయ వనరులు లేకపోవడంతో విద్యుత్ బకాయిలు చెల్లించలేకపోతున్నాయి. దీంతో ట్రాన్స్‌కోకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. పాత బకాయిలు కట్టకపోతే గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థకు సైతం విద్యుత్ నిలిపివేయక తప్పదని విద్యుత్ శాఖ అధికారులు తెగేసి చెబుతున్నారు. బకాయిలు చెల్లించే వరకు విద్యుత్‌ను పునరుద్ధరించేది లేదని భీష్మిస్తున్నారు. పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని చాలాకాలంగా సర్పంచ్‌లు డిమాండ్ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. బకాయిలు రూ.170 కోట్లు జిల్లాలో చాలా పంచాయతీలకు ఇప్పటికే ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వీటిలో కొన్ని చోట్ల ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో అనధికారికంగా కనెక్షన్లు ఇచ్చినప్పటికీ చాలా పంచాయతీలు నేటికీ చీకట్లో మగ్గుతున్నాయి. జిల్లాలో 906 పంచాయతీలు ఉండగా, రూ.170 కోట్ల మేర విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. మేజర్ పంచాయతీల విషయానికి వస్తే వీధిలైట్లు, పంచాయతీ కార్యాలయాలకు సంబంధించి రూ.22.94 కోట్లు బకాయిలు ఉండగా, మంచినీటి సరఫరాకు సంబంధించి రూ.57.54 కోట్లు చెల్లించాల్సి ఉంది. మైనర్ పంచాయతీలు వీధిలైట్లు, కార్యాలయాల విద్యుత్‌కు సంబంధించి రూ.22.23 కోట్లు బకాయి పడగా, మంచినీటి సరఫరాకు సంబంధించి రూ.67.22 కోట్లను బకాయిపడ్డాయి. మూడు నెలలుగా బకాయిలు పేరుకుపోతున్నాయని విద్యుత్ శాఖ చెబుతోంది. 14వ ఆర్థిక సంఘం నిధులతో పాత బకాయిలు చెల్లించి , ఆ తరువాత మూడు నెలల నుంచి ఏ నెలకు ఆ నెల బిల్లులు చెల్లించాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ పంచాయతీల వద్ద నిధుల లేకపోవడంతో ప్రతినెలా బిల్లులు పెండింగ్ పడుతున్నాయి. ప్రభుత్వమే చెల్లించాలి గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. వాటికి వచ్చే ఆదాయం సిబ్బంది జీతాలకే సరిపోవడం లేదు. దీనికి తోడు తాగునీటి సరఫరా, పారిశుధ్యానికి నిధులు చాలడం లేదు. ఈ పరిస్థితుల్లో పాత బకాయిలు కట్టలేకపోతున్నాం. ప్రభుత్వం తక్షణం స్పందించి విద్యుత్ బకాయిలను రద్దు చేయాలి. లేదంటే ప్రభుత్వమే ఆ మొత్తాలను చెల్లించాలి. మారిశెట్టి జగదీశ్వరరావు, సర్పంచ్, చింతలపూడి సరఫరా నిలిపివేస్తున్నాం విద్యుత్ బిల్లులు చెల్లించని పంచాయతీల్లో సరఫరా నిలిపివేస్తున్నాం. 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. పాత బకాయిలు వీటినుంచి కట్టించుకున్నా, ఆ తరువాత వరుసగా మూడు నెలల నుంచి పంచాయతీలు బిల్లులు చెల్లించడం లేదు. ఏ నెల బిల్లు ఆ నెల కట్టాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా పంచాయతీలు చెల్లించడం లేదు. దీంతో బకాయిపడిన పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నాం. ఈ విషయంలో మేం చేయగలిగిందేమీ లేదు సీహెచ్ సత్యనారాయణరెడ్డి, ఎస్ఈ, ఏపీ ఈపీడీసీఎల్ -
'మరుగు'న పడిన బిల్లులు
- అర్ధంతరంగా ఆగిన నిర్మాణాలు – చేతిలో చిల్లిగవ్వలేక లబ్ధిదారులు ఆందోళన – నీరుగారుతున్న స్వచ్ఛభారత్ లక్ష్యం అనంతపురం రూరల్ : ప్రజా ప్రతినిధులంతా స్వచ్ఛభారత్ గురించి ఉపన్యాసాలు దంచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుని బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలు తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామంటూ గొప్పలు చెబుతున్నారు. మరోవైపు అధికారులు కూడా ఊరువాడా ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. స్వచ్ఛభారత్‌లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో వ్యక్తిగత మరుగుదొడ్ల లబ్ధిదారులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంపికతో సరి అనంతపురం రూరల్ మండల పరిధిలోని 5 పంచాయతీలను అధికారులు స్వచ్ఛభారత్ పథకం పైలెట్ ప్రాజెక్టు కింద పిక చేసి మరుగుదొడ్లను మంజూరు చేశారు. ఒక్కొక్క మరుగుదొడ్డికి ప్రభుత్వం రూ.15 వేలు మంజూరు చేస్తోంది. దీంతో ప్రజలు కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చారు. అప్పులు చేసి నిర్మాణాలు చేసుకుంటున్నారు. అయితే మరుగుదొడ్లను పూర్తి స్థాయిలో నిర్మించుకున్నా. నేటికీ బిల్లులు మంజూరు కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 5 నెలలుగా బిల్లులు మంజూరు చేయాలని అధికారుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నా అధికార యంత్రాంగం పట్టించు కోవడం లేదు. ఆరు బస్తాల సిమెంట్, రెండు పైకప్పు రేకులు, ఒక పైపు మినహా ఒక్క పైసా మంజూరు చేయలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి బిల్లులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. రూ.5200 మాత్రమే మంజూరు చేశారు రూ.25 వేలు అప్పు చేసి మరుగుదొడ్డి నిర్మించుకున్నాను. బిల్లు కోసం రోజుల తరబడి తిరగడంతో కేవలం రూ. 5,200 మంజూరు చేశారు. అంతే 5 నెలలుగా మిగతా బిల్లుల కోసం వేచి చూస్తున్నాను. – నాగరాజు, నేతాజీనగర్ నిర్మాణ పనులు ఆపేశాం మరుగుదొడ్డి నిర్మాణం కోసం 6 బస్తాల సిమెంట్, రెండు పైకప్పు రేకులు మినహా ఒక పైసా మంజూరు చేయలేదు. ప్రస్తుతం మరుగుదొడ్డి నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. చేతిలో చిల్లి గవ్వలేక నిర్మాణపనులు ఆపేశాం. – వన్నూర్‌స్వామి, రాజీవ్‌కాలనీ పంచాయతీ జాప్యం వాస్తవమే బిల్లుల పంపిణీలో జాప్యం జరిగిన మాట వాస్తవమే.. గతంలో చోటు చేసుకున్న పరిణామాల వల్లే బిల్లుల చెల్లింపు ఆలస్యమవుతోంది. క్షేత్ర స్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు మంజూరు చేసే విధంగా చర్యలు చేపడతాం. -లక్ష్మీనరసింహ, ఈఓఆర్డీ మరుగుదొడ్డు నిర్మాణ పనులు వివిధ దశల్లో గ్రామం పేరు మంజూరైనవి పూర్తి అయినవి బేస్మెంట్ వివిధ దశల్లో రాచానపల్లి 308 92 144 72 కామారుపల్లి 256 14 70 172 మన్నీల 307 10 160 137 రాజీవ్‌కాలనీ 372 17 106 249 చిన్నంపల్లి 119 13 24 82 -
అంచనాలకు మించి..
విజయనగరం గంటస్తంభం: అధికారుల అత్యుత్సాహం వారికి ఇప్పుడు అవస్థలు తెచ్చి పెట్టింది. పరువు కోసం పాకులాడితే ప్రస్తుతం ఆందోళనలో పడిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇటీవల నిర్వహించిన విజయనగరం ఉత్సవాల్లో అంచనాలకు మించి అధికారులు ఖర్చు చేసి ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితుల్లో ఇరుక్కున్నారు. నిజానికి ప్రభుత్వం విజయనగరం ఉత్సవాల కోసం రూ.25లక్షలు మంజూరు చేసింది. కానీ అధికారులు రూ. 62 లక్షలు ఖర్చు చేశారు. పెండింగ్‌లో బిల్లులు.. అంచనాలకు మించి ఖర్చు చేయడం ఒక ఎత్తయితే ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు కూడా అధికారుల ఖాతాల్లో జమ కాకపోవడం మరో ఎత్తు. దీంతో మంజూరైన నిధులను దక్కించుకోవడానికి, అధికంగా ఖర్చు పెట్టిన నిధులు తెచ్చుకోవడానికి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అక్టోబర్ 15 నుంచి 17వరకు ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, పూల ప్రదర్శనలు, సైన్స ఫెయిర్, ఇతర కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు.. ఉత్సవాలకు ముందు రూ.40లక్షలు ఖర్చు అవుతుందని ఇన్చార్జ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులకు అధికారులకు అంచనా తెలిపారు. కానీ అనుకున్నదానికంటే రూ. 22 లక్షల ఖర్చు పెరగడంతో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించడంలో తప్పు లేదు కానీ, రాష్ట్రం లోటు బడ్జెట్‌తో ఇబ్బంది పడుతుంటే ఇంత ఖర్చు అవసరమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మూడు రోజుల్లో రూ. 62 లక్షలు ఖర్చు చేయడం సాధ్యమా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఆర్భాటాలకు ఇంత ఖర్చుపెట్టడం సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నారు. మంజూరైన నిధులూ రాలేదు.. మంత్రి రఘునాథరెడ్డి జిల్లాకు వచ్చినపుడు కలెక్టర్ రూ.40లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. రూ.10లక్షలు పర్యాటక శాఖ ఇస్తుందని చెప్పగా మిగిలిన రూ.30లక్షలను సాంస్కృతిక శాఖ నుంచి తాను మంజూరు చేస్తానన్నారు. కానీ ఇంతవరకు ఆ శాఖ నుంచి ఒక్కపైసా కూడా రాలేదు. పర్యాటక శాఖ నుంచి మాత్రం రూ.25 లక్షలు మంజూరైనా ఇప్పటివరకు జిల్లా అధికారుల ఖాతాల్లో జమ కాలేదు. ఆర్థిక శాఖ ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) రాక పోవడమే దీనికి కారణం. మిగతా నిధులెలా..? మంజూరైన 25 లక్షల నిధులను పక్కన పెడితే అధికంగా ఖర్చు చేసిన రూ.37లక్షల నిధులను సమకూర్చుకోవడం ఎలా అనే ప్రశ్న అధికారులను వేధిస్తోంది. నిధుల కోసం జిల్లా అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ ఇవ్వాల్సిన నిధులే రాకపోతే ఇంకా అదనపు నిధులు ఎలా ఇస్తారన్న ప్రశ్న వారిని ఆందోళనలో పడేసింది. ఉత్సవ కమిటీ ఖాతాలో ఉన్న రూ.21 లక్షలు తీసి ఖర్చు పెట్టేందుకు వీల్లేదు. అడ్వాన్స తీసి మళ్లీ జమ చేసేయాలి. దీనిలో నుంచే అధికారులు రూ.19లక్షలు తీసి పలు బిల్లులు చెల్లించారు. మిగతా బిల్లుల కోసం పలువురు వ్యక్తులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. వారికేం చెప్పాలో తెలియక అధికారులు మధనపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే మరి. -
శివారుకు సవాల్!
