‘ఇందిరమ్మ’ పెండింగ్ బిల్లులు చెల్లించాలి
ఇందిరమ్మ పథకం కింద పెద్ద ఎత్తున గృహాల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. సుమారు రూ.150 కోట్ల వరకు పెండింగ్ బిల్లులున్నాయి. రాష్ట్ర బడ్జెట్‌లో గృహనిర్మాణానికి భారీగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి నామమాత్ర ంగా నిధులు విడుదల చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించి లబ్ధిదారులను ఆదుకోవాలి.
-సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్
సింగరేణి కార్మికులను పర్మనెంట్ చేయాలి
సింగరేణి కార్మికులను పర్మనెంట్ చేయాలి. ఆరు మాసాలుగా వారి జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం చొరవ చూపి సింగరేణి కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.
- సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య
సభను తప్పుదోవ పట్టిస్తున్న అధికార పక్షం
అధికారపక్ష సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. శాసనసభా మర్యాదలు, సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అధికార పక్షానికి ఓర్పు సహనం అవసరం. కనీసం సలహాలు, సూచనలను సైతం తీసుకునే స్థితిలో అధికార పక్షం లేదు. టీడీపీ సభ్యులను నామినేట్ ఆంగ్లో ఇండియన్ సభ్యులుగా అభివర్ణించడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం.
- బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి
సభా సమయం వృథా అవుతోంది
టీఆర్‌ఎస్, టీడీపీ అనవసర రాద్ధాంతాలతో విలువైన సభా సమయం వృధాఅవుతోంది. సభా మర్యాదలు పాటించడం లేదు. సభ తీరు గందరగోళంగా ఉంది. ఇరుపక్షాలు సభను రాజకీయ వేదికగా మార్చుకున్నాయి. ఇప్పటి వరకు శాసనసభను అధికారపక్షం స్వార్థ రాజకీయాలకు వాడుకునేది .ఇప్పుడు కుటుంబం కోసం వాడుకుంటోంది. ఈ విషయాలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాం.
-కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్
సంక్షేమ పథకాల అమలేది..
టీఆర్‌ఎస్ ఎన్నికల ఎజెండాల్లో ప్రకటించిన సంక్షేమ పథకాల అమలు ఏది..? రైతు రుణాలపై స్పష్టత లేదు. విద్యుత్ సమస్యకు పరిష్కారం లేదు. గిరిజనులకు మూడు ఎకరాల భూమిపై చర్చ లేదు. ఆగస్టు 15న దళితులకు భూమి పంపిణీ చేసి వదిలేశారు. సాగుకు పెట్టుబడేది. ప్రజా సమస్యలపై చర్చ జరుగాలి. సభా సమయం వృథా కావద్దు.
-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టి.వెంకటేశ్వర్లు
విద్యుత్ కష్టాలకు సూత్రధారి చంద్రబాబే
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కష్టాలకు ప్రధాన సూత్రధారి చంద్రబాబు. ఆంధ్రబాబు కనుసైగల్లోనే టీడీపీ సభ్యులు ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డిలు వ్యవహరిస్తున్నారు. విద్యుత్‌ను అడ్డుకుంటుంది చంద్రబాబు కాదా..? సీఎం కేసీఆర్ స్పష్టంగా వివరిస్తున్నా... అడుగడుగునా అడ్డుకుంటూ ఆంధ్ర బాబుకు వత్తాసు పలుకుతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. టీటీడీపీ సభ్యులకు గుణ పాఠం తప్పదు.
- టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అసెంబ్లీ మీడియా పాయింట్: నేతలు ఎవరెవరెమన్నారు..
Published Thu, Nov 13 2014 1:56 AM | Last Updated on Sat, Aug 11 2018 8:06 PM
Advertisement