రూ.800 కోట్ల నిధులు దారిమళ్లింపు జలమండలి ఖజానా ఖాళీ శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రిజర్వాయర్లు, పైపులైన్ల పనులకు బ్రేక్ రూ.60 కోట్ల మేర పెండింగ్ బిల్లులు సిటీబ్యూరో: గ్రేటర్ శివార్ల దాహార్తిని తీర్చేందుకు హడ్కో సంస్థ మంజూరు చేసిన రూ.800 కోట్ల తొలివిడత నిధులను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా దారి మళ్లించడంతో జలమండలి ఖజానా ఖాళీ అరుుంది. దీంతో గ్రేటర్ శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో చేపట్టిన స్టోరేజి రిజర్వాయర్లు, పైప్‌లైన్ పనులకు రూ.60 కోట్ల మేర పెండింగ్ బిల్లులు పేరుకుపోయారుు. ఖజనాలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఇటు బోర్డు అధికారులు సచివాలయం చుట్టూ....అటు పనులు చేపట్టిన సంస్థలు జలమండలి చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తుండడం గమనార్హం. కొత్తగా మహానగరంలో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో 56 భారీ స్టోరేజి రిజర్వాయర్లు, 2700 కి.మీ మేర పైప్‌లైన్ పనులకు నిధుల లేమి శాపంగా మారింది. ఇటీవలే ఈ పనులకు జీహెచ్ఎంసీ రహదారి కోత అనుమతులు మంజూరు చేసినప్పటికీ.. అవసరమైన పైపులైన్లను కొనుగోలు చేసేందుకు సంబంధిత ఏజెన్సీలకు బిల్లులు చెల్లించని దుస్థితి తలెత్తింది. ఈనేపథ్యంలో పనులు చేపట్టిన సంస్థలు ఎలా ముందుకెళ్లాలా అన్న సంశయంలో పడ్డారుు. పలుచోట్ల పనులు నత్తనడకన సాగుతున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితితో శివార్ల దాహార్తి తీర్చే పనులు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం పొంచి ఉంది. దాహార్తి తీరే దారేదీ.... మహానగర పాలకసంస్థలో 2007లో 11 శివారు మున్సిపల్ సర్కిళ్లు విలీనమయ్యారుు. వీటి పరిధిలో సుమారు వెరుు్య కాలనీలు, బస్తీలు దశాబ్దాలుగా మంచినీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో లేక తీవ్ర దాహార్తితో అలమటిస్తున్నారుు. ఆయా ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు ఈ ఏడాది ప్రారంభంలో హడ్కో సంస్థ జలమండలి సంస్థాగత భూములను తాకట్టుపెట్టుకొని రూ.1900 కోట్ల రుణం జారీ చేసేందుకు అంగీకరించింది. అరుుతే హడ్కో సంస్థ మంజూరు చేసిన తొలివిడత రుణం రూ.800 కోట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏకపక్షంగా ఇతర పథకాలకు దారిమళ్లించడంతో దాహార్తి తీర్చే పనులకు నిధుల లేమి తలెత్తింది. ప్రస్తుతం నీటి బిల్లులు, ట్యాంకర్ నీళ్ల సరఫరా, నూతన నల్లా కనెక్షన్ల జారీతో జలమండలి నెలవారీగా రూ.90 కోట్ల రెవెన్యూ ఆదాయం లభిస్తుండగా..విద్యుత్ బిల్లులు, ఉద్యోగుల జీతభత్యాలు, నిర్వహణ వ్యయాలు కలిపితే నెలకు రూ.102 కోట్ల వ్యయం అవుతోంది. ఇప్పటికే నెలకు రూ.12 కోట్ల లోటుతో నెట్టుకొస్తున్న బోర్డుకు ఇప్పుడు శివారు మంచినీటి పథకాలకు బిల్లులు చెల్లించడం తలకు మించిన భారంగా మారింది. ఇప్పటివరకు చేపట్టిన 56 రిజర్వాయర్ల నిర్మాణం పనులు 50 శాతం మేర పూర్తయ్యారుు. పూర్తిచేసిన పనులకు సంబంధించి గత రెండు నెలలుగా రూ.60 కోట్ల మేర పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పనులు చేపట్టిన సంస్థలు బోర్డు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇచ్చిన చెక్కూ వృథానే..! కాగా జలమండలికి హడ్కో సంస్థ మంజూరు చేసిన నిధులను పెద్దమొత్తంలో దారిమళ్లించిన సర్కారు....బోర్డు అవసరాలకు రెండు నెలల క్రితం జారీ చేసిన రూ.50 కోట్ల చెక్కు కూడా పాస్ కాకపోవడం గమనార్హం. ఇప్పటికే రూకల్లోతు కష్టాల్లో కూరుకుపోరుున జలమండలికి నిధులలేమి కారణంగా శివార్లలో చేపట్టిన పనులను ఎలా పూర్తిచేయాలన్న అంశంపై బోర్డు అధికారులకు మింగుడు పడడంలేదు -
విద్యుత్ బకాయిలపై దృష్టి సారించండి
ట్రాన్స్‌కో డీఈ నాగరాజు పులివెందుల రూరల్ : ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువగా బిల్లుల బకాయిలు ఉన్నాయని.. వాటిపై దృష్టి సారించి వసూళ్లు చేయాలని విద్యుత్ శాఖ డీఈ నాగరాజు సూచించారు. బుధవారం పట్టణంలోని విద్యుత్ శాఖ డీఈ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని ఏడీఏ, ఏఈ, బిల్లింగ్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు, తాగునీటి పథకాలకు సంబంధించి దాదాపు రూ1.50కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. వీటిపై సంబంధిత అధికారులతోచర్చించి వసూళ్లు చేయాలన్నారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ తీగలు మరమ్మత్తుకు గురైన చోట వెంటనే కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. కొత్త మీటరు ఏర్పాటుకు మీసేవ కేంద్రాలలోనే వినియోగదారులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పులివెందుల అర్బన్, వేంపల్లె ఏడీఏలు రఘు, శ్రీకాంత్, పులివెందుల అర్బన్, రూరల్ ఏఈలు రవీంద్రప్రసాద్, జయసుధాకర్‌రెడ్డి, డివిజన్ పరిధిలోని ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీకి నిధులివ్వకుండా రోగులకు ముప్పుతిప్పలు
-
ఆరోగ్యం హరీ
⇒ పథకం అమలుకు నిధులివ్వకుండా రోగుల ప్రాణాలతో చెలగాటం ⇒ రూ. 910.77 కోట్లు అడిగితే.. బడ్జెట్ కేటాయింపులు రూ.500 కోట్లే ⇒ పాత బకాయిలే రూ. 250 కోట్లు.. మిగిలిన రూ. 250 కోట్లతో ⇒ చికిత్సలు ఎలాగో చెప్పాల్సింది ప్రభుత్వ పెద్దలే ⇒ మొత్తం రూ. 500 కోట్లకుపైగా బకాయిలు చెల్లిస్తేనే సేవలందిస్తాం ⇒ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన నెట్వర్క్ ఆసుపత్రులు ⇒ సర్కారు దగ్గర నిధుల్లేవు.. ఇష్టమైతే చేయండి, లేదంటే మానేయండి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టీకరణ ⇒ ముఖ్యమంత్రి వద్దే తేల్చుకోవాలని ‘ఆశా’ ప్రతినిధుల నిర్ణయం ⇒ సానుకూల స్పందన రాకుంటే పథకం నుంచి వైదొలగాలని యోచన ⇒ వైద్యసేవ వ్యయంపై సర్కారు పరిమితి.. రోగులకు ముప్పుతిప్పలు సాక్షి, అమరావతి రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పాతరేస్తోంది. పేద రోగుల పాలిట సంజీవని లాంటి పథకాన్ని క్రమంగా కనుమరుగు చేసేందుకు పన్నాగాలు పన్నుతోంది. శంకుస్థాపనలు, శిలాఫలకాలు, ప్రత్యేక విమానాల్లో విదేశీ యాత్రలకు ప్రజల సొమ్మును మంచినీళ్లలా ఖర్చు పెడుతున్న ప్రభుత్వ పెద్దలకు బక్క ప్రాణాల ఆరోగ్యమంటే లెక్కలేకుండా పోతోంది. ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్యసేవ) పథకం అమలుకు సరిపడా నిధులివ్వకుండా పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పథకం అమలుకు రూ.910.77 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదిస్తే ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది అక్షరాలా రూ.500 కోట్లే. బకాయిలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు రోగులకు వైద్య సేవలందించేందుకు నిరాకరిస్తున్నాయి. ‘మా దగ్గర నిధులు లేవు. మీకు ఇష్టమైతేనే ఆరోగ్యశ్రీ కింద రోగులకు వైద్యం చేయండి. లేదంటే మానెయ్యండి’ అని సాక్షాత్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రే తేల్చిచెప్పడం గమనార్హం. ఈ పథకం కింద నిధుల వ్యయంపై ప్రభుత్వం పరిమితి విధించింది. రోగులకు చికిత్సకు అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. సకాలంలో వైద్యం అందక రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆరోగ్యశ్రీ కేసులు స్వీకరించం... ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోయాయి. బకాయిలు చెల్లిస్తేగానీ రోగులకు వైద్య సేవలు అందించలేమని నెట్వర్క్ ఆసుపత్రులు తేల్చిచెప్పాయి. ఈ మేరకు రెండు రోజుల క్రితమే ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. బకాయిల చెల్లింపులపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో జరిపిన చర్చలు విఫలమయ్యాయని ఆశా(ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్) ప్రతినిధులు పేర్కొన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తామని, అక్కడో తాడేపేడో తేల్చుకుంటామని వారు మంత్రి కామినేనితో అన్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 200 వరకూ ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌మెంట్‌లో ఉన్నాయి. మరో 150 వరకూ ప్రభుత్వ హాస్పిటళ్లు ఉన్నాయి. ఈ మొత్తం ఆసుపత్రులకు కలిపి రూ.500 కోట్లకుపైగానే బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. సర్కారు ఆసుపత్రుల్లో వైద్యులు ఇప్పటికే ఆరోగ్యశ్రీ కేసులను స్వీకరించడం లేదు. వారంలోగా బకాయిలను పూర్తిగా చెల్లిస్తేనే ఈ పథకం కింద రోగులకు వైద్యం అందిస్తామని, లేదంటే నిలిపివేస్తామని నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. చిన్న చిన్న నర్సింగ్‌హోంలు వ్యాపారం లేక కొద్దో గొప్పో కేసులను స్వీకరిస్తున్నాయి. పెద్ద పెద్ద రోగాలకు చికిత్స చేయాల్సిన ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కేసులపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి రూ.910.77 కోట్లు కావాలంటూ అధికారులు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదన ప్యాకేజీల పెంపునకు మంత్రి విముఖత ‘‘మా దగ్గర నిధులు లేవు. మీకు ఇష్టమైతేనే ఆరోగ్యశ్రీ కింద రోగులకు వైద్యం చేయండి. లేదంటే మానెయ్యండి’’ అని మంత్రి కామినేని శ్రీనివాస్ తేల్చిచెప్పినట్లు ‘ఆశా’ ప్రతినిధులు వెల్లడించారు. కరెంటు బిల్లుల నుంచి సిబ్బంది వేతనాల వరకూ ఆసుపత్రుల నిర్వహణ వ్యయం విపరీతంగా పెరిగిందని, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద వివిధ చికిత్సలకు ప్రభుత్వం ఇస్తున్న సొమ్ము చాలా తక్కువ ఉందని, 2012లో 12 శాతం పెంచారని, ఆ తర్వాత పెంచలేదని, ఆరోగ్యశ్రీ ప్యాకేజీలు పెంచాలని ప్రతినిధులు కోరగా మంత్రి విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. వారం రోజుల్లో ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితిని వివరించాలని, సానుకూల స్పందన రాకపోతే ఎన్టీఆర్ వైద్యసేవల పథకం నుంచి వైదొలగాలని కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. రూ.250 కోట్లు సరిపోతాయా? టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చడంతోపాటు ప్రీమియంను రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచారు. ప్యాకేజీల్లో 938 జబ్బులు ఉండగా, కొత్తగా మరో 100 చేర్చారు. దీంతో ఆరోగ్యశ్రీ కింద వైద్యం పొందాల్సిన జబ్బుల సంఖ్య 1,038కి చేరింది. దీంతో ఈ పథకానికి ఏటా అదనంగా రూ.200 కోట్లు అవసరం. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలుకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.910.77 కోట్లు కావాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలు రూ.250 కోట్లు ఉన్నాయి. కానీ, ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.500 కోట్లే కేటాయించింది. పాత బకాయిలు పోను మిగిలింది రూ.250 కోట్లే. ఈ నిధులు ఏ మూలకూ సరిపోని పరిస్థితి. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికే ప్రభుత్వం బడ్జెట్లో సరిపడా నిధులు కేటాయించలేదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. చికిత్స అందక రోగుల దైన్యం ఆరోగ్యశ్రీ కింద రోగుల నమోదు ప్రక్రియలో వేగం మందగించింది. అధికారులు రకరకాల కొర్రీలతో వేధిస్తున్నారు. 2010 వరకూ ఆరోగ్యశ్రీ పరిధిలో రోజూ 2 వేలకుపైగా శస్త్రచికిత్సలు జరిగేవి. ప్రభుత్వం నిత్యం గరిష్టంగా రూ.3 కోట్లు వ్యయం చేసేది. ప్రస్తుతం రోగుల నమోదు గణనీయంగా పడిపోయింది. రోజుకు 250 మందికి కూడా చికిత్సల కోసం అనుమతులు రావడం లేదు. ఎన్టీఆర్ వైద్యసేవ వెబ్సైట్ ప్రకారం... 2016 అక్టోబర్ 31న చికిత్సలు చేయించుకున్న వారి సంఖ్య 254 మాత్రమే. అంటే ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో కలిపి 300 వరకూ నెట్వర్క్ ఆసుపత్రులుండగా.. ఆస్పత్రికొకరు చొప్పున కూడా నమోదు కాలేదంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. ప్రభుత్వం ఈ పథకం కింద నిధుల వినియోగానికి కోత వేస్తోంది. రోజుకు రూ.70 లక్షలు కూడా ఖర్చు చేయడం లేదు. నిధుల వినియోగంపై ప్రభుత్వం పరిమితి విధించింది. దీంతో రోగులకు వైద్య చికిత్సలకు గాను అనుమతులివ్వడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో నెలకొన్న పరిణామాలను ట్రస్ట్ సీఈఓ పలుమార్లు ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. క్షతగాత్రులు అర్హులు కాదట! ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద చికిత్స అందక రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. నరాల (న్యూరో), గుండె జబ్బులు, మూత్రపిండాలు, కాలేయం వంటి జబ్బులకు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సలు లేక, నెట్వర్క్ ఆసుపత్రులు స్పందించక రోగులు పడే యాతన అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ప్రమాదాల్లో క్షతగాత్రులుగా మారిన వారి పరిస్థితి మరింత దారుణం. భారతదేశంలో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్‌లోనే. రాష్ట్రంలో రోజూ 1,400కు పైగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాద బాధితులుఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందడానికి అర్హులు కారని ప్రైవేట్ ఆసుపత్రులు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సల కోసం నిత్యం 2 వేల మందికిపైగా వస్తుండగా.. వీరిలో కనీసం 300 మందికి కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు దక్కడం లేదు. -
పెండింగ్ బిల్లుల వసూళ్లపై కథలొద్దు
విద్యుత్‌శాఖ సిబ్బందిపై సీఈ నందకుమార్ ఆగ్రహం నెల్లూరు (టౌన్): జిల్లా వ్యాప్తంగా గృహాలకు సంబంధించి బిల్లులు కట్టని 2408 సర్వీసులను తొలగించి ఉన్నామని, వాటి నుంచి సుమారు రూ. కోటి మేర బిల్లులు వసూలు కావాల్సి ఉందని, రెండు నెలలుగా బిల్లులు వసూళ్లు చేయమని చెబుతున్నా, ఎందుకు చేయడం లేదని విద్యుత్ శాఖ ఏడీఈ, ఏఈలపై ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ నందకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక విద్యుత్ భవనంలోని స్కాడా సమావేశ మందిరంలో డీఈలు, ఏడీఈలు, ఏఈలతో గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూరల్ డివిజన్లో 1827 సర్వీసులు ఉన్నాయన్నారు. నగరంలో ఇంతమంది కరెంట్ లేకుండానే నివశిస్తున్నారా.. వారికి సంబంధించిన మిగిలిన కనెక్షన్లు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. మరమ్మతుల పేరుతో గంటల తరబడి సరఫరాను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడీఈలు 33కేవీ, ఏఈలు 11కేవీ ఫీడర్లను ప్రతి నెలా తనిఖీ చేయాలని చెప్పినా ఎక్కడా అమలు కావడం లేదని మండిపడ్డారు. జిల్లాలో విద్యుత్ చోరీలపై వారంలో ఒకరోజు తనిఖీలు నిర్వహించి శనివారం నాడు నివేదిక అందించాలని ఆదేశించారు. వీధిలైట్లు, వాటర్ సర్వీసులకు మీటర్లు బిగించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. హెచ్డీ, సీసీ మీటర్లకు ఏడీఈలు మాత్రమే రీడింగ్ తీయాలని ఆదేశించారు. ఆక్వా కల్చర్ సర్వీసులకు సంబంధించి మీటర్లను క్రాస్ చెకింగ్ చేయాలన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో ఎస్ఈ కళాధరరావు, టెక్నికల్ డీఈ రమాదేవి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
బకాయిల మంజూరుకు వినతి
అనంతపురం ఎడ్యుకేషన్ : బకాయి బిల్లుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని జాతీయ బాల కార్మికుల ప్రాజెక్ట్ (ఎన్సీఎల్పీ) పీడీ దశరథరామయ్యకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం ఎన్సీఎల్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ దశరథరామయ్య మాట్లాడుతూ జిల్లాలో బాల కార్మికులను గుర్తించేందుకు సర్వే నిర్వహించాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు సూచించారు. అయితే గతంలో బిల్లులు చాలా బకాయిలు ఉన్నాయని వారు వాపోయారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరుకు చర్యలు తీసుకుంటామని పీడీ హామీ ఇచ్చారు. -
ట్రెజరీలో పడిగాపులు!
కోట్లాది రూపాయల బిల్లుల పెండింగ్ అర్ధరాత్రితో ముగిసిన ఆర్థిక సంవత్సరం ఇబ్బందుల్లో ఉద్యోగులు, కాంట్రాక్టర్లు 14వ ఆర్థిక సంఘం నిధులకు అడ్డంకి శ్రీకాకుళం టౌన్: అర్ధరాత్రి.. ఆర్థిక సంవత్సరం ముగిసింది. ప్రభుత్వశాఖల్లో నిధుల విడుదల కోసం ఇటు ట్రెజరీ, అటు పేఅండ్‌అకౌంట్సు శాఖల వద్ద ప్రజలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఓవైఫు ఫీజింగ్, మరో వైపు ఫైనాన్స్ విభాగం అనుమతుల రాకలో ఇబ్బందుల వల్ల ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు పడిగాపులు తప్పలేదు. జిల్లా వ్యాప్తంగా 14 సబ్ ట్రెజరీల పరిధితో పాటు జిల్లా ట్రెజరీ, పేఅండ్ అకౌంట్సు కార్యాలయం వద్ద గురువారం రాత్రి వరకు ఉద్యోగులు, కాంట్రాక్టర్లు పడిగాపులు కాశారు. ట్రెజరీలో ఒక్కో అకౌంట్‌కు వందల సంఖ్యలో బిల్లులు వచ్చిపడ్డాయి. జ్యూడిషియల్, పోలీసు శాఖల్లో మార్చి 29వ తేదీ వరకు బిల్లులు స్వీకరించి వాటిపై ఫీజింగ్ లేని కారణంతో నిధులు విడుదల చేశారు. రెవెన్యూ శాఖతో పాటు సంక్షేమశాఖలు, పంచాయతీరాజ్, పరిపాలనా విభాగాల్లో బడ్జెట్ విడుదల ఆలస్యం కావడంతో ఒక్కసారి బిల్లులు చెల్లింపునకు అధికారులు నేరుగా ట్రెజరీ వద్దకు వెళ్లి హైదరాబాద్‌కు మెసేజిల ద్వారా టోకెన్ నంబర్లు పంపించుకుని నిధులు మంజూరు చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సాయంత్రం ఆరు గంటల సమయానికి జిల్లా ట్రెజరీలో 1624 బిల్లులకు రూ.36,26,72,136 నిధులు విడుదలయ్యాయి. ఎనిమిది గంటల సమయానికి మరో రూ. 1,12,89,876 బిల్లులకు అనుమతి లభించింది. కొన్ని బిల్లులు అడ్జస్టుమెంటు బిల్లులుగా మార్పు చేసి.. తర్వాత నిధులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పించారు. రెవెన్యూశాఖ పరిధిలో రూ.3 కోట్లుకు పైగా బిల్లులు మంజూరై బ్యాంకులకు పంపించారు. అర్ధరాత్రి వరకు సమయం కేటాయించడంతో పడిగాపులు తప్పలేదు. పెండింగ్‌లో భారీగానే..పంచాయితీరాజ్ శాఖ పరిధిలో చంద్రన్న బాట నిధులకు సంబంధించి రూ.కోట్ల విలువైన బిల్లులకు చెక్కులు జారీ అయ్యా యి. ఆ చెక్కుల విడుదల సాయంత్రానికి జరగక పోవడంతో ఇంజినీరింగ్ అధికారులు తలలు పట్టుకున్నారు. టూరిజం శాఖ పరిధిలో గిరిజనోత్సవాలకు సంబంధించి రూ.25 లక్షల నిదులు విడుదలయ్యాయి. ఈ బిల్లుకు సాంకే తిక కారణం వల్ల ఆ బిల్లు టోకెన్ ఆలస్యం కావడంతో నిధుల విడుదలకు అడ్డంకిగా మారింది. పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధుల బడ్జెట్ విడుదలైంది. మార్చి 22వ తేదీలోగా బిల్లులు చెల్లించిన వాటిని మాత్రమే ఆర్థిక శాఖ అనుమతించడంతో రూ.30 కోట్లువిడుదలకు అడ్డంకి ఏర్పడింది. జిల్లాపంచాయతీ అధికారి కోటేశ్వరరావు నేరుగా డిప్యూటీ డెరైక్టర్‌ను కలసి విన్నవించుకోవడంతో సర్థుబాటు బిల్లుగా ఆమె అంగీకరించారు. సంక్షేమశాఖల్లో స్కాలర్షిప్పులు, ఇతర డైట్ బిల్లుల పరిష్కారానికి టోకెన్లు ఇచ్చారు. ఈబిల్లులు ఉన్న వాటికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం మిగిలిన వాటిని సాయంత్రానికి విడుదల చేయలేదు. ట్రెజరీల పరిధిలో రూ.వంద కోట్లుకు పైగా బిల్లులు విడుదల కావాల్సిఉంది. పేఅండ్ అకౌంట్సు విభాగంలో కూడా ఇదే పరిస్థితి. -
వెంటనే టెండర్లు పిలవండి: హరీష్
హైదరాబాద్: 'మిషన్ కాకతీయ' పనుల నిమిత్తం ఖర్చు చేయాల్సిన బిల్లులను ఆలస్యం చేయకుండా సకాలంలో అందించాలని రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు అధికారులకు సూచించారు. మిషన్ కాకతీయ అంశంపై అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం సక్రమంగా జరగాలన్నారు. మిషన్ కాకతీయ మొదటి విడతలో పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలని చెప్పారు. రెండో విడతలో అనుమతి లభించిన పనులకు వెంటనే టెండర్లు పిలవాలని మంత్రి హరీష్ అధికారులను ఆదేశించారు. -
‘ఇందిరమ్మ’ బిల్లులొస్తున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: మూడు లక్షల పేద కుటుంబాలకు శుభవార్త. ప్రభుత్వం నుంచి బిల్లులు అందక అర్ధంతరంగా నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్లకు మోక్షం లభించనుంది. పెండింగ్ బిల్లులు సహా భవిష్యత్తు బిల్లులు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపారు. దీంతో ఏడాదిన్నరగా మొండిగోడలతో దర్శనమిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న 39,429 ఇళ్లకు సంబంధించి బిల్లులు చెల్లించేందుకు రెండు నెలల క్రితమే అంగీకరించిన ప్రభుత్వం... మిగతా ఇళ్ల విషయాన్ని పెండింగ్‌లో ఉంచింది. ఇప్పుడు వాటికి కూడా బిల్లులు చెల్లించాలని నిర్ణయించటంతో అధికారులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఇళ్ల వివరాలను కలెక్టర్లు పరిశీలించి వాటిల్లో అక్రమాలు జరిగినట్టు తేలితే అలాంటి లబ్ధిదారుల పేర్లు తొలగించాలని ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. దీంతో మండలాలవారీగా అధికారుల బృందాలు తనిఖీ ప్రారంభించాయి. ఈ నెలాఖరుకల్లా ఆ కసరత్తు పూర్తి చేసి ప్రభుత్వానికి జాబితా సమర్పించనున్నారు. ఫిబ్రవరి నుంచి బిల్లులు విడుదల చేసే అవకాశం ఉంది. -
ఈజీఎస్ పెండింగ్ బిల్లులపై విచారణ
ఉప్పునుంతల: మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునుంతల మండలంలో పెండింగ్‌లో ఉన్న జాతీయ ఉపాధిహామీ పథకం కూలీల వేతనం బిల్లులపై డ్వామా ఫైనాన్స్ మేనేజర్ ఫయాజ్ పాషా, డీబీటీ మేనేజర్ లక్ష్మీనారాయణ, క్లస్టర్ ఏపీడీ పాపయ్యలు బుధవారం స్థానిక కార్యాలయంలో విచారణ చేశారు. కూలీలకు సంబంధించిన మస్టర్లు, ఎఫ్టీఓలు, ఇతర రికార్డులను పరిశీలించారు. ఇటీవల జరిగిన ఏడో విడత సామాజిక తనిఖీలో మండలంలో కూలీలకు సంబంధించి రూ. 14 లక్షల వేతనం బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించామని క్లస్టర్ ఏపీడీ పాపయ్య తెలిపారు. ఈజీఎస్ ఏపీఓ సాయిశంకర్ అక్రమంగా డ్రా చేసిన రూ. 26 లక్షలు తిరిగి రికవరీ చేశామన్నారు. వాటిలో కూలీలకు అందాల్సిన బిల్లులపై విచారణ చేసి అందించడానికి కృషిచేస్తున్నామని తెలిపారు. సీఆర్డీ నుంచి అందిన ఆదేశాలమేరకు మొదట పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఏస్థాయిలో నిలిచిపోయావనే అంశాలపై రికార్డుల పరంగా విచారణ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి నేరుగా కూలీలతో మాట్లాడి వారి నుంచి డిక్లరేషన్ తీసుకొని డబ్బులను పంపిణీ చేయనున్నామని ఏపీడీ తెలిపారు. -
సీఎం టూర్ల పెండింగ్ బిల్లులు 19 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గత ఏడాదికాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన పర్యటనలకైన పెండింగ్ బిల్లులు ఏకంగా రూ.19 కోట్లు పేరుకుపోయాయి. వీటినెలా చెల్లించాలో తెలియక కలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. హోటళ్లు, ఇతర ఏర్పాట్లకోసం అయిన పెండింగ్ బిల్లులను చెల్లిస్తేగానీ తదుపరి ఏర్పాటు చేయలేమని కలెక్టర్లకు సంబంధితులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పెండింగ్ బిల్లుల వ్యవహారాన్ని కలెక్టర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై చిత్తూరు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాలకు పెండింగ్ బిల్లుల చెల్లింపుకోసం రూ.మూడేసి కోట్ల చొప్పున రూ.9 కోట్లు, మిగతా పది జిల్లాలకు జిల్లాకో రూ.కోటి చొప్పున రూ.పది కోట్లను విడుదల చేయాలంటూ సీఎస్ ఇటీవల ఆర్థికశాఖను ఆదేశించారు. అయితే మొత్తం రూ.19 కోట్లు విడుదల చేయాలంటే బడ్జెట్ కేటాయింపులు లేవు. ఈ నేపథ్యంలో అదనపు నిధులను విడుదల చేయాల్సి ఉంది. కానీ అదనపు నిధులు విడుదలచేసే అధికారం ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీ.వీ.రమేశ్‌కు మాత్రమే ఉంది. ఆయన ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన సోమవారంగానీ విధులకు హాజరుకారు. అప్పటివరకు అదనపు నిధుల విడుదలకు వేచిఉండాల్సిందే. ఈ విషయం తెలియని సీఎస్ ఇంకా నిధులు ఎందుకు విడుదల చేయలేదంటూ ఆర్థికశాఖ కార్యదర్శి రవిచంద్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బడ్జెట్లో కేటాయింపులున్న మేరకే నిధులు విడుదల చేసే అధికారం రవిచంద్రకుంది. ప్రాథమిక మిషన్ భేటీకి రూ.26 లక్షలు.. ఇదిలాఉండగా సీఎం చంద్రబాబునాయుడు ప్రాథమిక మిషన్ సమీక్ష పేరుతో శుక్రవారం విజయవాడలో నిర్వహించిన సమావేశానికి ఏకంగా రూ.26 లక్షలు ఖర్చయింది. ఇందులో పాల్గొనే అధికారుల బసకోసమే ఏకంగా రూ.11 లక్షలు ఖర్చవుతోంది. ఈ సమావేశంలో 13 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతోపాటు మంత్రులు, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారికి ఉదయం టిఫిన్లు, భోజనాలు ఇతర కార్యక్రమాలకు రూ.26 లక్షల్ని వ్యయం చేయడంపై అధికారవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. 13 జిల్లాల కలెక్టర్లను హైదరాబాద్‌కు రప్పించి హోటల్లో సమావేశం ఏర్పాటు చేసినా.. రూ.ఐదు లక్షలకు మించి వ్యయమయ్యేది కాదని వ్యాఖ్యానిస్తున్నాయి. అసలు ప్రాథమిక మిషన్‌కు వృద్ధి లక్ష్యాలను పెట్టడమే తప్పనేది ఆ వర్గాల వాదన . వ్యవసాయరంగానికి ప్రభుత్వ మద్దతుగా నిధులు సమకూర్చాలిగానీ వృద్ధికి లక్ష్యాలను నిర్ధారించడం సమంజసం కాదనే వాదన వినిపిస్తోంది. -
బకాయిలొచ్చాయ్..
- ఆర్‌డబ్ల్యూఎస్‌కు రూ. 1.25కోట్లు విడుదల - ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు - పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు సిద్ధమవుతున్న అధికారులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగానికి ఊరట లభించింది. గత వేసవిలో తాగునీటి సమస్యల పరిష్కారానికి చేపట్టిన పనులకు సంబంధించి నిధులు విడుదలయ్యాయి. వాస్తవానికి గత ఏడాదే ఈ నిధులు మంజూరయ్యాయి. అప్పట్లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ రాష్ట్ర విభజన ప్రక్రియతో జిల్లాకు రావాల్సిన ఈ నిధులు నిలిచిపోయాయి. తాజాగా ఈ నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ప్రభుత్వం జిల్లా ఆర్డబ్ల్యూఎస్ విభాగానికి రూ.1.25 కోట్లను కలెక్టర్ ఖాతాలో జమ చేసింది. 2014-15 సంవత్సరంలో వేసవిలో తాగునీటి సమస్యలనెదుర్కొనేందుకు ఆర్డబ్ల్యూఎస్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ట్యాంకర్ల ద్వారా నీటి, ప్రైవేట్ బోర్లు అద్దెకు తీసుకోవడం, ప్రస్తుతమున్న బోర్లు ఫ్లషింగ్తో పాటు లోతు పెంచడం, బోరుమోటార్ల మరమ్మతులు తదితర పనుల్ని సీఆర్ఎఫ్ (విపత్తు నివారణ నిధి) కింద చేపట్టారు. దాదాపు రూ.1.21కోట్లతో పనులు పూర్తిచేశారు. పనులు పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లించాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కాలేదు. మరోవైపు రాష్ట్ర విభజన ప్రక్రియతో ఈ ఫైలు అటకెక్కింది. ఒకవైపు పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లు నిధులకోసం అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో జిల్లా కలెక్టర్ ఈ నిధుల విడుదల కోసం ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం బకాయిల విడుదలకు పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా మంగళవారం రూ.1.25కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. గత బకాయిలు చెల్లించినప్పటికీ ఆర్డబ్ల్యూస్కు కొంత అదనపు నిధులు వలిసివచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రస్తుత అవసరాలకు వాటిని వినియోగించనున్నట్లు ఆ శాఖ ఇంజినీరు ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
రాత్రి ఏడు తర్వాతా రాజ్యసభ
న్యూఢిల్లీ: పెండింగ్ బిల్లుల ఆమోదంకోసం రాజ్యసభ వచ్చేవారం రాత్రి ఏడు గంటల తర్వాత కూడా కొనసాగనుంది. తొలి విడత బడ్జెట్ సమావేశాలు వచ్చేవారంతో ముగియనున్నాయి. దీంతో పెండింగ్ బిల్లులు, ఇతర బిల్లుల ఆమోదంకోసం వచ్చేసోమవారం నుంచి రాత్రి ఏడు గంటల తర్వాత కూడా రాజ్యసభ కొనసాగాలని గురువారం సమావేశమైన సభా కార్యకలాపాల సలహా సంఘం(బీఏసీ) నిర్ణయించింది. రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేని విషయం తెలిసిందే. అయితే విపక్షాలతో సంప్రదింపుల అనంతరం మొత్తం ఆరు ఆర్డినెన్స్‌లకు సంబంధించి మూడింటిని బిల్లులుగా మార్చగలిగింది. గనులు, ఖనిజాల సవరణ బిల్లు, బొగ్గు గనుల బిల్లులను రాజ్యసభ సెలక్ట్ కమిటీకి నివేదించారు. ఇక పౌరసత్వ చట్ట సవరణ, మోటారు వాహనాల చట్టం, బీమా చట్టాల బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. అయితే కీలకమైన భూసేకరణ సవరణ బిల్లు మాత్రం రాజ్యసభలో ఆమోదం పొందడానికి స్వల్ప అవకాశాలు కనిపిస్తున్నాయి. గనుల బిల్లుపై చర్చకు గంట, బొగ్గు గనుల బిల్లుపై చర్చకు రెండు గంటల సమయాన్ని రాజ్యసభ బీఏసీ కేటాయించింది. -
సొంతిల్లు..కలేనా?
ఒక్క ఇల్లూ మంజూరు చేయని నూతన ప్రభుత్వం బిల్లులన్నీ పెండింగ్‌లోనే జియో ట్యాగింగ్ పేరుతో జాప్యం నూతన గృహాల మంజూరు ఎప్పటికో మచిలీపట్నం : పేదల సొంతింటి కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించటం లేదు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒక్క గృహాన్నీ మంజూరు చేయకపోగా గతంలో నిర్మించిన ఇళ్లకు బిల్లుల మంజూరు కూడా నిలిపివేయటం గమనార్హం. ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడిచినా గృహనిర్మాణంపై దృష్టిసారించకపోవటంతో పేదలు గుడిసెల్లోనే కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో గృహనిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న సాకును బూచిగా చూపి ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది. సగం గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులు బిల్లుల కోసం నెలలతరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేని పరిస్థితి నెలకొంది. గతంలో నిర్మించిన గృహాలు వాస్తవంగా నిర్మించారా, లేదా అసలైన లబ్ధిదారులే ఉన్నారా తదితర వివరాలు సేకరించేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. జిల్లాలో 75 శాతం మేర జియో ట్యాగింగ్ ద్వారా గృహాలను గుర్తించే పని పూర్తయిందని, మరో 25 శాతం ఈ నెలాఖరులోగా పూర్తిచేస్తామని గృహనిర్మాణ శాఖ పీడీ సీహెచ్ ప్రతాపరావు తెలిపారు. రాష్ట్రంలో కృష్ణాజిల్లానే జియో ట్యాగింగ్ ద్వారా గృహాలను గుర్తించే ప్రక్రియలో మొదటి స్థానంలో ఉందన్నారు. పెండింగ్‌లో రూ.12.44 కోట్ల బిల్లులు.. జిల్లాలో 5,765 గృహాలకు రూ.12.44 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. 2014 మే నెల నుంచి బిల్లుల చెల్లింపులు నిలిపివేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత వీటిని చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఈ అంశాన్ని పక్కనపెట్టేశారు. నూతన గృహ నిర్మాణం చేసే సమయంలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అసలు గృహనిర్మాణమే ప్రారంభం కాకపోవటంతో మరుగుదొడ్ల నిర్మాణం కూడా నిలిచిపోయింది. నగదు పెంచుతామన్నారు.. జీవో జారీ చేయలేదు ప్రస్తుతం పేదలకు నిర్మించే ఒక్కొక్క గృహానికి రూ.70 వేలు, ఎస్సీ, ఎస్టీలైతే లక్ష రూపాయలు చొప్పున నగదు అందజేస్తున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత రూ.70 వేలు చొప్పున ఇస్తున్నవారికి లక్ష రూపాయలు, ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయల స్థానంలో లక్షా 50 వేల రూపాయలకు పెంచి ఇస్తామని పాలకులు ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదని గృహనిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వస్తేనే పెంచిన మొత్తాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు అంటున్నారు. జియో ట్యాగింగ్ 75 శాతమే పూర్తి.. 2004 నుంచి నిర్మాణంలో ఉండి వివిధ దశల్లో ఉన్న గృహాలను జియో ట్యాగింగ్ పద్ధతిలో ఫొటోలు తీసి కంప్యూటర్లో ఆన్లైన్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. దీని అమలు కోసం అసిస్టెంట్ ఇంజనీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లకు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు అందజేశారు. ప్రతి గృహాన్నీ రెండు ఫొటోలు తీసి శాటిలైట్‌కు అప్లోడ్ చేయాల్సి ఉంది. గతంలో ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు 50 గృహాల వివరాలను ఆన్లైన్లో ఉంచాలని చెప్పగా ప్రస్తుతం ఈ సంఖ్యను 100కు పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. 2 లక్షల 16 వేల 108 గృహాలను జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించి ఆన్లైన్లో ఉంచాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 75 శాతం మాత్రమే పూర్తయింది. 2015 జనవరి 31 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించినా ఆచరణలో అది సాధ్యం కాలేదు. జియో ట్యాగింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాతే పెండింగ్‌లో ఉన్న బకాయిలను లబ్ధిదారులకు అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుంది, ఎప్పటికి బిల్లులు చెల్లిస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. అప్పటివరకు తాము గుడిసెల్లోనే నివసిస్తూ ఇబ్బందులు పడాలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 14,020 గృహాలను పూర్తిచేసి రూ.118.78 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అర్హత లేని లబ్ధిదారులకు గృహాలు నిర్మించటం జరిగిందనే సందేహాలతో గత మూడేళ్లుగా నిలిచిన గృహాలను తనిఖీ చేసేందుకు మండలస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు అర్హత కలిగిన లబ్ధిదారుల జాబితాలు తయారుచేస్తేనే వాటిని ఆన్లైన్లో ఉంచుతామనే నిబంధన విధించారు. అర్హత లేనివారు గృహాలు నిర్మిస్తే ప్రభుత్వం నుంచి ఇచ్చిన నగదును వారి నుంచి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంజూరు చేయిస్తామంటూ అక్రమ వసూళ్లు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన గృహాల మంజూరు ఇంతవరకు ప్రారంభం కాలేదు. వివిధ దశల్లో ఉన్న గృహాలకు బిల్లుల చెల్లింపులూ చేయలేదు. పాత బకాయిలు రాక లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు నూతన గృహాలు మంజూరు చేయిస్తామంటూ లబ్ధిదారులకు ఆశ చూపుతున్నారు. గ్రామ, వార్డు, మండల కమిటీల్లో ఉన్న సభ్యులు సూచించినవారికే నూతనంగా గృహాలు మంజూరవుతాయనే ఆశ చూపి గుట్టుచప్పుడు కాకుండా ఒక్కొక్క గృహానికి రూ.4 నుంచి రూ. 5 వేలు చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలోనే నూతన గృహాలకు అనుమతులు వస్తాయని అధికారులు చెబుతుండగా ముందస్తుగానే అధికార పక్షానికి చెందిన కొందరు వసూళ్లకు దిగారు. -
‘ఆప్కో బకాయిలు ఇప్పించండి’
సాక్షి, హైదరాబాద్: చేనేత కార్మికులకు నిరంతరం పని కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసిన వస్త్రాలకు సంబంధించిన బిల్లులు రూ. 116 కోట్లు విడుదల చేయాలని తెలంగాణ ఆప్కో చైర్మన్ ఎమ్. హన్మంతరావు కోరారు. ఈ మేరకు రాష్ట్ర చేనేత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును శుక్రవారం కలిసి పరిస్థితిని వివరించారు. ఆప్కోకు చెల్లింపులు లేకపోవడంతో ఆరునెలలుగా చేనేత సహకార సంఘాలకు బకాయిలు చెల్లించడంలో జాప్యం జరుగుతుందని, ఆ కారణంగా సం ఘాల వాళ్లు నూలు కొనుగోలు చేయలేక, కార్మికులకు కూలీలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారని వివరించారు. -
‘ఇందిరమ్మ’కు ఊరట
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్):ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బిల్లులు ఎప్పుడు వస్తాయోనని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన లబ్ధిదారులకు ప్రభుత్వం నిర్ణయం హాయినిచ్చింది. ఇటీవల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గృహ నిర్మాణ శాఖ మంత్రిత్వ శాఖ లేదు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో అదిలాబాద్ జిల్లా నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా భాద్యతలు స్వీకరించారు. ఆ వెనువెంటనే సంబంధిత అధికారుల సమీక్ష నిర్వహించి రాష్ట్రం ఏర్పాటుకు ముందు నిర్మించుకున్న ఇళ్లకు కూడా బిల్లులు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలో 3 లక్షల 89 వేల 655 మందికి లబ్ధి చేకూరనుంది. గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటపై కేంద్రం నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో బిల్లుల చెల్లింపునకు బ్రేక్ పడింది. సుమారు సంవత్సర కాలం నుంచి లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ శాఖకు మంత్రినికేటాయించడంతో పాటు బిల్లులు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నారని ప్రభుత్వం సీఐడీ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో బిల్లులు నిలిపివేయడంతో లబ్ధిదారులు ఇప్పటివవరకు ఇబ్బందులు పడ్డారు. లబ్ధిదారుల ఎంపికలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో ఇప్పటి దాకా మొత్తం 5,80,732 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 3,89,655 ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారులకు మొత్తం బిల్లులు చెల్లించారు. 3,02,283 లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేశారు. వీరికి చివరిదైన చెత్తు బిల్లు చెల్లించాల్సి ఉంది. 87,372 మంది వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాలు ఉన్నారు. ఇందులో పునాదిదశలో 12,569, బేస్మెంట్ లెవెల్లో 42,577, లెంటల్ లెవెల్ 7,172, రూఫ్ లెవెల్లో 25,048 నిర్మాణాల్లో ఉన్నాయి. వీటిలో ఇప్పటిదాకా 1,91,077 ఇళ్ల లబ్దిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను ఇప్పటి దాకా మొదలు పెట్టలేదు. 1,91,077 ఇళ్లు రద్దు..? జిల్లాలో 1,91,077 ఇళ్ల లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను ఇప్పటి దాకా మొదలు పెట్టలేదు. దీంతో ప్రభుత్వం ఈ ఇళ్లను రద్దు చేయాలా.. లేక కొనసాగించాలా అన్న మీమాంసలో ప్రభుత్వం ఉందని అధికారులు చెబుతున్నారు. బిల్లులు చెల్లించాల్సిన వాటిలో కూడా అంతా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో అధికారులున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు తిరిగి నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారి పేర్లను ఆన్లైన్లో ఉంచేందుకు సిద్ధమయ్యారు. వచ్చే నెలలో లబ్ధిదారుల ఎంపికను పక్రియను పూర్తి చేసి బిల్లులను చెల్లించే ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
రద్దు చేస్తారా.. ఆదరిస్తారా?
తీవ్ర ఆవేదనలో 9 లక్షల మంది ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులు సాక్షి, హైదరాబాద్: అధికారికంగా ఇళ్లు మంజూరయ్యాయి.. ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.. ఒక్క ఇటుక కూడా పడలేదు.. ఇదంతా ఎన్నికలకు ముందటి ముచ్చట. కానీ అధికారుల లెక్కల ప్రకారం వారంతా ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులే...! ఇంతలో కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో అక్రమాల వెలికితీత పేరుతో పాత పథకానికి నిధుల విడుదలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో ఈ లబ్ధిదారులంతా.. ఇంకా ఇళ్ల నిర్మాణం ప్రారంభించనందున తమను కొత్త పథకంలోకైనా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. కానీ సర్కారు నుంచి స్పష్టత కరువైంది. దీంతో తాము రూ.75 వేల యూనిట్ కాస్ట్ ఉన్న పాత పథకానికే పరిమితమవుతామా లేక రూ.3.50 లక్షలున్న కొత్త పథకంలోకి మారతామా అన్నది వారికి అంతు చిక్కడంలేదు. దీంతో వారంతా తీవ్ర మానసికక్షోభకు గురవుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 9 లక్షల కుటుంబాల వేదన ఇది. అయోమయం.. గందరగోళం.. పేదల గృహ నిర్మాణ పథకం విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతుండడం తీవ్ర గందరగోళానికి కారణమవుతోంది. ‘ఇందిరమ్మ’ ఇళ్ల నిర్మాణంలో గతంలో అక్రమాలు జరిగాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం సీఐడీ తో దర్యాప్తు చేయిస్తోంది. అది తేలిన తర్వాతే రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని వేగిరం చేయాలని భావి స్తోంది. కానీ ఆ దర్యాప్తు ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనిపించటం లేదు. దీంతో పేదల ఇళ్ల విషయంలో తీవ్ర అయోమయం నెల కొంది. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడానికి కొద్దిరోజుల ముందు ఏకంగా 13.65 లక్షల మం దికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ అయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే రాష్ట్రం విడిపోవటంతో నిధులు విడుదల కాక ఆ ఇళ్ల నిర్మాణం మొదలు కాలేదు. దానికంటే ముందు కేటాయించినవి కూడా వివిధ కారణాలతో మొదలుకాలేదు. వెరసి తెలంగాణవ్యాప్తంగా 9 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదని అధికారులు తాజాగా లెక్కతేల్చారు. అనుమతి వద్దు.. తర్వాత చూద్దాం! ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవటంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వద్దంటూ జిల్లా అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటికే పనులు మొదలైన ఇళ్లకు మాత్రమే బిల్లులు విడుదల చేస్తామని అందులో స్పష్టంచేశారు. ప్రస్తుతం 4.69 లక్షల ఇళ్ల నిర్మాణాలు మొదలై వివిధ దశల్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించడం కోసం రూ.147 కోట్లను విడుదల చేసేం దుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పనులు మొదలుపెట్టని 9 లక్షల ఇళ్లకు సంబంధించిన జాబితాను తాత్కాలికంగా పక్కనపెట్టారు. అయితే వాటిని అలాగే రద్దు చేస్తారా లేక కొత్త పథకంలోకి మారుస్తారా.. ఇందిరమ్మ పథకం కిందనే కొనసాగి స్తారా అన్న విషయంలో అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఆ తొమ్మిది లక్షల మందిని లబ్ధిదారులు కేటాయింపులను రద్దు చేసి రెండు పడక గదుల ఇళ్ల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిం చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. -
గృహాలకు వీడిన గ్రహణం
ఖమ్మం వైరా రోడ్: ఇందిరమ్మ లబ్ధిదారులకు శుభవార్త. ఇళ్ల నిర్మాణాల పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు జిల్లా ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు నియోజకవర్గ డీఈలు, ఏఈలకు హౌసింగ్ పీడీ వైద్యం భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ప్రగతిలో ఉన్న ఇళ్ల వివరాలు, ఇంటి కొలతలు, ప్లాట్ కొలతలు తీసుకుని ఫొటోలు తీసి ఆన్లైన్లో పొందుపర్చాలని పేర్కొన్నారు. అయితే.. ఇప్పటికే 5 వేల ఇళ్ల వివరాలను అధికారులు ఆన్లైన్లో పొందుపర్చారు. పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిన ఇళ్ల వివరాలను 50 శాతం వరకు గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డెరైక్టర్‌కు పంపేందుకు సిద్ధం చేశారు. పదిరోజుల్లో 70 శాతానికి పైగా వివరాలను పంపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో పెండింగ్ బిల్లులు రూ. 35 కోట్లు మార్చి 25 నుంచి ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లులు ఆగిపోయాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న 15 వేల ఇళ్లకు రూ.35 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సీబీసీఐడీ విచారణ అనంతరం... జిల్లాలో మూడు విడతల్లో 4లక్షల 10వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యయి. వాటిలో ఇప్పటి వరకు 2.8 లక్షలు పూర్తయ్యాయి. మరో 64వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మంజూరైన ఇళ్లలో చాలా వరకు నిధులు దుర్వినియోగమైనట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై సీబీసీఐడీ బృందం నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రగతిలో ఉన్న గృహాలకు బిల్లులు నిలిచిపోయాయి. సీబీసీఐడీ విచారణ పూర్తిచేసిన అనంతరం నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో గృహ నిర్మాణ శాఖ అధికారులకు పెండింగ్ బిల్లు విడుదల చేసేందుకు అవకాశం లభించింది. బిల్లులు చెల్లించాల్సిన లబ్ధిదారుల వివరాలు పంపించాలని పీడీకి ఆ శాఖ మేనేజింగ్ డెరైక్టర్ నుంచి నాలుగు రోజుల క్రితం ఆదేశాలు అందాయి. -
అసెంబ్లీ మీడియా పాయింట్: నేతలు ఎవరెవరెమన్నారు..
‘ఇందిరమ్మ’ పెండింగ్ బిల్లులు చెల్లించాలి ఇందిరమ్మ పథకం కింద పెద్ద ఎత్తున గృహాల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. సుమారు రూ.150 కోట్ల వరకు పెండింగ్ బిల్లులున్నాయి. రాష్ట్ర బడ్జెట్లో గృహనిర్మాణానికి భారీగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి నామమాత్ర ంగా నిధులు విడుదల చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించి లబ్ధిదారులను ఆదుకోవాలి. -సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సింగరేణి కార్మికులను పర్మనెంట్ చేయాలి సింగరేణి కార్మికులను పర్మనెంట్ చేయాలి. ఆరు మాసాలుగా వారి జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం చొరవ చూపి సింగరేణి కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. - సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య సభను తప్పుదోవ పట్టిస్తున్న అధికార పక్షం అధికారపక్ష సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. శాసనసభా మర్యాదలు, సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అధికార పక్షానికి ఓర్పు సహనం అవసరం. కనీసం సలహాలు, సూచనలను సైతం తీసుకునే స్థితిలో అధికార పక్షం లేదు. టీడీపీ సభ్యులను నామినేట్ ఆంగ్లో ఇండియన్ సభ్యులుగా అభివర్ణించడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. - బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి సభా సమయం వృథా అవుతోంది టీఆర్ఎస్, టీడీపీ అనవసర రాద్ధాంతాలతో విలువైన సభా సమయం వృధాఅవుతోంది. సభా మర్యాదలు పాటించడం లేదు. సభ తీరు గందరగోళంగా ఉంది. ఇరుపక్షాలు సభను రాజకీయ వేదికగా మార్చుకున్నాయి. ఇప్పటి వరకు శాసనసభను అధికారపక్షం స్వార్థ రాజకీయాలకు వాడుకునేది .ఇప్పుడు కుటుంబం కోసం వాడుకుంటోంది. ఈ విషయాలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాం. -కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ సంక్షేమ పథకాల అమలేది.. టీఆర్ఎస్ ఎన్నికల ఎజెండాల్లో ప్రకటించిన సంక్షేమ పథకాల అమలు ఏది..? రైతు రుణాలపై స్పష్టత లేదు. విద్యుత్ సమస్యకు పరిష్కారం లేదు. గిరిజనులకు మూడు ఎకరాల భూమిపై చర్చ లేదు. ఆగస్టు 15న దళితులకు భూమి పంపిణీ చేసి వదిలేశారు. సాగుకు పెట్టుబడేది. ప్రజా సమస్యలపై చర్చ జరుగాలి. సభా సమయం వృథా కావద్దు. -వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.వెంకటేశ్వర్లు విద్యుత్ కష్టాలకు సూత్రధారి చంద్రబాబే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కష్టాలకు ప్రధాన సూత్రధారి చంద్రబాబు. ఆంధ్రబాబు కనుసైగల్లోనే టీడీపీ సభ్యులు ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డిలు వ్యవహరిస్తున్నారు. విద్యుత్‌ను అడ్డుకుంటుంది చంద్రబాబు కాదా..? సీఎం కేసీఆర్ స్పష్టంగా వివరిస్తున్నా... అడుగడుగునా అడ్డుకుంటూ ఆంధ్ర బాబుకు వత్తాసు పలుకుతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. టీటీడీపీ సభ్యులకు గుణ పాఠం తప్పదు. - టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు -
బకాయి కుప్ప!
వికారాబాద్: విద్యుత్ బిల్లులు కొండలా పేరుకుపోతున్నా ఆ శాఖ అధికారులు వసూలు చేయడంలో విఫలమవుతున్నారు. వికారాబాద్ డివిజన్లో ప్రభుత్వ సంస్థలనుంచి సుమారుగా రూ.50 కోట్ల వరకు విద్యుత్ బకాయిలు రావాల్సి ఉంది. ఈ బకాయిలు క్రమంగా పెరిగిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. డీఈ, ఏడీఈలతోపాటు సిబ్బంది ఏమైనా చేతివాటం ప్రదర్శిస్తూ ఆయా సంస్థలకు వెసులుబాటు కల్పిస్తున్నారా.. లేక వసూలు చేసిన డబ్బులను లెక్కలో చూపడం లేదా.. అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం కరెంట్ కష్టాలతో అల్లాడుతుంటే ఎందుకింత నిర్లక్ష్యమని విద్యుత్ అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పట్టించుకోరా.. గ్రామీణ, గిరిజన తండాల్లో నేరుగా విద్యుత్ స్తంభాలకు రాత్రి పూట కొండ్లు వేసి అక్రమ కరెంట్‌ను వాడుతున్నారని ఆ శాఖ అధికారులే అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గట్టిగా బిల్లు విషయం ఎత్తితే తెలిసిన రాజకీయ నాయకుడితో ఇంకొంత సమయం ఇవ్వాలని సిఫార్సు చేయిస్తున్నారు. వికారాబాద్ నియోజవర్గంలో రూ.25కోట్లు, పరిగిలో రూ.25 కోట్లు, చేవెళ్లలో రూ.20 కోట్లు, తాండూరులో రూ.30 కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో రెవెన్యూ, పోలీస్ శాఖలే ఎక్కువ బకాయిలున్నట్లు సమాచారం. అయితే విద్యుత్ అధికారులు బిల్లుల గూరించి ఆ శాఖలను టచ్ చేయాలంటేనే జంకుతున్నారు. అదే సామాన్యులయితే ముక్కు పిండి మరీ బిల్లులు వసూలు చేస్తున్నారు. వారిపైనా ఒత్తిడి తెస్తాం: డీఈ వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లిస్తేనే మేం మరిన్ని సేవలను అందించే అవకాశం ఉంటుందని డీఈ సాంబశివరావు అన్నారు. ఉన్నతాధికారులను సంప్రదించి ఇప్పటివరకు ఉన్న పాత బకాయిలను సర్‌చార్జి లేకుండా తీసుకొనే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఎవరైనా సకాలంలో కరెంట్ బిల్లులు చెల్లించకుంటే వారి ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపేస్తామని హెచ్చరించారు. అయితే ప్రభుత్వ సంస్థల బిల్లులు రూ.50 కోట్ల వరకు పేరుకుపోయినమాట వాస్తవమేనన్నారు. ఇక మీదట వారిపై కూడా ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. -
నత్తే నయం!
కదలని హంద్రీ-నీవా ఆరు నెలల్లో చేసింది రూ.24 కోట్ల పనులే అందులో రూ.4.51 కోట్ల బిల్లులు పెండింగ్ బి.కొత్తకోట: జిల్లా రైతాంగానికి వరప్రసాదిని అయిన ఏవీఆర్ హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు నత్తకంటే నిదానంగా సాగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో అంతోఇంతో ముందుకుసాగాయి. ప్రస్తు తం నామమాత్రంగానే సాగుతున్నాయి. కేవలం 10 శాతం పనులే నడుస్తున్నాయి. మదనపల్లె సర్కిల్ పరిధిలోని చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 32 ప్యాకేజీల్లో మెకానికల్, ఎత్తిపోతల, ప్రధాన, బ్రాంచ్ కెనాళ్ల, ఉపకాలువల పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులన్నీ అటకెక్కాయి. ప్రభుత్వం నిర్ధిష్టమైన చర్యలకు ఆదేశాలివ్వకపోవడంతో అధికారులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. 2013 డిసెంబర్ నాటికే ప్రాజెక్టు గడువు ముగిసింది. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వమిస్తున్న ప్రాధాన్యత ఏమిటో ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులే చెబుతున్నాయి. నిధులు నిలిచిపోవడంతో పనులు చేపట్టలేక అధికారులు చేతులెత్తేశారు. ఆరు నెలల్లో రూ.24 కోట్ల పనులే.. ప్రాజెక్టు రెండో దశ పనుల్లో భాగంగా మదనపల్లె సర్కిల్ పరిధిలో రూ.2,906.41కోట్ల పనులు చేయాల్సి ఉంది. ఈ సెప్టెంబర్ నాటికి రూ.2,178.89కోట్ల పనులు పూర్తి చేశారు. ఈ పను లు ఇప్పటికే పూర్తి కావాలి. అయితే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలతో పనులు మందగించాయి. ప్రస్తుతం దాదాపుగా పనులు నిలిచిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.24.59 కోట్ల పనులు మాత్రమే చేశారు. వీటికి ప్రభుత్వం రూ.4.51 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉంచింది. 720 కిలోమీటర్ల కాలువలకు 611 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. ప్రధాన కాలువ 205 కిలోమీటర్లలో 159.57 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఆ ప్యాకేజీలను పట్టించుకునే దిక్కులేదు.. మదనపల్లె సర్కిల్ పరిధిలోని 9 ప్యాకేజీల్లో పనులు చేపట్టని ఏజెన్సీలపై ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతోంది. ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. ఒక్కో ఏజెన్సీకి 10 నుంచి 20 నోటీసులిచ్చినా కదలికలేదు. మొదటి దశ పనులపై సమీక్షించిన ప్రభుత్వం రెండో దశ పనులపై ఆదేశాలివ్వడంలో జాప్యం చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. అందుకే 9 ప్యాకేజీలను రద్దు చేయాలన్న అధికారుల ప్రతిపాదనలను పట్టించుకోవడంలేదని అధికారులు అంటున్నారు. భూ సేకరణదీ అదే దారి ప్రాజెక్టు కోసం 22,947 ఎకరాలు సేకరించాలన్నది లక్ష్యం. ఇందులోనూ జాప్యం కనిపిస్తోంది. ప్రాజెక్టు పనులు చేపట్టి తొమ్మిదేళ్లు గడిచినా 17,960 ఎకరాలను మాత్రమే సేకరించారు. 4,987 ఎకరాలు సేకరించాల్సి ఉంది. కాలువల నుంచి రైతుల భూములకు నీరందేలా ఉప కాలువలను తవ్వాలి. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్లు వీటి జోలికి పోవడం లేదు. ఒకటి రెండు చోట్ల మినహాయిస్తే ఎక్కడా జరగడం లేదు. వ్యయాన్ని పెంచాలన్న డిమాండ్‌తో పనులు చేయడంలేదు. -
ఫీజు బకాయిలు ఎవరు చెల్లిస్తారో?
-
ఫీజు బకాయిలు ఎవరు చెల్లిస్తారో?
ఏపీలో 10 లక్షల మంది బీసీ, ఈబీసీ విద్యార్థుల ఎదురుచూపు ఆందోళనలో చివరి సంవత్సరం విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ల సాయంతో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఏ ఈడాది కొత్త సమస్య వచ్చిపడింది. ఆర్థిక పరిస్థితి పేరిట ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, చోటు చేసుకుంటున్న పరిణామాలు వారిలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లోని 7.4 లక్షల మంది బీసీ, 2.78 లక్షల మంది ఈబీసీ విద్యార్థులకు 2013-14 విద్యా సంవత్సరానికి అందాల్సిన రూ.800 కోట్ల బకాయిల చెల్లింపు ఇంతవరకు జరగలేదు. అసలు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ఈ పెండింగ్ బకాయిలు ఎవరు చెల్లించాలనే విషయంపైనే ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. రాజధానితో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు ఎవరు చెల్లించాలనే అంశంపై వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమకు కళాశాలల నుంచి సర్టిఫికెట్లు అందుతాయా లేదా? అన్న ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. కొలిక్కిరాని కౌన్సెలింగ్ ప్రక్రియ ఏటా ఈపాటికే ఇంజనీరింగ్, మెడికల్ తదితర ఉన్నత విద్యా కళాశాలలు అడ్మిషన్లు పూర్తిచేసుకుని కొంతమేరకు సిలబస్‌ను కూడా పూర్తి చేసుకునేవి. ఈ ఏడాది మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఎంసెట్ ఫలితాలు విడుదలై నెలరోజులు దాటుతున్నా ఇప్పటివరకు కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవకపోవడం విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. -
ఏపీ భవన్‌కు ఎంపీ సబ్బం రూ. 3.43 లక్షలు బకాయి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏపీభవన్‌లో తమ పేరిట ఉన్న పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు చివరి నిమిషంలో పోటీపడ్డారు. ఏపీభవన్‌లో చాలామంది ఎంపీ, ఎమ్మెల్యేలు ఇంకా బకాయిలు చెల్లించలేదంటూ పత్రికల్లో వార్తలు రావడంతో వారంతా నానా హైరానా పడ్డారు. వందల్లోనే బకాయి ఉన్నా, వాటిని చెల్లించి నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) సర్టిఫికేట్ తీసుకునేందుకు వారు హైరానా పడ్డారు. కేంద్ర మంత్రి బలరాం నాయక్ రూ. 26,250, ఎంపీ సురేశ్ షెట్కార్ రూ. 20వేలు చెల్లించగా మంత్రులు శైలజానాథ్ రూ. 100, బాలరాజు రూ. 200, బస్వరాజు సారయ్య రూ. 900, ప్రసాద్‌కుమార్ రూ. 400 డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క రూ. 500, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, పి.కిష్టారెడ్డి, సుమన్ రాథోడ్, దేవినేని ఉమ, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీలు వందల్లో ఉన్న తమ బకాయిలను చెల్లించి ఎన్ఓసీ తీసుకున్నారు. సీమాంధ్ర నుంచి ఇంకా 25 మంది వరకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. అత్యధికంగా ఎంపీ సబ్బం హరి రూ. 3.43లక్షల బకాయిలు ఉండగా, నిమ్మల కిష్టప్ప రూ. 22,500, కె.నారాయణ రూ.28,500, హర్షకుమార్ రూ.45,000, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి రూ.52,500, ఎన్.శివప్రసాద్ రూ. 6,750, కనుమూరి బాపిరాజు రూ. 3,750లతో పాటు మరి కొందరి బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. -
ఖజానాకు కళ్లెం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సర్కారు ఖజానాకు కళ్లెం పడింది. ఉద్యోగుల వేతనాలు మినహా ఎలాంటి చెల్లింపులు చేపట్టొద్దని ప్రభుత్వం ఆ విభాగానికి తేల్చి చెప్పింది. దీంతో గత వారం రోజులుగా చెల్లింపుల తంతు నిలిచిపోగా.. శుక్రవారం నుంచి మధ్యాహ్న భోజన కార్యక్రమం లాంటి అత్యవసర నిధుల విడుదల ప్రక్రియ కూడా ఆగిపోయింది. సాధారణంగా విడుదలయ్యే కార్యాలయ నిర్వహణ ఖర్చులతోపాటు ఇతర పనులకు సంబంధించి నిధుల చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. మరో వారం రోజుల్లో ఆర్థిక సంవ త్సరం ముగియనున్న నేపథ్యంలో ఖజానా చెల్లింపుల ప్రక్రియపై ప్రభుత్వం నిషేదం విధించడం కార్యాలయ నిర్వాహకుల్లో కలవరం సృష్టిస్తోంది. ప్రభుత్వ ఖజానాను సర్దుబాటుచేసే క్రమంలో అడపాదడపా నిధుల విడుదలపై ప్రభుత్వం నిషేదం విధించి.. తర్వాత యథావిధిగా చెల్లింపుల ప్రక్రియ చేపడుతుంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో నిషేదాజ్ఞలు లేకుండా అన్ని విభాగాలకు పూర్తిస్థాయి చెల్లింపులు చేపట్టాలి. ఒకవేళ ఆర్థిక సంవత్సరం ముగిసినట్లైతే.. ఆ ఏడాదికి సంబంధించిన చెల్లింపులు కొత్త సంవత్సరంలో చేపట్టే వీలు లేదు. దీంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి పెండింగ్ బిల్లులు ప్రస్తుతం ఖజానా విభాగానికి చేరాయి. అయితే నిధుల విడుదలపై నిషేదం విధించడంతో ఆ ఫైళ్లన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.22కోట్ల వరకు ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. సర్కారు వెంటనే నిషేదం ఎత్తివేయకుంటే ఈ ఫైళ్లకు సంబంధించి చె ల్లింపులకు మోక్షం కలిగే అవకాశం లేదు. ఖజానా విభాగం అనుమతి లేకపోవడంతో ఆయా శాఖల వద్ద అందుబాటులో ఉన్న నిధులు కూడా మురిగిపోయే ప్రమాదం ఉంది. -
పోలీస్ ఫోన్లు మూగనోము సర్వీస్ కట్
=పేరుకుపోతున్న పెండింగ్ బిల్లులు =బడ్జెట్ కేటాయింపులో అలక్ష్యం =జిల్లాలో రూ.4.90 లక్షల బకాయిలు =ప్రతిసారీ 25 మందికిపైగా ఎస్సైల ఫోన్ సర్వీసులు కట్ =పోలీస్, బీఎస్ఎన్ఎల్ శాఖల మధ్య తప్పని వార్ ‘నా పేరు శివమణి.. నా నంబర్ ఇదీ..’ అంటూ ఎవరైనా ఎస్సై ప్రజలకు గర్వంగా చెప్పుకోవాలంటే కాస్త ఆలోచించాల్సిందే. ఏదైనా అత్యవసరమై ఎస్సైకి ఎవరైనా ఫోన్ చేస్తే ‘ఈ సర్వీసును తాత్కాలికంగా నిలిపివేయడమైనది’ అనే వాయిస్‌తో కంగు తినాల్సిందే. ఇలా జిల్లాలోని పలువురు పోలీసు అధికారుల ఫోన్లు తరచూ మూగనోము పడుతున్నాయి. పోలీసుల సెల్‌ఫోన్ ఎందుకు పనిచేయట్లేదని ఆరా తీస్తే.. బీఎస్ఎన్ఎల్ వాళ్లు సర్వీసును నిలిపివేశారనేది వారి సమాధానం. సర్వీసు ఎందుకు కట్‌చేశారని బీఎస్ఎన్ఎల్ వాళ్లను అడిగితే.. బిల్లుల పెండింగ్‌తో ఈ సమస్య వస్తోందని చెబుతున్నారు. సాక్షి, మచిలీపట్నం : ప్రజలకు, ఉన్నతాధికారులకు నిత్యం అందుబాటులో ఉండేలా పోలీస్ శాఖలో బీఎస్ఎన్ఎల్ గ్రూపు (సీయూజీ) సెల్ఫోన్లు వినియోగిస్తారు. ఇలా జిల్లాలోని 103 మంది ఎస్సైలు, 30 మంది సీఐలు, ఏడుగురు డీఎస్పీలు గ్రూప్ మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. ఎస్సై, సీఐలకు నెలకు సెల్‌ఫోన్ బిల్లు రూ.500, ల్యాండ్‌లైన్ బిల్లు రూ.750 చొప్పున పోలీసు శాఖ కేటాయిస్తోంది. అంతవరకు బాగానే ఉన్నా నెలవారీగా ఇచ్చే బడ్జెట్ కేటాయింపులు సకాలంలో రాకపోవడం సమస్యగా మారింది. దీనికితోడు పోలీసుల పాత బకాయిలు సైతం పేరుకుపోవడంతో వారి సెల్‌ఫోన్ సర్వీసులను బీఎస్ఎన్ఎల్ సంస్థ నిలిపివేయాల్సి వస్తోందని సమాచారం. రూ.4.90 లక్షల బిల్లుల పెండింగ్... రాష్ట్రం మొత్తం మీద పోలీస్ శాఖ ఫోన్ బిల్లుల బకాయిలు సుమారు రూ.5.50 కోట్ల మేరకు ఉంటే జిల్లాలో రూ.4.90 లక్షలు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. దీనికితోడు జిల్లాలోని పోలీసుల సెల్ఫోన్లు, ల్యాండ్లైన్ల బిల్లులకు నెలవారీగా సుమారు రూ.1.40 లక్షలు చెల్లించాల్సి ఉంది. వాటికి నెలవారీగా బడ్జెట్ కేటాయింపులు సకాలంలో లేకపోవడంతో జిల్లాలో 25 మందికిపైగా ఎస్సైల సెల్ఫోన్లు, పలు స్టేషన్ల ల్యాండ్‌లైన్ ఫోన్లు ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ సర్వీసులను నిలిపివేస్తున్నారు. బిల్లు ఇచ్చి 55 రోజులు దాటినా వాటిని చెల్లించకపోవడంతో పూణేలో ఉండే సెంట్రల్ ఆన్లైన్ సిస్టం ద్వారా ఆయా మొబైల్ ఫోన్ల సర్వీసులు నిలిపివేస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో ఆయా ఎస్సై, సీఐలతో మాట్లాడాలంటే ప్రజలకు, పోలీసు ఉన్నతాధికారులకు సమస్యగా మారుతోంది. ప్రజలకు అందుబాటులో ఉంటారనుకునే ఎస్సైల ఫోన్లు తరచూ ఇలా మూగనోము పట్టడం స్థానికులకు ఇబ్బందికరంగా మారింది. పోలీస్ విభాగం అత్యవసర సేవలకు సంబంధించినది కావడంతో బిల్లు చెల్లించని ఫోన్ల సర్వీసులు నిలిపివేసిన సమాచారాన్ని బీఎస్ఎన్ఎల్ అధికారులకు చెబితే వాటిని కొనసాగిస్తున్నారు. ఇంకా జిల్లాలోని పలువురు ఎస్సైలు మాత్రం తమ శాఖకు చెందిన ఫోన్ల సర్వీసును నిలిపివేస్తే ఇబ్బంది లేదనుకుని సొంత నంబర్లు వాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. పరిమితికి మించి వినియోగం... జిల్లాలో పలువురు ఎస్సైల ఫోన్ బిల్లులు చూస్తే గుండె గుబేలుమంటుంది. పోలీసు శాఖ నిర్దేశించిన మొత్తాన్ని మించి వేలకు వేలు బిల్లులు వాడుతున్న వారున్నారు. దీంతో వారికి నెలకు ఇచ్చే రూ.500 కంటే అధిక మొత్తం వస్తే జీతాల నుంచి రికవరీ పెడుతున్నారు. గతంలో మచిలీపట్నం రూరల్ స్టేషన్లో పనిచేసిన ఒక ఎస్సై తన సెల్బిల్లును రూ.30 వేలు వాడి వేరొకచోటకు బదిలీపై వెళ్లిపోయాడు. అదే స్టేషన్‌కు కొత్తగా బదిలీపై వచ్చిన ఎస్సై ఈ సిమ్‌కార్డును వినియోగంలోకి తీసుకురావడానికి పాతబకాయి రూ.30 వేలు చెల్లించాల్సి వచ్చింది. చిలకలపూడి స్టేషన్లో గతంలో పనిచేసిన ఒక ఎస్సైకి రూ.35 వేలు సెల్ బిల్లు రావడంతో ఆ మొత్తాన్ని చెల్లించి తనకు స్వాధీనం చేయాలని అక్కడకు బదిలీపై వచ్చిన ఎస్సై ఒత్తిడి చేయడంతో చెల్లించి వెళ్లాడు. ఇలా బదిలీల సమయంలో పాత, కొత్త ఎస్సైల నడుమ సెల్ బిల్లులు వివాదాలకు కూడా దారితీస్తున్నాయి. ఎందుకొచ్చిన గొడవ అనుకునే తెలివైన ఎస్సైలు పలువురు మాత్రం డిపార్ట్మెంట్ వ్యవహారాల వరకు బీఎస్ఎన్ఎల్ గ్రూప్ సిమ్‌లను ఉపయోగించి మిగిలిన వ్యవహారాలకు వేరొక సిమ్‌ను వాడుతున్నారు. ఇలా జిల్లాలో పలువురు ఎస్సైలు, సీఐలు డ్యూయల్ సిమ్ ఫోన్లు, రెండు పోన్లు వాడుతుండటం కొసమెరుపు.